గత 60 ఏళ్లలో లేని డ్రగ్స్ విషసంస్కృతి ఈ మూడేళ్లలోనే జడలు విప్పడానికి సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్, వారి సమీప బంధువులే కారణమని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
మంత్రి, ఆయన బంధువులపై రేవంత్ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్:
గత 60 ఏళ్లలో లేని డ్రగ్స్ విషసంస్కృతి ఈ మూడేళ్లలోనే జడలు విప్పడానికి సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్, వారి సమీప బంధువులే కారణమని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ కనుసన్నల్లోనే అంతర్జాతీయ డీజే కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారని అన్నారు.
కేటీఆర్ బావమరిది రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈవెంట్స్ నౌ అనే సంస్థ ఈ మూడేళ్లలో దాదాపు 10 అంతర్జాతీయ డీజే షోలను ఏర్పాటు చేసిందని, ఈ షోలు డ్రగ్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, యువతులపై అఘాయిత్యాలకు వేదికలుగా ఉన్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి షోలను ముంబై, గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనూ పోలీసులు అనుమతించడంలేదన్నారు.