
ఇంత వరకు మగవాళ్లు కూడా పిల్లలు కనడం గురించి మానవజాతిలోనే జరిగింది. అది కూడా వారు ట్రాన్స్ జెండర్‌గా మారే క్రమంలో జరిగిన అరుదైన ఘటనే. ఇప్పుడు అలాంటి ఘటనే ఓ జంతుశాలలో చోటు చేసుకుంది. అప్పటి వరకు అది ఆ జూలో మగ గొరిల్లాగా పెరిగింది..ఉన్నటుండి ఒక రోజు ఓ ఆడ గొరిల్లా పిల్లకు జన్మనివ్వడంతో జూ సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన యూఎస్‌లోని కొలంబస్ జూలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. కొలంబస్ జూలో సుల్లీ అనే గొరిల్లా 2019లో తన తల్లితో కలిసి ఉంటోంది. దాన్ని చిన్నపటి నుంచి ఆ జూ సిబ్బంది అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఊహించని విధంగా గురువారం తెల్లవారుఝామున ఓ ఆడ గొరిల్లాకు జన్మనిచ్చేంత వరకు అది ఆడ గొరిల్లా అని కనుగొనలేకపోయారు. జూ సిబ్బంది ఆ గొరిల్లాను పర్యవేక్షించే కీపర్లు అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో అధికారికంగా జూ అధికారులు వెల్లడించారు.
ఎందుకు తాము దాన్ని మగ గొరిల్లా అని భావించామో కూడా వివరించారు. నిజానికి సుమారు 8 ఏళ్ల వయసు వరకు గొరిల్లాలు మగ లేదా ఆడవిగా గుర్తించలేమని, అవి రెండు ఒకే పరిమాణంలో ఉంటాయి. పైగా వాటికి ప్రముఖ లైంగిక అవయవాలు ఉండవు. గొరిల్లాలు ఒక వయసు వచ్చే వరకు ఏ లింగం అనేది గుర్తించడం కష్ట అని చెప్పుకొచ్చారు. మగ గొరిల్లాలకు చాలా వయసు వచ్చే వరకు గెడ్డం, వెన్ను, కొన్ని ప్రత్యేక అవయవాలు అభివృద్ధి చెందవు.
దీంతో వాటిని మగవా, ఆడవా అని గుర్తించడం కష్టమవుతుందని జూ నిర్వాహకులు చెప్పారు. అవి గర్భం దాల్చిన కూడా బాహ్య సంకేతాలు ఏమి పెద్దగా చూపవని చెబుతున్నారు. సహజంగానే గొరిల్లాకు పెద్ద పొత్తికడుపు ఉండటంతో గర్భదాల్చినట్లు గుర్తించడం కష్టమేనని కొలంబస్ జూ వివరణ ఇచ్చింది. ఇక సదరు గొరిల్లాకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, అది ఆడగొరిల్లా పిల్లలానే ఉందని జూ పేర్కొంది. ఇక సదరు సుల్లీ గొరిల్లాకు వెల్సన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే డీఎన్‌ఏ పరీక్షలు కూడా నిర్వహించి ఆడ గొరిల్లా పిల్ల తండ్రిని కూడా గుర్తిస్తామని కొలంబస్ జూ పేర్కొంది.
(చదవండి: సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే కారణమా..!)
Comments
Please login to add a commentAdd a comment