Gorilla
-
కార్నింగ్’ పెట్టుబడి రూ.934 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మెటీరియల్స్ సైన్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో రూ. 934 కోట్ల భారీ పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ ప్లాంట్ ద్వారా మొబైల్ ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలకు అవసరమైన గొరిల్లా గ్లాస్‌లను కార్నింగ్ తయారు చేయనుంది. 172 ఏళ్ల చరిత్రగల కార్నింగ్ తన తయారీ కేంద్రం ఏర్పాటు ద్వారా భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ భారీ పెట్టుబడితో 800 మందికిపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కార్నింగ్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ బెయిని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఎల్రక్టానిక్స్, అనుబంధ రంగాలకు తెలంగాణ హబ్‌గా మారుతున్న తీరును కేటీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశారు. యాపిల్ ఐఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ సంస్థ భారీ ఎత్తున తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న విషయాన్ని, ప్రభుత్వ పాలసీలను ఆ సంస్థ ప్రశంసించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన కార్నింగ్ ప్రతినిధి బృందం.. తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతలతోపాటు ఎల్రక్టానిక్స్, అనుబంధ రంగాల్లో తయారీరంగ పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు కార్నింగ్ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. దీంతో కార్నింగ్ సంస్థకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ కార్యకలాపాల ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఎల్రక్టానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడుల ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, తెలంగాణ యువతకు ఈ రంగంలో ఉద్యోగావకాశాలు రావడం తనకు అత్యంత సంతోషాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఐటీ శాఖ ఎల్రక్టానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. -
షాకింగ్ ట్విస్ట్: మగ గొరిల్లా కడుపున ఓ ఆడ గొరిల్లా పిల్ల..
ఇంత వరకు మగవాళ్లు కూడా పిల్లలు కనడం గురించి మానవజాతిలోనే జరిగింది. అది కూడా వారు ట్రాన్స్ జెండర్‌గా మారే క్రమంలో జరిగిన అరుదైన ఘటనే. ఇప్పుడు అలాంటి ఘటనే ఓ జంతుశాలలో చోటు చేసుకుంది. అప్పటి వరకు అది ఆ జూలో మగ గొరిల్లాగా పెరిగింది..ఉన్నటుండి ఒక రోజు ఓ ఆడ గొరిల్లా పిల్లకు జన్మనివ్వడంతో జూ సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన యూఎస్‌లోని కొలంబస్ జూలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొలంబస్ జూలో సుల్లీ అనే గొరిల్లా 2019లో తన తల్లితో కలిసి ఉంటోంది. దాన్ని చిన్నపటి నుంచి ఆ జూ సిబ్బంది అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఊహించని విధంగా గురువారం తెల్లవారుఝామున ఓ ఆడ గొరిల్లాకు జన్మనిచ్చేంత వరకు అది ఆడ గొరిల్లా అని కనుగొనలేకపోయారు. జూ సిబ్బంది ఆ గొరిల్లాను పర్యవేక్షించే కీపర్లు అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఈ విషయాన్ని ఫేస్బుక్లో అధికారికంగా జూ అధికారులు వెల్లడించారు. ఎందుకు తాము దాన్ని మగ గొరిల్లా అని భావించామో కూడా వివరించారు. నిజానికి సుమారు 8 ఏళ్ల వయసు వరకు గొరిల్లాలు మగ లేదా ఆడవిగా గుర్తించలేమని, అవి రెండు ఒకే పరిమాణంలో ఉంటాయి. పైగా వాటికి ప్రముఖ లైంగిక అవయవాలు ఉండవు. గొరిల్లాలు ఒక వయసు వచ్చే వరకు ఏ లింగం అనేది గుర్తించడం కష్ట అని చెప్పుకొచ్చారు. మగ గొరిల్లాలకు చాలా వయసు వచ్చే వరకు గెడ్డం, వెన్ను, కొన్ని ప్రత్యేక అవయవాలు అభివృద్ధి చెందవు. దీంతో వాటిని మగవా, ఆడవా అని గుర్తించడం కష్టమవుతుందని జూ నిర్వాహకులు చెప్పారు. అవి గర్భం దాల్చిన కూడా బాహ్య సంకేతాలు ఏమి పెద్దగా చూపవని చెబుతున్నారు. సహజంగానే గొరిల్లాకు పెద్ద పొత్తికడుపు ఉండటంతో గర్భదాల్చినట్లు గుర్తించడం కష్టమేనని కొలంబస్ జూ వివరణ ఇచ్చింది. ఇక సదరు గొరిల్లాకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, అది ఆడగొరిల్లా పిల్లలానే ఉందని జూ పేర్కొంది. ఇక సదరు సుల్లీ గొరిల్లాకు వెల్సన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించి ఆడ గొరిల్లా పిల్ల తండ్రిని కూడా గుర్తిస్తామని కొలంబస్ జూ పేర్కొంది. (చదవండి: సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే కారణమా..!) -
1996లో ఒకరోజు.. ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన పిల్లాడిని గోరిల్లా ఏం చేసిందంటే..
గోరిల్లాలు చూడటానికి కాస్త భయంకరంగా కనిపించినా వాటి మనస్సు మంచిదే. 1996 నాటి జూ ఘటనలో మూడేళ్ల పిల్లాడిని కాపాడింది ఓ గోరిల్లా. అప్పట్లో ఈ సంఘటన చాలా పాపులర్. అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన జనాలు కూడా ఈ సంఘటన తర్వాత ప్రత్యేకించి ఆ గోరిల్లాను చూడటినికి వచ్చేవారట. అంతలా అభిమానాన్ని చాటుకున్న గోరిల్లా కథేంటి? అసలు ఏం జరిగింది? 1996లో మూడేళ్ల బాలుడ్ని ఓ గోరిల్లా కాపాడిన ఘటన గుర్తుంది కదా..ఇల్లినాయిస్లోని బ్రూక్‌ఫీల్డ్ జూలో 8ఏళ్ల బింటి జువా అనే గోరిల్లా తన ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన బాలుడ్ని రక్షించింది. గోరిల్లా ఎగ్జిబిట్ చుట్టూ ఉన్న గోడను ఎక్కుతూ సుమారు 24 అడుగుల ఎత్తు నుంచి బాలుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా తీసుకొని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని తల్లిలా కాపాడింది. ఆ తర్వాత జూ సిబ్బంది సమన్వయంతో ఆ బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో అంత ఎత్తునుంచి పడిపోవడంతో బాలుడి చేయి, ముఖంపై గాయాలు మినహా మరేం జరగలేదు. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. గోరిల్లాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. గోరిల్లా బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకున్న దృశ్యం అందరినీ కట్టిపడేసింది. అంతే ఆ ఫోటోలు, వీడియాలో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన వారు కూడా ఈ ఘటన తర్వాత గోరిల్లాను చూడటానికి వచ్చేవారట. దీంతో సందర్శకుల తాకిడి బాగా పెరిగి ఆ గోరిల్లాకు స్టార్ స్టేటస్ వచ్చిందట.అటు జూ సిబ్బంది కూడా గోరిల్లాకు ప్రత్యేకమైన విందు ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 35ఏళ్ల వయసున్న గోరిల్లా బింటి జువా ఇప్పటికీ సజీవంగా ఉంది. ముగ్గురు మనవరాళ్లతో పాటు మునివడిని కూడా చూసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. In 1996, Binti Jua, an 8-year-old female Western lowland gorilla, tended to a 3-year-old boy who had fallen into her enclosure at the Brookfield Zoo in Illinois. On August 16, 1996, Binti Jua, who was eight years old at the time, witnessed a three-year-old boy climbing the wall… pic.twitter.com/OMFGmdRE4I — Historic Vids (@historyinmemes) June 22, 2023 في عام 1996، اهتمت بينتي خوا، وهي أنثى غوريلا الأراضي المنخفضة الغربية البالغة من العمر 8 سنوات، بصبي يبلغ من العمر 3 سنوات سقط في حظيرتها في حديقة حيوان بروكفيلد في إلينوي. في 16 أغسطس 1996، شهد بينتي خوا، الذي كان يبلغ من العمر ثماني سنوات في ذلك الوقت، صبيا يبلغ من العمر ثلاث… pic.twitter.com/dJnC16AFUn — ﮼الأعرابي القديم . (@radialonazi) June 22, 2023 -
వైరల్ వీడియో : తన ఛాతీని కొట్టడం నేర్చుకుంటున్న చిన్న గొరిల్లా..!
-
అన్ కండిషనల్ లవ్
మాఫియా దాడిలో తన వారందరినీ పోగొట్టుకుందా గొరిల్లా. రెండు నెలల పసికందుగా నేషనల్ పార్క్ రేంజర్‌కు దొరికింది. ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాడు రేంజర్ ఆండ్రే బవుమా. 13 ఏళ్లపాటు కంటికిరెప్పలా కాపాడాడు. ఆ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూ పం ఈ చిత్రం. అనారోగ్యంతో ఉన్న ఆ గొరిల్లా తన ఆఖరి గడియ ల్లోనూ రేంజర్‌ను వదిలిపెట్టలేదు. అతని ఒడిలోనే శాశ్వతంగా కన్ను మూసింది. కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్‌లో ఫొటో జర్నలిస్ట్ బ్రెంట్ స్టిర్టన్ తీసిన ఈ చిత్రం... ఫొటో జర్నలిజం కేటగిరీలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్–2022 అవార్డును దక్కించుకుంది. -
పాపం.. 32 ఏళ్లుగా బోనులోనే!
డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ. ఏడాది వయసులో బాగా నమ్మిన వ్యక్తి చెయ్యి పట్టి గెంతులేసుకుంటూ దేశాలు దాటింది ఆ చిట్టి గొరిల్లా. పాపం.. తన జీవితం మూడు దశాబ్దాలపైగా నరకం లాంటి చోట చిక్కుకుపోతుందని ఊహించి ఉంటే అమ్మ ఒడిని అప్పుడు అది వీడి ఉండేది కాదేమో!. బువా నోయి.. దీనికి అర్థం చిట్టి తామర అని. అయితే పేరులో ఉన్న ఆహ్లాదం.. ఆ గొరిల్లా ముఖంలో ఏమాత్రం కనిపించదు. దాని వయసు 33 ఏళ్లు. కానీ, 32 ఏళ్లుగా కంపు కొట్టే తుప్పు పట్టిన బొనులో బంధీగా ఉండిపోయింది. అందుకేనేమో ప్రపంచంలోనే అత్యంత బాధను అనుభవిస్తున్న గొరిల్లాకు దీనికంటూ ఒక ముద్ర పడిపోయింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాంగ్ బంగ్ ఫ్లాత్లో బాంగ్ కీ ఖాన్ వద్ద ఓ ప్రైవేట్ మర్షియల్ బిల్డింగ్ పైన ‘పటా’ అనే జూ ఉంది. ఈ జూకి ప్రధాన ఆకర్షణ మాత్రమే కాదు.. అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారింది బువా నోయి. బువా Bua Noi పుట్టింది జర్మనీలో. ఏడాది వయసున్న బువాను దాని సంరక్షకుడు 7 లక్షల పౌండ్లకు థాయ్‌లాండ్ పటా జూ నిర్వాహకులకు అమ్మేశాడు. 1990లో అది అమ్మకి దూరమై.. ఈ జూలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి అది బయటకు వచ్చింది లేదు. అక్కడే తిండి.. అక్కడే నిద్ర. అదే బోనులో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ జూకి ప్రధాన ఆకర్షణగా మారిపోయింది. అయితే ఒంటరిగా అది పడుతున్న అవస్థను చూడలేక.. 2015 నుంచి కొందరు ఉద్యమకారులు దానిని బయటకు రప్పించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. కొన్నదానికంటే కాస్త ఎక్కువ డబ్బు చెల్లిస్తేనే.. దానిని వదులుతానంటూ భీష్మించుకు కూర్చున్నాడు పటా జూ ఓనర్. దీంతో దీని విడుదలకు పెద్ద ఎత్తున్న ఉద్యమం మొదలైంది. Triste ao conhecer a história de outro animal escravizado por toda a vida. Bua Noi vive presa há mais de 30 anos num espaço dentro de uma loja de departamentos num shopping da Tailândia. Ela é conhecida como a gorila mais triste do mundo. Como as pessoas são capazes?? #FreeBuaNoi pic.twitter.com/yDZaNV7xkd — PREFIRO LULA 🚩🦑 (@carolando_44) October 26, 2022 థాయ్ పాప్ సింగర్ చెర్ సైతం దీనికి బయటకు రప్పించేందుకు చాలా యత్నించాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అగ్రిమెంట్ బలంగా ఉండడంతో.. అక్కడి ప్రభుత్వం సైతం ఎలాంటి బలవంతపు చర్యలకు దిగలేకపోయింది. చివరకు ఫండ్ రైజింగ్ ద్వారా అనుకున్న సొమ్ము సేకరణకు దిగినా.. ఫలితం దక్కలేదు. అగ్రిమెంట్లో ఉన్న లొసుగులతో ఎప్పటికప్పుడు దానిని అమ్మే ధర పెంచుకుంటూ పోతున్నాడు ఆ ఓనర్. ఇది దాని స్వేచ్ఛకు అడ్డుతగులుతోంది. దీంతో దానికి మరణం ద్వారా అయినా విముక్తి అందించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే అక్కడి కోర్టులో కొందరు అందుకు సంబంధించి పిటిషన్లు సైతం దాఖలు చేస్తున్నారు. బంధీగా అలా అది చావడం కంటే.. దానిని అక్కడే చంపేసేందుకు ప్రభుత్వం చర్యలు పూనుకోవాలని, అందుకు ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. మరోవైపు ఈ విషయం తమదాకా రావడంతో పెటా ఏషియా స్పందించింది. దాని బతుకు మరీ ఘోరంగా ఉందని.. పటా జూను మొత్తానికే సీల్ చేసి అక్కడి జంతువులకు విముక్తి కల్పించేందుకు పోరాటానికి సిద్ధమని ప్రకటించింది. -
‘ఫటో’నా మజాకా
ఈ చిత్రంలో కనిపిస్తున్న గొరిల్లా తీక్షణంగా చూస్తున్న వస్తువు ఏమిటబ్బా అని అనుకుంటున్నారా? ఇదో రైస్ కేక్. బియ్యం, వెన్న, పలు రకాల పండ్లు, కూరగాయలతో దీన్ని తయారు చేశారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న ఓ జూలో ఫటో అనే ఈ ఆడ గొరిల్లా ఆరగించేందుకు ఇలా తెచ్చిపెట్టారు. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? ఉందిలేండి.. తాజాగా ఈ గొరిల్లా 65 ఏళ్లు పూర్తి చేసుకుంది మరి! ప్రపంచంలోకెల్లా జీవించి ఉన్న అత్యంత వృద్ధ గొరిల్లాగా ఇది రికార్డులకెక్కింది. పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొనే కేక్‌పై ఎరుపు, నలుపు రంగులతో కూడిన జెమ్స్‌ను 65 అంకె ఆకారంలో ఉంచారు. ఇన్ని పదార్థాలతో చేసిన కేక్‌ను కళ్లెదుట ఉంచితే గొరిల్లా ఊరుకుంటుందా? పిసరంత కూడా మిగల్చకుండా మొత్తం కేక్‌ను గుటుక్కుమనిపించింది. జూ నిర్వాహకుల కథనం ప్రకారం పశ్చిమ ఆఫ్రికా అడవుల్లో 1957లో పుట్టిన ఈ గొరిల్లాను ఫ్రాన్స్‌కు చెందిన ఓ నావికుడు తన దేశానికి తీసుకెళ్లాడు. 1959లో దీన్ని జర్మనీ తీసుకొచ్చిన అతను.. మద్యానికి నగదు లేక గొరిల్లాను ఇచ్చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ గొరిల్లా జూలోనే జీవిస్తోంది. అడవుల్లోని గొరిల్లాల జీవితకాలం సుమారు 40 ఏళ్లు ఉంటుందని, జూలో ఉంటుండటంతో ఫటో ఇంత దీర్ఘకాలంపాటు జీవించగలుగుతోందని జూ నిర్వాహకుడు క్రిస్టియన్ ఆస్ట్ పేర్కొన్నాడు. వృద్ధాప్యం మీదపడ్డా నేటికీ ఫటో ఎంతో ఆరోగ్యంగా ఉందని, ఆకలి మందగించడం వంటి సమస్యలేవీ దీనికి లేవని చెప్పాడు. సుమారు 200 కేజీల బరువు ఉండే గొరిల్లాలు రోజూ 15 నుంచి 20 కిలోల వరకు గడ్డి, ఆకులు, బెరళ్లు, పండ్లు ఆరగిస్తాయని వివరించాడు. -
విషాద గాథ: కాపాడినోడి చేతిలోనే కన్నుమూసింది
Ndakasi Selfie Pose Gorilla No More: ఫేస్బుక్ మీద ఆరోపణల తర్వాత సోషల్ మీడియా మనుషుల మీద మానసికంగా ప్రభావం చూపెడతాయా? లేదా? అనేది ప్రస్తుతం చర్చలో నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఓ ఘటన ఇంటర్నెట్లో యూజర్లను భావోద్వేగాల్ని ప్రదర్శించేలా చేస్తోంది. కొన్నేళ్ల క్రితం మనిషితో సెల్ఫీకి ఫోజులిచ్చిన ఓ గొరిల్లా.. చివరికి తనను కాపాడిన వ్యక్తి ఒడిలోనే తుదిశ్వాస విడిచి అందరితో కంటతడి పెట్టిస్తోంది. సెల్ఫీ స్టార్ ఎండకశి.. కొండ జాతికి చెందిన గొరిల్లా ఇది (Mountain Gorilla). 2019లో తన తోటి గొరిల్లా ఎన్‌డెజెతో కలిసి పార్క్ రేంజర్ మాథ్యూ షమావూ తీసిన సెల్ఫీకి సీరియస్ ఫోజు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ గొరిల్లా వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఎండకశి మీద మీమ్స్, కథనాలు ఎన్నో వచ్చాయి. కొన్ని డాక్యుసిరీస్లలోనూ కనిపించింది. చివరికి పద్నాలుగేళ్ల వయసులో.. దాని చిన్నప్పటి నుంచి సంరక్షిస్తున్న ఆండ్రే బౌమా కౌగిలిలోనే కన్నుమూసింది అది. View this post on Instagram A post shared by Virunga National Park (@virunganationalpark) సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. అనారోగ్య సమస్యలతోనే ఎండకశి చనిపోయినట్లు పార్క్ నిర్వాహకులు తెలిపారు. చిన్నపిల్లలా చూసుకున్నా. కానీ, వీడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అంటూ ఆండ్రే పేరిట ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. This picture of two gorillas 🦍 posing for a selfie is one of the best things I’ve seen this week! 😭😭 pic.twitter.com/ftj2k3s1DF — A̶l̶h̶a̶j̶i̶ 𝔻𝕣𝕦𝕟𝕜𝕒𝕣𝕕 (@The_Nifemi) April 19, 2019 కాంగో విరుంగ నేషనల్ పార్క్‌లో సెన్‌వెక్వే సెంటర్లో ఇంతకాలం పెరిగింది ఎండకశి. విశేషం ఏంటంటే.. ఈ సెంటర్లో పెరిగే గొరిల్లాలన్నీ దాదాపు అనాథలే!. విరుంగ నేషనల్ పార్క్‌లో నివసించే గొరిల్లాలను, సాయుధులైన మిలిటెంట్లు కాల్చి చంపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఎండకశి తల్లిని సైతం కాల్చి చంపారు. ఆ టైంలో తల్లి శవం మీద గట్టిగా పడుకున్న నెలల వయసున్న పిల్ల గొరిల్లా(ఎండకశి)ని పార్క్ రేంజర్ ఆండ్రే బౌమా కాపాడి.. ఇంతకాలం ఆలనా పాలనా చూసుకున్నాడు. ఇక ఈ ఘటన తర్వాత కొండ గొరిల్లాలను సంరక్షించేందుకు కాంగో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఇది సత్ఫలితం ఇవ్వగా.. 2007లో 720 కొండ గొరిల్లాల సంఖ్య.. ఇప్పుడు ఆ సంఖ్య 1,063కి చేరిందని తెలుస్తోంది. Sharing again, selfie of the century, a ranger and friends at Virunga National Park in DR Congo. On #WorldRangerDay pic.twitter.com/Kp3BCkCHCS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 31, 2020 చదవండి: ఆకలేస్తుందన్నాడు.. సాయం చేస్తే.. చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు -
13 గొరిల్లాలకు సోకిన కరోనా
-
అమెరికాలో గొరిల్లాలకు కరోనా
శాన్‌డియోగో: కరోనా వైరస్ మనుషులతో పాటు మూగ జీవాలను కూడా విడిచిపెట్టడం లేదు. ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో మనుషుల నుంచి గొరిల్లాలకి వైరస్ సోకింది. అమెరికాలోని శాన్‌డియోగో సఫారి పార్కులోని ఎనిమిది గొరిల్లాలకి కరోనా సోకినట్టుగా పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిసా పీటర్సన్ సోమవారం వెల్లడించారు. కరోనా సోకిన వాటిలో కొన్ని గొరిల్లాలు బాగా దగ్గుతున్నాయని చెప్పారు. పార్కులోని జంతు సంరక్షణ బృందంలోని ఒక వ్యక్తి నుంచి వైరస్ గొరిల్లాలకి సంక్రమించి ఉంటుందని పీటర్సన్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయిందని, గొరిల్లాల దగ్గరకి వెళ్లినప్పుడు అతను ఎల్లప్పుడూ మాస్కు ధరించేవాడని చెప్పారు. గత బుధవారం నుంచి గొరిల్లాలు కాస్త నలతగా కనిపిస్తూ దగ్గుతూ ఉండడంతో ఒక గొరిల్లాకి పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వాటికి కూడా కరోనా సోకినట్టుగానే భావిస్తున్నట్టు జంతు ప్రదర్శన శాల అధికార ప్రతినిధి ఆండ్రూ జేమ్స్ చెప్పారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని కరోనా కట్టడికి లాక్డౌన్ చర్యల్లో భాగంగా డిసెంబర్ 6 నుంచి ఈ జూని మూసే ఉంచారు. గొరిల్లాలలో కరోనా లక్షణాలు బయటపడిన దగ్గర్నుంచి వాటికి ప్రత్యేకంగా ఆహారం ఇస్తున్నారు. విటమిన్లు, ఫ్లూయిడ్స్ అధికంగా అందిస్తున్నారు. వాటి దగ్గరకి వెళ్లినప్పడు సిబ్బంది అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కుతో పాటు ఫేస్‌షీల్డ్, కళ్లద్దాలు పెట్టుకొని వెళుతున్నారు. ఈ గొరిల్లాలలో మూడు అంతరించే జాతిలో ఉండడంతో జంతు ప్రేమికుల్లో ఆందోళన నెలకొంది. గత 20 ఏళ్లలో ఈ గొరిల్లాల సంఖ్య 60శాతానిపైగా పడిపోయింది. పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు దగ్గర్నుంచి అటవీ జంతువులు పులులు, సింహాలకు కరోనా సోకింది. కానీ గొరిల్లాలకు కరోనా సోకడం ఇదే ప్రథమం -
ప్రపంచ ప్రఖ్యాత గొరిల్లా హతం!
కంపాలా : ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్ బ్యాక్ గొరిల్లా వేటగాళ్ల చేతుల్లో మృత్యువాతపడింది. ఈ సంఘటన ఉగాండాలోని బ్విండి ఇంపినిట్రేబుల్ నేషనల్ పార్కులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రఫికి అనే ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్ బ్యాక్ గొరిల్లా ఉగాండా బ్విండి ఇంపినిట్రేబుల్ నేషనల్ ఉంటోంది. 25ఏళ్ల ఈ మగ గొరిల్లా ప్రమాదంలో పడ్డ కొండ జాతి గొరిల్లాల గ్రూపునకు నాయకుడు. కొద్దిరోజుల క్రితం నలుగురు వేటగాళ్లు రఫికిని చంపేసినట్లు ఉగాండా వైల్డ్‌లైఫ్ అథారిటీ అధికారులు ప్రకటించారు. దారుణానికి పాల్పడ్డ నలుగురిలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆత్మరక్షణ కోసమే గొరిల్లాను చంపేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న బయామికామా ఫెలిక్స్ అనే వేటగాడు అంగీకరించాడు. రఫికిని చంపిన కేసులో ఆ నలుగురు వేటగాళ్లకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ( గాళ్‌ఫ్రెండ్ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే..) పోలీసుల అదుపులోని వేటగాడు -
గాళ్‌ఫ్రెండ్ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే..
-
గాళ్‌ఫ్రెండ్ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే..
డల్లాస్ : చిన్నతనంలో నీళ్లున్న బకెట్లోకో లేదా టబ్బులోకో దిగి కేరింతలు కొడుతూ ఆడుకున్న రోజులు ఎప్పటికీ మర్చిపోలేము. సంతోషమంతా మనదే అన్నట్లుగా ఆడుకున్న అమాయకత్వపు రోజులు మళ్లీ రావు. ఏదో ఒక సందర్భంలో ఆ సంఘటనలు గుర్తుకొచ్చినపుడు మాత్రం మనసు అదోలాంటి భావంతో ఉప్పొంగుతుంది. మన చిన్నతనాన్ని గుర్తుచేసేలా బాత్‌టబ్‌లో డ్యాన్స్ ఇరగదీసేసింది ఓ గొరిల్లా. డల్లాస్ జూకు చెందిన జోలా అనే మగ గోరిల్లా నీటితో నింపిన బాత్‌టబ్‌లోకి దిగి ఒళ్లు మైమరిచిపోయింది. అటుఇటు తిరుగుతూ.. చేతుల్తో నీటిని చిమ్ముతూ సంతోషంతో ఆడింది. ( లాక్డౌన్: ఆ వార్తలో నిజం లేదు ) 2017లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ దానికో శీర్షికను కూడా పెట్టారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు..‘‘ గాళ్‌ఫ్రెండ్ తన ప్రేమను ఒప్పుకుందేమో, అందుకే ఈ సంతోషం... అది నేనే! ఓ వారం రోజుల తర్వాత స్నానం చేసినపుడు.. ఓ మై గాడ్! అతడెంతలా సంతోష పడుతున్నాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఆ గిఫ్ట్ ఇవ్వగానే ఏడ్చేసిన వృద్ధుడు ) -
గొరిల్లా సాయం
హీరోలకు సహాయం చేసే జంతువులు ప్రధాన పాత్ర పోషించిన పలు సినిమాలు గతంలో విజయవంతమయ్యాయి. కాకపోతే గతంలో ఏనుగులు, కుక్కలు, కోతులు, పాములు హీరోలకు సహాయం చేసే పాత్రల్లో నటించి, మెప్పించగా ఇప్పుడు గొరిల్లా వంతు వచ్చింది. ‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా, ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ శాలినీపాండే హీరోయిన్గా గొరిల్లా ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గొరిల్లా’. డాన్ శాండీ దర్శకత్వం వహించారు. సంతోషి సమర్పణలో గంగా ఎంటర్టైన్మెంట్స్, ఆల్ ఇన్ వన్ సంస్థల నిర్మాణంలో గంగా శబరీశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. శబరీశ్ రెడ్డి మాట్లాడుతూ–‘‘బ్యాంక్‌ను కొల్లగొట్టే బృందానికి గొరిల్లా చేసిన సహాయం ఏంటి? అసలు బ్యాంకులను వారు ఎందుకు కొల్లగొడుతున్నారు? అనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఇండియన్ స్క్రీన్ మీద తొలిసారి గొరిల్లా యాక్ట్ చేసింది మా సినిమాలోనే. శిక్షణ పొందిన గొరిల్లాను మా సినిమా కోసం తీసుకున్నాం’’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్. సి.యస్, కెమెరా : ఆర్.బి.గురుదేవ్. -
జంతుర్ మంతర్ సైలెన్స్... యాక్షన్!
మాట్లాడటానికి భాష కావాలి కానీ భావాలను చెప్పడానికి అక్కర్లేదు. ఆలకిస్తే మౌనం కూడా మాట్లాడుతుంది. అర్థం చేసుకునే మనసు ఉంటే కళ్లు కూడా కథలు చెబుతాయి. ఇలాంటప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై ప్రతిభ ఉన్న యాక్టర్స్‌తో పాటు మూగజీవాలు నటిస్తే తప్పేముంది! ప్రేక్షకులకు మంచి వినోదం దొరుకుతుంది. ప్రస్తుతం మూగజీవాలు కీలకపాత్రలుగా రూపొందుతున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. తోడుగా... విశ్వాసంగా...! వెండితెర దేవదాస్‌కు మందు బాటిల్‌తో తోడుగా ఉంది కుక్కే. అందుకనే కదా మూగజీవాల్లో విశ్వాసానికి పర్యాయపదంగా కుక్కను చెబుతారు. కానీ తప్పుడు శిక్షణ ఇచ్చామో.... ‘ఒక్కడు’ సినిమాలో తెలంగాణ శకుంతల ఉన్న క్లైమాక్స్ సన్నివేశాన్ని ఓసారి గుర్తు చేసుకోవడమే. మరీ.. ఇప్పుడు కుక్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న సౌత్ సినిమాల గురించి తెలుసుకుందాం. రాత్రివేళలో గుర్కా చేతిలో టార్చిలైట్‌తో పాటు ఓ కుక్క ఉంటే దొంగల పని అరికట్టడం మరింత సులువు అవుతుంది. అలా ఓ సెక్యూరిటీ గార్డ్ తనకు ఎదురైన ఓ సమస్యను ఓ కుక్క సాయంతో ఎలా పరిష్కరించాడనే నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘గుర్కా’. ఈ సినిమాలో సెక్యూరిటీ గార్డుగా హాస్యనటుడు యోగిబాబు లీడ్ రోల్ చేస్తున్నారు. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. అలాగే కన్నడ ‘కిర్రిక్‌పార్టీ’ సినిమాతో ఫేమ్ సంపాదించిన రక్షిత్ శెట్టి ప్రస్తుతం ‘777 చార్లీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఓ రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ డాగ్ రక్షిత్‌కు ఎప్పుడూ తోడుగా ఉంటుందట. ఉండి? ఏం చేస్తుంది? అంటే వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు ఈ సినిమా దర్శకుడు కిరణ్‌రాజ్. గొరిల్లా ప్లాన్! తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌లోకి ‘గోరిల్లా’ను చేర్చుకుని ఓ ప్లాన్ వేశారు యాక్టర్ జీవా. ఆ ప్లాన్ తాలూకు డీటైల్స్ షాలినీ పాండేకి తెలుసు. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించారు. అలాగే జీవా ప్లాన్ సక్సెస్ కావడం కోసం గొరిల్లా చేత గన్పట్టించారు జీవా. మరి.. గొరిల్లా ఎవర్ని షూట్ చేసిందనే విషయం సిల్వర్‌స్క్రీన్‌పై చూసి తెలుసుకోవాల్సిందే. పగ పట్టిందెవరు? అసలు పాములు పగపడతాయా? వాటికి శక్తులు ఉన్నాయా? అమావాస్య, పౌర్ణమి వంటి సందర్భాలతో పాములకు ఏవైనా లింక్ ఉందా? ఇటువంటి విషయాలపై ఎప్పటినుంచో పరిశోధన జరుగుతూనే ఉంది. సైన్స్ సంబం«ధీకులు ‘నో’ అంటే దైవాన్ని నమ్మేవారు ‘ఎస్’ అంటున్నారు. ఇవన్నీ ఏమో కానీ ఈ కథనాలపై చాలా సినిమాలే వచ్చాయి. తాజాగా తమిళంలో ‘నీయా 2’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో జై, వరలక్ష్మి శరత్‌కుమార్, కేథరిన్, రాయ్ లక్ష్మీ నటిస్తున్నారు. ఇందులో హీరో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా నటిస్తున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల కీబోర్డ్ పట్టుకోవాల్సిన జై.. నాగస్వరం ఊదుతారట. ఎందుకంటే వెండితెరపై చూడండి అంటున్నారు ‘నీయా 2’ దర్శకుడు ఎల్. సురేశ్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయిందని టాక్. అలాగే చిరంజీవి హీరోగా నటించిన ‘పున్నమినాగు’, సాయికుమార్ నటించిన ‘నాగదేవత’ సినిమాల్లో పాము లక్షణాలు హీరో పాత్రల్లో కనిపిస్తాయి. కానీ ‘పాంబన్’ సినిమా కోసం సగం పాముగా మారారు తమిళ నటుడు శరత్ కుమార్. ఈ సినిమాకు ఎ. వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రి శరత్ కుమార్‌తో కలిసి నటిస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. మూగజీవాలతో షూటింగ్ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో కష్టపడాలి. ముఖ్యంగా లొకేషన్లో టీమ్ అందరూ చాలా ఓర్పుగా ఉండాలి. ఒక్కోసారి చిన్న షాట్ కోసం కూడా చాలా టైమ్ వెచ్చించాల్సి రావచ్చు. అలాగే సినిమా విడుదల సమయంలో సంబంధిత అధికారుల నుంచి టీమ్ అనుమతి పొందాల్సిందే. ఎలాగూ గ్రాఫిక్స్ వర్క్స్ ఉండనే ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉన్నా.. పర్లేదు. సినిమా చూసి ఆడియన్స్ ఆనందపడాలి. కాసుల రూపంలో ఆ సంతోషం మాకు షేర్ కావాలి అని ఆయా సినిమా నిర్మాతలు అనుకుంటున్నారు. ఇలాంటి సినిమాలను ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టపడతారని అనుకోవచ్చు. అదుగోనండీ బంటీ సాధారణంగా పందిపిల్ల అంటే అందరూ అదోరకంగా చూస్తారు. అదే వెండితెరపై విన్యాసాలు చేస్తే ఎంజాయ్ చేయకుండా ఉండరు. ఈ థ్రిల్ కోసమే దాదాపు రెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు దర్శక–నటుడు రవిబాబు. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అదుగో’. ఈ సినిమాలో బంటీ అనే కీలకపాత్రలో పందిపిల్లను నటింపజేశారు టీమ్. అంతేకాదు.. ఈ సినిమాకు లైవ్ యాక్షన్ 3డీ యానిమేషన్ టెక్నాలజీని కూడా యాడ్ చేశారు చిత్రబృందం. ఈ సినిమాను భారతీయ అన్ని భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులో ‘అదుగో’ పేరుతో విడుదల చేస్తారు. మిగిలిన భాషల్లో ‘బంటీ’ అనే టైటిల్ పెట్టారు. అన్నట్లు ఈ సినిమాలో బంటీపై పాటలు కూడా ఉన్నాయటండోయ్. ఈ సినిమాలో నటి పూర్ణ ఓ స్పెషల్ సాంగ్ కూడా చేశారు. వర్మ, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి స్వరకర్త. త్వరలో విడుదల కానుంది. ‘అదుగో’ లో బంటి గజ రాజసం అడవి నేపథ్యంలో సినిమా వెండితెరపైకి వస్తుందంటే అందులో కచ్చితంగా ఒక్కసీన్‌లో అయినా గజరాజు కనిపిస్తాడు. ఆ మాటకొస్తే... ఎన్టీఆర్ ‘అడవిరాముడు’, చిరంజీవి ‘అడవిదొంగ’, రాజేంద్రప్రసాద్ ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాల్లో గజరాజు పాత్ర ఎంత పవర్ఫుల్లో ప్రేక్షకులకు తెలియనిది కాదంటారా. ఏనుగుతో ఈ వెండితెర మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికే టాలీవుడ్ టార్జాన్ రానా, బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్, ‘తమిళ బిగ్‌బాస్ 2’ ఫేమ్ అరవ్ ప్రయత్నిస్తున్నారు. అడవి జీవితం ఎలా ఉందో బందేవ్ని అదేనండీ... రానాని పలకరిస్తే... థాయ్‌లాండ్, కేరళ అడవుల్లో తాను తిరిగిన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేస్తున్నారట. ముఖ్యంగా ఏనుగులతో గడిపిన సీన్స్‌ను గుర్తుచేస్తున్నారట. ఇదంతా ఆయన తాజాగా నటిస్తున్న ‘అరణ్య’ సినిమా ప్రభావమని ఊహించవచ్చు. రానా హీరోగా నటిస్తున్న ‘అరణ్య’ సినిమాకు ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్‌కు ‘కాదన్’ అని, హిందీ వెర్షన్‌కు ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రానా ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్లో ఏనుగుల భాషను బాగా అర్థం చేసుకుని వాటితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నారు బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్. జమాల్‌కు ఈ అవసరం ఎందుకొచ్చిందంటే ‘జంగ్లీ’ సినిమా కోసం. మనుషులకు–ఏనుగులకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఆధారంగానే ఈ సినిమా రూపొందుతోంది. థాయ్‌లాండ్‌లో ఎక్కువగా షూట్ చేశారు. ఈ సినిమాకు అమెరికన్ డైరెక్టర్ చెక్ రసెల్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అరవ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘రాజ్ భీమా’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు నరేశ్ సంపత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కేవలం గజరాజు మాత్రమే కాదు. మిగతా జంతువులకూ ప్రాధాన్యం ఉంటుందట. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలు విడుదలైతే చిన్నపిల్లలు ఏనుగమ్మా.. ఏనుగు.. మా ఊరి థియేటర్స్లోకొచ్చిందేనుగు అని పాడుకుంటారేమో. రానా అరవ్ జీవా, షాలినీపాండే విద్యుత్ జమాల్ యోగిబాబు రక్షిత్‌శెట్టి వరలక్ష్మి జై శరత్ కుమార్ -
చింపాంజీ.. వెరీ చిలిపి
స్టూడెంట్ గ్యాంగ్, రౌడీ గ్యాంగ్, కామెడీ గ్యాంగ్.. ఇలా డిఫరెంట్ గ్యాంగ్‌ల గురించి వింటాం. సినిమాల్లో చూస్తాం. మరి.. గొరిల్లా గ్యాంగ్ పవర్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ‘గొరిల్లా’ సినిమా చూడాల్సిందే. కొత్త దర్శకుడు డాన్ శాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీవా, షాలినీ పాండే, యోగిబాబు, రాధా రవి, సతీష్, వివేక్ ప్రశన్న, రాజేంద్రన్ ఈ గొరిల్లా గ్యాంగ్ సభ్యులు. ‘గొరిల్లా’ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘విక్రమ్‌వేదా’ ఫేమ్ శ్యామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ‘‘చింపాజీలు చాలా తెలివైనవి. అవి చేసే చిలిపి చేష్టలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో చింపాంజీ ఓ మేజర్ క్యారెక్టర్ చేసింది. యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ తీయడానికి చింపాజీకి నాలుగు నెలలు ముందే ట్రైనింగ్ ఇప్పించాం. సినిమా విడుదల తర్వాత మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్ మెచ్చుకుంటారన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
సైగల సెన్సేషన్ ‘కోకో’ కన్నుమూత
కాలిఫోర్నియా : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోకో(గొరిల్లా) తన 46వ ఏట కన్నుమూసింది. గురువారం కోకో మృతిని ‘గొరిల్లా పౌండేషన్’ ప్రతినిధులు ధ్రువీకరించారు. సైగల భాషతో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ’కోకో’.. గోరిల్లాల అంబాసిడర్‌గా ఓ వెలుగు వెలిగింది. హనబీ కో( కోకో అసలు పేరు)1971 జూలై 4న శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ జూలో జన్మించింది. 12నెలల ప్రాయంలో స్టాన్ఫోర్డ్ యూనివర్శీటీకి చెందిన ఫ్రాన్సిన్ పాటర్సన్ అనే విద్యార్థి చొరవతో సైగల భాషను నేర్చుకుంది. దాదాపు 1000 రకాల సైగలనే కాకుండా ఆంగ్ల పదాలను సైతం అర్థం చేసుకోగలగటమే కోకో ప్రత్యేకత. 1983 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా ఓ పిల్లి పిల్ల కావాలని అడగటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 1985న కోకో పుట్టిన రోజు సందర్భంగా కొన్ని పిల్లులను తెచ్చి ఎంపిక చేసుకోవల్సిందిగా కోరారు. వాటిలో బూడిద, తెలుపు రంగులో ఉన్న ఓ పిల్లి పిల్లను ఎంపిక చేసుకోవటమే కాకుండా దానికి ఆల్ బాల్ అనే పేరు పెట్టింది. కన్న తల్లిలాగా దానికి సేవలు కూడా చేసేది. అయితే ఓ కారు ప్రమాదంలో ఆల్ బాల్ మృతిచెందటంతో కోకో కృంగిపోయి అలా కొద్ది రోజులు ఏడుస్తూ ఉండిపోయింది. నేషనల్ జియోగ్రఫీ బుక్ కవర్ పేజీపై రెండు సార్లు కనిపించటమే కాకుండా మరికొన్ని డాక్యుమెంటరీలలో కూడా కనిపించింది. సెల్ఫీ తీసుకోవటం, ఇంటర్నెట్లో చాట్ చేయటం వంటి పనులతో అందరి దృష్టిని ఆకర్షించింది. -
గొరిల్లాతో గోల గోల!
విహారయాత్రకు వెళ్లినప్పుడు అడవిలో గొరిల్లాను చూస్తే భయపడతాం. అదే జూలో చూస్తే అది ఏం చేస్తుందా? అని ఆసక్తికరంగా గమనిస్తాం. మరి... అదే గొరిల్లా సినిమాల్లో ఓ కీలక పాత్ర చేస్తే ఎలా ఉంటుంది? అనేది కొన్ని సినిమాల్లో చూశాం. ఇప్పుడు మేము మళ్లీ కొత్తగా చూపించబోతున్నాం అంటున్నారు ‘గొరిల్లా’ మూవీ టీమ్. డాన్ శాండీ దర్శకత్వంలో తమిళ యాక్టర్ జీవా హీరోగా నటించిన చిత్రం ‘గొరిల్లా’. ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను కంప్లీట్ చేశారీ హీరో. మరి.. ‘గొరిల్లా’ సినిమాలో నాయకా నాయికలు జీవా, షాలినీ పాండేలు గొరిల్లాతో ఏ విధంగా గోల గోల చేశారనేది థియేటర్లో బొమ్మపడితే కానీ తెలియదు. ఈ సినిమా షూటింగ్ కోసం మార్చిలో థాయ్‌లాండ్ కూడా వెళ్లింది చిత్రబృందం. ‘రంగం, మాస్క్’ వంటి డబ్బింగ్ సినిమాల ద్వారా జీవా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘గొరిల్లా’ను కూడా తెలుగులో విడుదల చేయాలనుకుంటున్నారట. -
మనుషుల్లా నడవటం నాకూ తెలుసు
ఫిలడెల్ఫియా : గొరిల్లాలు మనుషుల్లా రెండు కాళ్ల మీద నడవటం పెద్ద విశేషం ఏం కాదు. అయితే అది అరుదుగా జరగాలే తప్ప.. అదే పనిగా ఉంటే మాత్రం చర్చనీయాంశమే. అమెరికా ఫిలడెల్ఫియాలోని ఓ జూలో ఉన్న లూయిస్ అనే మగ గొరిల్లా చాలా ప్రత్యేకం. రోజులో దాదాపు సమయం అది రెండు కాళ్ల మీద అది నడుచుకుంటూ వెళ్తుంది. అయితే అది అలా చేయటానికి కారణం ఉందని చెబుతున్నారు జూ నిర్వాహకులు. ‘లూయిస్‌కు బురద అంటే చికాకు. దానిని చూసేందుకు వచ్చే వాళ్లే వేసే తిండిని అది మట్టి పాలు కానివ్వదు. శుభ్రత ఎక్కువ. నిర్వాహకులు పెట్టే తిండిని కూడా అది చేతిలో పట్టుకునే దాని బోనులోకి వెళ్లి అది తింటుంది. ఆ సమయంలో అది రెండు కాళ్ల మీద నడుస్తూనే ఉంటుంది’ అని నిర్వాహకులు చెబుతున్నారు. 18 ఏళ్ల లూయిస్ ఆ మధ్య ఓ సందర్భంలో ఠీవీగా తిప్పుకుంటూ పోతుంటే.. దానిని వీడియో తీసిన జూ అధికారులు ట్విటర్లో పోస్ట్ చేయటంతో వేలలో కామెంట్లు వచ్చిపడుతున్నాయి. Although gorillas occasionally walk on two legs (bipedal), it is less common. Not for Louis though - he can often be seen walking bipedal when his hands are full of snack or when the ground is muddy (so he doesn't get his hands dirty)! pic.twitter.com/6xrMQ1MU9S — Philadelphia Zoo (@phillyzoo) 5 March 2018 -
గొరిల్లా గ్లాస్-5 వచ్చేసింది!
న్యూయార్క్ః మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ మోడళ్ళ స్మార్ట్ ఫోన్ లు అధునాతన గొరిల్లా గ్లాస్ స్క్రీన్ లను కలిగి ఉంటున్నాయి. ఇలా గొరిల్లా గ్లాస్ ఉన్న ఫోన్లు ఎత్తునుంచీ కింద పడినా స్ర్నీన్ దెబ్బతినదన్న విషయం చాలామందికి ఇప్పటికే తెలిసిన విషయం. ఈ గ్లాస్ గీతలు పడకుండా కూడా నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు గొరిల్లా గ్లాస్ 5 మరింత మన్నికతో, ధృఢంగా మార్కెట్లోకి ప్రవేశించింది. గ్లాస్ మేకర్ కార్నింగ్.. కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు, ఎలక్ట్రానిక్స్ తయారీదారులు తమ పరికరాల్లో ఉపయోగించే ఈ సూపర్ గ్లాస్ ను ఇప్పుడు రసాయనికంగా మరింత ధృఢంగా, బలంగా ఉండేట్టు రూపొందించారు. ఈ కొత్త గ్లాస్.. 1.6 మీటర్ల ఎత్తునుంచీ కిందపడినా 80 శాతం వరకూ పగిలే అవకాశమే ఉండదని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. ముఖ్యంగా గాడ్జెట్ల పనితీరును మెరుగు పరిచేందుకు వీలుగా ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను రూపొందించారు. భుజం లేదా నడుము ఎత్తునుంచీ గట్టిగా ఉండే ఉపరితలంపై పడినా స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా, గ్లాస్ పగలకుండా ఉండేట్టు తయారు చేసినట్లు పేర్కొన్నారు. 2014 లో కార్నింగ్... గొరిల్లా గ్లాస్ 4 ను ప్రవేశ పెట్టింది. అప్పట్లో ఆ గ్లాస్ ను 1 మీటర్ ఎత్తునుంచి పడినా పగలకుండా, దెబ్బతినకుండా ఉండేట్లు రూపొందించింది. ఇప్పుడు ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను మునుపటికంటే రెండు రెట్లు దృఢంగా రూపొందించినట్లు కార్నింగ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ జాన్ బేన్ తెలిపారు. గొరిల్లా గ్లాస్ ను మొట్టమొదట 2007 లో ఎలెక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించడం ప్రారంభించారు. అప్పట్నుంచీ మరింత మన్నిక పెరిగేలా, గీతల్ని నిరోధించేలా, మరింత పలుచగా తయారు చేసేందుకు కార్నింగ్ సంస్థ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటివరకూ సుమారు 4.5 బిలియన్ల పరికరాల యూనిట్లకు గొరిల్లా గ్లాస్ రవాణా జరిగినట్లు కంపెనీ చెప్తోంది. శాంసంగ్, హెచ్‌టీసీ, హెవావే, ఎల్జీ, హెచ్‌పీ, ఆసుస్ వంటి పేరు పొందిన తయారీదారులతోపాటు.. మరెందరో పేరులేని పరికరాల ఉత్పత్తిదారులు కూడా కార్నింగ్ గ్లాస్ ను ఉపయోగించి పరికరాలు చేస్తున్నట్లు జాన్ తెలిపారు. -
టీవీలో సంచలనం: అమ్మాయితో గొరిల్లా రొమాన్స్
ఇప్పటికే ఆమె జీవితంలో ఇద్దరు మగాళ్లున్నారు. ఒకడు నిశ్చితార్థం ముందు ఆమెను కాదని, మళ్లీ వెంటపడేవాడు. మరొకడు.. ఆమె పనిచేస్తోన్న టీవీ చానెల్ ఓనర్. రెండో వాడంటే ఆమెకూ ఇష్టమే. కానీ ఆ డబ్బున్న మారాజు తల్లిదండ్రులకు మాత్రం అతడు ఈమెను పెళ్లిచేసుకోవడం ఇష్టంఉండదు. స్వతంత్ర భావాలున్న ఆమె.. ప్రేమలో వరుస వైఫల్యాల కారణంగా కుంగిపోతుంది. దీంతో జీవితం కాస్త భారంగా మారిపోతుంది.. అదే సమయంలో ప్రేమైక జీవనం కోసం తపన పెరుగుతుంది. తనవాడి కోసం ఎదురుచూస్తోన్న ఆమె దగ్గరకు అనుకోని పరిస్థితుల్లో ఓ మనసున్న(!) గొరిల్లా వస్తుంది. కాలక్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు(!). గొరిల్లాకు ఆ అమ్మాయిపట్ల ప్రేమ పుడుతుంది. పిచ్చిచేష్టలతో గుండెల్లో నిండుగా ఉన్న ప్రేమను ప్రదర్శిస్తుందా గొరిల్లా. భారతీయ బుల్లితెర చరిత్రలో ఇదొక సంచలనం. మొట్టమొదటిసారి ఓ టీవీ సీరియల్ లో భారీ జంతువు.. అది కూడా ఫుల్ లెంత్ పాత్రలో కనిపించనుంది. ఏడాది కాలంగా కలర్స్ చానెల్ లో ప్రసారం అవుతూ, మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోన్న 'థప్ కీ ప్యార్ కి' సీరియల్ లో ఈ అరుదైన దృశ్యాలు చోటుచేసుకోనున్నాయి. బిగ్ బ్రదర్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న జిగ్యాస్ సింగ్ 'థప్ కీ' షోలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. గొరిల్లా ఆమె వద్దకు చేరుకునే, ఇంట్లో నానా యాగీ చేసి, ఆమెను మెప్పించే ఎపిసొడ్లు జూన్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. జిగ్యాస- గరిల్లాల మధ్య సాగే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఏమేరకు రంజింపజేస్తాయో చూడాలి! -
మళ్లీ కనిపించనున్న గొరిల్లా
సిన్సినట్టి: గతవారం ఓ బాలుడిని రక్షించడం కోసం గొరిల్లాను చంపిన జూ అధికారులు తిరిగి ఆ గొరిల్లా ఉన్న చోటును ప్రారంభిస్తున్నారు. అయితే, ఈసారి ఆ ఎన్ క్లోజర్ వద్ద పెద్ద మొత్తంలో కంచెను ఏర్పాటుచేశారు. చిన్నపిల్లలు సైతం ఎక్కేందుకు వీలుకానంత విధంగా గట్టి రక్షణ చర్యలు తీసుకున్నారు. గత మే 28న సిన్సినట్టిలోని జంతు ప్రదర్శన శాలలో ఓ మూడేళ్ల బాలుడు ఓ గొరిల్లా ఎన్ క్లోజర్లో పడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ బాలుడిని రక్షించే క్రమంలో పదిహేడేళ్ల గొరిల్లాను చంపేశారు. అనంతరం ఆ ఎన్ క్లోజర్ ను మూసేశారు. వేరే గొరిల్లా అందులో ఉన్నప్పటికీ రక్షణ చర్యల్లో భాగంగా దానిని మూసేశారు. తిరిగి ఆ చర్యలు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. గొరిల్లాను హత్య చేయడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. కొంతమంది జంతు ప్రేమికులు ఆ బాలుడి వల్ల గొరిల్లాను చంపాల్సి వచ్చిందని, బాలుడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టులో పిటిషన్ కూడా వేయగా అందుకు నిరాకరించిన కోర్టు ఆ ఎన్ క్లోజర్ వద్ద గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని మాత్రం సూచించింది. -
గొరిల్లా నుంచి బాలున్ని రక్షించడానికి..
ఒహియో: ప్రమాదవశాత్తూ గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో పడ్డ బాలున్ని కాపాడడానికి 17 ఏళ్ల వయసున్న హరాంబే అనే గొరిళ్లాను జూ అధికారులు కాల్చి చంపారు. ఈ సంఘటన అమెరికాలో ఒహియోలోని సిన్సినాటీ జూ లో చోటుచేసుకుంది. జూ ను వీక్షించడానికి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ గొరిళ్లాలు ఉండే 10 నుంచి 12 అడుగుల లోతులో ఉన్న ఎన్‌క్లోజర్‌లో పడ్డాడు. ఆ సమయంలో ఆక్కడ మొత్తం మూడు గొరిల్లాలు ఉన్నాయి. వీటిలో రెండుగొరిల్లాలను బాలుడికి దూరంగా అధికారులు బయటకు పంపారు. కానీ అక్కడే ఉన్న మరో గొరిల్లా హరాంబే మాత్రం అక్కడి నుంచి వెళ్లలేదు. బాలున్ని పట్టుకుని ఈడ్చుకుంటూ అటూ ఇటూ విసరసాగింది. దీంతో బాలున్ని కాపాడడానికి వేరే దారి లేక గొరిల్లాను జూ అధికారులు కాల్చి చంపారు. గొరిల్లాను చంపిన సమయంలో బాలుడు గొరిల్లా రెండు కాళ్ల మధ్యలో ఉన్నాడు. తీవ్రగాయాలైన బాలున్ని దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి వీడియోను కూడా అధికారులు విడుదల చేశారు. అయితే గొరిల్లా బాలునితో దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలను అందులోంచి తీసేసిట్టు అధికారులు తెలిపారు. -
అంతరిక్షంలో వ్యోమగామి వెంటపడ్డ గొరిల్లా
అంతరిక్షంలోకి కుక్కలు వెళ్లడం మనకు తెలుసు కానీ ఈమధ్య గొరిల్లాలు కూడా వెళుతున్నాయా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో అవుననే అంటుంది. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఓ గొరిల్లా ప్రత్యక్షమవ్వడమే కాదు.. ఏకంగా ఓ వ్యోమగామిని వెంటపడి తరిమింది. అంతరిక్ష కేంద్రంలో ఒక్కసారిగా గొరిల్లాను చూసి కంగుతిన్న ఆ వ్యోమగామి బిత్తరపోవడమే కాదు.. భయంతో పరుగులు కూడా పెట్టాడు. ఇంతకు ఆ గొరిల్లా అంతరిక్ష కేంద్రంలోకి ఎలా వచ్చింది? వ్యోమగామిని ఎందుకు తరిమింది? అంటే దానికి వెనుక మరో వ్యోమగామి చిలిపి పని.. సహచర అంతరిక్ష యాత్రికుడ్రిని టీజ్ చేయాలన్న కొంటె ఆలోచన దాగి ఉంది. అమెరికాకు చెందిన వ్యోమగామి స్కాట్ కెల్లీ అంతరిక్షంలోని ఐఎస్ఎస్లోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. మార్చి మొదటి వారంలో అతను భూమికి తిరిగి రావాలి. వెళ్లేముందు ఏదో ఒక తుంటరి పని చేసి అంతరిక్ష కేంద్రంలో ఉన్న తన తోటి మిత్రులను ఆటపట్టించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గొరిల్లా అవతారమెత్తాడు. అంతరిక్ష కేంద్రంలోని జీరో గ్రావిటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. గొరిల్లా వేషం కట్టిన స్కాట్ కెల్లీ ఒక తెల్ల డబ్బానుంచి బయటకు వచ్చి గాల్లో తేలుతూ బ్రిటిష్ ఆస్ట్రోనాట్ టిమ్ పీక్ వెంటపడ్డాడు. అతనేమో నిజంగానే గొరిల్లా వచ్చిందనుకుని దాన్నుంచి తప్పించుకునేందుకు తెగ తంటాలు పడ్డాడు. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తోంది. గొరిల్లా సూట్‌ను స్కాట్ సోదరుడు మార్క్ అంతరిక్ష కేంద్రానికి పంపాడు. ఈ వీడియోను మొదట పోస్ట్ చేసింది కూడా అతనే. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉన్న అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీనే. -
మూడేళ్ల చిన్నారికి గొరిల్లా పాఠం
న్యూయార్క్: గొరిల్లాను దూరం నుంచి చూస్తేనే ఒళ్లంతా జలదరించిపోతుంటుంది. అలాంటిది నిజంగా ముఖంలోకి ముఖంపెట్టి చూస్తే.. అది కూడా ఓ మూడేళ్ల చిన్నారి ఆ సాహసం చేస్తే. ఆ చిన్నారిని చూసి ముచ్చటపడిన గొరిల్లా కూడా తనకు తెలిసిన విద్యలు నేర్పిస్తే.. ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా.. అవును ఒహియోలోని కొలంబస్ జూ వద్ద ఇదే ఘటన ఆవిష్కృతమైంది. రైలీ మాడిసన్ అనే మూడేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి జూ పార్క్‌కు వెళ్లింది. అక్కడ ఉన్న గొరిల్లా దగ్గరకు వెళ్లి హాయ్ అన్నట్లుగా ముఖంలోకి ముఖంపెట్టి చూసింది. ఆ తర్వాత ఆ గొరిల్లా తన మధ్య వేలిని చూపుడు వేలిగా చూపిస్తూ ఆ పాపను కూడా అలాగే చేయమన్నట్లుగా హావభావాలతో చెప్పడంతో ఆ పాప కూడా అలాగే చేసింది. తన మధ్య వేలినే చూపుడు వేలుగా చూపిస్తూ తనకు గొరిల్లా ఆ విషయం చెప్పిందన్నట్లు తల్లితో చెప్పింది. అప్పటి నుంచి పదే పదే అదే వేలును చూపుడు వేలిగా చూపెడుతూ ముచ్చటపడుతుండటంతో.. 'తప్పు నువ్వు గొరిల్లాను అనుసరించ కూడదు. చూపుడు వేలు అది కాదు ఇది' అంటూ అసలైన చూపుడు వేలు చూపిస్తూ ముద్దుచేసింది. అలా తొలిసారి, మధ్య వేలిని కూడా చూపుడు వేలిగా చూపించవచ్చని ఆ చిన్నారి గొరిల్లా వద్ద పాఠాలు నేర్చుకుంది.