భారత్‌ చేరుకున్న మాల్దీవులు అధ్యక్షుడు | Maldives President Mohamed Muizzu Arrives In India On First State Visit To Repair Ties, Tweets Inside | Sakshi
Sakshi News home page

భారత్‌ చేరుకున్న మాల్దీవులు అధ్యక్షుడు

Published Sun, Oct 6 2024 7:41 PM | Last Updated on Mon, Oct 7 2024 11:34 AM

Maldives President Mohamed Muizzu arrives in India

ఢిల్లీ: ఐదురోజులు పర్యటనలో భాగంగా మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు భారత్‌ చేరుకున్నారు. ఆయన సతీమణి షాజిదా మహ్మద్‌తో కలిసి మొయిజ్జు.. ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. వారికి కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు ఇతర సీనియర్‌ ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారు. మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ద్వైపాక్షిక చర్చల కోసం మొయిజ్జు  భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.

 

‘‘మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జుకు భారతదేశ పర్యటనలో న్యూ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మొయిజ్జు దంపతులకు కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌  స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్‌-మాల్దీవులు మధ్య ద్వైక్షిక భాగస్వామ్యానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది’’ అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణ్‌దీర్‌ జైశ్వాల్  ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.‌

 

‘‘ఈ రోజు భారతదేశ పర్యటనలో భాగంగా మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జును రావటం ఆనందంగా ఉంది. భారతదేశం-మాల్దీవుల సంబంధాలను మెరుగుపరచడానికి  ఆయన నిబద్ధతను అభినందిస్తున్నాం. రేపు(సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చేపట్టే చర్చలు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయనే నమ్మకం ఉంది’ అని విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement