Male
-
21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళా ఓటర్లేనని స్పష్టమైంది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 21 స్థానాల్లో పురుషులు కన్నా మహిళలే ఎక్కువ మంది ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ గణాంకాలు పేర్కొన్నాయి. అమలాపురం, ఒంగోలు, కర్నూలు, హిందూపురం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే మహిళలు కన్నా పురుషులు స్వల్పంగా ఎక్కువగా ఓటేశారు. కాకినాడ, అనంతపురం లోక్‌సభ స్థానాల్లో పురుషులు కన్నా మహిళలే ఎక్కువగా ఓటేసినా.. తేడా మాత్రం స్వల్పంగానే ఉంది.మిగతా లోక్‌సభ స్థానాల్లో 11 వేల నుంచి 47 వేల వరకు మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మహిళా ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయంటే సహజంగానే వైఎస్సార్సీపీకే మొగ్గు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా వారి జీవనోపాధిని మెరుగుపరచడమే కారణమని వారు విశ్లేíÙస్తున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరిట పథకాలు మంజూరు చేయడంతో మహిళా ఓటింగ్ పెరిగిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసిన విషయం తెలిసిందే.రాష్ట్రంలోని మహిళలందరూ మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే గట్టి పట్టుదలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారని సీనియర్ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళల ఓట్లు ఎక్కువగా నమోదైన 21 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఆ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మహిళల ఓట్లన్నీ వైఎస్సార్సీపీకే పడ్డాయని, పోలింగ్ రోజు ఇది స్పష్టంగా కనిపించిందని ఆ రాజకీయ నాయకులు చెబుతున్నారు.హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ఇస్త్రీ పనికి వెళ్లిన వారితో పాటు వివిధ రకాల చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వెళ్లిన మహిళలందరూ కూడా ఏపీ వెళ్లి వైఎస్సార్సీపీకే ఓటు వేశామని చెబుతున్నారు. ప్రభుత్వం వల్ల మేలు పొందిన వారందరూ ఎక్కడున్నా సరే పోలింగ్ రోజున రాష్ట్రానికి వచ్చి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఓటు వేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
మగవారికి మెనోపాజ్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!
మహిళల్లో మెనోపాజ్‌కి సంబంధించిన లక్షణాలు ఉంటాయని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతుంటే విన్నాం. అదే పరిస్థితి మగవారిలో కూడా ఉంటుందట. అయితే వాళ్లు దాన్ని పెద్దగా పట్టించుకోరు, గమనించరని అంటున్నారు. మహిళలకైతే స్థిరమైన అండాశయ నిల్వ కాలక్రమేణ తగ్గుతుంది. అదే పురుషుల్లో అయితే టెస్టోస్టెరాన్ అకస్మాత్తుగా పడిపోవడం వల్ల మెనోపాజ్ సమస్యలు వస్తాయట. సడెన్‌గా బరువు పెరగడం, జుట్టు బూడిద రంగులోకి మారిపోడం వంటి అనేక మార్పుల ద్వారా ఇది సంకేతం ఇస్తుందట. అయితే ఇంతవరకు దీనిపై పరిశోధనలు లేకపోవడం వల్ల దీని గురించి ఎవరికీ అంతగా అవగాహన లేదన్నారు. ఎందువల్ల ఈ పరిస్థితి మగవారికి వస్తుంది?. లక్షణాలు ఎలా ఉంటాయంటే.. మహిళల్లో మెనోపాజ్ దశ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, పైగా వివిధ అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మగవారిలో ప్రమాదం తీవ్రంగా ఉండదు గానీ కొన్ని సమస్యలు ఎదురవ్వుతాయని ఐవీఎఫ్ నిపుణురాలు డాక్టర్ శోభా గుప్తా అన్నారు. మగవారిలో వచ్చే మోనోపాజ్ని "ఆండ్రోపాజ్" అని పిలుస్తారని చెప్పారు. ఆండ్రోపాజ్ అంటే.. టెస్టోస్టెరాన్ స్థాయిల్లో క్షీణత కారణంగా ఆండ్రోపాజ్ వస్తుంది. ఇది సహజంగా వయసు తోపాటు దీని స్థాయిలు తగ్గడం వల్ల జరుగుతుంది. వయస్సుతో టెస్టోస్టెరాన్ తగ్గుదల అనేది అత్యంత అరుదుగా జరుగుతుంది. కొందరిలో చాలా ఆలస్యంగా సంభవిస్తుంది. స్త్రీల్లో మెనోపాజ్ వేగవంతంగా ఉంటే మగవారిలో ఈ దశ నెమ్మదిగా బయటపడుతుంది. లక్షణాలు.. ఫోకస్ తక్కువగా ఉండటం, అలిసిపోవటం మానసిక స్పష్టత తగ్గింది (చెడు శ్రద్ధ, డౌన్‌బీట్ మూడ్). శక్తి, బలం కోల్పోవడం. కండరాలను కోల్పోవడం, కొవ్వును పేరుకుపోయి బరువు పెరగడం. మూడ్లు మారిపోవడం లేదా చికాకు ఎక్కువగా ఉండటం. కండరాలలో నొప్పులు చెమటలు లేదా వేడిగా అనిపించటం చేతులు, కాళ్ళు చల్లగా అయిపోవడం దురద లైంగిక సామర్థ్యం తగ్గడం ఎత్తు కోల్పోవడం ఎందుకొస్తుందంటే.. టెస్టోస్టెరాన్ పురుషులలో అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుంది. ఉదాహరణకు ఇది లిబిడో, కండర ద్రవ్యరాశి, స్పెర్మ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి, రక్త ఉత్పత్తికి టెస్టోస్టెరాన్ చాలా అవసరం. ఇది అడ్రినల్ గ్రంథులు, వృషణాలలో ఉత్పత్తి అవుతుంది. పురుషుల వయస్సు ఆధారంగా స్పెర్మ్ ఉత్పత్తి చేసే సామర్థ్యం,టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం జరుగుతుంది. ఇది ఆండ్రోపాజ్ అనే పరిస్థితికి దారితీస్తుంది. ఎప్పుడు ప్రారంభమవుతుందంటే.. దాదాపు 40 ఏళ్ల వయసు నుంచి ప్రారంభమవుతుంది. అలా 70 ఏళ్ల వరకు కొనసాగుతుంది. అయితే వైద్యులు, సైకాలజిస్టులు పురుషులు మోనోపాజ్ దశన అనుభవిస్తారనే విషయాన్ని అంగీకరించరు. ఎందుకంటే..? చాలామంది దీన్ని ఫేస్ చేయకపోవడం అందుకు కారణం. మహిళలు ఎలా తమ భావాలను ఎలా నిర్థారిస్తారంటే.. పైన చెప్పిన ఏ లక్షణాలు కనిపించనప్పుడూ రక్త పరీక్ష ద్వారా గుర్తించడం జరుగుతుంది. అప్పుడు టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటే హర్మోన్ పునః స్థాపన చికిత్స(హెచ్ఆర్టీ) ద్వారా పరిస్థితిని మెరుగుపరిచే యత్నం చేస్తారు వైద్యులు. అలాగే శారీరక శ్రమ, మంచి ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటివి చేయమని వైద్యులు సూచించడం జరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ►మంచి పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు,పాల పదార్థాలను సమతుల్యంగా తీసుకోండి. ►క్రమం తప్పకుండా వ్యాయామం ఏరోబిక్ కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా ప్రోస్టేట్, టెస్టిక్యులర్, కార్డియోవాస్కులర్ క్యాన్సర్ కోసం తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ►హార్మోన్ స్థాయిలను చెక్ చేయించుకోండి. సాధారణంగా మనిషి శరీరంలోని అనేక ముఖ్యమైన హార్మోన్లు 40 నుంచి 55 ఏళ్ల మధ్య తగ్గడం ప్రారంభిస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోండి ►భాగస్వామి సాన్నిహిత్యం, ఇరువురి మధ్య సరైన అండర్స్టాండింగ్ ఉండేలా చూసుకోవడం ► దీంతోపాటు ముఖ్యంగా కంటినిండా నిద్రపోడం. ►ఇలాంటవన్ని చేయగలిగితే మగవారి శృంగార జీవితానికి ఎలాంటి సమస్య ఉండదు. అంతేగాదు వారు ఈ దశను అధిగమించేలా సమతుల్య ఆహారం, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే సులభంగా బయటపడగలరని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: బ్యూటీ క్వీన్‌గా కిరీటాన్ని గెలుచుకుంది..కానీ అంతలోనే..) -
‘భారత్‌తో మొండి వైఖరి మార్చుకోండి’
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు తను వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ హితవు పలికారు. మొండిగా వ్యవహరించటం మానేసి.. దేశ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొటంలో పొరుగుదేశం భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నారు. అయితే ఇటీవల మహ్మద్ మొయిజ్జు భారత్ విషయంలో సర్వం మార్చి.. భారత్ తమకు ఎప్పటి నుంచి సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందని పేర్కొన్న విషయంలో తెలిసిందే. భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయిపడింది. అయితే దానిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కల్పిలచాలని మాల్దీవుల కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మద్ సోలిహ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. మాలెలో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మహమ్మద్ సోలిహ్ మాట్లాడారు. బాకాయిపడ్డ రుణంలో ఉపశమనం కల్పించాలని అధ్యక్షుడు మొయిజ్జు భారత్‌ను కోరినట్లు తాను మీడియాలో చేశానని తెలిపారు. భారత్‌తో బాకిపడ్డ మొత్తం కంటే చైనాతో బాకిపడ్డ రుణం ఎక్కువని అన్నారు. ‘పొరుగు దేశాలు సాయం చేస్తాయని నేను విశ్వసిస్తున్నా. మనం మొండితనం వదిలి, చర్చలు జరపాలి. దేశంలోని అన్ని పార్టీలు సహకరిస్తాయి. అధ్యక్షుడు మొయిజ్జు ఎట్టిపరిస్థితుల్లో మొండితనంతో వెనకడుగు వేయోద్దు. ప్రభుత్వానికి ఇప్పడు దేశం ఎదుర్కొంటున్న పరిస్థితి అర్థం అయినట్లు తెలుస్తోంది’ అని మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సోలిహ్ తెలిపారు. తమ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న అధ్యక్షుడు మొయిజ్జు గతేడాది మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో భారత్ సైన్యం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
అలా పట్టించుకోకుండా వెళ్లిపోతే ఎలా? : హిల్లేరియస్ వీడియో వైరల్
నెమలి మన జాతీయ పక్షి. అందమైన అపురూపమైన పక్షి. ఆడ నెమలిని ఇంప్రెస్ చేసేందుకు మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది. గున గున అడుగులేస్తూ ఆడ నెమలి వెంట తిరుగుతుంది. ఈ నాట్యం చేసేటప్పుడు తన పింఛాన్ని చుట్టూ వృత్తం లాగా చేస్తుంది. ఒక్కోసారి విసినకర్రలా వంచి అందంగా నాట్యం చేస్తుంది. ప్రేయసి సంతృప్తి చెంది, చెంతక చేరేదాకా మగ నెమలికి ఈ తిప్పలు తప్పవు. అకస్మాత్తుగా మబ్బులు కమ్మేసి, చినుకులు పడినపుడు, ప్రధానంగా వడగళ్లు పడినపుడు సంతోషంతో పింఛంతో మగ నెమలి చేసే నాట్యం వర్ణశోభితంగా, అత్యంత రమణీయంగా ఉంటుంది కదా. తాజాగా గ్రేట్ ఆర్గస్ నెమలి ఆడ నెమలిని ఆకట్టుకునేందుకు పాట్లు, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో దాదాపు 30 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. వాస్తవానికి ఈ వీడియో 2021లో ఫ్లోరిడాలోని బే లేక్‌లోని డిస్నీస్ యానిమల్ కింగ్‌డమ్‌లోని మహారాజా జంగిల్ ట్రెక్‌లో తీసింది. ఇపుడు మళ్లీ సందడి చేస్తోంది. ఈ తతంగం అంతా చూసి నెటిజన్లు చతురోక్తులతో స్పందిస్తున్నారు. ఇంత చేసినా అలా వెళ్లిపోతే ఎలా అంటూ ఫన్నీ కమెంట్లు పెడుతున్నారు. A male Pheasant is trying to impress her but she is not impressed! 😂 pic.twitter.com/dqfAj2icz4 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 20, 2024 An incredible leucistic peacock! (Video Laurel Coons) pic.twitter.com/H0eO6ID6TM — Natural Science & History (@joehansenxx) March 20, 2024 This is so so beautiful 🦚🥰😍 pic.twitter.com/XHwbmH5lUC — Aisha Abbasi (@aisha_FCB) March 20, 2024 -
Kolkata: విమానంలో మహిళతో అసభ్య ప్రవర్తన
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తా నుంచి బాగ్డోరా వెళుతున్న స్పైస్‌జెట్ విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ ఆదివారం(ఫిబ్రవరి 4) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జనవరి 31నాడు జరిగినట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసిన వెంటనే అతని సీటు మార్చినట్లు ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. అయితే తాను అసభ్యంగా ప్రవర్తించలేదని ఆ వ్యక్తి సిబ్బందికి స్పష్టం చేశాడు. ‘విమానం బాగ్డోరాలో ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరు ప్రయాణికులను సీఐఎస్ఎఫ్ సిబ్బంది వద్దకు తీసుకెళ్లాం. తనకు క్షమాపణలు చెప్పాలని మహిళా ప్రయాణికురాలు ఆ వ్యక్తిని కోరింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి క్షమాపణలు చెప్పాడు. దీంతో ఆ మహిళా ప్రయాణికురాలు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయింది’ అని ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. గడిచిన కొన్ని నెలల్లో విమానాల్లో ఇలాంటి పలు సంఘటనలు నమోదయ్యాయి. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఒక వ్యక్తి వయసులో పెద్దదైన మహిళపై మూత్ర విసర్జన చేశాడని కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. నెల జైలు తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. ఇదీచదవండి.. రాష్ట్ర హోదా కోసం లడఖ్‌లో నిరసనలు -
Maldives: మహమ్మద్ ముయిజ్జుకు ఊహించని షాక్!
మాలె: ప్రపంచవ్యాప్తంగా మాల్దీవుల విషయం హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజులుగా మాల్దీవులకు సంబంధించి ప్రతీ చిన్న విషయం కూడా హైలైట్ అవుతోంది. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు మరో షాక్ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది. వివరాల ప్రకారం.. మాల్దీవుల్లో అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు బిగ్ షాక్ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీఎన్సీ ఘోర ఓటమి చవిచూసింది. భారత్ అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. దీంతో, అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. అయితే, భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో అధికార పార్టీ ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. Congratulations 👏👏👏@adamazim , New Mayor @MaleCitymv@MDPSecretariat @MDPmediaTeam @MDPYouth pic.twitter.com/5RNIACr3Ci — Ahmed Sarah - Thimarafushi (@SarahThimara) January 13, 2024 ఇక, మాలె మేయర్‌గా ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఎన్నికయ్యారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ఆ పదవిలో ముయిజ్జు కొనసాగారు. అజీమ్ గెలుపును మాల్దీవుల మీడియా భారీ ఘన విజయంగా అభివర్ణించింది. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సొలిహ్ నాయకత్వం వహిస్తున్నారు. కాగా, మేయర్ గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసొస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. చైనా పర్యటన అనంతరం అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పరోక్షంగా భారత్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మాల్దీవులను విమర్శించే హక్కు ఏ దేశానికి లేదన్నారు. ‘మాది చిన్న దేశమే కావచ్చు. కానీ అది మీకు మమ్మల్ని అవమానించేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం మాది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
భారత దళాలు వైదొలగాలి
మాలె: మాల్దీవుల నుంచి భారత సైనిక దళాలు వైదొలగాలని ఆ దేశాధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ ముయ్‌జ్జు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే చైనా దళాలను కూడా తమ భూభాగంపైకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. భారత దళాలను వెనక్కు పంపుతానని ఎన్నికల సందర్భంగా ఆయన వాగ్దానం చేశారు. మాల్దీవుల్లో 70 మంది భారతసైనిక సిబ్బంది ఉన్నారు. భారత్ అందజేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఆ ప్రాంతంలో సైనికంగా ప్రభావం చూపేందుకు, ముఖ్యంగా మాల్దీవులపై పట్టు కోసం భారత్, చైనా దశాబ్దాలుగా పోటాపోటీగా ప్రయతి్నస్తూ వస్తున్నాయి. -
గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!
ICMR Male Contraceptive: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక పురోగతిని సాధించింది. పురుషులకోసం గర్భనిరోధక ఇంజెక్షన్‌ను అభివృద్ది చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్’ (ICMR Male Contraceptive)ను ఇంజెక్షన్‌ను డెవలప్ చేసింది. దీనికి సంబందించిన క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు ఏడేళ్ల పరిశీలిన తర్వాత RISUG (రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్) పిలిచే నాన్-హార్మోనల్ ఇంజెక్షన్నపై సానుకూల ఫలితాలు వెలువడ్డాయి. అంతేకాదు ఈ ఇంజక్షన్ వల్ల ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు లేవనీ, చాలా సురక్షితం ప్రభావవంతమైనదని కూడా తేలడం విశేషం. ఫేజ్ 3 ట్రయల్స్ సక్సెస్ 25-40 ఏళ్ల వయసుస్సున్న 303 మంది ఆరోగ్యవంతులైన, వివాహిత పురుషులపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలు గత నెలలో రిలీజ్ అయ్యాయి. ICMR, న్యూఢిల్లీ సమన్వయంతో ఢిల్లీ, ఉదంపూర్, లూధియానా, జైపూర్, ఖరగ్ పూర్ ఆసుపత్రుల్లో ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించారు. ఈ వాలంటీర్లకు 60 మి.గ్రా. RISUG ఇంజెక్షన్‌ను అందించారు. ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా 99.02 శాతం సమర్థతతో ఈ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా హార్మోన్లను ఇంజెక్ట్ చేసే ఇతర గర్భ నిరోధకాల మాదిరిగా గాకుండా, లోకల్ ఇంజెక్షన్‌తోనే దీన్ని సాధించడం కీలకమని కూడా పేర్కొంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఇండియా (DCGI)సహా, ఇతర సంబంధిత కమిటీలచే అనుమతి మేరకు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఫలితాలను అంతర్జాతీయ ఓపెన్ యాక్సెస్ ఆండ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు. కాగా గర్భనిరోధం అంటే కేవలం అది స్త్రీల పనే అని అభిప్రాయం సమాజంలో బాగా వేళ్లూనుకుంది. పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేసెక్టమీపై రకరకాల అపోహలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వేసెక్టమీ అంటేనే భయపడే పరిస్థితి. ఈ క్రమంలో పురుషుల్లో సంతానం నిరోధం కోసం ఒక ఇంజెక్షన్‌ను తీసుకు రావడం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. -
పైసా లేకుండా జీవించడం ఎలా? 15 ఏళ్లుగా ‘మార్క్ బాయిల్’ ఏం చేస్తున్నాడు?
ప్రపంచంలో అధికశాతం మంది జీవితంలో వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించి, సుఖంగా జీవించాలని కలలు కంటారు. పేదరికంలో మగ్గిపోవాలని ఎవరూ కోరుకోరు. ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ, అధికంగా సంపాదించగలిగే అర్హత కలిగిన ఒక వ్యక్తి భిన్నమైన నిర్ణయం తీసుకుని, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ కథ యునైటెడ్ కింగ్డమ్ నివాసి మార్క్ బాయిల్‌కి సంబంధించినది. 2008లోనే బాయిల్ డబ్బును వినియోగించడం మానుకుని ఆనందంగా కాలం వెళ్లదీస్తున్నాడు. సాంకేతికతలాంటి విషయాల జోలికి వెళ్లకుండా ప్రకృతితో మమేకమై జీవించడాన్ని అలవర్చుకున్నాడు. మార్క్ బాయిల్.. బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ తీసుకున్నాడు. చదువు పూర్తయిన వెంటనే బ్రిస్టల్‌లోని ఒక ఫుడ్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాడు. జీవితంలో విజయం సాధించేందుకు ఏళ్ల తరబడి కష్టపడ్డాడు. అయితే 2007లో ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా జరిగిన సంఘటన బాయిల్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. హౌస్‌బోట్‌లో కూర్చున్న బాయిల్ అక్కడున్నవారు మాట్లాడుకున్న మాటలను విన్నాడు. అందరూ డబ్బు గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో అన్ని సమస్యలకు ఏకైక మూలం డబ్బు అని బాయిల్ గ్రహించాడు. అందుకే తాను డబ్బుకు అతీతంగా జీవించాలని, డబ్బు సంపాదించకూడదని, అలాగే ఖర్చు పెట్టకూడదని కఠినంగా నిర్ణయించుకున్నాడు. దీంతో మార్క్ బాయల్ తన ఖరీదైన హౌస్‌బోట్‌ను విక్రయించి, తన పాత కారవాన్‌లో నివసించడం మొదలుపెట్టాడు. డబ్బు లేకుండా జీవితాన్ని గడపసాగాడు. ఈ నేపధ్యంలో కొన్ని నెలలు పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. టీ, కాఫీలతో పాటు ఇతర సౌకర్యాలను వదులుకున్నాడు. ప్రకృతి అందించేవాటిని మాత్రమే ఉపయోగించసాగాడు. ఇటువంటి ప్రకృతి సహజ జీవనం ప్రారంభించినప్పటి నుంచి తాను అనారోగ్యం బారిన పడలేదని, తనకు ఆరోగ్య రక్షణ అవసరం లేదని బాయిల్ తెలిపాడు. బాయిల్ జీవితాన్ని చూసిన చాలామంది అతనికి స్నేహితులుగా మారారు. తాను 2017లో టెక్నాలజీ జోలికి వెళ్లడాన్ని పూర్తిగా వదులుకున్నానని, సాంకేతికతతో ముడిపడిన పాత జీవితం కాకుండా, సహజసిద్దంగా ప్రకృతితో గడిపే భావి జీవితం గురించి నిరంతరం ఆలోచిస్తుంటానని బాయిల్ తెలిపాడు. ఇది కూడా చదవండి: ఎస్క్లేటర్పై నిషేధమున్న నగరం ఏది? గణాంకాలు ఎందుకు బెంబేలెత్తిస్తున్నాయి? -
ఒకే వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు!
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి వృషణాలు లేకుండా పుట్టాడు. 40 ఏళ్లుగా అలాగే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నా.. ఎంతకు పిల్లలు పుట్టకపోవడం, పొత్తి కడుపు కింద నొప్పితో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చాడు. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయగా.. ఆ వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు రెండూ ఉన్నట్టు గుర్తించారు. జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్) కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టు తేల్చారు.ఆస్పత్రిలో ఆయనకు ఆండ్రాలజిస్టు, రోబోటిక్ సర్జన్ వైఎం ప్రశాంత్ చికిత్స చేశారు. దీనికి సంబంధించి వైద్యుడు వెల్లడించిన వివరాల మేరకు.. సాధారణంగా పిండం ఏర్పడిన సమయంలోనే హార్మోన్ల ప్రభావంతో ఆడ, మగ అన్నది నిర్ణయమైపోతుంది. అయితే మంచిర్యాల వ్యక్తి కేసులో జన్యు మ్యుటేషన్ కారణంగా.. హార్మోన్ల అసమత్యుల్యత ఏర్పడి ఆడ, మగ రెండు రకాల జననాంగాలు ఏర్పడ్డాయి. అందులో గర్భ సంచి, ఫాలోపియన్ ట్యూబ్స్‌తోపాటు వృషణాలు ఉదర భాగంలోనే ఉండిపోయాయి. ఇలాంటి వారు అన్ని అంశాల్లో మామూలుగానే ఉంటారు. హార్మోన్లు, పురుషాంగం, మీసాలు, గడ్డాలు అన్ని సాధారణంగానే ఉంటాయి. అయితే వృషణాలు లోపలే ఉండి, వీర్య కణాలు ఉత్పత్తిగాక పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. లాప్రో స్కోపిక్ శస్త్రచికిత్సతో.. ఈ వ్యక్తికి వైద్యులు చిన్నపాటి కోతతో కూడిన ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేసి.. గర్భసంచి, ఫాలోపియన్ ట్యూబ్స్‌తోపాటు వృషణాలను కూడా తొలగించారు. సాధారణంగా 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా వృషణాలు లోపలే ఉండిపోతే కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుందని.. అందువల్ల వాటినీ తొలగించాల్సి వచ్చిందని డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఇన్నేళ్లుగా ఆ వ్యక్తి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయాయని.. కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిపారు. 18 ఏళ్ల వయసుకు ముందే ఈ సమస్యను గుర్తించి శస్త్రచికిత్స చేస్తే వృషణాలను సాధారణ స్థితికి తెచ్చే అవకాశం ఉండేదని.. కానీ పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఇన్నేళ్లుగా సమస్యను గుర్తించలేకపోయారని వివరించారు. ఇలాంటి కేసులు అరుదని, ప్రపంచంలో ఇప్పటివరకు 300 కేసులు, దేశంలో 20 కేసులు మాత్రమే బయటికి వచ్చాయని తెలిపారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,06,42,333
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333కు చేరింది. అందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/ కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 19 వరకు గడువు ఉందని తెలిపారు. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరించి అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితానే వినియోగించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలుండగా, ముసాయిదా జాబితాలో 3,06,26,996 మంది సాధారణ ఓటర్లతో పాటు మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సరీ్వసు ఓటర్లున్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. కొత్త ఓటర్లు 8,31,520 మంది ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 8,31,520 మంది ఓటర్లను నమోదు చేశారు. 1,82,183 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఓటు తొలగిస్తే 15 రోజుల్లోగా అప్పీల్ చేయాలి ముసాయిదా జాబితాలో ఎవరిదైన పేరును తప్పుగా తొలగిస్తే బాధిత ఓటర్లు 15 రోజుల గడువులోగా జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవాలని సూచించారు. లేకుంటే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం–6 దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ‘ఓటర్ల’ అధికారుల బదిలీలపై నిషేధం సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా రూ పకల్పనలో పాలుపంచుకుంటున్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణలో కీలకమైన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్ల నమోదు అధికారులు, సహాయ ఓటర్ల నమోదు అధికారులు తదితర స్థాయి అధికారుల బదిలీలపై ఈ నెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు నిషేధం అమల్లోకి ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితా తయారీ బాధ్యతల్లోని అధికారులను బదిలీ చేస్తే జాబితా నాణ్యతపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా అధికారిని బదిలీ చేయాల్సివస్తే స్పష్టమైన వివరాలు అందజేసి ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ) వరకు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ఈ నిబంధన లు వర్తిస్తాయన్నారు. దీర్ఘకాలిక సెలవు ల్లో వెళ్లడానికి ముందు ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని అధికారులను సూచించారు. -
సైలెంట్ కిల్లర్.. వయెలెంట్‌గా..
సాక్షి, హైదరాబాద్: సైలెంట్ కిల్లర్‌గా పిలిచే కేన్సర్ వ్యాధి రాష్ట్రంలో వయెలెంట్‌గా విస్తరిస్తోంది. పొగాకు, మద్యం వినియోగం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయంలో పెరిగిపోతున్న రసాయన ఎరువులు, శీతల పానీయాల వినియోగం, ఆధునిక జీవన శైలి పోకడల వంటి పరిణామాలతోనే కేన్సర్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కేన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స మొదలుపెట్టగలిగితే వ్యాధిని నయం చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతుండగా...శరీరంలో తెలియకుండానే మొదలైన ఈ వ్యాధిని ముదిరిపోయేంతవరకూ పసిగట్టలేకే మరణాలవరకూ తెచ్చుకుంటున్నాం. జాతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన తాజా నివేదికలోని కేన్సర్ కేసుల, మరణాల గణాంకాలు ఇప్పుడు ప్రమాద ఘంటికల్ని మోగిస్తు న్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 8.08లక్షల మంది కేన్సర్‌తో మరణించగా...అందులో ఒక్క తెలంగాణలోనే 27,339 మంది ఉన్నట్లు ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది. రెండేళ్లతో పోలిస్తే పెరిగిన మరణాల సంఖ్య అంతకుముందు రెండేళ్లతో పోల్చుకుంటే దేశంతో పాటు రాష్ట్రంలోనూ కేన్సర్ రోగులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం కేన్సర్ మరణాల్లో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉంది. 1.16లక్షల మరణాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా 66,879 మరణాలతో మహారాష్ట్ర దాని తర్వాతి స్థానంలో నిలిచింది. దేశంలోని ప్రతి లక్ష మందిలో ఒకరికి కేన్సర్ ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 2022లో దేశంలో కేన్సర్ రోగులు 14.61 లక్షలుండగా అందులో తెలంగాణలోనే కొత్తగా 49,983 కేన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇక భవిష్యత్తులో దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి కేన్సర్ వచ్చే అవకాశం ఉందని, 2025 నాటికి ఆ సంఖ్య 15.7 లక్షలకు చేరుకోనుందని ఐసీఎంఆర్ తాజా నివేదికలో హెచ్చరించింది. అధికంగా ఆ వయసువారే.. 60–64 వయస్సు గలవారు అత్యధికంగా కేన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు 10.6%, నోటి కేన్సర్ 8.4%, ప్రొస్టేట్ కేన్సర్ కేసులు 6.1%, నాలుక కేన్సర్ కేసులు 5.9%, కడుపు కేన్సర్ కేసులు 4.8% నమోదవుతున్నాయి. మహిళల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో రొమ్ము కేన్సర్ 28.8%, గర్భాశయ కేన్సర్ 10.6%, అండాశయ కేన్సర్ 6.2%, ఊపిరితిత్తుల కేన్సర్ 3.7% నమోదవుతున్నాయి. 35 ఏళ్లు దాటితే పరీక్షలు తప్పనిసరి... ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 35ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకోసారైనా కేన్సర్ స్క్రీనింగ్ పరీ క్షలు చేయించుకోవాలి. దంత వైద్యుల వద్దకు వెళితే వారు చేసే పరీక్షలు నోటి కేన్సర్ నిర్ధారణకూ ఉపయోగపడతాయి. 8 నుంచి 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు సర్వైకల్ కేన్సర్ రాకుండా టీకాను వేయించి వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. యాభై ఏళ్లు దాటినవారికి మలంలో రక్తం పడితే కొలనోగ్రఫీ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆలస్యంగా రావడం వల్లే అధిక మరణాలు ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం మంది కేన్సర్ చివరి దశలో ఉండగా మాత్రమే ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో అధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇక విదే శాల్లో 70 నుంచి 80 శాతం మంది మొదటి దశలోనే ఆస్పత్రులకు వచ్చి వైద్యులను సంప్రదిస్తున్నారు. సర్వైకల్, రొమ్ము కేన్సర్లను సులువుగా నయం చేయవచ్చు. రొమ్ము కేన్సర్‌ను మూడో దశలోనూ, థైరాయిడ్ కేన్సర్ వస్తే 100% నయం చేయవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. పిల్లల్లో రక్త సంబంధిత కేన్సర్లే అధికం.. జన్యుమార్పిడి వల్లే పిల్లల్లో కేన్సర్ వస్తుంటుందని, ఎక్కువగా వారి లో రక్త సంబంధిత కేన్సర్లు అధికంగా వస్తుంటాయని వైద్యులు చెబుతు న్నారు. పిల్లల్లో వైద్యానికి స్పందించే లక్షణం ఎక్కువ వారికి వచ్చే కేన్స ర్లలో 80% వరకు నయం చేయడానికి వీలుంటుందని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. మూడో దశ కేన్సర్లతో వచ్చే పిల్లల్ని సగం మందిని, నాలుగోదశలో వస్తే 25% మందిని బతికించవచ్చని అదే తొలి రెండు దశల్లో వస్తే 90%మందికి నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. దేశంలో 2035 నాటికి 13లక్షల కేసులు.. పొగాకు, మద్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల 66 శాతం, ఇన్ఫెక్షన్లతో 20% కేన్సర్లు వస్తున్నాయి. హార్మోన్లు, జన్యుమార్పుల వల్ల 10% పైగా, కాలుష్యం వల్ల ఒక శాతం కేన్సర్ రిస్క్‌లున్నాయి. 2035 నాటికి దేశంలో కేన్సర్ మరణాలు 13 లక్షలకు చేరుకుంటాయని అంచనా. –డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
షాకింగ్ ట్విస్ట్: మగ గొరిల్లా కడుపున ఓ ఆడ గొరిల్లా పిల్ల..
ఇంత వరకు మగవాళ్లు కూడా పిల్లలు కనడం గురించి మానవజాతిలోనే జరిగింది. అది కూడా వారు ట్రాన్స్ జెండర్‌గా మారే క్రమంలో జరిగిన అరుదైన ఘటనే. ఇప్పుడు అలాంటి ఘటనే ఓ జంతుశాలలో చోటు చేసుకుంది. అప్పటి వరకు అది ఆ జూలో మగ గొరిల్లాగా పెరిగింది..ఉన్నటుండి ఒక రోజు ఓ ఆడ గొరిల్లా పిల్లకు జన్మనివ్వడంతో జూ సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన యూఎస్‌లోని కొలంబస్ జూలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొలంబస్ జూలో సుల్లీ అనే గొరిల్లా 2019లో తన తల్లితో కలిసి ఉంటోంది. దాన్ని చిన్నపటి నుంచి ఆ జూ సిబ్బంది అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఊహించని విధంగా గురువారం తెల్లవారుఝామున ఓ ఆడ గొరిల్లాకు జన్మనిచ్చేంత వరకు అది ఆడ గొరిల్లా అని కనుగొనలేకపోయారు. జూ సిబ్బంది ఆ గొరిల్లాను పర్యవేక్షించే కీపర్లు అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఈ విషయాన్ని ఫేస్బుక్లో అధికారికంగా జూ అధికారులు వెల్లడించారు. ఎందుకు తాము దాన్ని మగ గొరిల్లా అని భావించామో కూడా వివరించారు. నిజానికి సుమారు 8 ఏళ్ల వయసు వరకు గొరిల్లాలు మగ లేదా ఆడవిగా గుర్తించలేమని, అవి రెండు ఒకే పరిమాణంలో ఉంటాయి. పైగా వాటికి ప్రముఖ లైంగిక అవయవాలు ఉండవు. గొరిల్లాలు ఒక వయసు వచ్చే వరకు ఏ లింగం అనేది గుర్తించడం కష్ట అని చెప్పుకొచ్చారు. మగ గొరిల్లాలకు చాలా వయసు వచ్చే వరకు గెడ్డం, వెన్ను, కొన్ని ప్రత్యేక అవయవాలు అభివృద్ధి చెందవు. దీంతో వాటిని మగవా, ఆడవా అని గుర్తించడం కష్టమవుతుందని జూ నిర్వాహకులు చెప్పారు. అవి గర్భం దాల్చిన కూడా బాహ్య సంకేతాలు ఏమి పెద్దగా చూపవని చెబుతున్నారు. సహజంగానే గొరిల్లాకు పెద్ద పొత్తికడుపు ఉండటంతో గర్భదాల్చినట్లు గుర్తించడం కష్టమేనని కొలంబస్ జూ వివరణ ఇచ్చింది. ఇక సదరు గొరిల్లాకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, అది ఆడగొరిల్లా పిల్లలానే ఉందని జూ పేర్కొంది. ఇక సదరు సుల్లీ గొరిల్లాకు వెల్సన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించి ఆడ గొరిల్లా పిల్ల తండ్రిని కూడా గుర్తిస్తామని కొలంబస్ జూ పేర్కొంది. (చదవండి: సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే కారణమా..!) -
పచ్చళ్లు పెట్టే వనితల ఊరు ఉసులుమర్రు
గోదావరి జిల్లా వాసులంటే తిండితో చంపేస్తారురా బాబు అంటుంటారు. గోదావరి తీరాన వంటకాలకు ప్రసిద్ధి చెందిన పల్లెలు చాలానే ఉంటాయి. కండ్రిగ పాలకోవా, నగరం గరాజీలు, ఆత్రేయపురం పూతరేకులు, అంబాజీపేట ΄పొట్టిక్కలు... ఉసులుమర్రు పచ్చళ్లు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వశిష్ట గోదావరి గట్టుకు ఆనుకుని తణుకుకు అరగంట ప్రయాణ దూరంలో ఉండే ఆ గ్రామం ఎప్పుడూ సముద్రంలో ఉప్పునూ చెట్టు మీద కాయను కలిపి పచ్చళ్లు పెట్టడంలో నిమగ్నమై ఉంటుంది. వ్యక్తిగతంగా కావచ్చు, యజమాని కింద కావచ్చు ఆ గ్రామంలోని స్త్రీలలో ముప్పై, నలభై శాతం పచ్చళ్లు పెట్టడంలో ఉపా ధి ΄పొందుతూ ఉంటారు. వీరితో పా టు ఇరవై శాతం మగవారు ఈ పనిలో ఉంటారు. ఇక్కడి స్త్రీల చేతికి రుచి ఎక్కువ. అందుకే ఉసులుమర్రు పచ్చళ్లకు గిరాకీ ఎక్కువ. 40 సంవత్సరాల క్రితం నుంచి ఉసులుమర్రి జనాభా 2500 మాత్రమే. వీరిలో ఐదు వందల మంది స్త్రీలకు పైగా, మూడు వందల మంది పురుషులకు పైగా అందరూ కలిసి దాదాపు 1000 మంది వరకు సీజన్లో పచ్చళ్లు పెట్టడంలో బిజీగా ఉంటారని అంచనా. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్షణం తీరిక లేకుండా రేయింబవళ్లు అనేక రకాల పచ్చళ్లు పెడుతుంటారు. ఊరు ఊరంతా ఏ కంపెనీ కోసం, ఏ యజమాని కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపా ధిని కల్పించుకున్నారు. 40 సంవత్సరాల క్రితం పిళ్లా పెదకాపు కుటుంబం వారు మొదటిసారిగా పచ్చళ్లను తయారు చేయడం మొదలుపెట్టారు. మంచి లాభాలు, మిగులు ఉండడంతో వారిని చూసి వారి బంధువులు మొదలుపెట్టారు. అలా ఒకరిని చూసి మరొకరు అదే పనిని నేర్చుకుని స్వంతంగా తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. 200 కుటుంబాలకు పైగానే ఈ చిరు వ్యాపా రాన్ని చేస్తున్నారు. ఇప్పుడు తయారీలో మూడోతరం నిమగ్నమైంది. ఇవీ ప్రత్యేకం టమాటా, ఉసిరి, అల్లం, మాగాయి, ఆవకాయ, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ తదితర పచ్చళ్ళకు ఉసులుమర్రు ప్రత్యేకం. పచ్చళ్ల తయారీలో మహిళలకు కనీసం 300 రోజు కూలీ దక్కుతోంది. అన్ని రకాల పచ్చళ్ళు పెట్టాలంటే రూ.5 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఖర్చులు పొ గా మిగిలే లాభంతో తమకెంతో సంతోషంగా ఉంటుందంటున్నారు. ఈ ఒక్క పల్లెలో అన్ని రకాల పచ్చళ్లూ కలిసి ఏడాదికి 500 టన్నులు పచ్చళ్లు పడుతుంటారని అంచనా. టన్ను పచ్చడి రూ.2.50 లక్షలు వంతున విక్రయిస్తుంటారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే రూ.10 నుంచి రూ.12 కోట్లు. మహిళలు ఇళ్లవద్ద పచ్చళ్లు పెడితే పురుషులు మాత్రం ఏడెనిమిది నెలలపా టు ఊళ్లు తిరుగుతూ చివరిడబ్బా అమ్మేశాక మాత్రమే ఇంటికి తిరిగొస్తారు. కుటుంబాన్ని వదిలి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, వరంగల్, నల్గొండ, బోధన్, హైదరాబాద్, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, ఖమ్మం, మిరియాలగూడ, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఏడాది ΄పొడవునా నిల్వ ఉసులుమర్రు ఆవకాయ అంటే ఏడాది ΄పొ డవునా నిల్వకు తిరుగుండదంటారు. ముదురు మామిడికాయలను ముక్కలుగా కోసి ఆరబెట్టి ఆవపిండి, మెంతులు, ఎర్రపచ్చడి కారం, వేరుశెనగ లేదా నువ్వుల నూనె కలిపి మూడు రోజుల తరువాత జాడీలో పెడతారు. ఉప్పు, కారం, ఆవపిండి కలిపిన ముక్కలను డ్రమ్ములో వేసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడే వారి కళ్లెదుటే అన్నీ కలిపి ఇవ్వడంతో నమ్మకం రెట్టింపు అయ్యిందంటారు. వేసవిలో పండుమిరప, ఉసిరి, ఆవకాయ, గోంగూర, కాకరకాయ పెడతారు. వానాకాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆగస్టు నుంచి అల్లం, వెల్లుల్లి, టొమాటో, కాలీఫ్లవర్, కొత్తిమీరలాంటివి పెడతారు. మిక్స్డ్ వెజిటబుల్ అడిగితే పెట్టి ఇస్తారు. నిమ్మకు నిల్వ తక్కువ కాబట్టి తక్కువగా పెడతారు. చికెన్, రొయ్యలతో నాన్‌వెజ్ పచ్చళ్లు కూడా చేసి ఇస్తారు. సరుకును బట్టి లాభం. ఉదాహరణకు డ్రమ్ (200 కిలోలు) పండు మిరప పచ్చడి పట్టడానికి 20 వేలు అవుతుంటే మార్కెట్లో కిలో రూ.250కు అమ్ముతుంటారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు సాక్షి, కాకినాడ ,ఫొటోలు: పంతం వెంకటేశ్వర్లు, పెరవలి అందరూ ఆవకాయ పెట్టుకోరు. బయటి నుంచి తెచ్చుకునేవారు. ఎప్పుడూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఆ ఊరి స్త్రీలు ఆవకాయ పెడతారు. మే నుంచి జూన్ వరకూ ఉమ్మడి తూ.గో.జిల్లాలోని ఉసులుమర్రు స్త్రీలు ఆవకాయతో పా టు రకరకాల పచ్చళ్లు పెడుతుంటారు. వాటిని తీసుకుని మగవారు జిల్లాలకు బయలుదేరి నెలల తరబడి అమ్ముతారు. రోజూ ఏదో ఒక పచ్చడి తయారు చేసే ఆ ఊరి స్త్రీలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతినిధులు. -
మారువేషంలో దొంగగా వచ్చి అత్తను చితకబాదిన కోడలు.. కానీ..!
తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. మారువేశంలో దొంగగా వచ్చిన కోడలు అత్తను చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన అత్త ప్రాణాలు కోల్పోయింది. తిరునల్వేలి జిల్లాలోని వడుకనపట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో శణ్ముగవేలు భార్య సీతారామలక్ష్మి (57). వారికి కుమారుడు రామస్వామి, కోడలు మహాలక్ష్మి ఉన్నారు. ఇంట్లో అత్తాకోడళ్లు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో పరిస్థితిని మెరుగుపరచడానికి రామస్వామి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మకాం మార్చినా.. ప్రయోజనం లేకపోయింది. ఇటీవల జరిగిన గొడవ అనంతరం అత్తపై కక్ష పెంచుకున్న మహాలక్ష్మి పథకం వేసింది. మగవారి వేశం వేసి హల్మెట్ పెట్టుకుని అత్త నిద్రిస్తున్న సమయంలో ఆమెపై దాడి చేసింది. అత్త నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులకు సీసీటీవీ అధారాలతో అసలు విషయం బయటపడింది. కోడలే ఈ ఘటనకు కారకురాలని తేల్చారు. చదవండి:కంపెనీ డబ్బుతో డ్రైవర్ పరార్... ఓనర్ ఏం చేశాడంటే... -
అమ్మో మన ధోని, కోహ్లి, రిషభ్ ఇలా ఉంటారా?
-
'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి..
కన్నకూతుళ్లను దక్కించుకోవడం కోసం ఓ వ్యక్తి తన లింగాన్ని మార్చుకున్నాడు. చట్టపరంగా పోరాటం చేసి ఐడీ కార్డులో మగ నుంచి ఆడగా మారాడు. ఈక్వేడార్‌లో ఈ ఘటన జరిగింది. చట్టపరంగా లింగాన్ని మార్చుకున్న ఈ వ్యక్తి పేరు రినె సలినాస్ రామోస్(47). భార్యతో విడిపోయాడు. అయితే ఈ దేశ చట్టాల ప్రకారం పిల్లలు తల్లిదగ్గరే ఉండాలనే నిబంధన ఉంది. కానీ తన కూతుళ్లు తల్లి వద్ద సంతోషంగా లేరని, తనకు అప్పగించాలని రామోస్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఐడీ కార్డులో తన లింగాన్ని పురుషుడి నుంచి స్త్రీగా మార్చుకున్నాడు రామోస్. చట్టపరంగా అనుమతులు తీసుకున్నాడు. ఇప్పుడు తాను కూడా తల్లిని అయ్యానని, పిల్లలను తనకే అప్పగించాలని రామోస్ కోర్టును కోరాడు. అయితే న్యాయస్థానం దీనిపై తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. రామోస్ తన కూతుళ్ల కోసమే లింగాన్ని మార్చుకున్నప్పటికీ దేశంలోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తాము సర్జరీ చేయించుకొని ఆడ నుంచి మగగా, పురుషుడి నుంచి స్త్రీగా మారితే అధికారిక గుర్తింపు లభించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాంటిది ఓ పురుషుడు మాత్రం సులభంగా మహిళగా లింగాన్ని మార్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే తాను చేసిన దాంట్లో దురుద్దేశం ఏమీ లేదని రామోస్ పేర్కొన్నాడు. కేవలం తన కూతుళ్ల కోసమే ఇలా చేసినట్లు చెప్పాడు. పురుషులకు కూడా తమ పిల్లలపై హక్కు కల్పించేందుకే తాను పోరాడుతున్నట్లు వివరణ ఇచ్చాడు. చదవండి: బీజింగ్‌లో కోవిడ్ బీభత్సం -
బరితెగించిన మేల్ నర్స్.. సన్నిహితంగా ఉంటూ బ్లాక్‌మెయిలింగ్
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట ప్రాంతానికి చెందిన మేల్ నర్స్ మహ్మద్ గులామ్ నగరానికి చెందిన ఓ వృద్ధురాలిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఆమె వ్యక్తిగత వివరాలు సంగ్రహించిన అతగాడు వాటిని బయటపెడతానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. బాధితురాలు నగర షీ–టీమ్స్‌ను ఆశ్రయించడంతో కటకటాల్లోకి చేరాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం పేర్కొన్నారు. సదరు 55 ఏళ్ల మహిళ గతంలో కోవిడ్ బారినపడగా టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సహాయం పొందారు. అప్పట్లో మేల్ నర్సుగా ఈమెకు తరచు ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలుసుకున్న గులామ్ ఆమెకు సన్నిహితంగా మారాడు. తరచు ఫోన్లు చేస్తూ ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు. అతిగా స్పందిస్తున్నాడని, తన వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటున్నాడని పసిగట్టిన ఆమె దూరంగా ఉంచడం మొదలెట్టారు. దీంతో తన వద్ద ఉన్న సమాచారాన్ని లీక్ చేస్తానని, ప్రశాంత జీవితాన్ని పాడుచేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఇతడిని వదిలించుకోవడానికి ఆమె కొంత మొత్తం చెల్లించినా పంథా మారలేదు. బాధితురాలు షీ–టీమ్స్‌ను ఆశ్రయించింది. విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచిన అధికారులు గులామ్‌ను పట్టుకుని, పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి 8 రోజుల జైలు విధించడంతో చంచల్‌గూడకు తరలించారు. పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడంటూ.. ►పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడని మరో బాధితురాలు షీ–టీమ్స్‌ను ఆశ్రయించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈ మహిళకు (26) స్పాలో పని చేసే ఎం.అర్జున్ అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పించాడు. కొన్నాళ్ల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని అడగడం మొదలెట్టాడు. వివాహితుడైన అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో తిరస్కరించింది. బాధితురాలు ఆ ఉద్యోగాన్ని వదిలేసినా అర్జున్ నుంచి వేధింపులు తప్పలేదు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు ►గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బాలికను ఇన్‌స్ట్రాగామ్ ద్వారా వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మొత్తమ్మీద గత నెల్లో షీ–టీమ్స్‌కు 103 ఫిర్యాదులు వచ్చాయి. వీరిలో 52 మంది నేరుగా, 34 మంది వాట్సాప్ ద్వారా, మిగిలిన వాళ్లు ఇతర విధానాల్లో ఆశ్రయించారు. వీటికి సంబంధించి ఆయా ఠాణాల్లో 12 కేసులు నమోదు కాగా.. 26 ఫిర్యాదులు పెట్టీ కేసులుగా మారాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో 98 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండవద్దని, 9490616555కు వాట్సాప్ చేయడం ద్వారా లేదా నగర పోలీసు సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఫిర్యాదు చేయాలని ఏఆర్ శ్రీనివాస్ కోరారు. చదవండి: థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత -
మాల్దీవుల్లో ఘోరం
మాలె: మాల్దీవుల రాజధాని మాలెలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది భారతీయులు సహా మొత్తం 10 మంది వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. నిరుఫెహి ప్రాంతంలోని విదేశీ పనివారు నివసించే ఇరుకైన భవనంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 9 మంది భారతీయులు కాగా, మరొకరిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గ్యారేజీలో మంటలు మొదలై కార్మికులున్న మొదటి అంతస్తుకు వ్యాపించాయి. ప్రతి కార్మికుడి బెడ్ పక్కన ఒక గ్యాస్ సిలిండర్ ఉంది. ఫ్లోర్ అంతటికీ కలిపి కేవలం ఒకటే కిటికీ ఉంది. దీంతో మంటలను అదుపు చేయడం కష్టమైందని అధికారులు తెలిపారు. -
Maldives Fire: తొమ్మిది మంది భారతీయుల దుర్మరణం
మాలే: మాల్దీవుల రాజధాని మాలేలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదకొండు మంది దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులే ఉన్నట్లు సమాచారం. విదేశీ వలస కార్మికులు ఉంటున్న ఇరుకైన వసతి గృహాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వెహికిల్ రిపేర్ గ్యారేజీలో చెలరేగిన మంటలు.. పైఫ్లోర్లకు విస్తరించినట్లు అధికారులు ధృవీకరించారు. నాలుగు గంటలపాలు మంటలు చెలరేగుతూనే ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా చోటుచేసుకుందని సమాచారం. మృతుల సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం మొదలుపెట్టాయి. విదేశీ కార్మికులను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నాయి. మాలే జనాభా రెండున్నరల లక్షలుగా ఉంటే.. అందులో బంగ్లాదేశ్, భారత్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక నుంచే సగం జనాభా ఉంది. Deadliest #fire broke out at #crampedlodgings of foreign workers in the #Maldives capital #Male. So far 11 bodies have been recovered. Out of 11 9 are #Indians. The bodies were recovered from the upper floor of a building destroyed in the fire. The bodies are of #migrantworkers. pic.twitter.com/Is4jw2nRZ9 — Ashmita Chhabria (@ChhabriaAshmita) November 10, 2022 We are deeply saddened by the tragic fire incident in Malé which has caused loss of lives, including reportedly of Indian nationals. We are in close contact with the Maldivian authorities. For any assistance, HCI can be reached on following numbers: +9607361452 ; +9607790701 — India in Maldives (@HCIMaldives) November 10, 2022 -
మాల్దీవుల్లో ‘గొటబయ’కు నిరసనల సెగ.. మళ్లీ ఏ దేశం వెళ్తారో?
మాలే: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజాగ్రహంతో అట్టుడుకుతోంది శ్రీలంక. ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజామునే దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. అయితే.. అక్కడ కూడా గొటబయకు నిరసనల సెగ తగిలింది. పదుల సంఖ్యలో అక్కడి శ్రీలంక పౌరులు ఆందోళన చేపట్టారు. గొటబయకు మాలే ఒక సురక్షితమైన ప్రాంతం కాకూడదని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపాలని అక్కడి ప్రజలను కోరారు. శ్రీలంక జాతీయ జెండాలు, ప్లకార్డులతో రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. ' ప్రియమైన మాల్దీవుల స్నేహితులారా.. క్రిమినల్స్‌కు ఈ ప్రాంతం సురక్షితమైనదిగా మారకుండా మీ ప్రభుత్వానికి తెలియజేయండి' అని బ్యానర్ ప్రదర్శించారు. మరోవైపు.. మిలిటరీ విమానంలో వెలనా అంతర్జాతీయ విమానంలో దిగిన రాజపక్సకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేస్తున్న వీడియోలను మాల్దీవులకు చెందిన మీడియాలు ప్రసారం చేశాయి. అలాగే.. మాలేలోని కృత్రిమ బీచ్ ప్రాంతంలో పలువురు శ్రీలంక పౌరులు నిరసనలు చేపట్టగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. సింగపూర్‌కు గొటబయ..! శ్రీలంక నుంచి పరారై మాల్దీవులకు చేరిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో తలదాచుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. అక్కడి నుంచి యూఏఈ లేదా సింగపూర్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. 'ఆయన రెండు దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. ఆ దేశాల్లోనూ శ్రీలంక పౌరులు ఉన్నందున భద్రతాపరమైన సమస్యలు తలెత్తనున్నాయి.' అని శ్రీలంకకు చెందిన భద్రతా విభాగం అధికారి ఒకరు తెలిపారు. గొటబయ రాజపక్సను దేశంలోకి అనుమతించటాన్ని వ్యతిరేకించింది మాల్దీవులకు చెందిన ప్రతిపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ. రాజపక్సను అనుమతించటం ద్వారా శ్రీలంకలోని తమ స్నేహితులకు ద్రోహం చేస్తున్నామని పీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు. మరోవైపు.. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక పౌరులు మాల్దీవుల్లోని విద్య, ఆరోగ్య, ఆతిథ్య రంగాల్లో పని చేస్తుండగా.. మాల్దీవుల పౌరులు సైతం పెద్ద సంఖ్యలోనే శ్రీలంకలో ఉన్నారు. ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: దేశం విడిచిన లంకాధ్యక్షుడు.. అంతా ఇండియానే చేసిందని వదంతులు.. హైకమిషన్ రియాక్షన్ ఏంటంటే? -
పోలీస్ రిక్రూట్మెంట్లో యువతి.. మెడికల్ టెస్ట్‌లో ‘అతడు’గా తేలింది!
ముంబై: పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న ఓ యువతికి.. మెడికల్ టెస్టుల్లో మాత్రం ఊహించిన పరిణామం ఎదురైంది. ఆమె ఆమె కాదు.. అతడు అని ధృవీకరిస్తూ ఉద్యోగం ఇవ్వలేమని తేల్చి చెప్పింది రిక్రూట్మెంట్ బోర్డు. ఈ తరుణంలో ఆమె న్యాయపోరాటంలో విజయం సాధించింది. బాంబే హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ టెస్టుల వల్ల ఉద్యోగం దక్కకుండా పోయిన ఓ యువతికి.. రెండు నెలల్లో అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 2018లో సదరు యువతి (23) నాసిక్ రూరల్ పోలీస్ రిక్రూట్మెంట్ 2018కి ఎస్సీ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్‌లు అన్నీ క్వాలిఫై అయ్యింది. అయితే మెడికల్ ఎగ్జామ్‌లో ఆమె జనానాంగాలు లేవని గుర్తించారు. మరో పరీక్షలో ఆమెలో మగ-ఆడ క్రోమోజోమ్స్ ఉన్నట్లు తేడంతో ఆమెను పురుషుడిగా నిర్ధారించి పక్కనపెట్టారు. ఈ పరిస్థితిలో ఉద్యోగం రాకపోవడంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకున్న జన్యుపరమైన సమస్య గురించి తనకు ఏమాత్రం అవగాహన లేదని, పుట్టినప్పటి నుంచి తాను మహిళగానే పెరిగాని, చదువు కూడా అలాగే కొనసాగిందని, ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం చేయాలంటూ ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీంతో కార్యోటైపింగ్ క్రోమోజోమ్ టెస్ట్‌ల ద్వారా ఆమెను పురుషడిగా గుర్తించడం ఏమాత్రం సరికాదన్న ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్.. ఆమెకు ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తరుణంలో.. సానుభూతి ధోరణితో యువతికి ఉద్యోగం ఇప్పించేందుకు పోలీస్ శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు అడ్వొకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి హైకోర్టుకు వెల్లడించారు. చదవండి: గుడ్ బై.. గుడ్ లక్.. కాంగ్రెస్‌కు షాక్ -
అవాక్కయ్యే విషయం: ఒక సగం ఆడ.. మరో సగం మగ
Dual Gender Stick Insect That Is Half Male And Half Female: ఈ ఫొటోలో ఉన్నది చార్లీ. మిడతలాంటి కీటకం. గ్రీన్‌బీన్ స్టిక్ ఇన్సెక్ట్ అని పిలుస్తారు. బ్రిటన్‌కు చెందిన లారెన్ గార్ఫీల్డ్ దాన్ని పెంచుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు చార్లీ శరీరం రంగు మారడం మొదలైంది. ఇదేమిటా అని శాస్త్రవేత్తలకు చూపిస్తే.. అవాక్కయ్యే విషయం బయటపడింది. ఎందుకంటే చార్లీ ఒక సగం ఆడ కీటకం, మరోసగం మగ కీటకమని గుర్తించారు. సాధారణంగా ఈ రకం కీటకాల్లో మగవి ముదురు గోధుమ రంగులో చిన్నవిగా, ఆడవి లేత ఆకుపచ్చ రంగులో రెండింతలు పెద్దవిగా ఉంటాయి. చార్లీ ఆడకీటకంలా పెద్ద సైజులో ఒకవైపు ఆకుపచ్చ రంగులో ఉండగా, మరోవైపు ముదురు గోధుమ రంగులో మగ కీటకం లక్షణాలు ఉన్నాయి. ఈ తరహా కీటకాల్లో ఈ లక్షణాన్ని గుర్తించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు తేల్చడంతో.. పరిశోధనల కోసం లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియానికి ఇచ్చేశాడు. -
యాపిల్ జంబలకిడిపంబ: మగాడికి కడుపొస్తే..
Apple Brings Pregnant Man Emoji Soon To iPhones: టెక్ ప్రపంచంలో రోజూవారీ పనుల్ని తగ్గించేవెన్నో. అందులో సరదాగా మొదలైన ఎమోజీల వ్యవహారం.. ఇప్పుడు ఛాటింగ్ ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. జస్ట్ ఒక ఎమోజీతో బదులు ఇవ్వడమే కాదు.. పెద్ద పెద్ద ఉద్యమాలు సైతం నడుస్తున్న రోజులివి. కొన్నిసార్లు భావోద్వేగాలను మోతాదులో మించి ప్రదర్శిస్తున్నాయి కాబట్టే అంత ఆదరణ ఉంటోంది ఎమోజీలకు. కానీ, ఎమోజీలతో భావోద్వేగాలతో ఆడుకుంటే మాత్రం జనాలు ఊరుకుంటారా? యాపిల్ కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రెగ్నెంట్ మ్యాన్’ ఎమోజీ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గురువారం అందించిన ఈ అప్డేట్ సడన్ సర్ప్రైజ్తో పాటు సీరియస్ డిస్కషన్‌కు తెర తీసింది ఈ ఎమోజీ. గర్భంతో ఉన్న మగవాడి ఎమోజీ ద్వారా వివక్షకు తెర తీసిందంటూ కొందరు విమర్శిస్తుండగా.. కొందరేమో ఈ ఎమోజీని సరదా కోణంలో ఆస్వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ లింగ వివక్ష, మాతృత్వాన్ని దెబ్బ తీస్తుందన్న విమర్శల కోణంలో ఈ ఎమోజీపై నెగెటివిటీనే చెలరేగుతోంది సోషల్ మీడియాలో. #Pregnant man, pregnant person emoji coming to Apple iPhones. #Apple and #TimCook are you really that stupid. https://t.co/YA88hM4NiW #Pregnantemoji — Michael Osuna (@mlosuna) January 29, 2022 New Apple 'pregnant man' emoji looks like a regular dude with a beer belly to me and that's what i'm going with. pic.twitter.com/4MDN4xp5Fw — Pineapple on Pizza Speculator (@OnSpeculator) January 29, 2022 People in ancient times didn’t have pregnant men symbols because they had common sense #WokeHorseShit #emojis #pregnantman pic.twitter.com/wnClxh3Hra — Terry McNeely Comedian 🎙 (@Mac72Terry) January 29, 2022 ఐవోఎస్ 15.4 తాజా అప్డేట్తో ఐఫోన్లలో కొత్త ఎమోజీలు వచ్చాయి. ప్రెగ్నెంట్ మ్యాన్‌తో పాటు పెదవి కొరికే ఎమోజీ.. మరో 35 ఎమోజీలను ఐఫోన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం బేటా వెర్షన్లో ఉన్న ఈ ఎమోజీలు.. త్వరలో పూర్తిస్థాయిలో వాడుకలోకి రానున్నాయి. Men 👏🏼 cannot 👏🏼 get 👏🏼 pregnant! 👏🏼 Why is this so controversial?? @Apple #PregnantManEmoji #Apple #PregnantMan #Impossible — Conservative Goth Girl 🇺🇸❤️ (@ConservativeGG6) January 29, 2022 Stop attacking womanhood #apple #pregnantman — amornesta (@amornesta1) January 29, 2022 కొత్తేం కాదు.. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఇదే తరహా ఎమోజీను విడుదల చేసి విమర్శలు ఎదుర్కొంది ఎమోజీపీడియా. దీంతో ఆ ఎమోజీని ట్రాన్స్ మెన్, నాన్-బైనరీ పీపుల్, పొట్టి జుట్టు ఉన్న మహిళల కోసం.. ఉపయోగించొచ్చంటూ తప్పించుకునే వివరణ ఇచ్చుకుంది. అయినా విమర్శలు ఆగలేదు. ‘ఫుల్‌గా తిని కడుపు నిండిన మగవాళ్లు కూడా ఈ ఎమోజీని సరదాగా ఉపయోగించొచ్చు అంటూ ఎమోజీపీడియా జేన్ సోలోమన్ ఇచ్చిన స్టేట్మెంట్పై తిట్లు పడగా.. చివరికి తన మాటలకు క్షమాపణలు చెప్పాడు సోలోమన్. మరి విమర్శల నేపథ్యంలో యాపిల్ వెనక్కి తగ్గుతుందా? ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి మరి!. చదవండి: మాస్క్ ఉన్నా ఫేస్ డిటెక్ట్ చేసి.. లాక్ తీసేస్తది! -
పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్‌కు అనుమతి
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళా కానిస్టేబుల్‌కు తీపి కబురు అందించింది. మహిళ విన్నపం మేరకు.. లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఆమెకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స జరుగుతుందని తెలిపారు. ఆమెకు.. చిన్న తనం నుంచి పురుషులలో ఉన్నట్లు కొన్ని లక్షణాలు, హర్మోన్లు ఉన్నట్లు ఆమె గుర్తించింది. దీంతో ఆమె.. 2019లో లింగమార్పిడి శస్త్ర చికిత్సకోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్వాలియర్, ఢిల్లీలోని వైద్యుల సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు.‘లింగమార్పిడి అనేది వ్యక్తి హక్కు..’ అని అన్నారు. అందుకే మహిళా కానిస్టేబుల్‌కు అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సర్జరీకి ఆమె కుటుంబంవారు అంగీకరించలేదని తెలుస్తోంది. కానీ.. మహిళా లింగ మార్పిడి చేసుకోవడానికి మొగ్గుచూపుతుంది. దీనికోసం తాను.. దాచుకున్న డబ్బులతో సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడినట్లు కానిస్టెబుల్ తెలిపారు. కాగా, 2018లో మహరాష్ట్రకు చెందిన లలితా సాల్వె అనే మహిళా కానిస్టేబుల్ కూడా ఇదేవిధంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమెకు సెయింట్ జార్జ్ ఆస్పత్రి వైద్యులు లింగమార్పిడి చికిత్సను నిర్వహించారు. -
జనాభా వృద్ధికి జాగ్రత్తగా పగ్గం
దేశంలో జనాభా విస్ఫోటన భయం కొంత తగ్గినట్టే! జనాభా వృద్ధి నియంత్రణ చర్యలు ఫలితా లిస్తున్నాయి. దాదాపు దేశమంతటా ఆశించిన స్థాయిలోనే జనాభా వృద్ధిని కట్టడి చేయగలిగినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) తేల్చింది. మరో ఆరోగ్యకరమైన సంకేతం... దేశంలో మహిళా జనాభా పురుష జనాభాను దాటడం. ప్రతి వెయ్యి మంది పురుషులకు దేశంలో 1020 మంది మహిళలున్నట్టు తాజా సర్వే తెలిపింది. ఇలా మహిళల జనాభా పెరగడం, దాదాపు మూడు దశాబ్దాల ఈ సర్వే పర్వంలో తొలి నమోదు! అయితే ఈ లింగ నిష్పత్తి జననాల స్థాయిలో (ఎస్సార్బీ) ఇలా లేదు! అక్కడ పరిస్థితి భిన్నంగానే ఉంది. ప్రతి వెయ్యిమంది పురుషులకు 929 మంది మహిళలే ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) సహజమని చెప్పే స్త్రీ–పురుష నిష్పత్తి 950–1000తో పోలిస్తే ఇది తక్కువే! కానీ, అయిదేళ్ల కిందటి 2015–16 సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–4) చెప్పిన నిష్పత్తి (919–1000) కన్నా ప్రస్తుత పరిస్థితి మెరుగే! పరిమిత నమూనాలతో జరిపే ఈ సర్వే ఫలితాలను ప్రామాణికంగా భావించరు. పదేళ్లకోసారి వచ్చే సాధా రణ జనాభా లెక్కలే ప్రామాణికం. 2001, 2011 జనాభా లెక్కల్లో స్త్రీ–పురుష నిష్పత్తి సరళి కూడా ఇట్లాగే ఉంది. సాపేక్షంగా ఈ సర్వే నివేదికలూ వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్టే! ఒకటి మాత్రం నిజం. వివిధ సమాజాల్లో ఈ లింగవివక్ష, కాన్పుకు ముందే లింగ నిర్ధారణ దురదృష్టకరం, నేరం! ఆడ పిల్లలను అంతమొందించే బ్రూణహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వెయ్యిమంది పురుషులకు హిమాచల్‌ప్రదేశ్(875), తమిళనాడు(878), హరియాణా(893), ఒడిశా(894) లాగే తెలంగాణ (894)లోనూ మహిళల సంఖ్య తక్కువగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లో కొంత మెరుగ్గా (934) ఉంది. కేరళలో అయిదేళ్ల కింద 1047గా ఉన్న మహిళల సంఖ్య తాజాగా 951కి పడిపోయింది. ఢిల్లీలో 812 నుంచి ఏకంగా 923కి పెరిగింది! ఒట్టి జననాల్లో కాకుండా మొత్తం జనాభాలో మహి ళల నిష్పత్తి పురుషుల కన్నా ప్రస్తుతం పెరగడానికి పలు కారణాలుంటాయి. మరణాల రేటులో వ్యత్యాసం, మహిళల్లో ఆయుఃకాలం పెరగటం వంటివీ ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబ ఆరోగ్య సర్వేలో కొన్ని మంచి ఫలితాలు కనిపిస్తే, మరికొన్ని విషయాల్లో ఆందోళనకర సంకేతాలు వెలువడటాన్ని పాలకులు గుర్తించాలి. పిల్లలు, మహిళల్లో పౌష్టికాహార లోపం, ఇనుము కొరవడి రక్తహీనత (అనీమియా) ప్రబలడాన్ని తీవ్రంగా పరిగణించి, నివారణ చర్యల్ని ముమ్మరం చేయాలి. పిల్లల్లో రక్తహీనత కేసులు గత సర్వే కాలంలో 58.6 శాతం ఉంటే, ఇప్పుడది 67 శాతానికి పెరిగింది. గర్భిణీల్లో 50.4 శాతం నుంచి 52.2 శాతానికి, 15–49 మధ్య వయస్కులైన మహిళల్లో 53 నుంచి 57 శాతానికి పెరిగింది. అదే వయసు పురుషుల్లో 22.7 నుంచి 25 శాతానికి పెరగటం సమస్య తీవ్రతకు నిదర్శనం. ‘అనీమియా రహిత భారత్’ నినాదంతో, 2022 నాటికి కేసుల్ని తగ్గిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నా ఆశించిన ప్రగతి లేదని సర్వే తేల్చింది. పళ్లు, కూరగాయలు సరిగా తినకపోవడం, ఇతరత్రా పౌష్టికాహార లోపాలతోనే రక్తహీనత పెరిగి సమస్య జటిలమౌతోంది. కరోనా కాలంలో ఆదాయాలు రమారమి పడిపోయి, నిత్యావసరాల ధరలు పెరగ టం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేసింది. రోజువారీ భోజనంలో, తమ ఆర్థిక స్థాయిలోనూ సమ కూర్చుకోగలిగిన నిర్దిష్ట ఆహార పదార్థాలపైన జనాలకి స్పష్టమైన అవగాహన ముఖ్యం. జాతీయ పౌష్టికాహార సంస్థ ప్రచారం కల్పిస్తున్నప్పటికీ, సరిపోవడం లేదు. ప్రజలింకా చైతన్యం కావాలి. దేశవ్యాప్తంగా మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గ్రూపులు చేసి రెండు విడతల్లో నిర్వహించిన ఈ సర్వే ఏపీ, తెలంగాణల్లో తొలివిడతలోనే జరిగింది. వైద్యారోగ్యపరంగా కొన్ని మంచి సంకేతాలీ రాష్ట్రాల్లో వెలువడ్డాయి. పౌరులకు ఆరోగ్య భీమా వర్తింపజేయడంలో దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రభాగాన ఉన్నాయి. ఏపీలో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ‘నాడు– నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖల్ని మారుస్తున్న చర్య సత్ఫలితాలిస్తోంది. ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయి. కాన్పువేళ, తదనంతరం మాతా–శిశు మరణాలు తగ్గాయి. కొన్ని విషయాల్లో దేశవ్యాప్తంగానూ ఆశావహ సంకేతాలున్నాయి. దేశంలో నాల్గింట మూడొంతుల మంది మహిళలు బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచారు. స్త్రీ–పురుషుల్లోనూ ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. గృహ హింస, అదీ జీవిత భాగస్వామి నుంచి తగ్గినట్టు నమోదైంది. కుటుంబ నియంత్రణ పట్ల అవ గాహన పెరగటమే కాక సురక్షిత పద్ధతులు వారికి తెలిసి వచ్చాయి. జననాల రేటు తగ్గించడంలో ఇదెంతో ఉపయోగపడ్డట్టు గణాంకాలున్నాయి. జనాభా వృద్ధి కట్టడిలో చాలా రాష్ట్రాలు గణనీయ ఫలితాలే సాధిస్తున్నాయి. మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్పార్)ను 2.1 కన్నా తక్కువకి నియం త్రిస్తే జనన–మరణాల ప్రక్రియ కొనసాగుతూనే, ఇప్పుడున్న జనసంఖ్య స్థిరపడుతుందనేది ఓ లెక్క! బిహార్, మేఘాలయ, మణిపూర్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ టీఎఫ్పార్ని 2 కన్నా కిందే నిలిపేయడం మంచి పరిణామం. అయినా, 2040–50 సంవత్సరాల మధ్య భారత్ అత్యధిక (160 నుంచి 180 కోట్ల మందితో) జనాభా దేశంగా ఆవిర్భవించనుంది. 2031 నాటికే చైనాను అధిగమిస్తామని మరో అధ్యయనం! 2022కే అధిగమి స్తామన్న ఐక్యరాజ్యసమితి (యూఎన్) అంచనాను తప్పించామంటే, జన విస్ఫోటన తేదీని మనం ముందుకు, మరింత ముందుకు జరుపుతున్నట్టే లెక్క! ఇది ఆశావహ సంకేతం!! -
మగవాళ్ల కోసం సంతాన నిరోధక మాత్రలు! అతి త్వరలో..
Male Contraceptive Pill:ఆడవాళ్లకు గర్భనిరోధక మాత్రలు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా. సేమ్.. మగవాళ్లకూ అలాంటి మాత్రలు రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఇవి ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. ఈ తరుణంలో వీలైనంత త్వరగా మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆడవాళ్లలో అండాల తయారీని గర్భనిరోధక మాత్రలు ఎలా అడ్డుకుంటాయో.. అలాగే ఇవి మగవాళ్లపై పని చేస్తాయట. అంటే.. మగవాళ్లలోనూ వీర్యకణాల తయారీ ఆపుతాయన్నమాట. కేవలం శారీరక సుఖం కోసం కలయిక కోరుకునే జంటల కోసం ఈ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తేనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ డుండీ(స్కాట్లాండ్) ప్రకటించింది. ఈ మేరకు గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతుండగా.. ఈ ప్రయోగాల్లో డుండీ మొదటి అడుగు వేసింది. బిల్‌గేట్స్ సహకారం ఈ మాత్రలు మార్కెట్లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. కారణం.. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఈ ప్రయోగాల వెనుక ఉండడం. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ మగవాళ్ల సంతాన నిరోధక మాత్రల తయారీ నడుస్తోంది. ఇందుకోసం ఫౌండేషన్ నుంచి 1.7 మిలియన్ డాలర్ల సాయం అందించింది కూడా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేలా ఈ ట్యాబ్లెట్లను రూపొందిస్తున్నట్లు డుండీ యూనివర్సిటీ రిప్రొడక్టివ్ మెడిసిన్ ప్రొఫెసర్ క్రిస్ బర్రాత్ ఓ ప్రకటనలో వెలువరించాడు. సురక్షిత శృంగారం, ఆలస్యంగా పిల్లలు కనడం లేదా పూర్తి అయిష్టత కారణాలతో చాలా ఏళ్ల క్రితమే కండోమ్‌లను మార్కెట్లోకి తెచ్చారు సైంటిస్టులు. అయితే వీటి తర్వాత మెడికల్ సైన్స్‌లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు.. అదీ ఇంత కాలానికి తెర మీదకు రావడం విశేషం. 2015-19 మధ్య కాలంలో 121 మిలియన్ల మంది మహిళలు ఇష్టం లేకున్నా గర్భం దాల్చారని పలు సర్వేల్లో వెల్లడైంది. ముఖ్యంగా పేద దేశాల్లో జనాభా పెరుగుదలకు ఈ సంతాన నిరోధక మాత్రలు అడ్డుకట్ట వేస్తాయని University of Dundee ప్రొఫెసర్ క్రిస్ చెప్తున్నాడు. అయితే సుఖ వ్యాధుల్ని అడ్డుకుంటాయా? అని ప్రశ్నిస్తే.. తమ పరిధిలో ఆ అంశం లేదంటున్నారు ఆయన. -
మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్
స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మగ వాళ్లు కూడా ప్రసూతి సెలవులు తీసుకునేందుకు వీలు కల్పించింది. లింగ విషయంలో తటస్థ విధానాన్నిపాటిస్తూ 'ఫ్యామిలీ బాండ్'ను తీసుకొచ్చినట్లు వోల్వో ఇండియా ప్రకటించింది. వోల్వో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలోని పురుష ఉద్యోగులు మొత్తం జీతంలో 80 శాతంతో 24 వారాల(120 పని దినాలు) పేరెంటల్ లీవ్ తీసుకోవచ్చు. ప్రసూతి ప్రయోజన (సవరణ) చట్టం, 2017 ప్రకారం మహిళా ఉద్యోగులు 26 వారాల పూర్తి చెల్లింపుతో ప్రసూతి సెలవులను ఇవ్వనున్నట్లు వోల్వో కార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. వోల్వో కార్ ఇండియా గ్లోబల్ ఆదేశాలకు అనుగుణంగా భారతదేశంలోని తల్లులు, తండ్రులు, ఒకే సెక్స్ తల్లిదండ్రులు, పిల్లలను దత్తత తీసుకున్న, సర్రోగసీ ద్వారా కన్నా భారతదేశంలోని అందరి(ఆన్-రోల్, పూర్తి సమయం) ఉద్యోగులకు వర్తిస్తుంది అని ప్రకటనలో తెలిపింది. వయస్సు లేదా వైవాహిక స్థితిపై పరిమితులు లేవు. "వోల్వో, ఉద్యోగి-స్నేహపూర్వక సంస్థ కావడంతో తల్లిదండ్రులు పిల్లలను పెంచేటప్పుడు ఒకరికొకరు అందుబాటులో ఉండాలని, ఇద్దరు భాగస్వాములు ఆనందాలను పంచుకోవాలని నమ్ముతాము" అని వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు. ఈ విధానంతో వోల్వో మరింత మంది ఉద్యోగులను తల్లిదండ్రుల సెలవు తీసుకోవటానికి ప్రోత్సహిస్తుందని జ్యోతి మల్హోత్రా పేర్కొన్నారు. చదవండి: ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి! -
ఎమ్మెల్సీలో పురుష ఓటర్లదే హవా!
ఖమ్మం: సాధారణంగా ఏ ఎన్నికల్లోన్నైనా పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉంటారు. వారి ఓట్లను రాబట్టుకునేందుకు నేతలంతా హామీల వర్షం గుప్పిస్తుంటారు. కానీ.. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పురుష ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. దీంతో జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములపై పురుష ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలోని 21 మండలాల్లో 87,172 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పురుషులు వేసే ఓట్లే ప్రధానంగా కీలక భూమిక పోషించనున్నాయి. అభ్యర్థులు కూడా తమ వ్యూహ రచనల్లో భాగంగా పురుష, మహిళా ఓటర్లతోపాటు వయసుల వారీగా కూడా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా యువత ఓట్లను రాబట్టుకునేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటివరకు మహిళలదే సత్తా.. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నుంచి మొదలుకుంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకొని ఓట్లు అడిగేవారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి.. వారి కోసం చేయనున్న అభివద్ధి పనుల గురించి వివరించి.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేసేవారు. అయితే తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో వారిని ఎలా కలుసుకోవాలనే దానిపై కూడా అభ్యర్థులు ఆలోచనలు చేస్తూ ప్రణాళిక రూపొందిస్తున్నారు. మహిళలను ఇంటి వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించవచ్చు. అయితే పురుష ఓటర్లు ఎక్కువగా ఉండటం.. వారు పట్టభద్రులు కావడంతో ఎక్కువ మంది ఏదో ఒక ఉద్యోగం చేస్తూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటారు. దీంతో వారిని కలుసుకోవడం కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని బరిలో నిలిచిన అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. ఓట్లను అభ్యర్థించడానికి ఇళ్లకు వెళ్లడం కన్నా.. అంతర్గత సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడంపైనే ఇప్పటివరకు అభ్యర్థులు దష్టి సారించారు. ఇక మున్ముందు ఇళ్లను సందర్శించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఓటర్ల వివరాలను సేకరిస్తూ పోటీలో ఉన్న అభ్యర్థులు వారి వివరాలతో సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపుతూ తమకే ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. అలాగే ఓటు వేసే వ్యక్తి పేరు, ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ బూత్ నంబర్ తదితర వివరాలను పూర్తిగా పంపుతూ వారు ఓటు వేసేలా చైతన్యపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆడ, మగ కలిసి ఉండడం నేరం కాదు
తిరువొత్తియూరు: తాళం వేసిన గదిలో స్త్రీ, పురుషుడు ఉండడం తప్పు కాదని, దాని ఆధారంగా ఒకరికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వీలు కాదని మద్రాసు హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. 1998లో దాఖలైన కేసు విచారణను హైకోర్టు ముగించింది. 1997లో సాయుధ దళం విభాగంలో శరవణబాబు కానిస్టేబుల్‌గా చేరాడు. 1998లో అతని ఇంటి లోపల అదే ప్రాంతంలో నివా సం ఉంటున్న మరో మహిళా కానిస్టేబుల్ ఉండడాన్ని స్థానికులు చూసి గదికి తాళం వేశారు. దీంతో కానిస్టేబుల్ శరవణబాబుకు, మహిళా పోలీసు కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం ఉందా అని భావించి పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడానికి నిర్ణయించారు. అతన్ని డిస్మిస్ చేస్తూ సాయుధ దళం విభాగం ఐజీ మణి ఆదేశాలు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ శరవణబాబు మద్రాసు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. తనకు మహిళా కానిస్టేబుల్‌కు వివాహేతర సంబంధం లేదని పేర్కొన్నారు. ఆమె బయటకు వెళ్లినప్పుడు తాళం పెట్టి వెళుతూ ఉంటారని, దాన్ని తీసుకోవడానికి వెళ్లానని పేర్కొన్నారు. దీనిపై తుది విచారణ అనంతరం శుక్రవారం హైకోర్టు తీర్పు ప్రకటించింది. న్యాయమూర్తి సురేష్‌కుమార్ ఫిర్యాదుదారుడు శరవణబాబు, ఆ మహిళ ఒకే ఇంటిలో ఉంటున్నట్లు సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. ఆరోపణలపై చర్యలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. శరవణ బాబును డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పురుషుడు, ఒక స్త్రీ ఒకే గదిలో ఉండడాన్ని వ్యభిచారంగా చూడడం సరికాదన్నారు. సమాజంలో పలువురికి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చని, దాని ఆధారంగా చర్యలు తీసుకోవడానికి వీలు లేదని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
పురుషుల ప్రాణం తీస్తోన్న వ్యాధి, కారణం తెలిసింది!
వాషింగ్టన్: జన్యుపరమైన ఒక వ్యాధితో అమెరికాలో చాలామంది పురుషులు మరణించారు. అయితే దానికి సంబంధించిన కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. అయితే ఇటీవలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధిగల కారణాన్ని కనుగొని దీనికి విశాక్స్ అనే పేరుపెట్టింది. సాధారణంగా మన శరీరంలోకి హానికరమైన వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ ప్రవేశించినప్పుడు సహజంగా మన దేహంలో ఉండే వ్యాధి నిరోధక కణాలైన తెల్ల రక్త కణాలు వాటిపై దాడి చేసి వాటిని అంతమొందిస్తాయి. అయితే ఈ వ్యాధిలో మాత్రం బయట నుంచి ఎలాంటి హాని కలిగించే జీవులు శరీరంలోకి ప్రవేశించనప్పటికి ఈ కణాలు యుద్దాన్ని చేస్తూ మన శరీరంపైనే దాడిచేసి మంటను రగిలిస్తాయి. దాని వలన నరాల్లో రక్తం గడ్డకట్టడం, తరచు జ్వరం రావడంలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వ్యాధి సోకిన వారిలో అదేమిటో వైద్యులు సరిగా గుర్తించలేకపోయేవారు. ఆ వ్యాధి సోకిన వారిలో 40శాతం మంది మరణిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన 25వేలమందికి పైగా ప్రయోగాలు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది యూబీఏ1 అనే జన్యువులో మార్పు కారణంగా కలుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. చదవండి: ఇంటికి పిలిపించి కుక్కతో కరిపించాడని.. -
ఒంటరి పురుషులకు శిశు సంరక్షణ సెలవులు
న్యూఢిల్లీ: ఒంటరిగా ఉంటున్న పురుష ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇకపై శిశు సంరక్షణ(చైల్డ్ కేర్) సెలవులు పొందవచ్చని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తోమర్ సోమవారం చెప్పారు. అలాంటి వారిని సింగిల్ మేల్ పేరెంట్‌గా పరిగణిస్తామన్నారు. అవివాహితులు, భార్య మరణించిన వారు, విడాకులు తీసుకున్న వారు పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత ఉంటే ఈ సెలవులకు అర్హులని పేర్కొన్నారు. చైల్డ్ కేర్ లీవ్‌లో ఉన్నవారు లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) కూడా పొందవచ్చని సూచించారు. శిశు సంరక్షణ సెలవులో ఉన్నవారికి మొదటి 365 రోజులు పూర్తి వేతనం చెల్లిస్తారు. మరో 365 రోజులు కూడా ఈ సెలవులో ఉంటే 80 శాతం వేతనం చెల్లిస్తారు. చదవండి: బీమా ప్రకటనల నిబంధనల్లో మార్పులు -
ఈవెనింగ్ సినిమా
స్త్రీని, పురుషుడిని ప్రకృతి వేర్వేరుగా సృష్టించింది తప్ప, స్త్రీ పురుషులకు వేర్వేరుగా ఏమీ సృష్టించలేదు. వెలుగునీడలు, ఎండావానలు ఇద్దరికీ ఒకటే. అంటే ప్రకృతికి స్త్రీ పురుషులిద్దరూ సమానం. పురుషుడే.. స్త్రీ తనకు సమానం కాదనుకుంటాడు! అందుకే స్త్రీలకు ఏ కాలానికి ఆ కాలం ధర్మయుద్ధాలు, న్యాయ పోరాటాలు చేయక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. మహిళల తాజా పోరాటం, తాజా విజయం.. ఈవెనింగ్ సినిమా. మాధవ్ శింగరాజు స్త్రీ తనంత బలమైనది కాదని, తనంత తెలివైనది కాదని, తనంత చురుకైనది కాదని భావించి గొప్ప పెయిన్‌ని ఓర్చుకునే ఔదార్యంతో ఆమెను తనతో సమానంగా పైకి తెచ్చేందుకు అప్పుడప్పుడు చట్టాలు తెస్తుంటాడు పురుషుడు. స్త్రీకన్నా తను బెటర్ హ్యూమన్ బీయింగ్ అనుకోవడం వల్ల తనపై తనకే కలిగే ఆత్మవిశ్వాసంతో ఆమెనూ తనలా బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా మలిచేందుకు తను తగ్గి, తనలోని అధికుడినన్న భావనను తనకు తానుగా దహింపజేసుకుని తిరిగి తనే మరింతగా ఉన్నతీకరణ చెందుతాడు! అందుకే.. స్త్రీకి స్వేచ్ఛనివ్వడం పురుషుడి దృష్టిలో ఈనాటికీ గొప్ప సంస్కరణగా మన్నన పొందుతోంది. చితిపై నుంచి సతిని పైకి లేపాడు. చిన్నప్పుడే పెళ్లేమిటని పీటల పైనుంచీ లేపేశాడు. చదువుకోనిచ్చాడు. సినిమా చూడనిచ్చాడు. తను చేసే ప్రతి పనినీ చెయ్యనిచ్చాడు. ఈమధ్యే శబరిమలకు కూడా వెళ్లనిచ్చాడు. ఇప్పుడు హాస్టల్ అమ్మాయిల్ని ఫస్ట్షోకి, సెకండ్‌షోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చాడు. ఇవ్వడం, చెయ్యనివ్వడం రెండూ గొప్ప ఉదారతలే. అయితే తీసుకున్నది తిరిగి ఇచ్చేయడం, కట్టడి చేసి పట్టు విడవడం ఔదార్యం ఎలా అవుతుంది.. చేసిన తప్పును, ఇచ్చిన తీర్పును దిద్దుకోవడం అవుతుంది గానీ! ఏదో ఒకటి ప్రసాదిస్తున్నారు కదా, పోనివ్వండి. మనది మనకు ఇవ్వడం కూడా పురుషధర్మం అనుకుంటున్నారు కనుక మనమూ అలాగే మహాప్రసాదం అనుకుంటే వచ్చే నష్టం ఏమిటి? నష్టం ఏంటంటే.. తిరిగి ఇచ్చేసిన దానిని తిరిగి లాగేసుకుని మళ్లీ ఆంక్షలు విధించి, సంకెళ్లు వేసి.. సంస్కరణలు అవసరమైన పూర్వపు కాలాల్లోకి స్త్రీలను పురుషులు లాక్కెళ్లరనే నమ్మకం లేదు. అందుకే స్త్రీ ఎప్పుడూ తన కోసం జరిగిన ఏ మెరుగైన మార్పునూ కళ్లు విప్పార్చి చూడలేదు. మహిళల జీవితాలు మెరుగుపడేందుకు జరుగుతున్న పురుష ప్రయత్నాల వల్ల పైకి మీగడ తేలుతున్నది పురుష స్వామిత్వం తప్ప స్త్రీ పురుష సమానత్వం కాదు. మెరుగుపడటం అంటే స్త్రీ పురుషులకు ప్రకృతి ఇచ్చిన సమానత్వానికి పురుషుడు తలవొగ్గడం. సమానత్వాన్ని తీసేసుకుని తిరిగి ఇచ్చేయడం ‘మెరుగు’ ఎలా అవుతుంది? ఐదు రోజుల క్రితం కేరళ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చింది. అయితే అది మగవాళ్లకే సంచలనాత్మకం కానీ, ఆడవాళ్లకు కాదు. అందుకే స్త్రీలు గానీ, స్త్రీవాదులుగానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ‘కోర్టిచ్చిన తీర్పు ఈ పురుషస్వామ్య సమాజానికి పెద్ద కనువిప్పు’ అనే స్టేట్మెంట్లూ వినిపించలేదు. ఆ తీర్పుకంత ప్రాచుర్యం లభించకపోవడానికి ఇంకోకారణం.. దేశం ఇప్పుడు ఎలక్షన్ మూడ్‌లో ఉండడం. త్రిశ్సూర్‌లోని ‘శ్రీ కేరళ వర్మ కాలేజ్’ హాస్టల్ విద్యార్థినులు.. తమను హాస్టల్ యాజమాన్యం ఫస్ట్షోలకు, సెకండ్‌షోలకు వెళ్లనివ్వడం లేదని కేసు వేశారు. ‘బాయ్స్ హాస్టల్లో లేని ఈ ఆంక్ష, వివక్ష గర్ల్స్ హాస్టల్‌కు ఎందుకు?’ అన్నది వారి వాదన. నిజమే అనిపించింది న్యాయస్థానానికి. ‘‘ఈవెనింగ్ మూవీలకు వెళ్లే స్వేచ్ఛ అబ్బాయిలకు మాత్రమే ఎందుకు ఉండాలి? అమ్మాయిలకూ కల్పించండి’’ అని కోర్టు ఆ హాస్టల్ వారిని ఆదేశించింది. రాజ్యాంగంలోనే స్త్రీ పురుష సమానత్వం ఉన్నప్పుడు ఆ సమానత్వ హక్కును నిరాకరించడం నేరం అవుతుందని కూడా హాస్టల్ యాజమాన్యాన్ని మేల్కొలిపింది. దీనికి ఆ అమ్మాయిలు సంతోషించారు. నిజంగానే వాళ్లు ఫస్ట్ షోలకు, సెకండ్ షోలకు వెళ్తారా అన్నది తర్వాతి మాట. వెళ్లడానికైతే అనుమతి సాధించారు. అనుమతి సాధించడం కాదది. ఉన్న అనుమతిని సాధించుకోవడం!ప్రకృతి ఇచ్చిన సమానత్వ హక్కుల్ని పొందడం కోసం స్త్రీ పురుషుడి నుంచి అనుమతి తీసుకోవలసిన పరిస్థితిని పురుషుడు కల్పించిన నాటి నుంచీ ఈ పోరాటం సాగుతూనే ఉంది. అంటే.. స్త్రీలెవరూ హక్కుల సాధనకోసం పోరాటం చేయడం లేదు. హక్కుల్ని కాపాడుకోవడం చేస్తున్నారు. కొత్తగా వాళ్లేదైనా చెయ్యాలంటే.. చేయవలసింది ఒక్కటే. మగవాడిని సంస్కరించడం. అంటే ఏంటి? స్త్రీలను ఉద్ధరించే పని నుంచి అతడికి విముక్తి కల్పించడానికి ఆధిక్య భావనల నుంచి అతడిని కిందికి తోసేయడం. సాయి పల్లవి (ప్రతీకాత్మక చిత్రం) హాస్టల్ విద్యార్థినులను ఈవెనింగ్ షోలకు వెళ్లనివ్వకుండా నిరోధించడం.. స్త్రీ, పురుష సమానత్వ హక్కులకు భంగం కలిగించడమేనని కేరళ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. -
ల్యాప్‌టాప్
‘నేను మగ’ అని హెల్ప్ చెయ్యకపోవడం కాదు. ‘ఆమె ఆడ’ అని హెల్ప్ చెయ్యడం కాదు. ఇంట్లో పనిని మగవాళ్లు పని అనుకోవడం, అనుకోకపోవడాన్ని బట్టే.. ఇంట్లో ఆడవాళ్లకు సహాయం అందడం, అందకపోవడం ఉంటుంది! కెవ్వుమంది ఆమె! ‘ఏంటీ?!’ అని పైకి లేచాడతను. ‘బ..బ.. బల్లి’ అంది. ‘ఎక్కడ?’. ‘బాత్రూమ్’లో. చిరాకుపడ్డాడు. బల్లికి భయపడ్డం ఏంటి! నేరుగా బాత్రూమ్లోకి వెళ్లాడు. కిటికీలో బల్లి ఇంకా అక్కడే ఉంది. అతడి వెనుక నుంచి ఆమె ఇంకా భయంగానే బల్లివైపు చూస్తోంది. ‘మీవారిని తీసుకొచ్చావా?’ అని ఆ బల్లి తననే చూస్తున్నట్లు అనిపించింది ఆమెకు. బల్లి దగ్గరకు వెళ్లాడు అతను. అదిలించాడు. కదిలించాడు. ఎగిరి కిందపడింది. మళ్లీ కెవ్వుమంది ఆమె. ఆమె చేతిలోని చీపురును తను తీసుకుని బల్లిని తరిమేశాడు.కయ్యిమన్నాడు అతడు! ‘ఏంటీ!’ అని పరుగెత్తుకొచ్చింది ఆమె. ‘బూజు’ అన్నాడు. ‘ఎక్కడ?’ అంది. ‘అదేమిటి?’ అన్నాడు. తలెత్తి చూసింది. గదికి పైన ఓ మూల ఉంది. బూజుకర్ర తెచ్చింది. ‘నిన్ను పంపించారా మీవారు, తను చెయ్యనని’ అని ఆ బూజు తనను అడిగినట్లుగా ఆమెకేమీ అనిపించలేదు. తనకు అందకపోతే కదా భర్తనే వెళ్లమనడం. కర్రను రెండు చుట్లు చుట్టి శుభ్రం చేసి వెళ్లిందామె. ఈలోపు, నోటికి తీసుకోబోతూ పక్కన పెట్టేసిన టీ కొంచెం చల్లారిపోయింది. నష్టమేం లేదు. మళ్లీ వేడి చేసుకుంటుంది. తాగబోతుండగా మళ్లీ కయ్యిమని పిలుపొచ్చినా మళ్లీ టీని అక్కడ పెట్టేసి వెళుతుంది. ఆమెకు మూమూలే.. రోజుకి రెండు మూడు ‘కయ్’లన్నా వినడం. ఆమెకు కోపం రాదు. ఆమె కెవ్వుమన్నందుకు అతడికి చిరాగ్గా అనిపించవచ్చు కానీ, అతను కయ్మన్నందుకు ఆమెకు కోపం రాదు! బల్లినంటే ఆమె తరమలేకపోయింది కానీ, బూజును అతడు తుడిచేయొచ్చు. బూజేమీ బల్లిలా ఒళ్లు తిప్పుకుంటూ వెళ్లదు. కళ్లు మిటకరిస్తూ చూడదు. తోకను కదల్చదు. అదో టైపులో కటకటమని అరవదు. ఇవన్నీ కాదు, బల్లి అంటే ఆమెకు ఉన్నట్లుగా, బూజు అంటే అతడికి భయం లేదు. మరి తనే బూజుకర్ర తీసుకొచ్చి ఆమె చుట్టినట్లు రెండు చుట్లు చుట్టి బూజును తీసేయొచ్చు కదా! తీసేయొచ్చు కానీ, ఆమేం పుట్టింట్లో లేదు కదా.. వచ్చేందుకు టైమ్ పడుతుంది, ఈలోపు బూజు ఎగిరొచ్చి తన నెత్తి మీదో, భుజం మీదో పడుతుంది.. అనుకుని బూజుకర్ర అందుకోవడానికి!తప్పేం లేదు. సరిగ్గానే ఉన్నాడతడు. ఇల్లు దులపడం ఆడ పని, మగ పని అని అనుకునేంత దూరంగా కూడా ఏమీ వెళ్లిపోలేదు. తను పనిలో ఉన్నట్లుగానే, తనలా ఇంట్లో ఉన్న మరో మనిషి కూడా ఏదో పనిలో ఉంటుందన్న ఆలోచనైతే రావాలి. రాలేదు. బూజు కనిపించింది.. కయ్యిమన్నాడు. అది కూడా కాదు. బూజు దులపడాన్ని అసలతడు పనే అనుకోలేదు. దాన్ని పని అనుకుని ఉంటే, లోపల మనిషి చేస్తున్నదీ పనే అనుకునేవాడు. పనిలో ఉన్న మనిషిని పిలిచి మళ్లీ ఒక పని చెప్పేవాడు కాదు. లేచి తనే చేసేవాడు. లేదంటే, ఆమె తన పని పూర్తి చేసుకుని అటుగా వచ్చినప్పుడు.. పని గురించి వినే తీరికలో, వినే ఓపికలో ఆమె ఉందా అని గమనించి చెప్పేవాడు. ఆ చెప్పడం కూడా.. ‘ఓ సెలవు రోజు ఇద్దరం కలిసి ఇంటిని శుభ్రం చేయాలి’ అని సీలింగ్ వైపు చూస్తూ చెప్పేవాడు. ఆ తర్వాత ఆమెకు కుదిరినప్పుడు ఆమె, అతడికి కుదిరితే అతడు, ఇద్దరికీ కుదిరితే ఇద్దరూ కలిసి చేసుకునేవాళ్లు. ఇంటి పనుల్లో మగవాళ్లు హెల్ప్ చెయ్యకపోవడానికి కనిపించే సాధారణ కారణం.. ‘ఎవరి పని వారు’ చెయ్యాలనే ఒక ఆలోచన వారిలో ఇన్‌బిల్ట్‌గా ఉండిపోవడం అనుకుంటాం. ఆలోచన కాదు, ‘అనాలోచన’ ఇన్‌బిల్ట్‌గా ఉండిపోవడం అసలు కారణం. టమాటాలు తరగడం పనిలా కనిపించనప్పుడు.. టమాటాలు తరిగే మనిషి కూడా పని చేస్తున్నట్లుగా కనిపించదు. పని చేస్తున్నట్లు కనిపించనప్పుడు పనిగట్టుకుని వెళ్లి హెల్ప్ చేయడం ఏమంటుందనే ఆ అనాలోచన.. సెన్సిటివిటీ లేకపోవడమే కానీ, జెండర్ సెన్సిటివిటీ లేకపోవడం కాదు. ఇంటపనుల్లో చక్కగా హెల్ప్ చేస్తుండే మగవాళ్లు కూడా.. ‘అయ్యో పాపం.. ఆడ మనిషి’ అని హెల్ప్ చెయ్యడం కాదు. స్త్రీ పురుష సమానత్వం అనుకుని టమాటాల్ని, కత్తిపీటను ఆమె నుంచి లాక్కోవడం కాదు. హెల్ప్ చెయ్యాలని అనిపించడం కాదు. హెల్ప్ చేస్తున్నామని అనుకోవడమూ కాదు. ఎదురుగా ఒక మనిషికి ఏకకాలంలో రెండు మూడు పనులున్నాయి కనుక సాటి మనిషిగా వాటిల్లో ఒక పనిని చేతికి అందుకోవడం. అది కూడా సెన్సిటివిటీ తప్ప జెండర్ సెన్సిటివిటీ కాదు. ఇంట్లో పనిని మగవాళ్లు పని అనుకోవడం, అనుకోకపోవడాన్ని బట్టే ఇంట్లో ఆడవాళ్లకు సహాయం అందడం, అందకపోవడం తప్ప.. ఇది మగ పని, ఇది ఆడ పని అని జనరల్‌గా అక్కడ పురాతత్వ పని విభజన నియమాలేవీ అప్లయ్ అవ్వవు. కొందరికి పేస్ట్ అందించాలి. బ్రష్ అందించాలి. బ్రష్‌లో పేస్ట్ వేసి కూడా అందించాలి. తమ పళ్లు, తమ పని అనుకోరు. మీరు తినడానికే మేము పళ్లు తోముకుంటున్నాం అన్నట్లుంటారు. ఇలాంటి వాళ్లను సెన్సిటైజ్ చెయ్యడానికి తప్ప, మహిళలూ పెద్దగా ఉద్యమాలేం చెయ్యరు కూడా. ‘ఇల్లు క్లీన్ చెయ్యడం ఆడవాళ్ల పని, ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని కూర్చోవడం మగవాళ్ల పని అనుకోకండి. మనుషులకు తప్ప, పనులకు జెండర్ లేదు’ అని చెప్పడానికి మాత్రమే వాళ్ల ప్రయత్నమంతా. మొన్న చూడండి. వాలంటైన్స్ డేకి హాంకాంగ్, లండన్లలో హెచ్.ఎస్.బి.సి. సిబ్బందికి ఓ పెద్ద కంపెనీ బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ చార్ట్‌లో ‘ఫర్ హిమ్’ సెక్షన్ కింద ల్యాప్‌టాప్ కంప్యూటర్లు, గోప్రో కెమెరాలు, వైర్లెస్ హెడ్ఫోన్లు ఉన్నాయి. ‘ఫర్ హర్’ సెక్షన్ కింద వ్యాక్యూమ్ క్లీనర్లు, ఆహార పదార్థాల్ని కలియదిప్పే బ్లెండర్లు, కిచెన్ వాటర్ ట్యాప్‌లు ఉన్నాయి! ఈ లైంగిక వివక్ష ఉమెన్ స్టాఫ్‌కి ఆగ్రహం తెప్పించింది. ఆఫీస్‌ల నుంచి వాకవుట్ చేశారు. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ అనిపిస్తుంది. ఇంట్లో మగాళ్లు హెల్ప్ చెయ్యకపోవడం అనాలోచన వల్ల కాదేమో, ఆడా మగా అనే ఆలోచన వల్లనేనేమో అని! ఒక్క యుగంలో లోకం ఏమీ మారిపోదేమో. యుగాలుగా లోకం మగాళ్లదే కనుక. బల్లిని చూసి ఆమె భయపడినప్పుడు అతడు వెళ్లి తరిమేశాడు. కొన్నిసార్లు ఇంటి పని కూడా బల్లిలా ఆమెను భయపెడుతుంది. అప్పుడు బల్లిని తరమాల్సింది బల్లి అంటే భయం లేనివాళ్లే. అతడెళ్లి పని అందుకోవాలి. చిన్న పనులు కూడా ఒక్కోసారి ఆమెకు చేయలేని పనులవుతాయి. ఆ గమనింపు ఉంటే చాలు. పని చేయకున్నా పని అందుకున్నట్లే. మరి బూజు? బూజు అయినా, ల్యాప్‌టాప్ అయినా.. మేడమ్ వచ్చి తుడిస్తేనే నేను క్లీన్ అవుతానని, సారొచ్చి ఒడిలో పెట్టుకుంటేనే నేను ఆన్ అవుతాయని అంటాయా?! - మాధవ్ శింగరాజు -
‘మా ఇంట్లో మగవాళ్లు లేరు’
బ్యాంకాక్ : ‘ఓ స్త్రీ రేపు రా’.. కొన్నేళ్ల క్రితం దెయ్యాల భయంతో మన దేశంలోని చాలా గ్రామాల్లో ఇలాంటి బోర్డులు దర్శనమిచ్చాయి. అయితే మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్మే థాయ్‌లాండ్‌లోని ఓ గ్రామంలో ఇప్పుడీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ ఇంట్లో మగాళ్లు మోహిని పిశాచి మూలంగా చనిపోతుండటంతో వింత పద్ధతులకు దిగారు. ఇంతకీ కథేంటో తెలియాంటే నాఖోన్ ఫానోమ్ గ్రామానికి ఒక్కసారి వెళ్దాం. ఈశాన్య థాయ్‌లాండ్‌కు సుదూర దూరంలో ఉన్న ఆ గ్రామంలో రాత్రయ్యిందంటే చాలూ మగాళ్లు.. మహిళల మాదిరి సింగారించుకుని పడుకుంటారు. ఇళ్ల ముందు దిష్టి బొమ్మలు, బోర్డులపై రాతలు దర్శనమిస్తాయి. అవి సాధారణంగా ఉంటే చర్చనీయాంశంగా ఎందుకు మారుతాయి?. దిష్టి బొమ్మలకు దుంగలతో పెద్ద పురుషాంగం మాదిరి ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక బోర్డులపై ‘మా ఇంట్లో మగవాళ్లు లేరు’ అన్న రాతలు దర్శనమిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఆ ఊళ్లో ఓ వితంతువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో పురుషులు విచిత్రంగా ప్రాణాలు విడుస్తున్నారు. నిద్రలో పడుకున్న వాళ్లు.. పడుకున్నట్లే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆ మహిళ మోహిని పిశాచంలా మారి తమ ఇంట్లో మగాళ్లను బలితీసుకుంటూ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ ఊరి మహిళలు నమ్మసాగారు. వారంతా కలిసి కొందరు తాంత్రిక పెద్దలను కలిశారు. వారి సలహా మేరకు ఆ పిశాచి నుంచి మగాళ్లను రక్షించుకోవడానికి ఈ పద్ధతులను అవలంభిస్తున్నారు. అంత పెద్ద మర్మాంగం చూస్తే ఆ ఇంట్లోకి వచ్చేందుకు దెయ్యం వణికిపోతుందని.. ఒకవేళ తెగించి వచ్చినా మహిళల రూపంలో ఉన్న మగాళ్లని చూసి వెళ్లిపోతుందనే ఆ పని చేశారంట. అయితే ఈ పద్ధతులు పాటిస్తున్నాకే తమ గ్రామంలో పురుషుల మరణాలు ఆగిపోయాయని అక్కడివారు చెబుతున్నారంట. అలాంటప్పుడు తాము ఎంత చెప్పినా ఏం లాభమని హేతువాదులు, వైద్యులు అంటున్నారు. -
మగవాళ్లకి కూడా తొమ్మిది నెలలే!
టెక్సాస్ : వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ మగవాళ్లు కూడా గర్భం దాల్చే రోజులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. మగవారు కూడా పిల్లల్ని కనడానికి భవిష్యత్తులో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని డాక్టర్ రిచర్డ్ పాల్సన్ స్పష్టం చేశారు. అమెరికా పునరుత్పత్తి వైద్య సంఘం అధ్యక్షుడు అయిన పాల్సన్ శాన్ ఆంటోనియోలో నిర్వహించిన వార్షిక సమావేశంలో ఈ అంశంపై ప్రసంగించారు. లింగమార్పిడి చేయించుకున్న పురుషులు... గర్భాశయ మార్పిడికి కూడా ముందుకు రావచ్చని ఆయన అన్నారు. లింగ మార్పిడి అనంతరం పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టడానికి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. సాధారణ పురుషుల్లో కాన్పు మాములు విషయం కాదని ఆయన చెప్పారు. పురుషులు, స్త్రీల మధ్య పొత్తి కడుపు నిర్మాణం తేడాగా ఉండటమే అందుకు కారణమని పాల్సన్ తెలిపారు. అయితే క్లిష్ట తరమైన ఈ సమస్యకు సిజేరియన్ ద్వారా కాన్పు చేయాల్సి ఉంటుందని చెప్పారు. గర్భాశయంలో పిండం సక్రమంగా ఎదగడానికి మహిళల్లో ప్రకృతిసిద్ధంగా కొన్ని హార్మోన్లు విడుదల అవుతాయాని... ఈ హార్మోన్లను పురుషులకు కృత్రిమంగా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మగవారికి అవసరమైన మందులు మార్కెట్లలో విరివిగా ఉన్నాయని... దీని కారణంగా మగవారు పిల్లలను కనొచ్చని చెప్పారు. అయితే దీనిపై అభ్యంతరాలు లేవనెత్తవాళ్లు నుంచి మాత్రమే సమస్య ఉండొచ్చన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. -
ఆడదే ఆధారం
నాటి సినిమా పురుషుడు స్త్రీకి ఈ ప్రపంచంలో ఒక చిన్న ప్రపంచం కేటాయింటాడు. దాని పేరు ఇల్లు. స్త్రీ ఇంట్లో ఉండాలి. సాటి స్త్రీని ఇంట్లో ఉంచాలి. ఇంటి రాజకీయాలలో ఒకరితో ఒకరు తలపడుతూ ఉండాలి. రెండు గదులు, ఒక హాలు, చిన్న వరండా... ఇదే సామ్రాజ్యం అనుకుంటూ దానిలో ఆధిపత్యం కోసం ఒక స్త్రీ మరో స్త్రీతో వాదనకూ యుద్ధానికీ పీడనకూ దిగాలి. చాలాసార్లు పురుషుడు ఈ యుద్ధానికి దూరంగా ఉంటాడు. ఈ పాపంతో తనకు సంబంధం లేదు అన్నట్టుంటాడు. ఎందుకంటే అతడికి బయట పెద్ద ప్రపంచం ఉంది. అందులో అతడు హాయిగా తిరుగుతుంటాడు. కాని స్త్రీ మాత్రం? ఇంట్లోనే తాను వేదన అనుభవిస్తూ ఒకరికి వేదన కలిగిస్తూ... ‘ఆడదే ఆధారం’ సినిమా పురుష ప్రపంచంలో స్త్రీల సగటు మానసిక స్థితిని చెబుతుంది. అత్తగా ఉండే స్త్రీ కోడలని వేధించాలని, కోడలుగా ఉండే స్త్రీ అత్తామామలను నిర్లక్ష్యం చేయాలని నమ్ముతూ సమాజం కల్పించిన చట్రంలో స్త్రీలు ఎంత దారుణంగా కొట్టుకుపోతున్నారో చూపుతుంది. ఇందులో ఒక కోడలు (ముచ్చెర్ల అరుణ). ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఉద్యోగం చేస్తూ సంపాదిస్తోంది కనుక ఇంట్లో దర్జాగా ఉండాలని భావిస్తుంది. అత్తమామలను పనివాళ్ల కింద జమ చేస్తుంది. భర్త ఈ విషయాన్ని చూసీ చూడనట్టుగా ఉంటాడు. వాదన చేస్తే భార్య పెద్ద గొడవకు దిగుతుందని భయం. వీళ్ల పక్క వాటాలోనే ఒక అత్తగారు (పి.ఆర్.వరలక్ష్మి) ఉంటుంది. ఈమె తన ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేస్తుంది. కోడలు (సీత) ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెకు సంతోషం లేదు. ఎందుకంటే కోడలు తేవాల్సిన కట్నాన్ని ఇంకా తేలేదు. బాకీ ఉంది. అందువల్ల అత్త కోడలని వేధిస్తూ ఉంటుంది. ఆమెను గర్భం దాల్చవద్దని ఆజ్ఞాపిస్తుంది. అయినప్పటికీ గర్భం వస్తే అబార్షన్ చేయించాలని చూస్తుంది. చివరకు కోడలితోనే తెగదెంపులు చేసుకునేదాకా వెళుతుంది. ఆ ఇంట్లో ఒక కోడలి వల్ల సుఖం లేదు. ఈ ఇంట్లో ఒక అత్త వల్ల సంతోషం లేదు. వీరి మనసులు, మెదడులు ఇంత ‘నేరో’గా కావడానికి కారణం ఎవరు అని మనం ఆలోచించాలి. కోడలికి అత్త శత్రువు, అత్తకు కోడలు శత్రువు అని ఎవరు నిర్థారణ చేశారు? మగవాడు కాదా? కాని అందరు మగవాళ్లు ఒకేలా ఉండరు. ఈ కథలోనే ఒక రేడియో మామ (విసు) ఉంటాడు. ఈయన రిటైరైన పెద్ద మనిషి. అయితై రిటైరైనవాడు రిటైరైనట్టు ఉండక కొడుకూ కోడలి (చంద్రమోహన్, రాజ్యలక్ష్మి)తో ఏ కాలనీకి వెళితే ఆ కాలనీలో చుట్టు పక్కల ఆడవాళ్ల కష్టాలను తీర్చే పని పెట్టుకుంటాడు. అతడి దృష్టి ఈ కాలనీకి రాగానే పొరుగన ఉన్న అత్తగారిపైన, పై పోర్షన్లో ఉన్న కోడలి మీద పడుతుంది. వారిని అతడు ఎలా సరిదిద్దాడో అనేది కథ. అయితే అత్తాకోడళ్లందరూ ఇలాగే ఉంటే ఈ సినిమాకు విలువ లేదు. ఈ సినిమాలోని రేడియో మామ కోడలు పరిణితి కలిగిన స్త్రీ. మామగారు స్త్రీల పట్ల ఆర్తి చెందితే ఆయనకు ఆమె ఆలంబనగా నిలుస్తుంది. అలాగే మరో మురికివాడలో ఇద్దరు అత్తాకోడళ్లు ఉంటారు. తండ్రీ కొడుకులు తాగి తందనాలాడుతూ ఉంటే ఈ అత్తాకోడళ్లు ఎంతో సహనంతో సంయమనంతో ఒకరికొకరు మద్దతుగా ఉంటూ కాపురాన్ని నిలబెట్టుకుంటూ వస్తారు. మగాడు నిస్సహాయంగా ఉన్నా, దాష్టికంగా ఉన్నా స్త్రీ బుద్ధి కుశలతా, ఇంగితజ్ఞానంతో ఇంటిని నిలబెట్టుకోవచ్చు అనడానికి ఈ పాత్రలు కనిపిస్తాయి. కాని చాలాసార్లు స్త్రీలు ఎంత అభద్రతతో ఉంటారంటే అత్తతోగాని, కోడలితోగాని వైరం పెట్టుకుంటే తప్ప మనుగడ లేదు అనట్టుగా ఉంటారు. ఆర్థిక కేంద్రం మగాడు తీసుకోగా నాలుగ్గోడలు ఉండే ఇంటి కేంద్రమైనా తన చేతుల్లో ఉండాలని భావించడం వల్లే ఈ అభద్రత. ఎట్టకేలకు ఈ సినిమాలో అత్త కోడలి ఔన్నత్యాన్ని గ్రహిస్తుంది. కోడలు అత్త పెద్దరికాన్ని అర్థం చేసుకుంటుంది. నలుగురూ ఆడవాళ్లే. కాని కొద్దిపాటి సామరస్యాన్ని కోల్పోయి ఇల్లు నరకం చేస్తారు. అత్త కోడలి దృష్టి నుంచి ఆలోచించినా కోడలు అత్త వైపు నుంచి ఆలోచించినా చాలా సమస్యలు రావు. ఉన్నవి తొలిగిపోతాయి. నేటికీ ఈ సూత్రం పాటించే అత్తాకోడళ్లు మాత్రం తక్కువ. అలాంటివారిని తట్టిలేపే సినిమా ‘ఆడదే ఆధారం’. తమిళంలో నటుడుగా, నాటక కర్తగా, దర్శకుడుగా ప్రఖ్యాతి పొందిన విసు ఈ సినిమాను మొదట తెలుగులో (1988) తీసి ఆ తర్వాత తమిళంలో చేశాడు. రెండు చోట్లా విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇరుగు పొరుగు ఎలా చస్తే మనకేంటి అనుకునే మనుషులకు బదులు... సాటి మనిషి కష్టాన్ని పట్టించుకునే రేడియో మామగా అతడు ఆకట్టుకుంటాడు. ఇందులో సీతారామశాస్త్రి రాసిన ‘మహిళలూ మహరాణులు’... ‘నేలమ్మా నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ’.. పాటలు రేడియోలో చాలాకాలం వినిపించాయి... వినిపిస్తున్నాయి. ప్రపంచం దాని చలన సూత్రాల ఆధారంగా అది కదలుతూ ఉండొచ్చు. కాని ఇంటి చలన సూత్రాలు సరిగ్గా ఉన్నప్పుడే దాని చలన సూత్రాలు సజావుగా సాగుతాయి. ఇల్లు సజావుగా ఉండాలంటే కుటుంబం సజావుగా ఉండాలి. కుటుంబం సజావుగా ఉండాలంటే స్త్రీ తనను తాను గమనించుకుంటూ ఏమరుపాటుగా ఉండాలి. తను స్త్రీ. ఎదురుగా ఉన్నది కూడా స్త్రీయే. ఆమే అగ్ని. ఆమే జడి. ఆడదే ఆధారం. కథ ఆడనే ఆరంభం. – కె -
‘మాలె ’ వివాదంలో జీఎంఆర్‌కు ఊరట
• ఎయిర్‌పోర్టుపై ఆర్బిట్రేషన్‌లో మాల్దీవుల ప్రభుత్వానికి చుక్కెదురు • జీఎంఆర్‌కు 270 మిలియన్ డాలర్లు • చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాలె అంతర్జాతీయ విమానాశ్రయ వివాదంలో ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ మాలె ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (జీఎంఐఏఎల్)కు ఊరట లభించింది. ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు రద్దు నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ జీఎంఐఏఎల్‌కు 270 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,800 కోట్లు) పరిహారం చెల్లించాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. రుణ మొత్తం, ప్రాజెక్టుపై పెట్టిన పెట్టుబడి, లీగల్ ఖర్చులు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయని జీఎంఆర్ వెల్లడించింది. మాల్దీవుల ప్రభుత్వం .. ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం సరికాదన్న తమ వాదనలే గెలిచాయని జీఎంఆర్ ప్రతినిధి పేర్కొన్నారు. ‘ట్రిబ్యునల్ ఆదేశాలు.. మా కార్పొరేట్ గవర్నెన్స్, అత్యున్నత స్థాయి ప్రమాణాలు, వ్యాపార విలువల పట్ల జీఎంఆర్ గ్రూప్ నిబద్ధతను నిరూపించేవిగా ఉన్నాయి’అని వ్యాఖ్యానించారు. ఇబ్రహీం నాసిర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఆధునీకరణ, పాతికేళ్ల పాటు నిర్వహణకు సంబంధించి మాల్దీవుల ప్రభుత్వం (జీవోఎం) మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ కంపెనీ (ఎంఏసీఎల్)తో జీఎంఐఏఎల్ 2010లో ఒప్పందం కుదుర్చుకుంది. జీఎంఆర్ ప్రణాళికల ప్రకారం ఈ ప్రాజెక్టులో సుమారు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఈ నిధుల్లో సింహభాగం 358 మిలియన్ డాలర్లు యాక్సిస్ బ్యాంకు రుణంగా అందించేలా జీఎంఆర్ ఏర్పాట్లు చేసుకుంది. అయితే, ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఫీజు కింద 25 డాలర్ల వసూలుపై వివాదం తలెత్తడం, ప్రాజెక్టు కేటాయింపు ప్రక్రియలో గత ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదంటూ ఆరోపణలు రావడం తదితర పరిణామాల మధ్య 2012లో జీఎంఐఏఎల్ ప్రాజెక్టును మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఏకపక్షంగా జరిగిందని, దీన్ని సవాల్ చేస్తూ జీఎంఆర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. నష్టపరిహారం ఇప్పించాలంటూ కోరింది. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య అంతర్జాతీయ ట్రిబ్యునల్ తాజాగా తుది ఆదేశాలు ఇచ్చింది. -
కబడ్డీ ఎంపికలకు విశేష స్పందన
కడప స్పోర్ట్స్ : జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీనగర్ నగరపాలకోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన 64వ జిల్లాస్థాయి సీనియర్ పురుషుల, మహిళల కబడ్డీ ఎంపికలకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఈ ఎంపికలకు క్రీడాకారులు తరలివచ్చారు. ఈ క్రీడా ఎంపికలను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు తోటృష్ణ, కార్యదర్శి చిదానందగౌడ్, గౌరవాధ్యక్షుడు హరిప్రసాద్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబడ్డీ ఎంపికలకు ఇంత చక్కటి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి, కోచ్ టి. జనార్ధన్ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ప్రకటించారు. అంతకు మునుపు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులుగా ఎంపికైన సంపత్‌కుమార్, ఆనందమ్మ, నిత్యప్రభాకర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు మహేష్‌రెడ్డి, గోవిందు నాగరాజు, వైవీయూ వ్యాయామబోర్డు కార్యదర్శి డా. కె. రామసుబ్బారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటసుబ్బయ్య, పుల్లారావు, సుబ్బన్న, పి.సి. వెంకటరమణ, శేఖర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. పురుషుల జట్టు: ఎం. జనార్ధన్‌రెడ్డి, సుధీర్, వై. రవిశంకర్, ఎస్. ఓబులేసు, పి. మహేష్‌బాబు, బి. నాగేంద్ర, టి. గంగాధర్‌రెడ్డి, పి. రెడ్డయ్యరెడ్డి, కె.గిరీశ్‌కుమార్, కె. వీరకుమార్‌రెడ్డి, ఎం. శివగణేష్‌రెడ్డి, పి. కళ్యాణ్చరణ్తేజ. స్టాండ్‌బై : టి.సి. రాకేష్, పి.నాగేంద్ర, కె.ప్రశాంత్, ఎం.రాజకుమార్నాయక్, కె.మహేష్‌కుమార్. మహిళల జట్టు : టి.శ్రీవాణి, బి.సుహాసిని, ఎం. రాణి, కె.నాగమునీశ్వరి, ఎస్.పూజ, యు.ఉమామహేశ్వరి, టి.పవిత్ర, సావిత్రి, పి. సౌజన్య, కె.రాణి, ఎం.ధనలక్ష్మి, వై.గౌరి. స్టాండ్‌బై : పి. భార్గవి, ఆర్.మనీష్, వి.శ్రీలత, ఎ.లక్ష్మిపూర్ణిమ, కె.శిల్ప. -
శవమై తేలిన మరో ఖడ్గమృగం!
అసోంః కాజీరంగా నేషనల్ పార్క్ సమీపంలో మరో ఖడ్గమృగం శవమై తేలింది. ఇప్పటికే ఎన్నోసార్లు వేటగాళ్ళ బారిన పడి ఆ మూగజీవాలు మృత్యు వాత పడ్డ విషయం తెలిసిందే. వాడిగా ఉండే వాటి కొమ్ములకోసం వేటగాళ్ళు ఏంకగా వాటి ప్రాణాలనే బలితీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కాగా తాజాగా కొమ్ములతోసహా ఓ మగ ఖడ్గమృగం కనిపించి కలకలం రేపింది. అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్ (కేఎన్ పీ) సమీపంలో ఖడ్గ మృగం మృతదేహం కనిపించింది. పార్కు సమీపంలోని జపోరిపత్తర్ గ్రామస్థులు కొమ్ములతోపాటు ఉన్న జంతువు శరీరాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. కొహోరా రేంజ్ లోని మికిర్జన్ అటవీప్రాంతం డిప్లూ నదిలో ఖడ్గమృగం శరీరం కొట్టుకొని వచ్చినట్లు జపోరిపత్తర్ గ్రామస్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో కేఎన్పీ అధికారులు, పశువైద్యులు శరీరాన్ని పరిశీలించి.. ఆ మృగానిది సహజ మరణంగా నిర్థారించారు. ఎంతో దృఢంగా ఉండే ఖడ్గమృగం కొమ్ములను సురక్షితంగా భద్రపరిచేందుకు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఒక రోజు అమ్మాయిగా, మరో రోజు అబ్బాయిగా....
సిడ్నీ: ‘అన్నీ’ అనే ఆస్ట్రేలియాకు చెందిన విద్యార్థి లేదా విద్యార్థిని చాలా చిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక రోజు మగవాడిలా, మరో రోజు ఆడపిల్లలా ప్రవర్తిస్తున్నారు. ఒక రోజు నెత్తిన ఫూలు పెట్టుకొని స్కర్టు వేసుకుంటే మరో రోజు క్రాఫ్ దువ్వుకొని కోటు వేసుకుంటున్నారు. ఆమె లేదా అతనికి ఇప్పుడు 12 ఏళ్లు. ప్రధానంగా పదవ ఏటనే ఈ సమస్య ఉత్పన్నమైంది. ‘అన్నీ’ని చిన్నప్పటి నుంచి అమ్మాయిలాగా పెంచారు. పదవ ఏట అడుగుపెట్టగానే పురుష లక్షణాలు బయటపడ్డాయి. పోనీ పురుషుడిగా గుర్తిద్దామంటే వారం రోజులకన్నా ఎక్కువగా ఆ లక్షణాలు ఉండడం లేదు. మళ్లీ ఆడ లక్షణాలు వస్తున్నాయి. అలా మొదట వారానికోసారి మారే ఆడ, మగ లక్షణాలు ఇప్పుడు రోజు రోజుకు మారుతున్నాయి. ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘జెండర్ ఫ్లూయిడ్ లేదా నాన్ బైనరీ చిల్డ్రన్’ అని పిలుస్తారు. ‘నేను ఓ రోజు మార్నింగ్ వాక్కు వెళ్లిరాగానే నేను పూర్తిగా మగవాడినని అనిపిస్తుంది. నూటికి నూరు శాతం మగవాడిననే విశ్వసిస్తాను. అలాగే ప్రవర్తిస్తాను. మరో రోజు ఆడపిల్లననిపిస్తుంది. నాకు తెలియకుండానే నేను అచ్చం ఆడపిల్లలానే ప్రవర్తిస్తుంటాను. కొన్ని సార్లు నేను ఆడపిల్లనా, మగ పిల్లవాడినా కూడా నాకు అర్థం కాదు. ఇంతకుమించి నాకు ఏమీ తెలియదు’ అని అన్నీ బుధవారం మీడియాతో వ్యాఖ్యానించింది. ‘మా అమ్మాయి లేదా అబ్బాయి రోజుకోరకంగా ప్రవర్తిస్తున్నారు. ఒక రోజు అబ్బాయిలా, మరో రోజు అమ్మాయిలా మారిపోతున్నారు. ఒక్కొక్కసారి రెండూలా ప్రవర్తిస్తున్నారు. వైద్యులకు చూపించినా సమస్య పరిష్కారం అవడం లేదు. వయస్సు పెరుగుతున్నా కొద్దీ మగవాడిలా లేదా ఆడామెలా బలమైన లక్షణాలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. శారీరకంగా కంటే మానసికంగానే ఆడ లేదా మగ లక్షణాలు ఎక్కువ ఉంటున్నాయి’ అని అన్నీ తల్లి మారిట వివరించారు. మొదట్లో అన్నీకి ఏ దుస్తులు కొనాలన్నది పెద్ద సమస్యగా ఉండేదని, అందుకనే రెండు రకాల దుస్తులు కొనడం అలవాటు చేసుకున్నామని ఆమె చెప్పారు. అన్నీకి స్కూల్లో కూడా సమస్యలు వస్తున్నాయి. ఓ రోజు బాయ్స్ టాయ్లెట్లోకి వెళితే మరో రోజు గర్ల్స్ టాయ్లెట్లోకి వెళ్లడం అన్నీకే కాకుండా తోటి పిల్లలకు ఇబ్బందిగా తయారయింది. అమ్మాయిలు, అబ్బాయిలతో కలుపుగోలుగా తిరగడం కూడా అన్నీకి ఇబ్బందిగా ఉంటోంది. -
చెప్పుకోవాలన్నా చెప్పుకోలేని బాధ...
మన సమాజానికి కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. ‘బాధితులు అనగా మహిళలు, పీడకులు అనగా పురుషులు’ అనేది కూడా అలాంటి అమూల్య నిశ్చితాభిప్రాయమే! మగవాడు బలవంతుడు, ఆడది బలహీనురాలు అనేది కూడా సమాజానికి గల మరో నిశ్చితాభిప్రాయం. కర్మకాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సీన్ రివర్సయి... ఎవడైనా మగాడు బలహీనుడిగా తేలితే... ఇక వాడి బతుకు నరకప్రాయంగా మారుతుంది. ఇంట్లో భార్య గాఠిగా ప్రైవేటు చెబితే, కుక్కిన పేనులా ఓర్చుకుని పంటిబిగువున బాధను దిగమింగాలే గానీ, పొరపాటున గావుకేకలు పెట్టాడో.. ఇక వాడి బతుకు వీధిన పడ్డట్లే! అలాగని ఇదంతా ఆధునిక చట్టాల వల్ల వాటిల్లిన అధునాతన అనర్థమేమీ కాదు, పురుష పుంగవులపై పీడన పురాతన కాలం నుంచే ఉంది. దురదృష్టవశాత్తు అలాంటి నిర్భాగ్యుల గాథలేవీ చరిత్రకెక్కలేదు. ఇందుకు పెద్ద కారణమేమీ లేదు, చరిత్రను రాసిన వాళ్లు కూడా మహిళాజన పక్షపాతులు కదా! మచ్చుకు ఒక ఉదంతాన్ని ముచ్చటించుకుందాం... అగ్రరాజ్యాలలో ఒకటిగా ఎన్నదగిన ఫ్రాన్స్ శతాబ్దాల కిందటే ఆధునికతకు మార్గదర్శిగా వెలుగొందేది. ఫ్యాషన్‌కు పుట్టినిల్లయిన ఫ్రాన్స్‌ను అప్పటి చరిత్రకారులు సాక్షాత్తు భూతల స్వర్గంగా వేనోళ్ల కొనియాడేవారు. అంతటి భూతల స్వర్గ సమానమైన ఫ్రాన్స్‌లో సైతం సామాన్య పురుషాధముల బతుకులు కడు హీనంగా ఉండేవి. ఐదారు శతాబ్దాల కిందట ఫ్రాన్స్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది. అప్పట్లో అక్కడ పెళ్లాం చేతిలో దెబ్బలు తిన్న మగాళ్లు నోర్మూసుకుని పడి ఉండాల్సిందే! వీధికెక్కి లబోదిబోమంటూ గగ్గోలుపెడితే, పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. పెళ్లాం చేతిలో దెబ్బలు తిని గగ్గోలు పెట్టే మగాళ్లను గాడిద మీదకెక్కి ఊరేగించేవాళ్లు. అలాంటి మగాధముడిని పిల్లా జెల్లా కూడా గేలిచేస్తూ వెంబడించేవాళ్లు. ఇక అప్పటి నుంచి సదరు మగాధముడు ఊరందరికీ ఉచిత వినోదంగా మారేవాడు. మగాళ్ల పట్ల ఇలాంటి దారుణాలు మరెన్ని జరిగాయో మరింత లోతుగా పరిశోధిస్తే గానీ వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవు. దాష్టీకాలకు పాల్పడే మగాళ్లను చరిత్ర క్షమించదని బెదిరిస్తూ ఉంటారు గానీ, దాష్టీకాలకు గురైన మగాళ్ల పట్ల ఇంతటి వివక్ష చూపిన చరిత్రను మగపుట్టుక పుట్టిన వాడెవడైనా క్షమించగలడా? -
జీవితాన్ని మార్చిన పాఠం!
జ్ఞాపకం ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే మాటను నా చిన్నప్పటి నుంచీ వింటున్నాను. అయితే ఆ వాక్యాన్ని నేను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. బాల్యంలో ‘తెలియని తనం’ వల్ల కావచ్చు, యవ్వనంలో ‘పురుషాహంకారం’ వల్ల కావచ్చు. కారణం ఏదైతేనేం... మగవాడినన్న అహం నాలో ఒక పాలు ఎక్కువగానే ఉండేది. ఆ అహం ఎంత చెడ్డదో తర్వాత నాకు అర్థమైంది. అయిదు సంవత్సరాల క్రితం... నాకు పెళ్లయింది... సునందతో. బాగా చదువుకున్న అమ్మాయి. చక్కని ఉద్యోగం చేస్తోంది. అందంగా ఉంటుంది. అన్ని రకాలుగానూ నాకు తగిన జోడీ. అందుకే చూడగానే ఓకే అన్నాను. ఆనందంగా తన మెడలో తాళి కట్టాను. ఓ నెలరోజుల పాటు తనే నా లోకం. మా ఇంట్లో కొన్ని రోజులు, వాళ్లింట్లో కొన్ని రోజులు, హనీ మూన్‌లో కొన్ని రోజులు... అంతా ఆనందంగా గడిచిపోయింది. అంతలో లీవు అయిపోయింది. ఉద్యోగంలో చేరే రోజు వచ్చింది. ఆ రోజు నేను ఆఫీసుకు బయలు దేరుతుంటే సునంద అంది... ‘‘నేనూ ఇవాళ్టి నుంచి ఆఫీసుకు వెళ్లిపోతానండీ.’’ ఆ మాట సూటిగా నా అహం మీద దెబ్బకొట్టింది. మనసులో చిన్న అలజడి. ‘‘ఇంకా ఉద్యోగం ఎందుకు? మానెయ్’’ అన్నాను. ‘‘ఉద్యోగం చేస్తే తప్పేమిటి?’’ అందామె అమాయకంగా. ‘‘తప్పు కాదు... తప్పున్నర. నువ్వు ఉద్యోగం చేస్తున్నావని తెలిస్తే నా ఫ్రెండ్స సర్కిల్లో నా పరువు పోతుంది. అయినా ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నీకేమిటి? మనకేం తక్కువని?’’... అలుపు లేకుండా గడగడా అనేశాను. ఆమె ముఖం చిన్నబోయింది. ‘‘తక్కువయ్యి కాదుగా ఉద్యోగం చేసేది’’ అంది తడబడుతూ. నా అహం మరోసారి అరిచి గోల చేసింది. ‘‘మా ఇళ్లల్లో ఆడవాళ్లెవరూ ఉద్యోగం చేయరు. అందుకే నువ్వూ చేయకూడదు. ఇక ఆ విషయం వదిలెయ్’’ అనేసి మరో మాటకి చాన్స ఇవ్వకుండా వెళ్లిపోయాను. బహుశా ఆ రోజు తన కళ్లలో నీళ్లు చిప్పిల్లి ఉండవచ్చు. కానీ అది తెలుసు కోవడానికి నేను వెనక్కి తిరిగి తనవైపు చూడలేదు. ఆరోజే కాదు... ఏ రోజూ నేను తనని నాతో సమానంగా చూడ లేదు. నా రెక్కల వెనుక ఉండి జీవించ డమే నీకున్న ఏకైక హక్కు అన్నట్టుగా ప్రవర్తించాను. కానీ నా అహం విరిగి ముక్కలై, నా కళ్లు నేల మీదికి వచ్చే రోజు రానే వచ్చింది. ఓరోజు మేడ మెట్లు దిగుతూ కాలు జారి పడ్డాను. వెన్నుపూస విరిగింది. చక్రాల కుర్చీకే జీవితం అంకితమైంది. చేతకాని వాడిలా, చేవలేని వాడిలా మిగిలిపోయాను. అమ్మానాన్నలు వయసుడిగినవాళ్లు. ఏమీ చేయలేరు. నా వైద్యం కోసం అందినకాడల్లా అప్పుడు చేశారు. అది కాస్తా తడిసి మోపెడయ్యింది. నేను వాటిని తీర్చడం కాదు కదా, వాళ్లకి, నా భార్యకి పట్టెడు మెతుకులు కూడా పెట్టలేని పరిస్థితి. నాలో నేనే కుమిలి పోయాను. ఆ సమయం లోనే నా భార్య నా దగ్గరకు వచ్చింది. ‘‘ఏమండీ... మీకు అభ్యంతరం లేకపోతే నేను ఉద్యోగం చేస్తాను’’ అంది. ఏం సమాధానం చెప్పను! తన చేతులు పట్టుకుని ఏడ్చేశాను. నా అహం కరిగి కన్నీటితో పాటు జారిపోయింది. ‘ఇందులో మీరు తక్కువగా ఫీలవ్వాల్సిందేం లేదండీ. మీరు బాగున్నప్పుడు నన్ను చూసుకున్నారు. నేను బాగున్నప్పుడు మిమ్మల్ని చూసుకుంటాను. నేను మీలో సగమే కదా’ అంది తను. అవును. తను నాలో సగమే. కానీ అలా నేను ఎప్పుడూ ఆలోచించలేదే. నేను ఎక్కువ, తను తక్కువ... నాతోడిదే తన బతుకు అనుకున్నాను. కానీ ఆ రోజు తన తోడు లేకుండా నాకు బతుకే లేదని తెలుసుకున్నాను. అహాన్ని వీడి నేడు ఆమె నీడలో హాయిగా జీవిస్తున్నాను. - ఆర్.వి.సాగర్, విజయనగరం -
ఆమే యజమాని!
పరిగి: తరతరాల వివక్షకు తెర పడనుంది. పితృస్వామ్య వ్యవస్థలో కొత్త శకం ఆవిష్కృతం కానుంది. శతాబ్దాలుగా పురుషాధిక్యతయే పరంపరగా సాగిన సమాజంలో మహిళకు సరికొత్త గుర్తింపు దక్కనుంది. కుటుంబ యజమానురాలిగా చరిత్రలో పేరు లిఖించుకోనున్న తరుణీ తరుణం ఆసన్నమైంది. గత ప్రభుత్వాలు పురుషులను కుటుంబ యజమానులుగా గుర్తిస్తూ రేషన్ కార్డుల అందజేయగా.. కొత్త రాష్ట్రంలో.. కొత్త సర్కారు మహిళల పేరిటఆహార భద్రతా కార్డులు అందజేయనుంది. ఈ క్రమంలోనే వారంరోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. కుటుంబ యజమానుల స్థానంలో మహిళల పేర్లను చేరుస్తూ జాబితాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మెట్టినింట ఇన్నాళ్లూ ఇల్లాలిగా.. తల్లిగా పలు పాత్రలు పోషిస్తూ వచ్చిన మహిళలు ఇకమీద అధికారికంగా కుటుంబ యజమానుల పాత్రలో ఒదిగిపోనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మొదటిసారిగా మహిళల పేరిట ‘ఇందిరమ్మ’ గృహాలు మంజూరు చేయగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు నిర్ణయంతో పూర్తి స్థాయిలో మహిళలు కుటుంబ యజమానుల అవతారమెత్తనున్నారు. బియ్యంతో కలిపి మూడు సరుకులే.. అమ్మహస్తం పేరుతో గత ప్రభుత్వం సరఫరా చేసిన తొమ్మిది రకాల సరుకులకు ఇక స్వస్తి పలికారు. ప్రస్తుత ప్రభుత్వం ఒక వ్యక్తికి ఇచ్చే నాలుగు కిలోల బియ్యం స్థానంలో ఆరు కిలోలు ఇవ్వనుండగా బియ్యం తోపాటు అరకిలో చక్కెర, కిలో కందిపప్పు కలిపి మూడు రకాల సరుకులు మాత్రమే ఆహారభద్రతా పథకంలో సరఫరా చేస్తున్నారు. -
సంసారంలో నా పాత్ర... ఇడ్లీ పాత్రేనా?
ఉత్త(మ)పురుష నేనేం చెప్పబోయినా... మా శ్రీవారు చెప్పే ఒకే ఒక మాట... ‘‘నీకేం తెలియదు నువ్వూరుకో’’. మా వారే కాదు... ఈ లోకంలో చాలా మంది శ్రీవార్ల బజ్ వర్డ్ ‘‘నీకేం తెలియదు... నువ్వూరుకో’’. అవును... ఒప్పుకుంటాను. మా ఆయన ఆలోచనలన్నీ ఉదాత్తమైనవే. ఆయన దృక్పథాలన్నీ ఉన్నతమైనవే. కోనసీమలో ప్రమాదం జరగగానే అందులో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ల నిర్లక్ష్యం ఉందా లేదా? పాపం... ఆ మృతులకు బాధ్యులెవరు? ఈ అంశాలన్నింటిపైనా వాళ్ల ఫ్రెండ్స్ మధ్య హోరాహోరీ చర్చ జరుగుతుంటుంది. ఈ తీవ్రస్థాయి వాదోపవాదాలు సరే... ప్రతి నెలా గ్యాస్‌పైన బాదుడు ఉంటుందట... ఆ మేరకు మన ఆదాయం పెంపుదల ఉంటుందా లేదా? ఒకవేళ ఉంటే ఆ అదనపు ఆదాయం ఎలా సంపాదించాలి అన్న విషయంపై ఎందుకు చర్చ జరగదు? ఒక్కోసారి ఆ ఫ్రెండ్స్ శ్రుతి మించి కీచులాడుకుంటుంటారు. కానీ చివరకు మిగిలేదేమిటి? అన్నం తింటే నిరపకారమైన భుక్తాయాసమైనా ఉంటుంది. కానీ ఈ వాదులాటల తర్వాత అపార్థ అపకారాల ఆవేశకావేశాలు మాత్రం మిగులుతాయి. నేనడిగే ఏ ప్రశ్నకూ మావారి దగ్గర సమాధానం ఉండదు. పెళ్లయి పుష్కరం దాటింది, మన దగ్గర మిగిలిందేమిటి? ఠక్కున ఎవరో వచ్చి చాలా చీప్‌గా ఏ ఐదారు లక్షలకో మంచి స్థలాన్ని ఆఫర్ చేస్తున్నారంటే తీసుకోగలరా? సొంతింటి కల ఎప్పటికైనా నెరవేర్చగలరా? బుజ్జిది ఎదిగొస్తోంది. రేపు ఇంటర్ తర్వాత ఏడాదికి లక్ష చొప్పున ఫీజు కట్టగలిగే స్థోమత ఎప్పటికైనా వస్తుందా? లేదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నాలో ఉద్భవిస్తుంటాయి. కానీ ఆయన మదిలోకి ఇవెందుకు రావు. ఆయనకు వచ్చే అద్భుత, అమోఘ, అత్యుత్తమ, ఉదాత్త ఆలోచనలకు బదులుగా ఈ చిన్న చిన్న సందేహాలు వస్తే మా జీవితం ఎంత బాగుంటుంది, ఎంతలా బాగుపడుతుంది! ఈ ప్రస్తావన ఏదైనా తెచ్చినప్పుడు మా శ్రీవారు చెప్పే స్టాక్ డైలాగ్ ఒక్కటే... ‘‘నీకేం తెలియదు... నువ్వూరుకో’’ అని. ఇవ్వాళ్ల టిఫిన్ కోసం ఇడ్లీ చేద్దామని డిసైడ్ చేశా. నేను లేవనెత్తిన భావాలూ, నాలో ఉద్భవించిన ప్రశ్నలన్నీ ఇడ్లీ పాత్ర కింద నీళ్లలా ఉడుకుతున్నాయి. ఇడ్లీ పాత్రలోని రేకు గుంటలో ఇడ్లీ పిండి పోస్తూ, అది గుంటకు అంటుకోకుండా ఉండటానికి వాయి వాయికీ నూనె రాస్తున్నా. ఇలా రాస్తూ ఉంటే నాకో ఆలోచన వచ్చింది. అవునూ... కుటుంబంలో నా పాత్ర ఏమిటి? నాలో మెదిలే భావాల్ని చూసుకుంటూ ఉంటే కుటుంబంలో నా పాత్ర... అచ్చం ఈ ఇడ్లీ పాత్ర లాగే ఉంది. అందరికీ ఇడ్లీ కావాలి. అందుకోసం ఇడ్లీ రేకులోని గుంటలో పిండి పోయాలి. కానీ ఆ పిండి మాత్రం గుంటకు అంటకూడదు. ఇదీ ఇడ్లీ తయారీ సిద్ధాంతం. నా జీవితమూ అంతేనేమో. నేనూ ఇడ్లీ పాత్రను. ఇడ్లీ రేకును. ఇడ్లీ తయారీ కోసం లాగా కాపురం నడవడానికి నేను కావాలి. కానీ నేనేదైనా ప్రశ్న అడగబోతే... ‘‘నీకేం తెలియదు... నువ్వూరుకో’’ అనే మాటను నూనెలా వాడతారు. ఆ నూనెను పూసి జారుకుంటారు, జారిపోతారు. కానీ నేను మావారిని అడగదలచుకున్న ప్రశ్నలన్నీ ఇడ్లీపాత్రలోని నీళ్లలా కాసేపు కుతకుత ఉడికి, ఆ తర్వాత ఆవిరిలా మారి, వంట పూర్తయ్యే సరికి ఇంకిపోతాయి. ఇక ఇడ్లీలన్నీ తయారయ్యాక దాన్ని కడిగేసి, ఇడ్లీ పాత్రను బోర్లేసి, రేకులన్నీ శుభ్రం చేసేసి మూల పెట్టేస్తాం. అంతే! మావారెప్పుడు మారుతారో, ఆర్జన అవసరం ఎప్పుడు తెలుసుకుంటారో, సంపాదనతో కుటుంబ జీవన ప్రమాణాలు ఎప్పుడు బాగుపరుస్తారో అప్పుడు నేనూ, మావారూ ఇడ్లీ రవ్వ, రుబ్బిన మినప్పిండీ అవుతాం. అది జరగనంతకాలం... ఈ కుటుంబంలో నా పాత్ర కేవలం ఇడ్లీ పాత్ర. అవును కేవలం ఇడ్లీ పాత్రే. - వై! -
మగనోరు తీరు వేరు!
ఉత్త(మ) పురుష నేను చెప్పే మాటలు మా శ్రీవారికి అర్థం కావో లేక నేను మంచి చెబితే అది ఆయనకు చెడుగా వినిపిస్తుందో నాకు తెలియదుగానీ... ఎందుకో ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరులే అన్న పాపులర్ పాటకు సంసారలోకం సరిగ్గా వ్యతిరేకంగా ఉందని నా అభిప్రాయం. అసలు విషయం మొదలుపెట్టేముందు కాస్త ఉపోద్ఘాతం మాట్లాడుకుందామా? ‘అల్పపీడనం’ అన్న మాటకు అర్థం ఏమిటో చూద్దాం. అంటే... పీడించడం తక్కువగా ఉండటం లేదా పీడన స్వల్పంగా ఉండటం. అలాంటప్పుడు అల్పపీడనం మంచిదా కాదా మీరే చెప్పండి. నాకూ, మా శ్రీవారికీ కాస్త ఎడమొహం పెడమొహం మొదలుకాగానే ఆయన వ్యాఖ్యలూ మొదలు... ‘అబ్బ... ఇంట్లో అల్పపీడనం ఏర్పడింది’ అంటూ. ఇదేదో సరదాగా జోక్‌గా అన్నాలెండి. కానీ నా మాటల్లోని పాజిటివిటీ కాస్తా మా వారికి ఎందుకు నెగెటివ్‌గా అనిపిస్తుందో నాకింకా తెలియదు. ఆయన పొద్దున్నే నిద్ర లేవగానే ‘ఈరోజు నుంచి వాకింగ్‌కు వెళ్లరాదా’ అన్నాను. అంతే... ‘నేను సుఖపడితే నువ్వు చూడలేవు. కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వవు’ అంటూ నస. ఆయన ప్రశాంతంగా పడుకుంటే నాకేమిటి బాధ. ఆఫీసుకు బయల్దేరుతూ బెల్టు పెట్టుకునే ముందు మళ్లీ నస. పొట్ట పెరిగిపోయి బెల్టు పట్టక అదికాస్తా దిగాలుగా నేలముఖం చూస్తోంది. ఎవరో గొప్పనాయకుడు మరణించాక జెండాను అవనతం చేసినట్టుగా ముఖం వేలాడేసుకున్నట్లుగా ఉంది దాని బకిల్. దాంతో తన వయసు కాస్త పెరిగినట్టూ, ఆరోగ్యం తగ్గినట్టూ అనిపిస్తోందని బోల్డంత సేపు బాధపడ్డారు. అందుకే ఆయన మంచి కోసమే ‘ఈరోజు నుంచైనా వాకింగ్ చేయరాదా’ అన్నాను. అంతే... ‘చేయరాదు... నన్ను సుఖంగా ఉండనివ్వకూడదనే నీ అభీష్టాన్ని నెరవేరనీయరాదు’ అంటూ కొట్టిపారేశారు. ఇలాంటిదే మరో సంఘటన. గోదావరి ఒడ్డునే ఉన్న ఊరి నివాసులమైనందువల్ల... అన్ని పనులకూ పడవ మీదే అవతలి ఒడ్డుకు వెళ్లాలి. ‘ఇవ్వాళ్ల నది మంచి పోటు మీద ఉందట. ఇప్పుడు ప్రయాణం పెట్టుకోకపోతేనేం?’ అన్నాను. అంతే... గోదావరి కాస్తా మావారి ఒంట్లో రక్తమై ప్రవహించింది. గంగమ్మ పోటు కాస్తా ఆయన నరాల్లోని రక్తానికి బదిలీ అయ్యింది. ‘వెళ్లితీరాల్సిందే’ అంటూ కటువుగా అనేసి బయటకెళ్లారు. ఆ మాటనైతే కటువు ధ్వనించడం కోసం ‘పొడిపొడిగా’ అన్నారా... కాసేపట్లోనే తడితడిగా మారిపోయి ఇంట్లోకి వచ్చారు. అదేమిటంటే... మూడు లేదన్నారు. మూడు లేకపోవడం కాదూ... మూడంకేసుకొని పడుకోవాలనీ కాదు. వాస్తవం ఏమిటంటే... మూడోనెంబరు ప్రమాదహెచ్చరిక జెండాను అక్కడ ఎగరేశారట. ఏమిటో ఈ మగాళ్లు... ఎగిరే జెండాలా గర్వంగా నిలపాల్సిన బెల్టును తల వేలాడేసేలా చేసుకుంటారు. తెరచాపలు గాలికి కొట్టుకుపోతూ తుపాన్లో జెండాలా విరగబడే సమయాల్లో పొగరుగా తలెగరేసి వెళ్లి తలవంపులు తెచ్చుకుంటారు. మగాళ్లెవరూ ఏమీ అనుకోకపోతే ఒక్క మాట చెప్పాలనుంది. ఆడది నోరేసుకు బతుకుతుంది అంటూ మా మీద అక్కసు వెళ్లగక్కుతుంటారు ఈ మగాళ్లు. అప్పుడెప్పుడో విజయావారు తమ సినిమాలో ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ అని పాట పెట్టినందుకు ఆ మాటనే మకుటాయమానం చేసుకుని నిత్యం వల్లిస్తుంటారు. దాన్నే మళ్లీ మళ్లీ పాడుతుంటారు. ఎందుకలా...? ఎందుకనీ...? ఎందుకంటే వాళ్లకు నోరుంది. వాళ్లకే నోరుంది. లోకం నోరున్నవాళ్లది. ఇంతకంటే విపులీకరించాల్సిన అవసరం వేరే ఏదీ లేదనుకుంటాను. అర్థమయ్యేవాళ్లకు అర్థమై తీరుతుంది లెండి. ఎందుకంటే... వాళ్లు మగాళ్లు. ఆడవాళ్లకంటే ఓ పట్టాన అర్థం కాదుగానీ... మగాళ్లకు అర్థంకానిదంటూ ఏదీ ఉండదు. -
భారత రాయబారి వాహనంపై దాడిని ఖండించిన మహమ్మద్ నషీద్
మాల్దీవుల రాజధాని మాలెలో భారత రాయబారి రాజీవ్ షహరి వాహనంపై నిన్న సాయంత్రం ఆగంతకులు రాళ్ల దాడిని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ఆ ఘటన వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఘటనకు పాల్పడిన ఆగంతకుల చర్యను మతిలేని చేష్టలుగా వ్యాఖ్యానించారు. మాలెలోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఆగి ఉన్న రాజీవ్ షహరి వాహనంపైన మొటర్ సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి రాళ్ల దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని, కానీ రాళ్ల దాడితో కిటికి అద్దాలు పగిలిపోయాయని, అలాగే కారు ధ్వంసమైందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దక్షిణం: అవీ.. ఇవీ.. మగాడివే!
ఇంటర్నెట్లో అమ్మాయిల మీద వచ్చే జోకులతో పోల్చుకుంటే అబ్బాయిలపై ఉన్న జోక్స్ చాలా తక్కువ. పురుషుడు మాట్లాడేటపుడు దానిని విశ్లేషించడానికి మన మెదడు అనుభవించే ఒత్తిడి కంటే స్త్రీలు మాట్లాడినపుడు దాన్ని అర్థం చేసుకోవడానికి పురుషుడి బ్రెయిన్ చాలా ఎక్కువ కష్టపడుతుందన్నది ఓ పరిశోధన ఫలితం. పురుషుడు రోజుకు సగటున 8 సార్లు నవ్వితే, స్త్రీ 62 సార్లు నవ్వుతుందట. దంపతుల్లో వాగ్వాదాలకు ప్రధాన కారణం... అమ్మాయి తన తండ్రి లక్షణాలను, మంచితనాన్ని భర్తలో ఆశించి నిరాశకు గురికావడమేనట. స్త్రీ - పురుషుల మెదళ్ల పనితీరు ఒకే అంశంపై వేరువేరుగా ఉంటుంది చాలా విషయాల్లో! 1900 ముందు అంతా మగ నర్సులే ఉండేవారట. ఇపుడు వారి శాతం ఆరు లోపే! కండర శక్తి స్త్రీ కంటే పురుషుడికి యాభై శాతం ఎక్కువట. కాంప్లిమెంట్స్ ఇష్టపడేది స్త్రీలే అయినా... వాటిని పద్ధతి ప్రకారం స్వీకరించేది మాత్రం మగాళ్లే. ప్రజాస్వామ్యం- వరుడు ! ప్రజాస్వామ్య రాజ్యమైన భారతదేశంలో అన్ని చోట్లా ప్రజాస్వామ్యం వర్ధిల్లడం లేదు. ఇది రాజకీయ విమర్శ కాదు, వధువులను వెతుకుతున్న వరుల విమర్శ! అవును, ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణం... మెజారిటీ ప్రజల అభిప్రాయాలు చెల్లడమే కదా. కానీ, మన దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పులుల కంటే వేగంగా అమ్మాయిల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో వారిపుడు దేశంలో సంఖ్యాపరంగా మైనారిటీలు. కానీ వారు మైనారిటీలోకి వెళ్లేకొద్దీ వారి చెల్లుబాటు పెరుగుతోంది. అధిక సంఖ్యలో ఉన్న అబ్బాయిల మాట చెల్లకపోగా అమ్మాయిల మాటే చెల్లుతోంది. పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతి అబ్బాయికి ఈ దిమ్మతిరిగే నిజం తెలుస్తోంది. అప్పట్లో పెళ్లి చూపులంటే అమ్మాయి తలవంచుకుని ఉంటే అబ్బాయి ఆమెను గమనిస్తూ ఉండేవాడు. ఇపుడు ఏ అబ్బాయీ టీ తెచ్చిన అమ్మాయి చేతినే తప్ప మొహం చూసే సాహసం చేయట్లేదు. యువతి మాత్రం కలర్ నుంచి గ్లామర్ వరకు అన్నీ స్కానింగ్ చేసేస్తోంది. నీకు పాటలు పాడటం వచ్చా అని అడిగే లోపు ‘నీ శాలరీ ఎంత, ఆన్సైట్ ఆప్షన్ (విదేశీ అవకాశం) ఉంటుందా?’ అనే ప్రశ్న బాణంలా వస్తోంది. ఉందంటే బుక్కయిపోతాం, లేదంటే చూపులు క్యాన్సిల్. పెళ్లయ్యాక కూడా అబ్బాయి శాలరీ ఎంతో తెలుసుకునే ధైర్యం చేసే వారు కాదపుడు. ఇపుడు అమ్మాయిని ఒప్పించడానికి పెళ్లి చూపుల బయోడేటాలో దాన్ని హైలైట్ చేయాల్సి వస్తోంది. ‘ఆ కుటుంబానికి కోడలుగా వెళ్లడం మన పిల్ల అదృష్టం’ అనే డైలాగును ‘అలాంటి పిల్ల దొరకడం నీ అదృష్టం’ అనే డైలాగు రీప్లేస్ చేసింది. ఇది అమ్మ చెప్పే నిజం కాదు, ధైర్య వచనం!! పెళ్లి చూపులకెళ్లి రిజల్టు కోసం ఎదురుచూస్తున్న కాబోయే వరులారా... ఈ ఆర్టికల్ మీకే అంకితం. వధువు తల్లిదండ్రుల మాటలు: అప్పుడు, ఇప్పుడు! 1993 : అబ్బాయి మంచివాడు గవర్నమెంట్ ఉద్యోగి మంచి రాబడి.. సిగరెట్ అలవాటు లేదు మందు అలవాటు లేదు వాళ్ల నాన్నకు ఎదురుచెప్పడు అందరితోనూ కలుపుగోలుగా ఉంటాడు అక్కాచెల్లెళ్లను బాగా చూసుకుంటాడు 2013: అబ్బాయి మంచివాడు సాఫ్ట్వేర్ జాబ్ లక్ష రూపాయల శాలరీ ఆన్సైట్ ఆప్షన్ ఎక్కువ అమ్మాయిను తనతో పాటు తీసుకెళ్తాడు హైదరాబాదులో సొంత ఫ్లాటు ఈ మధ్యనే పెద్ద కారు కూడా కొన్నాడు అమ్మాయి బీటెక్ చేసుంటే చాలట - ప్రకాష్ చిమ్మల