Maldives: మహమ్మద్‌ ముయిజ్జుకు ఊహించని షాక్‌! | Democratic Party Adam Azim wins Male Mayor By-Election | Sakshi
Sakshi News home page

Maldives: మహమ్మద్‌ ముయిజ్జుకు ఎదురుదెబ్బ.. భారత్‌కు ఫేవర్‌!

Published Sun, Jan 14 2024 9:29 AM | Last Updated on Sun, Jan 14 2024 10:46 AM

Democratic Party Adam Azim wins Male Mayor By-Election - Sakshi

మాలె: ప్రపంచవ్యాప్తంగా మాల్దీవుల విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. కొద్దిరోజులుగా మాల్దీవులకు సంబంధించి ప్రతీ చిన్న విషయం కూడా హైలైట్‌ అవుతోంది. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు మరో షాక్‌ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఘోర ఓటమి చవిచూసింది. 

వివరాల ప్రకారం.. మాల్దీవుల్లో అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు బిగ్‌ షాక్‌ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీఎన్‌సీ ఘోర ఓటమి చవిచూసింది. భారత్‌ అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. దీంతో, అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. అయితే, భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో అధికార పార్టీ ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 

ఇక, మాలె మేయర్‌గా ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఎన్నికయ్యారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ఆ పదవిలో ముయిజ్జు కొనసాగారు. అజీమ్‌ గెలుపును మాల్దీవుల మీడియా భారీ ఘన విజయంగా అభివర్ణించింది. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ సొలిహ్‌ నాయకత్వం వహిస్తున్నారు. కాగా, మేయర్‌ గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసొస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. చైనా పర్యటన అనంతరం అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పరోక్షంగా భారత్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మాల్దీవులను విమర్శించే హక్కు ఏ దేశానికి లేదన్నారు. ‘మాది చిన్న దేశమే కావచ్చు. కానీ అది మీకు మమ్మల్ని అవమానించేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం మాది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement