తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేరు చెప్పడంలో మరో తెలుగు హీరో మరిచిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే పుష్ప2 సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ (Allu Arjun ) మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పే క్రమంలో కాస్త తడపడటం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరోసారి అదే తప్పు జరగడంతో నెటిజన్లతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి అభిమానులు భగ్గుమంటున్నారు.
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక సమావేశాలు జనవరి 5న ముగింపు కార్యక్రమం జరిగింది. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అతిథిగా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి హోస్ట్‌గా సినీ నటుడు బాలాదిత్య (Baladitya) వ్యవహరిస్తున్నారు. సభ జరుగుతుండగా సీఎం రేవంత్ అక్కడకు చేరుకున్నారు. హోస్ట్‌గా ఉన్న బాలాదిత్య ఆయనకు ఆహ్వానం పలికే క్రమంలో ఇలా తప్పుగా సంబోధించారు. 'మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులు, శ్రీ కిరణ్ కుమార్ గారు' అని ఉచ్చరించారు.
ఇంతలో అక్కడ ఉన్న వారందరూ కేకలు వేయడంతో తన తప్పును ఆయన వెంటనే గ్రహించారు. ఒక క్షణంలో తన తప్పును సరిచేసుకుని మళ్లీ మైక్‌లో ఇలా చెప్పారు. 'క్షమించాలి.. మన ప్రియతమ నాయకులు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు' అని సరిచేసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న కార్యక్రమంలో ఎదురుగానే ఒక సీఎం ఉంటే ఆయన పేరును తప్పుగా పిలువడం ఏంటి అంటూ సామాన్యులు కూడా విరుచుకుపడుతున్నారు. హౌస్ట్‌గా వ్యవహిరిస్తున్నప్పుడు ఇంతటి పెద్ద తప్పులు ఎలా చేస్తారని కామెంట్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్)
ఇదే సమయంలో బాలాదిత్య పరిస్థితిని అర్థం చేసుకుంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ ఒక వేదికపై మాట్లాడుతూ సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు చెప్పే క్రమంలో కాస్త తడపడటం జరిగింది. ఆ ఘటన తర్వాత సంధ్య థియేటర్ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పుడు బాలాదిత్య కూడా బహుశా.. ఆ ఘటన తాలూకు భయంతో అతి జాగ్రత్తపడి ఉంటాడని కొందరు చెప్పుకొస్తున్నారు.
వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలకు హోస్ట్‌గా బాలాదిత్య చాలా చక్కగా నిర్వహించారు. గతంలో ఒక టీవీ ఛానల్ కోసం జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కానీ, ఇప్పుడు ఆయన పెద్ద తప్పే చేశారని ఎక్కువ శాతం అభిప్రాయ పడుతున్నారు.
మళ్ళీ ఘోర అవమానానికి గురైన తెలంగాణ ముఖ్యమంత్రి
తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికిన వైనం
త్వరలో జైలుకి వెళ్లనున్న మరో యాంకర్ అంటూ సెటైర్లు వేస్తున్న నెటిజన్లు https://t.co/vY2w4RJZ2O pic.twitter.com/GEaoPEjYZi— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025
Comments
Please login to add a commentAdd a comment