తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు నేడు సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణం ఆపై అల్లు అర్జున్ అరెస్ట్ వంటి అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. దీంతో ముఖ్యమంత్రిని పులువురు సినీ ప్రముఖులు నేడు కలవనున్నడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం కలిగింది. అయితే, సీఎంతో భేటీ అయ్యే సినీ పెద్దలు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ విషయంలో నిర్మాత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్‌రాజు కీలకంగా వ్యవహరించనున్నారు. సీఎంతో భేటే అయేందుకు సినీ ప్రముఖులతో కూడా ఆయన ఇప్పటికే మాట్లాడారని తెలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌లో ఈ సమావేశం జరగనుంది. సుమారు 36 మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్,త్రివిక్రమ్, సురేష్‌బాబు,నితిన్,వరుణ్ తేజ్, శివ బాలాజీ, పలువురు నిర్మాతలు, దర్శకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే, ఈ సమావేశంలో చిరంజీవి పాల్గొనకపోవచ్చు అని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. పలు కారణాల వల్ల ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నారని నెట్టింట వైరల్ అవుతుంది. మెగాఫ్యాన్స్ కూడా నేడు జరిగే సమావేశంలో తమ బాస్ దూరంగానే ఉండబోతున్నట్లు ట్వీట్లు చేస్తున్నారు. అయితే, ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే 10 గంటల వరకు వేచి ఉండాల్సిందే.
చిత్ర పరిశ్రమ పెద్దలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొనే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment