మళ్లీ కనిపించనున్న గొరిల్లా | Cincinnati Zoo Reopening Exhibit Where Boy Fell, Gorilla Was Shot | Sakshi
Sakshi News home page

మళ్లీ కనిపించనున్న గొరిల్లా

Published Tue, Jun 7 2016 11:22 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

మళ్లీ కనిపించనున్న గొరిల్లా

మళ్లీ కనిపించనున్న గొరిల్లా

సిన్సినట్టి: గతవారం ఓ బాలుడిని రక్షించడం కోసం గొరిల్లాను చంపిన జూ అధికారులు తిరిగి ఆ గొరిల్లా ఉన్న చోటును ప్రారంభిస్తున్నారు. అయితే, ఈసారి ఆ ఎన్ క్లోజర్ వద్ద పెద్ద మొత్తంలో కంచెను ఏర్పాటుచేశారు. చిన్నపిల్లలు సైతం ఎక్కేందుకు వీలుకానంత విధంగా గట్టి రక్షణ చర్యలు తీసుకున్నారు. గత మే 28న సిన్సినట్టిలోని జంతు ప్రదర్శన శాలలో ఓ మూడేళ్ల బాలుడు ఓ గొరిల్లా ఎన్ క్లోజర్లో పడిపోయిన విషయం తెలిసిందే.

అయితే, ఆ బాలుడిని రక్షించే క్రమంలో పదిహేడేళ్ల గొరిల్లాను చంపేశారు. అనంతరం ఆ ఎన్ క్లోజర్ ను మూసేశారు. వేరే గొరిల్లా అందులో ఉన్నప్పటికీ రక్షణ చర్యల్లో భాగంగా దానిని మూసేశారు. తిరిగి ఆ చర్యలు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. గొరిల్లాను హత్య చేయడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. కొంతమంది జంతు ప్రేమికులు ఆ బాలుడి వల్ల గొరిల్లాను చంపాల్సి వచ్చిందని, బాలుడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టులో పిటిషన్ కూడా వేయగా అందుకు నిరాకరించిన కోర్టు ఆ ఎన్ క్లోజర్ వద్ద గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని మాత్రం సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement