Shalini Pandey
-
‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ రివ్యూ
బాలీవుడ్ వెబ్ సిరీస్‌లకి ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లపై ప్రేక్షకుల ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లే వస్తున్నాయి. అలా తాజాగా నెటిఫ్లిక్స్‌లో రిలీజైన మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే ‘డబ్బా కార్టెల్’(Dabba Cartel Review). షబానా అజ్మీ, జ్యోతిక, షాలినీ పాండే, నిమిషా సజియన్, అంజలి ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది.ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. షీలా(షబానా ఆజ్మీ) కోడలు రాజీ(షాలినీ పాండే)‘లంచ్ బాక్స్’ పేరిట వ్యాపారం చేస్తుంటుంది. ఈ బిజినెస్‌లో మరో ఇద్దరు మహిళలు మాల(నిమిషా సజయన్), షాహిదా(అంజలి ఆనంద్) కూడా భాగస్వామ్యం అవుతారు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన మాల..తప్పనిసరి పరిస్థితుల్లో లంచ్ బాక్స్‌లో ఆహారంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసేందుకు అంగీకరిస్తుంది. ఈ విషయం రాజీకి తెలియగానే..మొదట నో చెప్పినా.. తర్వాత ఆమె కూడా గంజాయి సరఫరాకు ఓకే చెబుతుంది. కొన్నాళ్ల తర్వాత ఈ గంజాయి బిజినెస్ ఆపేద్దామని అనుకుంటారు. ఆ లోపే డ్రగ్స్ విక్రయించాలని వీరిపై ఒత్తిడి వస్తుంది. లంచ్ బాక్స్ మాత్రమే అందజేసే ఈ మహిళలు.. గంజాయి, డ్రగ్స్ సరఫరా ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజీ చేస్తున్న స్మగ్లింగ్ గురించి అత్తయ్య షీలాకు తెలిసినా.. ఆమె ఎందుకు వారికి సపోర్ట్ చేసింది? చివరకు ఈ మహిళలు ఆ వ్యాపారాన్ని మానేశారా లేదా? వివా ఫార్మా కంపెనీ తయారు చేసిన ఓ మెడిసిన్ ప్రమాదకరమని ప్రపంచానికి చెప్పాలన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ పాఠక్ (గజరాజ్ రావ్) ప్రయత్నం ఫలించిందా? ఫార్మా కంపెనీ ఉద్యోగి శంకర్(జిషు సేన్గుప్త) సతీమణి వరుణ(జ్యోతిక)తో రాజీ గ్యాంగ్‌కు ఉన్న సంబంధం ఏంటి? రాజీ గ్యాంగ్‌తో కలిసి ఎందుకు పని చేసింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ‘డబ్బా కార్టెల్’ చూడాల్సిందే.కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేస్తుంటారు.ఒకసారి చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేయాల్సి వస్తుంది. అలా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేసిన ఐదుగురు మహిళల కథే ‘డబ్బా కార్టెల్’. తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి చిక్కుల్లో పడతారనేది రాజీ, మాల పాత్రల ద్వార చక్కగా చూపించాడు దర్శకుడు హితేశ్ భాటియా. భార్యభర్తలు ఒకరి చేసే పని గురించి మరొకరికి పూర్తిగా తెలియాలి. భర్తకు తెలియకుండా భార్య..భార్యకు తెలియకుండా భర్త డబ్బు కోసం ప్రమాదకర పనులు చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సిరీస్ ద్వారా చూపించారు. అలాగే ఫార్మా కంపెనీలో ఎలాంటి లొసుగులు ఉంటాయో కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కోటి దాదాపు ముప్పావు గంట వరకు ఉంటుంది.తొలి ఎపిసోడ్ కేవలం పాత్రల పరిచయానికే సరిపోయింది. రెండు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. సంతోష్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి.. డ్రగ్స్, గంజాయి అమ్మించడం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో రాజీ గ్యాంగ్ చేస్తున్న ఈ స్మగ్లింగ్ బిజినెస్ గురించి అత్తయ్య షీలాకి తెలిసిన తర్వాత కథనం మరింత ఉత్కంఠంగా సాగుతుంది.దర్శకుడు ఈ కథను వినోదభరితంగా నడిపించడంతో పూర్తిగా సఫలం కాలేదు. ఐదు ప్రధాన పాత్రలను ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ట్విస్టులు కూడా ఊహకందేలా ఉంటాయి.డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పాత్రని ఇంకాస్త బలంగా చూపించాల్సింది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుటుంది. సీజన్ 2కి స్కోప్ ఇస్తూ ఈ సిరీస్‌ని ముగించారు. నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గా సిరీస్ పర్వాలేదు. అసభ్యకర సన్నివేశాలు తక్కువే ఉన్నా..బూతు డైలాగులు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీలో కలిసి చూడడం కాస్త కష్టమే. ఓపిగ్గా చూద్దాంలే అనుకునే క్రైమ్ థ్రిల్లర్స్ లవర్స్‌ని ఈ సిరీస్ మెప్పిస్తుంది. -
రెడ్ శారీలో యాంకర్ రష్మీ.. పెళ్లి వీడియోను షేర్ చేసిన బుల్లితెర నటి!
రెడ్ శారీలో యాంకర్ రష్మీ గౌతమ్ హోయలు..సైకిల్‌పై సవారీ చేస్తోన్న నమ్రతా శిరోద్కర్...బ్లాక్ డ్రెస్‌లో ఐశ్వర్య లక్ష్మి స్టన్నింగ్ లుక్స్..పెళ్లి వీడియోను షేర్ చేసిన బుల్లితెర నటి మాన్సి జోషి..పింక్ డ్రెస్‌లో షాలిని పాండే పోజులు.. View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
ఇడ్లీ కొట్టులో ఏం జరిగింది?
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ‘మా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాం. మీ మూలాలకు కట్టుబడి ఉండండి’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. ఇక ఈ సినిమాలో ధనుష్ యంగ్ లుక్‌లో కనిపిస్తుండటం ఆయన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. మరి... ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’లో ఏం జరిగింది? అనేది చూడాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
భక్తి మోడ్‌లో యాంకర్ అనసూయ.. రాకీభాయ్ తల్లి క్లాస్ లుక్
థాయ్ లాండ్లో ఏనుగులతో డింపుల్ హయాతిభద్రాచలం రాముడిని దర్శించుకున్న అనసూయఇటలీలో హనీమూన్‌లో ఉన్న హీరోయిన్ మేఘా ఆకాశ్చీరలో సంప్రదాయ బద్ధంగా 'కేజీఎఫ్' రాకీభాయ్ తల్లిఅందంతో మెరిసిపోతున్న దిశా పటానీ అక్క ఖుష్బూడివోషనల్ లుక్‌లో 'కమిటీ కుర్రోళ్లు' బ్యూటీ విషికసెల్ఫీ వీడియోతో కాక రేపుతున్న 'అర్జున్ రెడ్డి' షాలినీ View this post on Instagram A post shared by Dimplee Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Chitra Shukla Upadhyay (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) View this post on Instagram A post shared by Archana (@archanashastryofficial) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Kirthi♊️ (@vishika_14) View this post on Instagram A post shared by Aditi Balan (@officialaditibalan) View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Archana Jois (@jois_archie) -
Shalini Pandey: సింపుల్‌గా అర్జున్ రెడ్డి హీరోయిన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బాత్రూం పోజుల్లో షాలినీ పాండే.. నీడలో పాయల్ వయ్యారాలు!
బాడీ బెండు తీసేలా హీరోయిన్ పాయల్ రాజ్పుత్షూట్ గ్యాప్‌లో ఫన్నీగా ప్రవర్తిస్తున్న అనన్య నాగళ్లబాత్రూమ్ పోజుల్లో 'అర్జున్ రెడ్డి' బ్యూటీ షాలినీ పాండేవింటేజ్ హీరోయిన్లా రెడీ అయిపోయిన కృతిశెట్టిలంగా ఓణీలో వయ్యారంగా వితిక షేరు సోయగాలుమహారాష్ట్ర అడవుల్లో విహరిస్తున్న ఈషా రెబ్బాజీను ప్యాంటులో కారు పక్కన బిగ్ బాస్ వాసంతి View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Aditiii🔥Ravi (@aditi.ravi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
ఫ్రెండ్సిప్ డే రోజు సినీ తారలు పంచుకున్న ఫోటోలు
గ్రీన్ కలర్ చీరలో తలుక్కుమంటున్న మీనాక్షీ చౌదరిసింబా సినిమా ప్రమోషన్లో ట్రెండీగా మెరిసిన సీనియర్ నటి కస్తూరిగ్లామర్ ఫోటోలతో హీట్ పెంచుతున్న షాలిని పాండే View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Kasthuri Rasigan (@kasthurirasigan) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
విల్లులా ఒళ్లు వంచేసిన షాలినీ.. బిగ్‌బాస్ స్రవంతి గ్లామర్ ట్రీట్!
గులాబీ పెట్టుకున్న గులాబీలో కీర్తి సురేశ్గోల్డ్ కంటే బ్రైట్‌గా మెరిసిపోతున్న శ్రీలీలఒళ్లుని విల్లులా వంచేసి హోయలు పోతున్న షాలీనీ పాండేఅద్దాల డ్రస్సులో జిగేలుమనేలా హెబ్బా పటేల్అందాల కుందనపు బొమ్మలా యాంకర్ విష్ణుప్రియజడతో పరాచకాలు ఆడేస్తున్న శ్రుతిహాసన్చీరలో అందాలన్నీ చూపించేస్తున్న బిగ్‌బాస్ స్రవంతిAngel in Gold 💫 Our @sreeleela14 as showstopper, show openerThrowback to @TimesFashionWk @BangaloreTimes1 By @studiobhargavi #Sreeleela pic.twitter.com/9a6qaKvunH— Team Sreeleela (@Teamsreeleela) July 30, 2024 View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
కృతి శెట్టి స్టైలిష్.. షాలినీ పాండే బ్లాక్ బస్టర్.. అలియా కూల్ లుక్
పెళ్లి ఫోటోలు అభిమానులతో పంచుకున్న వరలక్ష్మీ శరత్కుమార్స్టన్నింగ్ ఫోజులు ఇచ్చిన షాలినీ పాండేమీలోని అంతర్గత బలాన్ని స్వీకరించాలని కోరుతున్న కృతి శెట్టియాడ్ షూట్ కోసం బ్లాక్ డ్రెస్‌లో దుమ్మురేపిన అనన్య నాగళ్ల'పసుపు' ఇష్టమైన రంగు అంటూ ఇలా వివరణ ఇచ్చిన రష్మిక 'సూర్యరశ్మి, సన్ ఫ్లవర్స్, చిరునవ్వులు, ఆనందం వంటి దయ, సంతోషకరమైన అన్ని విషయాలను పసుపు రంగు సూచిస్తుంది.' View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ruhii Siingh (@ruhisingh12) -
ఆ సీన్ చేసేటప్పుడు బయటకు పరిగెత్తా: అర్జున్ రెడ్డి హీరోయిన్
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ షాలిని పాండే. ఆ తర్వాత మహానటి, ఇద్దరి లోకం ఒకటే చిత్రాల్లోనూ మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న షాలిని.. ఇటీవల మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన మహారాజ్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రల్లో నటించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పాండే పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమాలోని ఇంటిమేట్ సీన్ గురించి మాట్లాడింది. ఈ చిత్రంలో కిషోరి పాత్రను పోషించిన నటి షాలిని పాండే లైంగికపరమైన సీన్లో కనిపించారు. ఆ సన్నివేశంలో తన అనుభవం గురించి వెల్లడించింది.ఆ సీన్ చేసేటప్పుడు ఆకస్మాత్తుగా బయటకు వెళ్లానని తెలిపింది. అయితే అది నాపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలియదు కానీ.. నాకు చీకటి గదిలో ఉండాలంటే భయమని షాలిని వెల్లడించింది. తనకు కొంత సమయం, ప్రశాంతమైన వాతావరణం కావాలని డైరెక్టర్‌ను అడిగానని వివరించింది. దీంతో వారు వెంటనే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారని షాలిని పేర్కొంది. కాగా.. సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన మహారాజ్లో జైదీప్ అహ్లావత్ స్త్రీలపై అత్యాచారం చేసే పాత్రలో కనిపిస్తాడు. 1800 కాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. -
క్రేజీ గెటప్‌లో 'ఆదిపురుష్' బ్యూటీ.. అలాంటి పోజులో శ్రియ
చాన్నాళ్ల తర్వాత ఇన్ స్టాలో కనిపించిన నివేతా గ్లామర్ సెగలు రేపుతున్న రంగం బ్యూటీ పియా బాజ్‌పాయి బ్లాక్ డ్రస్‌లో 'ఆదిపురుష్' కృతి సనన్ డిఫరెంట్ లుక్ వయ్యారమైన పోజుల్లో రాజశేఖర్ చిన్న కూతురు ఓరకంట చూస్తూ కవ్విస్తున్న హీరోయిన్ శ్రియ సోఫాపై కూర్చుని కిక్కిచ్చే పోజుల్లో శ్రియ బ్యాక్ చూపిస్తూ కవ్విస్తున్న 'అర్జున్ రెడ్డి' భామ చీరలో క్లాస్ లుక్ తో ఆకట్టుకున్న రాశీఖన్నా View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Pia Bajpiee (@piabajpai) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) -
నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్ సీన్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా తీసుకొచ్చిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఈ సినిమా విడుదలైన నిన్నటికి(ఆగస్ట్ 25)ఐదేళ్లు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సందీప్ వంగా ‘అర్జున్ రెడ్డి’నుంచి ఓ డిలీట్ సీన్‌ని విడుదల చేశారు. 2.53 నిమిషాలు ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీన్లో విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ మధ్య సంభాషణలను చూపించారు. ప్రీతి(షాలినీ పాండే) ఇంటికి వెళ్లిన అర్జున్ రెడ్డి... అక్కడ ఆమెను ముద్దు పెట్టుకోవడం.. అది చూసి ప్రీతి నాన్న గొడవపెట్టుకోవడంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. (చదవండి: రజనీకాంత్‌తో సినిమా.. రాజమౌళి స్టేట్మెంట్, ‘ఆర్ఆర్’కి చాన్స్ ఉందా?) ‘అమ్మ, నాన్న, నానమ్మ .. ఒక పది రోజుల తర్వాత వాళ్లను కలిస్తే.. నాకు హగ్ ఇచ్చి కిస్ పెట్టుకునేవాళ్లురా. ఆ రోజు ప్రీతికి ఇచ్చింది అలాంటి కిస్సే. వేరే ఉద్దేశంతో కాదు. దాన్ని ఆమె తండ్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు’అంటూ విజయ్ చెప్పే డైలాగ్‌తో ఆ వీడియో మొదలవుతుంది. ఈ డిలీట్ సీన్‌ని దర్శకుడు సందీప్ వంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘అర్జున్‌రెడ్డి’కి ఐదేళ్లు. ఈ సందర్భంగా ఈ సీన్‌ని షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రబృందానికి నా కృతజ్ఞతలు’అని రాసుకొచ్చాడు. ఆసక్తికరమైన ఈ డిలీటెడ్ సీన్‌పై ఓ లుక్కేయండి. 5 years for ARJUN REDDY 🙂 Very happy to share this scene 🙏 Thanks to the entire cast & crew🙏@TheDeverakonda #ShaliniPandey @eyrahul @VangaPranay @VangaPictures @rameemusic @Synccinema#5yearsforarjunreddy https://t.co/3qiQhM3YvW — Sandeep Reddy Vanga (@imvangasandeep) August 25, 2022 -
కథ డిమాండ్ చేస్తే నేను తగ్గడానికి రెడీ: షాలినీ పాండే
విజయ్ దేవరకొండను స్టార్‌ని చేసిన ‘అర్జున్ రెడ్డి’ని గుర్తుకు తెచ్చుకోండి. అదే సినిమాతో హీరోయిన్గా బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు షాలినీ పాండే. ఆ సినిమాలో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అందుకు ఉదాహరణ ఇక్కడున్న ఫొటో. హిందీ సినిమా ‘జయేష్ భాయ్ జోర్దార్’ కోసం ఇలా సన్నబడ్డారు షాలిని. ఈ సినిమాలో ఆమె డ్యాన్సర్‌గా చేశారు. ఈ పాత్రకు తగ్గట్టుగా బరువు తగ్గారు. ఈ విషయం గురించి షాలినీ పాండే మాట్లాడుతూ – ‘‘బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా మన శరీరాన్ని కష్టపెడతాం. కఠినమైన వర్కవుట్స్‌తో పాటు ఆహారం విషయంలోనూ చాలా నియమాలు పాటిస్తాం. అయినప్పటికీ కథ డిమాండ్ చేస్తే నేను తగ్గడానికి రెడీ.. పెరగడానికి కూడా రెడీయే. మనం ఎంత బాగా నటించినా, క్యారెక్టర్‌కి తగ్గట్టుగా శరీరాకృతి లేకపోతే చూడ్డానికి బాగుండదు. ‘జయేష్ భాయ్ జోర్దార్’ కోసం నేనెక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. వేరే వర్కవుట్స్, ప్రత్యేకమైన డైట్‌తో పాటు ఈ ప్రాక్టీస్ కూడా నేను సన్నబడ్డానికి హెల్ప్ అయింది’’ అన్నారు. ఇంకా అమ్మాయిల శరీరాకృతి గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారని చెబుతూ – ‘‘అమ్మాయిలంటే ఇలా ఉండాలనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అందుకని కొందరు అమ్మాయిలు ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే నా మటుకు నేను ఎలా ఉన్నా ఒత్తిడి ఫీల్ కాను. ఇప్పుడు తగ్గానంటే సినిమాలో క్యారెక్టర్ కోసమే. పాత్రకు తగ్గట్టు ఒదిగిపోగలిగినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు షాలిని. ఆ సంగతలా ఉంచితే చక్కనమ్మ చిక్కినా చక్కనే అన్నట్లుగా షాలినీ ఉన్నారు కదూ. -
తిట్టిన మల్లికా... సారీ చెప్పిన షాలిని పాండే
♦ ఫ్యామిలీ పిక్ షేర్ చేసిన పూజా హెగ్డే ♦ సారీ.. నా దృష్టిని ఏదో దారి మళ్లిస్తోందంటున్న షాలిని పాండే ♦ చీరకట్టులో బుట్టబొమ్మలా రెడీ అయిన అరియానా గ్లోరీ ♦ వెళ్లిపోవే అంటూ కోవిడ్‌ను తిట్టిపోస్తున్న మల్లికా శెరావత్ ♦ ఇంటి భోజనం అని లొట్టలు వేస్తున్న శ్రద్దా కపూర్ ♦ ఏదో ఆలోచిస్తున్న లావణ్య త్రిపాఠి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shalini (@shalzp) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Swathi deekshith✨ (@swathideekshith) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Aarti Singh (@aartisinghhhh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
సోషల్ హల్చల్: ఫ్రీ అంటున్న మౌనీ, పంచండంటోన్న కృతీ
♦ కారు ముందు ఫొటోకు పోజిచ్చిన హిందీ నటి మధుమిత సర్కార్ ♦ నా టీ షర్ట్ మీకో మాట చెప్తోందంటున్న శ్రద్ధా దాస్ ♦ ఏంటి? అలా చూస్తున్నారంటూ ఓ లుక్కిస్తోన్న షాలిని పాండే ♦ నన్నస్సలు డామినేట్ చేయలేరంటున్న మంచు లక్ష్మీ ప్రసన్న ♦ కరోనాను కాదు, సంతోషాన్ని పంచండంటోన్న కృతీ శెట్టి ♦ బ్లాక్ డ్రెస్‌లో కుర్రాళ్ల మతి పోగొడుతున్న కృతి కర్బందా ♦ పొట్టి గౌనులో మరిన్ని ఫొటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్ ♦ మాస్కుకు ముందు, తర్వాత అంటూ ఫొటోలు పంచుకున్న సొనాలీ బింద్రె ♦ బీ ఫ్రీ అంటూ వీడియో షేర్ చేసిన మౌనీ రాయ్ View this post on Instagram A post shared by Madhumita Sarcar (@madhumita_sarcar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shalini (@shalzp) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) -
ఆమిర్ తనయుడితో జోడీ
‘అర్జున్ రెడ్డి’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు షాలినీ పాండే. హిందీ ఆడియన్స్‌నూ పలకరించడానికి రెడీ అయ్యారామె. రణ్వీర్ సింగ్‌తో ‘జయేష్ భాయ్ జోర్దార్’ సినిమాలో నటించారామె. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా రెండో హిందీ సినిమా కూడా అంగీకరించారని తెలిసింది. అది కూడా ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన అని సమాచారం. జునైద్ హీరోగా పరిచయం కానున్న సినిమాకి రంగం సిద్ధమైంది. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో షాలినీ హీరోయిన్గా నటించనున్నారట. యశ్ రాజ్ సంస్థ ఈ సినిమా నిర్మించనుంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రారంభం కానుంది. -
నిశ్శబ్దం ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది
అనుష్క, మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలినీ పాండే ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా చిత్రదర్శకుడు హేమంత్ మధుకర్ మీడియాతో చెప్పిన విశేషాలు. ► కమల్‌హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ సినిమాలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రయోగాత్మక సినిమాగా చేద్దామనుకుని కోన వెంకట్‌గారికి ఈ కథ చెప్పాను. కోనగారికి కథ నచ్చటంతో ఆయన ద్వారా అనుష్కగారికి, మిగతా నటీనటులకు ఈ కథ చెప్పి, ఒప్పించాను. ప్రయోగాత్మక చిత్రం అంటే నిర్మాతలు ముందుకు రారేమోనని కోన వెంకట్‌గారి సలహా మేరకు మూకీ సినిమాని కాస్తా డైలాగ్స్‌తో నింపి మెయిన్ పాత్ర అనుష్క క్యారెక్టర్‌ను మాత్రం మూకీగా ఉంచాను. అప్పుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై సినిమాను నిర్మించటానికి ముందుకు వచ్చారు. ఆయనతో పాటు కోన ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మాణ భాగస్వామిగా చేరటంతో మా ‘నిశ్శబ్దం’ తెరకెక్కింది. ► విజువల్‌గా గ్రాండ్‌గా కనిపించటంతో పాటు ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ రావటం కోసం, కథానుగుణంగా సినిమాను అమెరికాలో చిత్రీకరించాం. అమెరికాలో పుట్టిన ఇండియన్ అమ్మాయి పాత్ర అనుష్కది. అలాగే అన్ని ముఖ్యపాత్రలు అమెరికా నేపథ్యంలో ఉంటాయి. ఒరిజినాలిటీ మిస్ కాకూడదనే ఉద్దేశంతో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ను పూర్తి నిడివి ఉన్న పాత్రకోసం తీసుకున్నాం. ఒక హాలీవుడ్ నటుడు పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’ అని అనుకుంటున్నాను. ► ఈ సినిమాను కేవలం 55రోజుల్లో తీయగలిగానంటే దానికి కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలే. అమెరికాలో షూటింగ్ అంటే వీసాలు, లొకేషన్లు అని ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను చెప్పిన కథను నమ్మి టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గార్లు ఏ లోటు లేకుండా చేయటం వల్లే ఈ సినిమా సాధ్యమయింది. ఈ సినిమాలోని సౌండ్, షానిల్ డియో కెమెరా వర్క్ గురించి సినిమా చూసిన తర్వాత అందరూ మాట్లాడతారని నమ్ముతున్నాను. సంగీత దర్శకుడు గిరీష్, గోపీసుందర్ నేపథ్య సంగీతం పోటాపోటీగా ఉంటాయి. -
వేసవిలో నిశ్శబ్దం
‘నిశ్శబ్దం’ చిత్రం కొత్త విడుదల తేదీ ఖారరైంది. అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య తారాగణంగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమాను జనవరి 31న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్లు శనివారం చిత్ర బృందం ప్రకటించింది. -
బై బై జయేష్
పాత్ర ఎలాంటిదైనా అందులోకి సులువుగా ఒదిగిపోగలరు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. తన లేటెస్ట్ చిత్రం ‘జయేష్‌భాయ్ జోర్దార్’ కోసం తుంటరి గుజరాతీ కుర్రాడిలా మారారు. తాజాగా ఆ పాత్రకు బై బై చెప్పారు. నూతన దర్శకుడు దివ్యాంగ్ తక్కర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జయేష్‌భాయ్ జోర్దార్’. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై మనీష్ శర్మ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే బాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ‘‘జయేష్ భాయ్ బై బై’’ అన్నారు రణ్వీర్. -
తేదీ కుదిరింది
అనుష్క నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ ఈ నెల 31న విడుదల కావాలి. కానీ సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్‌ను నిర్ణయించారని సమాచారం. అనుష్క, మాధ వన్, అంజలి, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిశ్శబ్దం’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్, హాలీవుడ్ క్రాస్ ఓవర్ (రెండు ప్రాంతాల నటీనటులు కలసి నటించడం) చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
‘ఇద్దరి లోకం ఒకటే’ మూవీ రివ్యూ
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే జానర్: లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా నటీనటులు: రాజ్ తరుణ్, షాలినీ పాండే, మాస్టర్ భరత్, నాజర్, సిరివెన్నెల రాజా, సిరి, సంగీతం: మిక్కీ జే మేయర్ దర్శకత్వం: జీఆర్ కృష్ణ(జి. కృష్ణారెడ్డి) నిర్మాత: దిల్ రాజు బ్యానర్: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ గత కొంతకాలంగా సక్సెస్ లేక యంగ్ హీరో రాజ్ తరుణ్ వెనకబడిపోయాడు. కెరీర్ ఆరంభంలో ఒకటి రెండు విజయాలను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో అదే జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు. అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ విజయాలు మాత్రం అతడి దరిచేరడంలో లేదు. దీంతో సినిమాలకు చిన్న విరామం తర్వాత ఓ విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో ‘ఆడు మగాడ్రా బుజ్జి’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జీఆర్ కృష్ణ డైరెక్షన్లో రాజ్‌తరుణ్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ ఏడాది దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఎఫ్2, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వస్తుండటంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. క్రిస్మస్ కానుకగా బుధవారం ప్రేక్షకుల మది తట్టిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది?. ఈ చిత్రంతో దిల్ రాజు ఈ ఏడాది హ్యాట్రిక్ సాధించాడా? రాజ్ తరుణ్ సక్సెస్ బాట పట్టాడా? అనేది రివ్యూలో చూద్దాం. కథ: మహి (రాజ్‌తరుణ్) ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. తాతా (నాజర్) కోరిక మేరకు వర్ష (షాలినీ పాండే) సినిమాల్లో హీరోయిన్గా నటించాలనే లక్ష్యంతో ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ దశలో మహితో వర్షకు పరిచయం ఏర్పడుతుంది. అయితే వీరిద్దరి పరిచయం ఇప్పడిది కాదని చిన్ననాటిదని తెలుసుకుంటారు. అంతేకాకుండా మహి ప్రోద్బలంతో వర్ష హీరోయిన్ అవుతుంది. అంతేకాకుండా చిన్నతనం నుంచే ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమలో పడతారు. అయితే అప్పటికే రాహుల్(రాజు సిరివెన్నెల) అనే వ్యక్తితో పెళ్లికి రెడీ అయిన వర్ష, మహితో ప్రేమపై ఎటూ తెల్చుకోలేకపోతుంది. మరోవైపు మహి తీవ్ర గుండెజబ్బుతో భాదపడుతున్న విషయం కూడా తెలుస్తోంది. చివరకి వర్ష, మహిలు ఒక్కటయ్యారా? చిన్న తనం నుంచి వీరి ప్రేమ ప్రయాణంలో ఎదురైన సమస్యలేంటివి? వీరిద్దరి లోకం ఒకటే ఎలా అయింది? అనేదే మిగతా కథ. నటీనటులు: యాజ్ యూజ్‌వల్‌గా రాజ్ తరుణ్ తన నటనతో మెప్పించాడు. కథకు అనుగుణంగా సెటిల్డ్ ఫర్ఫామెన్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా అర్జున్ రెడ్డి తర్వాత హీరోయిన్ షాలినీ పాండే సూపర్బ్ నటనతో ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అలరించింది. షాలిని తల్లి పాత్రలో కనిపించిన రోహిణి మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రాజు సిరివెన్నెల, మాస్టర్ భరత్, సిరి, తదితర నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: ప్రేమ కథలు ఎప్పుడూ బాగుంటాయి. అయితే ఆ కథలను దృశ్యరూపంలో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడమనేది దర్శకుడి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో డైరెక్టర్ జీఆర్ కృష్ణ నూటికి నూరు మార్కులు సాధించారు. తను అనుకున్న కథను ఎక్కడా డీవీయేట్ కాకుండా, అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా సినిమాను చాల చక్కగా ప్రజెంట్ చేశాడు. ప్రతీ సన్నివేశాన్ని సుదీర్ఘంగా, క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా హీరోహీరోయిన్ల ఫ్లాష్‌బ్యాక్ సీన్లతో ప్రేక్షకుల్ని కూడా ఆ కాలంలోకి తీసుకెళతాడు దర్శకుడు. అంతేకాకుండా ఎవరూ ఊహించని క్లైమాక్స్‌ను చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఇక సినిమాకు సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఊటీ అందచందాలతో పాటు, హీరోహీరోయిన్స్ల మధ్య ఎమోషన్ సీన్స్ తెరపై అందంగా కనిపించేలా చేశారు. అంతేకాకుండా కెమెరామెన్ తన పనితనంతో సినిమాకు రిచ్ లుక్‌ను తీసుకొస్తాడు. ఇక లవ్ స్టోరీలకు ప్రధానంగా కావాల్సింది సంగీతం. ఫ్రెష్ లవ్ సాంగ్స్‌ను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే ఈ విషయంలో మిక్కీజెమేయర్ కాస్త తడపడినట్లు అనిపిస్తోంది. రోటీన్ పాటలతో కాస్త ఇబ్బంది పెట్టాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంత కొత్తగా ఏమనిపించలేదు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిఉండేది. నిర్మాణవిలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ రాజ్ తరుణ్, షాలినీ పాండేల నటన హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ఎడిటింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్ డెస్క్ -
చిక్కుల్లో షాలినీ పాండే.. నిర్మాత ఫిర్యాదు
సాక్షి, చెన్నై: ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే చిక్కుల్లో పడ్డారు. ఆమెపై తమిళ నిర్మాత ఒకరు ఫిర్యాదు చేశారు. అమ్మ క్రియేషన్ పతాకంపై తెరకెక్కిస్తున్న ‘అగ్ని సిరగుగల్’ చిత్రాన్ని నిర్మాత శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అరుణ్ విజయ్, విజయ్ ఆంటోని, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 29శాతం పూర్తయింది. మిగతా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ క్రమంలో హీరోయిన్ షాలినీకి రణ్‌బీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ భారీ అవకాశం రావడంతో షాలినీ పాండే యూటర్న్ తీసుకున్నారని, ఇక నుంచి దక్షిణాది సినిమాల్లో నటించలేదని ఆమె తేల్చిచెప్పారని నిర్మాత శివ వాపోతున్నారు. ఆమె అకస్మాత్తు నిర్ణయం వల్ల తాము తీవ్రస్థాయిలో నష్టపోయామని, ఎన్నిసార్లు పిలిచినా ఆమె షూటింగ్స్ రావడం లేదని, ఆకస్మికంగా సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని శివ నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్, నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. తెలుగు, హిందీ చిత్రపరిశ్రమలకు చెందిన నిర్మాతల మండలిలోనూ, ఆర్టిస్టుల సంఘాల్లోనూ ఫిర్యాదు చేయనున్నట్టు శివ తెలిపారు. షాలినీ పాండేపై చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోవాలని నిర్మాత శివ భావిస్తున్నారు. -
రెండేళ్ల ప్రయాణం ఇద్దరిలోకం ఒకటే
‘రెండేళ్ల ప్రయాణమే ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా. కృష్ణ చెప్పిన ఐడియా నచ్చింది. ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకున్నాం కానీ కుదర్లేదు. ఆ తర్వాత రాజ్ తరుణ్‌తో ప్రాజెక్ట్ ఓకే అయింది’’ అన్నారు ‘దిల్’ రాజు. జీఆర్.కృష్ణ దర్శకత్వంలో రాజ్‌తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మిక్కి జె.మేయర్, సమీర్ రెడ్డి వంటి టాప్ టెక్నీషియ¯Œ ్స ఈ సినిమాకు పనిచేశారు. హీరోయిన్ విషయంలో ముగ్గురు, నలుగుర్ని అనుకున్నాం.. కానీ, శిరీష్ మాత్రం షాలినీ పేరును చెప్పి ఒప్పించాడు. రాజ్‌తరుణ్, షాలినీ పాండే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు ఎక్కలేదు.. ఆ విషయాన్ని డైరెక్టర్‌కి చెప్పాను. మళ్లీ మార్పులు చేర్పులు చేసి సినిమాను చూపించాడు. ఫైనల్ సినిమా చూసి డైరెక్టర్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఫస్టాఫ్ టైమ్‌పాస్‌లా ఉంటుంది. సెకండాఫ్ గుడ్. ముఖ్యంగా క్లైమాక్స్ వెరీగుడ్ అనిపిస్తుంది. నిజాయతీగా చేసిన చిత్రమిది. ఈ ఏడాది ‘ఎఫ్2, మహర్షి’ తర్వాత ఈ సినిమాతో సక్సెస్ కొడితే హ్యాట్రిక్ వచ్చేసినట్టే’’ అన్నారు. ‘‘ఇదో అందమైన ప్రేమకథ. సినిమా అందరికీ నచ్చుతుంది. థియేటర్లోనే సినిమా చూడండి.. పైరసీని ప్రోత్సహించొద్దు’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘పుట్టుక నుండి చివరి వరకు ఇద్దరి వ్యక్తుల జర్నీ ఈ సినిమా’’ అన్నారు దర్శకుడు జీఆర్ కృష్ణ. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
ఈ సినిమాతో హ్యాట్రిక్ షురూ
‘‘లైఫ్ ప్రతివాడికి ఒక మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్ ఇస్తుందట.. ‘ఇద్దరిలోకం ఒకటే’ ట్రైలర్‌లోని డైలాగ్ ఇది. రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.ఆర్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ మధ్యకాలంలో నేను నా జర్నీల్లో ఈ సినిమాలోని పాటలనే వింటున్నాను. మిక్కీ జె.మేయర్ అద్భుతమైన మెలోడీలు ఇచ్చారు. అబ్బూరి రవితో నేను ‘బొమ్మరిల్లు’ చిత్రం నుండి జర్నీ చేస్తున్నాను. ఈ చిత్రానికి కూడా మంచి డైలాగ్‌లు అందించారు. ఈ ఏడాది మా బేనర్లో ‘ఎఫ్–2’, ‘మహర్షి’ చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్ కొట్టాం. ‘ఇద్దరిలోకం ఒకటే’తో హ్యాట్రిక్ సాధిస్తాం’’ అన్నారు. ‘‘చివరి 30 నిమిషాల సినిమాను ప్రేక్షకులు మరచిపోలేరు. హృదయాలతో చూసే ప్యూర్ లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘హృదయాలను కదిలించే ఫీల్‌గుడ్ మూవీ ఇది’’ అన్నారు రాజ్‌తరుణ్. ‘‘అభినందన’, నీరాజనం’ చిత్రాలను ఈ సినిమా గుర్తు చేస్తుంది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. -
నా లక్కీ డేట్‌కే వస్తున్నా
‘‘సాధారణంగా నేను చాలా హైపర్. కానీ ‘ఇద్దరిలోకం ఒకటే’ సినిమాలో నా పాత్ర ఎక్కువగా మాట్లాడదు. నేను మాట్లాడే యాస కూడా ఉండదు.. సాధారణంగా మాట్లాడతాను. నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అని రాజ్‌తరుణ్ అన్నారు. జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరిలోకం ఒకటే’. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. రాజ్ తరుణ్ పంచుకున్న విశేషాలు... ► ఓ టర్కీ సినిమా చూడమని జీఆర్ కృష్ణ చెబితే చూశాను. ఆ కథను మన నేటివిటీకి తగట్టు మార్చి చెప్పారు.. నాకు చాలా నచ్చింది. నేటివిటీ మార్చే ప్రయత్నంలో కొందరు కథను సరిగ్గా తయారు చేసుకోరు. కృష్ణ మాత్రం కథను బాగా తయారు చేసుకున్నారు. ► ఈ మధ్య కాలంలో నా సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ‘లవర్’ సినిమా తర్వాత కొంత బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. దానికి చాలా కారణాలున్నాయి. తిరుపతి వెళ్లి జుత్తు ఇచ్చి వచ్చాను. ఈ బ్రేక్‌లో నార్త్ ఇండియా మొత్తం ప్రయాణించాను. ఈ ప్రయాణంలో ఫ్రెష్ అవడమే కాకుండా రీచార్జ్ అయినట్టుంది. మానసికంగానూ చాలా రిలాక్స్డ్గా అనిపించింది. గతంలో కంటే ఇకపై ఇంకా ఎక్కువగా కథపై దృష్టిపెట్టి, కష్టపడదాం అనుకున్నాను. ► షాలినీతో పని చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. తన ఎనర్జీ లెవల్స్ సూపర్. ఏడవమంటే చాలు ఏడ్చేస్తుంది. చివరి అరగంట సినిమాకు చాలా కీలకం. అదే మా చిత్రానికి పెద్ద ప్లస్ అవుతుంది. ‘ఉయ్యాల జంపాల’ విడుదల తేదీకే వస్తున్నాం. అది నా లక్కీ డేట్. ► బ్రేక్ వచ్చిందని వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేయలేదు. ప్రస్తుతం హిందీ ‘డ్రీమ్ గాళ్’ తెలుగు రీమేక్, ‘ఒరేయ్ బుజ్జిగా..’, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాను. ► సినిమాలు వైఫల్యం చెందడానికి చాలా కారణాలుంటాయి. ప్రత్యేకించి ఒకటని చెప్పలేం. ► ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. కానీ, దర్శకత్వం ఎప్పుడు చేస్తానో తెలియదు. ► 2022లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. -
జయేష్ భాయ్‌కి జోడీ
‘అర్జున్ రెడ్డి’తో తెలుగులోకి బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన షాలినీ పాండే, ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్లో పరిచయం కాబోతున్నారు. మరి... బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్‌లో సినిమా, అందులోనూ యూత్ క్రేజీ స్టార్ రణ్వీర్ సింగ్ సరసన అంటే క్రేజీ ప్రాజెక్టే కదా. దివ్యాంగ్ తక్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘‘ఈ అవకాశం ద్వారా నా టాలెంట్‌ను బాలీవుడ్‌లోనూ చూపిస్తాను. రణ్వీర్ సింగ్‌లాంటి సూపర్‌స్టార్‌తో కలసి నటించడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది’’ అన్నారు షాలినీ పాండే. గుజరాత్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక చిత్రంమిది. త్వరలో షూటింగ్ ఆరంభం కానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది. -
రణ్వీర్ సింగ్‌కు జోడీగా ‘అర్జున్‌రెడ్డి’ భామ
ముంబై : తన తొలి సినిమా ‘అర్జున్‌రెడ్డి’తో బోల్‌్డ నటిగా పేరు తెచ్చుకున్న షాలినీ పాండే బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. వరుస హిట్లతో జోరుమీదున్న స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా నటించే అవకాశం ఆమెకు దక్కింది. రణ్వీర్ను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ఫిల్మ్స్ షాలినీని కూడా హిందీ తెరకు పరిచయం చేయనుండటం విశేషం. ఈ విషయాన్ని యశ్‌రాజ్‌ఫిల్మ్స్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. దివ్యాంగ్ థక్కర్ దర్శకత్వంలో తాము నిర్మిస్తున్న జయేష్‌భాయ్ జోర్దార్ సినిమాలో షాలినీని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు పేర్కొంది. కాగా విజయ్ దేవరకొండ- షాలినీ పాండే జంటగా తెరకెక్కిన అర్జున్‌రెడ్డి సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సంచనాలతో పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ సినిమా హిందీలో కబీర్‌సింగ్‌గా రీమేక్ అయ్యింది. ఇక జయేష్ భాయ్ జోర్దార్ సినిమా విషయానికొస్తే.. మహిళలకు, పురుషులకు సమాన హక్కులు ఉండాలని భావించే ఓ మధ్యతరగతి వ్యక్తికి పితృస్వామ్య వ్యవస్థలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి రణ్వీర్ మాట్లాడుతూ... ‘ మనస్ఫూర్తిగా నవ్వాలంటే.. అందుకోసం ఒక్కోసారి నువ్వు చాలా నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈ సినిమాలో జయేశ్ భాయ్ హీరోలా కనిపించడు. తనొక సాధారణ వ్యక్తి. సున్నిత మనస్కుడు. పితృస్వామ్య వ్యవస్థ సిద్ధాంతాలు, ఆచారాలకు వ్యతిరేకంగా అందరికీ సమాన హక్కులు ఉండాలని భావిస్తుంటాడు. నటుడిగా నాకు ఈ పాత్ర ఒక సవాల్’ అని చెప్పుకొచ్చాడు. #ShaliniPandey is @RanveerOfficial's heroine in YRF’s #JayeshbhaiJordaar! #ManeeshSharma |#DivyangThakkar | @JJ_TheFilm pic.twitter.com/9t3KHwVxnY — Yash Raj Films (@yrf) December 11, 2019 -
హ్యాట్రిక్ హిట్‌తో 2020కి స్వాగతం చెబుతాం
‘‘2019లో ‘ఎఫ్2, మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్స్ సాధించాం. ఈ ఏడాది నాలుగైదు సినిమాలు ఉంటాయనుకున్నాం కానీ మూడు సినిమాలతోనే ముగిస్తున్నాం. మా మూడో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’ని ఈ నెల 25న విడుదల చేస్తున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ టర్కీ సినిమా చూసిన కృష్ణ ఈ ఐడియాను నాకు చెప్పాడు. మన నేటివిటీకి తగిన విధంగా కథను డెవలప్ చేశాం. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ. సినిమాల్లో ఒకప్పటితో పోలిస్తే చాలా మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం లిప్‌కిస్‌ల ట్రెండ్ నడుస్తోంది. మా సినిమాలో కూడా లిప్‌కిస్ ఉండటంతో సెన్సార్ వారు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. మేం అనుకున్నట్లు జరిగితే హ్యాట్రిక్ హిట్‌తో ఈ ఏడాదిని ముగిస్తాం. 2020 మాకు మంచి వెల్కమ్ అవుతుంది’’ అన్నారు. ‘‘పుట్టిన దగ్గరి నుంచి ఒకటయ్యేవరకు హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథ ఇది. మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేసి బయటకు వస్తారు ప్రేక్షకులు. ఈ సినిమాలో వైవిధ్యమైన రాజ్‌తరుణ్ కనపడతారు’’ అన్నారు జీఆర్ కృష్ణ. ‘‘నాకు కలిసొచ్చిన డేట్.. ‘ఉయ్యాల జంపాల’ విడుదలైన డిసెంబర్ 25న ఈ సినిమా విడుదలవుతోంది’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘పెద్ద సాంకేతిక నిపుణులు సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. -
నన్ను చాలెంజ్ చేసిన స్కిప్ట్ర్ నిశ్శబ్దం
‘‘కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు. ‘నిశ్శబ్దం’ కథ హేమంత్ రూపంలో నా దగ్గరకు వచ్చింది. కథలు మనల్ని కదిలిస్తే సినిమాలు అవుతాయి. అందరూ అనుకుంటున్నట్టు ఇది మూకీ సినిమా కాదు. సంభాషణలు ఉంటాయి’’ అన్నారు కోన వెంకట్. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ప్రారంభయ్యే ముందు అనుకోని సంఘటనలు జరిగాయి. ముందు అనుష్క కాకుండా వేరే హీరోయిన్ అనుకున్నాం. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అనుష్క ఫ్లైట్‌లో కలసినప్పుడు ఈ కథ విని సినిమా చేశారు. హేమంత్, నేను ఒక యజ్ఞంలా ఈ సినిమా చేశాం. సినిమాలో అందరూ పాత్రలే. హీరో, హీరోయిన్లు ఉండరు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించాం. మలయాళ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తాం. రచయితగా నన్ను చాలెంజ్ చేసిన స్కిప్ట్ర్ ‘నిశ్శబ్దం’. అనుష్క పాత్ర మాట్లాడలేదు కాబట్టి ‘నిశ్శబ్దం’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘హేమంత్ నాకు 15 ఏళ్లుగా స్నేహితుడు. ఈ కథను నేను కూడా ఫ్లైట్‌లోనే విన్నాను. ఇందులో చాలా డిఫరెంట్ రోల్ చేశాను’’ అన్నారు సుబ్బరాజు. ‘‘మంచి సినిమా. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘టెక్నాలజీ నా వృత్తి అయినా సినిమాలంటే ప్యాషన్. హాలీవుడ్ రేంజ్లో సినిమా చేయాలకునేవాణ్ణి. ఈ సినిమా హాలీవుడ్ స్టయిల్లో ఉంటుంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘టెక్నికల్‌గా ఇది కొత్త చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందనుకుంటున్నాను. విశ్వప్రసాద్‌గారి లాంటి నిర్మాత దొరకడం అదృష్టం’’ అన్నారు హేమంత్. -
రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే’
రాజ్ తరుణ్-శాలిని పాండే జంటగా, జీ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. విభిన్న ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే మిక్కి జే మేయర్ సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు సూపర్ హిట్ కాగా, తాజాగా విడుదలైన పోస్టర్స్ ఈ సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెంచుతున్నాయి. అంతే కాదు తక్కువ టైం లో అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్ తోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారని, భారీ బడ్జెట్ కన్నా కథలో కంటెంట్ ముఖ్యం అనేలా సినిమా రూపొందించారని.. సినిమాపై నమ్మకంతో దిల్ రాజు సినిమాను సొంతంగా రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు లాంటి బిగ్ ప్రొడ్యూసర్ సొంతంగా సినిమా రిలీజ్ చేస్తున్నారంటేనే అర్థం అవుతుంది.. సినిమా ఎంత బాగా వచ్చిందో. దీన్ని బట్టి రాజ్ తరుణ్ ఖాతాలో మరో హిట్ పడడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీగా వున్నారు. ఈ ప్రేమ కథ మంచి సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి మరి. -
సోనాలి... వాయిస్ ఆఫ్ సాక్షి
సాక్షి మాట్లాడలేరు. కేవలం సైగలతోనే స్పందిస్తారు. ఆ సైగల్ని సరిగ్గా అర్థం చేసుకోగల అమ్మాయి ఒకరున్నారు. ఆమే సోనాలి. సాక్షి గొంతు. ఆ సోనాలి పాత్రను పోస్టర్ ద్వారా సోమవారం పరిచయం చేసింది చిత్రబృందం. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడిసన్, సుబ్బరాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. ‘సాక్షి’ అనే మూగ పెయింటర్ పాత్రలో అనుష్క నటించారు. సోనాలి పాత్రలో షాలినీ పాండే నటించారు. ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
ఏజెంట్ మహా
యూఎస్‌లోని సియోటెల్ పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేశారు హీరోయిన్ అంజలి. పోలీసాఫీసర్‌గా ఆమె కేసులను ఎలా సాల్వ్ చేశారో వెండితెరపై చూడాల్సిందే. అనుష్క, ఆర్. మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే ముఖ్యతారలుగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఇటీవల ఈ సినిమాలోని అనుష్క, మాధవన్ లుక్స్‌ని విడుదల చేశారు. తాజాగా అంజలి లుక్‌ను రిలీజ్ చేశారు. యూఎస్ పోలీసాఫీసర్ ఏజెంట్ మహా పాత్రలో నటించారు అంజలి. ఈ పాత్ర కోసం దాదాపు 8 కిలోల బరువు తగ్గానని ఓ సందర్భంలో అంజలి పేర్కొన్నారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరకర్త. -
ఒకటే లోకం
రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన చిత్రం ‘ఇద్దరిలోకం ఒకటే’. జీఆర్ కృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న సినిమా విడుదల కానుంది. ‘‘క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు తెరకెక్కించారు’’ అన్నారు ‘దిల్’ రాజు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: సమీర్, సంగీతం: మిక్కీ.జె. మేయర్. -
బర్త్‌డే స్పెషల్
నిశ్శబ్ధంగా అమెరికాలో చిత్రీకరణ పూర్తి చేశారు ‘నిశ్శబ్ధం’ చిత్రబృందం. ఆల్రెడీ సినిమాలో అనుష్క, మాధవన్ లుక్స్‌ను విడుదల చేశారు. ఇప్పుడు టీజర్ రెడీ అని తెలిసింది. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్ధం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను నవంబర్ 7న విడుదల చేయనున్నట్టు సమాచారం. నవంబర్ 7 అనుష్క బర్త్‌డే. ఆమె బర్త్‌డే స్పెషల్‌గా ఈ టీజర్‌ను విడుదల చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం అమెరికా, ఇండియాలో ఏకకాలంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24న రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటించారు. -
‘ఇద్దరి లోకం ఒకటే’ ఫస్ట్ లుక్ విడుదల
యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం.. ‘ఇద్దరిలోకం ఒకటే’. యూ ఆర్ మై హార్ట్ బీట్ ట్యాగ్ లైన్. ఈ సినిమాతో జిఆర్. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాజ్ తరుణ్ సరసన ‘అర్జున్ రెడ్డి’ ఫేం శాలిని పాండే హీరోయిన్గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీత మందిస్తున్నారు. అభిమానులకు దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. రాజ్ తరుణ్‌కు ‘కుమారి 21 ఎఫ్’తర్వాత ఆ స్థాయి విజయం లేక వెనకబడిపోయాడు. అయితే ఫలితాల సంబంధం లేకుండా వరుస సినిమాలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. బాక్సీఫీస్ వద్ద విజయాలు సాధించడం లేదు. అయితే విజయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దిల్ రాజు మినిమమ్ కంటెంట్ ఉంటే గాని సినిమాను నిర్మించరు. దీంతో ‘ఇద్దరిలోకం ఒకటే’తో రాజ్ తరుణ్ మళ్లీ విజయాల బాట పడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సైగల కోసం శిక్షణ
‘నిశ్శబ్దం’ సినిమాలో మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో అనుష్క నటించిన సంగతి తెలిసిందే. ఆమె లుక్‌ని బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాలో సాక్షి పాత్రను చేయడానికి అనుష్క ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నారని తెలిసింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, మైఖెల్ మ్యాడిసన్, అంజలి, షాలినీ పాండే ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. చిత్రకారిణిగా నటించడం కోసం పెయింటింగ్ ప్రాక్టీస్ చేశారట అనుష్క. మాట్లాడలేనివాళ్లు సైగల ద్వారా సంభాషించుకుంటారు కదా. ఆ సైన్ భాష కూడా నేర్చుకున్నారట అనుష్క. అటు పెయింటింగ్, ఇటు సైగలను ఆరునెలల పాటు అభ్యసించి, సాక్షి పాత్రను చేశారట అనుష్క. ఈ ఏడాది చివర్లో ‘నిశ్శబ్దం’ విడుదల కానుంది. -
సాక్షి.. ఓ నిశ్శబ్ద చిత్రకారిణి
గత ఏడాది జనవరిలో విడుదలైన ‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని బుధవారం విడుదల చేశారు. బొమ్మలు గీస్తూ చూస్తున్న అనుష్క పోస్టర్‌పై ‘సాక్షి, ఏ మ్యూట్ ఆర్టిస్ట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇది నిశ్శబ్ద చిత్రం. ఇందులో సాక్షి అనే మూగ చిత్రకారిణిగా అనుష్క నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, ఇంగ్లిష్, హిందీ, మలయాళం భాషల్లో ఈ ఏడాది చివరిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షానియల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంకట్. -
మాది తొలి హాలీవుడ్ క్రాస్ఓవర్ చిత్రం
‘‘హాలీవుడ్ నటీనటులు, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కాంబినేషన్లో వస్తున్న తొలి ‘క్రాస్ఓవర్’ (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలసి పని చేయడాన్ని క్రాస్ ఓవర్ అంటారు) చిత్రం ‘నిశ్శబ్దం’. రెండేళ్లు ప్రయాణం చేసి రికార్డ్ టైమ్‌లో షూటింగ్ పూర్తి చేశాం. సెప్టెంబర్‌లో టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. ఈ సినిమా విశేషాల గురించి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్ హిట్ చిత్రం ‘కిల్‌బిల్’ సినిమాలో విలన్‌గా నటించిన మైఖేల్ మ్యాడిసన్‌తో పాటు 7–8 మంది హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా మా సినిమాకు పని చేశారు. అమెరికాలోని సియోటల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ మొత్తం సాగుతుంది. నలుగురు ఇండియన్స్‌కి అమెరికన్ పోలీసుల మధ్య జరిగిన క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా కేవలం బహుభాషా చిత్రమే కాకుండా బహు ప్రాంతాలకు చెందిన చిత్రం. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. గ్రాఫిక్స్‌కి స్కోప్ ఉన్న కథ. అన్నీ అనుకున్నట్లు కుదిరితే డిసెంబర్లోనే విడుదల చేస్తాం. లేకపోతే జనవరిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
నిశ్శబ్దంగా పూర్తయింది
ఈ మధ్య కాలంలో సినిమా పూర్తి కావాలంటే తక్కువలో తక్కువ ఆరునెలలు టైమ్ పడుతుంది. కానీ ‘నిశ్శబ్దం’ చిత్రబృందం సైలెంట్‌గా రెండు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయడం విశేషం. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో హేమంత్ మధుకర్ తెరకెక్కించిన చిత్రం ‘నిశ్శబ్దం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. సినిమా మొత్తం షూటింగ్‌ని అమెరికాలోని సీటెల్‌లో జరిపారు. సైలెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కొందరు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించారు. ‘‘షూటింగ్ పూర్తయింది. ఈ థ్రిల్లర్‌ను మీ అందరికీ త్వరగా చూపించేయాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. -
నిశ్శబ్దాన్ని విందాం
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం ‘సూపర్’ (2005) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు అనుష్కా శెట్టి. ఆ తర్వాత ‘విక్రమార్కుడు’ (2006), ‘లక్ష్యం’ (2007), ‘అరుంధతి’ (2010), ‘మిర్చి’ (2013), ‘బాహుబలి’ (2017), ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ (2018) వంటి సూపర్‌హిట్ సినిమాలతో ప్రేక్షకులతో సూపర్ హీరోయిన్ అనిపించుకున్నారు అనుష్క. ఆమె నటించిన తొలి సినిమా ‘సూపర్’ విడుదలై ఈ నెల 21తో 14 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’లోని ఫస్ట్ లుక్‌ను ఈ ఆదివారం విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బదిర యువతి (చెవిటి, మూగ) పాత్ర చేస్తున్నారు అనుష్క. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూఎస్‌లో జరుగుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడసన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
తగ్గానండి!
అమెరికా పోలీసాఫీసర్ల చట్టాలను బాగా స్టడీ చేస్తున్నారు మన తెలుగు అమ్మాయి అంజలి. అక్కడి చట్టాలతో ఇక్కడి అమ్మాయికి పనేంటా అని ఆలోచనలో పడ్డారా? మరేం లేదు.. ఆమె ‘నిశ్శబ్దం’ సినిమాలో అమెరికన్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలుగా ‘నిశ్శబ్దం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఇటీవలే ఓ పాటను కూడా చిత్రీకరించారు. మాధవన్, అనుష్కలపై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బధిర యువతి (చెవుడు, మూగ) పాత్రలో అనుష్క నటిస్తున్నారు. ఇటీవలే అంజలిపై కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో చేస్తున్న పోలీసాఫీసర్ పాత్ర కోసం ఆమె ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారు. అంతే కాదండోయ్... కెరీర్లో అంజలి తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ‘‘నిశ్శబ్దం’ సినిమాలో యూఎస్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాను. ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా అమెరికా పోలీసుల బాడీ లాంగ్వేజ్, వారి చట్టాల గురించి స్పెషల్ కోర్స్ తీసుకున్నాను’’ అన్నారు అంజలి. -
‘రూటు మార్చిన అర్జున్ రెడ్డి పిల్ల’
చెన్నై : నటి శాలిని పాండే తన రూటు మార్చేసిందా? అవుననే బదులే కోలీవుడ్ నుంచి వస్తోంది. ఈ జైపూర్ బ్యూటీ నిజంగా లక్కీఅనే చెప్పాలి. థియేటర్ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఈ అమ్మడి నట జీవితాన్ని అర్జున్‌రెడ్డి సినిమా ఒక్కసారిగా మార్చేసింది. ఆ చిత్రంతో వచ్చిన పాపులారిటీ కోలీవుడ్ ఎంట్రీకీ పనిచేసింది. ఇక్కడ 100% కాదల్ చిత్రంతో తమిళసినిమా పరిశ్రమకు పరిచయం అయినా.. ఆ చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. అదే కాదు నడిగైయార్ తిలకం(మహానటి) చిత్రం మినహా ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం కూడా కోలీవుడ్‌లో విడుదల కాలేదు. నడిగైయార్ తిలగం చిత్రంలో శాలినిపాండేది నిమిత్త మాత్రం పాత్రే. ప్రస్తుతం జీవాతో జత కట్టిన గొరిల్లా చిత్రంతో పాటు విజయ్‌ఆంటోనితో అగ్రిసిరగుగళ్, అనుష్కతో కలిసి సైలెన్స్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూడు చిత్రాలే కోలీవుడ్‌లో నటిగా శాలినిపాండే స్థానాన్ని డిసైడ్ చేయాలి. వీటిలో జీవాతో రొమాన్స్ చేసిన గొరిల్లా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంపై శాలినిపాండే చాలా ఆశలు పెట్టుకుంది. ఇక ఆ చిత్రాలను నమ్ముకుంటూనే కొత్తగా అవకాశాల కోసం వేట మొదలెట్టిందని సమాచారం. ముఖ్యంగా ఈ అమ్మడు నటించింది తక్కువ చిత్రాలే అయినా హోమ్లీ ఇమేజ్ను సంపాదించుకుంది. ఇప్పుడు దాన్ని చెరిపేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టేసింది. అంతే కాదు వచ్చే ఏడాది కల్లా స్టార్ హీరోయిన్గా వెలిగిపోవాలని కలలు కంటోందట. ఆ కలలను సాకారం చేసుకోవడానికి గ్లామర్ ఒక్కటే మార్గం అని భావించిన శాలినిపాండే ఆ దిశగా అడుగులు మొదలెట్టేసింది. ఏకంగా ఈత దుస్తుల్లో ఫొటో షూట్ చేయించుకుంది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెటిజన్ల విమర్శలతో పాటు పలువురి లైక్స్ పొందుతున్నాయి. అలా శాలినిపాండే వార్తల్లో నానుతోంది. రెండు హింది చిత్రాల్లోనూ నటిస్తున్న ఈ అమ్మడు అధిక దృష్టిని కోలీవుడ్‌పైనే సారిస్తోందట. ఎందుకంటే తెలుగులో ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతుండడంతో తమిళ సినిమానే నమ్ముకుంటోందని టాక్. -
గొరిల్లా సాయం
హీరోలకు సహాయం చేసే జంతువులు ప్రధాన పాత్ర పోషించిన పలు సినిమాలు గతంలో విజయవంతమయ్యాయి. కాకపోతే గతంలో ఏనుగులు, కుక్కలు, కోతులు, పాములు హీరోలకు సహాయం చేసే పాత్రల్లో నటించి, మెప్పించగా ఇప్పుడు గొరిల్లా వంతు వచ్చింది. ‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా, ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ శాలినీపాండే హీరోయిన్గా గొరిల్లా ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గొరిల్లా’. డాన్ శాండీ దర్శకత్వం వహించారు. సంతోషి సమర్పణలో గంగా ఎంటర్టైన్మెంట్స్, ఆల్ ఇన్ వన్ సంస్థల నిర్మాణంలో గంగా శబరీశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. శబరీశ్ రెడ్డి మాట్లాడుతూ–‘‘బ్యాంక్‌ను కొల్లగొట్టే బృందానికి గొరిల్లా చేసిన సహాయం ఏంటి? అసలు బ్యాంకులను వారు ఎందుకు కొల్లగొడుతున్నారు? అనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఇండియన్ స్క్రీన్ మీద తొలిసారి గొరిల్లా యాక్ట్ చేసింది మా సినిమాలోనే. శిక్షణ పొందిన గొరిల్లాను మా సినిమా కోసం తీసుకున్నాం’’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్. సి.యస్, కెమెరా : ఆర్.బి.గురుదేవ్. -
అమెరికాలో సైలెంట్‌గా...
‘బాహుబలి’ తర్వాత అనుష్క నెక్ట్స్ సినిమా పట్ల చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఏ సినిమా చేస్తున్నారో చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ‘సైలెంట్’ అనే బహుభాషా చిత్రం అంగీకరించారు. మాధవన్, అనుష్క జంటగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిశ్శబ్దం’. అంజలి, షాలినీ పాండే, హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడిసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అమెరికాలోని సీటెల్ ప్రాంతంలో ప్రారంభమైంది. చాలా శాతం షూటింగ్ అక్కడే జరుపుకోనుంది. సైలెంట్ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి ‘గూఢచారి’ ఫేమ్ షానీ డియోల్ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. -
మౌనం వీడారు
ఈపాటికి యూఎస్‌లో సైలెంట్‌గా ‘సైలెన్స్’ టీమ్ షూటింగ్ చేసుకుంటూ ఉండాల్సింది. కానీ జరగలేదు. ఈ విషయంపై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టీమ్ ఇప్పుడు మౌనం వీడారు. ఈ నెలాఖర్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ చిత్రం తెరకెక్కనుంది. అనుష్కా, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజులతో పాటు హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య తారాగణంగా కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24న ప్రారంభించనున్నట్లు దర్శకుడు హేమంత్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఆల్మోస్ట్ యూఎస్‌లోనే జరగుతుందని తెలిసింది. కొంతమంది అమెరిక్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ‘సైలెన్స్’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
‘అర్జున్ రెడ్డి’ భామతో రాజ్ తరుణ్ రొమాన్స్
కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో రాజ్‌తరుణ్ తరువాత పూర్తిగా గాడి తప్పాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురుకావటంతో ఈ యువ కథానాయకుడి కెరీర్ కష్టాల్లో పడింది. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ బ్యానర్లో తెరకెక్కిన లవర్ సినిమా కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ మరోసారి దిల్ రాజు బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఇద్దరి లోకం ఒకటే అనే పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాకు జీఆర్ కృష్ణ దర్శకుడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కు జోడిగా అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే నటించనున్నారు. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన షాలిని కెరీర్ కూడా టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో సాగటం లేదు. మరి ఈ సినిమా అయినా రాజ్ తరుణ్, షాలినిలకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. -
అతని ప్రేమలోకంలో?
ప్రేమికులిద్దరిదీ ఒకటే లోకం. అందులో ఒకరు రాజ్ తరుణ్. మరి రాజ్ తరుణ్ ప్రేమ లోకంలో ఉన్నది ఎవరు? అనే విషయంపై క్లారిటీ దొరికింది. రాజ్‌తరుణ్ హీరోగా జి.ఆర్. కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండేను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే రాజ్ తరుణ్, షాలినీ తొలిసారి జోడీ కట్టినట్లే. ఈ సినిమాకు మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకులుగా పని చేస్తున్నారు. -
‘అర్జున్ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!
అలాంటి వాడైతే కచ్చితంగా ప్రేమిస్తానంటోంది ‘ప్రీతి’ అలియాస్ శాలినిపాండే. ఎక్కడో ఉత్తరాదిలో పుట్టిర ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్‌లో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటున్నారు ప్రీతి. టాలీవుడ్లో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం విజయం సాధించడంతో ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అయ్యారు శాలినిపాండే. ‘100 శాతం కాదల్’ చిత్రంతో తమిళ పరిశ్రమకు పరిచయం అవుతున్న శాలినిపాండే ఆ చిత్రం విడుదల కాకముందే మరో రెండు మూడు చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘100 శాతం కాదల్’ తెలుగులో మంచి విజయాన్ని సాధించిన ‘100% లవ్’ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీంతో పాటు జీవాకు జంటగా గొరిల్లా, విజయ్ ఆంటోని సరసన అగ్ని సిరగుగళ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు శాలిని పాండే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల గురించి ముచ్చటించారు శాలిని పాండే. సినిమాలంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. చదుకుంటున్నప్పుడే సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగిందని చెప్పిందన్నారు. అయితే తాను నటించడం తన తండ్రికి అసలు ఇష్టం లేదని తెలిపారు. వేరేదన్నా ఉద్యోగం చేసుకోమని ఒత్తిడి చేశారని, దీంతో తాను ముంబై వెళ్లి సినిమా అవకాశాల వేటలో పడ్డానని చెప్పింది. ఆ సమయంలో తినడానికే చాలా కష్ట పడ్డానని అన్నారు. అలా కొన్ని నెలల తరువాతనే తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి కోసం నిర్వహించిన ఆడిషన్లో ఎంపికై నటించే అవకాశాన్ని పొందినట్లు తెలిపారు. అప్పుడు కూడా ముద్దు సన్నివేశాల్లో, హీరోతో సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో నటింపజేయరాదని దర్శకుడికి తన తండ్రి షరతులు విధించారని చెప్పుకొచ్చారు. అలాంటిది ఆ చిత్రం విడుదలై సక్సెస్ కావడంతో ప్రశంసల వర్షం కురిపించారని అన్నారు. ఇకపోతే ప్రేమ గురించి అడుగుతున్నారని, నిజ జీవితంలో ‘అర్జున్‌రెడ్డి’ లాంటి వ్యక్తి లభిస్తే కచ్చితంగా ప్రేమిస్తానని చెప్పారు శాలిని పాండే. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం తరువాత చాలా అవకాశాలు వచ్చాయని చెప్పింది. అదే విధంగా రెండేళ్ల సినీ జీవితంలో చాలా నేర్చుకున్నానని అన్నారు. గ్లామరస్‌గా ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. నటుడు కమలహాసన్, దర్శకుడు మణిరత్నంలకు వీరాభిమానినని చెప్పుకొచ్చారు శాలిని పాండే. ఇక తిండి విషయంలో ఎలాంటి నియమాలు లేవని, వారానికి ఐదు రోజులు మాత్రం శారీరక కసరత్తులు చేస్తానని చెప్పారు. పుస్తకాలు బాగా చదువుతానని, స్నేహితులు తక్కువేనని నటి శాలినిపాండే చెప్పుకొచ్చారు. -
మ్యాడసన్ @ సైలెన్స్
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు ముఖ్య తారలుగా హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న చిత్రం ‘సైలెన్స్’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్ నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ‘కిల్ బిల్, హేట్‌ఫుల్ ఎయిట్, రిసర్వోయర్ డాగ్స్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు మ్యాడసన్. ‘‘టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. ఓ వినూత్నమైన సినిమాను చూశామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని ఆశిస్తున్నాం. యూఎస్ఏలోని సీయోటల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిత్రీకరణ జరపబోతున్నాం. ఈ సినిమా టీజర్‌ను మేలో యు.ఎస్.ఏలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఈ సక్సెస్ మా నాన్నగారికి అంకితం
‘‘షూటింగ్‌కు అందరికంటే ముందు వచ్చే ప్రొడక్షన్ యూనిట్, ఆలస్యంగా వెళ్లే లైట్మేన్లు, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లే డ్రైవర్స్. ఇలా చాలా డిపార్ట్మెంట్స్ కష్టం ఈ సినిమాలో ఉంది. సినిమా బావుంటుందని అందరం నమ్మి పని చేశాం’’ అని కల్యాణ్‌రామ్ అన్నారు. కెమెరామేన్ కేవీ గుహన్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘118’. కల్యాణ్‌రామ్ హీరోయిన్గా, షాలినీ పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. మహేశ్ యస్ కోనేరు నిర్మాత. మార్చి 1న రిలీజ్ అయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసి, సినిమాలో పని చేసిన అందరికీ షీల్డ్‌లను బహూకరించారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ – ‘‘సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసి నన్ను రుణపడిపోయేలా చేశారు. నివేదా ఈ సినిమాకు సెకండ్ హీరో. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. గుహన్‌గారి నెక్ట్స్ సినిమా కూడా నాతోనే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ కాంప్లిమెంట్ తారక్ ఇచ్చాడు. తనకు థ్యాంక్స్. జయాపజయాలు పెక్కన పెట్టి ప్రతి సినిమాకు ‘ఆల్ ది బెస్ట్ నాన్న’ అని నాన్నగారు (హరికృష్ణ) చెబుతుండేవారు. ఈ విజయాన్ని ఆయనకు అంకితమిస్తున్నాను’’ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా 23 ఏళ్లు పూర్తి చేశాను. అందులో కొన్ని బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి. వాటిలో ఈ సినిమా కూడా ఉంటుంది. మంచి సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు. ‘‘కల్యాణ్‌రామ్‌గారితో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్ కావాలనుకుంటున్న కలను ఆయన నిజం చేశారు. 118 నిర్మాత మహేశ్ బాగా ప్రమోట్ చేశారు. సక్సెస్‌తో పాటు గౌరవం కూడా తెచ్చిపెట్టింది’’ అన్నారు. ‘‘మంచి ప్రయత్నం అని అందరూ అభినందిస్తున్నారు. పని చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. ‘‘కథ వినగానే సినిమాలో భాగం అవ్వాలనుకున్నాను. కాన్సెప్ట్ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. -
అర్జున్ రెడ్డి జోడి.. రిపీట్!
టాలీవుడ్లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు. అందుకే తన తదుపరి చిత్రాలను బహు భాషా చిత్రాలుగా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డియర్ కామ్రేడ్‌ను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ తరువాత కూడా ఓ ట్రై లింగ్యువల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు విజయ్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే నటించనున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న విజయ్, షాలినిల జోడి మరోసారి తెర మీదకు వస్తుండటం ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయ్యింది. -
హీరోకి వచ్చిన కలలన్నీ నాకొచ్చినవే
‘‘దర్శకుడిగా నా ప్రయాణం ఓ కలతో మొదలైంది. ఆ కలతో తీసిన ‘118’ సినిమా విజయం సాధించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవీ గుహన్. కల్యాణ్‌రామ్, నివేథా థామస్, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా గుహన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ మహేశ్ కోనేరు నిర్మించిన ‘118’ ఇటీవల విడుదలైంది. మంచి టాక్‌తో విజయవంతంగా సాగుతోందన్నారు గుహన్. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ– ‘‘118’లో హీరోకి వచ్చిన కలలు నాకొచ్చినవే. నాకు ఒక పెద్ద రూమ్‌లో ఒక్కడినే ఉండాలంటే చాలా భయం. కానీ కెమెరామేన్‌గా అనేక ప్రదేశాలు తిరుగుతుంటాను కాబట్టి తప్పదు. ఓ సినిమా కోసం నేను ఓ హోటల్ రూమ్‌లో బస చేశాను. రాత్రి నిద్రపోయిన తర్వాత భయంకరమైన కల వచ్చింది. అది నిజంగా జరిగినట్లే అనిపించింది. మర్నాడు ఒంట్లో ఓపిక లేనట్లు నీరసంగా లొకేషన్‌కి వెళ్లాను. డాన్స్‌మాస్టర్ ప్రేమ్‌రక్షిత్ ‘ఏంటి సార్ నీరసంగా ఉన్నారు’ అనడిగితే, ‘కల వచ్చింది’ అని చెప్పాను. కొన్ని కలలు అలానే ఉంటాయి అనుకున్నాం. ఆ కల గురించి ఆ తర్వాత ఆలోచిస్తూనే ఉన్నాను. ఓ రెండేళ్ల తర్వాత అదే హోటల్లో అదే రూమ్‌లో ఉండాల్సి వచ్చింది. మళ్లీ అదే కలకు కంటిన్యూషన్గా కల రావడంతో ఆశ్చర్యపోయాను. ఓసారి అనుకోకుండా కల్యాణ్‌రామ్‌ను కలిసినపుడు ‘ఓ లైన్ ఉంది వింటారా’ అని అడిగితే ‘సరే’ అన్నారు. రెండు గంటలపాటు కథను నెరేట్ చేశాను. ‘మీరు కెమెరామేన్ అయ్యుండి కథని ఇంత బాగా నెరేట్ చేశారు, మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారాయన. వారం రోజుల్లో సినిమా స్టార్ట్ అయ్యింది. అంతా ఓ కలలా జరిగిపోయింది. ప్రస్తుతం మేం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలామంది నిర్మాతలు వేరే భాషలో ఈ సినిమా చేయొచ్చు కదా అంటున్నారు. నేను ఇదే కథను ఏ భాషలో కావాలన్నా ఎన్నిసార్లు చేయమన్నా ఆనందంగా చేస్తాను. చేసిన సినిమానే కదా, మళ్లీ ఏం చేస్తాంలే అనుకోను. ఒకవేళ హిందీలో కాని, తమిళ్లో కాని రీమేక్ చేసే అవకాశం వస్తే తెలుగులో నేను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా లేకుండా ఇంకా బాగా చేస్తాను. నేను దర్శకత్వం వహించే సినిమాలకు నేనే కెమెరామెన్‌గా పనిచేస్తే దర్శకునిగా నాకేం కావాలో అలా చేసుకోగలుగుతాను. నాలోని డైరెక్టర్‌కి, కెమెరామెన్‌కి క్లాష్ ఉండదు. మంచి అవుట్‌పుట్ ఇస్తాను. ప్రస్తుతం తమిళ్లో కెమెరామెన్‌గా చరణ్ దర్శకత్వంలో ఓ సినిమాకు పనిచేస్తున్నా. తెలుగులో దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను’’ అన్నారు. -
సొంత సినిమా సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది
‘‘పటాస్’ తర్వాత కల్యాణ్‌రామ్, మా కాంబినేషన్లో హిట్ కొట్టాం. ‘118’ రెగ్యులర్ మూవీ కాదు. కొత్త ప్రయత్నం. రివ్యూస్, ఆడియన్స్ రెస్పాన్స్ రెండూ పాజిటివ్‌గానే ఉన్నాయి’’ అని ‘దిల్’ రాజు అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకె క్కిన చిత్రం ‘118’. నివేదా «థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోందని ప్రముఖ నిర్మాత, ఈ చిత్ర పంపిణీదారులు ‘దిల్’ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘118’ సినిమాను ఏపీ, తెలంగాణలలో రిలీజ్ చేశాం. రెండు రోజులకు మూడు కోట్ల షేర్ వచ్చింది. గుహన్‌గారితో 20 ఏళ్ల అనుబంధం ఉంది. మా సొంత సినిమా సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘కొత్త సినిమాలు తీయడానికి ప్రేక్షకుల స్పందన ప్రేరణ ఇస్తుంది. నాకు ‘దిల్’రాజుగారు గాడ్ బ్రదర్‌లాగా. ఆయన చేతి నుంచి సినిమా రిలీజ్ అవ్వడం సంతోషం’’ అన్నారు గుహన్. ‘‘‘పటాస్’ రిలీజ్ అయి నాలుగేళ్లయింది. అప్పుడూ ‘దిల్’ రాజుగారే సినిమాను పంపిణీ చేశారు. ఆ రోజు మమ్మల్ని నమ్మారు. మళ్లీ ఇప్పుడు. నా ప్రతి సినిమాను రాజుగారికి చూపిస్తా (నవ్వుతూ)’’ అన్నారు కల్యాణ్ రామ్. ‘‘ఫీడ్‌బ్యాక్ వింటుంటే చాలా çహ్యాపీగా ఉంది. ఫస్ట్ మాకు ధైర్యాన్ని ఇచ్చింది తారక్‌గారు. ఆ తర్వాత రాజుగారు’’ అన్నారు మహేశ్ కోనేరు. -
‘118’ మూవీ ప్రెస్‌మీట్
-
తారక్... నీ నమ్మకం నిజమైంది
కల్యాణ్‌రామ్, నివేథా థామస్, శాలిని పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘118’. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించారు. ప్రముఖ కెమెరామెన్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. శుక్రవారం చిత్రం విడుదలైంది. ఫస్ట్ షోకే మంచి టాక్ తెచ్చుకుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులందరికి థ్యాంక్స్. గుహన్‌గారు నాలో ఏం చూశారో నాకు ఇప్పటికీ తెలియదు. ఈ రోజు మా నిర్మాత మహేశ్ నవ్వు చూస్తున్నాను. ‘నా నువ్వే’ సినిమా రిలీజైనప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో నాకింకా గుర్తే. అప్పుడు నేను ‘మనం కొత్తగా చేయాలని ట్రై చేస్తాం, కొన్ని వర్కవుట్ అవ్వవు. నో ప్రాబ్లమ్, మన ‘118’ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని తనతో చెప్పాను. అదే నిజం అయ్యింది. మన నిర్మాత నవ్వుతూ ఉండటం కంటే ఓ హీరోకి ఏం కావాలి. మా ఎడిటర్ తమ్మిరాజు ఈ సినిమాను న మ్మి మా కంటే ఎక్కువ వర్క్ చేసారు. శేఖర్ చంద్ర ఉన్నది ఒకటే పాట కదా అని అనుకోకుండా ఈ సినిమాకు అద్భుతమైన రీరికార్డింగ్‌ను అందించారు. యన్టీఆర్ని ఉద్దేశించి... నాన్నా.. తారక్ నీ నమ్మకం నిజమైంది. ఫస్ట్ నువ్వే ఈ సినిమాని చూశావు. ఖచ్చితంగా హిట్ అవుతుంది’ అని చెప్పావు. మా కథ మీద నమ్మకంతో సినిమా కొన్న ‘దిల్’ రాజు, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్’’ అన్నారు. మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘గుహన్‌గారు తాను నమ్మినది తీశారు. ఈ రోజు సినిమాకు ఇంత మంచి పేరు రావటానికి కారణం అదే. కలెక్షన్లు బావున్నాయి’’ అన్నారు. గుహన్ మాట్లాడుతూ– ‘‘నేను కెమెరా ముందుకు రావటానికి ఇష్టపడను. ఈరోజు గర్వంగా కెమెరా ముందు మాట్లాడుతున్నాను. నేను తమిళ్ అయినా తెలుగు పరిశ్రమ నన్ను కన్నబిడ్డలా ఆదరించింది. కల్యాణ్‌రామ్ ఈ కథ విని ఎలా ఓకే చేశారు? అని నాకు ఓ కాల్ వచ్చింది. దానికి ఓ కొత్త విషయం చెప్పటానికి చాలా టాలెంట్ కావాలి. అది కల్యాణ్ గారిలో ఉంది అన్నాను’’ అని చెప్పారు. ‘‘క్రిటిక్స్ చాలామంది రాశారు ఇలాంటి స్క్రిప్ట్‌తో సినిమా తీయాలంటే చాలా గట్స్ కావాలని’’ అన్నారు నివేదా. సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర, మాటల రచయిత ‘మిర్చి’ కిరణ్, ఎడిటర్ తమ్మిరాజు, విలన్ పాత్రధారి హబీబ్ తదితరులు పాల్గొన్నారు. -
‘118’ మూవీ రివ్యూ
టైటిల్ : 118 జానర్ : థ్రిల్లర్ తారాగణం : కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలినీ పాండే, ప్రభాస్ శ్రీను సంగీతం : శేఖర్ చంద్ర దర్శకత్వం : కేవీ గుహన్ నిర్మాత : మహేష్ ఎస్ కోనేరు కెరీర్‌ను మలుపు తిప్పే బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్, హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 118. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా కూడా మెప్పింస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఆ అంచనాలను 118 అందుకుందా.? ఈ సినిమాతో కల్యాణ్ రామ్ మరో సక్సెస్ సాధించాడా? కథ : గౌతమ్ (కల్యాణ్ రామ్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఏ విషయాన్ని అయినా మొదలుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్‌ను ఓ కల బాగా డిస్ట్రబ్ చేస్తుంది. కలలో ఓ అమ్మాయిని ఎవరో తీవ్రంగా కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో గౌతమ్ ఆ కల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. తనకు కలలో కనిపించిన అమ్మాయి నిజంగా ఉందా? అని వెతికే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో గౌతమ్‌కు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు గౌతమ్ కలలో వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు కొట్టారు? ఈ మిస్టరీని గౌతమ్ ఎలా సాల్వ్ చేశాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : జర్నలిస్ట్ పాత్రలో కల్యాణ్ రామ్ మరోసారి ఆకట్టుకున్నాడు. గతంలో ఇజం సినిమాలో రిపోర్టర్ గా కనిపించిన కల్యాణ్ రామ్ ఈ సారి స్టైలిష్ పాత్రలో మరింతగా మెప్పించాడు. పర్ఫామెన్స్, యాక్షన్ సీన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. థ్రిల్లర్ సినిమా కావటంతో రొమాన్స్, డ్యాన్స్‌లకు పెద్దగా స్కోప్ లేదు. నివేదా థామస్ నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా తన మార్క్ చూపించింది. హీరోయిన్ షాలిని పాండే పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో మంచి నటనతో మెప్పించింది. ఇతర పాత్రల్లో హరితేజ, ప్రభాస్ శ్రీను, నాజర్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సినిమాటోగ్రాఫర్‌గా టాలీవుడ్‌కు సుపరిచితుడైన కేవీ గుహన్, 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 ఓ తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన గుహన్ లాంగ్ గ్యాప్ తరువాత తెలుగు సినిమాతో మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. రొటీన్ ఫార్ములా సినిమాకు భిన్నంగా ఓ సైన్స్‌ఫిక్షన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంట్రస్టింగ్ పాయింట్ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. అనవసరమైన సన్నివేశాలను ఇరికించకుండా సినిమా అంతా ఓకె మూడ్‌లో సాగటం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ రేసీ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ సీన్స్‌తో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ప్రీ క్లైమాక్స్‌కు వచ్చే సరికి పూర్తిగా లాజిక్‌ను పక్కన పెట్టి తెరకెక్కించిన సన్నివేశాలు అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. సినిమాటోగ్రఫి పరంగా మాత్రం గుహన్ ఫుల్ మార్క్స్ సాధించాడు. స్టైలిష్ టేకింగ్‌తో మెప్పించాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను తన మ్యూజిక్‌తో మరింత ఎలివేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కల్యాణ్ రామ్, నివేదా థామస్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : లాజిక్ లేని సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
హీరోలతో పోలికెందుకు పెట్టరు?
‘‘ఫలానా హీరోయిన్ కంటే బాగా చేశారు? అని బాగా నటించినప్పుడు ఇతర హీరోయిన్లతో పోలిక పెడుతుంటారు. మరి.. హీరోతో ఎందుకు పెట్టరు? ఎప్పుడూ హీరోయిన్లతోనే పోటీ పెడుతుంటారు. నేనెవర్నీ పోటీగా ఫీల్ అవ్వను. నాకు నేనే పోటీగా ఫీల్ అవుతాను. స్వీయ పరిశీలన చేసుకుంటాను. నాకు నేను సవాల్ విసురుకుంటా’’ అని నివేదా థామస్ అన్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రం ‘118’. కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలీని పాండే హీరోహీరోయన్లు మహేశ్ కోనేరు నిర్మించారు. శుక్రవారం చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా నివేదా చెప్పిన విశేషాలు. ► పదే పదే వచ్చే ఒక కలను ఫాలో అయ్యే ఓ హీరో కథే ఈ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్. మిస్టరీ ఉంటుంది. హీరో ఆ కల గురించి లోతుగా అన్వేషణ చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్న అంశాల ఆధారంగా స్క్రీన్‌ప్లే ఉంటుంది. సినిమా నిడివి చాలా తక్కువ. చివరి 20 నిమిషాలు సినిమా హైలైట్‌గా ఉంటుంది. గుహన్‌గారి లైఫ్‌లోని కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. కొంచెం ఫిక్షన్ కూడా ఉంది. సినిమా కాబట్టి కొంచెం లిబర్టీ తీసుకునే వీలు ఉంటుంది. ► నాకు వచ్చిన కలే మళ్లీ మళ్లీ రాదు. ఏదైనా కొత్త ప్లేస్‌లోకి వచ్చినప్పుడు ఇంతకుముందు ఏమైనా వచ్చానా? అనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది అప్పుడప్పుడు. కానీ అది కొన్ని సెకన్లపాటే ఉంటుంది. ఒక అమ్మాయి ఓ సమస్యలో పడినప్పుడు ఏం చేస్తుందో ఈ సినిమాలో నా పాత్ర అదే చేస్తుంది. నా పాత్ర గురించి ఇప్పుడు పెద్దగా చెప్పను. ఎందుకంటే సినిమాలో కీలకమైన పార్ట్ అది. ఫస్ట్‌టైమ్ నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకున్న సినిమా ఇది. ► ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో తారక్ వంటి మంచి నటుడు నాకు అప్రిషియేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ కూడా మెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ‘అన్వేషణ’ సినిమాను నేను చూడలేదు. ఆ సినిమాతో ఈ సినిమాను ఎందుకు పోల్చుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అలాగే హాలీవుడ్ మూవీ ‘ఫైనల్ డెస్టినేషన్’ సిరీస్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందా? అంటే.. అది ఆడియన్స్ వెండితెరపై చూడాలి. ► సినిమాలో నా స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉందా? లేక తక్కువగా ఉందా? అనే అంశాలను పెద్దగా పట్టించుకోను. నేను చేస్తున్న పాత్రకు ఎంత వరకు న్యాయం చేస్తున్నానన్నదే నాకు ముఖ్యం. ఈ సినిమాలో నా స్క్రీన్ టైమ్ దాదాపు 20 నిమిషాలే ఉంటుంది. ‘నిన్నుకోరి, జెంటిల్మన్’ చిత్రాల్లో ఎక్కువ ఉంటుంది. వెంట వెంటనే సినిమాలు చేయడం కన్నా మంచి సినిమాలు చేయాలనుకుంటాను. కొత్త విషయాలు నేర్చుకుంటూ యాక్టర్‌గా మెరుగవ్వాలని కోరుకుంటాను. అన్నిరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. నేను చేసిన సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో చూస్తాను. అది కూడా నిలబడే చూస్తాను. నెర్వస్ వల్ల కాదు. అదో ఫీలింగ్. ► ‘బ్రోచేవారెవరురా’ అనే కామెడీ చిత్రం, ‘శ్వాస’ అనే ట్రావెల్ ఫిల్మ్ చేయబోతున్నాను. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది తమిళ సినిమా కూడా చేస్తాను. మలయాళ సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాదిలో నావి ఐదు సినిమాలు ఉంటాయి. రిలీజ్‌ల పరంగా నా కెరీర్లో ఇదో బిగ్గెస్ట్ ఇయర్‌గా ఉండొచ్చు. -
‘118’ ప్రీ రిలీజ్ వేడుక
-
మెప్పించే వరకూ ట్రై చేస్తూనే ఉంటా
‘‘ఇంతింతై వటుడింతింతై అన్నట్టు.. ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలి, కొత్తదనాన్ని అందించాలని కల్యాణ్‌లో ఓ తపన ఉంది. కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వాలనే తపనే ఆయనచేత ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ అనే సంస్థ స్థాపించి ‘అతనొక్కడే’ సినిమా తీశారు’’ అని నటుడు బాలకృష్ణ అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో కల్యాణ్‌రామ్ బాలనటుడిగా పరిచయం అయ్యా రు. ఇవాళ కోడి రామకృష్ణగారు మనమధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన దర్శకత్వంలో ‘మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, బాలగోపాలుడు, భారతంలో బాలచంద్రుడు’ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించే అవకాశం నాకు కలిగింది. ‘118’ ఈ టైటిల్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా వీల్లేదు.. కానీ యువతరానికి కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిత్రం ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. గుహన్‌గారు ఇంకా ఎన్నో మంచి సినిమాలకు దర్శకత్వం వహించాలి. నాకు ఈ అవకాశం కల్యాణ్‌రామ్, తారక్‌లు కల్పించారు. ఎన్నో సినిమాలు చేస్తూ కళామతల్లికి మన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘గుహన్‌గారు నాకు చాలా ఏళ్లుగా పరిచయం. మేమిద్దరం ‘బాద్షా’ చిత్రం చేశాం. కష్టపడే మనస్తత్వం కలిగిన కెమెరామెన్ ఆయన. అంతే ఇంట్రెస్ట్‌తో ఆయన ‘118’ సినిమాతో మీ ముందుకొస్తున్నారు. నేను కచ్చితంగా చెబుతున్నా గుహన్సార్.. ఇది ఫెంటాస్టిక్ ఫిల్మ్ అవుతుంది. నివేథగారితో ‘జై లవ కుశ’ సినిమాలో పనిచేశా. ‘118’ సినిమా చూశా. ఓ సీన్లో నివేథ నటన చూసి కన్నీళ్లు వచ్చాయి. షాలినీగారు ఎంతో హుందాగా తన కష్టాన్ని జోడించి చక్కని నటన కనబరిచారు. మాకు బాగా కావాల్సిన వ్యక్తి మహేశ్. ఈ సినిమా ద్వారా ఓ అద్భుతమైన హిట్ సాధించి, ఇంకెన్నో మంచి సినిమాలు తీయడానికి తన పరంపరని ఈ చిత్రంతో మొదలుపెట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా. ఎప్పుడూ ఓ కొత్త చిత్రాన్ని అందించాలి, ఓ కొత్త ధోరణిలో కథ చెప్పాలని అన్నయ్య పడే కుతూహలం బహుశా ఇంకెవరిఎవరిలోనైనా ఉంటుందేమో కానీ, నేను మాత్రం ఆయనలోనే చూశాను. ఇప్పటి వరకూ ఆయన చేసిన చిత్రాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఇది.. ఆయన నటన కావొచ్చు.. డైరెక్టర్‌గారికి, నిర్మాతగారికి అందించిన సపోర్ట్ కావొచ్చు. ఓ నటుడు కంప్లీట్‌గా పాత్రకి సరెండర్ అయిపోతేకానీ ఇలాంటి నటన కనబరచడం కుదరదు.. హ్యాట్సాఫ్ కల్యాణ్ అన్న! ఈ సినిమా హిట్ అందిస్తుందని, ఇంకెన్నో మంచి చిత్రాలు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా.’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.. మైండ్ బ్లాంక్ అయిపోయింది. బాబాయ్, తారక్ అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా మాట్లాడాలనుంది. కానీ, ఈ సారి సినిమా విడుదల తర్వాత మాట్లాడదామని అనుకున్నా. మనందరి దేవుడు నందమూరి తారకరామారావుగారు.. ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే మేం ముగ్గురం ఇక్కడ ఉంటున్నాం. ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని మీ ముందు ఉంచాలనే తపనతో ట్రై చేస్తున్నాను.. ఫెయిల్ అవుతున్నా.. ఈ విషయం నాకూ తెలుస్తోంది.. మీకూ బాధ ఉంది.. ప్రతిసారీ ట్రై చేస్తున్నావ్ హిట్ రాదేంటి? అని. బట్.. ‘టెంపర్’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో తమ్ముడు చెప్పినట్టు ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాం.. అదే మళ్లీ చెబుతున్నా.. మిమ్మల్ని మెప్పించే వరకూ ట్రై చేస్తూనే ఉంటా. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. గుహన్‌గారికి, టీమ్‌కి థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గుహన్ అసిస్టెంట్ కెమెరామెన్‌గా నాకు పరిచయం.. ‘ఖుషి’ సినిమా చేశాడు. ఆయన ఈ రోజు కల్యాణ్‌రామ్‌గారితో తీసిన ‘118’ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే ఎంత నావల్‌పాయింట్ తీసుకున్నాడో అర్థం అవుతోంది. సినిమా సినిమాకి ఏదో కొత్తదనం చేయాలని కల్యాణ్‌రామ్‌గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పీఆర్వోగా స్టార్ట్ అయిన మహేశ్ నిర్మాతగా మారి నందమూరి ఫ్యామిలీతో అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా మా సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ’’ అన్నారు. కె.వి. గుహన్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌సార్.. కొత్తగా చేయాలనే మీ ఐడియాకి థ్యాంక్స్. అందువల్లే మీరు నా లైన్‌ని, కథని విన్నారు. చిన్న లైన్‌గా అనుకున్న ఈ కథ ఇంతవరకూ వచ్చిందంటే అది మీవల్లే.. నాకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఈ స్క్రిప్ట్ మొత్తుం నివేథా చుట్టూ నడుస్తుంది. స్క్రిప్ట్‌లోని తన పాత్రకి నటనతో ఊపిరి పోశారు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత షాలినీ క్రేజ్ ఏంటో నాకు తెలుసు. ‘118’ సినిమా కథని ఎంచుకున్నందుకు థ్యాంక్స్. నిర్మాత కోనేరుగారు గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. టీమ్ అందరి సహకారం వల్లే ఈ సినిమా ఇంతబాగా చేయగలిగా. ‘దిల్’రాజుగారు మా సినిమా చూసి, నచ్చడంతో విడుదల చేస్తూ మా టీమ్‌కి ఎనర్జీ ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రనిర్మాత మహేశ్ కోనేరు, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, షాలినీ పాండే, నివేథా థామస్ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నో డౌట్.. చాలా నమ్మకంగా ఉన్నాను
‘‘హరేరామ్’ లాంటి డిఫరెంట్ మూవీని పదేళ్ల క్రితమే ట్రై చేశాం. కొత్త తరహా సినిమాలు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉన్నాను. ‘118’ కథ వినగానే చాలా నచ్చింది. నా బ్యానర్లో చేద్దామనుకున్నాను. దర్శకుడు కేవీ గుహన్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకొని కథ తయారు చేశారు. నో డౌట్.. ఈ సినిమా సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’’ అని కల్యాణ్‌రామ్ అన్నారు. కెమెరామేన్ గుహన్ తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతూ, కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘118’. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్ యస్ కోనేరు నిర్మాత. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ పలు విశేషాలు పంచుకున్నారు. ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయి థ్రిల్లర్‌లో నటించాను. ట్రైలర్లోనే సినిమా కథంతా చూపించాం. ట్రైలర్‌ని మూడు నాలుగుసార్లు చూస్తే కథ అర్థం అవుతుంది. ట్రైలర్ బావుందని మంచి రెస్పాన్స్ వస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా ఇది. కామెడీ కానీ, కమర్షియల్ సాంగ్స్ కానీ ఏవీ కావాలని పెట్టినట్లుగా ఉండవు. గుహన్‌గారి లైఫ్‌లో ఒక సంఘటన రిపీటెడ్‌గా జరిగింది. దీన్నే కథగా ఎంచుకొని హీరో దాన్ని ఛేదించుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? అనే అంశంతో స్క్రిప్ట్ తయారు చేశారు. మొదట చాలా టైటిల్స్ అనుకున్నాం ‘రక్షణ, అన్వేషణ’ ఇలా.. అయితే కొత్తగా, డిఫరెంట్‌గా ఉండాలని ‘118’ ఫిక్స్ చేశాం. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ స్క్రీన్‌ప్లే. పరిగెడుతుంది. హీరో కూడా ప్రేక్షకుడిలానే ఉంటాడు. ప్రేక్షకులకు, హీరోకు సర్ప్రైజ్లు ఒకేసారి తెలుస్తుంటాయి. ఈ సినిమా కోసం లుక్ మార్చానంటున్నారు. మరీ రొటీన్‌గా ఉంటే ప్రేక్షకులు కూడా రొటీన్ ఫీల్ అవుతారు. ‘ఇజం’ నుంచి కొత్త లుక్ ట్రై చేస్తూ వస్తున్నా. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర నాది. మొదట ఈ క్యారెక్టర్లోకి వెళ్లడానికి కొంచెం టైమ్ పట్టింది. ప్రొడక్షన్లో నిర్మాత మహేశ్ కోనేరు కాంప్రమైజ్ కాలేదు. అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా ముంబై వెళ్లి మరీ షూట్ చేశాం. నాకు ఈత రాదు. నేర్చుకొని మరీ చేశా. ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాను. చివరి 30 నిమిషాలు సినిమాకే హైలైట్. విజువల్‌గా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. గుహన్‌గారు లేకపోతే ఈ సినిమా ఇలా ఉండేది కాదని నమ్మకంగా చెబుతున్నాను. నివేదా థామస్ ఎమోషనల్ సీన్స్ బాగా చేయగలుగుతారు. ఈ పాత్రకు ఫస్ట్ ఆప్షన్ ఆమె. షాలినీ పాండే కూడా బాగా చేశారు. హిట్, ఫ్లాప్స్ ఎఫెక్ట్ కచ్చితంగా మా మీద ఉంటుంది. ఫ్లాప్ సినిమాకి బాధపడతాం. ఆ తర్వాత సినిమా వైఫల్యానికి కారణాలేంటో లెక్కలేసుకొని రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఇది ట్రై అండ్ ట్రై ప్రాసెస్ అంతే. వరుస హిట్స్ సాధించాలని ఏ నటుడికైనా ఉంటుంది. మంచి సినిమా ఆడియన్స్‌కు ఇద్దాం అనుకునే సినిమాలు తీస్తాం. రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. మనం మళ్లీ హిట్ సాధిస్తాం అనే నమ్మకంతో నిర్మాతలు, దర్శకులు సినిమాలు తీస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించడం వెనక ఉన్న ముఖ్యోద్దేశం మంచి సినిమాలు తీయడమే. ‘ఇంత చెత్త సినిమా తీశాడేంట్రా’ అని ప్రేక్షకుడు అనుకోకూడదు. మా బ్యానర్లో పరిచయమైన సురేందర్‌రెడ్డి, అనిల్ రావిపూడి మంచి హిట్స్ సాధించడం హ్యాపీగా ఉంది. కొన్ని కథలు విన్నాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాను. మా బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నాం. టీనేజ్ లవ్‌స్టోరీతో ఆ సిరీస్ సాగుతుంది. ఇదివరకు సినిమా రిలీజైన 6 నెలలకు టీవీలో వచ్చేది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వల్ల నెల రోజులకే అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేస్తున్నాయి. కనీసం ఓ 2 నెలలు అయినా ఆగితే బావుంటుందన్నది నా అభిప్రాయం. సినిమా వంద రోజులాడే రోజులు పోయాయి. నాలుగు వారాలాడితే సూపర్‌హిట్. -
ప్రీతి ఎక్కడ అర్జున్?!
అర్జున్‌రెడ్డి తెలుగులో దుమ్ము రేపింది.ఆ దుమ్ము కోలీవుడ్‌లో, బాలీవుడ్లో దుమారం రేపింది.రీమేక్ చేస్తున్నారు. అయితే అదంత ఈజీ కావడం లేదు!పెద్ద హిట్ సినిమాను రీమేక్ చేయడానికి ఉండే తంటాలే ఇవి. ఇప్పటికింకా..అర్జున్‌రెడ్డి రీమేకింగ్లోనే ఉన్నాడు. హీరోయిన్లు ఫైనల్ అయినా..ఫైనల్ వరకు వాళ్లు ప్రీతిలా చేయగలరా?రీమేక్ అర్జున్‌రెడ్డికి ఒర్జినల్ ప్రీతి కనిపిస్తుందా? తెలుగు ‘అర్జున్‌రెడ్డి’లో లవర్ గర్ల్ పాత్ర కోసం షాలినీ పాండేకు (సినిమాలో ప్రీతి) ముందు డైరెక్టర్ ఎంతమందిని వడపోశారో తెలీదు. తమిళ్ అర్జున్‌రెడ్డికి మాత్రం మొదట మేఘా చౌదరిని అనుకున్నారు. ఆమెతో పూర్తి సినిమా తీశారు. ఆ షూట్‌ని పక్కన పడేసి జాహ్నవిని అనుకున్నారు. అది వర్కవుట్ కాలేదు. బనితా సందూని తీసుకున్నారు. ఆమెతో ఫ్రెష్‌గా షూటింగ్ మొదలు పెట్టారు. హిందీ అర్జున్‌రెడ్డికి కూడా మొదట తీసుకోవాలనుకున్నది అనన్య పాండేను. తర్వాత తీసుకున్నది కియారా అద్వానీని. ఎందుకిలా హీరోయిన్లను మార్చేస్తున్నారు. ప్రీతిలా కనిపిస్తారో లేదోనన్న సందేహమా? మరేమైనా కారణాలా?! ఫిబ్రవరి 15న రిలీజ్ కావాలి ‘వర్మా’. కాలేదు.‘అర్జున్‌రెడ్డి’ తమిళ్ వెర్షనే ‘వర్మా’. ధ్రువ్ హీరో. విక్రమ్ కొడుకు. ఎందుకు విడుదల కాలేదు?ఫస్ట్ కాపీ వచ్చింది. ధ్రువ్ హీరోలా ఉన్నాడు. విక్రమ్‌లా ఉన్నాడు. కానీ అర్జున్‌రెడ్డిలా లేడు!అర్జున్‌రెడ్డిలా ఉండడం అంటే విజయ్ దేవరకొండలా ఉండడం. అది ఆశించారు నిర్మాతలు. అలా ఉండదేమో అని కూడా అనుమానించారు. మామూలుగా తీశాడా, మామూలుగా చూపించాడా అర్జున్‌రెడ్డిని, దేవరకొండని.. మన డైరెక్టర్ సందీప్ వంగ! పిక్చర్ పదహారు జూన్‌లో మొదలై, పదిహేడు జూన్‌లో ఫినిష్ అయింది. ఆ వెంటనే ఆగస్టులో విడుదలైంది. బడ్జెట్ నాలుగు కోట్లు. బాక్సాఫీస్ ఇచ్చింది యాభై కోట్లు! డబ్బు అలా ఉంచండి. ఎంత రొద! రణగొణధ్వని.‘వర్మా’ను పద్దెనిమిది మార్చిలో మొదలు పెట్టి ఏడు నెలల్లో ఫినిష్ చేశాడు డైరెక్టర్ బాలా. ఫస్ట్ కాపీ చూసి, ‘‘రిలీజ్ చెయ్యడం లేదు. మళ్లీ మొత్తం షూట్ చేస్తున్నాం’’ అని ‘ఇ4’ (నిర్మాణ సంస్థ) రిలీజ్‌కు ముందు ప్రకటన ఇచ్చింది! కొత్త వెర్షన్ రిలీజ్ టైమ్ కూడా ఇచ్చేసింది. ఈ ఇయర్ జూన్‌లో ఏదో ఒక ఫ్రైడే. ఈసారి డైరెక్టర్ బాలా మాత్రం కాదు. వేరెవరైనా! రెండు రోజుల క్రితం ఆ వేరెవరైనా అనే వ్యక్తి దొరికాడు. గిరీశ్ అయా. తెలుగు అర్జున్‌రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ అతడు!ఇ4 బాలాకు ముందే చెప్పింది. ‘వర్మా’.. సేమ్ ఒరిజినల్లా ఉండాలని. అంటే తెలుగు ‘అర్జున్‌రెడ్డి’లా. కానీ తమిళ్‌కి ఒక ఒరిజినల్ ఉంటుందిగా. ఆ ఒరిజినాలిటీని పట్టుకున్నట్టున్నాడు బాలా. ఇ4కి అది నచ్చలేదు. వద్దనుకుంది. రద్దు ప్రకటన రిలీజ్ చేసింది. తర్వాత బాలా కూడా ఒక నోట్ రిలీజ్ చేశాడు. తను చెప్పడం.. ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ అని. డబ్బులిచ్చి తీయించేవాడు నిర్మాత, డబ్బులు తీసుకుని నిర్మించేవాడు దర్శకుడు. ‘వర్మా’లో కొన్ని సీన్లప్పుడు ఇద్దరి మధ్య డబ్బుకు బదులు ‘ఇగో’ ముఖ్యపాత్ర పోషించింది. ఫిల్మ్ ముక్కలయింది. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాల్సింది. సింగిల్ కాపీ ఉన్న బాక్సే బద్దలైపోయింది!∙∙ బాలా.. సందీప్ కన్నా సీనియర్. ట్వంటీ ఇయర్స్ ఇండస్త్రీ. లాంగ్ కెరియర్. ‘శివపుత్రుడు, వాడు–వీడు, నేనే దేవుడు’.. మంచి మంచి హిట్స్. çసందీప్‌కి ‘అర్జున్‌రెడ్డి’ తొలి చిత్రం. రెండో సినిమా ఇంకా రాలేదు. అర్జున్రెడ్డినే హిందీలో ‘కబీర్ సింగ్’గా తీస్తున్నాడు సందీప్. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. పిక్చర్ పూర్తయితే జూన్ 21న విడుదల. ‘వర్మా’ను తియ్యడానికి నిజానికి బాలా అంత సీనియర్ అవసరం లేదు. అర్జున్‌రెడ్డిలా ఉండాలి అనుకున్నప్పుడు ఇ4 సంస్థ సందీప్‌నే డైరెక్టర్‌గా తీసుకుని ఉండాలి. మన దగ్గరే ‘సీనియర్ సందీప్’ ఉన్నప్పుడు చెన్నై నుంచి హైద్రాబాద్ వెళ్లడం ఎందుకనుకున్నారు నిర్మాతలు. ఇంకోటి కూడా పని చేసింది. విక్రమ్‌కి ‘సేతు’తో బ్రేక్ ఇచ్చిన బాలా.. విక్రమ్ కొడుకు ధ్రువ్కీ ‘వర్మా’తో అలాంటి బ్రేకే ఇవ్వొచ్చని ఒక సెంటిమెంట్. అయితే సినిమా తీస్తున్నప్పుడే ‘వర్మా’కు బ్రేక్‌లు వచ్చాయి. ‘‘నన్ను స్వేచ్ఛగా తియ్యనివ్వలేదు. ధ్రువ్ కెరీర్ దెబ్బతినకూడదని.. దీన్నిక వివాదం చేయదలచుకోలేదు’’ అని బాలా తన నోట్ స్టేట్మెంట్ను ముగించారు. ఏం నచ్చి ఉండకపోవచ్చు ఇ4కి ‘వర్మా’ ఫస్ట్ కాపీలో? ఏదీ నచ్చలేదట! రీషూట్‌కి ధ్రువ్ ఒక్కణ్నీ ఉంచుకుని మొత్తం టీమ్‌ని మార్చేశారు. ఆఖరికి హీరోయిన్ని కూడా. మొదట ఉన్న బెంగాలీ అమ్మాయి మేఘా చౌదరి ప్లేస్‌లోకి శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్‌ని అనుకున్నారు. బోనీ ‘ఎస్’ అని ఉంటే.. జాహ్నవీనే ఫైనల్. కానీ కరెక్టేనా ఆమె ఎంపిక! కాదనిపించినట్లుంది. ఆమె ప్లేస్‌లోకి బినితా సంధూ వచ్చింది.అర్జున్‌రెడ్డి అబ్సెషన్లో ఉన్న ఇ4కి జాహ్నవి కన్నా మేఘ చౌదరే కరెక్ట్ అనిపించాలి. మేఘ పల్చగా ఉంటుంది కానీ, చూడ్డానికి షాలినీ పాండేలాగే ఉంటుంది. అదే కదా కావలసింది. మేఘలో ఇంకో ప్లస్.. కొత్త ముఖం. ఆ కొత్తదనం టికెట్లను అమ్మిపెడుతుంది. జాహ్నవి దేశం మొత్తానికీ తెలుసు. అలాంటప్పుడు రీల్ రీల్‌కీ కొత్తదనం ఉండే అర్జున్‌రెడ్డి థీమ్‌కి ఆమె ఎలా సెట్ అవుతుంది? ఇదే ఈక్వేషన్ పొరపాటున హిందీ అర్జున్‌రెడ్డి ‘కబీర్ సింగ్’కి పని చేస్తే కనుక అది ‘ఫట్’ అనే ప్రమాదం ఉంది. తెలుగు అర్జున్‌రెడ్డిలో విజయ్ దేవరకొండది ఫ్రెష్ ఫేస్. కబీర్ సింగ్‌లో షాహిద్ కపూర్ది సేమ్ ఓల్డ్ ఫేస్. అందులో హీరోయిన్ కైరా అద్వాని. (మొదట అనుకున్న పేరు అనన్యా పాండే). కైరా నటించింది నాలుగు సినిమాలే అయినా ఆమెనూ చాలాకాలంగా చూస్తున్నట్లనిపిస్తుంది. సందీప్ ధైర్యం ఏమిటో మరి! నిర్మాతలకేం పర్వాలేదు. వారికి సందీప్ ఉన్నాడన్న ధైర్యం ఉంది. ∙∙ జూన్‌లోనే విడుదల అవబోతున్న తమిళ్ అర్జున్‌రెడ్డి, హిందీ అర్జున్‌రెడ్డి.. తెలుగు అర్జున్‌రెడ్డిలా హిట్ అవుతాయా.. లేదా చెప్పలేం. కానీ తెలుగు అర్జున్‌రెడ్డి ట్రైలర్స్ వచ్చినప్పుడే చాలామంది చెప్పేశారు. ఇదేదో బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉందని. పిక్చర్ కోసం ఎదురు చూసేలా చేసిన ట్రైలర్స్ అవి. సినిమా అంతా అర్జున్‌రెడ్డి చుట్టూ తిరుగుతుంది. అర్జున్‌రెడ్డి సినిమా అంతా షాలిని చుట్టు తిరుగుతాడు. అర్జున్‌రెడ్డి గొంతు, అతడి మాట ఓ రకంగా ఉండడం కూడా ఆడియెన్స్‌కి ఎక్కింది. ట్రైలర్లో.. ‘‘చూడండీ.. మీకో విషయం చెప్పడానికొచ్చిన. అధ్యాపకురాలికి అర్థం గాకుండా, ఒక్క పదం ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను సరిగా వినండి’’ అని అర్జున్‌రెడ్డి.. క్లాస్‌రూమ్‌కి వెళ్లి చెప్పే సీన్, ఫుట్‌బాల్‌లో కోర్టులో ‘ఏయ్.. అమిత్’ అని పిలిచి అమిత్‌ని అర్జున్‌రెడ్డిని రెచ్చగొట్టే సీన్.. సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసేలా చేశాయి. అర్జున్‌రెడ్డి ట్రైలర్‌ని చూసిన కళ్లతో, వర్మా ట్రైలర్‌ని చూడలేకపోయారు ఆడియన్స్. తెలుగు ఆడియన్సే కాదు, తమిళ్ ఆడియన్స్ కూడా! బాలా సినిమాల్లోని సైకో సీన్లు, లస్ట్ సీన్లు చూస్తున్నట్లే ఉంది కానీ, కొత్తదనం లేదు. బాలా క్రియేటివ్ డైరెక్టర్. ఆయన్ని తీసుకొచ్చి తర్జుమా చేసి పెట్టి ‘గురూ నీ స్టయిల్లో చెయ్యి’ అంటే ఇలానే ఉంటుంది. గుడ్ డైరెక్టర్ రాంగ్ చాయిస్ అయ్యాడు. అర్జున్‌రెడ్డి లాంటి ‘కల్ట్’ మూవీలను సబ్ టైటిల్స్‌తో సరిపెట్టుకోవాలి. రీమేక్ చేసుకుంటే కల్ట్ మిస్ అయి, మూవీ మాత్రమే మిగులుతుంది. అర్జున్‌రెడ్డి హీరోయిన్లు తెలుగు: షాలినీ పాండే (25) చెప్పేదేముందీ! ప్రీతి క్యారెక్టర్‌కు భలే సరిపోయింది. అర్జున్‌రెడ్డి తొలి చిత్రం. ఆ తర్వాత నాలుగు చిత్రాల్లో నటించారు. మరో ఐదు చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళం: మేఘా చౌదరి (26) మేఘ బెంగాలీ అమ్మాయి. మోడల్. ఆరేడు తమిళ చిత్రాల్లో నటించారు. ‘వర్మా’లో లవర్ గర్ల్‌గా బాగా సెట్ అయ్యారు. ప్ఛ్. ఆ సినిమాను మళ్లీ తీస్తున్నారు. మళ్లీ ఆమెనే తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది కానీ, నిర్మాతలు జాహ్నవి వైపు చూస్తున్నారు. చివరికి బిన్నిత దగ్గర సెటిల్ అయ్యారు. జాహ్నవీ కపూర్ (21) ‘వర్మా’ రీషూట్‌లో మేఘకు బదులుగా జాహ్నవిని అనుకున్నారు. బాలీవుడ్ మూవీ ‘ధడక్’తో సినిమాల్లోకి వచ్చారు జాహ్నవి. ఎక్స్ప్రెషన్స్ ఇంకా కుదురుకోలేదు. అర్జున్‌రెడ్డిలోని లాస్ట్ సీన్లో (గర్భిణిగా ఉన్నప్పుడు అర్జున్‌రెడ్డితో పార్కులో ఎమోషనల్‌గా మాట్లాడే సీన్) ఆమె ఎలా చేస్తారన్నది రాబోయే డైరెక్టర్ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు జాహ్నవి లేదు. ఆమె స్థానంలోకే బనితా వచ్చింది. బనితా సంధూ (21) టీవీ సీరియళ్లు, డబుల్ మింట్ చూయింగ్ గమ్, ఓడాఫోన్ వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. పదకొండో ఏట నుంచే సీరియళ్లలో నటిస్తోంది. షూజిత్ సర్కార్ దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన ‘అక్టోబర్’ సినిమాలో నటించింది. అనన్యా పాండే (19) ఈ ఏడాది మే లో విడుదల అవుతున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంలో నటిస్తోంది. నటుడు చుంకీ పాండే కూతురు. కరణ్ జోహార్ తాజా చాట్ షోలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌పై ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతోంది. వాటిని తేలిగ్గా తీసుకుని నవ్వగలుగుతోంది అనన్య. హిందీ: కైరా అద్వానీ (26) ఈ నలుగురిలోనూ సీనియర్. ‘కబీర్ సింగ్’ హీరోయిన్. ఇప్పటికే ఆరు సినిమాల్లో నటించారు. మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖంలో ముగ్ధత్వమేం కనిపించదు. పరిణతి ఉంటుంది. మరి అర్జున్‌రెడ్డి హీరోయిన్గా సరిపోతుందా! సందీప్ తంటాలు పడుతున్నాడుగా. పడనివ్వండి. -
ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే కథ
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన చిత్రం ‘118’. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటించారు. మహేశ్ కోనేరు నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. కానీ మనం పట్టించుకోం.. వదిలేస్తాం. ట్రైలర్‌ను లోతుగా గమనిస్తే సినిమా ఏంటో అర్థమైపోతుంది. నివేదా థామస్ పాత్ర ఆధారంగానే సినిమా అంతా సాగుతుంది. ఆమె బాగా నటించారు. గుహన్‌గారి సినిమాటోగ్రఫీ గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు నేను. కానీ పక్కాగా ప్లాన్ చేసి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. నిర్మాత మహేశ్ నాకు కుటుంబ సభ్యుడితో సమానం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేద్దామనేంత బాగా నచ్చింది ఈ సినిమా స్క్రిప్ట్. అయితే పూర్తి కథ విని మహేశ్ నిర్మించడానికి రెడీ అయ్యారు. తమ్మిరాజుగారి సపోర్ట్ మర్చిపోలేనిది. మార్చి 1న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మంచి కథతో మిళితమైన థ్రిల్లర్ చిత్రమిది. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకునిగా మారిన తర్వాత ఒక సినిమా కోసం టీమ్ ఎంత కష్టపడతారో అర్థం అయింది. కల్యాణ్‌రామ్‌గారి యాక్టింగ్ సూపర్. ఒక వ్యక్తిగా ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు. నివేదా థామస్ ఓ బాధ్యతాయుతమైన పాత్రలో నటించారు. షాలినీ పాండే నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాత మహేశ్‌గారికి థ్యాంక్స్. శేఖర్‌చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు కె.వి. గుహన్. ‘‘కల్యాణ్‌రామ్‌గారి నటన, గుహన్‌గారి టేకింగ్, నివేదా, షాలినీల పెర్ఫార్మెన్స్... ఇలా అన్నీ బాగా కుదిరాయి. ఇది నాకు స్పెషల్ మూవీ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది’’ అన్నారు మహేశ్ కోనేరు. ‘‘118 అంటే ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. తక్కువ టైమ్‌లో చాలా ఎక్కువగా వర్క్ చేసిన చిత్రమిది. చాలెంజింగ్‌గా అనిపించింది’’ అన్నారు నివేధా థామస్. -
‘118’ ట్రైలర్ విడుదల
-
స్క్రీన్ టెస్ట్
‘ప్రేమ’... ఈ రెండక్షరాల్లో ఏదో మ్యాజిక్ వుంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన రెండు హృదయాల మనసు చప్పుడు ప్రేమ. ప్రేమ అంటే అబ్బాయి–అమ్మాయి మధ్య ఉండేదేనా? ఊహూ తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమ.. ఇలా ఎన్నో ప్రేమలు. ఇప్పుడు మాత్రం మనం అబ్బాయి– అమ్మాయిల ప్రేమ గురించి చెప్పుకుందాం. సిల్వర్ స్క్రీన్‌ని ప్రేమతో ముంచెత్తిన ప్రేమలతో సినిమా క్విజ్. 1. ‘‘ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతి రూపమా...’ పాట వెంకటేశ్ హీరోగా నటించిన హిట్ చిత్రం ‘ప్రేమ’లోనిది. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన హీరోయిన్గా నటించింది ఎవరు? ఎ) రేవతి బి) శోభన సి) గౌతమి డి) సితార 2. ‘‘అరె ఏమైందీ... ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది’’ అనే హిట్ సాంగ్ ‘ఆరాధన’ చిత్రంలోనిది. ఇందులో నిరక్షరాస్యుడు పులిరాజు పాత్రలో నటించిన హీరో.. హీరోయిన్ సుహాసినిని ఆరాధిస్తాడు. పులిరాజు పాత్రలో నటించిన ప్రముఖ హీరో ఎవరు? ఎ) వెంకటేశ్ బి) రాజశేఖర్ సి) సుమన్ డి) చిరంజీవి 3. ‘‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం..’’ పాట ‘అభినందన’ చిత్రంలోనిది. ఆ చిత్రానికి తన సంగీతంతో ప్రాణం పోసిన సంగీత దర్శకుడెవరు? ఎ) మంగళంపల్లి బాలమురళీకృష్ణ బి) ఇళయరాజా సి) చక్రవర్తి డి) కె.వి. మహదేవన్ 4. నాగార్జున కెరీర్లో బెస్ట్ ఇయర్స్‌లో 1989 ఒకటి. ఎందుకంటే ఆ ఇయరే ఆయనకు ‘శివ’ ‘గీతాంజలి’ లాంటి మంచి చిత్రాలు వచ్చాయి. ‘గీతాంజలి’లో హీరోయిన్ గిరిజ వాయిస్ చాలా వెరైటీగా ఉంటుంది. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఓ ప్రముఖ నటి. ఆమె ఎవరో? ఎ) సరిత బి) రోహిణి సి) భానుప్రియ డి) సితార 5. ‘‘ప్రేమా ప్రేమా... ప్రేమ ప్రేమ, నను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు, వినిపించదా ప్రియా నా గోడు...’ అనే పాట ‘ప్రేమదేశం’ చిత్రంలోనిది. అబ్బాస్, వినీత్ బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ని ఇద్దరూ పోటీపడి ప్రేమిస్తారు. ఆ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) సిమ్రాన్ బి) సౌందర్య సి) టబు డి) సోనాలీ బింద్రే 6. ప్రేమించి పెళ్లి చేసుకున్న తెలుగు హీరోలు వీళ్లు. వీరిలో ఓ హీరో పెళ్లి ఫిబ్రవరిలోనే జరిగింది. ఆ జంట ఎవరు? ఎ) అల్లు అర్జున్ బి) మహేశ్‌బాబు సి) రామ్ చరణ్ డి) మంచు విష్ణు 7. ‘ నీరాజనం’ చిత్రంలోని ‘‘నిను చూడక నేనుండలేను ఈ జన్మలో.. మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే...’’ పాట ఓపీ నయ్యర్ స్వరపరిచారు. ఆ పాట రచయిత ఎవరు? ఎ) వేటూరి బి) సిరివెన్నెల సి) ఆచార్య ఆత్రేయ డి) కృష్ణశాస్త్రి 8. తమిళ్లో సూపర్‌హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ చిత్రానికి ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ రీమేక్. ఆ చిత్రంలో లవర్‌బాయ్‌గా నటించారు హీరో రవితేజ. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టినది ఓ ప్రముఖ ఛాయాగ్రాహకులు. ఆయనెవరు ఎ) పీసీ శ్రీరాం బి) చోటా.కె. నాయుడు సి) ఎస్.గోపాల్‌రెడ్డి డి) అజయ్ విన్సెంట్ 9. విషాద ప్రేమలకు కేరాఫ్ అడ్రస్ అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన చిత్రం ‘దేవదాసు’. ఆ చిత్రదర్శకుడు వేదాంతం రాఘవయ్య, నిర్మాత డి.ఎల్ నారాయణ. బెంగాలీలో శరత్చంద్ర చటర్జీ రాసిన కథ ఇది. ఆ కథను తెలుగు సినిమాగా తీయటానికి అవసరమైన రచనను చేసింది ఓ ప్రముఖ నిర్మాత. ఆయన పేరేంటి? ఎ) ఆలూరు చక్రపాణి బి) నాగిరెడ్డి సి) వేదాంతం రాఘవయ్య డి) డి.యల్. నారాయణ 10. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ ‘‘బేబి మనం దూరంగా ఉండి 15డేస్ కూడా కాలేదు, అంటే నాకు 15 ఇయర్స్లా ఉంది’ అనే డైలాగ్ చెప్పిన హీరోయిన్ ఎవరు? ఎ) కియరా అద్వానీ బి) మేఘా చౌదరి సి) ప్రియాంకా జవాల్కర్ డి) షాలినీ పాండే 11. ‘మరోచరిత్ర’ సినిమాతో కమల్‌హాసన్‌ని తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేశారు బాలచందర్. ఆ చిత్రంతోనే హీరోయిన్గా పరిచయమైన ప్రముఖ నటి ఎవరు? ఎ) జయచిత్ర బి) జయసుధ సి) జయప్రద డి) సరిత 12. ‘‘ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని...’ పాట ‘ప్రేమికులరోజు’ సినిమాలోనిది. ఈ పాటను ప్రముఖ నిర్మాత ఏ.యం.రత్నం రాశారు. ఆ చిత్ర సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) ఎ.ఆర్. రెహమాన్ బి) ఎస్.ఏ రాజ్‌కుమార్ సి) ఇళయరాజా డి) హారిస్ జయరాజ్ 13. ‘‘ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే... ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే..’’ పాట శంకర్ దర్శకత్వం వహించిన ‘ప్రేమికుడు’ చిత్రంలోనిది. ఆ పాట పాడిందెవరో తెలుసా? ఎ) ఉన్నిక్రిష్ణన్ బి) హరిహరన్ సి) ఎస్పీబీ డి) మనో 14. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సూపర్‌హిట్ లవ్ స్టోరీ ‘ఆర్య’. ఆ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన నటి ఎవరో గుర్తుందా? ఎ) కీర్తీ చావ్లా బి) అనూ మెహతా సి) గజాలా డి) జెనీలియా 15. ‘‘గ్రీకువీరుడు... గ్రీకువీరుడు... గ్రీకువీరుడు, నా రాకుమారుడు కళ్లలోనే ఇంకా ఉన్నాడు...’’ పాటలో నాగార్జున, టబు నటించారు. ఆ చిత్రంలోని ఫ్యామిలీ లవ్‌స్టోరీని బేస్ చేసుకొని ఎన్నో మూవీస్ వచ్చాయి. ఆ చిత్రదర్శకుడెవరు? ఎ) సురేశ్‌కృష్ణ బి) కృష్ణవంశీ సి) వైవీయస్ చౌదరి డి) గుణశేఖర్ 16. మణిరత్నం దర్శకత్వం వహించిన క్లాసికల్ లవ్‌స్టోరీ ‘బొంబాయి’. ఆ చిత్రంలో అరవింద స్వామి, మనీషా కొయిరాల కాంబినేషన్లోని ‘ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు.. కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు...’’ అనే పాటలోని మేల్ వాయిస్ హరిహరన్ పాడారు. ఆ పాటలోని ఫిమేల్ వాయిస్‌ను పాడిన సింగర్ ఎవరో కనుక్కోండి? ఎ) చిత్ర బి) శ్రేయాఘోషల్ సి) ఉషా డి) సునీత 17. ఉదయ్‌కిరణ్, అనిత నటించిన సూపర్‌హిట్ లవ్ స్టోరి ‘నువ్వు నేను’. ఆ చిత్రంలోని ‘‘నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం...’ పాటతో పాటు ఆ సినిమాలోని అన్ని పాటలను రచించిందెవరు? ఎ) ఆర్.పి. పట్నాయక్ బి) కులశేఖర్ సి) వనమాలి డి) తేజ 18. నాగచైతన్య, సమంత జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి మొదటి సినిమా ‘ఏం మాయ చేసావే’ అని అందరికీ తెలుసు. ఇప్పుడు వారిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. వారిద్దరూ జంటగా నటిస్తున్న ఎన్నో సినిమా ఈ ‘మజిలీ’? ఎ) 3 బి) 7 సి) 6 డి) 5 19. ‘‘హృదయం ఎక్కడున్నది...హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నాది...’’ పాట సూర్య నటించిన సూపర్‌హిట్ చిత్రంలోనిది. సూర్య సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) నయనతార బి) తమన్నా సి) అనుష్క డి) అసిన్ 20. 1981లో విడుదలైన రొమాంటిక్ చిత్రం ‘సీతాకోకచిలుక’. ప్రముఖ దర్శకులు భారతీరాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) శ్రీదేవి బి) ముచ్చర్ల అరుణ సి) శాంతిప్రియ డి) విజయశాంతి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (ఎ) 2) (డి) 3) (బి) 4) (బి) 5) (సి) 6) (బి) 7) (సి) 8) (సి) 9) (ఎ) 10) (డి) 11) (డి) 12) (ఎ) 13) (ఎ) 14) (బి) 15) (బి) 16) (ఎ) 17) (బి) 18) (డి) 19) (డి) 20) (బి) నిర్వహణ: శివ మల్లాల -
‘118’ నుంచి లిరికల్ వీడియో సాంగ్!
‘పటాస్’ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఎమ్మెల్యే, నా నువ్వేలాంటి సినిమాలు చేసినా.. ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. మరోసారి సూపర్‌హిట్‌ను కొట్టేందుకు డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ.. టీజర్‌తో బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అర్జున్‌రెడ్డి బ్యూటీ షాలిని పాండే హీరోయిన్గా నటిస్తోంది.తాజాగా ఈ సినిమాలోంచి చందమామే అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. షాలిని పాండే, కళ్యాణ్ రామ్‌ల కెమిస్ట్రీ బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. నివేదా థామస్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
‘అర్జున్ రెడ్డి’ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్
2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా స్టార్ హీరోలతో సినిమాలో ఓకె చేయించుకొని ఫుల్ బిజీ అయ్యాడు. అయితే హీరోయిన్గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం 100% లవ్ తమిళ రీమేక్‌తో పాటు కల్యాన్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న 118 సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి ఓ బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా తెరకెక్కుతున్న బాంఫాడ్ సినిమాలో షాలిని హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్న ఈ సినిమాతో రంజన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. -
ఆ నలుగురూ ముఖ్యులు
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి పేరున్న నటుడు మాధవన్. ‘బాహుబలి’ ముందు వరకూ అనుష్క దక్షిణాది వరకే పరిమితం. ఆ సినిమా తర్వాత ఉత్తరాదిన కూడా పేరు తెచ్చుకున్నారు. తెలుగమ్మాయి అంజలికి సౌత్‌లో మంచి పేరుంది. ఇక ‘అర్జున్‌రెడ్డి’తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు షాలినీ పాండే. ఈ నలుగురూ ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అమెరికాలో జరిగే షూటింగ్‌తో ప్రారంభం కానుంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో తీయనున్నామని చిత్రనిర్మాతలు తెలిపారు. అలాగే తెలుగు, తమిళ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పని చేస్తారు. తొలి క్రాస్ ఓవర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజులు ముఖ్య పాత్రలు చేస్తారు. కోన వెంకట్, షనిల్ డియో, గోపీ మోహన్, నీరజ కోన, గోపీసుందర్ టెక్నీషియన్లుగా చేయనున్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. మార్చిలో ప్రారంభం అయ్యే ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేస్తామన్నారు. -
అనుష్క సినిమాలో మరో ఇద్దరు భామలు
భాగమతి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలుగు, తమిళ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు అంజలి, షాలిని పాండేలు కూడా నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎక్కువగా భాగం విదేశాల్లో షూటింగ్ జరపుకోనున్న ఈ చిత్రం మార్చి నెలలో అమెరికాలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
118... ఓ సస్పెన్స్
కల్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమాను మార్చి 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ – ‘‘కల్యాణ్‌రామ్ ఇప్పటి వరకూ చేయని జానర్ ఇది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తరహా సస్పెన్స్ ఉంటుంది. యాక్షన్ పార్ట్ సినిమాకు హైలైట్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్స్కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, మాటలు : ‘మిర్చి’ కిరణ్. కథ, కెమెరా, స్క్రీన్‌ప్లే : కె.వి గుహన్. -
మార్చి 1న కళ్యాణ్ రామ్ ‘118’
నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలీష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ `118`. నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1న విడుదలకానుంది. పటాస్ సినిమాతో బ్రేక్ వచ్చినట్టుగానే కనిపించినా తరువాత మళ్లీ గాడి తప్పాడు కల్యాణ్ రామ్. ఈ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కీ మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్గా 118 షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ లో కనిపించనుండంతో సినిమాపై అంచానాలు పెరిగాయి. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
‘జ్వాల’ చిత్రం ప్రారంభం
-
రగిలిన జ్వాల
ఇప్పటి వరకూ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తెలుగులో చేస్తున్న స్ట్రయిట్ మూవీ ‘జ్వాల’. అరుణ్ విజయ్ మరో కథా నాయకుడు. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే కథానాయికగా నటిస్తున్నారు. ఎం. నవీన్ దర్శకత్వంలో టి. శివ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విజయ్ ఆంటోని మాట్లాడుతూ–‘‘తెలుగులో నేను చేస్తున్న స్ట్రయిట్ చిత్రమిది. నవీన్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చింది. నాతో పాటు అరుణ్‌విజయ్, షాలినీ పాండేకి కూడా ఇది చాలెంజింగ్ మూవీ. నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీస్‌గా ఉంటుందని చెప్పగలను. ఈ సినిమాలో కీలక పాత్రలు చేయడానికి అంగీకరించిన ప్రకాశ్‌రాజ్, జగపతిబాబుగార్లకి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘బ్రూస్ లీ, సాహో’ చిత్రాల తర్వాత నేను నటిస్తున్న మూడో స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఇలాంటి యాక్షన్ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు అరుణ్ విజయ్. ‘‘ఈ చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి ఎగై్జటింగ్‌గా ఎదురుచూస్తున్నా’’ అన్నారు షాలినీ పాండే. ఈ సినిమాకు నటరాజన్ సంగీతం అందిస్తున్నారు. -
తెలియని విషయం వెంటాడుతోంది
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటించారు. సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. టీజర్లో కల్యాణ్ రామ్ చాలా స్టైలిష్ లుక్‌తో కనిపించారు. ఏదో తెలియని విషయం ఆయన్ని వెంటాడుతున్నట్లు, ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు ఆయన పాత్రను కె.వి.గుహన్ మలిచినట్లుగా టీజర్ చెబుతోంది. మహేశ్ కోనేరు మాట్లాడుతూ –‘‘స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ‘118’ టైటిల్ లోగో, ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కల్యాణ్ రామ్‌గారు ఇప్పటివరకు చేయనటువంటి జోనర్లో రూపొందింది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, కెమెరా, దర్శకత్వం: కె.వి.గుహన్. -
స్టైలిష్ యాక్షన్
అటు కమర్షియల్ సినిమాలు.. ఇటు వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు హీరో కల్యాణ్ రామ్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘118’. కథ, కథనంతో పాటు యాక్షన్ పార్ట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కల్యాణ్ రామ్‌గారు ఇప్పటి వరకు చేయనటువంటి సరికొత్త పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. కె.వి.గుహన్‌గారు ఈ చిత్రంతో టాలీవుడ్‌కి డైరెక్టర్‌గా పరిచయం కావడంతో పాటు సినిమాటోగ్రఫీ కూడా చేశారు. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర. -
ఆసక్తికరమైన టైటిల్‌తో కళ్యాణ్ రామ్!
‘పటాస్’ చిత్రంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి కళ్యాణ్‌రామ్. అయితే అప్పటినుంచీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక మళ్లీ వెనుకబడ్డాడు. అయినా సరే ఎలాగైనా విజయం సాధించాలని.. కొత్తగా ట్రై చేసి తమన్నాతో కలిసి ‘నా నువ్వే’ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ అదికూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కళ్యాణ్‌రామ్ సిద్దమవుతున్నాడు. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం టైటిల్‌ను సోమవారం రివీల్చేశారు. ‘118’ గా రాబోతోన్న ఈ చిత్రంలో నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నారు. Here we go.. #118 is the title of our next with @NANDAMURIKALYAN and KV Guhan.. A slick and suspenseful action thriller your way. #NKR16 pic.twitter.com/kS0vuMglvj — East Coast Prdctns (@EastCoastPrdns) December 3, 2018 -
ఇంట్రస్టింగ్ టైటిల్‌తో కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ సక్సెస్ కోసం చాలా రోజలుగా ఎదురు చూస్తున్నాడు. పటాస్ సినిమాతో బ్రేక్ వచ్చినట్టుగానే కనిపించినా తరువాత మళ్లీ గాడి తప్పాడు. ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ‘118’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కథలో ఈ నెంబర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో అదే టైటిల్‌గా ఫిక్స్ చేసే ఆలోచనటో ఉన్నారట యూనిట్. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. -
కొత్త లుక్‌లో కల్యాణ్ రామ్
నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకుడు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. అందుకోసం బాలీవుడ్ స్టైలిష్ట్ హకీం అలీం నేతృత్వంలో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు కల్యాణ్ రామ్. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరునగాని, జనవరి లోగాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. -
జంతుర్ మంతర్ సైలెన్స్... యాక్షన్!
మాట్లాడటానికి భాష కావాలి కానీ భావాలను చెప్పడానికి అక్కర్లేదు. ఆలకిస్తే మౌనం కూడా మాట్లాడుతుంది. అర్థం చేసుకునే మనసు ఉంటే కళ్లు కూడా కథలు చెబుతాయి. ఇలాంటప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై ప్రతిభ ఉన్న యాక్టర్స్‌తో పాటు మూగజీవాలు నటిస్తే తప్పేముంది! ప్రేక్షకులకు మంచి వినోదం దొరుకుతుంది. ప్రస్తుతం మూగజీవాలు కీలకపాత్రలుగా రూపొందుతున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. తోడుగా... విశ్వాసంగా...! వెండితెర దేవదాస్‌కు మందు బాటిల్‌తో తోడుగా ఉంది కుక్కే. అందుకనే కదా మూగజీవాల్లో విశ్వాసానికి పర్యాయపదంగా కుక్కను చెబుతారు. కానీ తప్పుడు శిక్షణ ఇచ్చామో.... ‘ఒక్కడు’ సినిమాలో తెలంగాణ శకుంతల ఉన్న క్లైమాక్స్ సన్నివేశాన్ని ఓసారి గుర్తు చేసుకోవడమే. మరీ.. ఇప్పుడు కుక్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న సౌత్ సినిమాల గురించి తెలుసుకుందాం. రాత్రివేళలో గుర్కా చేతిలో టార్చిలైట్‌తో పాటు ఓ కుక్క ఉంటే దొంగల పని అరికట్టడం మరింత సులువు అవుతుంది. అలా ఓ సెక్యూరిటీ గార్డ్ తనకు ఎదురైన ఓ సమస్యను ఓ కుక్క సాయంతో ఎలా పరిష్కరించాడనే నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘గుర్కా’. ఈ సినిమాలో సెక్యూరిటీ గార్డుగా హాస్యనటుడు యోగిబాబు లీడ్ రోల్ చేస్తున్నారు. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. అలాగే కన్నడ ‘కిర్రిక్‌పార్టీ’ సినిమాతో ఫేమ్ సంపాదించిన రక్షిత్ శెట్టి ప్రస్తుతం ‘777 చార్లీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఓ రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ డాగ్ రక్షిత్‌కు ఎప్పుడూ తోడుగా ఉంటుందట. ఉండి? ఏం చేస్తుంది? అంటే వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు ఈ సినిమా దర్శకుడు కిరణ్‌రాజ్. గొరిల్లా ప్లాన్! తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌లోకి ‘గోరిల్లా’ను చేర్చుకుని ఓ ప్లాన్ వేశారు యాక్టర్ జీవా. ఆ ప్లాన్ తాలూకు డీటైల్స్ షాలినీ పాండేకి తెలుసు. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించారు. అలాగే జీవా ప్లాన్ సక్సెస్ కావడం కోసం గొరిల్లా చేత గన్పట్టించారు జీవా. మరి.. గొరిల్లా ఎవర్ని షూట్ చేసిందనే విషయం సిల్వర్‌స్క్రీన్‌పై చూసి తెలుసుకోవాల్సిందే. పగ పట్టిందెవరు? అసలు పాములు పగపడతాయా? వాటికి శక్తులు ఉన్నాయా? అమావాస్య, పౌర్ణమి వంటి సందర్భాలతో పాములకు ఏవైనా లింక్ ఉందా? ఇటువంటి విషయాలపై ఎప్పటినుంచో పరిశోధన జరుగుతూనే ఉంది. సైన్స్ సంబం«ధీకులు ‘నో’ అంటే దైవాన్ని నమ్మేవారు ‘ఎస్’ అంటున్నారు. ఇవన్నీ ఏమో కానీ ఈ కథనాలపై చాలా సినిమాలే వచ్చాయి. తాజాగా తమిళంలో ‘నీయా 2’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో జై, వరలక్ష్మి శరత్‌కుమార్, కేథరిన్, రాయ్ లక్ష్మీ నటిస్తున్నారు. ఇందులో హీరో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా నటిస్తున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల కీబోర్డ్ పట్టుకోవాల్సిన జై.. నాగస్వరం ఊదుతారట. ఎందుకంటే వెండితెరపై చూడండి అంటున్నారు ‘నీయా 2’ దర్శకుడు ఎల్. సురేశ్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయిందని టాక్. అలాగే చిరంజీవి హీరోగా నటించిన ‘పున్నమినాగు’, సాయికుమార్ నటించిన ‘నాగదేవత’ సినిమాల్లో పాము లక్షణాలు హీరో పాత్రల్లో కనిపిస్తాయి. కానీ ‘పాంబన్’ సినిమా కోసం సగం పాముగా మారారు తమిళ నటుడు శరత్ కుమార్. ఈ సినిమాకు ఎ. వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రి శరత్ కుమార్‌తో కలిసి నటిస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. మూగజీవాలతో షూటింగ్ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో కష్టపడాలి. ముఖ్యంగా లొకేషన్లో టీమ్ అందరూ చాలా ఓర్పుగా ఉండాలి. ఒక్కోసారి చిన్న షాట్ కోసం కూడా చాలా టైమ్ వెచ్చించాల్సి రావచ్చు. అలాగే సినిమా విడుదల సమయంలో సంబంధిత అధికారుల నుంచి టీమ్ అనుమతి పొందాల్సిందే. ఎలాగూ గ్రాఫిక్స్ వర్క్స్ ఉండనే ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉన్నా.. పర్లేదు. సినిమా చూసి ఆడియన్స్ ఆనందపడాలి. కాసుల రూపంలో ఆ సంతోషం మాకు షేర్ కావాలి అని ఆయా సినిమా నిర్మాతలు అనుకుంటున్నారు. ఇలాంటి సినిమాలను ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టపడతారని అనుకోవచ్చు. అదుగోనండీ బంటీ సాధారణంగా పందిపిల్ల అంటే అందరూ అదోరకంగా చూస్తారు. అదే వెండితెరపై విన్యాసాలు చేస్తే ఎంజాయ్ చేయకుండా ఉండరు. ఈ థ్రిల్ కోసమే దాదాపు రెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు దర్శక–నటుడు రవిబాబు. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అదుగో’. ఈ సినిమాలో బంటీ అనే కీలకపాత్రలో పందిపిల్లను నటింపజేశారు టీమ్. అంతేకాదు.. ఈ సినిమాకు లైవ్ యాక్షన్ 3డీ యానిమేషన్ టెక్నాలజీని కూడా యాడ్ చేశారు చిత్రబృందం. ఈ సినిమాను భారతీయ అన్ని భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులో ‘అదుగో’ పేరుతో విడుదల చేస్తారు. మిగిలిన భాషల్లో ‘బంటీ’ అనే టైటిల్ పెట్టారు. అన్నట్లు ఈ సినిమాలో బంటీపై పాటలు కూడా ఉన్నాయటండోయ్. ఈ సినిమాలో నటి పూర్ణ ఓ స్పెషల్ సాంగ్ కూడా చేశారు. వర్మ, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి స్వరకర్త. త్వరలో విడుదల కానుంది. ‘అదుగో’ లో బంటి గజ రాజసం అడవి నేపథ్యంలో సినిమా వెండితెరపైకి వస్తుందంటే అందులో కచ్చితంగా ఒక్కసీన్‌లో అయినా గజరాజు కనిపిస్తాడు. ఆ మాటకొస్తే... ఎన్టీఆర్ ‘అడవిరాముడు’, చిరంజీవి ‘అడవిదొంగ’, రాజేంద్రప్రసాద్ ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాల్లో గజరాజు పాత్ర ఎంత పవర్ఫుల్లో ప్రేక్షకులకు తెలియనిది కాదంటారా. ఏనుగుతో ఈ వెండితెర మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికే టాలీవుడ్ టార్జాన్ రానా, బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్, ‘తమిళ బిగ్‌బాస్ 2’ ఫేమ్ అరవ్ ప్రయత్నిస్తున్నారు. అడవి జీవితం ఎలా ఉందో బందేవ్ని అదేనండీ... రానాని పలకరిస్తే... థాయ్‌లాండ్, కేరళ అడవుల్లో తాను తిరిగిన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేస్తున్నారట. ముఖ్యంగా ఏనుగులతో గడిపిన సీన్స్‌ను గుర్తుచేస్తున్నారట. ఇదంతా ఆయన తాజాగా నటిస్తున్న ‘అరణ్య’ సినిమా ప్రభావమని ఊహించవచ్చు. రానా హీరోగా నటిస్తున్న ‘అరణ్య’ సినిమాకు ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్‌కు ‘కాదన్’ అని, హిందీ వెర్షన్‌కు ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రానా ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్లో ఏనుగుల భాషను బాగా అర్థం చేసుకుని వాటితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నారు బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్. జమాల్‌కు ఈ అవసరం ఎందుకొచ్చిందంటే ‘జంగ్లీ’ సినిమా కోసం. మనుషులకు–ఏనుగులకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఆధారంగానే ఈ సినిమా రూపొందుతోంది. థాయ్‌లాండ్‌లో ఎక్కువగా షూట్ చేశారు. ఈ సినిమాకు అమెరికన్ డైరెక్టర్ చెక్ రసెల్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అరవ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘రాజ్ భీమా’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు నరేశ్ సంపత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కేవలం గజరాజు మాత్రమే కాదు. మిగతా జంతువులకూ ప్రాధాన్యం ఉంటుందట. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలు విడుదలైతే చిన్నపిల్లలు ఏనుగమ్మా.. ఏనుగు.. మా ఊరి థియేటర్స్లోకొచ్చిందేనుగు అని పాడుకుంటారేమో. రానా అరవ్ జీవా, షాలినీపాండే విద్యుత్ జమాల్ యోగిబాబు రక్షిత్‌శెట్టి వరలక్ష్మి జై శరత్ కుమార్ -
చెడుగుడు
తప్పు చేశారో లేదో తెలుసుకోవడానికి చర్చలు పెడితే ఓకే. కానీ తప్పు చేసినవాడు ఎవరో తెలిసి, ఎదురుగా ఉంటే పౌరుషం ఉన్న కుర్రాడు ఊరుకుంటాడా? చెడుగుడు ఆడే స్తాడు. ప్రస్తుతం కల్యాణ్ రామ్ ఇదే చేస్తున్నారు. తప్పు చేసిన విలన్లను తుక్కురేగ్గొడుతున్నారు. కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలోని కల్యాణ్‌రామ్ క్యారెక్టర్లో మస్త్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయట. క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుందని వినికిడి. ఈ పవర్‌పుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలంటే ఇంకాస్త టైమ్ ఉంది. -
ఇక మాలీవుడ్‌లోనూ!
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా టాలీవుడ్లో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌తో బాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరో. అలాగే షాహిద్ కపూర్ హీరోగా హిందీ ‘అర్జున్ రెడ్డి’ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒరిజినల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగానే ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడు తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా మలయాళంలో కూడా రీమేక్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. మల్లూ అర్జున్‌రెడ్డి ఎవరు? అనే విషయం పై మాలీవుడ్‌లో చర్చ జరగడం ఖాయం. -
టైటిల్ కమింగ్ సూన్
ఈ ఏడాది ఆల్రెడీ రెండుసార్లు థియేటర్స్‌లో కనిపించిన కల్యాణ్ రామ్ మరో సినిమాతో రెడీ అవుతున్నారు. కెమెరామేన్ కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ థ్రిల్లర్ మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్స్‌గా యాక్ట్ చేస్తున్నారు. మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. కేవలం సాంగ్స్ షూటింగ్ వరకూ బ్యాలెన్స్ ఉందట. ఈ చిత్రం టైటిల్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో ప్రకటించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర. -
చింపాంజీ.. వెరీ చిలిపి
స్టూడెంట్ గ్యాంగ్, రౌడీ గ్యాంగ్, కామెడీ గ్యాంగ్.. ఇలా డిఫరెంట్ గ్యాంగ్‌ల గురించి వింటాం. సినిమాల్లో చూస్తాం. మరి.. గొరిల్లా గ్యాంగ్ పవర్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ‘గొరిల్లా’ సినిమా చూడాల్సిందే. కొత్త దర్శకుడు డాన్ శాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీవా, షాలినీ పాండే, యోగిబాబు, రాధా రవి, సతీష్, వివేక్ ప్రశన్న, రాజేంద్రన్ ఈ గొరిల్లా గ్యాంగ్ సభ్యులు. ‘గొరిల్లా’ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘విక్రమ్‌వేదా’ ఫేమ్ శ్యామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ‘‘చింపాజీలు చాలా తెలివైనవి. అవి చేసే చిలిపి చేష్టలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో చింపాంజీ ఓ మేజర్ క్యారెక్టర్ చేసింది. యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ తీయడానికి చింపాజీకి నాలుగు నెలలు ముందే ట్రైనింగ్ ఇప్పించాం. సినిమా విడుదల తర్వాత మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్ మెచ్చుకుంటారన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
గొరిల్లాతో గోల గోల!
విహారయాత్రకు వెళ్లినప్పుడు అడవిలో గొరిల్లాను చూస్తే భయపడతాం. అదే జూలో చూస్తే అది ఏం చేస్తుందా? అని ఆసక్తికరంగా గమనిస్తాం. మరి... అదే గొరిల్లా సినిమాల్లో ఓ కీలక పాత్ర చేస్తే ఎలా ఉంటుంది? అనేది కొన్ని సినిమాల్లో చూశాం. ఇప్పుడు మేము మళ్లీ కొత్తగా చూపించబోతున్నాం అంటున్నారు ‘గొరిల్లా’ మూవీ టీమ్. డాన్ శాండీ దర్శకత్వంలో తమిళ యాక్టర్ జీవా హీరోగా నటించిన చిత్రం ‘గొరిల్లా’. ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను కంప్లీట్ చేశారీ హీరో. మరి.. ‘గొరిల్లా’ సినిమాలో నాయకా నాయికలు జీవా, షాలినీ పాండేలు గొరిల్లాతో ఏ విధంగా గోల గోల చేశారనేది థియేటర్లో బొమ్మపడితే కానీ తెలియదు. ఈ సినిమా షూటింగ్ కోసం మార్చిలో థాయ్‌లాండ్ కూడా వెళ్లింది చిత్రబృందం. ‘రంగం, మాస్క్’ వంటి డబ్బింగ్ సినిమాల ద్వారా జీవా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘గొరిల్లా’ను కూడా తెలుగులో విడుదల చేయాలనుకుంటున్నారట. -
షూటింగ్లో నరకం అనుభవించా!
తమిళసినిమా: తారల ఆరంభ జీవితాలు బాధాకరంగా, అయ్యో పాపం అనేంతగా ఉంటాయనిపిస్తాయి. కొందరైతే లైంగిక వేధింపులు, ప్రేమలో విఫలం వంటి దుస్థితులకు గురైన వారై ఉంటారు. అలా తన ఆరంభం శోక కథే అంటోంది నటి శాలిని పాండే. తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డితో ఈ నటి పేరు మారుమోగిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్ర షూటింగ్‌లోనే నరకయాతన అనుభవించానంటోందీ భామ. ఈ మధ్య నడిగైయార్ చిత్రంలో మెరిచిన శాలినిపాండేకు ప్రస్తుతం కోలీవుడ్‌లోనే అవకాశాలున్నాయి. యువ నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా 100% లవ్, జీవాతో గొరిల్లా చిత్రాల్లో నటిస్తోంది. తన సినీరంగప్రవేశం గరించి శాలినిపాండే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను సినిమాల్లో నటించడానికి తన తల్లిదండ్రులు వ్యతిరేకించారని చెప్పింది. ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం చూసుకోమని ఒత్తిడి చేశారని అంది. తాను పట్టుబట్టి రంగస్థల నటిగా మారానని, ఆ తరువాత సినిమా అవకాశాల కోసం ఇంట్లో గొడవ పడి ముంబై వచ్చేశానని తెలిపింది. అప్పుడు తన తండ్రి శాపనార్థాలు కూడా పెట్టారని చెప్పింది. ఇకపోతే ముంబైలో ఒంటరి అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా ఇల్లు అద్దెకు ఇవ్వరని తెలిపింది. దీంతో తాను మరో అమ్మాయితో కలిసి ఇద్దరు అబ్బాయిలు ఉంటున్న ఇంట్లో అద్దెకు ఉన్నానని చెప్పింది. ఆ అబ్బాయిలు చాలా మంచి వాళ్లని, తనతో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని అంది. వారి సాన్నిహిత్యంలో కొత్త లోకాన్ని చూశానని పేర్కొంది. అర్జున్‌రెడ్డి చిత్రం సంచలన విజయం సాధించి తనకు మంచి పేరు తెచ్చి పెట్టడంతో తన కుటుంబ సభ్యులు తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పింది. తన జీవితంలో కళాశాలలో చదువుతున్న సమయంలో, సినిమాకు పరిచయం అయిన తరువాత రెండు సార్లు ప్రేమలో పడి విఫలం అయ్యానని చెప్పింది. దీంతో అర్జున్‌రెడ్డి చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ ప్రేమ వైఫల్యంతో బాధ పడ్డానని చెప్పింది. అదే సమయంలో ఆ చిత్ర హీరోతో సన్నిహిత సన్నివేశాల్లో నటించల్సి వచ్చినప్పుడు నరకయాతన అనుభవించానని శాలినిపాండే చెప్పింది. -
మహానటి స్పెషల్ స్క్రీన్ టెస్ట్
1 దర్శకుడిగా ‘మహానటి’ నాగ్ అశ్విన్‌కి రెండో సినిమా. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏంటో తెలుసా? ఎ) పెళ్ళిచూపులు బి) ఘాజీ సి) అర్జున్ రెడ్డి డి) ఎవడే సుబ్రమణ్యం 2 సావిత్రి పెళ్లి చేసుకున్న జెమినీ గణేశన్ హీరో కాకముందు సినీ పరిశ్రమలో ఏ శాఖలో పని చేసేవారు? ఎ) దర్శకుడు బి) ఎడిటర్ సి) సింగర్ డి) కాస్టింగ్ మేనేజర్ 3 ‘మహానటి’ చిత్రంలో సావిత్రి స్నేహితురాలు సుశీలగా నటించిన నటి ఎవరో తెలుసా? ఆమె గతేడాది నటించిన ఓ తెలుగు సినిమా బ్లాక్‌బస్టర్ హిట్? ఎ) షాలినీ పాండే బి) సమంత సి) అనుష్క డి) మాళవికా నాయర్ 4 సావిత్రి మొదట మద్రాసులో అడుగుపెట్టినప్పుడు ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నటించారు. అయితే హీరోయిన్గా కాదు. ఆ సినిమా పేరేంటి? ఎ) పాతాళభైరవి బి) సంసారం సి) పలలెటూరి పిల్ల డి) అర్ధాంగి 5 1957లో వచ్చిన ‘మాయా బజార్’ చిత్రంలో సావిత్రి ఓ పాత్రను అనుకరించారు. ఆమె ఏ పాత్రను అనుకరించారో తెలుసా? ఎ) కృష్ణుడు బి) అర్జునుడు సి) అభిమన్యుడు డి) ఘటోత్కచుడు 6 అక్కినేని నాగేశ్వరరావుతో సావిత్రి నటించిన ‘దేవదాసు’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) వేదాంతం రాఘవయ్య బి) ఘంటసాల బలరామయ్య సి) విఠలాచార్య డి) కమలాకర కామేశ్వరరావు 7 ‘మహానటి’ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ ‘తొడరి’ అనే ఓ తమిళ సినిమా చూస్తున్నప్పుడు కీర్తీ సురేశ్‌ను సావిత్రిలా ఊహించుకున్నారట. ఆ తమిళ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) బాబీ సింహ బి) శివ కార్తికేయన్ సి) ధనుష్ డి) సూర్య 8 1962వ సంవత్సరంలో ‘సావిత్రి గణేశ్’ పేరు మీద ‘వడ్డివారి పాలెం’అనే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మించారు. అది ఏ జిల్లాలో ఉందో తెలుసా? ఎ) నెల్లూరు జిల్లా బి) కృష్ణా జిల్లా సి) గుంటూరు జిల్లా డి) చిత్తూరు జిల్లా 9 ‘మహానటి’ కథ వినమని ఓ హీరో కీర్తీ సురేశ్‌ను రికమెండ్ చేసి, ఆ చిత్రదర్శకుణ్ణి ఆమెకి పరిచయం చేశారు. సినిమా రిలీజైన తర్వాత ఆ హీరోకు కృతజ్ఞతలు తెలిపారామె. ఆ తెలుగు హీరో ఎవరు? ఎ) విజయ్ దేవరకొండ బి) నానీ సి) రామ్ డి) దుల్కర్ సల్మాన్ 10 సావిత్రి దర్శకత్వం వహించిన మొదటి సినిమా పేరేంటో తెలుసా? ఎ) చిన్నారి పాపలు బి) మాతృదేవత సి) చిరంజీవి డి) వింత సంసారం 11 సినిమాల్లోకి రాకముందు సావిత్రి ఓ నాటక సమాజంలో డాన్స్ చేసేవారు. ఆ నాటక సమాజ యజమాని తర్వాతి కాలంలో సినిమాల్లో అద్భుతంగా రాణించిన నటుడు. ఎవరా నాటక సంఘ యజమాని? ఎ) గుమ్మడి బి)చిత్తూరు వి.నాగయ్య సి) ఎస్వీ. రంగారావు డి) కొంగర జగ్గయ్య 12 ‘మహానటి’లో ఓ సీన్లో యస్వీ రంగారావు పాత్రను చేసిన మోహన్‌బాబు సావిత్రి పాత్రధారి కీర్తీ సురేశ్‌కు ఓ సీన్లో భోజనం పెట్టించినట్లు చూపిస్తారు. కానీ ఒరిజినల్‌గా ఆ టైమ్‌లో భోజనం పెట్టింది వేరే నటుడని కొందరు అంటున్నారు. వాళ్లు చెప్పిన ఆ నటుడెవరు? ఎ) రమణా రెడ్డి బి) గుమ్మడి సి) రేలంగి డి) కాంతారావు 13 సావిత్రి భర్త జెమినీ గణేశన్ అసలు పేరు ‘రామస్వామి గణేశన్’. ఆమె ఆయన్ని ఏ సంవత్సరంలో వివాహం చేసుకున్నారో తెలుసా? ఎ) 1950 బి) 1951 సి) 1952 డి) 1954 14 1960వ సంవత్సరంలో సావిత్రి రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ఆమెకు అవార్డు తెచ్చిన ఆ సినిమా పేరేంటో తెలుసా? ఎ) చివరకు మిగిలేది బి) తొలిప్రేమ సి) బాంధవ్యాలు డి) మూగజీవులు 15 ‘మహానటి’ చిత్రంలో కె.వి. చౌదరి పాత్రను పోషించిన నటుడెవరు? ఎ) మోహన్ బాబు బి) రాజేంద్ర ప్రసాద్ సి) నాగచైతన్య డి) క్రిష్ 16 సావిత్రి ఏ సంవత్సరంలో తనువు చాలించారో తెలుసా? ఎ) 1978 బి) 1991 సి) 1988 డి) 1981 17 సావిత్రి భర్త జెమినీ గణేశన్ ఆమెని ఏమని పిలిచేవారో కనుక్కోండి? ఎ) శ్రీమతి గారు బి) అమ్మణి సి) అమ్మాడి డి) బేబి 18 దిగ్దర్శకుడు కె.వి రెడ్డి ఓ చిన్న డాన్స్ సీక్వెన్స్‌లో నటించటానికి సావిత్రిని ఆడిషన్ చేశారు. అది చాలా చిన్న పాత్ర. అది ఏ సినిమా కోసమో తెలుసా? ఎ) రూపవతి బి) దేవదాసు సి) పాతాళభైరవి డి) ఆదర్శం 19 ‘దేవదాసు’ చిత్రంలో పార్వతి పాత్రకు మొదట అనుకున్న నటి సావిత్రి కాదు. మరి ఆ నటెవరో తెలుసా? ఎ) షావుకారు జానకి బి) భానుమతి సి) అంజలీదేవి డి) జమున 20 సావిత్రి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) మూగ మనసులు బి) చదువుకున్న అమ్మాయిలు సి) డాక్టర్ చక్రవర్తి డి) తోడి కోడళ్లు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (డి) 2) (డి) 3) (ఎ)4) (బి) 5) (డి) 6) (ఎ) 7) (సి) 8) (సి) 9) (బి) 10) ఎ 11) (డి) 12) (బి) 13) (సి) 14) (ఎ) 15) (బి) 16) (డి) 17) (సి)18) (సి) 19) (ఎ)20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
మహానటిపై క్యూరియాసిటీని పెంచేస్తోంది
-
సస్పెన్స్ థ్రిల్లర్ స్టార్ట్
కల్యాణ్ రామ్ మాంచి జోరుమీదున్నారు. మార్చిలో ‘ఎంఎల్ఏ’గా ప్రేక్షకుల్ని అలరించిన ఆయన నటించిన తాజా చిత్రం ‘నా నువ్వే’ మే 25న విడుదల కానుంది. ‘నా నువ్వే’ నిర్మాణ సంస్థలోనే కల్యాణ్‌రామ్ హీరోగా మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. నందమూరి రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఇందులో నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లు. ఈ సందర్భంగా మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘మే 2న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు శేఖర్ చంద్రగారు చాలా మంచి సంగీతాన్ని అందిస్తారనే సంగతి తెలిసిందే. ఆయన మా సినిమాకు సంగీతం అందించనుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. కథ చాలా బాగా వచ్చింది’’ అన్నారు గుహన్. ‘‘తెలుగులో నా రెండో సినిమా ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు షాలినీ పాండే. ‘‘ఈ చిత్రకథని గుహన్‌గారు తమిళంలో వినిపించారు. తెలుగు సినిమాలకు ఆరు నెలలు దూరంగా ఉన్నా. మహేశ్‌గారితో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నివేథా థామస్. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర పాల్గొన్నారు. -
నలుగురు ముద్దుగుమ్మలతో..
తమిళసినిమా: నటుడు దుల్కర్ సల్మాన్ కోలీవుడ్‌పై మక్కువ చూపిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ అన్న విషయం తెలిసిందే. ఈయన మాతృభాషలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా, వాయై మూడి పేసవుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. బాలాజీమోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పర్వాలేదనిపించుకున్నా, ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీఛాన్స్ వరించింది. అలా ఒరు కాదల్ కణ్మణి చిత్రంతో తమిళ ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ఆ తరువాత మరోసారి మణిరత్నం చిత్రంలో అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోలేదు. ఇటీవల సోలో అనే చిత్రంలో నటించారు. మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ బహు భాషా నటుడిగా రాణిస్తున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం కన్నుమ్ కన్నుమ్ కొళ్లైయడిత్తాల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా మరో తమిళ చిత్రానికి పచ్చజెండా ఊపారు. కొత్త దర్శకుడు కార్తీక్ పరిచయం అవుతున్న ఈ చిత్రంలోనే దుల్కర్‌సల్మాన్‌తో నలుగురు కథానాయికలు రొమాన్స్ చేయనున్నారని సమాచారం. ఇందులో తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి ఫేమ్ శాలిని పాండే, నటి నివేదా పేతురాజ్ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో ఇద్దరి ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాను తమిళ్ తో పాటు మలయాళంలోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. -
అదే బ్యానర్లో మరో సినిమా
త్వరలో నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కల్యాణ్ రామ్.. తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడు. ఏప్రిల్ 25న కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాను కూడా నా నువ్వే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే నిర్మించనున్నారు. జల్సా, దూకుడు, ఆగడు లాంటి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నా నువ్వే మేలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. -
మహేష్ 25.. ఆమె హీరోయిన్ కాదు!
భరత్ అనే నేను చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 25వ చిత్రంగా ఇది తెరకెక్కబోతోంది. దాదాపుగా విదేశాల్లోనే ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డేను అల్రెడీ తీసేసుకోగా.. ఇప్పుడు మరో హీరోయిన్‌కు ఛాన్స్ దక్కినట్లు వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేను ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం మేకర్లు సంప్రదించగా.. ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర కాదని.. ఓ కీలక పాత్ర మాత్రమేనని చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. దిల్ రాజు, అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించబోతున్నాడు. అల్లరి నరేష్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. భరత్ అనే నేను చిత్రం విడుదల తర్వాత మహేష్.. కాస్త గ్యాప్ తీసుకుని 25వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. -
వారికి బానిసైపోయా!
తమిళసినిమా: నేను దానికి బానిసనైపోయానంటోంది నటి శాలినిపాండే. టాలీవుడ్లో ఒకే ఒక్క చిత్రం ఈ అమ్మడిని పిచ్చ పాపులర్ చేసేసింది. అదే తనను కోలీవుడ్ వరకూ తీసుకొచ్చింది. విశేషం ఏమిటంటే ఇక్కడ ఒక్క చిత్రం కూడా తెరపైకి రాకుండానే వరుసగా మూడు చిత్రాలను చేసేస్తోంది. యమ కిక్ ఇచ్చే లక్ అంటే ఇదే మరి. తెలుగులో సంచలన విజయం సాధించిన 100% లవ్ చిత్ర తమిళ రీమేక్ ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్న ఈ స్టేజీ ఆర్టిస్ట్ ఈ చిత్ర విడుదల కాకుండానే జీవాకు జంటగా గొరిల్లా, చిత్రంతో పాటు తెలుగు, తమిళం భాషల్లో నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న మహానది చిత్రంలోనూ నటిస్తున్నారు. మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించే విషయమై ఒప్పందాలు కుదుర్చుకున్న శాలినిపాండే మాట్లాడుతూ తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి చిత్రం ద్వారా దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యానని చెప్పింది. అందులో ప్రీతి పాత్రలో లీనమై నటించానని, ఆ పాత్ర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పింది. తాను ఎక్కడికి వెళ్లినా ప్రీతి అంటూ పిలుస్తున్నారని అంది. అలాంటిప్పుడు తాను చాలా భావోద్రేకాలకు గురవుతానని చెప్పింది. అలా వారి అభిమానానికి తాను బానిసనైపోయానని చెప్పింది. అయితే అర్జున్‌రెడ్డి చిత్రం తెచ్చి పెట్టిన పేరును తాను తలకెక్కించుకోలేదని, ఎప్పటిలానే ఉన్నానని పేర్కొంది. అయితే ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందినట్లు కోలీవుడ్ ప్రేక్షకుల మనసులను మంచి పాత్రలతో గెలుచుకోవాలని ఆశ పడుతున్నానని శాలినిపాండే అంటోంది. -
అవును.. నేను ప్రేమలో ఉన్నాను..
సాక్షి, సిటీబ్యూరో: ‘అవును.. నేను ప్రేమలో ఉన్నాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. ఇలా అందరినీ ప్రేమిస్తాను. అలాగని మీరంటున్న ప్రేమలో పడనని కాదు. ఎప్పుడు ప్రేమలో పడతామో చెప్పలేం. అది తెలియకుండా జరిగిపోతుంది. ఇప్పుడు మాత్రం ప్రేమలో లేన’ని చెప్పింది షాలినీపాండే. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ.. కుటుంబంతో గడిపే సమయమే చిక్కడం లేదు. ఇక ప్రేమలో పడే సమయం ఎక్కడా? అని సెలవిచ్చింది. తొలి సినిమాతోనే ప్రశంసలందుకున్న షాలిని... ఇప్పుడు ‘నా ప్రాణమే’ పాటతో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో మెరిసింది. వాలెంటైన్స్ డేకి విడుదలైన ఈ ఆల్బమ్ మంచి హిట్స్ సాధించింది. సింగర్‌గానూ అలరించిన షాలిని ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... షాలినీపాండే నేను థియేటర్ (రంగస్థలం) బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. రంగస్థలం, సినిమా రెండు వేర్వేరు. నాటకంలో ప్రత్యక్షంగా ప్రేక్షకుల స్పందన చూస్తూ పాత్రను పండించాల్సి ఉంటుంది. సినిమా పూర్తయి విడుదలైతే గానీ ప్రజల అభిప్రాయం తెలియదు. అయితే దేని గొప్పదనం దానిదే. నా మట్టుకు నాకు అభినయానికి అవకాశమున్న పాత్ర లభిస్తే ఏదైనా ఇష్టమే. ప్రస్తుతం తెలుగులో ‘సావిత్రి’ సినిమాలో ప్రాధాన్యమున్న పాత్ర పోషిస్తున్నాను. ఇంకా కొన్ని చర్చల్లో ఉన్నాయి. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. ఒక భాషా పరిశ్రమలో సెటిలవ్వాలని అనుకోవడం లేదు. ఏ భాషలో అయినా సరే పాత్ర బాగుండాలి. అది నేను చేయాలి అనుకోవాలి. అభినయానికి అవకాశం ఉండాలి. అర్థరహిత పాత్రలు చేయాలనుకోవడం లేదు. నటించడం నాకు ఇష్టం. అలాగే డ్యాన్స్ కూడా పెర్ఫార్మెన్స్లో భాగమేనని నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు టాప్‌లో ఉన్న వారిని చూసి, ఆ పొజిషన్లోకి వెళ్లాలనే లక్ష్యాలు పెట్టుకోను. నాకు రోల్ మోడల్స్ అంటూ లేరు. మాధురి దీక్షిత్, గురుదత్, కమల్‌హాసన్... ఇలా ఎందరినో అభిమానిస్తాను. వారి అభినయాన్ని ఇష్టపడతాను. అయితే ప్రేక్షకులకు నేను షాలినిగా మాత్రమే గుర్తుండాలి. నాకు సొంత ఐడెంటిటీ ఉండాలి. నటన అనేది నాకొక ప్రొఫెషన్ మాత్రమే కాదు... అదొక ఎమోషనల్ థింగ్ ఫర్ మి. నాకు పాటలంటే మహా ఇష్టం. సంగీతం మాత్రం నేర్చుకోలేదు. మా అమ్మగారు క్లాసికల్ సింగర్. ఓ రకంగా ఈ సింగింగ్ టాలెంట్ కొంతం దైవ ప్రసాదం, కొంత అమ్మ నుంచి వచ్చింది. బెంగళూర్‌కి చెందిన లగోరి బ్యాండ్‌ని ముంబైలో తొలిసారి కలిశాను. నాలుగేళ్లుగా వారితో ప్రయాణం సాగుతోంది. విభిన్న భాషల్లో పాటలు విడుదల చేసిన వీరు... వాలెంటైన్స్ డేకి తెలుగులో పాట రూపొందించాలని అనుకున్నారు. తెలుగులో పాడడం అనగానే నేను వెంటనే ఒప్పుకున్నాను. ఈ ఆల్బమ్‌ను బెంగళూర్‌లో సినిమా షూటింగ్‌లు చేసే ప్లేస్‌లో కేవలం ఒక్క రోజులోనే షూటింగ్ చేశారు. ఇందులో నాతో పాటు బ్యాండ్‌కు చెందిన గాయకుడు తేజాస్ మేల్ వాయిస్ ఇచ్చారు. గీత్ బ్యాండ్ మేనేజర్, సినీ గీత రచయిత కృష్ణకాంత్ పాట రాశారు. కరణ్ చావ్లా డైరెక్టర్‌గా వ్యవహరించారు. వ్యక్తిగతంగా ఈ ఆల్బమ్ చాలా ఆనందాన్నిచ్చింది. ఇంకెవరైనా మంచి కాన్సెప్ట్‌తో వస్తే ఇలాంటి ఆల్బమ్స్ చేయడానికి నేను రెడీ. భవిష్యత్తులో సొంత సినిమాల్లో పాడే అవకాశం వస్తే ఫుల్ హ్యాపీ. ఐ లైక్ సిటీ... అర్జున్‌రెడ్డి సినిమా కోసం చాలా రోజులు హైదరాబాద్‌లో ఉన్నాను. ఈ సిటీ నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అలాగే నాకు చాలా ఇష్టమైన ప్లేస్‌లు కూడా ఎన్నో ఉన్నాయి. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా నా స్టైలిస్ట్ మేఘనతో చాలా టైమ్ స్పెండ్ చేస్తాను. ప్రస్తుతం ముంబై నుంచి హైదరాబాద్, చెన్నైకి రాకపోకలు సాగుతున్నాయి. అయితే హైదరాబాద్‌లో సెటిలవుతానా? మరెక్కడైనానా? అనేమీ అనుకోలేదు. సరికొత్త షాలిని... ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో ప్రీతి క్యారెక్టర్ కోసం బరువు పెరిగాను. నిజానికి నేను సన్నగా ఉంటాను. ఆ క్యారెక్టర్‌కి బొద్దుగా ముద్దుగా ఉండడం అవసరం కాబట్టి, దానికి అనుగుణంగా బరువు పెరిగాను. అయితే ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాను. సో... కొత్త పాత్రలో సరికొత్త షాలినీని చూస్తారు మీరు. -
మరో అవతారంలో షాలినీ...
అర్జున్‌రెడ్డి ఫేమ్ షాలీనీ పాండే ‘నా ప్రాణమై...’ అంటూ సాగే ఓ ప్రైవేట్ సాంగ్‌ను ఇటీవల రికార్డ్ చేశారు. ‘లగోరీ’ అనే ఇండియన్ బ్యాండ్ కంపోజ్ చేసిన ఈ పాటకు షాలినీ తన వాయిస్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు. షాలినీ మొదటి సినిమాలోనే తెలుగు డబ్బింగ్ చెప్పుకుని ‘బేబీ.. బేబీ... ’ అంటూ ఆడియన్స్‌ను అలరించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఏకంగా తెలుగులో పాట పాడి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇదిలా ఉంటే షాలినీ ‘అర్జున్ రెడ్డి’ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోతున్నారు. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో, జీ.వీ.ప్రకాశ్‌తో ‘100% లవ్’ తమిళ రీమేక్ ‘100% కాదల్ లో, జీవా సరసన ‘గొరిల్లా’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
షాలినీ రాగం
షాలినీ రాగమా! ఇదెక్కడి రాగం? అసలు ఇలాంటి రాగం ఒకటి ఉందా అని అవాక్కవుతున్నారా? ఇది రాగం పేరు కాదండీ షాలినీ పాండే తీస్తున్న రాగం. ‘బేబీ.. బేబీ... ’ అంటూ ‘అర్జున్ రెడ్డి’లో బుజ్జి బుజ్జిగా తెలుగు పలుకులు పలికారు ప్రీతీ శెట్టి. అదేనండి షాలినీ పాండే. ఫస్ట్ సినిమాకే తెలుగు డబ్బింగ్ చెప్పుకుని తెలుగు ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచారీ జబల్పూర్ భామ. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరచటానికి రెడీ అయ్యారు షాలినీ. ఈసారి ఏకంగా పాట పాడేశారామె. ‘నా ప్రాణమై...’ అంటూ సాగే ఓ ప్రైవేట్ సాంగ్‌ను ఇటీవల రికార్డ్ చేశారు షాలినీ. ‘లగోరీ’ అనే ఇండియన్ బ్యాండ్ కంపోజ్ చేసిన ఈ పాటకు షాలినీ తన వాయిస్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ 14న ఈ పాటను రిలీజ్ చేయనున్నారట. తొలి సినిమాతోనే తెలుగు డబ్బింగ్ చెప్పుకొని, రెండో సినిమా కూడా రిలీజ్ కాకముందే ఓ పాటను పాడటం విశేషమే కదండి. ఇదిలా ఉంటే ‘అర్జున్ రెడ్డి’ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోతున్నారు షాలినీ. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో, జీ.వీ.ప్రకాశ్‌తో ‘100% లవ్’ తమిళ రీమేక్ ‘100% కాదల్ లో, జీవా సరసన ‘గొరిల్లా’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
రూటు మార్చిన అర్జున్ రెడ్డి హీరోయిన్
-
రూటు మార్చిన అర్జున్ రెడ్డి హీరోయిన్
సాక్షి, సినిమా : థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన షాలిని పాండే.. అర్జున్ రెడ్డి చిత్రంతో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ప్రీతి పాత్రలో ఆమె ఇచ్చిన ఫెర్ఫార్మెన్స్ దెబ్బకు మిగతా భాషల్లో కూడా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే షాలిని ఇప్పుడు మరో రూట్లోకి వెళ్లి సింగర్ అవతారం ఎత్తింది. ప్రేమికుల రోజు ప్రత్యేకం ‘నా ప్రాణమే’ అంటూ ఓ స్పెషల్ వీడియో ఆల్బమ్‌లో కోసం తన గళం వినిపించింది. పాప్ రాక్ బ్యాండ్ ‘లగోరీ’ కంపోజ్ చేసిన ఈ పాటలో షాలిని గాత్రం ఆకట్టుకుంది. ఈ పాటకు సంబంధించిన చిన్న టీజర్‌ను నెట్లో వదిలారు. చాలా కాన్ఫిడెంట్‌తో షాలిని పాటను పాడగా.. అద్భుతంగా ఉన్న ఆమె గాత్రం... అందుకు తగ్గట్లే మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పూర్తి పాటను విడుదల చేయనున్నారు. చూస్తుంటే సింగర్‌గా కూడా ఆమె సక్సెస్ అవుతుందనే అనిపిస్తోంది. ఇక సినిమాల పరంగా చూసుకుంటే సావిత్రి బయోపిక్ మహానటితోపాటు, కోలీవుడ్‌లో 100% లవ్ రీమేక్‌లో షాలిని పాండే హీరోయిన్గా నటిస్తోంది. -
లాస్ట్ ఇయర్ సంక్రాంతి... ఈ ఇయర్ పొంగల్ – షాలినీ పాండే
సంక్రాంతి మెమరీస్ పెద్దగా లేవు. ఎందుకంటే మేం పెద్దగా సెలబ్రేట్ చేసుకోం. ఇక్కడికొచ్చాకే (హైదరాబాద్) సంక్రాంతి గురించి తెలిసింది. ‘అర్జున్ రెడ్డి’ చేస్తున్నప్పుడు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూశాను. చక్కెర పొంగలి చాలా టేస్టీగా అనిపించింది. ఫెస్టివల్ టైమ్‌లో ఎక్కడ చూసినా గాలిపటాలే. ఇంత బాగా ఎగరేస్తారని నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ తెలుగు సినిమా చేస్తే.. ఈ ఇయర్ తమిళ సినిమా ‘100% కాదల్’ (తెలుగు ‘100% లవ్) రీమేక్) షూటింగ్లో ఉన్నాను. ఈ సెట్స్‌లో పొంగల్ (సంక్రాంతి) సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ విధంగా తమిళనాడులో ఎలా పండగ చేస్తారో తెలిసింది. నేను ఆర్టిస్ట్ అవ్వడంవల్లనే అన్ని సంప్రదాయాలు తెలుసుకోగలుగుతున్నాను. ఇక్కడి అమ్మాయిని అనే ఫీల్ కలుగుతోంది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన నన్ను ఇక్కడివారు తమ అమ్మాయిలా ఆదరిస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. -
చింపాంజీతో జీవా
తమిళసినిమా: చింపాంజీతో కలిసి వినోదాల విందునివ్వడానికి నటుడు జీవా సిద్ధం అవుతున్నారు. ఆయనతో వర్ధమాన నటి శాలినిపాండే జోడి కడుతోంది. కీ చిత్రంతో త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతున్న నటుడు జీవా తాజా చిత్రానికి రెడీ సిద్ధం అయిపోతున్నారు. ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై విజయరాఘవేంద్ర హైయస్ట్ కామెడీ థ్రిల్లర్ కథతో భారీ వ్యయంతో నిర్మించినున్న ఈ చిత్రానికి గోరిల్లా అనే టైటిల్‌ను నిర్ణయించారు. తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి ఫేమ్ శాలినిపాండే నాయకిగా నటించనున్న ఇందులో నిజ చింపాంజీ టైటిల్ పాత్రలో నటించనుంది. దీనికి డాన్శాండి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ చింపాంజీలు చాలా తెలివిగా, జాలీగా ఉండడానికి కారణం వాటి అల్ల రితనమేనన్నారు. అలాంటి ఇతివృత్తంతో రూపొందించనున్న చిత్రం గెరిల్లా అని వివరించారు. ఇందులో జీవా, శాలినిపాండే హీరోహీరోయిన్లుగా నటించనుండగా థాయ్‌లాండ్‌కు చెందిన చింపాంజీ ముఖ్య పాత్రలో నటించనుందని తెలిపారు. ఈ చింపాంజీకి థాయ్‌లాండ్‌లోని సాముట్ అనే సంతు శిక్షణ కేంద్రంలో నాలుగు నెలల పాటు శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. హాలీవుడ్ చిత్రాలు హెంగోవర్–2, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ వంటి చిత్రాల్లో నటించిన చింపాంజీలు ఈ కేంద్రంలోనే శిక్షణ పొందాయన్నది గమనార్హం. గెరిల్లా చిత్రం పూర్తి వినోదాత్మకంగానూ, అదే సమయంలో చాలా థ్రిల్లింగ్‌గానూ ఉంటూ ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. చిత్ర షూటింగ్‌ను జనవరిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనికి విక్రమ్‌వేదా చిత్రం ఫేమ్ శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారని తెలిపారు. -
అర్జున్‌రెడ్డికి నో...
...అవును. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీ రీమేక్‌లో నటించేందుకు రణ్వీర్ సింగ్ ‘నో’ చెప్పారట. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం టాలీవుడ్లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో హీరో, హీరోయిన్, డైరెక్టర్, స్నేహితుడి పాత్రధారి రాహుల్ ఓవర్‌నైట్ స్టార్లుగా మారిపోయారనడం అతిశయోక్తి కాదేమో. తెలుగునాట ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాను హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేసేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నారు. హిందీ, కన్నడ భాషల్లో ఇతర దర్శకులు రీమేక్ చేస్తున్నా హిందీకి మాత్రం సందీప్ రెడ్డే దర్శకత్వం వహిస్తారనీ, రణ్‌వీర్‌సింగ్ లీడ్ రోల్లో నటిస్తారని వార్తలు వినిపించాయి. రణ్‌వీర్‌కి కథ వినిపించడంతో నటించేందుకు తొలుత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారట. ‘అర్జున్‌రెడ్డి’ కంటెంట్ బోల్డ్‌గా ఉండడమే ఇందుకు కారణమట. ‘పద్మావతి’ సినిమాలో రణ్వీర్ చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రే ఇప్పటికే వివాదం కావడంతో ‘అర్జున్‌రెడ్డి’ వంటి మరో వివాదాస్పద పాత్రలో నటించడం ఇష్టం లేక ‘నో’ చెప్పారట. రణ్వీర్ స్థానంలో ఇప్పుడు షాహిద్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. దాదాపు షాహిద్‌నే ఖరారు చేసే అవకాశాలున్నాయని బాలీవుడ్ టాక్. -
ఇప్పుడు క్రైమ్!
ఫుల్‌గా లవ్ చేసింది. అర్జున్ రెడ్డిని పీకల్లోతు ప్రేమించింది. ఇప్పుడు జీవీ ప్రకాశ్కుమార్ని ఫుల్‌గా లవ్ చేస్తోంది. అవును మరి.. తెలుగులో షాలినీపాండే ఫస్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ లవ్‌స్టోరీ అని తెలిసిందే. ఇప్పుడు తమిళంలో చేస్తోన్న ‘100% లవ్’ రీమేక్ కూడా లవ్‌స్టోరీయే. ఇందులో జీవీ ప్రకాశ్‌కుమార్ సరసన నటిస్తోంది షాలిని. ఇప్పుడు షాలిని క్రైమ్ వైపు టర్న్ తీసుకుందని కోలీవుడ్ సమాచారం. జీవా∙హీరోగా డాన్ సాండీ దర్శకత్వంలో విజయేంద్ర వర్మ నిర్మాణంలో తమిళంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో షాలినీపాండేని కథానాయికగా ఎంపిక చేశారు. ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా అన్నది కోలీవుడ్ టాక్. ‘‘మా సినిమాలో బిగ్ సర్ప్రైజ్ ఉంది. అదేంటనేది ఇప్పుడే చెప్పను. జనవరిలో షూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘‘ స్క్రిప్ట్‌లో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆధారంగా జీవాను తీసుకున్నాం. ఫ్రెష్ అండ్ యంగ్ టాలెంట్ ఉన్న అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలని షాలినీ పాండేని ఎంపిక చేశాం’’ అన్నారు నిర్మాత. -
అవకాశాల బాటలో అర్జున్‌రెడ్డి హీరోయిన్
సాక్షి, సినిమా: టాలీవుడ్లో తొలి సినిమా అర్జున్‌రెడ్డితోనే సంచలన విజయాన్ని అందుకున్న జైపూర్ బ్యూటీ శాలినిపాండే. ఆ సినిమా విజయం ఈ అమ్మడిని కోలీవుడ్‌కు పరిచయం చేసేసింది. తెలుగులో ఘనవిజయం సాధించిన 100 % లవ్ రీమేక్ ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన శాలినిపాండే ఈ చిత్రంలో జీవీ. ప్రకాశ్‌కుమార్‌తో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం నటి సావిత్రి జీవిత చరిత్రతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న నడిగైయార్ తిలగంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. అదే విధంగా మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో మూడో చిత్రానికి రెడీ అవుతోంది. ఇందులో నటుడు జీవాకు జంటగా నటించనుంది. ఇది జీవీకు 29వ చిత్రం. దీనికి డాన్ శాండి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆల్ ఇన్ ఫిక్చర్స్ పతాకంపై విజయ రాఘవేంద్ర భారీ బడ్జెట్లో నిర్మించనున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నటుడు జీవా ఇప్పటి వరకూ నటించనటువంటి వైవిధ్యంతో కూడిన కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శాలినిపాండే పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. విక్రమ్‌వేదా చిత్రం ఫేమ్ శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పారు. మొత్తం మీద నటి శాలినిపాండే కోలీవుడ్‌లో మూడో చిత్రానికి సిద్ధం అయిపోతోంది. -
వైజాగ్ లో కాథరీన్, మెహ్రీన్ కౌర్, శాలిని పాండే సందడి
-
'ప్రీతి'గా ముద్దు పెట్టా!
‘‘ముద్దు పెట్టుకోవడం కూడా ఒక ఎమోషన్. నటిస్తున్నప్పుడు ఏ ఎమోషన్ అయినా ప్యాషన్‌తో చేయాల్సిందే. ‘అర్జున్‌రెడ్డి’లో షాలినీ పాండే కనపడదు. ముద్దు పెట్టుకున్నది షాలినీ పాండే అనిపించదు. ‘ప్రీతి’గానే ముద్దు పెట్టుకున్నాను.. ‘ప్రీతి’గానే అనిపిస్తాను. నిజానికి షాలిని విజయ్ దేవరకొండను ముద్దుపెట్టుకోలేదు. ప్రీతి అర్జున్‌రెడ్డిని ముద్దు పెట్టుకుంది’’ అంటున్నారు ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ ఇచ్చిన షాలినీ పాండే. ఏంటండీ... షాలినిగారూ.. హండ్రెడ్ పర్సంట్ లవ్‌లో ఉన్నట్లున్నారు? ఎగ్జాట్లీ. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. చిన్ని చిన్ని అలకలు, పెద్ద పెద్ద గొడవలు, తీపి కబుర్లు, కొంటె చూపులు.. సూపర్బ్. ఆన్‌స్క్రీన్ లవ్ (తెలుగు ‘100% లవ్ ’ తమిళ రీమేక్‌లో కథానాయికగా నటిస్తున్నారు షాలిని) గురించి భలే చెప్పారు.. ఆఫ్ స్క్రీన్ ప్రేమ గురించి? ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పటివరకూ ఒక్కరు కూడా ‘ఐ లవ్ యు’ చెప్పలేదు. అందుకే, ప్రేమంటే ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్ తెలుసుకుంటున్నా. ఇంత అందమైన అమ్మాయికి ఒక్కళ్లు కూడా ప్రపోజ్ చేయలేదా? ఫాల్ట్ మీదేనేమో? అవునండి. నేను కొంచెం తేడానే. ఏది చేసినా ఫుల్‌గా కాన్సన్ట్రేట్ చేస్తా. స్కూల్ డేస్‌లో పుస్తకాల్లో మునిగిపోయేదాన్ని. కాలేజ్ డేస్‌లోనూ అంతే. దాంతో నాకు ఎమోషన్స్ ఉండవని, మరబొమ్మ టైప్ అనీ అబ్బాయిలు అనుకునేవారు (నవ్వుతూ). అయినప్పటికీ నన్ను ఇష్టపడ్డవాళ్లు ఉన్నారు. అయితే, ఆ ఇష్టాన్ని నాతో డైరెక్ట్‌గా చెప్పకుండా నా ఫ్రెండ్స్‌తో చెప్పేవారు. ఏం లాభం చెప్పండి? మరి.. మీరు ఎవరి మీదైనా మనసు పారేసుకున్నారా? ప్చ్... ఇప్పటివరకూ లేదు. అప్పుడేమో చదువులు. ఇప్పుడేమో యాక్టింగ్. మైండ్ అంతా వర్క్ మీదే. ఓకే.. ఫ్రమ్ జబల్పూర్ టు హైదరాబాద్‌కి హీరోయిన్గా వచ్చారు. సినిమాల్లోకి రావాలని చిన్నప్పటినుంచే అనుకున్నారా? అవును. హీరోయిన్ అయ్యే తీరాలన్నది నా యాంబిషన్. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయి. నన్ను ఇంజనీర్‌గా చూడాలనుకున్నారు. కానీ, నేను హీరోయిన్ అవుతానంటే కాదనలేదు. ఎందుకంటే, నేనేది చేసినా ఒక కమిట్మెంట్తో చేస్తానని ఆయన నమ్మకం. ముందు నేను థియేటర్ ఆర్టిస్ట్‌ని. అక్కణ్ణుంచి మోడల్‌గా ట్రై చేద్దామనుకున్నా. అట్నుంచి సినిమాల్లోకి రావాలనుకున్నా. తెలుగు సినిమాతో నా కల నెరవేరింది. ఫస్ట్ మూవీ (‘అర్జున్‌రెడ్డి’) హిట్టయింది కాబట్టి హ్యాపీగా ఉన్నారు. తేడా జరిగి ఉంటే? కొలాప్స్ అయ్యేదాన్ని కాదు. కొంచెం బాధ మాత్రం ఉండేది. అయినా ఫెయిల్యూర్స్ నాకు కొత్త కాదు. ముంబైలో చాలానే ఫేస్ చేశాను. ఎన్నో రిజెక్షన్స్. అన్నీ తట్టుకున్నాను. లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నా. అందుకని అంత ఈజీగా హర్ట్ అవ్వను. అది సరే.. ఫస్ట్ సినిమాకే అన్నేసి ముద్దు సీన్స్ చేశారు... ఇబ్బందిగా అనిపించలేదా? మిమ్మల్ని తక్కువగా మాట్లాడతారని భయపడలేదా? నేను థియేటర్ నుంచి వచ్చానని చెప్పాను కదా. అక్కడ మాకు ఒకటే నేర్పించారు. ‘నువ్వు ఏ పాత్ర అయితే చేస్తున్నావో అక్కడ ఉన్నది నువ్వు కాదు. ఆ క్యారెక్టర్ మాత్రమే’ అని. నా మనసులో అది బలంగా నాటుకుపోయింది. నేను షాలినిగా ముద్దులు పెట్టలేదు. ప్రీతీ (‘అర్జున్‌రెడ్డి’లో షాలిని క్యారెక్టర్ పేరు)గా పెట్టా. నటిగా ఎంతో ప్యాషన్‌తో ఆ సీన్స్ చేశా. ఇంజినీర్‌గా చూడాలనుకున్న మీ నాన్నగారు మీరు హీరోయిన్ అవుతానన్నా ఒప్పుకున్నారు. మరి.. ముద్దు సీన్స్ చేసే ముందు ఆయనతో చెప్పారా? పర్మిషన్ తీసుకున్నారా? బేసిక్‌గా నేను ఎవరి అడ్వైస్ తీసుకునే టైప్ కాదు. నిర్ణయాలు నావే. దాని తాలూకు సక్సెస్, ఫెయిల్యూర్స్ నావే. జీవితంలో ఎవర్నీ బ్లేమ్ చేయాలనుకోను. అందుకే సలహాలు తీసుకోను. ఆ సినిమాకి అది కరెక్ట్ అనిపించింది. పైగా డైరెక్టర్ సందీప్‌గారు చాలా ఏస్థటిక్గా తీస్తారని నమ్మాను. అందుకే చేశాను. ఒకవేళ స్టోరీ డిమాండ్ చేసి ఉండకపోతే మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు. సినిమా చూశాక మీ అమ్మానాన్న ఏమన్నారు? నెగటివ్ కామెంట్స్ చేయలేదు. ‘షాలిని ఏది చేసినా ఒక కమిట్మెంట్ కనిపిస్తుంది’ అని నా చెల్లెలితో నాన్న అన్నారు. అది చాలు. రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు చుట్టూ పది మంది ఉంటే ఇబ్బందిగా ఉంటుందేమో. పైగా మీలాంటి కొత్త హీరోయిన్‌కి అయితే కష్టమేమో? ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూలో నేను కొత్త అయ్యుండొచ్చు. కెమెరా ఫేస్ చేయడం నాకు కొత్త కాదు. కొన్ని నాటకాల్లో నటించాను. అప్పుడు కెమెరాలో షూట్ చేశారు. ఫొటోషూట్స్ చేశాను. సో.. నాకేం ఇబ్బంది అనిపించలేదు. ‘కిస్సింగ్’ అనేది ఒక ఎమోషన్ అని సందీప్‌గారు చెప్పారు. అవును కదా.. నవ్వు, ఏడుపులా అది కూడా ఒక ఎమోషనేగా. దానికి అంత ఇబ్బంది ఎందుకు? అనిపించింది. మరి.. రొమాంటిక్ సీన్స్ చేశాక... మీరు, విజయ్ దేవరకొండ మామూలుగానే మాట్లాడుకోగలిగారా? ఇబ్బందేమైనా? నెవర్ అండి. కెమెరా ముందు మేం అర్జున్ – ప్రీతి. ఆ తర్వాత విజయ్, షాలిని. అందుకని బాగానే మాట్లాడుకున్నాం. తను నాకు మంచి ఫ్రెండ్. ‘కిస్సింగ్’ అనేది ఎమోషన్ కాబట్టి చేశానన్నారు. మరి.. సీన్ డిమాండ్ చేస్తే బికినీ ధరిస్తారా? అది ఫిజిక్‌ని బయటపెట్టేస్తుంది కదా? స్టోరీ డిమాండ్ చేస్తే నేను ఏది చేయడానికైనా రెడీ. కానీ, డైరెక్టర్ ఎలా తీస్తారు? అనేది మాత్రం చూసుకుంటా. నన్ను చీప్‌గా చూపించే సీన్స్ చేయను. చీప్‌గా కనిపించే కాస్ట్యూమ్స్ వేసుకోను. కానీ, కొంచెం బొద్దుగా ఉన్నారు కాబట్టి మీ ఫిజిక్‌కి బికినీ సూట్ కాదేమో? ‘అర్జున్‌రెడ్డి’లో ప్రెగ్నెంట్ ఉమన్‌గా కనిపించాల్సి వచ్చింది కాబట్టి, బరువు పెరిగాను. ఇప్పుడు సన్నబడి పోయాను. తెలుగు ‘100% లవ్’ తమిళ రీమేక్‌లో యాక్ట్ చేస్తున్నాను కదా. ఆ సినిమాలో టీనేజ్ గాళ్‌గా కూడా కనిపించాలి కాబట్టి తగ్గాను. తమన్నా ఓ పది సినిమాలు చేశాక ‘100% లవ్’ ఒప్పుకున్నారు. ఫుల్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. మీరేమో జస్ట్ వన్ మూవీ ఓల్డ్. మరి చేయగలుగుతారా? ఇది నాకు చాలెంజింగ్. ఆ సినిమా చూశాను. తమన్నా చాలా బాగా చేశారు. నేను ఆమెలా చేయను. నాలా చేస్తాను. క్యారెక్టర్‌కి న్యాయం చేయగలననే నమ్మకం ఉండబట్టే ఒప్పుకున్నా. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఏ సినిమా ఒప్పుకున్నా, నేను చేయగలననే నమ్మకం ఉంటేనే ‘యస్’ అంటా. సీనియర్ నటి సావిత్రిగారి జీవితం ఆధారంగా తీస్తోన్న ‘మహానటి’లో చేస్తున్నారు కదా.. మీ క్యారెక్టర్ గురించి? డీటైల్స్ చెప్పలేను. ఇంకా టైమ్ ఉంది. ‘అర్జున్‌రెడ్డి’లో కనిపించిన షాలిని వేరు.. ఈ సినిమాలో కనిపించబోతున్న షాలిని వేరు. ఫైనల్లీ డ్రీమ్ రోల్ ఏదైనా? నేను మంచి ఆకలి మీద ఉన్న హీరోయిన్ని. ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలనుకుంటున్నాను. అదే నా డ్రీమ్ రోల్ అనుకుని, చేస్తా. తమిళంలో ఇంకా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కూడా కథలు వింటున్నాను. సో.. కెరీర్ గురించి ఫుల్ పాజిటివ్‌గా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ షాలిని.. థ్యాంక్యూ . – డి.జి. భవాని -
జీవాతో రొమాన్స్‌కు సై
తమిళసినిమా: అపజయానికేమోగానీ, విజయానికి ఒక్క చిత్రం చాలు ఆ తరువాత కెరీర్ గాడిలో పడినట్లే. నటి శాలిని పాండేకు అలాంటి సక్సెస్ టాలీవుడ్‌ను దాటి కోలీవుడ్‌కు పరిచయం చేసేసింది. అర్జున్‌రెడ్డి అనే ఒక్క తెలుగు సినిమా ఆమె దశ మార్చేసింది. రంగస్థల నటి అయిన శాలిని నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తరువాత అక్కడ మహానటి సావిత్రి జీవిత చరిత్రగా తెరకెక్కుతున్న మహానది చిత్రంలో కీలక పాత్రను పోషి స్తోంది. అదే విధంగా తెలుగులో మంచి విజయాన్ని సాధించిన 100% లవ్ చిత్ర తమిళ రీమేక్‌లో తమన్నా పాత్రను చేసే లక్కీఛాన్స్‌ను అందుకుంది. ఇక నటుడు జీవాకు జంటగా నటించే కొత్త చిత్రంలో నటించే అవకాశం శాలినిపాండే తలుపు తట్టిందన్న తాజా సమాచారం. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో స్థిరపడాలని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి శాలిని పాండే స్పందిస్తూ అర్జున్‌రెడ్డి చిత్రం తరువాత తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయని, అయితే అవన్నీ అంగీకరించకుండా, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. తమిళంలో మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్న మాట నిజమేనని చెప్పింది. 100% కాదల్ చిత్రం పూర్తి అయిన తరువాత శాలిని జీవాతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుందనే కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక్కడ ఒక్క చిత్రం విడుదల కాకుండానే మరో చిత్ర అవకాశాన్ని దక్కించుకుందంటే శాలినిపాండేను లక్కీ నటే అనాలి. -
అర్జున్ రెడ్డి చిత్రం దశ మార్చేసింది..!
ఒక సక్సెస్ హీరోయిన్ శాలిని పాండేను టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు పరిచయం చేసేసింది. అర్జున్‌రెడ్డి సినిమా ఆమె దశను మార్చేసింది. రంగస్థల నటి అయిన శాలిని నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత అక్కడ మహానటి సావిత్రి జీవిత్ర చరిత్రగా తెరకెక్కుతున్న మహానది చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాక తెలుగులో విజయాన్ని సాధించిన 100% లవ్ చిత్ర తమిళ రీమేక్‌లో తమన్నా పాత్రను చేసే లక్కీఛాన్స్‌ను కొట్టేసింది. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో స్థిరపడాలని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై శాలిని స్పందిస్తూ.. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటానని పేర్కొంది. తమిళంలో మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్న మాజ నిజమేనని ఆమె చెప్పింది. 100% కాదల్ చిత్రం పూర్తి అయిన తర్వాత జీవాతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుందనే కోలీవుడ్ వర్గాల సమాచారం. -
శర్వాకు జోడిగా క్రేజీ హీరోయిన్స్
మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో శర్వానంద్, క్రేజీ ప్రాజెక్ట్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. స్వామి రారా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుధీర్, కేశవతో మరో విజయాన్నిఅందుకున్నాడు. ఇప్పుడు అదే జోరు శర్వానంద్ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో శర్వాకు జోడిగా ఇద్దరు టాలెంటెడ్ బ్యూటీస్ ను ఫైనల్ చేశారు. వరుసగా పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లను ఎంచుకుంటూ సత్తా చాటుతున్న మలయాళీ బ్యూటీ నివేదా థామస్‌తో పాటు అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన షాలినీ పాండే మరో హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌తో కాకుండా మరో దర్శకుడితో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ఇదే కావటం విశేషం. -
ఎస్ అండ్ ఎస్ జోడీ
ఎస్ ఫర్ సన్... స్కూల్లో ఇలానే చదువుకున్నాం. ఎస్ ఫర్ సన్ మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఫర్ సక్సెస్.. ఎస్ ఫర్ శర్వానంద్.. ఎస్ ఫర్ షాలినీ పాండే. ఈ ఎస్ అండ్ ఎస్కి జోడీ కుదిరిందని టాక్. సూపర్ సక్సెస్‌లతో దూసుకెళుతున్నారు శర్వా. ‘అర్జున్‌రెడ్డి’తో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చేసుకున్నారు షాలినీ పాండే. ‘స్వామి రారా’ వంటి హిట్ మూవీతో దర్శకుడిగా మార్కులు కొట్టేసి, ‘దోచెయ్’, ‘కేశవ’లతో గ్రాఫ్ పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శర్వా డ్యూయల్ రోల్ చేయనున్నారట. సో.. ఇద్దరు నాయికలు ఉండటం సహజం. ఒక నాయికగా షాలినీ పాండేని అడగడం, ఆమె దాదాపు ‘యస్’ అనడం జరిగాయట. మరి.. ఇంకో హీరోయిన్ ఎవరు? ఆమె పేరు కూడా ‘ఎస్’తోనే స్టార్ట్ అవుతుందా? వెయిట్ అండ్ సీ. -
ఓకే బంగారం అంటారా?
షాలినీ పాండే... ఇప్పుడు హాట్ టాపిక్. టీ టౌన్ అదేనండీ.. మన టాలీవుడ్... కో టౌన్ అంటే.. కోలీవుడ్‌లో షాలినీ పాండేకి బోలెడంత క్రేజ్. ఆ క్రేజ్ అంతా ‘అర్జున్ రెడ్డి’ తెచ్చిందే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా హిట్‌తో షాలినీ పాండేకి ఓవర్ నైట్ ఫుల్ పాపులార్టీ వచ్చేసింది. ఇటు తెలుగులో కాకుండా అటు తమిళ పరిశ్రమ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘100% పర్సంట్’ తమిళ రీమేక్ ‘100% కాదల్’లో నటిస్తున్నారు. ఇటు తెలుగులో ‘మహానటి’లో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఓ సినిమాకి అవకాశం వచ్చిందట. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో షాలినీ పాండేని కథానాయికగా అడిగారట. ‘ఓకే బంగారం’తో దుల్కర్‌కి తెలుగు, తమిళంలో మంచి పేరొచ్చింది. ‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్ర చేస్తున్నారు. ఇదే చిత్రంలో షాలినీ కూడా నటిస్తున్నారు. కాకపోతే జోడీగా కాదు. సో... ద్విభాషా చిత్రానికి షాలిని ఓకే చెబితే.. ఈ ఇద్దరినీ జంటగా చూడొచ్చు. మరి.. ‘ఓకే బంగారం’ అంటారా? అనే క్వొశ్చన్ అవసరం లేదేమో. ఎందుకంటే, షాలిని పచ్చజెండా ఊపేస్తారని ఊహించవచ్చు. -
బిజీ అవుతోన్న అర్జున్ రెడ్డి హీరోయిన్
అర్జున్ రెడ్డి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ షాలిని పాండే. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటితో పాటు 100% లవ్ తమిళ రీమేక్ లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించనుంది షాలినీ. ఓకె బంగారం సినిమాతో టాలీవుడ్ లోనూ ఘనవిజయం సాధించిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. ఈ ద్విభాషా చిత్రంలో షాలినీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆర్ ఏ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశముంది. మహానటి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న దుల్కర్ ఆ సినిమా షూటింగ్ సమయంలో షాలిని నటన చూసి మరో సినిమాకు ఆమెను ఎంపిక చేసుకున్నాడు. -
నెల్లూరులో షాలిని సందడి
-
నేను బాగానే ఉన్నా: షాలినీ పాండే
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. నెల్లూరులో షాలిని ఓ సెల్ ఫోన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానుల హాజరయ్యారు. అయితే అదే సమయంలో షాలిని పాండే అస్వస్థతకు గురవ్వడంతో నిర్వాహకులు ఆమెను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జి కూడా చేశారు. అయితే ఆమె తీవ్ర అస్వస్వతకు గురయ్యారంటూ పుకార్లు రావడంతో షాలిని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. చాలామంది తనకు ఫోన్లు చేసి పరామర్శిచడంతో ఆమె నేరుగా ఫేస్బుక్ లైవ్‌లోకి వచ్చి తనకు ఏం కాలేదని, బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. కొద్దిగా తలనొప్పి, జ్వరం ఉంటే ఆసుపత్రికి వెళ్లానని, అంతే తప్ప కొన్ని మీడియాల్లో వస్తున్నట్టు తీవ్ర అస్వస్థత కాదని తెలిపింది. అర్జున్ రెడ్డి సినిమాతో ఆకట్టుకున్న షాలిని ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సావిత్రి బయోపిక్ మహానటిలో అలనాటి అందాల తార జమున పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుందని తెలిపింది. త్వరలోనే తన కొత్త సినిమా ప్రాజెక్ట్‌లను వెల్లడిస్తానని చెప్పింది. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దని అభిమానులకు సూచించింది. -
అర్జున్ రెడ్డి హీరోయిన్‌కు అస్వస్థత
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షాలిని.. నెల్లూరులో ఓ సెల్ ఫోన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానుల హాజరయ్యారు. అయితే అదే సమయంలో షాలిని పాండే అస్వస్థతకు గురయ్యారు. అయితే వెంటనే స్పందించిన నిర్వహకులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అర్జున్ సినిమాతో ఆకట్టుకున్న షాలిని ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సావిత్రి బయోపిక మహానటిలో అలనాటి అందాల తార జమున పాత్రలో ఆమె నటించనున్నారు. -
కోలీవుడ్‌కు అర్జున్‌రెడ్డి నాయకి
తమిళసినిమా: తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి నాయకికి కోలీవుడ్‌లో ఎంట్రీ ఖారారైంది. ఈ మధ్య కాలంలో అనూహ్య విజయాన్ని సాధించిన తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి. చాలా చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ద్వారా నాయకిగా పరిచయం అయిన నటి షాలిని పాండే. జైపూర్‌కు చెందిన ఈ బ్యూటీకిదే తొలి చిత్రం. ఇంజినీరింగ్ చదివిన ఈ జాణ కాలేజీ రోజుల్లోనే థియేటర్ ఆర్టిస్టుగా అనుభవం గడించిందట. దీంతో అర్జున్‌రెడ్డి చిత్రంలో కథానాయకుడి ప్రేయసిగా చాలా చక్కని నటనను ప్రదర్శించి అందరి ప్రశంసలనను అందుకుంది. ఇప్పుడీమె పేరు ఒక్క తెలుగు చిత్రపరివ్రమలోనే కాదు. ఇతర భాషలకూ పాకేసింది. తాజాగా కోలీవుడ్‌లో చాన్స్ కొట్టేసింది కూడా. తమిళంలో యువ నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తెలుగులో మంచి విజయాన్ని సాధించిన 100% లవ్ చిత్ర తమిళ్ రీమేక్‌లో జీవీ.ప్రకాశ్‌కుమార్ నటించనున్న విషయం తెలిసిందే. తెలుగులో తమన్నా నటించిన పాత్రలో షాలిని పాండే నటించనుంది. ఇందులో ఇంతకు ముందు నటి లావణ్య త్రిపాఠి నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తన కాల్షీట్స్ సమస్య కారణంగా చిత్రం నుంచి వైదొలగడంతో ఆమెకు బదులు షాలిని పాండే నటించనుంది. దీనికి 100 శాతం కాదల్ అనే టైటిల్‌ను పెట్టారు. నవ దర్శకుడు చంద్రమౌళి దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. షాలినిపాండే ఇప్పటికే నటి కీర్తీసురేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తోందన్నది గమనార్హం. -
లావణ్య ప్లేస్‌లో అర్జున్ రెడ్డి హీరోయిన్..!
తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 100% లవ్. రొమాటింక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పుడు కోలీవుడ్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. చంద్రమౌళి తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా హెబ్బా పటేల్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. కానీ చివరి నిమిషంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుందంటూ ప్రకటించారు. అయితే లావణ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించటంతో మరోసారి హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా అర్జున్ రెడ్డి సినిమాతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన షాలిని పాండేనే ఈ రీమేక్ లో హీరోయిన్ గా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న షాలిని, ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.