
‘గొరిల్లా’ మూవీ పోస్టర్
హీరోలకు సహాయం చేసే జంతువులు ప్రధాన పాత్ర పోషించిన పలు సినిమాలు గతంలో విజయవంతమయ్యాయి. కాకపోతే గతంలో ఏనుగులు, కుక్కలు, కోతులు, పాములు హీరోలకు సహాయం చేసే పాత్రల్లో నటించి, మెప్పించగా ఇప్పుడు గొరిల్లా వంతు వచ్చింది. ‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా, ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ శాలినీపాండే హీరోయిన్‌గా గొరిల్లా ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గొరిల్లా’. డాన్ శాండీ దర్శకత్వం వహించారు.
సంతోషి సమర్పణలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆల్ ఇన్ వన్ సంస్థల నిర్మాణంలో గంగా శబరీశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. శబరీశ్ రెడ్డి మాట్లాడుతూ–‘‘బ్యాంక్‌ను కొల్లగొట్టే బృందానికి గొరిల్లా చేసిన సహాయం ఏంటి? అసలు బ్యాంకులను వారు ఎందుకు కొల్లగొడుతున్నారు? అనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఇండియన్ స్క్రీన్ మీద తొలిసారి గొరిల్లా యాక్ట్ చేసింది మా సినిమాలోనే. శిక్షణ పొందిన గొరిల్లాను మా సినిమా కోసం తీసుకున్నాం’’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్. సి.యస్, కెమెరా : ఆర్.బి.గురుదేవ్.
Comments
Please login to add a commentAdd a comment