
షాలినీ పాండే
ప్రేమికులిద్దరిదీ ఒకటే లోకం. అందులో ఒకరు రాజ్ తరుణ్. మరి రాజ్ తరుణ్ ప్రేమ లోకంలో ఉన్నది ఎవరు? అనే విషయంపై క్లారిటీ దొరికింది. రాజ్‌తరుణ్ హీరోగా జి.ఆర్. కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండేను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే రాజ్ తరుణ్, షాలినీ తొలిసారి జోడీ కట్టినట్లే. ఈ సినిమాకు మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకులుగా పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment