revanthreddy
-
'పుష్ప2' ఘటన.. వాళ్లకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్: విజయశాంతి
పుష్ప2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య దూరం పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే చాలామంది రాజకీయ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణమని చెప్పవచ్చు. ఇదే అంశంపై తాజాగా సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆమె ఇలా చెప్పుకొచ్చారు.'ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. అయితే, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలలో ఇదే కనిపిస్తుంది. ఈ ఘటన తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన తెలుగు రాష్ట్రాల నేతల ప్రకటనలు ఉన్నాయి. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి.. అలా కాకుండా మళ్లీ ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయం. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ అవసరం. ఇలాంటి ఘటనలు జరగకుండా సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి.. పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి.’ అని పేర్కొన్నారు.పుష్ప2 సినిమా విడుదల సమయంలో డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ ఘటనపై రాజకీయ నాయకుల కామెంట్లు వల్ల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా రేవతి మరణం గురించి వ్యాఖ్యలు చేయండంతో పాటు ఆ సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు బాగాలేదని ఆయన అన్నారు. దీంతో అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం పెట్టి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. ఆపై పలు రాజకీయ పార్టీ నేతలు బన్నీకి సపోర్ట్‌గా మాట్లాడటంతో వివాదం మరింత ఎక్కువ అయింది అని చెప్పవచ్చు. -
బన్నీ 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు.. ఎక్కడైనా తప్పు చేశాడా..?: అల్లు అరవింద్
సంధ్య థియేటర్ ఘటన గురించి తన కుమారుడు అల్లు అర్జున్‌పై వస్తున్న విమర్శల పట్ల అల్లు అరవింద్ కూడా రెస్పాండ్ అయ్యారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం తట్టుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన మేరకే బన్నీ మాట్లాడుతున్నాడని ఆయన గుర్తు చేశారు.'దయచేసి అందరూ ఈ విషయం అర్థం చేసుకోండి. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో మీరు అడిగే ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పలేకపోతున్నాడు. సుమారు మూడేళ్లు కష్టపడి పాన్ ఇండియా రేంజ్లో తీసిని సినిమాను అభిమానులతో చూద్దామని థియేటర్‌కు వెళ్లాడు. అయితే, థియేటర్ వద్ద జరిగిన ఆ సంఘటనతో బన్నీ మా ఇంట్లో పార్కులో ఓ మూలన కూర్చొని ఉంటున్నాడు. సినిమా సెలబ్రేషన్స్ వద్దని చెప్పాడు.సినిమా ఇంతటి విజయం సాధించినప్పటికీ ఎలాంటి సంతోషం లేకుండానే తన అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడు. బన్నీ ఇంతటి స్థాయిలోకి రావడానికి 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు. అతనికి వచ్చిన పేరు అంతా కూడా ఒక రాత్రి, ఒక సినిమాతో రాలేదు. మూడు తరాలుగా ఇండస్ట్రీలోనే ఉంటున్నాం. ఎక్కడా కూడా చెడుగా వ్యవహరించలేదు. ఇప్పడు మాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తేంటే బాధగా ఉండటం వల్లే మీడియా ముందుకు వచ్చాం.' అని అల్లు అరవింద్ అన్నారు. -
రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల చెక్ అందించిన మంత్రి
తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలుగు నటీనటుల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప2' సినిమా విడుదలరోజు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఇప్పటికే రేవతి మరణించిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రేతేజ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వారి కుటుంబానికి తెలంగాణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించారు. శ్రీ తేజ్ తండ్రికి తన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి చెక్ అందించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపు అనేది ఉండదని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఇస్తామని చెప్పిన రూ. 25 లక్షలు ఇప్పటికీ అప్పగించలేదని మంత్రి అన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ మాట నిలబెట్టుకోలేదని అన్నారు. రేవతి కుమారుడు శ్రీతేజ వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఆయన అన్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ గారిని కలిసి 25 లక్షల రూపాయల చెక్కును కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరుపున అందించడం జరిగింది. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ లను అడిగి తెలుసుకోవడం జరిగింది. తన చికిత్సకు కోసం… pic.twitter.com/3EC5Agiowh— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 21, 2024 -
సీఎం రేవంత్‌రెడ్డికి అల్లు అర్జున్ కౌంటర్
పుష్ప2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సినీ హీరో అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా బన్నీ మీడియాతో మాట్లాడారు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా బన్నీ కౌంటర్ ఇచ్చారు. 'సంధ్య థియేటర్ ఘటన ప్రమాదవశాత్తుగా మాత్రమే జరిగింది. కానీ, నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే. నేను ఎలాంటి ర్యాలీ చేయలేదు. థియేటర్ లోపలికి నేను వెళ్లిన తర్వాత ఏ పోలీస్ లోపలికి వచ్చిన జరిగిన సంఘటన గురించి చెప్పలేదు. థియేటర్ యాజమాన్యం వచ్చి, జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పడంతో బయటకు వచ్చేశాను. తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం ఆ క్షణంలో నాకు తెలియదు. మరుసటి రోజు రేవతి విషయం తెలిసింది. నా సినిమా కోసం వచ్చిన ఒక మహిళ చనిపోయిన విషయం తెలిసి కూడా ఎలా వెళ్లిపోతాను..? నాకూ పిల్లలు ఉన్నారు కదా. మరుసటి రోజు నా టీమ్ వారికి ఫోన్ చేసి వెంటనే ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను. సినిమాకు వచ్చేవారిని ఆనందపరచాలనేది మా ఉద్దేశం.నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. ఇంతవరకు నేను ఎవరినీ ఒకమాట అనలేదు. అనుమతి లేకుండా థియేటర్‌కు వెళ్లాను అనడంలో ఎలాంటి నిజం లేదు. రేవతి కుటుంబం విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించానని చెప్పడం చాలా దారుణం. నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు చాలా బాధను కలిగిస్తున్నాయి. నేను రోడ్ షో, ఊరేగింపు చేయలేదు. మూడేళ్లుగా సినిమా కోసం చాలా కష్టపడ్డాను. అభిమానులతో సినిమా చూడాలని ఆశతో వెళ్లాను. గతంలో ఇతర హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది నా అభిమానులు చనిపోతే.. ఆ కుటుంబాన్ని వెళ్లి కలవకుండా ఎలా ఉంటాను. లాయర్ల సూచనలతో నేను శ్రీతేజను చూసేందుకు వెళ్లలేదు. అయితే, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్ అనుమతి తీసుకుని, మా నాన్నను వెళ్లమని చెప్పాను. కానీ, అదీ కుదరదన్నారు. అయితే, సుకుమార్‌ను అయినా వెళ్లమని చెప్పాను. అదీ కాదన్నారు. నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని చెప్పడం చాలా దారుణం. నా క్యారెక్టర్‌ను చాలామంది తక్కువ చేసి మాట్లాడుతుంటే మాత్రం మనసుకు తీసుకోలేకపోతున్నా. అంతటి ఘోరం జరిగిందని నాకు తెలిస్తే.. నా బిడ్డలను థియేటర్ వద్దే వదిలి ఎలా వెళ్తాను. పూర్తి విషయాలు తెలుసుకోకుండా నాపైన నిందలు వేస్తున్నారు. నేను కూడా ఒక తండ్రినే.. నాకు శ్రీతేజ వయసు ఉన్న అబ్బాయి ఉన్నాడు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు.తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని.. థియేటర్ నుంచి వెళ్లిపోవాలని ఏసీపీ చెప్పినా కూడా సినిమా చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నట్టు తెలిసిందని రేవంత్‌రెడ్డి అన్నారు. పోలీసులు ఎదోరకంగా అల్లు అర్జున్ను అక్కడి నుంచి పంపిస్తే.. అయినప్పటికీ, మరోసారి రూఫ్‌టాప్ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారని కామెంట్ చేశారు. ఒక మహిళ చనిపోయిందని తెలిసి ఆపై ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా కూడా అల్లు అర్జున్ అదే పద్ధతి కొనసాగించారనే సంచలన ఆరోపణ రేవంత్‌రెడ్డి చేశారు. ఒక మహిళ చనిపోయాన కూడా ఆయన సినిమా చూసే వెళ్తానని అనడం ఏంటి అంటూ బన్నీ తీరుపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. -
అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ ఘటనలో A11గా ఉన్న వ్యక్తిని నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఇప్పటికే నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని వర్మ గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. రేవతి కుటుంబానికి ముమ్మాటికి నష్టం జరిగిందని చెప్పిన వర్మ ఆ పేరుతో మరోక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఏంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలని ఆయన అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీ అరెస్ట్ గురించి చేసిన కామెంట్లు కూడా అభ్యంతరంగా ఉన్నాయని వర్మ అన్నారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారని అంటున్నారు... వారిపై నమోదైన కేసులకు, బన్నీ మీద నమోదు అయిన కేసుకు చాలా తేడా ఉందని ఆయన గుర్తు చేశారు.పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమా ల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?.. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవ రైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? అంటూ వర్మ ప్రశ్నించారు. బన్నీ అరెస్ట్ గురించి ఆర్జీవీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో ద్వారా ఇంటర్వ్యూ చూడగలరు. -
రేవంత్‌కు మాటలెక్కువ..పని తక్కువ: హరీశ్‌రావు
సాక్షి,మహబూబ్‌నగర్:రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాలకుడు ప్రజలను మోసం చేయకుండా చేయాలని కురుమూర్తి స్వామిని కోరుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం(నవంబర్ 20) హరీశ్‌రావు మహబూబ్‌నగర్‌లోని కురుమూర్తిస్వామిని దర్శించుకున్నారు.‘కురుమూర్తి స్వామి సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసగించారు.రేవంత్‌రెడ్డికి పని తక్కువ మాటలెక్కువ. ఆయనకు సీఎం కేసీఆర్ భయం పట్టుకుంది. పాలకుడే మాటతప్పితే రాజ్యానికి అరిష్టం. రాష్ట్రంలో సగానికి పైగా మంది రైతులకు రుణమాఫీ చేయలేదు.వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క గ్యారెంటీపైన ప్రకటన చేయని సీఎం వరంగల్‌లో కేసీఆర్ మీద తిట్ల పురాణం పెట్టాడు. రేవంత్‌కు తెలిసింది ఒట్లు లేకుంటే తిట్లు. రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారు. అబద్దాలు,మోసం చేయడం సీఎం రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది. ప్రతిపక్షాల మీద పగ..రైతులు,ప్రజలకు దగా..తప్ప రేవంత్ చేసిందేమీ లేదు. రేవంత్‌రెడ్డి వచ్చాకా బీ ట్యాక్స్ వచ్చింది.బిల్లుల చెల్లింపులకు కమిషన్లు వసూలు చేస్తున్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేసేంత వరకు రేవంత్ మెడలు వంచుతాం. ఏడాది పాలనలో ఒక్క ఇల్లు నిర్మించలేదు.మూడునాలుగు నెలలు పనులు చేయిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయి రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది.66 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీలు పాలమూరు జిల్లాను దగా చేశాయి. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశాడు.గత పాలనలో ఇచ్చిన పథకాలను రేవంత్ ఎగ్గొడుతున్నాడు.కేసీఆర్ కలుపు మొక్కకాదు..కల్ప వృక్షం.రేవంత్‌రెడ్డి గురించి ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి.రియల్ఎస్టేటను కుప్పకూల్చాడు’అని హరీశ్‌రావు ఫైరయ్యారు. -
పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌కు ప్రశాంత్‌రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
సాక్షి,నిజామాబాద్జిల్లా:రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు మోసే పనిలో ఉన్నాడని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం(నవంబర్19) నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘త్వరలో కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించటం ఖాయం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.రుణమాఫీ,రైతు బంధు,వడ్ల బోనస్ మీరు ఇచ్చారని ప్రజలు చెప్తే నేను రాజీనామా చేస్తాను. ఇవ్వలేదు అని ప్రజలు చెప్తే నువ్వు నీ పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా? పీసీసీ పదవి రాగానే మహేష్‌గౌడ్ నిషాలో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని అవాకులు చవాకులు పేలుతున్నారు.11నెలల కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ సంగతి వదిలేసి మీ పార్టీ లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టండి.బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నేతలు రిబ్బన్లు కట్ చేస్తున్నారు. ఏం ముఖం పెట్టుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తారు.సామాన్య ప్రజలతో తిట్లు పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సైతం పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.మహారాష్ట్రలో తెలంగాణ పరువు తీస్తున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.ఇపుడు అదే వరంగల్ లో విజయోత్సవాలా’అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. -
ఒక్కరు కాదు.. తెలంగాణకు ఇద్దరు సీఎంలు: బండి సంజయ్
సాక్షి,సంగారెడ్డి:లగచర్ల ఫార్మాసిటీకి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కోరారు. సంగారెడ్డిలో ఆదివారం(నవంబర్17) బండి సంజయ్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.‘రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. రైతుల గురించి ఆలోచించకుండా దౌర్జన్యం చేయడానికి ఇది రాచరిక పాలనా? గతంలో బీఆర్ఎస్ కూడా ఇలానే చేసింది. కలెక్టర్‌పై దాడి అనేది దారుణం. రైతులు కలెక్టర్‌పై దాడి చేయలేదు. ఈ దాడి వెనుక కేటీఆర్,బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ చెప్పింది. అయినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇది ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం.కేటీఆర్ నక్క వినయం ప్రదర్శించి అన్ని ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసీఆర్ కొడుకు నటసార్వభౌముడు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిశారు. గతంలో కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్ కేసును ఇలానే నీరు గార్చారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. కేటీఆర్‌కు తెలియకుండా ఇది జరుగుతుందా. అప్పుడు,ఇప్పుడు సీఎం కేటీఆరే.దీపావళి బాంబులు ఎక్కడికి పోయాయి. ఫార్ములా-ఈ కేసు,ధరణి కేసు,జన్వాడ ఫామ్ హౌస్ కేసు,డ్రగ్స్ కేసు ఇవన్నీ ఎక్కడికి పోయాయి.జనాలని,మీడియాని కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లను పిచోళ్ళు చేస్తున్నారు. తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరు కేటీఆర్, ఇంకొకరు రేవంత్‌రెడ్డి’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. -
నరేందర్‌రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్ర: సబితా
హైదరాబాద్, సాక్షి: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. వికారాబాద్ లగచర్లలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని అన్నారు. ఆమె బుధవారం సాక్షి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారులపై జరిగిన ఘటన కూడా బాధాకరం. అహంకారంగా భూమి లాక్కోవడం ఎంతవరకు సమంజసం. అహంకారంతో భూమి లాక్కుంటే ప్రతిఘటన ఏవిధంగా ఉంటుందో రుచి చూపించారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్?. మాజీ శాసనసభ్యుడు కాబట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు. ప్రతిసారి ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నారు. అక్కడి ఘటనలో బీఆర్ఎస్ నేతలే కాదు.. కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. మూసి దగ్గర సమస్య వచ్చినప్పుడు అక్కడున్న ఇల్లు కూలగొడతామన్నారు. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కారం చేయకుండా ప్రతిపక్షాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. కొడంగల్‌లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగోట్టాడు కాబట్టే రాజకీయ ప్రత్యర్థిని తొక్కేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు’’ అని అన్నారు. -
కేసీఆర్‌కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఇటీవల ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. సోమవారం(నవంబర్ 11) ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడాారు. పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతున్నాడని, ఆయన ఇంట్లో మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోవడం తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదని పరోక్షంగా కేసీఆర్‌కు రేవంత్ చురకంటించారు.‘ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. ఒక కోటి 5లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు.నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. 49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు.రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుతోంది.21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు.35వేల మంది టీచర్ల బదిలీలు పూర్తి చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది.కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం,ప్రగతి భవన్ కట్టుకుండు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు.మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం.ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం.త్వరలో వారికి నియామకపత్రాలు అందించి వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తాం. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇవన్నీ చేసాం.మీరు లేకపోయినా ఏం బాధలేదు.మీతో ప్రజలకేం పని లేదు.తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి.బడి దొంగలను చూసాం కానీ..ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం’ అని రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. -
ప్రధాని ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్
సాక్షి,ముంబయి : మహారాష్ట్రలో బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 9)రేవంత్‌రెడ్డి ముంబైలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ‘ప్రధాని మోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు.మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే..మేం నిజాలు చెబుతూనే ఉంటాం..అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చా.దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్లచట్టాలు తెచ్చి అదానీ,అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం.ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశాం. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాం. ఆ తర్వాత ప్రధాని తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారు.వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి మా ప్రభుత్వం అందించింది.సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టాం.ఎంతో ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకి వెళ్లకూడదు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారు.మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండి’అని రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం -
సీఎం రేవంత్‌రెడ్డిపై డీకే అరుణ ఫైర్
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ సీనియర్‌నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తాజాగా రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్ 3)డీకే అరుణ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.‘సోనియా గాంధీ పుట్టిన రోజునాడే అన్నీ గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క ఇల్లు నిర్మాణం మొదల పెట్టలేదు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా? రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రంలో అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫ్రీబస్ స్కీమ్ ఎత్తేస్తాం అంటున్నారు.గ్రామాలకు బస్సులు బంద్ చేసి తెలంగాణలో ఫ్రీ బస్ అంటున్నారు. మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారు. ఆయన వ్యాఖ్యలపై మాట్లాడడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలి. 500 రూపాయలకే సిలిండర్‌లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లన్నీ కేంద్రానీవే. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో ఉంచుతున్నారు. కానీ ప్రజలు మేల్కొన్నారు. అన్ని అర్దం చేసుకుంటున్నారు.రైతు భరోసా లేదు. కౌలు రైతులకు,కూలీలకు సాయం దిక్కు లేదు. అమ్మాయిలకు స్కూటీలు ఎటు పాయే.50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్.10 లక్షల రూపాయల వైద్యం ఈ పది నెలల్లో ఎంతమందికి చేయించారో బయట పెట్టండి. చెప్పిన మాట నిలబెట్టుకోకుండ దబాయించాలని చూస్తున్నారు. కొత్తగా ఒక ఫించను దరఖాస్తు కూడా తీసుకోలేదు.కొత్త వితంతు ఫించన్లు రాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు’అని డీకే అరుణ మండిపడ్డారు. ఇదీ చదవండి: పీఎం నరేంద్రమోదీ వర్సెస్ సీఎం రేవంత్‌రెడ్డి -
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్:మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా శనివారం(నవంబర్ 2) రేవంత్‌రెడ్డి ఒక పోస్టు చేశారు.‘ప్రధాని మోదీ చేసిన ప్రకటనలో అనేక అవాస్తవాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల బీమా వంటి హామీలను నెరవేర్చాం.22 లక్షల 22 వేల మంది రైతులకు రుణమాఫీ చేశాం.25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం.పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటే,కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తోంది.ఈ పథకం కింద 42,90,246 మంది లబ్ధిపొందారు. యువతకు వేల ఉద్యోగాలిచ్చాం’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: నోటికందే కూడు నీటిపాలు -
రేవంత్,బండి సంజయ్ రహస్య మిత్రులు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్,బండి సంజయ్‌లు రహస్య మిత్రులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సోమవారం(అక్టోబర్ 21)మీడియాతో మాట్లాడారు. రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్‌కి బాధ ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్,బీజేపీ రహస్య ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వస్తాయన్నారు.‘రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వార్షికోత్సవం జరుపుకోవాలి. ముత్యాలమ్మ గుడిపై దాడిని నేను ఖండిస్తే తప్పేంటి? నేను ట్వీట్ చేసినందుకు నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు నాకు లేఖ పంపారు. రేవంత్ లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు.ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ అబద్దాలు చెప్తున్నాడు.మూసీ విషయంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది జర్నలిస్టులు. లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? లక్షన్నర కోట్లు జేబులో వేసుకుంటామంటే ఊరుకుంటామా? జర్నలిస్టులపై బీఆర్ఎస్కు ఎనలేని గౌరవం ఉంది. ఎన్నడూ నేను అవమానించలేదు.ఉద్యమంలో మాకంటే ఎక్కువ జర్నలిస్టుల పాత్ర ఉంది’అని కేటీఆర్ పేర్కొన్నారు.గ్రూప్ వన్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..‘గ్రూప్ వన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు వెల్లడించవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.రిట్ పిటిషన్‌పై వేగంగా వాదనలు విని నిర్ణయం తీసుకోమని సుప్రీం హైకోర్టుకు చెప్పింది.జీవో 29కు వ్యతిరేకంగా హైకోర్టులో అభ్యర్థుల తరుపున కొట్లాడుతాం.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిందే నిరుద్యోగులు.స్థానికుల కోసం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు.తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదనటనం అన్యాయం. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుంది. గ్రూప్ - 1 అభ్యర్థుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేసిందే బీఆర్ఎస్.కపిల్ సిబల్ లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: కేటీఆర్ ఇంటివద్ద భారీగా పోలీసులు -
న్యాయం అడిగితే తలలు పగులగొడతారా: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఓ వైపు గ్రూప్ వన్ విద్యార్థులు,మరోవైపు ముత్యాలమ్మ గుడి భక్తుల ఆందోళనలతో వారం రోజులుగా హైదరాబాద్ అట్టుడుకుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి ఆదివారం(అక్టోబర్20) మీడియాతో మాట్లాడారు.‘సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేస్తే సీఎం ఎందుకు స్పందించలేదు. హిందువులను కాంగ్రెస్ ఎప్పుడూ శత్రువులుగానే భావిస్తోంది. పోలీసులు చాలా మంది భక్తుల తలలు పగులగొట్టారు. హిందువుల విషయంలో అనేక నిర్బంధాలకు గురిచేస్తున్నారు. న్యాయం కోసం ఆందోళనలు చేస్తే తలలు పగులగొడతారా.గ్రూప్ వన్ విద్యార్థులపై లాఠీఛార్జ్ సరికాదు. తెలంగాణలో మళ్లీ యువత రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ప్రాతిపదికన విద్యార్థులు చదువుకోవాలి. వికీపీడియా ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇస్తారా’అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు -
సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు
సాక్షి,కరీంనగర్జిల్లా: ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాల్సిందేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం(అక్టోబర్20) తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ సభలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు.‘కాంగ్రెస్ వాళ్లు మోసపూరితంగా అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ప్రజలను గోస పెడుతున్నారు. కరోనా సమయంలోనూ రైతులకు రైతుబంధు పడాలన్న ఆశయంతో నడిచింది కేసీఆర్ ప్రభుత్వం.రూ.10వేలు వద్దు..రూ.15వేలు ఇస్తా అన్న రేవంత్ ఏం చేస్తున్నాడు.రేవంత్ రైతు వ్యతిరేకి. యాసంగికైనా రైతుబంధు కావాలంటే అందరూ సంఘటితం కావాలి.ఆరు గ్యారెంటీ పథకాలు ఏమయ్యాయి రేవంత్. ఫించన్‌లో కూడా దగా చేస్తుండు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ కాదు చీటింగ్ మ్యాన్. బోనస్ ఇస్తా అంటివి..ఏడపోయింది? దేవుడి మీద ఒట్టు పెట్టి రాజకీయం చేసే నాయకుడిని ఇప్పటి వరకు నేను చూడలేదు.రేవంత్ రెడ్డి చేసిన పాపాలకు ప్రజల్ని కాపాడు అని లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి వెళితే నాపై కేసు పెట్టారు. నిరుద్యోగులను దేశ ద్రోహుల్లా చూస్తున్నారు.2లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి ఏమయ్యాయి. జీఓ 29 రద్దు చేయడమే గ్రూప్ 1 సమస్యకు పరిష్కారం.రాజ్యాంగాన్ని అమలు చేస్తా అన్న రాహుల్ గాంధీ ఏడబోయిండు.?ఎన్నికల ముందు వచ్చిన గాంధీలు ఏడబోయారు’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదీ చదవండి: రేవంత్ నువ్వు రాహుల్ కాంగ్రెస్‌లో లేవా -
ఇకపై బీఆర్ఎస్ అధికారంలోకి రాదు: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో బుధవారం ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఆయన పాల్గొని మాట్లాడారు. ‘మిమ్మల్ని చూస్తే దసర పండగ మూడు రోజులు ముందే వచ్చిందా అనిపిస్తోంది. సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని గతంలో ఆశించారు. కానీ, గత సీఎం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఏనాడు చేయలేదు. మా ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం.వివాదం లేకుండా 21వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం. నిరుద్యోగుల సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పా. తండ్రీ కొడుకుల కొలువులు ఊడగొడ్తే.. మీకు కొలువులు వస్తున్నాయి. ఏదో రకంగా నోటిఫికేషన్లు అడ్డుకోవాలని కుట్రలు చేశారు. ఉద్యోగాలు ఇస్తుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. తెలంగాణ సమాజం మీద మీకెందుకంత కోపం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.నేను ప్రభుత్వం పాఠశాలలోనే చదువుకున్నా. ఇకపై బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.ప్రభుత్వ స్కూళ్లకు పంపడానికి కొందరు నామోషీగా ఫీలవుతున్నారు. పేదోళ్లు తాళిబొట్టు తాకట్టుపెట్టి ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. బడ్జెట్లో విద్యారంగానికి రూ. 21 వేల కోట్లు కేటాయించాం. ఏనాడైనా నిరుద్యోగులకు ఇవ్వాలని ఆలోచనా చేశావా?. అసెంబ్లీకి రావు (కేసీఆర్).. సలహాలు, సూచనలు ఇవ్వవు. మంచి పనులు చేస్తే.. కాళ్లల్లో కట్టెలు పెట్టి అడ్డుకుంటున్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదనం చేసిన పేద ప్రజలను పట్టించుకోలేదు. కేవలం 60 రోజుల్లో డీఎస్సీ నియామకాల ప్రక్రియ పూర్తి చేశాం. నిరుద్యోగుల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ.ఇవాళ్టి కార్యక్రమం జరగొద్దని కుట్రలు చేసిండ్రు. పదేళ్లు ఏలిన వారు పది నెలల మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. ఆ అవకాశం తెలంగాణ ప్రజలు వారికి ఇవ్వరు. తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు. నాతో పాటు ఇక్కడున్న చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్ళమే. తెలంగాణలో 30వేల పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుకుంటున్నారు. తెలంగాణలోని 10వేల పాఠశాలల్లో 34లక్షల మంది చదువుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషీగా భావిస్తున్న పరిస్థితికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నాం.ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.125 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 11న పనులు ప్రారంభించుకోబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేలా వ్యవస్థను తయారు చేస్తాం. ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపట్టాం.తెలంగాణలో ప్రతీ ఏటా 1లక్షా 10వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. కానీ ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించబోతున్నాం.త్వరలో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు. తెలంగాణ పునర్మిర్మాణానికి మీవంతు కృషి చేయండి’ అని అన్నారు. -
మేం వచ్చాక రాజీవ్‌గాంధీ విగ్రహం అక్కడికే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి ఆవిష్కరించటంపై సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ పప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు నిరసనగా రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రేవంత్‌రెడ్డి తెలంగాణతల్లి ఆత్మను తాకట్టుపెట్టాడని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధేనని హెచ్చరించారు. ఇదీ చదవండి.. రాజీవ్ విగ్రహాన్ని టచ్‌చేస్తే బీఆర్ఎస్కే నష్టం: వీహెచ్ -
కాంగ్రెస్ వల్లే ఖమ్మం వరదలు: పువ్వాడ అజయ్
సాక్షి,హైదరాబాద్: మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే తమపైన దాడి చేశారని మాజీ మంతత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు వాయిస్ లేదని విమర్శించారు. తెలంగాణభవన్‌లో పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు.‘ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారు. మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా. అజయ్ కుమార్ ఆక్రమణల వలనే ఖమ్మం మునిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు పరివాహకంలో రాజీవ్ గృహకల్ప,జలగం నగర్ కాలనీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్యి. నా హాస్పిటల్ కట్టి 25 సంవత్సరాలు అయింది. నా హాస్పిటల్‌కు చుక్క నీరు రాలేదు. నా హాస్పిటల్‌కు మున్నేరుకు సంబంధం లేదు. కేసీఆర్ వరద సాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు..? ప్రజలను డైవర్ట్ చేసేందుకు నిన్న మాపై దాడులు చేశారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని రూ.650 కోట్లు మంజూరు చేయించాను. రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలి. భౌతికంగా మాపై దాడి చేస్తే ఖమ్మం ప్రజల భాదలు తీరుతాయా..? మంత్రుల ఫంక్షన్ హాల్స్ ఆక్రమణలో ఉన్నాయని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు. రెవిన్యూ మంత్రి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మరో మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి. హైడ్రా కూల్చివేతలు మంత్రుల ఫంక్షన్ హాళ్లు,విల్లాలతో మొదలు పెట్టండి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు మనుషులే మాపై దాడి చేశారు’అని అజయ్‌కుమార్ మండిపడ్డారు. -
సీఎం రేవంత్‌పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం(సెప్టెంబర్2) ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా రేవంత్‌రెడ్డి వైఖరిని సుప్రీంకోర్టు మరోసారి తప్పుపట్టింది. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ లాయర్స్ మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ పీసీసీ ట్విటర్ హ్యాండిల్‌లోనే కవిత బెయిల్‌పై పోస్టులు పెట్టిన విషయాన్నికోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ‘బెయిల్ గ్రాంటెడ్.. బెయిల్ గివెన్..? అని పోస్టులు పెట్టినట్లు తెలిపారు. సీఎం రేవంతే పీసీసీ చీఫ్‌గా ఉన్నారని కోర్టుకు విన్నవించారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం స్పందింంది. ఈ పోస్టులను కోర్టు దృష్టికి తేవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు‘ఉన్నత స్థానాలలో ఇలా వ్యవహరించడం మంచిది కాదు. లాయర్లను, జడ్జిలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. న్యాయ వ్యవస్థగా మీ నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నాం’అని రేవంత్‌ను ఉద్దేశించి ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో రేవంత్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు. దీనికి స్పందించిన బెంచ్ రిప్లై ఫైల్ చేయాలని రేవంత్ న్యాయవాదిని ఆదేశించింది. కాగా, ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం: సీఎం రేవంత్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై ఢిల్లీలో శుక్రవారం(ఆగస్టు16) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్‌రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్‌గా పదవులు తీసుకుంటారు. బీఆర్ఎస్కు ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వీళ్లంతా బీజేపీలో విలీనం తర్వాత కవితకు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారు’అని రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
‘అమరరాజా’ వెళ్లిపోతే విపత్తే: కేటీఆర్ హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రూ. 9500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకుగాను అమర్‌రాజాను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం అనేది పాలసీ కొనసాగింపును నిర్ధారించాల్సిన సంస్థగా వ్యవహరించాలని సూచించారు.గతంలో తమకు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం నిలబెట్టుకోకపోతే తెలంగాణ నుంచి వెళ్లిపోతామని అమర్‌రాజా కంపెనీ చైర్మన్ గల్లాజయదేవ్ అన్నట్లు వచ్చిన వార్తలపై ఆదివారం(ఆగస్టు11) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘మన రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బాధపడకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనీ పెట్టుబడిదారులందరికీ గౌరవిస్తుందని నేను ఆశిస్తున్నాను.నిజానికి దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన శక్తివంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో సమానం అంటూ హాస్యాస్పద ప్రకటనలు చేయడం సీఎం రేవంత్ మానేయాలి. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లిపోవడం, కార్నింగ్ ప్లాంట్‌ను చెన్నైకి పోగొట్టుకోవడం చూశాం. ఇప్పుడు గనుక అమరరాజా వెళ్లిపోతే అది విపత్తుతో సమానం’అని కేటీఆర్ హెచ్చరించారు. -
సీఎం రేవంత్ షాడో కేబినెట్లో ఆ నలుగురు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో షాడో కేబినెట్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో శనివారం(జులై 27) మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్‌లో మాట్లాడారు. సీఎం రేవంత్ సన్నిహితులు వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఉదయ సింహ, అజిత్ రెడ్డితో షాడో కేబినెట్ నడుస్తోందన్నారు. మిగతా వాళ్ళంతా డమ్మీలే అని ఎద్దేవా చేశారు.సీఎం సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. తమ వద్దకు అన్ని వివరాలు వస్తున్నాయని చెప్పారు. అన్నీ బయటపెట్టడానికి టైమ్ ఉందన్నారు. -
పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం(జులై 26) సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహించడంపై అధికారులతో చర్చించారు. ఆగస్టు తొలివారంలోగా కొత్త ఓటరు లిస్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన తర్వాత గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌ను సీఎం కోరారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వి.కృష్ణ మోహన్, సీఎస్ శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
అయినా బీఆర్ఎస్ మారలేదు: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తాం. విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. .. ఏడు లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదు. ప్రజలు ఆగ్రహించినా బీఆర్ఎస్ మాత్రం మారలేదు. తప్పులు చేశారు. ప్రజలు శిక్షించారు. అయినా మారలేదు. బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాం’’ అని రేవంత్ తెలిపారు. కార్మికులు పక్షాన కొట్లాడే కమ్యూనిస్టులకు మైక్ ఇస్తే తప్పేంటి?. ఎమ్మెల్యే సాంబశివరావుకు మైక్ ఇవ్వటం తప్పా?. స్పీకర్‌పై ఆరోపణలు చేయటం తగదని సీఎం రేవంత్ అన్నారు.