‘‘మహర్షి’ సినిమా కమర్షియల్‌గా నాన్ ‘బాహుబలి’ రికార్డులతో తెలుగు ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్‌గా నిలుస్తుందని అనుకుంటున్నా. ఈ సమ్మర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ఈ చిత్రం నిలుస్తుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. మహేశ్‌బాబు, పూజాహెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మించిన ఈ సినిమా గురు వారం విడుదలైంది.
శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘నేను ముందుగా ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగానే మొదటిరోజు అన్ని సెంటర్స్‌లో మహేశ్‌బాబు కెరీర్‌లోనే హయ్యెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేశ్ అభిమానులకు ధన్యవాదాలు. శుక్రవారం సెలవు కాకున్నా నెల్లూరులో ఉదయం 9 థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. మహేశ్ కెరీర్‌కు ‘మహర్షి’ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. గురువారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 24కోట్ల 61 లక్షల రూపాయల షేర్‌ను సొంతం చేసుకుంది’’ అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ‘‘ఇదొక హార్ట్ హిట్టింగ్ ఫిల్మ్. ఈ విజయం నా రాబోయే చిత్రాలకు మంచి ఎనర్జీ ఇచ్చింది. నాకు ఫస్ట్‌టైమ్ డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసి అభినందిస్తున్నారు. మహేష్ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు, ఫ్యా¯Œ ్స నిజం చేశారు. ఇండస్ట్రీ నుండి ఎన్నో కాల్స్ వస్తున్నాయి. మోస్ట్ స్పెషల్ కాల్ చిరంజీవిగారిది. ఆయన ఫోన్ చేయడంతో ఎవరండీ అన్నాను. ‘నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను’ అనగానే గూస్ బమ్స్ వచ్చాయి. మే 9న చిరంజీవిగారి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా రిలీజైన రోజు నుంచి నాకు సినిమాలపై ప్యాష¯Œ మొదలైంది.
అదేరోజున ‘మహర్షి’ రిలీజ్ అవడం, అశ్వనీదత్‌గారు కూడా ఈ సినిమాతో అసోసియేట్ అవడం మర్చిపోలేనిది. ఇది నా జీవితంలో ఓ మెమొరబుల్ మూమెంట్. వినాయక్‌గారి ‘ఆది’ సినిమా చూసి సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. అలా నా కెరీర్‌లో ఒక ఇంపార్టెంట్ పర్స¯Œ అయిన వినాయక్‌గారు ఫోన్ చేసి అభినందించడం కూడా ఒక హైపాయింట్’’ అన్నారు. ‘‘మహర్షి’ సినిమాని సక్సెస్ చేసిన తెలుగు ఆడియ¯Œ ్సకి ధన్యవాదాలు. మహేష్‌గారి ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌లో నేను కూడా భాగమైనందుకు హ్యాపీగా ఉంది. ‘పాలపిట్ట..’ సాంగ్‌కి స్క్రీన్ కనపడకుండా పేపర్స్ వేయడం చాలా థ్రిల్లింగ్‌గా అన్పించింది’’ అన్నారు పూజాహెగ్డే.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ మహేష్‌గారు కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో పాటు సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చేయడం చాలా గ్రేట్. మహేష్‌గారి 25వ సినిమా ‘మహర్షి’, ఎన్టీఆర్‌గారి 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’, సూర్య 25వ సినిమా ‘సింగం’ చిరంజీవిగారి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఇలా.. అందరి ల్యాండ్ మార్క్ ఫిలింస్‌లో భాగమవ్వటం గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment