
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఆ సంస్థ ప్రచారకర్త మహేశ్‌బాబు (Mahesh Babu)ను ఈడీ (Enforcement Directorate) విచారణకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే! అయితే షూటింగ్స్‌తో బిజీగా ఉన్న కారణంగా నేడు (ఏప్రిల్ 28) విచారణకు రాలేనని, మరో తేదీ ఇవ్వాలని మహేశ్ అధికారులకు లేఖ రాశాడు. దీనిపై ఈడీ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. మరి నేటి విచారణకు ఈడీ మినహాయింపు ఇస్తుందా? విచారణ కోసం మరో తేదీ కేటాయిస్తుందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.
ఏం జరిగింది?
సాయిసూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేశ్‌బాబుకు రూ.3.5 కోట్లు చెక్ ద్వారా, రూ.2.4 కోట్లు క్యాష్ రూపంలో డబ్బు చెల్లించినట్లు ఆధారాలు సేకరించింది. మహేశ్‌బాబుకు అందిన డబ్బుపై ఆరా తీసేందుకు ఈడీ అతడిని విచారణకు రమ్మని ఆదేశించింది. కానీ రాజమౌళి సినిమా (SSMB29) షూటింగ్‌తో బిజీగా ఉన్నందున నేడు విచారణకు రాలేనని మహేశ్ ఈడీకి లేఖ రాశాడు. మరి దీనిపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి!