Dill raju
-
సీఎం రేవంత్‌ను కలవనున్న సినీ ప్రముఖల లిస్ట్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు నేడు సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. సుమారు 36 మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేడు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం కానున్నారు.నిర్మాతల నుంచి ఎవరు వెళ్తున్నారంటే.. దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్,శ్యాంప్రసాద్‌రెడ్డి, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్ , కె ఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్ తదితరులుతెలుగు హీరోలనుంచి వెంకటేష్,నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ, హాజరు కానున్నారు.దర్శకుల సంఘం నుంచి అధ్యక్షుడు వీర శంకర్, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ,కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ , అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ సీఎంతో భేటీ కానున్నారు.తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ , సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వెళ్తుండగా మా అసోసియేషన్‌తో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారుచర్చకు వచ్చే అంశాలుసినిమా పరిశ్రమ సమస్యలపై చర్చతెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులునంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలనచిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపుతెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలుఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై చర్చటికెట్ ధరల పెంపు, పెంపుబెనిఫిట్ షోల అంశాల గురించి చర్చ -
సీఎం రేవంత్‌తో సినీ పెద్దల భేటీ.. దూరంగా చిరంజీవి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు నేడు సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణం ఆపై అల్లు అర్జున్ అరెస్ట్ వంటి అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. దీంతో ముఖ్యమంత్రిని పులువురు సినీ ప్రముఖులు నేడు కలవనున్నడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం కలిగింది. అయితే, సీఎంతో భేటీ అయ్యే సినీ పెద్దలు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ విషయంలో నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ) ఛైర్మన్ దిల్‌రాజు కీలకంగా వ్యవహరించనున్నారు. సీఎంతో భేటే అయేందుకు సినీ ప్రముఖులతో కూడా ఆయన ఇప్పటికే మాట్లాడారని తెలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌లో ఈ సమావేశం జరగనుంది. సుమారు 36 మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్,త్రివిక్రమ్, సురేష్‌బాబు,నితిన్,వరుణ్ తేజ్, శివ బాలాజీ, పలువురు నిర్మాతలు, దర్శకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సమావేశంలో చిరంజీవి పాల్గొనకపోవచ్చు అని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. పలు కారణాల వల్ల ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నారని నెట్టింట వైరల్ అవుతుంది. మెగాఫ్యాన్స్ కూడా నేడు జరిగే సమావేశంలో తమ బాస్ దూరంగానే ఉండబోతున్నట్లు ట్వీట్లు చేస్తున్నారు. అయితే, ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే 10 గంటల వరకు వేచి ఉండాల్సిందే.చిత్ర పరిశ్రమ పెద్దలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొనే ఛాన్స్ ఉంది. -
సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై దిల్ రాజు ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిసెంబర్ 26న చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులతో పాటు కలవబోతున్నట్లు ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజన పరామర్శించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత చిత్రపరిశ్రమలో తీవ్ర అలజడి నెలకొంది. అయితే, సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో సీఎంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలవనున్నారు.సంధ్య థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడం వంటివి ఉండవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఇదే అంశం గురించి ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు తాను కూడా కలవనున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఎఫ్డీసీ ఛైర్మన్‌గా.. ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య వారధిగా తాను ఉంటానని దిల్ రాజు అన్నారు. సంక్రాంతి రేసులో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ సినిమాలు ఉన్నాయి. -
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో సినీ ప్రముఖులు
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమల మధ్య దూరం పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు కలుస్తారని ఆయన తెలిపారు. బాలకృష్ణ- బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డాకు మహారాజ్' ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆయన మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు.సంధ్య థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడం వంటివి ఉండవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు కదా.. మరీ మీరు నిర్మించిన డాకు మహారాజ్ పరిస్థితి ఏంటి అని నాగవంశీని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమెరికాలో ఉన్నారు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్ కార్యక్రమం నుంచి ఆయన హైదరాబాద్‌కు తిరిగొచ్చాక సీఎంను కలుస్తాం. ఆ సమయంలో టికెట్ ధరల పెంపుతో పాటు ప్రీమియర్ షోలపై చర్చ చేస్తామని ఆయన అన్నారు. నా సినిమా డాకు మహారాజ్ కంటే ముదే దిల్ రాజ్ గేమ్ ఛేంజర్ విడుదల అవుతుంది. కాబట్టి, టికెట్ల ధరల విషయంలో ఆయన ఏం తేలుస్తారో అందరికీ అదే వర్తిస్తుంది' అని నాగవంశీ అన్నారు. తాము కూడా అన్ని సినిమాలకు టికెట్ ధరలు పెంచమని అడగమన్నారు. ఏ సినిమాకు అయితే టికెట్ ధర పెంపు అవసరమో వాటికి మాత్రమే అడుగుతామని వంశీ అన్నారు.ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లతో సినీ ప్రముఖుల భేటీ గురించి తనకు తెలియదని నాగవంశీ తెలిపారు. ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్లిపోతుందని టాక్ వినిపిస్తోంది కదా..? అనే ప్రశ్నకు ఆయన ఇలా అన్నారు. 'నేను చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్‌లోనే ఇల్లు కట్టుకున్నా.. అలాంటప్పుడు మరోచోటకు ఎందుకు వెళ్తాను. ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల సపోర్ట్ ఇండస్ట్రీకి వుంది.' అని ఆయన అన్నారు. -
సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'.. దిల్ రాజు ప్రకటన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, దసరా సందర్భంగా మెగా ఫ్యాన్స్‌లో నిర్మాత దిల్‌రాజు జోష్ నింపారు. గేమ్ ఛేంజర్ విడుదల తేదీని అయన అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు స్పష్టతనిచ్చారు.'గేమ్ ఛేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నప్పుడు క్రిస్మస్ కంటే సంక్రాంతి అయితే బావుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్ సీస్‌లోని ఇతర డిస్ట్రిబ్యూటర్స్ అందరం భావించాం. ఈ ఆలోచనను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ సంస్థకు తెలియజేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నామని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభర’ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అందువల్ల సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారితో పాటు యువీ క్రియేషన్స్ సంస్థను అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి విడుదలకు లైన్ క్లియర్ అయింది. విశ్వంభర సినిమా విషయంలో మరో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారు. విశ్వంభర సినిమా కూడా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా నిర్మాణ పనులన్నీ పూర్తి అయ్యాయి. కానీ, నా కోసం, మా సినిమా కోసం వాళ్ల మరో రిలీజ్ డేట్‌కు విశ్వంభర విడుదల చేయటానికి ఒప్పుకున్నారు. అందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి నా ధన్యవాదాలు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను సంక్రాంతి విడుదల చేస్తున్నాం. ఇటు అభిమానులకు, అటు సినీ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నాం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూ ట్యూబ్‌లో మారుమోగిపోతున్నాయి. తర్వాత టీజర్‌తో పాటు మరో మూడు సాంగ్స్ రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజయం సాధించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతికి కలుద్దాం.' అన్నారు.సంక్రాంతికి కలుద్దాం! ❤️🔥✊🏼#GameChanger Global Star @AlwaysRamCharan @shankarshanmugh @MusicThaman @advani_kiara @iam_SJSuryah @actorsrikanth @yoursanjali @Naveenc212@AntonyLRuben @DOP_Tirru @artkolla @HR_3555 @ZeeStudios_ @saregamaglobal @saregamasouth @PharsFilm… pic.twitter.com/57Ht1FRW8m— Sri Venkateswara Creations (@SVC_official) October 12, 2024 -
'నా తమ్ముడు, మా నాన్న' అంటూ తారక్‌పై కల్యాణ్ రామ్ ప్రశంసలు
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'దేవర'. తాజాగా విడుదలైన ఈ సినిమా తారక్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దేవర దూసుకుపోతున్నాడు. సినిమాకు మంచి ఆదరణ రావడంతో తాజాగా చిత్ యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దేవరను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. చిత్ర సమర్పకులుగా ఉన్న కల్యాణ్ రామ్ దేవర గురించి ఇలా చెప్పుకొచ్చారు.దేవర సినిమాను ఆదరిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. నా తమ్ముడు, మా నాన్న (ఎన్టీఆర్) యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. దేవరలో తన రోల్ వన్ మ్యాన్ షో అని చెప్పగలను. ఎంతో కష్టపడి మాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు.' అని కల్యాణ్ రామ్ చెప్పారు.అనంతరం చిత్ర దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ.. 'దేవరతో మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. సినిమా ఫస్ట్ షో పడిన సమయం నుంచి నాకు వరసుగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. దేవర సినిమానే నా ఉత్తమ సినిమా అంటూ వారు అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చిత్ర యూనిట్ కష్టం వల్లే దేవర సినిమాకు ఇలాంటి ప్రశంసలు దక్కుతున్నాయి.' అని ఆయన అన్నారు.నైజాంలో ‘దేవర’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్‌రాజు కూడా ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. సినిమాలో ఆయన నటన మరోస్థాయిలో ఉంటుంది. 'వన్ మ్యాన్ షోతో సినిమాను తారక్ నడిపించారు. ప్రపంచదేశాలు కూడా నేడు తెలుగు హీరోల వైపు చూస్తున్నాయి. మన తెలుగు సినిమాలు కూడా ఇప్పుడు అన్ని దేశాల్లో రన్ అవుతున్నాయి. దీనంతటికి కారణమైన దర్శకులు, హీరోలకు నేను కృతజ్ఞతలు చెబుతుతున్నా.' అని దిల్ రాజు అన్నారు. -
వరద బాధితుల కోసం ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..సురేష్ బాబు, దిల్ రాజు భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరద వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేసేందకు తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులపే ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తాజాగా ప్రకటించింది. నివేదిక సాయంతో బాధితుల కోసం సహాయ కార్యక్రమాలను చేపడుతామని ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమా థియేటర్ల వద్ద విరాళాలు, ఆహార వస్తువలను సేకరించేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చాలామంది సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు విరాళం ప్రకటించింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు అందిస్తుండగా ఫెడరేషన్ తరపున రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు నిర్మాత సురేశ్ బాబు ప్రకటించారు. అనంతరం దిల్ రాజు కూడా తెలంగాణకు రూ. 25 లక్షలు, ఏపీకి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఎలాంటి సహాయసహకారాలు చేస్తే బాగుంటుంది అనేదానిపై చర్చించాము. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీ, తెలంగాణకు విరాళంగా ప్రకటిస్తున్నాం. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు సంబంధించి అకౌంట్ నంబర్స్ అలాగే, ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సహాయం చేయాలనుకునేవారు ఈ అకౌంట్స్‌కు డబ్బులు పంపించవచ్చు.' అని తెలిపారు.నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే చాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాం. ఫెడరేషన్ పిలుపుమేరకు ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరుతున్నాం. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం.' అని చెప్పారు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..'మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అని చెప్పారు.ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ..'రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాలకు ఎంత చేయాలో అంతా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..'వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుంది.' అని చెప్పారు. -
ప్రేక్షకులను మేమే చెడగొట్టాం.. దిల్‌రాజు వైరల్ కామెంట్స్
టాలీవుడ్లో సినిమా మనుగడ గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నిర్మించిన అనుభువం దిల్ రాజుకు ఉంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా ఆయన బ్యానర్ నుంచి విడుదల అయ్యాయి. ఈ క్రమంలో కొత్త వారికి కూడా ఆయన భారీగానే అవకాశాలు కల్పించారు. అయితే, తాజాగా ‘రేవు’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమలో పాల్గొన్న దిల్ రాజు ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకుండా తామే చెడగొట్టామని దిల్‌రాజు కామెంట్ చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యాలు అందరినీ ఆలోచించే విధంగా చేస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. కానీ, వారిలో ఎక్కువగా ఫెయిల్ శాతమే ఉంటుంది. ఈరోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడం అంత సులభం కాదు. ఒక్కప్పుడు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలి అంటే ఇంకా ఏమేమి యాడ్ చేయాలని నేను కూడా ఆలోచించేవాడిని. నా వరకు అయితే ఆ పరిస్థితి లేదు. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడంలో కొత్త వారికి మాత్రం బిగ్ ఛాలెంజ్‌గా మారింది. మేము తీసిన బలగం, కమిటీ కుర్రోళ్ళు ప్రేక్షకులను మెప్పించాయి. ఇదే సమయంలో రివ్యూస్ ఇచ్చే వారు కూడా మంచిగానే ఇవ్వడంతో మాకు ఇంకా కలిసొచ్చింది. అసలు ప్రేక్షకులను థియేటర్ల వరకు రాకుండా చెడగొట్టింది మేమేలెండీ.. సినిమా విడుదలయ్యాక నాలుగు వారాలు ఆగండి ఆ తర్వాత ఓటీటీలోకి తెస్తాము.. మీ ఇంట్లోనే కూర్చోని సినిమా చూడండి అని మేమే చెడగొట్టాం. రాంబాబు, ప్రభు నాకు చాలా మంచి సన్నిహితులు. వారు ఈ చిత్రం గురించి చెప్పారు. వీళ్లు వెనకాల ఉండి ఈ సినిమాను తీశారు కాబట్టి.. నేను ముందుండి నడిపించాలని అనుకున్నాను. ఇంత వరకు వీళ్ళు సినిమాని చూసి రివ్యూ రాశారు. ఇప్పుడు వీళ్ళు సినిమా (రేవు) తీశారు. కాబట్టి వీళ్ళ సినిమా (రేవు) చూసి నేను రివ్యూ రాస్తా’ అని అన్నారు.50 రోజుల షరతుప్రస్తుతం దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగుతుంది. సినిమా బాగున్నా వెంటనే ఓటీటీలోకి సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులు పెద్దగా థియేటర్ వైపు వెళ్లడం మానేశారు. సినిమా విడుదలయ్యాక కనీసం 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని పలు షరతులు ఉన్నప్పటికీ ఎవరూ వాటిని పాటించడం లేదు. అన్ని చిత్రపరిశ్రమలలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది.వాటి రేట్లు తగ్గిస్తేనే మనుగడప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. టికెట్ ధరలుతో పాటు పార్కింగ్, బ్రేక్ టైమ్‌లో తినుబండారాల ధరలు తారాస్థాయిలో ఉంటున్నాయి. మరికొన్ని థియేటర్లలో అయితే, నీళ్ల బాటిల్ కొనాలన్నా రూ. 100 చెల్లించాల్సిందే. ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే కనీసం రూ. 2 వేలు ఖర్చు చేయాల్సిందే. ఇవన్నీ కాస్త తగ్గిస్తే సామాన్యుడు కూడా థియేటర్లో అడుగుపెట్టి సినిమా చూస్తాడు. లేదంటే రాబోయే రోజుల్లో థియేటర్ అనే పేరును కూడా మరిచిపోయే ఛాన్స్ ఉంది. -
గేమ్ ఛేంజర్ విడుదల తేదీని ప్రకటించిన దిల్ రాజు
రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదల తేదీని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయిందని డైరెక్టర్ శంకర్ తెలిపిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి సినిమా రాలేదు కాబట్టి ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'గేమ్ ఛేంజర్' పేరుతో రెండేళ్లుగా ఊరిస్తూనే ఉన్న ఇప్పటి వరకు అధికారికంగా మూవీ రిలీజ్ పై స్పష్టత లేదు. అటు డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 మూవీ ప్రమోషన్లలో ప్రకటిస్తాడు అనుకుంటే ఆయన కూడా రివీల్ చేయలేదు.జులై 26న విడుదల కానున్న 'రాయన్' సినిమా ప్రీ- రిలీజ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్ రాజు 'రాయన్' చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. ఈ క్రమంలో 'గేమ్ ఛేంజర్' విడుదల ఎప్పుడు అంటూ చరణ్ ఫ్యాన్స్ పట్టుపట్టారు. దీంతో ఆయన చెప్పక తప్పలేదు. 'గేమ్ ఛేంజర్' మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని దిల్ రాజ్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. దిల్ రాజు చెప్పిన ప్రకారం డిసెంబర్ 25న గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. దీపావళికి విడుదలవుతుందని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
వెంకటేశ్- అనిల్ రావిపూడి హ్యాట్రిక్ సినిమా
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ని తీసుకున్నట్లు దర్శకుడు అనిల్‌రావిపూడి ప్రకటించారు.అయితే, తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆయన పూజలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమని దర్శకుడు అన్నారు. ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారని ముందే అనిల్ రివీల్ చేశాడు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ ఎంటర్టైనర్ మూవీ అని ఆయన అన్నాడు. ఈ నెల 3 నుంచి ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. -
‘లవ్ మీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ ధైర్యం దిల్ రాజుకే సాధ్యం: అల్లు అరవింద్
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు గురించి ఆసక్తరమైన విషయాలను పంచుకున్నారు.లవ్ మీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అరుణ్‌కు దక్కడం చాలా సంతోషం అని అల్లు అరవింద్ అన్నారు. కొత్తవారికి దర్శకత్వం వహించే ఛాన్సులు ఎక్కువగా దిల్ రాజు ఇస్తుంటారని ఆయన గుర్తు చేశారు. డైరెక్షన్లో గత అనుభవం లేని వారికీ అవకాశాలు ఇవ్వడం దిల్ రాజుకే సాధ్యమని అల్లు అరవింద్ తెలిపారు. అలాంటి సాహసం తాను ఏమాత్రం చేయలేనని ఆయన అన్నారు. లవ్ మీ సినిమాతో కీరవాణి, పీసీ శ్రీరామ్‌లాంటి స్టార్ టెక్నిషియన్లతో మొదటి ప్రాజెక్ట్‌కే పని చేయడం అరుణ్ అదృష్టమని తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆరవింద్ ఆశించారు.దిల్ రాజు మాట్లాడుతూ..'హర్షిత్ రెడ్డి సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారాడు. హన్షిత చిన్నప్పటినుంచి షూటింగ్స్‌కు వెళ్లేది. కానీ సినిమా రంగంలోకి వస్తుందని ఊహించలేదు. వీరిద్దరు కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్నారు. తొలి సినిమా బలగంతో వేణు యెల్దండిని దర్శకుడిగా పరిచయం చేశారు. లవ్ మీతో అరుణ్‌కు ఛాన్స్ ఇచ్చారు. మరికొన్ని సినిమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. కొత్తవారిని ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం' అని అన్నారు. -
వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
నేషనల్ అవార్డ్ విన్నర్ 'అల్లు అర్జున్' అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేలా తనను తాను మలుచుకున్నాడు. 'గంగోత్రి'తో ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీ సులువుగానే జరిగిపోయింది. కానీ, 'ఆర్య' నుంచి తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల పరంగానే కాకుండా... పురస్కారాల్లోనూ తగ్గేదేలే అని చాటి చెప్పాడు. 'గంగోత్రి'లో అందర్నీ నటనతో కట్టిపడేసిన బన్ని.. తర్వాత వచ్చిన 'ఆర్య'తో తన మార్క్‌ను చూపించాడు. ఆర్య సినిమా బన్నీకి మాత్రమే కాదో ఎందరో జీవితాలను మార్చేసింది. ఆ సినిమాతో మొదలైన సుకుమార్- బన్నీ ప్రయాణం.. పుష్ప చిత్రం ద్వారా నేషనల్ అవార్డు వరకు చేరింది. అందుకే ఆర్య సినిమా వారందరికీ చాలా ప్రత్యేకం. సరిగ్గా నేటికి ఆర్య విడుదలై 20 సంవత్సరాలు అయింది.అల్లు అర్జున్ హీరోగా నటించిన రెండవ సినిమానే ఆర్య. సుకుమార్‌కు ఇదే మొదటి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 7 మే 2004లో విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇందులో బన్నీకి జోడిగా అనురాధ మెహతా నటించింది. మొదటి ఆటతోనే 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఆర్య సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ భారీగా క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ను మనం ప్రేమగా బన్నీ అని పిలుచుకుంటే.. మలయాళం ప్రేక్షకులకు మల్లు అర్జున్ అయిపోయాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియరే మారిపోయింది. తనలోని డ్యాన్స్,నటన, స్టైల్ ఇలా అన్నీ తెరపై చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.ఆర్యతో మారిపోయిన జీవితాలుసుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎందరో జీవితాలని మార్చింది. నటుడిగా అల్లు అర్జున్, దర్శకుడిగా సుకుమార్, నిర్మాతగా దిల్‌రాజుకి, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌కి, డీఓపీగా రత్నవేలుకి, డిస్ట్రిబ్యూటర్‌గా బన్ని వాసుకి ఇలా చాలామందికి ఆర్య మంచి గుర్తింపునిచ్చింది. వారందరి కెరీర్లో ఒక మైలురాయిగా ఆర్య నిలిచిపోయింది. ఇలా ఎందరికో బ్రేక్ ఇచ్చిన ఆర్యను గుర్తు చేసుకుంటూ ఒక ఈవెంట్‌ను ప్లాన్ చేయాలని దిల్ రాజు ఉన్నారట. దీని నుంచి అధికారక ప్రకటన రాలేదు.అల్లు అర్జున్ రియాక్షన్ఆర్యకు 20 సంవత్సరాలు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అని తెలిపాడు 20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig— Allu Arjun (@alluarjun) May 7, 2024 -
టాలెంటెడ్ డైరెక్టర్‌తో దిల్ రాజు- విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను తాజాగా ప్రకటించారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈరోజు లాంఛనంగా అనౌన్స్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా తెరకెక్కనుంది. మే 9న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. విజయ్ దేవరకొండ- దిల్ రాజు కాంబోలో ఫ్యామిలీస్టార్ సినిమా కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. కొందరు కావాలని సినిమాపై నెగెటివ్ టాక్ వ్యాప్తి చేయడంతో కొంతమేరకు నిరాశపరిచిందని వార్తలు వచ్చాయి. కానీ, హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండతో మరొక సినిమా చేస్తానని దిల్ రాజు గతంలోనే అన్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ ఫలితం తర్వాత దిల్ రాజు ఇచ్చిన మాటను పక్కనపెడుతారేమో అని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలకు మించి ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రకటించారు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న రవికిరణ్ కోలాకి ఏకంగా ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చి దిల్ రాజు అందరిని ఆశ్చర్య పరిచారు. ఇక్కడ విజయ్ దేవరకొండ కూడా తన కమిట్మెంట్తో దిల్ రాజు మనసు గెలుచుకున్నారని చెప్పవచ్చు. A Larger-than-life "Rural Action Drama" is on the cards 🧨#SVC59 will be @TheDeverakonda's Mass EndeavourX A @storytellerkola's Vision 💥 Produced by Raju - Shirish ✨More Updates on 9th May, Stay tuned to @SVC_official pic.twitter.com/FVca4INOGC— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2024 -
ఆర్థిక ఇబ్బందులు ఉంటే 'దిల్ రాజు' సాయం చేశారు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. గీతా గోవిందం తర్వాత విజయ్‌తో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రెస్మీట్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. దిల్ రాజు గురించి ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. కొవిడ్ సమయంలో విజయ్‌కు దిల్ రాజు చేసిన సాయాన్ని బహిరంగంగానే ఇలా చెప్పాడు. 'నాతో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నాకు కూడా ఆయన బ్యానర్లో సినిమా చేయాలనే కోరిక ఉంది. అందుకోసం కొన్ని కథలు కూడా పంపించారు. కానీ సినిమా పట్టాలెక్కేందుకు కాస్త సమయం తీసుకుంది. ఇంతలో కొవిడ్ రావడంతో ఆ సమయంలో నాకు కొంత డబ్బు అవరసరం వచ్చింది. అప్పుడు దిల్ రాజు గారే అడ్వాన్స్ రూపంలో సాయం చేశారు. అప్పటికి సినిమా కూడా ఒప్పుకోలేదు.' అని ఆయన అన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన 'కేరింత' కోసం ఆడిషన్స్‌కు వెళ్లితే తనను సెలెక్ట్ చేయలేదని విజయ్ దేవరకొండ గుర్తుచేసుకున్నాడు. అందుకు తాను బాగా హర్ట్ అయినట్లు ఆయన చెప్పారు. అదే విషయాన్ని కొన్నేళ్ల క్రితం దిల్‌రాజుతోనూ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ సమయం నుంచి కరెక్ట్ కథ కోసం ఎదురుచూస్తే.. ఇప్పుడు ఫ్యామిలీస్టార్‌తో సెట్ అయినట్లు విజయ్ అన్నారు. ఫ్యామిలీస్టార్ తర్వాత విజయ్‌తో మరో సినిమా తీస్తానని దిల్ రాజు ప్రకటించారు. చాలారోజుల నుంచి విజయ్‌తో భారీ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేసినట్లు దిల్ రాజు అన్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ పెట్టుకున్నానని ఆయన అన్నారు. -
ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యామిలీస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్
విజయ్ దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీస్టార్’ మరో కొద్దిరోజుల్లో థియేటర్లోకి రానున్నాడు. వేసవి సందర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు - శిరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 2న ఫ్యామిలీస్టార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని మైసమ్మగూడ వద్ద ఉన్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సాయింత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. 'గీత గోవిందం' కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... సినిమాలో వినోదంతో పాటు ఫైట్స్, కామెడీ, భావోద్వేగాలు అన్నీ కలిపిన పక్కా సమ్మర్ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు. ఒక కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లే ప్రతీ మనిషి ఫ్యామిలీ స్టారే అంటూ ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీస్టార్స్‌లా మారతారని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యామిలీస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్
విజయ్ దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీస్టార్’ మరో కొద్దిరోజుల్లో థియేటర్లోకి రానున్నాడు. వేసవి సందర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు - శిరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 2న ఫ్యామిలీస్టార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని మైసమ్మగూడ వద్ద ఉన్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సాయింత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. 'గీత గోవిందం' కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... సినిమాలో వినోదంతో పాటు ఫైట్స్, కామెడీ, భావోద్వేగాలు అన్నీ కలిపిన పక్కా సమ్మర్ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు. ఒక కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లే ప్రతీ మనిషి ఫ్యామిలీ స్టారే అంటూ ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీస్టార్స్‌లా మారతారని ఆయన అభిప్రాయపడ్డారు. Let us indulge in an evening of celebration with the amazing team of #Family Star and the energetic fans ❤️🔥#FamilyStar Grand Pre-release event on April 2nd 💥💥 Venue : Narasimha Reddy Engineering College, Maisammaguda, Hyd.#FamilyStarOnApril5th@TheDeverakonda @Mrunal0801… pic.twitter.com/3Mh3MmVKYn — Sri Venkateswara Creations (@SVC_official) March 31, 2024 -
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ హీరో నితిన్ నేడు (మార్చి 30) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో నితిన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'తమ్ముడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన మేకర్స్.. నేడు నితిన్ పుట్టినరోజు కావడంతో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాని దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న 56వ సినిమాగా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లో నితిన్ కాస్త డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆడవాళ్లు లారీ తోలుతుంటే లారీపై కుమారస్వామి ఆయుధం పట్టుకొని నితిన్ కూర్చున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీన్ నుంచి ఈ పోస్టర్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నితిన్- దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో మరో సినిమాను రానుంది. వీరిద్దరి కాంబోలో ఇష్క్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నితిన్ భారీ హిట్ అందుకున్నాడు. A story of ambition, courage, and determination🎯 Presenting the passion-filled first look of #THAMMUDU ❤️🔥 Wishing everyone's Favourite Brother @actor_nithiin a very Happy Birthday ❤️🎉#HBDNithiin A Film by #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/30PgqvLvIZ — Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2024 -
పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 'దిల్ రాజు' సాయం
అంతరించిపోతున్న ఆ కళకు అతడే చివరి వారసుడు. బుర్రవీణను భుజాన మోస్తూ.. రామాయణం, ఆధ్యాత్మిక, గ్రామీణ కథలకు తగ్గట్లు వాయిద్యం వాయిస్తూ.. పాటలు పాడుతూ అందరినీ అబ్బురపరిచారు దాసరి కొండప్ప. వాయిద్యం, పాట మాత్రమే తెలిసిన అతడిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకి చెందిన ఒలియ దాసరి కుటుంబీకుడైన కొండప్పది ఎంతో నిరుపేద కుటుంబం.. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి ఆయనది. తాతల కాలం నుంచే బుర్రవీణ వాయిద్యంతో భిక్షాటన చేస్తూ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గుర్తించి దేశంలోనే నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కానీ కొన్ని సంవత్సరాలుగా తిరుమలరావు అనే వ్యక్తి ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పాటలు పాడి తన కళకు గుర్తింపు సంపాదించారు. ఈ క్రమంలో ఆయన కళను గుర్తించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కూతురు నిర్మించిన బలగం చిత్రంలో ఒక పాట పాడేందుకు అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలో ‘అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే’ అనే పాటకు తన గాత్రాన్ని అందించాడు కొండప్ప. తాజాగా కొండప్పను తన ఆఫీస్‌కు దిల్ రాజు పిలుపించుకున్నారు. ఆపై ఆయన్ను సన్మానించి గౌరవించారు. దిల్ రాజుతో పాటు బలగం డైరెక్టర్ వేణు తదితరులు కొండప్పను అభినందించారు. అనంతరం దిల్ రాజు లక్ష రూపాయల చెక్కుని కొండప్పకు అందించారు. ఆ డబ్బును కొండప్ప కోసం మాత్రమే వాడాలని సూచించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. #DasariKondappa garu who sang a song and acted in the film #Balagam has been awarded the PRESTIGIOUS PADMA SHRI ❤️ The entire team met him, felicitated him and presented a cheque of 1 Lakh as a token of appreciation!@VenuYeldandi9 @PriyadarshiPN @kavyakalyanram @dopvenu pic.twitter.com/gVNabIzGNK — Dil Raju Productions (@DilRajuProdctns) February 3, 2024 -
‘ధీర’ట్రైలర్ బాగుంది.. వారి కష్టానికి ప్రతిఫలం రావాలి: దిల్ రాజు
‘‘25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్‌ని చూస్తున్నాం. శ్రీనివాస్‌గారు చిన్న నిర్మాతలకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తారు. ఇక లక్ష్ నటించిన ‘ధీర’ట్రైలర్ బాగుంది. తన హార్డ్ వర్క్, చిత్ర యూనిట్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. లక్ష్ చదలవాడ హీరోగా విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధీర’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మించిన ఈ మూవీ రేపు (శు క్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ‘దిల్’ రాజు, దర్శకులు గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన అతిథులుగా హాజరై, సినిమా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్లలో ఎంతో మంది దర్శకులని పరిచయం చేశాను. ‘ధీర’తో విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నాను. లక్ష్ ను చూసి తండ్రిగా గర్విస్తుంటాను. మా ప్రొడక్షన్లో ఇప్పుడు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి’’ అన్నారు. ‘‘పక్కోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేసే వాడికి ఓ మిషన్ అప్పగిస్తే ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యల్ని ‘ధీర’లో చూస్తారు’’ అన్నారు లక్ష్ చదలవాడ. ‘‘ధీర’ చాలా యూనిక్ పాయింట్. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు విక్రాంత్ శ్రీనివాస్. -
దేవర రిలీజ్ పై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
-
టీజర్ ఆసక్తికరంగా ఉంది
సంబీత్ ఆచార్య, జో శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎమ్4ఎమ్’. నిర్మాత మోహన్ వడ్లపట్ల ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాను. నెక్ట్స్ హాలీవుడ్‌లోనూ ఓ సినిమాను నిర్మించబోతున్నాను. రాహుల్ అడబాల, జో శర్మలు ఈ చిత్రకథ రాయడంలో సహకరించారు’’ అన్నారు మోహన్ వడ్లపట్ల. ఎంఆర్సీ చౌదరి, రాహుల్ అడబాల మాట్లాడారు. -
పగ.. ప్రతీకారం...
కళాధర్ కొక్కొండ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కర్ణ’. మోనా ఠాకూర్ హీరోయిన్గా నటించారు. సనాతన క్రియేషన్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. కళాధర్ కొక్కొండ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనలతో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కర్ణ’. పగ, ప్రతీకారం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రంలోని ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ బీజే, కెమెరా: శ్రవణ్ జి.కుమార్. -
'కర్ణ' కోసం వెళ్లిన దిల్ రాజు
యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కర్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ ప్రేక్షకుల మెప్పు పొంది ఆసక్తి పెంచేసింది. జూన్ 23వ తేదీన ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనంతరం యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెష్ చెప్పారు. (ఇదీ చదవండి: Adipurush: ఏకంగా లక్షకు పైగా టికెట్లు కొనేశాడు..!) యుద్ధం శరణం శిక్షామి, స్నేహం శూన్యం రక్ష్యామి, లోకం స్వార్థం ప్రక్షామి అనే లైన్స్ షో చేస్తూ మొదలు పెట్టిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్లో మూవీ సోల్ తెలిసేలా సన్నివేశాలు కట్ చేశారు. ముఖ్యంగా హీరోయిజం, యాక్షన్ సన్నివేశాలు హైలైట్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు తోడు పల్లెటూరి వాతావరణం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో చూడొచ్చని ట్రైలర్ స్పష్టం చేసింది. ట్రైలర్ మొత్తం కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ హైలైట్ అయింది. చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం.. మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం అంటూ ఉత్కంఠ రేపే సీన్స్ చూపిస్తూ ఈ ట్రైలర్ క్లోజ్ చేశారు. చివరలో సెంటిమెంట్ సీన్స్ చూపించి ఆసక్తి పెంచేశారు. (ఇదీ చదవండి: Adipurush: అక్కడ కేవలం 24 టికెట్లే అమ్ముడుపోయాయట) -
సీనియర్ హీరోయిన్‌పై మనుసు పడిన రౌడీబాయ్
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచాడు. ఇప్పుడిప్పుడే 'లైగర్' సినిమా గొడవల నుంచి బయటపడుతున్న ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమా కోసం సీనియర్ హీరోయిన్ను తీసుకోవాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చాడట. ఇప్పటికే సమంత కాంబినేషన్లో ఖుషి సినిమా చేస్తున్న విజయ్ .. తర్వాత సినిమాకు కూడా సీనియర్ హీరోయిన్‌పైనే ఆసక్తి చూపుతున్నాడట. తాజాగా నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ పరశురాంతో కలిసి ఓ సినిమాను విజయ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకోవాలని వారికి సూచించాడట. ఇదే టాపిక్ టాలీవుడ్లో తెగ వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అందరి చర్చ దానిపైనే!) పూజానే ఎందుకు? పూరి డైరెక్షన్లో 'జనగణమన' సినిమాను తెరకెక్కించాలనుకున్న విజయ్‌కు 'లైగర్' షాక్ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదే సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్గా కూడా ఓకే చేశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ లేదు కాబట్టి.. పరుశురాం సినిమాతో తనను తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేశాడట. ఈ విషయంపై మేకర్స్ కూడా ఓకే చెప్పారట. ఏదేమైనా సమంత తర్వాత మరో సీనియర్ హీరోయిన్‌తో నటించే అవకాశాన్ని విజయ్ దేవరకొండ పొందాడు. (ఇదీ చదవండి: మంచు మనోజ్- భూమా మౌనిక.. ఇంత ఫ్యాషన్‌గా ఎప్పుడైనా చూశారా?) -
దిల్ రాజు మాటలకు ఐశ్వర్య రాయ్ ఎలా నవ్వుతుందో చుడండి..
-
దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చిన సమంత..
-
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో దిల్ రాజు భేటీ
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణుతో నిర్మాత దిల్ రాజు సమావేశమయ్యారు. గురువారం ఉదయం మా కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షూటింగ్స్ బంద్‌పై, మా సభ్యులకు సినిమా అవకాశాలపై వీరు ముచ్చటించారని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరు ఆయన ట్వీట్ చేశారు. దిల్ రాజును కలిసిన సందర్భంగా తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్ ఈ సందర్భంగా తమ సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని, అలాగే కొత్తవారు ‘మా’ సభ్యత్వం పొందేలా ప్రోత్సహించాలని దిల్ రాజును కోరినట్లు విష్ణు తెలిపారు. ఈ మేరకు మా సంక్షేమ కమిటి వినతి పత్రాన్ని దిల్ రాజుకు అందించారు. కాగా ‘మా’ సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించాలని కోరుతూ విష్ణు ఇకపై పలువురు టాలీవుడ్ నిర్మాతలను కలవనున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన దిల్ రాజుతో భేటి అయినట్లు సమాచారం. చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు హఠాన్మరణం Started meeting our TFI producers on behalf of MAA, requesting them to hire mostly MAA members and also to encourage newcomers to become a part of the MAA family. pic.twitter.com/1AjvqU436J — Vishnu Manchu (@iVishnuManchu) August 4, 2022 -
వాళ్లందర్నీ కలిసి థ్యాంక్స్ చెప్పాను
‘‘రచయిత బీవీఎస్ రవి నాలుగేళ్ల క్రితం నాకు ‘థ్యాంక్యూ’ స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. ఇదే లైన్‌ని నాని ‘గ్యాంగ్ లీడర్’ ప్రీమియర్‌లో విక్రమ్ కుమార్‌కి చెబితే తను కూడా ఎగ్జయిట్ అయ్యి, సినిమా చేద్దాం అన్నాడు. ‘మనం’ చిత్రం తర్వాత విక్రమ్‌కి, చైతన్యకి మధ్య ఉన్న కెమిస్ట్రీ (డైరెక్టర్, హీరోగా) మా సినిమాకి ప్లస్ అయింది. ‘థ్యాంక్యూ’లో మూడు పాత్రల్లో నాగచైతన్య అద్భుతంగా నటించాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► బీవీఎస్ రవి చెప్పిన స్టోరీ లైన్‌తో ఓ హీరో కేరక్టర్ రాయాలనుకున్నాం. ఆ పాత్రకి గతం చెప్పాలనుకున్నాం. అందుకే ‘థ్యాంక్యూ’లో హీరో పాత్రలో కాలేజ్, టీనేజ్.. ఇలా అన్నింటినీ డిజైన్ చేశాం. స్క్రీన్‌ప్లే, సీన్స్ అన్నీ విక్రమ్ స్టైల్లో రాయమని రవికి చెబితే అలాగే రాశాడు. ∙ ► కరోనా లాక్డౌన్ సమయంలో నేను కూడా వ్యక్తిగతంగా ‘థ్యాంక్యూ’ జర్నీని స్టార్ట్ చేశాను. నాకు స్కూల్లో, ఆటోమొబైల్ రంగంలో సహాయం చేసిన వారందర్నీ కలిసి థ్యాంక్స్ చెప్పాను. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో థ్యాంక్యూ జర్నీని కంటిన్యూ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. ∙ ► ‘థ్యాంక్యూ’ సినిమాలో ఒక సాధారణ కుర్రాడు లెజెండ్ అవుతాడు. మొత్తం నేనే అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. అతనికి సాయం చేసినవాళ్లు చాలామంది ఉంటారు. అందమైన ప్రేమకథ, వాణిజ్య అంశాలన్నీ కలిపి ఈ కాన్సెప్ట్‌ని సినిమాటిక్‌గా చెప్పడానికి ఎక్కువ స్ట్రగుల్ అయ్యాం. గతం గురించి ఆలోచించే టైమ్ ప్రస్తుతం ఎవరికీ లేదు. ► కథ విషయంలో ప్రతి డైరెక్టర్‌తో డిస్కస్ చేస్తాను. నా సలహాలను కొందరు డైరెక్టర్లు వింటారు.. మరికొందరు తామే రైట్ అంటారు. అలాంటివాళ్లతో నేను వాదించను. ∙పెద్ద డైరెక్టర్ల అనుభవాలు వాడుకుంటాను. కొత్తవాళ్లకి పాయింట్ టు పాయింట్ రాసిస్తాను. దానికి రీచ్ అవుతున్నామా? లేదా అని చెక్ చేస్తాను. మిడ్ వాళ్లతో అటూ ఇటూ ఉంటాను. ► కరోనాకి ముందు, కరోనా తర్వాత ప్రేక్షకుల ఆలోచనలు మారిపోయాయి. అంతకుముందు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూద్దామనే మూడ్‌లో ఉన్నారు. లాక్డౌన్లో ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో చాలా కంటెంట్ చూసి, ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు వాళ్లకి అంతంత మాత్రం కంటెంట్ నచ్చట్లేదు. దీనికోసం ఇంత డబ్బు పెట్టి వెళ్లాలా? అనుకుంటున్నారు. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ మారాల్సిన టైమ్ వచ్చింది. మంచి కంటెంట్ ఇచ్చి టిక్కెట్ ధరలు తగ్గిస్తే జనాలు వస్తారు. ఓటీటీలో త్వరగా సినిమాలు రావడం వల్ల కూడా థియేటర్లకు వచ్చే జనాలు తగ్గారు. మీడియం రేంజ్ నుంచి టాప్ స్టార్స్ సినిమాలు థియేటర్లలో వచ్చాకే ఓటీటీకి వెళ్లాలి. అది ఎన్ని వారాలకు? అనేది నిర్మాతలందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య వచ్చిన ‘మేజర్, విక్రమ్’ సినిమాల కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు ఆదరించారు... మంచి కంటెంట్ ఉంటే హిట్ చేస్తారు. ► ఒక సినిమా ఫ్లాప్‌కు చాలా కారణాలుంటాయి. కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ఇబ్బందులవల్ల జనాల్లో డబ్బు ఖర్చు చేసే సత్తా కూడా తగ్గింది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం అనేది గతంలో నిర్మాత సమస్య. కానీ ఇప్పుడు సినిమాది. అందుకే అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ప్రతి సినిమాకీ డబ్బు పోతుందని తెలిస్తే బాధ ఉంటుంది. ఈ విషయం డైరెక్టర్లకీ, హీరోలకి కూడా అర్థమైంది. హిందీలో తీసిన ‘హిట్’ సినిమాకి మేం నష్టపోలేదు. కానీ, ‘జెర్సీ’ రీమేక్‌ని కరోనా పరిస్థితుల్లో రిలీజ్ చేయడం వల్ల 3–4 కోట్ల డ్యామేజ్‌తో బయటపడ్డాం. ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఓటీటీలో సూపర్‌హిట్ అయినా వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే ఆ వసూళ్లు, ఆ ఎనర్జీ వేరు. ప్యాషన్‌గా సినిమా తీయాలనుకున్నవారికి డబ్బులతో పాటు ఎనర్జీ కూడా ముఖ్యమే. హీరోలందరికీ ప్రస్తుత పరిస్థితు (నిర్మాణ వ్యయాన్ని ఉద్దేశించి) లను, సమస్యను చెబితే అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. -
20 ఏళ్ల ప్రయాణం.. ఇది మామూలు విషయం కాదు: దిల్ రాజు
‘‘జయం’(2002) సినిమాతో మొదలైన నితిన్ ప్రయాణం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఇంత పోటీలో కూడా నితిన్ సక్సెస్ ఫుల్‌గా ఉండటం గొప్ప విషయం. ‘మాచర్ల నియోజకవర్గం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్, కృతీశెట్టి, కేథరీన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ’ పాట లిరికల్ వీడియోను ‘దిల్’ రాజు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను లిప్సిక ఆలపించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పాట రిలీజ్ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ– ‘‘నా అభిమానుల కోసం ఈ చిత్రంలో హెవీ డ్యాన్స్ నంబర్స్ పెట్టాం. ‘రా రా రెడ్డి..’ పాటలో నా ‘జయం’ చిత్రంలోని ‘రాను రాను అంటూనే..’ పాటను రిపీట్ చేయడం ప్రత్యేకంగా అనిపించింది. అంజలి కాలికి గాయమైనప్పటిMీ ఫ్లోర్ మూమెంట్స్‌ని హార్డ్‌వర్క్‌తో కంప్లీట్ చేశారు’’ అన్నారు. ‘‘మాచర్ల నియోజకవర్గం’ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. -
వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు
Naga Chaitanya Raashi Khanna Thank You Movie Postponed: అక్కినేని నాగ చైతన్య తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపాడు. చై హీరోగా నటించిన తాజా చిత్రం 'థ్యాంక్యూ'. ఈ మూవీ రిలీజ్లో చిన్న మార్పు జరిగింది. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్లో చిన్న మార్పు చేశారు. ఈ సినిమాను జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ప్రకటించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే అవికా గోర్ మరో కీలక పాత్ర పోషించింది. ''మా టీజర్ సినిమాపై ఆసక్తి పెంచగా, 'మారో..', 'ఎంటో ఏంటేంటో..' పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. చైతన్య కెరీర్లో స్పెషల్ మూవీగా నిలుస్తుంది.'' అని చిత్రబృందం పేర్కొంది. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? #ThankYouTheMovie is now hitting the screens on July 22nd! It will be worth the wait...We promise! #ThankYou for understanding ♥️ @chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/xAyBsIbMxJ — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 #ThankYouTheMovie in Theatres on July 22nd😍https://t.co/ABhrv9Ndap#ThankYouOnJuly22nd@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/RlPP5acpJU — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 -
ఎఫ్ 3లో పవన్ కల్యాణ్?, దిల్ రాజు క్లారిటీ
Dil Raju Clarifies On Pawan Kalyan In F3 Movie: విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా రేపు(మే 27న) థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలంతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఎఫ్ 3కి సంబంధించిన ఓ ఆసక్తిర అప్డేట్పై ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సింగర్ దారుణ హత్య, ప్రాణాలు తీసే ముందు 10 నిద్ర మాత్రలు.. అయితే తాజాగా దీనిపై చిత్ర నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఎఫ్ 3 ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయన ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని తెలిపాడు. సినీ అభిమానులకు ఇదొక బిగ్ సర్ప్రైజ్ అని చెప్పారు. పవన్ కల్యాణ్‌తో పాటు టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా స్క్రీన్‌పై కనిపిస్తారంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. అనంతరం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే స్క్రీన్‌పై పవన్ కల్యాణ్ ఏ విధంగా కనిపించబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో దీనిపై సస్పెన్స్ నెలకొంది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్! -
కన్నడ సినిమాకు ఇంత బడ్జెట్ పెడుతున్నారు.. పిచ్చా అనుకున్నా: దిల్ రాజు
‘‘కేజీఎఫ్’ తొలి భాగం రిలీజ్ అయ్యేవరకు నాలాంటి వాళ్లకు కూడా ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్ అయ్యాక మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేసినందుకు ఆ టీమ్‌కి హ్యాట్సాఫ్. ఇప్పుడు ‘కేజీఎఫ్ 2’తో చరిత్ర సృష్టించబోతున్నారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలనచిత్రంపై సాయి కొర్రపాటి రిలీజ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడారు. ‘‘కన్నడ ఇండస్ట్రీ గురించి చెబితే చిన్న సినిమాలు తీస్తారు, ఐదు కోట్ల బడ్జెట్‌తోనే తీస్తారనుకునేవాళ్లం. యశ్‌తో ప్రశాంత్ ‘కేజీఎఫ్’ సినిమా మొదలు పెట్టినప్పుడు బడ్జెట్ చూసి కొందరు ఆశ్చర్యపోయారు.. మరికొందరు కర్నాటకలోని రెవెన్యూకి మించి ఖర్చు పెడుతున్నాడు.. పిచ్చా వీడికి అనుకున్నారు. ఈ మధ్య వచ్చిన ‘పుష్ప, ఆర్ఆర్ఆర్’ సినిమాలు వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేసినట్లు ‘కేజీఎఫ్ 2’ కూడా చరిత్ర క్రియేట్ చేస్తుంది. ఇండియన్ ఫిల్మ్ గర్వపడే రేంజ్‌కి ఎదిగినందుకు ప్రశాంత్‌కి, యశ్‌కి, విజయ్‌కి అభినందనలు’’ అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో ‘కేజీఎఫ్’ చాలా పెద్ద ప్రయాణం. ప్రతి సినిమాను ఆదరించే తెలుగు ఆడియన్స్ అంటే నాకు చాలా గౌరవం. ప్రశాంత్ నీల్ ప్రపంచం, ఆలోచనలు, కలల ప్రతిరూపమే ‘కేజీఎఫ్’ సినిమాలు. విజయ్‌గారు విజనరీ ఉన్న ప్రొడ్యూసర్. ‘కేజీఎఫ్’ రిలీజ్ చేసేందుకు సాయి కొర్రపాటిగారు చాలా ఎఫర్ట్ పెట్టారు. ‘బాహుబలి’ లాంటి సినిమాతో అన్ని ఇండస్ట్రీల వారికి నమ్మకాన్ని ఇచ్చిన రాజమౌళి, శోభు యార్లగడ్డ, ప్రభాస్గార్లకు థ్యాంక్స్. తెలుగు డైలాగులు, డబ్బింగ్, పాటల విషయంలో కన్నడ కంటే పదిరెట్లు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాం. రామారావుగారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు.. ఆయన పనే మాట్లాడుతుంది. ‘కేజీఎఫ్ 2’ తల్లీ–కొడుకు. కుటుంబంతో కలిసి చూసి, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా తీసినందుకు కర్నాటక చాలా గర్వపడుతుంది. కానీ ఇది ఇండియన్ సినిమా. తెలుగువారు ఎక్కడున్నా మా సినిమాని బాగా ఆదరిస్తారని ఓవర్సీస్లో వస్తున్న బుకింగ్స్ చూస్తుంటే అర్థమవుతోంది. మా సినిమా మీ నమ్మకాన్ని, అంచనాలను అందుకుంటుంది’’ అన్నారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తనయుడు, హోంబలే ఫిలింస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామారావు మాట్లాడుతూ–‘‘కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలని చెప్పే విజయ్ కిరగందూర్ ఏకంగా పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు’’ అన్నారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ– ‘‘కైకాల సత్యనారాయణగారి సమర్పణలో ‘కేజీఎఫ్ 2’ చేశాం. ఆ లెజెండరీ పేరుకు తగ్గట్టు సినిమా తీశామనే నమ్మకం ఉంది. సాయిగారిలాంటి వాళ్లు అరుదుగా ఉంటారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా గురించి చెప్పాల్సి వస్తే మొదట రాజమౌళి సార్ గురించి మాట్లాడాలి. యశ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు’’ అన్నారు. ఈ సమావేశంలో కెమెరామేన్ భువన్, డైలాగ్ రైటర్ హనుమాన్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
జెర్సీ ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
Shahid Kapoor Jersey Movie Makers Clarity On OTT Release: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం ‘జెర్సీ’.నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో షాహిద్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన ఈ చిత్రం విడుదల తేదీని డిసెంబర్ 31, 2021కి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక మూవీ విడుదల మరోసారి వాయిదా పడుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. జెర్సీని దిల్ రాజు నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు తెలిసింది. డిసెంబర్ 31 నుంచి కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లో విడుదల చేయడం కంటే ఓటీటీ రిలీజ్ చేయడం బెటర్ ఆయన అభిప్రాయడుతున్నాడని, ఇందుకోసం ఇప్పటికే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో దిల్ రాజు చర్చలు జరపగా మంచి ఫ్యాన్సీ రేటుకు ఒప్పందం కూడా కుదిరినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు షాహిద్ నిరాకరించాడని, కావాలంటే తన పారితోషికంలో 31 కోట్ల రూపాయలను తగ్గించుకుంటానని నిర్మాత దిల్ రాజుకు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో షాహిద్, దిల్ రాజు మధ్య విభేదాలు కూడా తలెత్తినట్లు ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై మేకర్స్ స్పందించారు. జెర్సీ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. తాజా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో మూవీని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అంతేగాక మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్తో పాటు విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, అప్పటి వరకు అందరూ సేఫ్‌గా ఉండాలంటూ మేకర్స్ ప్రకటన ఇచ్చారు. -
అభిమానులు అర్థం చేసుకోవాలి.. సినిమాల వాయిదాపై దిల్ రాజు
Producer Dill Raju Reaction On Movies Postponed: వచ్చే సంక్రాంతి పండగ రిలీజ్ రేసులో ఎన్టీఆర్-రామ్‌చరణ్‌ల ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్), ప్రభాస్ ‘రాధేశ్యామ్’, పవన్ కల్యాణ్-రానాల ‘భీమ్లా నాయక్’ చిత్రాలు ఉన్నాయి. అయితే ‘యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Active Telugu Producers Guild)’ అభ్యర్థన మేరకు సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకుంది. ఈ విషయం గురించి యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున నిర్మాతలు ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య స్పందించారు. ‘‘సంక్రాంతి రేసులో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలు నిలిచాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియన్ సినిమాలు. ఈ రెండు సినిమాలు దాదాపు మూడేళ్లుగా వర్క్స్ జరుపుకుంటూనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయన్న కారణంగానే జనవరి 7న విడుదల కావాల్సిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం ఫిబ్రవరికి వాయిదా పడింది. అలాగే ఒకేసారి మూడు పెద్ద సినిమాలు విడుదలైతే స్క్రీన్స్ షేరింగ్ విషయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. ఈ పరిస్థితిలోనే సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకోవాల్సిందిగా ఈ చిత్రనిర్మాత రాధాకృష్ణ, హీరో పవన్‌ను కోరితే, వారు సానుకూలంగా స్పందించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న విడుదలవుతుంది. అలాగే ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ (వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలు) సినిమాకు నిర్మాతను నేనే. ‘ఎఫ్ 3’ని ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నాం. తమ అభిమాన హీరోలను వీలైనంత త్వరగా థియేటర్స్‌లో చూసుకోవాలని ఫ్యాన్స్‌కు ఉంటుంది. అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నాం. ఈ విషయాన్ని అందరి హీరోల అభిమానులు అర్థం చేసుకోవాలి’’ అని దిల్ రాజు పేర్కొన్నారు. ‘‘భీమ్లా నాయక్’ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నందుకు నిర్మాత చినబాబు, త్రివిక్రమ్, పవన్‌లకు థ్యాంక్స్’’ తెలిపారు నిర్మాత డీవీవీ దానయ్య. ఈ సమావేశంలో నిర్మాతలు దామోదర ప్రసాద్, స్రవంతి రవికిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ఆర్’ జనవరి 7న, ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
‘రౌడీబాయ్స్’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ సందడి
-
మేమిద్దరం ఇండస్ట్రీకి రావాలని కలలు కనేవాళ్లం: విజయ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా నటించిన చిత్రం ‘రౌడీబాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, ఫస్ట్సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. ‘ప్రేమ ఆకాశమైతే...’ అంటూ సాగే ఈ పాటే యంగ్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. శ్రీమణి రాసిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చగా జస్ప్రీత్ జస్జ్ ఆలపించారు. చదవండి: ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్ సాంగ్, ఈసారి క్లాసికల్ టచ్‌తో..! ఈ పాట విడుదల అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ‘‘హర్ష, నేను ఇండస్ట్రీలోకి రావాలని కలలు కనేవాళ్ళం. హర్షకు కాలేజ్ మీటర్ బాగా తెలుసు. హర్ష దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘హుషారు’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నా. ఇక తొలి సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను ఆశిష్ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ‘పెళ్ళి చూపులు’ స్ట్రాంగ్‌గా గుర్తుండిపోయింది. ఆశిష్‌లో నాకో సిన్సియారిటీ కనిపిస్తుంది. ‘రౌడీ బాయ్స్’ స్టార్ట్ కావడానికి ముందు ఓసారి నన్ను కలిశాడు. అతనిలో నటన పట్ల ఆసక్తి, తపన కనిపించాయి. ఆశిష్... మీ నాన్న (శిరీష్), బాబాయ్ (‘దిల్’ రాజు) చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. నువ్వు.. వారు గర్వపడేలా చేస్తావని ఆశిస్తున్నాను’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ప్రభాస్ బర్త్‌డే: రాధే శ్యామ్ నుంచి రానున్న బిగ్ సర్ప్రైజ్ -
పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయకండి: దిల్ రాజు
సాక్షి, మచిలీపట్నం: సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు బుధవారం మచిలీపట్నంలో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మంత్రితో పాటు నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. కరోనా కాలంలో సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో మంత్రికి వివరించామని తెలిపారు. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దృష్టికి గతంలోనే తీసుకెళ్లామని చెప్పారు. చదవండి: పవన్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి అన్నారు: పేర్ని నాని ‘గతంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళితో కలిసి సీఎం జగన్‌ను కలిశాం. మా విజ్ఙప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినిమా అనేది చాలా సున్నితమని, ఏ సమస్య వచ్చినా ఆ ప్రభావం నిర్మాతలపైనే పడుతుంది. అందుకే చిత్ర పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయొద్దని మీడియాను కోరుతున్నా. టికెట్లు ఆన్లైన్ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుంది’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. చదవండి: Tollywood Producers Meet: సినీ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చొరవ అలాగే నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. రాజకీయం వేరు.. సినిమా పరిశ్రమ వేరని స్పష్టం చేశారు. ఎవరో ఏదో మాట్లాడితే.. తమకు సంబంధం లేదని ప్రకటించారు. థియేటర్లో 100 శాతం ఆక్యూపెన్సీ పెరగాలనేదే తమ ఉద్దేశమని, టికెట్లను ఆన్లైన్ చేయమని అడిగింది తామేనని గుర్తుచేశారు. -
‘రౌడీ బాయ్స్’ మూవీ టైటిల్ సాంగ్ విడుదల
‘‘ప్రేమదేశం, హ్యాపీ డేస్’ చిత్రాలు యువతను షేక్ చేశాయి. ఆశిష్‌తో మేం సినిమా అనుకున్నప్పుడు అలాంటి ఔట్ అండ్ ఔట్ కాలేజ్ యూత్ స్టోరీ కావాలని శ్రీహర్షను అడిగాను. తన కాలే జ్ లైఫ్‌లో జరిగిన çఘటనలతో కథ రాసుకుని, ‘రౌడీ బాయ్స్’ తీశాడు’’ అన్నారు ‘దిల్’ రాజు. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి ఆశిష్ రెడ్డి (శిరీష్ తనయుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విక్రమ్ మరో హీరో. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో కలసి ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘రౌడీ బాయ్స్’ టైటిల్ సాంగ్‌ను వైజాగ్‌లో విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నాలుగేళ్ల జర్నీ ఈ చిత్రం. రెండు కాలేజీల మధ్య జరుగుతుంది. రౌడీ బాయ్స్ గుడ్ బాయ్స్ ఎలా అయ్యారనేదే కథ. దసరాకు సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. శ్రీహర్ష, ఆశిష్, విక్రమ్, ‘ఆదిత్య’ నిరంజన్, రోల్ రైడా పాల్గొన్నారు. -
ఆలియా.. జాన్వీ... ఫైనల్‌గా ఎవరో?
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ప్యాన్ ఇండియా మూవీని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ఇప్పటికే పూజా హెగ్డే, రష్మికా మందన్నా, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా జాన్వీ కపూర్, ఆలియా భట్ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీని దక్షిణాది తెరకు పరిచయం చేయడానికి చాలామంది దర్శక–నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే రాజమౌళి ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలో రామ్‌చరణ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఆలియా భట్‌ను హీరోయిన్గా ఫిక్స్ చేసి ‘ఆర్ఆర్ఆర్’ జోడీని దర్శకుడు శంకర్ రిపీట్ చేస్తారా? లేక జాన్వీని కన్ఫార్మ్ చేసి, కొత్త జోడీని వెండితెరపై చూపిస్తారా? ఆలియా, జాన్వీ కాకుండా మరో హీరోయిన్ని ఎంపిక చేస్తారా? అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు. -
కరోనా కలకలం: దిల్ రాజు ఎంత పనిచేశావ్..
హిందీలో లాగానే తెలుగు చిత్రసీమలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల నిర్మాత అల్లు అరవింద్, రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు త్రివ్రికమ్, హీరోయిన్ నివేదా థామస్‌లు కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకులు గుణశేఖర్, వి.ఎన్ .ఆదిత్య పేర్లు చేరాయి. ‘దిల్’ రాజుకు కరోనా లక్షణాలు లేవు. కానీ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. ‘శాకుంతలం’ దర్శకుడు గుణశేఖర్‌కు సైతం కరోనా పాజిటివ్ అని సోమవారం పొద్దు పోయాక తెలిసింది. గతవారం ఓ స్టూడియోలో పవన్‌కల్యాణ్ – హరీశ్ శంకర్ కొత్త చిత్రం ఫోటోషూట్ జరుగుతుంటే, అక్కడకు వెళ్ళి పవన్‌కల్యాణ్‌ను రాజు కలిశారు. ఆ పక్కనే స్వీయ సమర్పణలో షూటింగ్ జరుగుతున్న ‘శాకుంతలం’ సెట్స్‌కు కూడా వెళ్ళి వచ్చారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే పవన్ కల్యాణ్ హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళారు. ఆలస్యంగా పాజిటివ్ అయిన గుణశేఖర్ కూడా క్వారంటైన్ బాట పట్టారు. దాంతో, ‘శాకుంతలం’ షూటింగ్ కొన్నాళ్ళు ఆగనుంది. మరోపక్క ఈ నెల 23న రిలీజు కావాల్సిన నాని ‘టక్ జగదీశ్’ సైతం తెలుగు నేలపై కరోనా కలకలంతో వాయిదా పడింది. -
వకీల్‌సాబ్ ట్రైలర్ లాంఛ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ
విశాఖపట్నం : పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ సినిమా ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజ్, శిరీశ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దీంతో థియేటర్లో ట్రైలర్‌ను చూసేందుకు పవన్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు తోసుకుంటూ, అద్దాలు పగలకొట్టి మరీ లోపలికి చొచ్చుకెళ్లారు. దీంతో పలువురు పవన్ అబిమానులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Andhra Pradesh: Ruckus erupted at a theatre in Visakhapatnam during the release of the trailer of actor & Jan Sena chief Pawan Kalyan's movie, yesterday pic.twitter.com/MjNrpxto1d — ANI (@ANI) March 30, 2021 చదవండి : మీరు వర్జినా?: వకీల్ సాబ్ ట్రైలర్ ‘వకీల్ సాబ్’ హవా.. అంబరాన్నంటిన టికెట్ల ధరలు -
ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం : దిల్ రాజు
పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘సరిగ్గా చెప్పండి.. ఏం చెప్పారు.. ఏం చేశారు’, ‘అలా జరగద్దు.. జరగకూడదు’ అనే డైలాగ్స్‌తో టీజర్ సాగుతుంది. టీజర్ విడుదల సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్‌ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మనం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాం. వెయిటింగ్ పూర్తయింది. ట్రైలర్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే. ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం’’ అన్నారు. ‘‘ట్రైలర్ కంటే సినిమా ఇంకా బాగుంటుంది’’ అన్నారు వేణు శ్రీరామ్. హిందీ హిట్ ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ రూపొందిన విషయం తెలిసిందే. చదవండి: లవ్‌స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ పదహారువందల మందిని ప్రేమించా' -
మళ్లీ నిరూపించుకోవాలి!
‘‘సినిమా పరిశ్రమలో లాక్డౌన్ తర్వాత మార్పు వచ్చింది. మరో కొత్త అధ్యాయం మొదలైనట్లుంది. గత చిత్రాలతో సంబంధం లేకుండా మళ్లీ యాక్టర్స్‌గా నిరూపించుకోవాల్సి వస్తోంది’’ అని అన్నారు విశ్వక్ సేన్ . నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న సినిమా ‘పాగల్’. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కానుంది. నేడు విశ్వక్సేన్ బర్త్ డే. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేశాను. ‘పాగల్’ సినిమా కూడా ఓ కొత్త ప్రయత్నం. ప్రేమించేప్పుడు కొందరు పిచ్చోడిలా ఆలోచిస్తుంటారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ అలానే ఉంటుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. మా సినిమా టీజర్లో ఎంటర్టైన్ మెంట్ మాత్రమే చూపించాం... సినిమాలో ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవాళ్టితో ‘పాగల్’ సినిమా షూటింగ్ పూర్తయింది. నా బర్త్ డే రోజు కూడా షూటింగ్లో పాల్గొనడం హ్యాపీగా ఉంది. నరేష్ బాగా డైరెక్ట్ చేశారు. నేను చేస్తున్న ‘ప్రాజెక్ట్ గామీ’ సినిమా పూర్తయింది. నిర్మాతలు పీవీపీ, బీవీఎస్ఎన్ ప్రసాద్గార్లతో వర్క్ చేయబోతున్నాను. ఈ ఏడాది నావి మూడు సినిమాలు రిలీజవుతాయి’’ అని అన్నారు. -
పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి
‘‘దాసరి నారాయణరావుగారు, రాఘవేంద్రరావుగారు, కోడి రామకృష్ణగారు వంటి వారు పెద ్దసినిమాలతో పాటు చిన్న సినిమాలూ తీశారు. అందుకే వారు వంద సినిమాల మార్క్‌ను ఈజీగా దాటగలిగారు. పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి. పెద్ద డైరెక్టర్ యాడ్ అయితే చిన్న సినిమా పెద్ద సినిమా అవుతుంది. ‘గాలి సంపత్’ అలాంటి పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో అనీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాలి సంపత్’. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ, సమర్పణలో ఎస్. కృష్ణ, హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. అనిల్æరావిపూడి మాట్లాడుతూ – ‘‘గాలి సంపత్ (రాజేంద్రప్రసాద్ పాత్ర) గొంతుకు ప్రమాదం జరిగి, మాట బయటకు రాదు. గాలి మాత్రమే వస్తుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారిది చిలిపిగా మాట్లాడే ఫీ..ఫీ..ఫీ భాష’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు అనీష్. ‘‘చిన్న సినిమాగా మొదలైన ‘గాలిసంపత్’ అనిల్ రావిపూడి రాకతో పెద్ద సినిమాగా రిలీజ్ కాబోతోంది’’ అన్నారు సాహు గారపాటి, ఎస్. కృష్ణ. -
వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు'
అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాత ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాను మే 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంటర్టైనింగ్ కథను అందించారు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: శక్తికాంత్ కార్తీక్. -
‘పాగల్’ ఫస్ట్‌లుక్ విడుదల
‘హిట్’ సినిమా విజయంతో మంచి స్పీడు మీదున్న విష్వక్ సేన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘పాగల్’. పాగల్ అంటే పిచ్చి. మ్యూజికల్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కుతోంది. అంటే.. హీరోకి ప్రేమ పిచ్చి అని ఊహించవచ్చు. ఈ చిత్రానికి నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఏప్రిల్ 30న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్. -
తిరిగిచ్చే సమయం వచ్చింది
‘దిల్’ రాజు 50వ పుట్టినరోజు వేడుకకు పలువురు ప్రముఖ సినిమా తారలు కదిలి వచ్చారు. శుక్రవారం (డిసెంబర్ 18) ఆయన బర్త్‌డే. గురువారం ‘దిల్’ రాజు స్వగృహంలో జరిగిన వేడుకలో చిరంజీవి, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్, నాగచైతన్య, నితిన్, వరుణ్‌తేజ్, విజయ్ దేవరకొండ, సాయి శ్రీనివాస్, ప్రకాశ్‌రాజ్, కన్నడ స్టార్ యశ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ‘దిల్’ రాజు మీడియాతో మాట్లాడుతూ– ‘‘సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్లవుతోంది. ఈ పాతికేళ్లలో ఇండస్ట్రీ నాకెంతో పేరుతో పాటు డబ్బును కూడా ఇచ్చింది. ఇన్నేళ్ల కెరీర్లో జయాపజయాలు ఉన్నాయి. అన్నింటినీ దాటి ఇక్కడిదాకా వచ్చాను. ఈ ప్రయాణంలో నాకెంతోమంది సాయం చేసి, ఈ స్థాయిలో నిలబడటానికి కారణం అయ్యారు. ఇప్పుడు తిరిగిచ్చే సమయం వచ్చింది. ముఖ్యంగా సాయం కోరి రోజూ ఎంతోమంది వస్తుంటారు. అలా వచ్చేవారిలో ఎంతమంది నిజం చెబుతున్నారో మాకు తెలియదు. అందుకే ఒక కమిటీని ఏర్పాటు చేసి, వారికి కావాల్సిన విద్య, వైద్య సౌకర్యాలు సమకూర్చాలనుకుంటున్నా. దానికి మీడియా ప్రతినిధుల సాయం కూడా ఉంటే నిజంగా అవసరాల్లో ఉన్నవారికి సాయం అందుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. భార్య వైగా, కుమార్తె హన్షితలతో ‘దిల్’ రాజు శిరీష్, విజయ్, రామ్, రామ్‌చరణ్, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబు, ప్రభాస్, నాగచైతన్య -
దిల్ రాజుతో టాప్ హీరోలు.. ఫోటోలు వైరల్
దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు 50వ పుట్టిన రోజు నేడు(డిసెంబర్ 18). ఈ సందర్భంగా దిల్‌రాజ్‌కు సినీ ప్రముఖులను నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టిన రోజును పురస్కరించుకొని ముందు రోజు రాత్రి టాలీవుడ్ ప్రముఖులకు దిల్‌రాజు గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీస్‌తో పాటు తనకు పరిచయం ఉన్న స్టార్స్ అందరిని పిలిచాడు. అందులో కన్నడ సూపర్ స్టార్ యశ్‌తో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు దిల్ రాజు పార్టీకి వచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలాఉంటే దిల్‌రాజుతో మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాగచైతన్య, రామ్, విజయదేవరకొండ కలిసి ఫోటో దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్ర హీరోలందరిని ఒకే ఫ్రేమ్‌లో అభిమానులు ఫిదా అవుతున్నారు. అలాగే రామ్ చరణ్, ప్రభాస్ కూడా ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసి అటు ప్రభాస్.. ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరు హీరోలతో దిల్ రాజు హిట్ సినిమాలు నిర్మించాడు. ప్రభాస్‌తో చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ అయింది. దాంతో పాటు చరణ్‌తో నిర్మించిన ఎవడు కమర్షియల్ సక్సెస్ సాధించింది.వీరిద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా మారడంతో ఈ పిక్ కు మరింత క్రేజ్ వచ్చింది. -
ఇండస్ట్రీలోకి దిల్‌రాజు సతీమణి..!
కరోనా వైరస్ విజృంభణతో చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. తొమ్మిది నెలల విరామం అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నా.. ప్రేక్షకుడు మాత్రం ఆ వైపుకు కన్నెత్తికూడా చూడటంలేదు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ భయం దర్శక, నిర్మాతలను తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో నిర్మించబోయే సినిమాలను ఓటీటీని వేదికగా చేసుకుని విడుదల చేయాలనే ఆలోచనలో పడ్డారు. దీనికి అనుగుణంగానే కథలను సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త ఆలోచనలకు పదునుపెడుతూ.. ఓటీటీ దిశగా అడుగులు వేస్తున్నారు. (కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా) ఈ క్రమంలో టాలీవుడ్ బడా నిర్మాత దిల్‌రాజు సైతం ఓటీటీకి తగ్గకథల కోసం వెతుకులాట ఆరంభించారు. అయితే భర్త కోసం తన సతీమణి తేజస్వీని స్వయంగా ఓ కథను సిద్ధం చేశారని చిత్రపరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఆమె కొత్త కథలపై దృష్టిసారించారని, ఓటీటీకి అనుగుణంగా సృజనాత్మకతతో కూడిన ఓ కథను భర్తకు బహుమతిగా ఇచ్చారని సమాచారం. భార్య స్టోరీకి ఫిదా అయిన దిల్‌రాజు.. ఆ కథకు మరింత మెరుగులు దిద్దేందుకు ఆమెకు సహాయంగా ఓ రచనా బృందాన్ని ఏర్పాటు చేశాడని తెలిసింది. (దిల్‌రాజుకు షాకిచ్చిన వరుణ్, వెంకీ..!) ఓటీటీ విస్తరిస్తున్న నేపథ్యంలో భార్య రూపొందించిన కథాంశాన్ని తెరక్కించాలని నిర్ణయించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్లు కథ కార్యరూపం దాల్చితే తేజస్వీని సైతం చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దిల్‌రాజు ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్3 మూవీ నిర్మాణ బాధ్యతల్లో బిజిబిజీగా ఉన్నారు. కాగా దిల్’రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)ని గత మార్చిలో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. -
మూడు సినిమాలకు శ్రీకారం
‘క్రియేటివ్ మెంటార్స్ యానిమేష¯Œ అండ్ గేమింగ్ కాలేజీ’ మేనేజింగ్ డైరెక్టర్ కొవ్వూరి సురేష్ రెడ్డి మూడు కొత్త చిత్రాలను ప్రకటించారు. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన 30 ఏళ్ల లోపు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్‌రెడ్డి. ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ కూడా నిర్వహిస్తున్న సురేష్‌రెడ్డి ‘పి19 ఎంటర్టై¯Œ మెంట్’ సంస్థను స్థాపించి, శుక్రవారం మూడు చిత్రాలను ప్రకటించారు. ఈ మూడు చిత్రాల ప్రీ లుక్స్, లోగోలను ప్రసాద్స్ గ్రూప్ చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ –‘‘మా తొలి చిత్రానికి ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’, ‘పేపర్ బోయ్’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహిస్తారు. రెండో సినిమాని ‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’, ‘ఐతే 2.0’ ఫేమ్ రాజ్ మాదిరాజు డైరెక్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్ జామితో కలిసి నేను నిర్మిస్తాను. మూడో సినిమాకి దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తారు’’ అన్నారు. ఆర్థోపెడిక్స్ డాక్టర్ దశరథరామిరెడ్డి, నిర్మాతలు కె.ఎల్. దామోదర ప్రసాద్, రాజ్ కందుకూరి, జీ5 క్రియేటివ్ హెడ్ నిమ్మకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా
కొంత కాలంగా నిర్మాత ‘దిల్’ రాజు రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. తాజాగా జీవితంలో కొత్త ప్రయాణాన్ని (పెళ్లిని ఉద్దేశించి) ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు ‘దిల్’ రాజు. ఈ ప్రెస్ నోట్లో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ప్రపంచమంతా కష్టకాలంలో ఉంది. వృత్తిపరంగా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగానూ కొంతకాలంగా సరిగ్గా సాగడంలేదు. కానీ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి, అందరం బావుంటాం అనే ఆశతో ఉన్నాను. ఈ నమ్మకంతోనే నా జీవితంలో మరో ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాను’’. ఆదివారం నిజామాబాద్‌లోని ‘దిల్’ రాజు ఫార్మ్ హౌస్‌లో రాత్రి 11.30 గంటలకు అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ‘దిల్’ రాజు వివాహం చేసుకున్నది వాళ్ల బంధువుల అమ్మాయినే అని, సినిమా నేపథ్యం లేని కుటుంబం అని తెలిసింది. 2017లో ‘దిల్’ రాజు భార్య అనిత హార్ట్ ఎటాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే. -
కరోనా విరాళం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, సినిమా కార్మికుల కోసం ఇటీవలే ‘సీసీసీ మన కోసం’’ (కరోనా క్రైసిస్ చారిటి మనకోసం) ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. ఆదివారం విరాళం ప్రకటించిన వారి వివరాలు. ► రవితేజ (20 లక్షలు) ► వరుణ్ తేజ్ (20 లక్షలు) ► ‘దిల్’ రాజు, శిరీష్ (10 లక్షలు) ► శర్వానంద్ (15 లక్షలు) ► సాయిధరమ్ తేజ్ (10 లక్షలు) ► విశ్వక్ సేన్ (5 లక్షలు) ► ‘వెన్నెల’ కిశోర్ (2 లక్షలు) ► సంజయ్ (25 వేలు) -
పాగల్ ప్రారంభం
‘హిట్’ వంటి హిట్ చిత్రం తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పాగల్’. ఈ చిత్రం ద్వారా నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విశ్వక్సేన్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా హీరో రానా దగ్గుబాటి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ‘దిల్’ రాజు స్క్రిప్ట్‌ని సినిమా యూనిట్‌కు అందజేశారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘విశ్వక్‌తో ‘పాగల్’ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక క్రేజీ సబ్జెక్టుతో ఈ చిత్రం తీస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక షెడ్యూళ్లను ప్లాన్ చేస్తాం. నరేష్ లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నరేష్ చెప్పిన స్క్రిప్ట్ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో ‘పాగల్’ చిత్రాన్ని అంగీకరించా. సరికొత్త జానర్లో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు విశ్వక్సేన్. ‘‘టైటిల్‌ని బట్టి ఇది యాక్షన్ సినిమానా? అని అడుగుతున్నారు. లవ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. ఒక మంచి సినిమా చూశామనే తృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు నరేష్ కుప్పిలి. సంగీత దర్శకుడు రథన్, కెమెరామేన్ మణికంద¯Œ , ఎడిటర్ గ్యారీ, ప్రొడక్షన్ డిజైనర్ లతా తరుణ్ తదితరులు మాట్లాడారు. -
హిట్ ఇస్తున్నందుకు గర్వంగా ఉంది
‘‘అ’ సినిమాతో నాని నిర్మాతగా మారి నేర్చుకున్నాడు.. ఇప్పుడు ‘హిట్’ అంటున్నాడు. ఎంత నమ్మకం లేకుంటే ఆ పేరు పెడతాడు. చాలా సినిమాలు చేశాడు కదా.. కొన్ని ఆడతాయి, మరికొన్ని ఆడవు. ఆడని వాటిలోని తప్పులు.. ఆడిన వాటిలోని బెస్ట్‌లు తీసుకుని ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ‘హిట్’ అని పేరు పెట్టే్టశాడు. మొత్తంగా ఓ డాక్టర్ని(శైలేశ్) డైరెక్టర్ చేశాడు నాని’’ అని డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు అన్నారు. ‘ఫలక్‌నుమాదాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా, రుహానీ శర్మ హీరోయిన్గా నటించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ఉపశీర్షిక. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘హిట్’ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి.. యూనిట్ ప్రమోషన్ ఐడియాలు కూడా కొత్తగా ఉన్నాయి. సినిమా మంచి హిట్ అవ్వాలి. ఉపశీర్షికలో ఫస్ట్ కేస్ అని పెట్టారు.. రెండో కేస్, మూడో కేస్ అంటూ దీనికి మరిన్ని ఫ్రాంచైజీలు రావాలి. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. అనుష్క మాట్లాడుతూ– ‘‘ఈరోజు నేను ఇక్కడికి అతిథిగా రాలేదు. నాని, ప్రశాంతి నా కుటుంబసభ్యులే. ‘అ’ చాలా మంచి సినిమా. రెండో సినిమా చాలా మంచి కథతో వస్తారనుకుని వేచి చూశా. ‘హిట్’ ట్రైలర్స్, పాటలు బాగున్నాయి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘హిట్’ సినిమా పెద్ద విజయం సాధించాలి. నాని హీరో అయినప్పటికీ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నాడు.. అలాంటి నాని బ్యానర్‌కి సక్సెస్ కావాలి’’ అన్నారు. నాని మాట్లాడుతూ–‘‘హిట్’ సినిమాని తొలుత నేనే చేద్దామనుకున్నా.. విశ్వక్ అయితే బాగుంటుందనిపించింది. శైలేష్ చెప్పిన కథల్లో ‘హిట్’ వెంటనే తీయాలనిపించింది. డాక్టర్ ఉద్యోగం వదలొద్దని తొలుత చెప్పేవాణ్ణి.. ఈ రోజు చెబుతున్నా ఉద్యోగం వదిలేయ్.. పర్లేదు. ‘ఫలక్‌నుమాదాస్’లో విశ్వక్ ఆ పాత్రకు సరిపోయాడు.. ‘హిట్’ సినిమా చూశాక ఏ పాత్ర అయినా ఇరగదీస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు.. ఒక్కరు విశ్వక్ సేన్.. మరొకరు సంగీత దర్శకుడు వివేక్ సాగర్. ‘అ’ సినిమా బాగున్నా డబ్బులు రాలేదేమో? అని కొందరు రాస్తుంటారు.. నిర్మాతగా నేను చెబుతున్నా. ఆ సినిమా పక్కా కమర్షియల్ హిట్. ఈ నెల 28న ప్రేక్షకులకు ‘హిట్’ రూపంలో ఓ క్వాలిటీ, మంచి సినిమా ఇస్తున్నాం.. ఇందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రుహాని శర్మ మంచి నటి. ప్రశాంతిగారు సో స్వీట్. ఒకేసారి రెండు సినిమాలు చేయొద్దు.. ఒక్కొక్కటి చేస్తే ప్రశాంతంగా ఉంటుందని నాని అన్న సలహా ఇచ్చాడు.. అది ఎంతో ఉపయోగపడింది. శైలేష్గారు శాస్త్రవేత్తలాంటివాడు.. తెలివైనవాడు. ‘హిట్’ సినిమాకి నీళ్లు ఎక్కువ తాగి రాకండి.. వాష్‌రూమ్ వెళ్లే టైమ్ కూడా ఉండదు. ఇలాంటి థ్రిల్లర్ సినిమా తెలుగులో నేను చూడలేదు’’ అన్నారు. శైలేశ్ కొలను మాట్లాడుతూ– ‘‘2017లో నానీ అన్నకి కథ చెప్పా.. విన్నాక ‘నువ్వే ఎందుకు దర్శకత్వం చేయకూడదు?’ అన్నారు. ఆ తర్వాత సిడ్నీ వెళ్లిపోయి డైరెక్షన్ నేర్చుకుని వచ్చి ఈ సినిమా తీశా. నన్ను దర్శకునిగా పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్స్ అన్న. ప్రశాంతి మేడమ్‌కి థ్యాంక్స్. విక్రమ్ రుద్రరాజు అని నేను రాసుకున్న పాత్రకి రెట్టింపు నటన ఇచ్చిన విశ్వక్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ చిత్రం బాగా రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకి థ్యాంక్స్’’ అన్నారు రుహాని శర్మ. ఈ వేడుకలో నిర్మాత ప్రశాంతి, డైరెక్టర్ నందినీ రెడ్డి, హీరోలు రానా, నవదీప్, సందీప్ కిషన్, ‘అల్లరి’ నరేశ్, సునీల్, కార్తికేయ, నటి మంచు లక్ష్మి, నటులు భానుచందర్, రాహుల్ రామకృష్ణ, రవివర్మ, నిర్మాతలు రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకులు కీరవాణి, వివేక్ సాగర్, కాలభైరవ, కెమెరామేన్ మణికంద¯Œ , ఎడిటర్ గ్యారీ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు. -
క్లైమ్యాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను
‘‘సరిలేరు నీకెవ్వరు, ‘అల.. వైకుంఠపురములో, జాను’ చిత్రాలతో ఈ ఏడాది అప్పుడే ‘దిల్’ రాజుగారు హ్యాట్రిక్ కొట్టారు. ‘జాను’ అందమైన ప్రేమకథ. క్లైమ్యాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను చూసిన ‘గీతాంజలి’, నేను డైరెక్ట్ చేసిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాల క్లైమ్యాక్స్ తర్వాత ‘జాను’ చిత్రం అంతలా కదిలించింది’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తొలి రోజు నుంచి ఇటు ఇండస్ట్రీ నుండి అటు మీడియా, సోషల్ మీడియా, ప్రేక్షకుల నుండి మా ‘జాను’కి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేమ్, ఇతర సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. శర్వానంద్, సమంత కళ్లతోనే నటించారు. మా బ్యానర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెబుతున్నారు. జనరల్‌గా సినిమాలు తీసేటప్పుడు లెక్కలు వేసుకుంటాను.. కానీ ‘జాను’కి లెక్కలు వేసుకోలేదు. ఇలాంటి సినిమాను ప్రోత్సహిస్తేనే మరిన్ని మంచి సినిమాలు చేయగలం’’ అన్నారు. ‘‘సినిమాని చూసిన వారందరూ చాలా పాజిటివ్‌గా స్పందించారు’’ అన్నారు సమంత. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘జాను’. హిట్స్ కొడుతున్నా కానీ... నటుడిగా ఏదో మిస్ అయ్యాననే భావన మనసులో ఉండిపోయింది.. అది ‘జాను’తో తీరింది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను’’ అన్నారు. దర్శకులు బి.వి.ఎస్. రవి, నందినీ రెడ్డి, పాటల రచయిత శ్రీమణి, రచయిత ‘మిర్చి’ కిరణ్ మాట్లాడారు. -
అదే మాకు పెద్ద సక్సెస్
‘‘ఒక నటుడిగా నేను బాగానే చేస్తున్నానంటున్నారు కానీ రావాల్సిన పేరు ఇంకా మనకు రాలేదా? అనే ఒక చిన్న వెలితి ఉండేది. ‘జాను’ చిత్రం యాక్టర్‌గా నన్ను మెరుగుపరిచింది. నా కెరీర్లోనే ఎప్పుడూ రానన్ని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విజయం యాక్టర్‌గా నా ఆకలిని కొంచెం తీర్చింది’’ అన్నారు శర్వానంద్. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళంలో హిట్ సాధించిన ‘96’ చిత్రానికి ఇది రీమేక్. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమా వేశంలో శర్వానంద్ చెప్పిన విశేషాలు. ► ‘96’ చూసి క్లాసిక్ మూవీ, తెలుగు రీమేక్ అవసరమా? అనిపించింది. ‘శతమానం భవతి’(2017) సినిమా సమయంలో కూడా ‘కథ బాగుంది కాకపోతే నా పాత్ర అంతగా ఉన్నట్లు లేదు’ అనే సందేహం వచ్చినప్పుడు.. ఈ సినిమాతో ఫ్యామిలీకి దగ్గరవుతావు’ అన్న ‘దిల్’ రాజుగారి జడ్జ్మెంట్ నిజమైంది. ‘జాను వర్కౌట్ అవుతుంది’ అని అన్నారాయన. ఆ నమ్మకంతోనే నటించాలనుకున్నాను. ‘దిల్’ రాజుగారు నిర్మాత కాకపోతే గ్యారంటీగా ‘జాను’ చిత్రం చేసేవాడిని కాను. ► ఒక రోజు రాత్రి జరిగే కథ. ఓ నలభై రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందిలే అనుకున్నా. కానీ రామచంద్ర క్యారెక్టర్ కళ్లతోనే ఎక్కువగా మాట్లాడాలి. ఇరవై రోజులు కెన్యాలో షూట్ చేశాం. మాల్దీవుల్లో చేశాం. ఓ సీన్లో గాయపడ్డాను. మరోవైపు కో–స్టార్‌గా సమంత. రిలీజ్ తర్వాత మా ఇద్దరి యాక్టింగ్‌కు పోలికలు పెట్టి ట్రోల్ చేస్తారేమోనన్న భయం. కానీ నా కెరీర్లోనే నేను బాగా కష్టపడ్డ సినిమా ‘జాను’. సమంత కాకుండా వేరే ఎవరైనా ‘జాను’ పాత్ర చేసినా నా నుంచి అంత నటన వచ్చి ఉండేది కాదేమోనని ఒక యాక్టర్‌గా నేను అనుకుంటున్నాను. ‘96’లో చేసిన విజయ్‌సేతుపతి, త్రిషలను మర్చిపోయి ‘జాను’లో శర్వా, సమంతలను చూస్తున్నాం అంటున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్. ► వ్యక్తిగా, నటుడిగా సమంత నుంచి చాలా నేర్చుకున్నాను. ‘నేనొక సూపర్‌స్టార్.. నేను అక్కినేని ఫ్యామిలీ’ అనే గర్వం తనలో లేదు. నేనొక షాట్ పూర్తి చేసి వెళ్లి కూర్చొంటే... సమంత మాత్రం మానిటర్ దగ్గరకు వెళ్లి చెక్ చేసుకునేది. ఇప్పుడు ఆ ఫార్ములాను నా సెట్లో నేను వాడుతున్నాను. రిలీజ్ తర్వాత మేం ఫోన్లో మాట్లాడుకున్నాం. ‘సైలెంట్‌గా ఉంటావ్ కానీ బాగానే మార్కులు కొట్టేశావ్.. నువ్వు దొంగవి’ అంది సమంత. ► ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ ఉంటుంది. నాకు కూడా ఉంది కాబట్టే రామచంద్ర పాత్రలో బాగా నటించానేమో (నవ్వుతూ). ఫస్ట్ లవ్‌ను పెళ్లి చేసుకునేవారు చాలా తక్కువ. 100లో 5 పర్సెంట్ ఉంటారేమో. ► నా కెరీర్లో ‘గమ్యం, ప్రస్థానం’ వంటి మంచి హిట్స్ ఉన్నాయి. కానీ ‘జాను’ లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. నా కెరీర్లో ‘జాను’ గుర్తుండిపోయే సినిమా. ► తక్కువ రోజుల్లోనే షూట్‌ను కంప్లీట్ చేద్దామనే అక్షయ్‌కుమార్ ఫార్ములాను ఫాలో అవుదామని ఫిక్స్ అయ్యాను. 3 సినిమాలు అయిపోవాలి.. 3 సెట్స్‌పై ఉండాలి. ‘శ్రీకారం’లో రైతు పాత్ర చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న విడుదల చేస్తున్నాం. -
యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్
‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంతో హరి కొలగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సాయి లక్ష్మీ క్రియేష¯Œ ్స పతాకంపై పి.యస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. తొలి సన్నివేశానికి నిర్మాత బి.వి.యస్. ఎన్. ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) మాట్లాడుతూ–‘‘డిస్ట్రిబ్యూటర్‌గా తెలుగు సినిమా పరిశ్రమతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను నిర్మాతగా మారడంలో బెక్కం వేణుగోపాల్ ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అన్నారు. ‘‘శబ్దాలయా, అన్నపూర్ణ సంస్థలలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేశాను. యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమై ఇరవై రోజుల పాటు హైదరాబాద్‌లో జరుగుతుంది’’ అన్నారు హరి కొలగాని. ‘‘ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను’’ అన్నారు సాయి ధన్సిక. ఈ చిత్రానికి సమర్పణ: వాగేశ్వరి (పద్మ), కెమెరా: వాస్లి శ్యాం ప్రసాద్, సంగీతం: శేఖర్ చంద్ర, సహ నిర్మాతలు: పవన్, సుమన్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట యస్‌కె కులపాక. -
పేరు కోసమే కష్టపడ్డాను
‘‘నా కెరీర్ ప్రారంభం నుంచి కూడా నేను పేరుకోసమే పని చేశాను. ఒక సినిమా చేయాలా? వద్దా? అనే నా నిర్ణయాన్ని డబ్బు ప్రభావితం చేయలేదు. కొత్త సినిమాని ఒప్పుకునేముందు ఆ సినిమా వల్ల నాకు ఎంత పేరు వస్తుందని మాత్రమే ఆలోచించుకుని నా వంతు కష్టపడ్డాను. డబ్బు ఆటోమేటిక్‌గా వచ్చేసింది(నవ్వుతూ)’’ అని సమంత అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళంలో హిట్ సాధించిన ‘96’ చిత్రానికి ‘జాను’ తెలుగు రీమేక్. ‘96’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్‌కుమారే ‘జాను’ సినిమాని డైరెక్ట్ చేశారు. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు(శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత చెప్పిన విశేషాలు... ► ‘జాను’ ఇద్దరు వ్యక్తుల కథ. నాకైతే చాలా పెద్ద సినిమా చేశాననిపించింది. ఎక్కువ రిస్క్ అనిపించింది. నా 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను. ‘96’ సినిమా బాగా నచ్చింది. ఆ చిత్రంలో విజయ్ సేతుపతి బాగా చేశారన్నారు. నాకైతే ‘96’ త్రిషగారి సినిమా అనిపించింది. ఈ సినిమా రీమేక్‌లో నటించకూడదని తొలుత అనుకున్నాను. ‘దిల్’రాజుగారు అడగడంతో కాదనలేకపోయాను. కానీ ‘జాను’ సినిమా చేయకపోతే నా కెరీర్లో ఒక మంచి సినిమా కోల్పోయేదాన్ని.. పశ్చాత్తాపం చెందాల్సి వచ్చేది. ► త్రిషగారి నటనను కాపీ చేయలేదు. సినిమాలోని పాత్రని అర్థం చేసుకుని నా శైలిలో విభిన్నంగా నటించాను. అది స్క్రీన్‌పై ఎంత వర్కవుట్ అయ్యిందన్నది ప్రేక్షకులు చెబుతారు. నేను చాలా కష్టపడ్డాను. స్క్రిప్ట్‌ను చాలాసార్లు చదివాను. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాను. ‘96’లాంటి సినిమాలను రీమేక్ చేయడం కష్టం. కానీ ప్రేమ్‌కుమారే తెరకెక్కించడంతో ఆ మ్యాజిక్‌ను రీ–క్రియేట్ చేశారనిపించింది. ► స్క్రిప్ట్ ప్రకారం నా నటన బట్టే శర్వాగారి నటన ఉంటుంది. అందుకే ఒకరికొకరు సహాయం చేసుకుని బెస్ట్ ఔట్పుట్ రావడం కోసం కష్టపడ్డాం.. శర్వా బాగా నటించారు. క్లైమాక్స్ మార్చడం కోసం షూటింగ్‌ను ఆపేశామనే వార్తల్లో నిజం లేదు. శర్వాగారికి ఆరోగ్యం సహకరించనప్పుడు కొంత షూట్ ఆపాం. ఆ తర్వాత మొదలైన ఒక్క షెడ్యూల్లోనే సినిమాను పూర్తి చేశాం. ► నా కెరీర్లో పది సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం గడిచేకొద్దీ కొత్త హీరోయిన్లు వస్తుంటారు. ట్రెండ్ మారిపోతుంటుంది. కొందర్ని బెటర్ పెర్ఫార్మెన్స్ అంటారు.. ఇంకొందర్ని బ్యూటిఫుల్ అంటారు. కానీ వీలైనంత కాలం నా పేరు నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకు తగ్గట్లు కష్టపడుతున్నాను. నేను చేసే ప్రతి సినిమా నా మొదటిదిగా భావిస్తాను. నా నటన, నా ప్రవర్తన పట్ల సినిమా యూనిట్ సంతోషంగా ఉన్నారో లేదో కూడా ముఖ్యమే. ► ప్రమోషన్స్ ఎంతవరకు సినిమా కలెక్షన్స్‌ను ప్రభావితం చేస్తాయో నాకు తెలియదు. కానీ నేను ఒక చోటుకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయడం వల్ల పది టిక్కెట్లైనా అమ్ముడు పోతాయంటే వెళ్లి ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే ఒక నిర్మాత నన్ను నమ్మి, ఇంత పారితోషికం ఇచ్చినప్పుడు చేయాలి. మూవీ విడుదలై, విజయం సాధిస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయను (సరదాగా). అదే రిలీజ్‌కు ముందు అయితే నాకు వీలైనంత ప్రమోషన్ చేస్తాను. రిలీజ్ టైమ్‌లో సినిమా ఫలితం గురించి కాస్త ఆందోళనకి గురవుతా. ► నా చదువు పట్ల మా అమ్మగారు మరీ స్ట్రిక్ట్‌గా ఉండేవారు కాదు. కానీ, నేను ఫుల్ మార్క్స్ రావాలని కోరుకుంటాను. 12వ తరగతిలో అకౌంట్స్‌లో 200కి 199 మార్కులు రావడంతో బాగా ఏడ్చాను. నేను ఫెయిల్ అయ్యానని మా అమ్మ అనుకున్నారు. అసలు విషయం తెలియడంతో సైలెంట్‌గా వెళ్లిపోయారు. ► నా సినిమాలను చూడమని నా స్నేహితులకు చెబుతుంటాను. నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుదు మాది గర్ల్స్ కాలేజ్. చాలా స్ట్రిక్ట్. ఎవరూ టీవీ, ఇండస్ట్రీ అంటూ ఉండేవారు కాదు. కానీ, నేను చేసేదాన్ని. సినిమాలకే కాదు.. కుటుంబానికీ సమయం కేటాయించాలనుకుంటున్నాను. ఒక ఆర్టిస్టుగా నేను సాధించే విజయాల కన్నా కూడా నా వ్యక్తిత్వం గురించి మా కుటుంబ సభ్యులు గర్వంగా ఫీల్ అవుతారు. ► ‘రంగస్థలం’ తర్వాత సమంత ఏం చేసినా హిట్ అయిపోతుందన్నారు. ఆ సినిమాలో నా క్యారెక్టరైజేషన్, కొంచెం కథ తెలుసంతే. ఎంటైర్ స్క్రిప్ట్ తెలియదు. ఇప్పుడు నేను సినిమాలను చాలా తెలివిగా ఎంచుకుంటున్నాని అంటున్నారు. కానీ అది అలా జరుగుతోందంతే. ► ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లో కొత్త సమంతను చూస్తారు. చాలా కష్టపడ్డాను. నేను ఒక్కషాట్‌లో కూడా డూప్ వాడలేదు. అప్పుడు అనుకున్నాను.. సినిమాలో ఫైట్స్ కోసం హీరోలు ఇంత కష్టపడతారా అని!. ఇందులో నేను చేసిన పాత్రను ఇదివరకు చేయలేదు. -
స్ట్రయిట్ సినిమా చేయడం ఈజీ
శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళంలో విజయవంతమైన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు విలేకరులతో మాట్లాడారు. ► నేను నిర్మాతగా చేసిన మొదటి సినిమా నుండి స్క్రిప్ట్‌తో పాటు ట్రావెల్ చేయటం అలవాటు. అందుకే రీమేక్ చిత్రాలు తీయలేదు. అది మాత్రమే కాదు స్ట్రయిట్ సినిమా చేయటం ఈజీ. మధ్యలో ‘ప్రేమమ్’, ‘బెంగుళూర్ డేస్’ సినిమాలు చూసినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. ‘బెంగుళూర్ డేస్’ సినిమాకి చాలా వర్కవుట్ చేసి హీరోలుగా నాని, శర్వానంద్‌లను అనుకున్నాను. తర్వాత మూడో హీరో విషయంలో శాటిస్ఫై అవ్వలేదు. డ్రాప్ అయ్యాను. ‘ప్రేమమ్’ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సితార ఎంటర్టైన్మెంట్ నాగవంశీ ‘అన్నా.. ఈ సినిమాని నేను రీమేక్ చేస్తాను’ అన్నాడు. ‘సరే’ అన్నాను. ► అనుకోకుండా ఈ ఏడాది మూడు రీమేక్ సినిమాలు చేస్తున్నాను. ‘96’ తమిళ చిత్రాన్ని ‘జాను’ పేరుతో చేశాను. నాని హీరోగా తెలుగులో విజయం సాధించిన ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్ కపూర్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నా. బాలీవుడ్లో నిర్మాతగా నాకిది ఫస్ట్ సినిమా. అలాగే హిందీ ‘పింక్’ను తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్నాను. ఈ సినిమాను మే 15న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ► ‘జాను’ సినిమా విషయానికొస్తే ‘96’ సినిమా ట్రైలర్ చూడగానే ఆసక్తిగా అనిపించింది. అప్పటినుండి దాన్ని ఫాలో అవుతూ వచ్చాను. నాకు తమిళ్ పెద్దగా అర్థం కాకపోయినా సినిమా టచ్ చేసింది. ఈ సినిమాలో అద్భుతమైన సన్నివేశాలతో పాటు చిన్నప్పటి ఫ్రెండ్స్, రీయూనియన్ అనగానే పాత రోజు లకు వెళ్లిపోతాం. జనరల్‌గా పదో తరగతి ప్రేమలు సక్సెస్ కావు. ఈ సినిమాలోనూ అంతే. ఈ పాయింట్ లె లుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ► అల్లు అర్జున్‌తో మేం చేసిన ‘ఆర్య’ సినిమాకి ఈ చిత్రదర్శకుడు ప్రేమ్‌కుమార్ అసిస్టెంట్ కెమెరామేన్‌గా చేశాడట. మాకు గుర్తు లేదు. ‘96’ చూడ్డానికి కెమెరామేన్ విజయ్ చక్రవర్తితో వెళ్లినప్పుడు తను ఆ విషయం నాకు చెప్పాడు. మీకు ఆసక్తి ఉంటే తెలుగులో కూడా మీరే డైరెక్ట్ చెయ్యండని ప్రేమ్‌తో అంటే, సరే అన్నారు. తెలుగు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కథలో చిన్న మార్పులు చేశాం. ► నేను ఈ సినిమా చూస్తున్నప్పుడే త్రిష ప్లేస్‌లో సమంతను ఊహించుకున్నాను. ముందు సమంత ఈ సినిమాలో నటించటానికి భయపడింది. షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజుల తర్వాత ప్రతి రోజూ మేజిక్ జరుగుతోంది, మీరు నన్ను ఒప్పించకుంటే మంచి సినిమా మిస్ అయ్యేదాన్ని అని మెసేజ్ పెట్టింది. ► విజయ్ సేతుపతి ‘96’లో అద్భుతంగా నటించాడు. అతనిలాంటి హీరో దొరుకుతాడా అనుకున్నాను కానీ, ఈ కథను ఓన్ చేసుకొని శర్వానంద్ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడని ప్రేమ్‌కుమార్ అన్నాడు. మా బేనర్లో నెక్ట్స్ మహేశ్‌బాబు హీరోగా సినిమా ఉంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. -
‘దిల్’ రాజుకి ఏమైనా మెంటలా!
‘‘తమిళచిత్రం ‘96’ని తెలుగులో రీమేక్ చేస్తున్నాం అని వార్తలు రాగానే వీళ్లకేమైనా పిచ్చా? ‘దిల్’ రాజుకేమైనా మెంటలా? అని కామెంట్స్ వినిపించాయి. నేను ఏ ఫీలింగ్‌తో అయితే ఉన్నానో రేపు సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ‘96’కి ఇది రీమేక్. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘నా 17 ఏళ్ల కెరీర్లో ఇది తొలి రీమేక్. తమిళంలో రిలీజ్ కాకముందే చూశాను. తమిళం అర్థం కాకపోయినా ఆ పాత్రలతో కనెక్ట్ అయి ప్రయాణించాను. అప్పుడే రీమేక్ చేయాలని నిశ్చయించుకున్నాను. నాపై నమ్మకం ఉంచి సినిమా చేయమని సమంతకు చెప్పాను. సినిమా చూసి చేస్తానని శర్వా (శర్వానంద్) చెప్పాడు. ‘జాను’ చూశాక అమ్మాయిలు శర్వాతో, అబ్బాయిలు సామ్‌తో లవ్‌లో పడతారు. అలాంటి లవర్ మనకు లేరని ఈర్ష్య పడతారు’’ అన్నారు. ‘‘రీమేక్ చేయాలా వద్దా? అని మాట్లాడుకుంటున్నప్పుడు రాజు అన్న ‘నన్ను నమ్ము’ అన్నారు. ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ‘శతమానం భవతి’ అప్పుడు కూడా ఇదే అన్నారు. నాకు మంచి హిట్ ఇచ్చారు. ఈసారి కూడా అదే చేస్తారనుకుంటున్నాను. సమంతగారు లేకపోతే నేను అంతగా యాక్ట్ చేయలేకపోయేవాడినేమో. లవ్ ఫెయిల్యూర్ అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఫస్ట్ లవ్ అందరికీ గుర్తుంటుంది. ఈ పదేళ్లలో ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదనుకుంటున్నా’’ అన్నారు శర్వానంద్. ‘‘రీమేక్ మూవీ కోసం రాజుగారు కలుస్తాను అంటే భయపడ్డాను. ఒకవేళ ఆయన్ను కలిస్తే సినిమాకి ఓకే చెప్పేస్తాను. ఆయన బ్యానర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమా ఒప్పుకున్నాను. ప్రతిరోజూ సెట్లో మ్యాజిక్ జరగాలంటే కష్టం. కానీ శర్వానంద్ వల్ల ఆ కష్టాన్ని దాటేశాం. నా పర్ఫార్మెన్స్కి వచ్చే క్రెడిట్ మా ఇద్దరికీ దక్కుతుంది’’ అన్నారు సమంత. -
నా కెరీర్లో ఇలాంటి సంక్రాంతి చూడలేదు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతోంది. నా కెరీర్లో ఇప్పటివరకు ఇలాంటి సంక్రాంతిని చూడలేదు’’ అని అన్నారు ‘దిల్’ రాజు. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైన సంగతి తెలిసిందే. తమ సినిమాకు మంచి స్పందన, కలెక్షన్స్ వస్తున్నాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కేవలం ఐదు నెలల్లో సినిమాను పూర్తి చేసి ‘సరిలేరు మాకెవ్వరు’ అనిపించారు మహేశ్‌బాబు, అనిల్ రావిపూడి. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని బ్లాక్ బస్టర్‌కా బాప్ అనే స్థాయిలో రెవెన్యూ క్రియేట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నిజమైన సంక్రాంతి అనుకునేలా చేశారు అనిల్. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కు, ఏకే ఎంటర్టైన్మెంట్స్కి హాయ్యస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసిన సినిమాగా చేశారు అనిల్. డిస్ట్రిబ్యూటర్స్‌కు ఎంత లాభాలు కావాలో అంత లాభం వచ్చింది. ఇంకా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. ఈ సంక్రాంతికి ఇంత మంచి రెవెన్యూ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘సంక్రాంతి పండగ ముగిసిపోయింది. కానీ పండక్కి విడుదలైన సినిమాలకు సంక్రాంతి ఇంకా నడుస్తూనే ఉంది. మహేశ్‌గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అంటే మామూలు విషయం కాదు. అనిల్ కష్టానికి తగిన ప్రతిఫలం మా అందరికీ వచ్చింది. మేము ఊహించిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ సంక్రాంతి అంటూ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంక్రాంతిలో మా సినిమా ఉండటం సంతోషంగా ఉంది’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని మహేష్‌గారి కెరీర్లోనే పెద్ద హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా మూడు వారాల రన్ ఉంది. సినిమాలో కొత్తగా 90సెకన్లు ఉండే ఓ సీన్‌ను జోడించబోతున్నాం. దాంతో ఇంకొంచెం నవ్వులు బోనస్‌గా లభిస్తాయి. సినిమాను మళ్లీ చూడాలనుకునేవారికి, కొత్తగా చూడాలనుకునేవారి కోసం ఈ సీన్‌ను యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు యాడ్ చేస్తామనేది త్వరలో చెబుతాం’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. -
నేను తీసుకున్న మంచి నిర్ణయం సరిలేరు నీకెవ్వరు చేయటమే
‘‘నా కెరీర్లో నేను తీసుకున్న మంచి నిర్ణయం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేయటమే. 20 ఏళ్ల కెరీర్లో ఇంత అద్భుతమైన స్పందనను నేనెప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాన్న అభిమానులు, నా అభిమానుల తరఫున దర్శకుడు అనిల్‌కి థ్యాంక్స్’’ అన్నారు మహేశ్‌బాబు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న విడుదలైన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్‌బాబు, రష్మిక జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించారు. ‘బ్లాక్‌బస్టర్ కా బాప్’ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా 100 కోట్ల షేర్ పోస్టర్‌ను చిత్రం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో మంచి డైలాగులు రాశారు. కానీ, ‘రమణా.. లోడెత్తాలిరా’ అనే డైలాగ్ మాత్రం బీభత్సంగా పేలింది. కథ వినగానే దేవిశ్రీ ప్రసాద్ మాస్ సాంగ్ చేయటానికి మంచి అవకాశం ఉందని ముందే చెప్పారు. అలా వచ్చిందే ‘మైండ్ బ్లాంక్’ సాంగ్. ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో విజయశాంతి గారితో నటించాను. ఆ సినిమా పెద్ద హిట్. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ సంక్రాంతిని ఎప్పటికీ మరచిపోను. నాలుగైదేళ్లుగా నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేశ్‌ను కోరుకుంటున్నారు. అది ఈ సినిమాతో సాధ్యం చేసిన నిర్మాత అనిల్ సుంకరగారికి థ్యాంక్స్’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని ‘బ్లాక్‌బస్టర్ కా బాప్‌గా నిలిపిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను. సైనికుల తల్లిదండ్రుల బాధ ఏంటో అనిల్ ఈ చిత్రంలో సందేశాత్మకంగా చూపించారు. మహేశ్‌బాబుతో పని చేయటం కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో చేసిన భారతి పాత్ర నా కెరీర్‌కి ఎంతో ప్రత్యేకం. రాములక్కా.. మళ్లీ సినిమాలు చేయండి అని అడుగుతున్నారు. ఈ రాములక్క సినిమా చేయాలంటే సబ్జెక్ట్ బాగుండాలి, పాత్ర దద్దరిల్లాలి’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్లో అన్నాను... మహేశ్ సార్ నా సినిమా వల్ల మీ ముఖంలో నవ్వురావాలి, మిమ్మల్ని ఆనందంగా చూడాలి అని. సినిమా విడుదలైన రోజు నుండి నేను ఆయనతోనే ఉంటున్నాను. ఆయన ఎంతో సంతోషంగా ఉంటున్నారు. బాబు బ్యాటింగ్ మొదలయ్యింది, ఫస్ట్ వీక్ 100 కోట్లు కలెక్ట్ చేసింది’’ అన్నారు. ‘‘మహేశ్‌తో ఇలాంటి జోనర్లో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నా. ఎవరూ ఊహించని విధంగా ఆయన నటన ఉంది. అనిల్ రావిపూడికి థ్యాంక్స్’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, యం.ఎల్.ఏ వినయ్ భాస్కర్, వరంగల్ సీపీ రవీందర్‌తో పాటు నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాతలు ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, దర్శకులు వంశీ పైడిపల్లి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
విచిత్రమైన జోన్లో ఉన్నాం
‘‘అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమా చేస్తున్నప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కథని నాకు 40 నిమిషాలు చెప్పాడు.. ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అయితే ‘మహర్షి’ తర్వాత వేరే సినిమా కమిట్మెంట్ ఉంది.. దాని తర్వాత చేద్దామన్నాను.. తను కూడా ‘ఎఫ్ 2’ తర్వాత వేరే సినిమా చేస్తాను.. ఆ తర్వాత ఇద్దరం చేద్దాం సార్ అన్నాడు. కానీ, ‘ఎఫ్ 2’ సినిమా చూశాక ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సమయంలో నేను చేయడం కరెక్ట్ అనిపించింది. అనిల్‌కి చెప్పగానే చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు’’ అని మహేశ్‌బాబు అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు, రష్మిక మందన్నా జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ‘శ్రీమంతుడు’ సినిమా నుంచి నేను అన్నీ సందేశాత్మక చిత్రాలే చేస్తున్నా. వాణిజ్య అంశాలతో కూడిన ‘దూకుడు’ లాంటి వినోదాత్మక చిత్రం రావాలని నా అభిమానులు కోరుకున్నారు.. నాక్కూడా చేయాలనిపించింది. జూలైలో ఈ సినిమా స్టార్ట్ చేసి, డిసెంబరులో పూర్తి చేశాం. ఐదు నెలల్లో సినిమా పూర్తి చేశాం. ఈ సినిమా ఈ టైమ్‌లో చేయడం నా కెరీర్లో తీసుకున్న మంచి నిర్ణయమని అనుకుంటున్నాను. ► సినిమా చాలా బాగా వచ్చింది.. బొమ్మ (సినిమాని ఉద్దేశించి) దద్దరిల్లిపోతుంది. నేను, నిర్మాతలు, డైరెక్టర్‌తో పాటు యూనిట్ అంతా హిట్ సాధించబోతున్నామనే పూర్తి నమ్మకంతో ఉన్నాం. సినిమాని మా టీమ్‌తో పాటు కొంతమంది చూశారు. మేము ఏదైతే ఫీల్ అయ్యామో సినిమా చూసినవాళ్లు కూడా అలాగే ఫీల్ అవడం చాలా సంతోషంగా అనిపించింది. తొలి రోజు షూటింగ్ నుంచి ఈ రోజు వరకూ అదే వైబ్స్ ఫీలయ్యాం. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే వైబ్స్ కనిపిస్తున్నాయి. ► ‘బిజినెస్ మేన్’ సినిమా తర్వాత నేను త్వరగా చేసిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. కథ అనుకున్నప్పడు జూన్‌లో స్టార్ట్ చేసి సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం.. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా.. అందుకే జూలైలో సినిమా స్టార్ట్ చేసి, పూర్తయ్యేవరకూ నాన్‌స్టాప్‌గా పనిచేశాం. ఇందులో నేను ఆర్మీ మేజర్ పాత్ర చేస్తుండటంతో మేకోవర్ కోసం ఓ నెల టైమ్ పట్టింది. ఈ పాత్ర కోసం 6 కిలోలు బరువు తగ్గాను. ► టీమ్ చక్కగా కుదిరితే సినిమాలు త్వరగా పూర్తవుతాయి.. కొన్ని సినిమాలు అలా కుదురుతాయి.. మరికొన్ని మన చేతుల్లో ఉండవు. అన్నీ ఐదు నెలల్లోనే పూర్తి కావాలంటే ఎలా? మంచి క్వాలిటీ కావాలి కదా? అయితే ‘సరిలేరు నీకెవ్వరు’కు అన్నీ కుదిరాయి.. పైగా సంక్రాంతి లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి వచ్చాం. ► ఈ చిత్రంలో నాది బాధ్యతగల ఆర్మీ మేజర్ పాత్ర. ఇష్టం వచ్చినట్లు చేయలేం.. దాన్ని అనిల్ చక్కగా తెరకెక్కించాడు. ఇప్పటివరకూ అనిల్ తీసిన సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా వేరే ఎత్తు. ఈ సినిమాతో దర్శకుడిగా పది రెట్లు పెరుగుతాడు. అంత బాగా తీశాడు ఈ సినిమాని. ► నేను ఒక్కసారి డైరెక్టర్‌కి సరెండర్ అయిపోతే వాళ్లు చెప్పినట్లు చేస్తా. ‘దూకుడు’ తర్వాత మళ్లీ అంత వాణిజ్య అంశాలున్న చిత్రమిది. అలాగని ‘దూకుడు’లా ఉండదు.. ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా అనిల్‌దే. నా గత సినిమాలను చూసి ఈ పాత్రని అనిల్ తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండాలనేది అనిల్ కోరిక.. పైగా ఈ చిత్రంలో ఆ పాటకి అవకాశం ఉండటంతో పెట్టాం. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేశ్‌ను చూస్తారు. ► విజయశాంతిగారితో ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా తర్వాత, దాదాపు 30 ఏళ్లకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశాను. సెట్లో తొలిరోజు ఆమెను కలవగానే ‘కొడుకు దిద్దిన కాపురం’ షూటింగ్ నిన్ననే జరిగినట్టు అనిపించింది. ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆమెకు థ్యాంక్స్.. ఎందుకంటే ఈ సినిమాలోని భారతి పాత్ర ఆమె తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. పదేళ్ల తర్వాత సంగీతగారు ఇందులో నటించారు. ఆమెను అనిల్ ఒప్పించి తీసుకొచ్చారు. ► కృష్ణగారి సర్ప్రైజ్ ఏంటో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ సినిమాలో సైనికులపై వచ్చే థీమ్ సాంగ్ అంటే నాకు ఇష్టం. ఈ చిత్రంలో చాలా సర్ప్రైజ్ అంశాలున్నాయి.. ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నా. ఈ పాత్ర చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.. ఈ మధ్య కాలంలో అంత సరదాగా ఎప్పుడూ ఉండలేదు. సినిమా స్టార్ అయిన నాలుగో రోజు నుంచే సరదాగా ఉన్నా. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి అడ్వాన్స్ తీసుకోకుండా చేశానని కాదు కానీ, ఈ సినిమా ఐదు నెలల్లో చేయాలనుకున్నాం.. ఎలా ఉంటుంది? బడ్జెట్ ఎంత? అనుకోలేదు. నేను కూడా ఈ సినిమాకి ఓ నిర్మాత కావడంతో అడ్వాన్స్ తీసుకోలేదు. ఒక నిర్మాతగా నేను తీసుకున్న నిర్ణయమది. నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. భవిష్యత్తులో అందరూ ఇలాగే చేస్తే ఓ సినిమాకి ఆర్థికంగా చాలా మిగులుతుంది. ► ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవడం మంచిది కాదు.. రెవెన్యూ షేర్ అయిపోతుంది. ‘అల.. వైకుంఠపురములో...’ మరుసటి రోజు విడుదలకు ఒప్పుకున్నందుకు నిర్మాతలకు థ్యాంక్స్. హీరోలెప్పుడూ థియేటర్ల గురించి పట్టించుకోరు.. సోలో రిలీజ్ కావాలని అంటారంతే. డబ్బులు నా ఒక్కడికే వస్తే ఎలా? సినిమా కొన్నవారికి కూడా రావాలి కదా? సంక్రాంతి కాబట్టి మూడు నాలుగు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంతే. ఈసారి ఒకేరోజు కాకుండా ఇండస్ట్రీ వారు మాట్లాడుకుని గ్యాప్‌తో విడుదల చేస్తున్నారు. ► నాన్నగారికి (కృష్ణ) ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ ఇవ్వాలని చిరంజీవిగారు కోరడం సంతోషాన్నిచ్చింది. ఆ మరుసటి రోజు నాన్నగారిని కలిసినప్పుడు.. ‘చిరంజీవి బాగా మాట్లాడారు.. నా తరఫున థ్యాంక్స్ చెప్పు’ అన్నారు. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించేందుకు రెండు ఫౌండేషన్లు పని చేస్తున్నాయి. వాటికి నా వంతు సహాయం అందిస్తున్నా. భవిష్యత్‌లో పెద్దగా చేస్తా. ► ప్రయోగాలు, వైవిధ్యమైన సినిమాలు అనుకోవడానికి బాగుంటాయి. కానీ, 125 నుంచి 130 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అన్ని యాంగిల్స్ చూడాలి.. ఫ్రెష్‌గా ఉండాలి.. పైగా పెద్ద హీరోలందరం ఒక విచిత్రమైన జోన్లో ఉన్నాం.. అన్నీ ఉండాలి.. లేకుంటే మార్కెట్‌కి ఇబ్బంది. అన్నీ కుదిరితే చిన్న సినిమా చేయొచ్చు. ► దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎలాగూ బాగా ఇస్తాడు.. నేపథ్య సంగీతం చాలా బాధ్యతగా చేస్తాడని నా భావన. నేపథ్య సంగీతంలో మంచి అనుభవం గతంలో మణిశర్మగారికి ఉండేది.. ఇప్పుడు దేవిశ్రీకి ఉంది. ఇప్పటికి 25 సినిమాలు చేశాను.. ఇంకా కొత్తగా ఏం చేయాలి? ఏం చేయొచ్చు? అని ఆలోచిస్తుంటా. ► మా సినిమా నుంచి ముందు అనుకున్న కెమెరామేన్ తప్పుకున్నప్పుడు రత్నవేలుగారికి ఫోన్ చేయగానే గంట సమయం తీసుకుని ఓకే అన్నారు. తను లేకుంటే ఇంత స్పీడ్‌గా సినిమా పూర్తవ్వదు.. రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగ్గొట్టేశారు. ► ‘కేజీఎఫ్’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ని కలిశాను.. కొన్ని స్టోరీ లైన్స్ విన్నా.. ఆ మాత్రానికే సినిమా ఫిక్స్ అయిపోదుగా? -
నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే
‘‘మనం చేసే పని నచ్చేవారు వందలో అరవై నుంచి డెబ్బై మంది మాత్రమే ఉంటారు. ముప్పై మంది మనం ఏం తీసినా తిడతారు. అందుకే 70 మంది కోసమే సినిమా తీయాలి. నా సినిమాల కథలను ఏ కొందరో విమర్శించారని నేను పక్కకు పోయి ఓ ప్రయోగాత్మక సినిమా తీస్తే... అదేంటీ అనిల్ రావిపూడి అతని బలమైన జానర్‌ను వదిలేసి ఇలాంటి సినిమా తీశాడు? అనే వార్తలు వస్తాయి. నేను చేసిన ప్రతి సినిమా ఆ హీరోల కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ ఫిలింసే’’ అన్నారు అనిల్ రావిపూడి. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతున్న సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు. ► ‘సుప్రీమ్’ సినిమా కోసం జోధ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక సైనికుడిని కలిశాను. ఆయనతో మాట్లాడినప్పుడు సైనికులు ఏయే పరిస్థితుల్లో ఎలా ఉంటారో తెలుసుకున్నాను. ఆ సంఘటనల నుంచి ప్రేరణ పొంది ‘సరిలేరు నీకెవ్వరు’ కథ రాసుకున్నాను. ‘ఎఫ్ 2’ సినిమా సమయంలో మహేశ్‌బాబుగారికి ఈ కథ చెప్పాను. క్యారెక్టరైజేషన్ బాగా నచ్చి, నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాను మహేశ్‌గారి నమ్మకానికి నేను ఇచ్చే బహుమతిగా భావిస్తున్నా. మహేశ్‌గారి టైమింగ్ బాగుంటుంది. దర్శకులకు ఆయన పూర్తి స్వేచ్చ ఇస్తారు. దర్శకులకు కావాల్సింది వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. మహేశ్‌గారికి నేను కాదు.. ఆయన నా కెరీర్‌కు ప్లస్. విజయశాంతిగారు మొదట్లో చేయనన్నారు. ఒకసారి కథ వినమన్నాను. కథ విన్నాక భారతి పాత్ర చేయడానికి ఆమె ఒప్పుకున్నారు. ఆమె కోసమే ఈ పాత్ర రాశాను. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటల పట్ల దర్శకుడిగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను. నిర్మాతలు ‘దిల్’ రాజు, అనిల్ సుంకరగారు సహకరించారు. ► దేశభక్తి, వినోదం అనే అంశాలను ఒకేసారి డీల్ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. కానీ దాన్నే హీరోగారి చేత ఎంటర్టైనింగ్గా ఎలా చెప్పించాం అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. బోర్డర్ నుంచి అజయ్‌కృష్ణ (మహేశ్ పాత్ర పేరు) అనే ఆర్మీ ఆఫీసర్ ఓ బాధ్యతతో కర్నూలు వస్తాడు. ఒక యుద్ధ వాతావరణం నుంచి సాధారణ ప్రజల మధ్యలోకి వచ్చిన అతనికి ప్రజలు అమాయకులుగా కనిపిస్తారు. ఎందుకంటే సరిహద్దుల్లో శత్రువులు వేరు, సమాజంలోని శత్రువులు వేరు. వీరందరూ బాధ్యతతో ఉండాలనేది అజయ్‌కృష్ణ వ్యక్తిత్వం. యుద్ధంలో శత్రువును చంపడం కాదు. శత్రువును మార్చడం ముఖ్యమని మా సినిమా చెబుతుంది. ఇందులో వచ్చే ఆర్మీ ఎపిసోడ్ చాలా కీలకం. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి. ► ప్రస్తుతం నా సినిమా ప్రయాణం బాగానే సాగుతోంది. అయితే నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే. ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా కల్యాణ్‌రామ్‌గారు అవకాశం ఇచ్చారు. ‘సుప్రీమ్’తో సాయిధరమ్ తేజ్, ‘రాజా ది గ్రేట్’కి రవితేజగారు, ‘ఎఫ్ 2’కి వెంకటేష్, వరుణ్‌తేజ్ గార్లు వీరందరు నన్ను ఇంతదూరం తీసుకువచ్చారు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్‌గారితో సినిమా చేశాను కాబట్టి నేను ఏదో గొప్ప అని ఊహించుకోవడం లేదు. నేను వచ్చిన దారి నాకు గుర్తు ఉంది. ► ఏ దర్శకుడికైనా అతని ప్రయాణంలో ఏదో సందర్భంలో ఫ్లాప్ వస్తుంది. మనకు తెలియకుండానే ఆ తప్పు జరిగిపోతుంది. కానీ ఆ తప్పుని ఎంత దూరంలో జరుపుకుంటామనేది మన చేతుల్లో ఉంటుంది. ఆ తప్పు తొందరగా జరగకూడదని ప్రయత్నిస్తున్నాను. నేను తీసిన ప్రతి సినిమా సూపర్‌హిట్ అవుతుందని నేను చెప్పలేను. ► చిరంజీవిగారితో సినిమా చేసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తా. బాలకృష్ణగారితో సినిమా చేయాల్సింది. కుదర్లేదు. భవిష్యత్‌లో ఉండొచ్చు. ‘ఎఫ్ 2’ సీక్వెల్ ఆలోచన ఉంది. ప్రస్తతానికి నా తర్వాతి చిత్రం గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. -
అందర్నీ టార్చర్ పెట్టాను!
‘‘నేను చాలా సెటిల్డ్ యాక్టర్‌ని. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో చాలా ఎమోషనల్‌గా నటించాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఫుల్ ఎనర్జీ ఉన్న పాత్ర చేశాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రయోగాలు చేస్తున్నాను’’ అన్నారు రష్మికా మందన్నా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మిక కథానాయిక. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రష్మికా చెప్పిన విశేషాలు. ► దర్శకుడు అనిల్‌గారు కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఆయన కథను మొత్తం యాక్ట్ చేసి చూపిస్తారు. ఈ సినిమాలో నా పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. నా పాత్రకో ముగింపు కూడా ఉంటుంది. సినిమాలో మంచి ఫీల్ ఉంది. మహేశ్‌బాబుగారు, విజయశాంతిగారితో కలసి యాక్ట్ చేయడం బోనస్. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నా పాత్ర చాలా డ్రమాటిక్‌గా ఉంటుంది. హీరో వెంటపడి అల్లరి చేసే పాత్ర నాది. చాలా హైపర్ యాక్టివ్. ఫుల్ లెంగ్త్ నవ్వించే పాత్ర నాది. ట్రైన్ ఎపిసోడ్లో మహేశ్‌బాబు పాత్రను నా పాత్ర చాలా టార్చర్ పెడుతుంది. ఈ సినిమాలోనే కాదు సెట్లోనూ అందర్నీ టార్చర్ పెట్టాను. సెట్లో అందరూ కామ్‌గా ఉంటే అందర్నీ డిస్ట్రబ్ చేస్తుంటాను. అదే నా బలం అనుకుంటున్నాను (నవ్వుతూ). ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు ‘మరీ అంత టార్చర్ పెట్టకే’ అని అనుకున్నాను. ► ఈ సినిమా ట్రైలర్లో కనిపించినంత హైపర్‌గా నిజజీవితంలో ఉండను. మా దర్శకుడు చెప్పినట్లు చేశాను. మీరు చేసి చూపించండి, దాన్ని కాపీ కొడతాను అని చెప్పి కాపీ కొట్టేశా. కాపీ అంటే పూర్తి కాపీ కాదు. ఆయన చెప్పినదానికి కొంచెం నా స్టయిల్ జత చేసి నటించాను. ► విజయశాంతిగారితో నాకు ఎక్కువ సన్నివేశాలు లేవు. మొదట్లో ఆమెతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ పడ్డాను. ఆమెను లేడీ అమితాబ్ అంటారు కదా. అలాగే సీనియర్ యాక్టర్ అని చిన్న భయం ఉండేది. కానీ సెట్లో ఆమె ఎనర్జీ చూసి ఫ్యాన్ అయిపోయాను. చాలా పాజిటివ్‌గా ఉంటారు. కేరళలో షూటింగ్ అప్పుడు మేం ఫ్రెండ్స్ అయిపోయాం. రెండు రోజులు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఫోన్ చేసి కూడా విసిగిస్తున్నా. త్వరలోనే మేమిద్దరం కలసి ఓ సినిమా చేస్తాం (నవ్వు). ► ఈ సినిమాలోని ‘మైండ్ బ్లాక్..’ సాంగ్‌లో డ్యాన్స్ హైలైట్‌గా ఉంటుంది. నాకు డ్యాన్స్ అంతగా రాదేమో అని మా టీమ్ అనుకున్నారు. ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో అని ఎదురు చూస్తున్నాను. ► వచ్చే నెలలో ‘భీష్మ’ విడుదల అవుతుంది. సుకుమార్– అల్లు అర్జున్ కాంబినేషన్లో హీరోయిన్గా చేయబోతున్నాను. రెండు మూడు నెల్లలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. మిగతావి చర్చల్లో ఉన్నాయి. -
సమస్యలను పరిష్కరించడమే గిల్డ్ టార్గెట్
మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో చిత్రాలు ఈ నెల 11, 12 తేదీల్లో విడుదల కానున్నాయి. అయితే ఈ చిత్రాల విడుదల తేదీలపై రెండు మూడురోజులుగా చిన్న అస్పష్టత ఏర్పడింది. విడుదల తేదీలు మారే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. కానీ ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ చొరవతో ఈ సినిమాలు ముందు ప్రకటించిన తేదీల్లోనే రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘చర్చల అనంతరం సినిమా విడుదల తేదీలపై క్లారిటీ వచ్చింది. కారణాలు ఏమైనా కావచ్చు. సమస్యలకు పరిష్కారం దొరకడమే ముఖ్యం. ఈ రోజు జరిగిన మీటింగ్‌లో అందరూ పాజిటివ్‌గానే స్పందించారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘గతంలో జరిగిన ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ మీటింగ్‌లో నిర్మాతలతో మాట్లాడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని 11వ తేదీన, అల వైకుంఠపురములో చిత్రాన్ని 12న విడుదల చేయాలనుకున్నాం. అయితే కొన్ని పరిణామాల మధ్య ‘అల వైకుంఠపురములో’ జనవరి 10 లేదా 11న విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. దాంతో మరోసారి గిల్డ్‌లో చర్చలు జరిగాయి. పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు అందరూ బావుండాలనే ఉద్దేశంతో ముందు అనుకున్న తేదీలకే సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలను ఒప్పించాం. ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు వస్తే పరిష్కరించడానికి గిల్డ్ ముందుంటుంది. ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది అనేది పక్కన పెడితే సమస్యను పరిష్కరించడమే గిల్డ్ టార్గెట్’’ అన్నారు. నిర్మాత రాజీవ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. -
రెండేళ్ల ప్రయాణం ఇద్దరిలోకం ఒకటే
‘రెండేళ్ల ప్రయాణమే ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా. కృష్ణ చెప్పిన ఐడియా నచ్చింది. ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకున్నాం కానీ కుదర్లేదు. ఆ తర్వాత రాజ్ తరుణ్‌తో ప్రాజెక్ట్ ఓకే అయింది’’ అన్నారు ‘దిల్’ రాజు. జీఆర్.కృష్ణ దర్శకత్వంలో రాజ్‌తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మిక్కి జె.మేయర్, సమీర్ రెడ్డి వంటి టాప్ టెక్నీషియ¯Œ ్స ఈ సినిమాకు పనిచేశారు. హీరోయిన్ విషయంలో ముగ్గురు, నలుగుర్ని అనుకున్నాం.. కానీ, శిరీష్ మాత్రం షాలినీ పేరును చెప్పి ఒప్పించాడు. రాజ్‌తరుణ్, షాలినీ పాండే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు ఎక్కలేదు.. ఆ విషయాన్ని డైరెక్టర్‌కి చెప్పాను. మళ్లీ మార్పులు చేర్పులు చేసి సినిమాను చూపించాడు. ఫైనల్ సినిమా చూసి డైరెక్టర్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఫస్టాఫ్ టైమ్‌పాస్‌లా ఉంటుంది. సెకండాఫ్ గుడ్. ముఖ్యంగా క్లైమాక్స్ వెరీగుడ్ అనిపిస్తుంది. నిజాయతీగా చేసిన చిత్రమిది. ఈ ఏడాది ‘ఎఫ్2, మహర్షి’ తర్వాత ఈ సినిమాతో సక్సెస్ కొడితే హ్యాట్రిక్ వచ్చేసినట్టే’’ అన్నారు. ‘‘ఇదో అందమైన ప్రేమకథ. సినిమా అందరికీ నచ్చుతుంది. థియేటర్లోనే సినిమా చూడండి.. పైరసీని ప్రోత్సహించొద్దు’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘పుట్టుక నుండి చివరి వరకు ఇద్దరి వ్యక్తుల జర్నీ ఈ సినిమా’’ అన్నారు దర్శకుడు జీఆర్ కృష్ణ. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
బ్లాక్‌బస్టర్ బహుమతి
హీరోగా విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక దర్శకునిగా శివ నిర్వాణ తెరకెక్కించిన రెండు చిత్రాలు ‘నిన్నుకోరి (2017), మజిలీ (2019)’ హిట్ సాధించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. బుధవారం (డిసెంబరు 18) నిర్మాత ‘దిల్’ రాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘‘రాజుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బ్లాక్‌బస్టర్ బహుమతి లోడ్ అవుతోంది’’ అని పేర్కొన్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్, హీరో, ఫైటర్’ సినిమాలతో విజయ్ బిజీ. అలాగే నాని హీరోగా నటిస్తున్న ‘టక్ జగదీష్’తో శివ నిర్వాణ కూడా బిజీ.. సో.. వీరిద్దరు వారి వారి సినిమాలను పూర్తి చేశాక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఊహించవచ్చు. -
హ్యాట్రిక్ హిట్‌తో 2020కి స్వాగతం చెబుతాం
‘‘2019లో ‘ఎఫ్2, మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్స్ సాధించాం. ఈ ఏడాది నాలుగైదు సినిమాలు ఉంటాయనుకున్నాం కానీ మూడు సినిమాలతోనే ముగిస్తున్నాం. మా మూడో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’ని ఈ నెల 25న విడుదల చేస్తున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ టర్కీ సినిమా చూసిన కృష్ణ ఈ ఐడియాను నాకు చెప్పాడు. మన నేటివిటీకి తగిన విధంగా కథను డెవలప్ చేశాం. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ. సినిమాల్లో ఒకప్పటితో పోలిస్తే చాలా మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం లిప్‌కిస్‌ల ట్రెండ్ నడుస్తోంది. మా సినిమాలో కూడా లిప్‌కిస్ ఉండటంతో సెన్సార్ వారు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. మేం అనుకున్నట్లు జరిగితే హ్యాట్రిక్ హిట్‌తో ఈ ఏడాదిని ముగిస్తాం. 2020 మాకు మంచి వెల్కమ్ అవుతుంది’’ అన్నారు. ‘‘పుట్టిన దగ్గరి నుంచి ఒకటయ్యేవరకు హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథ ఇది. మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేసి బయటకు వస్తారు ప్రేక్షకులు. ఈ సినిమాలో వైవిధ్యమైన రాజ్‌తరుణ్ కనపడతారు’’ అన్నారు జీఆర్ కృష్ణ. ‘‘నాకు కలిసొచ్చిన డేట్.. ‘ఉయ్యాల జంపాల’ విడుదలైన డిసెంబర్ 25న ఈ సినిమా విడుదలవుతోంది’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘పెద్ద సాంకేతిక నిపుణులు సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. -
ఈ ఉగాదికి హింసే!
‘‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అన్నాడు షేక్స్పియర్. అదే నేనూ అంటున్నాను. శత్రువులందరూ జాగ్రత్తగా ఉండండి’’ అంటున్నారు నాని. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘వయొలెన్స్ (హింస) కావాలన్నారుగా. ఇస్తాను. ఉగాదికి సాలిడ్‌గా ఇస్తాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు నాని. ఈ సినిమాలో సుధీర్‌బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో, నాని విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇది నాని 25వ చిత్రం కూడా కావడం విశేషం. ఈ సినిమాకు సంగీతం: అమిత్ త్రివేది. -
తెలుగు పింక్
ఇక పవన్ కల్యాణ్ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశారా? అని చాలామంది అనుకుంటున్న తరుణంలో ఓ వార్త తెరమీదకు వచ్చింది. హిందీ హిట్ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్‌లో ఆయన నటించబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. గత ఏడాది ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ మరో సినిమాలో నటించని సంగతి తెలిసిందే. ఇక హిందీ ‘పింక్’ని తమిళంలో అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేసిన బోనీకపూరే తెలుగు రీమేక్‌ను నిర్మించబోతున్నారు. ‘దిల్’ రాజు మరో నిర్మాత. ‘ఓ.. మై ఫ్రెండ్, ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. హిందీ హిట్ ‘బదాయి హో’ తెలుగు రీమేక్ నిర్మాణానికి తొలిసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న బోనీ కపూర్, ‘దిల్’ రాజు తాజాగా ‘పింక్’ తెలుగు రీమేక్‌ను కూడా నిర్మించబోతుండటం విశేషం. ‘బదాయిహో’ తెలుగు రీమేక్‌లో ఎవరు నటించబోతున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరి.. ‘పింక్’లో పవన్ నటిస్తారా? లేదా? -
ఆవిరి ఐడియా అలా వచ్చింది
‘‘హారర్ జానర్లో రకాలు ఉన్నాయి. ‘ఆవిరి’ హారర్ మూవీ కాదు. మంచి ఫ్యామిలీ బేస్డ్ థ్రిల్లర్. గతంలో నేను చేసిన ‘అవును, అనసూయ’ చిత్రాలు కూడా థ్రిల్లర్ మూవీసే. హారర్ కాదు. ప్రేక్షకులను భయపెడితే థ్రిల్ ఫీల్ అవుతారని నేను అనుకోను’’ అని దర్శక–నిర్మాత, రచయిత రవిబాబు అన్నారు. నేహా చౌహాన్, రవిబాబు, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన తారాగణంగా రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆవిరి’. నవంబరు 1న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రవిబాబు చెప్పిన విశేషాలు. ► నేను, ‘దిల్’ రాజుగారు ఎప్పట్నుంచో మంచి మిత్రులం. ఆయన నిర్మించిన ‘బొమ్మరిల్లు’ నాకు చాలా ఇష్టం. మేం ఇద్దరం ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటున్నాం. ‘ఆవిరి’ సినిమాతో కుదిరింది. ఈ సినిమా తీయడానికి ముందు ‘దిల్’ రాజుగారికి కథ చెప్పాను. సినిమా పూర్తయ్యాక చూపిస్తే, బాగుందన్నారు. నేను ఎవరితో సినిమా తీసినా ఫస్ట్ కాపీ పూర్తయ్యేవరకు బాధ్యత తీసుకుంటాను. ► ‘అదుగో’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు రెండున్నరేళ్లు పట్టింది. ఆ సమయంలో నెక్ట్స్ ఏ చిత్రం చేయాలి? అని ఆలోచిస్తున్నప్పుడు అప్పటి వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో ఓ స్పిరిట్ ఉందన్న వార్తలు చదివాను. ఈ ఐడియాకు కొన్ని కల్పిత అంశాలు జోడించి ‘ఆవిరి’ కథ రాసుకున్నాను. ‘అదుగో’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో కొన్ని సినిమాల్లో నటించలేకపోయా. ‘సాహో’ వదులుకున్నాను. మళ్లీ నటుడిగా బిజీ అవుతా. ► భారీ బడ్జెట్ సినిమాలు తీయడం కంటే కొత్త ఐడియాలతో ప్రేక్షకుల మెప్పు పొందడమే గొప్పగా భావిస్తాను. ఇప్పటివరకు నేను ప్రయత్నించిన జానర్లు ఎవరూ ప్రయత్నించి ఉండరు. ∙నా దగ్గర నాలుగైదు ఐడియాలు ఉన్నాయి. వాటిలో ఓ ముసలాయన పాత్ర ఆధారంగా ఓ కథ ఉంది. అక్కినేని నాగేశ్వరరావుగారు బతికి ఉండి ఉంటే ఆయన్ను ఈ క్యారెక్టర్ చేయమని రిక్వెస్ట్ చేసేవాడిని. -
నా జీవితంలో ఇదొక మార్పు
‘ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వీవీ వినాయక్ ‘సీనయ్య’ చిత్రంతో తొలిసారి హీరోగా మారారు. నరసింహ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వినాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకులు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఆది’ సినిమాతో వినయ్(వినాయక్)తో నా ప్రయాణం మొదలైంది. మా సంస్థను స్థాపించిన తర్వాత తొలి సినిమా వినాయక్ దర్శకత్వంలో ‘దిల్’ చేశాం. ఈ సినిమా పేరే మా ఇంటిపేరుగా మార్చేంత హిట్ సాధించింది. 1982–1984 నేపథ్యంలో సాగే కంప్లీట్ ఎమోషనల్ స్టోరీ ‘సీనయ్య’. ఈ సినిమాలో ఎవర్ని హీరోగా అడుగుదామా? అనుకుంటున్న తరుణంలో మా సంస్థలో సినిమాలు చేసిన దర్శకులు గుర్తుకువచ్చారు. ఈ కథకు వినయ్ అయితే సరిపోతాడనిపించి నరసింహతో చెప్పగానే ఎగై్జటింగ్‌గా ఫీలయ్యాడు. ఆ తర్వాత వినయ్‌కు కథ చెప్పడంతో నటిస్తా అన్నాడు. ఈ కథలో భాగమైన హరిని భవిష్యత్‌లో దర్శకుడిగా పరిచయం చేస్తా. వచ్చే ఏడాది వేసవిలో ‘సీనయ్య’ విడుదల చేస్తాం’’ అన్నారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘రాజుగారు ఓ రోజు వచ్చి...‘నువ్వు నన్ను ‘దిల్’ రాజుని చేశావ్. నేను నిన్ను హీరోని చేద్దాం అనుకుంటున్నా’ అన్నారు. నరసింహ చెప్పిన కథ నచ్చి, పాత్ర కోసం బరువు తగ్గాను. ఇప్పుడు ఎలాంటి దుస్తులైనా వేసుకోగలుగుతున్నా (నవ్వుతూ). జీవితంలో నాకు ఇదొక మార్పు’’ అన్నారు. ‘‘మంచి ఎమోషనల్ కథ ఇది’’ అన్నారు నరసింహ. దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, సి.కల్యాణ్, డీవీవీ దానయ్య, అనిల్ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని వంశీ, రచయిత హరి పాల్గొన్నారు. -
హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ
ఇండస్ట్రీలో అభిరుచి గల నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు ‘దిల్’ రాజు. తాజాగా ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే చిత్రాన్ని అక్టోబరు 8న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారాయన. రాకేష్ వర్రె, గార్గేయి హీరో హీరోయిన్లుగా నటించారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై బసవ శంకర్ దర్శకత్వంలో రాకేష్ వర్రె నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘‘హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ చిత్రాలను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తుంటారు. ఈ చిత్రం కూడా ఆ కోవలోకే వస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా. మా సినిమాను విడుదల చేస్తున్న ‘దిల్’ రాజుగారికి స్పెషల్ థ్యాంక్స్. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రాకేష్. ఈ సినిమాకు శంకర్ శర్మ సంగీతం అందించారు. -
ఫుల్ జోష్
హీరోగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు నాగచైతన్య. ఇటీవలే ‘మజిలీ’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ ప్రేమకథను ఈ మధ్యనే పట్టాలెక్కించారు నాగచైతన్య. ఇప్పుడు ‘దిల్ రాజు’ బ్యానర్లో నూతన దర్శకుడు శశి సినిమాలో యాక్ట్ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమాకు ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది కాకుండా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’లో తండ్రి నాగార్జునతో కలసి నటించనున్నారు నాగచైతన్య. -
సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు
‘‘ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది నేను చూశా. సినిమా ఆఫీస్ ప్రారంభం నుంచి ఆ చిత్రం విడుదలయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు. సినిమా అనేది అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునాదిరాళ్లు’’ అని హీరో చిరంజీవి అన్నారు. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ‘తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం’ హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ–‘‘షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లే. కాబట్టి సినిమా సక్సెస్‌లో వారి వంతు చాలా ఉంటుంది. ‘సైరా’ సినిమా షూటింగ్ లొకేషన్ కోసం మా మేనేజర్ లొకేషన్ వారి కాళ్లమీద పడి అనుమతి తీసుకున్నారు. ఇందుకు మేనేజర్స్‌కి మా హృదయపూర్వక నమస్కారాలు. మేనేజర్స్ సిల్వర్ జూబ్లీ రజతోత్సవం ఇంత వైభవంగా జరగడం ఆనందంగా ఉంది’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ–‘‘సినిమా ఇండస్ట్రీలోని అతిరథ మహారథులు ఈ ఫంక్షన్‌కు రావడం హర్షించదగ్గ విషయం. ఈ వేడుకను ఇంత గ్రాండ్‌గా చేసిన మేనేజర్స్ యూనియన్‌కు అభినందనలు. భవిష్యత్తులో కూడా నేను చిత్ర పరిశ్రమకు సహాయపడతాను’’ అన్నారు. నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘ప్రొడక్షన్ మేనేజర్స్ ఇంత మంచి ఫంక్షన్ చేస్తారని ఊహించలేదు. వారు తలుచుకుంటే సినిమాని టైమ్‌లో పూర్తి చేయగలరు. తెలుగు చిత్ర పరిశ్రమలో గత 50 ఏళ్ల నుండి ఎంతో మంచి మేనేజర్స్‌ను చూశాను. వారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి’’ అన్నారు. నటుడు గిరిబాబు మాట్లాడుతూ– ‘‘ప్రొడక్షన్ మేనేజర్ల సేవలు చాలా అమూల్యమైనవి. సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు వారు సినిమాకు చాలా సహాయంగా ఉంటారు. వారు పదికాలాల పాటు చల్లగా ఉండాలి’’ అన్నారు. దర్శకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప ఫంక్షన్ చూడలేదు. మేనేజర్లు చేస్తున్న ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ దిశగా ముందుకు వెళుతుంది. నేను ఇన్ని గొప్ప సినిమాలు చేయడానికి సహకరించిన మేనేజర్స్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు. హీరో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ ఫంక్షన్లో చిరంజీవిగారిని కలవడం కొత్త ఎనర్జీని ఇచ్చింది. మేనేజర్స్ చేస్తున్న ఈ వేడుకకు రావడం సంతోషంగా భావిస్తున్నా. భవిష్యత్తులో వారు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చేయాలి’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మేనేజర్లు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి హాజరవడం సంతోషం. నేను 32 సినిమాలు తీశాను కాబట్టి రూ.32 లక్షలు మేనేజర్స్ యూనియన్‌కు ఇస్తున్నా. నేను నిర్మించిన మంచి చిత్రాల్లో మేనేజర్స్ సహాయ సహకారాలు ఉన్నాయి’’ అన్నారు. కాగా మేనేజర్స్ యూనియన్‌కు నటీనటులు జీవిత, రాజశేఖర్ రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. ఈ వేడుకలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి, కోటా శ్రీనివాసరావు, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, అల్లు అరవింద్, సురేశ్ బాబు, నీహారిక, నాగబాబు, రామ్–లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశీఖన్నా, రెజీనా, ప్రగ్యాజైస్వాల్, పూజాహెగ్డే, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, శ్రీకాంత్, అశ్వినీదత్, బోయపాటి శ్రీను, టి.సుబ్బిరామిరెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, తనీష్, శివ బాలాజీతో పాటు ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ గౌరవ అధ్యక్షుడు ఎమ్.సీతారామరాజు, అధ్యక్షుడు అమ్మిరాజు కాసుమిల్లి, ప్రధాన కార్యదర్శి: ఆర్.వెంకటేశ్వర రావు, కోశాధికారి: కె.సతీష్, ఉపాధ్యక్షులు డి.యోగనంద్, కుంపట్ల రాంబాబు, జాయింట్ సెక్రటరీలు సురపనేని కిషోర్, జి.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. రోజారమణి, సుమలత, టి. సుబ్బరామిరెడ్డి, జయప్రద, చిరంజీవి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రఘురామకృష్టం రాజు, అమ్మిరాజు, రాజశేఖర్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వారికి శేష్ ఒక ఉదాహరణ
‘‘ఇండస్ట్రీలో మాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు’ అని చాలామంది అంటుంటారు. వారందరికీ అడివి శేష్ ఒక ఉదాహరణ. ప్రతిభ ఉండి కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’రాజు. అడివి శేష్, రెజీనా, నవీన్‌చంద్ర ముఖ్య తారాగణంగా వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పీవీపీ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఎవరు’. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఒక స్టోరీ ఎలా ఉంది? ఏంటి? అంటే నేను చెప్పగలను కానీ ఇలాంటి ట్విస్ట్‌లతో కూడుకున్న సినిమాను నేను సరిగ్గా జడ్జ్ చేయలేను. ‘ఎవరు’ సినిమా చూశాను. పాటలు, ఫైట్స్ లేవు. వరుస ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను థియేటర్లో కూర్చోబెట్టారు. ఇటీవల ఇలాంటి సినిమా తెలుగులో రాలేదు. ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసినందుకు హ్యాపీ. అడివి శేష్‌ని క్యారెక్టర్ ఆర్టిస్టు అనాలా? లేక హీరో అనాలా?.. డైరెక్టర్ రామ్‌జీ యాక్టర్ అనమంటున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’ ఇప్పుడు ‘ఎవరు’ వంటి సినిమాలతో శేష్ యాక్టర్‌గా ఎదుగుతున్నాడు. మా బ్యానర్లో సినిమా చేయమని అడిగాను. రెజీనా, నవీన్‌చంద్ర బాగా నటించారు. ‘నేను లోకల్’ సినిమా సమయంలో నవీన్‌చంద్రకు హీరోగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ట్రై చేయమని చెప్పాను. అతను బాగా చేస్తున్నారు. చాలామంది హీరోలకు ఇలా చెబితే ..‘రాజుగారి ఏంటీ ఇలా చెబుతారు.. హీరోగా చేయమని ఎంకరేజ్ చేయాలి కదా’ అనుకుంటారు. ఏళ్ల తరబడి హీరోలుగా చేసిన వారు కూడా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాల్సిందే. క్యారెక్టర్ ఆర్టిస్టు ఎప్పుడూ ఉంటాడు. నా మిత్రుడు పీవీపీ బ్యానర్లో మరో మంచి సినిమా వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘సినిమా విజయం సాధించడంతో మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నాను. చాలాకాలం తర్వాత హాయిగా ఎనిమిది గంటలు నిద్రపోయాను. ‘దిల్’ రాజుగారి ‘ఎవడు’ సినిమాలో మెయిన్ విలన్‌గా చేయడానికి అప్పట్లో ప్రయత్నించాను. కుదర్లేదు. బహుశా.. నేను అప్పటికీ ఆ స్థాయిలో లేనేమో. ఇప్పుడు ‘దిల్’ రాజుగారు ‘ఎవరు’ సినిమా చూసి అభినందించడం మరిచిపోలేను. సినిమా చూసి మా బ్యానర్లో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్? అన్నారు. హ్యాపీ ఫీలయ్యాను. కలెక్షన్స్ గురించి మాట్లాడను. కానీ ‘గూఢచారి’ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పగలను’’ అన్నారు అడివి శేష్.‘‘‘అరవిందసమేత..’లో చేసిన బాల్ రెడ్డి పాత్రలానే ‘ఎవరు’లో నేను చేసిన అశోక్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. హీరోగానే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ట్రై చేయమన్న ‘దిల్’ రాజుగారి సలహాను పాటిస్తూనే ఉంటాను’’ అన్నారు నవీన్‌చంద్ర. ‘‘ఇది సమిష్టి విజయం’’ అన్నారు వెంకట్ రామ్‌జీ. ‘‘సక్సెస్‌ను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అన్నారు మురళీ శర్మ. ‘‘ఈ సినిమాకు, నేను చేసిన సమీర పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సింగిల్ స్క్రీన్‌కి వెళ్లి చూశాం. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలోని ట్విస్ట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చూడబోయేవారి ఆసక్తిని తగ్గించవద్దు. వారు కూడా సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయాలి’’ అన్నారు రెజీనా. -
కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం
‘‘ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు మాకు అద్భుతమైన ప్రయాణం దొరికినందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి మేము తీసుకున్న దానికి, మాకు లభించిన అనుభవాన్ని పంచాలనుకుంటున్నాం. ఇందుకోసం కొంతమంది నిర్మాతలతో మా వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) అసోసియేట్ అవుతోంది. స్క్రిప్ట్ నుంచి రిలీజ్ డేట్ వరకు ఆయా చిత్రనిర్మాతలకు మా సంస్థ నుంచి మద్దతు ఇస్తాం. మా సంస్థ ద్వారా ఎంతోమంది నిర్మాతలకు, రాబోయే నిర్మాతలకు ఉపయోగపడాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాం’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. పంపిణీరంగం నుంచి నిర్మాతగా మారి, ఎన్నో విజయాలు చూస్తున్నారు ‘దిల్’ రాజు. ఎస్వీసీ సంస్థ 20ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘1999లో ‘ఒకే ఒక్కడు’ సినిమాతో మా వెంకటేశ్వర ఫిల్మ్స్ మొదలైంది. ఈ సినిమాకు ముందు (1998 జూలై 24) ఇదే జూలై 24న ‘తొలిప్రేమ’ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామ్యులుగా ఉన్నాం. పవన్‌కల్యాణ్‌గారిని స్టార్‌ని చేసిన సినిమా అది. ‘పెళ్లి పందిరి’ సినిమా సక్సెస్ మమ్మల్ని ఇక్కడివరకూ తీసుకువచ్చింది. ఈ రెండు సినిమాల నిర్మాతలకు థ్యాంక్స్. అలాగే మా డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన నిర్మాతలందరికీ ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈ పదహారేళ్లలో 32 సినిమాలు తీశాం. 2017లో ఆరు, గత ఏడాది మూడు సినిమాలు మా సంస్థ నుంచి వచ్చాయి. ఈ ఏడాది నాలుగు సినిమాల రిలీజ్లు ప్లాన్ చేస్తున్నాం. ఒక సినిమా సక్సెస్ కావాలంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు కావాల్సినవి ఎన్నో ఉంటాయి. శివలెంక కృష్ణప్రసాద్‌గారు, విజయ్, సత్యనారాయణరెడ్డి, కృష్ణ, గోపీ, రాహుల్, హరి, సాగర్, రాహుల్ యాదవ్ నక్కా, విజయ్ చిల్లా, మహేశ్ కోనేరు, రాజీవ్.. ఇలా ఈ నిర్మాతలందరితో మాకు ఒక మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని తర్వాత స్థాయికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో మా సంస్థతో అసోసియేషన్ గురించి ఆలోచించాం. వారితో ట్రావెల్ అవుతూ మా సంస్థ నుంచి వస్తున్న మంచి సినిమాల మాదిరిగానే వారు కూడా మంచి సినిమాలు తీయడానికి మా వంతు కృషి చేస్తాం. వీరేకాదు, మంచి సినిమాలు చేయాలని మంచి స్క్రిప్ట్‌ను తీసుకువస్తే మా ఎస్వీసీని వాడుకుని తెలుగు ఇండస్ట్రీకి మంచి సినిమాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాం.అలాగే డబ్బు సంపాదిస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. హారిక హాసిని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కూడా ఈ సందర్భంగా «థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘రాజుగారితో నాకు 18ఏళ్ల పరిచయం ఉంది. సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీవైపు వచ్చారు రాజు, శిరీష్, లక్ష్మణ్. ‘ఎస్వీసీ’ సక్సెస్ఫుల్ జర్నీలో నా వంతుగా నాలుగు సినిమాలు ఉండటం హ్యాపీగా ఉంది. ఎస్వీసీని నా మాతృసంస్థగా భావిస్తాను. రైటర్‌గా నాకు జన్మనిచ్చారు. ఈ సంస్థ సపోర్ట్‌తో నాలాంటి దర్శకులు చాలామంది స్థిరపడే అవకాశం ఉంది’’ అన్నారు దర్శకుడు వంశీపైడిపల్లి. ‘‘ఎస్వీసీ’ జర్నీలో నాది 2015–2019 టైమ్. ‘దిల్’ రాజుగారి జడ్జిమెంట్, లక్ష్మణ్ ప్లానింగ్, శిరీష్ ఎగ్జిక్యూషనే ఈ సంస్థ సక్సెస్‌కు కారణమనిపిస్తోంది. ఎస్వీసీ అంటే సక్సెస్ వీళ్ల కేరాఫ్ అడ్రస్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఇండస్ట్రీలో అన్నింటినీ అన్ని రకాలుగా చూసినవాడే నిర్మాత. ఈ ముగ్గురూ ఇంత దూరం వచ్చారు. వీరితో అసోసియేట్ అవ్వడం హ్యాపీ’’ అన్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ‘‘ఇలాంటి పెద్దబ్యానర్లో అసోసియేట్ అయితే చిన్న సినిమాలు మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతాయి’’ అన్నారు నిర్మాత రాహుల్ యాదవ్. ‘‘నిర్మాత అంటే ప్రతిరోజూ యుద్ధమే. 20ఏళ్లలో దాదాపు 95 శాతం విజయాలతో ఈ సంస్థ టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా నిలబడింది’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. ‘‘ఆర్య’ సినిమా సమయంలో నేను, బన్నీవాసు, యూవీ క్రియేషన్స్ ఈ బ్యానర్‌తో అసోసియేట్ అయ్యాం. ఈ రోజు మేమంతా నిర్మాతలుగా మారాం’’ అన్నారు విజయ్ చిల్లా. ‘‘సినిమా చూపిస్తా మామా’ చిత్రం నుంచి ఈ సంస్థతో అసోసియేట్ అయ్యాను’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. లక్ష్మణ్, శిరీష్, సాగర్, కృష్ణ, గోపీ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎక్స్100లా పెద్ద హిట్ కావాలి
‘‘కమల్ హాసన్‌గారి ‘గుణ’, బాలకృష్ణగారి ‘ఆదిత్య 369’ సినిమాల టైటిల్స్‌లో సగం సగం కలిపి చక్కగా కథకు తగ్గట్టు ‘గుణ 369’ టైటిల్ కుదిరింది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, అనఘ జంటగా నటించిన చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అనిల్ కడియాల, తిరుమల రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలోని తొలిపాట ‘తొలి పరిచయమా.. తొలి పరవశమా ఇది’ ను నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘తొలి పరిచయమా...’ ఫీల్ గుడ్ సాంగ్లా ఉంది. ఈ సినిమా ‘ఆర్ఎక్స్ 100’లా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఇదేదో వండి వార్చిన కథ కాదు. నిజంగా జరిగిన కథ. రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇంతకు ముందు సిల్వర్‌స్క్రీన్ మీద ఇలాంటి కథ రాలేదు’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘గోల్డెన్ హ్యాండ్ ‘దిల్’ రాజుగారితో బోణీ కొట్టినందుకు మా ఆల్బమ్‌కు తిరుగుండదని నమ్మకంగా ఉన్నాం. భరద్వాజ్ కంపోజిషన్, విశ్వనాథ్ సాహిత్యం, హరిహరన్‌గారి గాత్రం సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్య కిశోర్, శివ మల్లాల.