మాలె: మాల్దీవుల నుంచి భారత సైనిక దళాలు వైదొలగాలని ఆ దేశాధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ ముయ్‌జ్జు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే చైనా దళాలను కూడా తమ భూభాగంపైకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
భారత దళాలను వెనక్కు పంపుతానని ఎన్నికల సందర్భంగా ఆయన వాగ్దానం చేశారు. మాల్దీవుల్లో 70 మంది భారతసైనిక సిబ్బంది ఉన్నారు. భారత్ అందజేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఆ ప్రాంతంలో సైనికంగా ప్రభావం చూపేందుకు, ముఖ్యంగా మాల్దీవులపై పట్టు కోసం భారత్, చైనా దశాబ్దాలుగా పోటాపోటీగా ప్రయతి్నస్తూ వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment