bilateral discussions
-
భారత్ చేరుకున్న మాల్దీవులు అధ్యక్షుడు
ఢిల్లీ: ఐదురోజులు పర్యటనలో భాగంగా మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారత్ చేరుకున్నారు. ఆయన సతీమణి షాజిదా మహ్మద్‌తో కలిసి మొయిజ్జు.. ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. వారికి కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు ఇతర సీనియర్ ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారు. మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ద్వైపాక్షిక చర్చల కోసం మొయిజ్జు భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.A warm welcome to President @MMuizzu of Maldives as he arrives in New Delhi on a State Visit to India.Received by MoS @KVSinghMPGonda at the airport.The visit will provide further boost to this long-standing 🇮🇳-🇲🇻 comprehensive bilateral partnership.#NeighbourhoodFirst pic.twitter.com/FHoNN4C0U3— Randhir Jaiswal (@MEAIndia) October 6, 2024 ‘‘మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు భారతదేశ పర్యటనలో న్యూ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మొయిజ్జు దంపతులకు కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్-మాల్దీవులు మధ్య ద్వైక్షిక భాగస్వామ్యానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది’’ అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.EAM S Jaishankar tweets, "Pleased to call on President Mohammed Muizzu today at the start of his State Visit to India. Appreciate his commitment to enhance the India-Maldives relationship. Confident that his talks with PM Narendra Modi tomorrow will give a new impetus to our… pic.twitter.com/9gTdb11huD— ANI (@ANI) October 6, 2024 ‘‘ఈ రోజు భారతదేశ పర్యటనలో భాగంగా మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జును రావటం ఆనందంగా ఉంది. భారతదేశం-మాల్దీవుల సంబంధాలను మెరుగుపరచడానికి ఆయన నిబద్ధతను అభినందిస్తున్నాం. రేపు(సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చేపట్టే చర్చలు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయనే నమ్మకం ఉంది’ అని విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. -
బైడెన్‌తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ
న్యూయార్క్: నాలుగో క్వాడ్ సమ్మిట్ సమావేశం ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాన మంత్రి మోదీ ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీలో ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చించారు. ప్రెసిడెంట్ జో బైడెన్‌తో జరిగిన ఈ భేటీపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. బైడెన్‌తో తాను జరిపిన చర్చలు చాలా ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు.‘‘డెలావేర్ గ్రీన్‌విల్లేలోని తన నివాసంలో నాకు ఆతిథ్యమిచ్చినందుకు ప్రెసిడెంట్ జో బిడెన్‌కి ధన్యవాదాలు. మా చర్చలు ఫలవంతమయ్యాయి. ఈ సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించడానికి మాకు అవకాశం లభించింది’’ అని పేర్కొన్నారు.I thank President Biden for hosting me at his residence in Greenville, Delaware. Our talks were extremely fruitful. We had the opportunity to discuss regional and global issues during the meeting. @JoeBiden pic.twitter.com/WzWW3fudTn— Narendra Modi (@narendramodi) September 21, 2024 ప్రధాని మోదీ ట్వీట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తమ సమావేశానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ. తనను కలిసిన ప్రతిసారీ ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను కనుగొనడంలో ప్రధాని మోదీ సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు.‘‘భారతదేశంతో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడైనా లేనంత బలమైంది. ఈ బంధం చాలా సన్నిహితమైంది, చైతన్యవంతమైనది. ప్రధాని మోదీ, నేను భేటీ అయిన ప్రతిసారీ ఓ కొత్త సహకార రంగాలను కనుగొనడంలో మా సామర్థ్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నా. ఈ రోజు సమావేశంలో అదే జరిగింది’’ఎక్స్‌లో పేర్కొన్నారు.The United States' partnership with India is stronger, closer, and more dynamic than any time in history.Prime Minister Modi, each time we sit down, I'm struck by our ability to find new areas of cooperation. Today was no different. pic.twitter.com/TdcIpF23mV— President Biden (@POTUS) September 21, 2024మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఫిలడెల్ఫియాలో ఘన స్వాగతం లభించింది. ప్రెసిడెంట్ బిడెన్ తన ఇంటికి పీఎం మోదీని స్వాగతించారు. చేయి పట్టుకుని మరీ మోదీని తన నివాసంలోకి బైడెన్ తీసుకెళ్లారు.క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదు!క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదనీ, ఇది అంతర్జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో వివాదాలలో నిమగ్నమై ఉన్న చైనాపై మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలు చుట్టుముట్టిన సమయంలో విల్మింగ్టన్లో ఈ సమావేశం జరుగుతోందని ఆయన చెప్పారు. అలాంటి పరిస్థితిలో భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్‌తో కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. 2021లో బైడెన్ అధ్యక్షతన జరిగిన తొలి క్వాడ్ సదస్సును ప్రధాని గుర్తు చేసుకున్నారు. చాలా తక్కువ సమయంలో క్వాడ్ దేశాలు సహకారాన్ని ప్రతి దిశలో విస్తరించాయని పేర్కొన్నారు. 2025లో క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటం ఎంతో సంతోషకరంగా ఉందని మోదీ చెప్పారు.ఘన స్వాగతంఅమెరికా పర్యటనలో భాగంగా తొలుత ఫిలాడెల్ఫియా విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం దక్కింది. విమానాశ్రయం వెలుపల ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సంభాషించారు. తరువాత డెలావేర్‌లోని విల్మింగ్టన్లోని హోటల్ డుపాంట్‌లోనూ ప్రవాస భారతీయులతో మోదీ మాట్లాడారు. అక్కడ ప్రదర్శించిన 'గర్బా'ను ప్రధాని వీక్షించారు. ఇవాళ న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేస్తున్న 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు.చదవండి: మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు.. కుదిరిన డ్రోన్ డీల్ -
PM Narendra Modi: యుద్ధాలకు సమయం కాదిది
వియన్నా: ప్రపంచం ఇప్పటికే అనేకానేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇది యుద్ధాలకు సమయం కాదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రెండు రోజుల ఆ్రస్టియా పర్యటనలో భాగంగా ఆ దేశ చాన్సలర్ కార్ల్ నెహమర్‌తో బుధవారం ఆయన భేటీ అయ్యారు. పశి్చమాసియా సంక్షోభంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం తదితరాలపై నేతలిద్దరూ లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని, అందుకోసం మైలిక సదుపాయాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇన్నొవేషన్లు, నీటి–వ్యర్థాల నిర్వహణ వంటి అన్ని రంగాల్లోనూ అవకాశాలనూ మరింతగా అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శాంతియుత వాతావరణంలో చర్చలే యుద్ధాలకు ఏకైక పరిష్కారమమని పేర్కొన్నారు. అందుకు అన్నివిధాలా సహకరించేందుకు ఇరు దేశాలూ సిద్ధమని ప్రకటించారు. ఔరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సమకాలీన అవసరాలకు తగ్గట్టుగా సంస్కరణలు అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు మొదలుకుని ఉగ్రవాదం దాకా అన్ని అంశాలపైనా చర్చించినట్టు వివరించారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తుల నిర్వహణ మౌలిక సదుపాయాల కూటమి, జీవ ఇంధన కూటమి తదితరాల్లో భాగస్వామి కావాలని ఆ్రస్టియాను మోదీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ పాత్ర కీలకమని నెహమర్ అభిప్రాయపడ్డారు. గార్డాఫ్ ఆనర్ భారత ప్రధాని ఆ్రస్టియాలో పర్యటించడం 41 ఏళ్ల అనంతరం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బుధవారం మోదీకి వియన్నాలో గార్డాఫ్ ఆనర్ లభించింది. స్థానిక కళాకారులు వందేమాతరం ఆలపించారు. మోదీని నెహమర్ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతో సెల్ఫీ తీసుకుంటూ సందడి చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మోదీ జీ! వియన్నాకు స్వాగతం’ అని పేర్కొన్నారు. అంతకుముందు నేతలిద్దరూ పలు అంశాలపై చాలాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు.సీఈవోలతో భేటీభారత్లో ఇన్ఫ్రా, ఇంధన, టెక్నాలజీ తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ్రస్టియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. స్థానిక హాఫ్బర్గ్ ప్యాలెస్‌లో ఆ్రస్టియా, ఇండియా సీఈఓల రౌండ్‌టేబుల్ భేటీలో మోదీ, నెహమర్ పాల్గొన్నారు. ఇరు దేశాల నడుమ 2023లో 293 కోట్ల డాలర్ల మేర వర్తకం జరిగింది.అధ్యక్షునితో భేటీ ఆ్రస్టియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండెర్ బెలన్తో మోదీ భేటీ అయ్యారు. పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపై లోతుగా చర్చించుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తమ భేటీ అద్భుతంగా జరిగిందన్నారు. -
G20 Summit: బిజీబిజీగా ద్వైపాక్షిక భేటీలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విచ్చేసిన సభ్యదేశాల అధినేతలతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో బిజీగా కనిపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్, తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రెటే, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోండెర్ లెయిన్, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు, ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ అసౌమనీ తదితరుల నాయకులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరిపారు. ► ‘మధ్యాహ్నం భోజనం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో జరిపిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండియా–ఫ్రాన్స్ బంధం నూతన సమున్నత శిఖరాలకు చేరేందుకు ఇరువురం కృషిచేస్తాం’ అని మోదీ ట్వీట్‌చేశారు. ► జీ20 సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు నేతలంతా మోదీని అభినందించారు. ఇంటర్‌గవర్నమెంటల్ కమిషన్ మరో దఫా చర్చల కోసం వచ్చే ఏడాది భారత్‌కు విచ్చేయాల్సిందిగా జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్‌ను మోదీ ఆహా్వనించారు. ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన ఓలాఫ్‌కు ఇది రెండో అధికారిక పర్యటన. రక్షణ, హరిత, సుస్థిరాభివృద్ధి, అరుదైన ఖనిజాలు, నైపుణ్యమైన సిబ్బంది, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై స్కోల్జ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ► శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికత తదితరాలపై నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ చర్చించారు. ► వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, చిరుధాన్యాలు, ఆర్థిక సాంకేతికతలపై నైజీరియా అధ్యక్షుడు తినుబుతో మోదీ చర్చలు జరిపారు. ► జీ20లో శాశ్వత సభ్యత్వానికి కృషిచేసినందుకు ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ► వాణిజ్యం, సాంస్కృతిక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈవీ బ్యాటరీ సాంకేతికతల పరిపుష్టికి మరింతగా కృషిచేయాలని నిర్ణయించామని ద.కొరియా నేత ఇయోల్‌తో భేటీ తర్వాత ప్రధాని మోదీ వెల్లడించారు. ► డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బ్రెజిల్ సారథ్యంలో జీ20 మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు డ సిల్వాతో మోదీ వ్యాఖ్యానించారు. ► వాణిజ్యం, సాంకేతికత, అనుసంధానం వంటి కీలకాంశాల్లో యూరప్‌తో భారత్ బంధం మరింత పటిష్టానికి సంబంధించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులాతో, ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్‌తో మోదీ విడిగా చర్చలు కొనసాగించారు. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి: ఎర్డోగన్ దక్షిణాసియాలో భారత్ తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ పేర్కొన్నారు. భారత్–తుర్కియే పరస్పర సహకారం అవిచి్ఛన్నంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జీ20 సదస్సు ముగిశాక ఎర్డోగన్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యాయని, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించామని తెలిపారు. జీ20లో ఆఫ్రియన్ యూనియన్ భాగస్వామిగా మారడాన్ని ఎర్డోగాన్ స్వాగతించారు. -
G20 Summit 2023: ఒకే వసుధ ఒకే కుటుంబం ఒక సదస్సు
అంతర్జాతీయ స్థాయిలో జరిగే అత్యంత కీలకమైన జీ20 సదస్సుకు నభూతో అనే స్థాయిలో ఘనంగా ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. అమెరికా మొదలుకుని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల అధినేతలు ఒకే వేదిక మీదికి రానున్నారు. ఆర్థిక అసమానతలు మొదలుకుని వాతావరణ మార్పుల దాకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు ప్రధాన సమస్యలపై సెపె్టంబర్ 9 నుంచి రెండు రోజుల పాటు లోతుగా చర్చించనున్నారు. ఐక్యత, సమష్టి కార్యాచరణే ఆయుధాలుగా పరిష్కార మార్గాలు అన్వేషించనున్నారు. అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి, పేరు ప్రతిష్టలు కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. దేశాల మధ్య అతి జటిలమైన సమస్యల పరిష్కారానికైనా, వివాదాల్లో మధ్యవర్తిత్వానికైనా అన్ని దేశాలూ భారత్ వైపే చూసే పరిస్థితి! ఇప్పుడు జీ20 శిఖరాగ్రానికి భారత్ వేదికగా నిలుస్తుండటాన్ని అందుకు కొనసాగింపుగానే భావిస్తున్నారు. మన దేశ వ్యవహార దక్షతను నిరూపించుకోవడానికి మాత్రమే గాక అంతర్జాతీయ స్థాయిలో సంలీన వృద్ధి, సుస్థిర అభివృద్ధి సాధన యత్నాలకు అజెండా నిర్దేశించేందుకు కూడా ఇది చక్కని అవకాశంగా నిలవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెరపైకి తెచి్చన వసుధైవ కుటుంబకం (ఒక వసుధ, ఒకే కుటుంబం, ఒకటే భవిత) నినాదమే సదస్సుకు మూలమంత్రంగా నిలవనుంది. రెండు రోజులు.. మూడు సెషన్లు ► దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రక ప్రగతి మైదాన్‌లో సదస్సు జరగనుంది. ► వేదికకు భారత్ మండపం అని నామకరణం చేశారు. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 7వ తేదీనే భారత్‌కు రానున్నారు. 8న మిగతా దేశాధినేతలు వస్తారు. దాంతో వారితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలకు కావాల్సినంత సమయం చిక్కనుంది. ► 8న బైడెన్‌తో మోదీ భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీ ఎజెండా ఏమిటన్నది ఇప్పటికైతే సస్పెన్సే. తొలి రోజు ఇలా... ► సదస్సు 9న మొదలవుతుంది. ► ప్రతి దేశాధినేతకూ భారత్‌మండపం వద్ద మన సంప్రదాయ రీతుల మధ్య ఘన స్వాగతం లభించనుంది. ► రెండు రోజుల సదస్సులో మొత్తం మూడు సెషన్లు జరుగుతాయి. ► ఒకే వసుధ (వన్ ఎర్త్) పేరుతో తొలి సెషన్ శనివారం ఉదయం 9కి మొదలవుతుంది. ► దానికి కొనసాగింపుగా దేశాధినేతల మధ్య అధికార, అనధికార భేటీలుంటాయి. ► అనంతరం ఒకే కుటుంబం (వన్ ఫ్యామిలీ) పేరుతో రెండో సెషన్ మొదలవుతుంది. రెండో రోజు ఇలా... ► సదస్సు రెండో రోజు ఆదివారం కార్యక్రమాలు త్వరగా మొదలవుతాయి. ► దేశాధినేతలంతా ముందు రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. గాం«దీజీ సమాధి వద్ద నివాళులరి్పస్తారు. ► అనంతరం భారత్ మండపం వేదిక వద్ద మొక్కలు నాటుతారు. పర్యావరణ పరిరక్షణకు పునరంకితం అవుతామని ప్రతినబూనుతారు. ► ఒకే భవిత (వన్ ఫ్యూచర్) పేరిట జరిగే మూడో సెషన్‌తో సదస్సు ముగుస్తుంది. ► జీ20 అధ్యక్ష బాధ్యతలను వచ్చే ఏడాది శిఖరాగ్రానికి ఆతిథ్యం ఇస్తున్న బ్రెజిల్‌కు అప్పగించడంతో సదస్సు లాంఛనంగా ముగుస్తుంది. ప్రథమ మహిళల సందడి ► జీ20 సదస్సులో ఆయా దేశాధినేతల సతీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ► పలు ప్రత్యేక కార్యక్రమాలతో సందడి చేయనున్నారు. ► శనివారం తొలి రోజు వాళ్లు పూసా లోని వ్యవసాయ పరిశోధన సంస్థ, నేషనల్ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ సందర్శిస్తారు. ► తృణ ధాన్యాల పరిరక్షణ, వృద్ధిలో భారత్ చేస్తున్న కృషిని స్వయంగా గమనిస్తారు. ► చివరగా పలు రకాల షాపింగులతో సేదదీరుతారు. ► రెండో రోజు ఆదివారం దేశాధినేతల అనంతరం వాళ్లు కూడా రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. మరెన్నో విశేషాలు... ► ప్రతినిధుల షాపింగ్ కోసం క్రాఫ్ట్స్ బజార్ పేరిట వేదిక వద్ద జీ20 జాబ్ ఫెయిర్ ఏర్పాటు చేస్తారు. ► ప్రజాస్వామ్యాలకు తల్లి భారత్ థీమ్‌తో çహాల్ నంబర్ 14లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. షడ్రసోపేత విందు ► శనివారం తొలి రోజు సదస్సు అనంతరం రాత్రి ఆహూతులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా విందు ఇవ్వనున్నారు. ► ఇందులో దేశాధినేతలు మొదలుకుని రాయబారులు దాకా 400 మంది దాకా పాల్గొంటారు. ► విందు కూడా అధినేతల చర్చలకు వేదిక కానుంది. కాన్ఫరెన్స్ గదుల రొటీన్‌కు దూరంగా ఆరుబయట వారంతా మనసు విప్పి మాట్లాడుకుంటారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
విబేధాలు రాజేయడం మానుకోవాలి: చైనా
బీజింగ్: భారత్-అమెరికా మధ్య జరగాల్సిన 2+2 చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ సోమవారం భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై డ్రాగన్ దేశం స్పందించింది. బీజింగ్‌తో పాటు ఈ ప్రాంతంలోని ఇతర దేశాల మధ్య విబేధాలు రాజేయడం మానుకోవాల్సిందిగా అమెరికాని కోరింది. చైనా బెదిరింపుల నేపథ్యంలో మైక్ పాంపీయో, భారత్‌తో పాటు ఇతర దక్షిణాసియా దేశాల్లో పర్యటించడం గురించి చైనా స్పందన ఏంటని బీజింగ్ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్‌ని ప్రశ్నించగా.. చైనాపై ఆరోపణలు చేయడం మైక్ పాంపియోకు కొత్త కాదని తెలిపారు. ఆయన పదే పదే వాటిని పునరావృతం చేశాడన్నారు. (చదవండి: అమెరికా ‘వ్యూహాత్మక’ చెలిమి) ఈ సందర్భంగా వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. ‘పాంపియో ఆరోపణలు నిరాధరమైనవి. ఆయన వ్యాఖ్యలు చూస్తే ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం, సైద్ధాంతిక పక్షపాతం భావజాలానికి అతుక్కుపోతున్నట్లు తెలుస్తోంది. కానీ మేం మాత్రం ఆయన ప్రచ్ఛన్న యుద్ధం, జీరో సమ్ గేమ్ మనస్తత్వాన్ని విడనాడాలని కోరుతున్నాము. చైనా, ప్రాంతీయ దేశాల మధ్య అసమ్మతిని రగల్చడం, శాంతి, స్థిరత్వాలను అణగదొక్కాలని చూస్తున్నారు’ అని మండి పడ్డారు. భారత్, అమెరికా రెండు దేశాల మధ్య మైలురాయిగా నిలిచే బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా) పై సంతకం చేసిన తర్వాత వాంగ్ వెన్బిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బెకా ఉన్నత స్థాయి సైనిక సాంకేతిక పరిజ్ఞానం, వర్గీకృత ఉపగ్రహ డేటా మరియు ఇరు దేశాల మధ్య క్లిష్టమైన సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. (చదవండి: భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు) ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంచుకోవడం, చైనాకు చెక్ పెట్టడం ముఖ్య ఉద్దేశంగా 2+2 చర్చలు జరగనున్నాయి. ఇటీవల లద్దాఖ్‌లో చైనా నిర్వాకాలు, ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా దూకుడు.. తదితర అంశాలు ఈ చర్చల్లో కీలకం కావొచ్చని భావిస్తున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత రవాణా ఉండాలని పలు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇవన్నీ తమ సొంత జలాలని వాదిస్తోన్న సంగతి తెలిసిందే. భారత పర్యటన తరువాత, పాంపియో శ్రీలంక, మాల్దీవులను సందర్శించనున్నారు. -
భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు
సాధారణంగా రెండు ప్లస్ రెండు నాలుగవుతుంది. కానీ ఇండో అమెరికా మాత్రం రెండు ప్లస్ రెండు ఈక్వల్టూ ఒకటి అంటున్నాయి. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య జరిగే ఈ చర్చలు..ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించేందుకు, దక్షిణాసియాలో ఇండియా స్థానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సాగుతున్నాయి. పలు దేశాల పర్యటనలను వర్చువల్ పర్యటనలుగా మార్చుకున్న అమెరికా రక్షణ మంత్రి.. భారత్ పర్యటనకు స్వయంగా రావడం గమనిస్తే ప్రాధాన్యం అర్థమవుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. మంగళవారం భారత్, అమెరికా మధ్య జరగాల్సిన 2+2 చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ సోమవారం భారత్ వచ్చారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంచుకోవడం, చైనాకు చెక్ పెట్టడం ముఖ్య ఉద్దేశంగా 2+2 చర్చలు జరగనున్నాయి. కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నా అమెరికా కీలక మంత్రులు ఈ పర్యటనకు స్వయంగా రావడం విశేషం. జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌తో సైతం అమెరికా మంత్రులు సమావేశం కానున్నారు. ఇటీవల లద్దాఖ్‌లో చైనా నిర్వాకాలు, ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా దూకుడు.. తదితర అంశాలు ఈ చర్చల్లో కీలకం కావొచ్చని భావిస్తున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత రవాణా ఉండాలని పలు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇవన్నీ తమ సొంత జలాలని వాదిస్తోంది. భారత్ నిర్ణయాత్మకం దక్షిణాసియా ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోనే భారత్ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోందని అమెరికా ప్రశంసించింది. భారత్ ఎదుగుదలను స్వాగతిస్తున్నట్లు యూఎస్ రక్షణ, విదేశాంగ శాఖలు తెలిపాయి. 2021 జనవరి నుంచి ఆరంభమయ్యే ఐరాస భద్రతా మండలి టర్మ్‌లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపాయి. 2017లో ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియాలు ఇండో పసిఫిక్ జలాలను స్వేచ్ఛగా ఉంచేందుకు ఉమ్మడిగా వ్యూహరచన చేయాలని భావించాయి. ఇందుకోసం నాలుగు దేశాలు కలిసి క్వాడ్ పేరిట ఒక బృందంగా ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ 4 దేశాల మంత్రులు జపాన్‌లో సమావేశమయ్యారు. చైనా దుందుడుకు చేష్టలను ఆపేందుకు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. ఎకానమీ పరంగానూ భారత్ అత్యంత కీలకమని అమెరికా భావిస్తోంది. ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందాల విలువ 20 బిలియన్ డాలర్లకుపైనే ఉంది. 2+2 చర్చలు, బెకా అంటే.. ఒక దేశ రక్షణ, విదేశీ మంత్రులు మరో దేశ రక్షణ, విదేశీ మంత్రులతో జరిపే చర్చలను టు ప్లస్ టు చర్చలంటారు. ఒక దేశం తనకు అత్యంత కీలకమని భావించే మరో దేశంతో ఇలాంటి సమావేశాలు జరుపుతుంది. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు ఈ చర్చలు కీలకంగా ఉంటాయి. తాజా సమావేశాల్లో భారత్ బెకా(బేసిక్ ఎక్సే్చంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్) కోసం ఎదురుచూస్తోంది. శాటిలైట్ సమాచార మార్పిడి ఈ బెకాలో కీలకం. ఈ ఒప్పందం కుదిరితే యూఎస్ జియో శాటిలైట్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇండియా వాడుకునే వీలుంటుంది. 2002లో అమెరికాతో భారత్ జిఎస్‌ఓఎంఐఏ(జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా లాజిస్టికల్ ఎక్సే్చంజ్ మెమొరాండమ్ అగ్రిమెంట్(లెమొవా)ను 2016లో, కమ్యూనికేషన్, కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్(కామ్కాసా)ను 2018లో పూర్తి చేసుకుంది. బెకా పూర్తయితే 2002 అగ్రిమెంట్ దశలన్నీ పూర్తయినట్లవుతుంది. -
ఇరాన్‌తో చర్చలు ఫలవంతం
టెహ్రాన్: ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ హటామితో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతతోపాటు అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. పలు అంశాలపై పరస్పరం అభి ప్రాయాలు పంచుకున్నామని, ఈ చర్చలు ఫలవంతమయ్యా యని రాజ్ నాథ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజ్‌నాథ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని అక్కడి నుంచి శనివారం ఇరాన్‌కు వచ్చారు. ఇరాన్ రక్షణ మంత్రి వినతి మేరకే ఈ భేటీ జరిగిందని రక్షణ శాఖ తెలిపింది. ఇరువురు నేతలు సాంస్కృతిక, భాషా, పౌర సంబంధాలు తదితర అంశాలపై సుహృ ద్భావ వాతావరణంలో చర్చలు జరిపారని చెప్పింది. ప్రాంతీయ భద్ర త, శాంతి పరిరక్షణ కోసం ఇరు దేశాల అధికారులు పరస్పరం సం ప్రదింపులు జరుపుతూనే ఉన్నారంది. ‘ఈ రీజియన్‌లోని దేశాలతో భా రత్ స్నేహ సంబంధాలను కోరుకుంటుంది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు , ద్వైపాక్షిక సంబంధాల్లో ఇతరుల జో క్యం నివారణకు కృషి చేస్తాం’అని రాజ్‌నాథ్ చెప్పారు. అంతర్యుద్ధం తో అతలా కుతలమవుతున్న అఫ్గానిస్తాన్‌లో పరిస్థితిపై భారత్ ఆం దోళ న వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ మంత్రితో భేటీ ప్రాధాన్యం సంత రించుకుంది. తాలిబాన్లు అమెరికాతో శాంతి ఒప్పందం కుదు ర్చు కు న్న తర్వాత రాజకీయ సుస్థిరత ఏర్పాటుపై భారత్ మరింత దృష్టిసారించింది. -
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని సంప్రదింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో గురువారం ఫోన్లో సంప్రదింపులు జరిపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంతో పాటు, రష్యాలో రాజ్యాంగ సవరణలపై విజయవంతంగా ఓటింగ్‌ను పూర్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని అభినందించారు. భారత్-రష్యా ప్రజల మధ్య స్నేహానికి సంకేతంగా ఈ ఏడాది జూన్ 24 న మాస్కోలో జరిగిన సైనిక కవాతులో భారతీయ బృందం పాల్గొందని ప్రధాని గుర్తు చేశారు. కోవిడ్-19 ప్రతికూల ప్రభావాన్నఅధిగమించేందుకు ఇరు దేశాలు చేపట్టిన చర్యలను ఇరువురు నేతలు సమీక్షించారు. కోవిడ్-19 అనంతరం ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు అవసరమని ఇరువురు నేతలు అంగీకరించారు. ఈ ఏడాది చివరిలో భారత్‌లో జరిగే వార్షిక ద్వైపాక్షిక సదస్సుకు ద్వైపాక్షిక సంప్రదింపులను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక సదస్సుకు భారత్‌కు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. తనకు ఫోన్ చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన పుతిన్ అన్ని రంగాల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. (చదవండి : పుతిన్ రక్షణకు భారీ టన్నెల్ ఏర్పాటు) -
ఆ హోర్డింగులకు మా అనుమతి అక్కర్లేదు
సాక్షి, చెన్నై : ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లను స్వాగతిస్తూ బ్యానర్లు పెట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. అంతేకాక, ఇలాంటి విషయాల్లో తమ అనుమతి అవసరం లేదని వ్యాఖ్యానించింది. వివరాల్లోకెళితే.. అక్టోబరు 11, 12 తేదీల్లో ఇరు దేశాల నాయకుల మధ్య తమిళనాడులోని పర్యాటక పట్టణమైన మామళ్లపురంలో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ పట్టణం చెన్నై విమానాశ్రయం నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేస్తామని హైకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే ఇంతకు ముందు బ్యానర్లు, ప్లెక్సీలను మద్రాస్ హైకోర్టు నిషేధించింది. 20 రోజుల క్రితం ప్లెక్సీ కారణంగా ఒక మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ శుభశ్రీ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెక్సీలు, బ్యానర్లు కట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తొలగించి దాదాపు 650 మందిపై అధికారులు కేసులు పెట్టారు. (చదవండి : యువతిని బలిగొన్న బ్యానర్) ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ హైకోర్టులో అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేశారు. అగ్రశ్రేణి ప్రముఖుల పర్యటనల సందర్భంగా వారి గౌరవార్ధం హోర్డింగులు ద్వారా స్వాగతించడం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాంప్రదాయమని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించాయని పిటిషన్లో పేర్కొన్నారు. అందువలన తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎం.సత్యనారాయణన్, జస్టిస్ శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ పైన పేర్కొన్న విధంగా స్పందిస్తూ.. రాజకీయ పార్టీలు హోర్డింగులు పెట్టకుండా మాత్రమే నిషేధించామని ప్రభుత్వానికి కాదని తెలిపింది. అయితే ఈ చర్యను ప్రతిపక్ష డీఎమ్‌కే వ్యతిరేకిస్తోంది. దీని వెనుక రహస్య ఎజెండా ఉందని, దీన్ని సాకుగా చూపి భారీ సంఖ్యలో హోర్డింగులు, బ్యానర్లు పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని డీఎంకే నేత స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. -
భారత్‌కు మరోసారి షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్ : భారత్, అమెరికా మధ్య జరగాల్సిన అత్యంత కీలక సమావేశాన్ని (2+2 చర్చలు) అమెరికా ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రుల మధ్య జులై 6న జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలను అనివార్య కారణాలతో మరోమారు వాయిదా వేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సుష్మా స్వరాజ్‌కు ఫోన్లో తెలియజేశారు. కాగా ప్రస్తుతం అదే రోజున(జూలై 6) పాంపియో ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం... వచ్చే నెల(జూలై) 6న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. తద్వారా ఉత్తర కొరియాలో పర్యటించనున్న మొదటి అమెరికా మంత్రిగా ఆయన ఘనత సాధించనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న పర్యటనలో భాగంగా అణునిరాయుధీకరణ అంశంలో పురోగతి సాధించేందుకు కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. పాంపియో ఉత్తర కొరియా పర్యటన ద్వారా భారత్ కంటే ఉత్తర కొరియాకే అమెరికా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కన్పిస్తోందంటూ అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్ రష్యాతో సత్సంబంధాలు కొనసాగించడం, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకం పెంచడం, చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం వంటి అంశాలు జీర్ణించుకోలేకే ట్రంప్ సర్కారు ఈ విధంగా వ్యవహరిస్తోందంటూ వారు అభిప్రాయ పడుతున్నారు. కాగా అణునిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య ఈనెల(జూన్) 12న జరిగిన చరిత్రాత్మక భేటీ విజయవంతమైన విషయం తెలిసిందే. అమెరికా ఆశించినట్లుగానే అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా.. అందుకు ప్రతిగా తమ దేశ భద్రతకు అమెరికా నుంచి కిమ్ హామీ పొందారు. అమెరికాతో గత వైరాన్ని పక్కనపెట్టి ముందుకు సాగుతామని, ప్రపంచం ఒక గొప్ప మార్పును చూడబోతుందని కిమ్ చెప్పారు. ప్రస్తుతం ఆ దిశగా పురోగతి సాధించేందుకే పాంపియో ఉత్తర కొరియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
మోదీ, జిన్‌పింగ్ విస్తృత చర్చలు
వుహాన్: ప్రపంచంలోని దాదాపు 40 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు పెద్ద సరిహద్దు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు కీలక ముందడుగు పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య చైనాలోని పర్యాటక కేంద్రం వుహాన్‌లో శుక్రవారం అనధికార శిఖరాగ్ర భేటీ ప్రారంభమైంది. హృదయపూర్వక సమావేశం (హార్ట్ టు హార్ట్ సమ్మిట్)గా పేర్కొంటున్న ఈ భేటీలో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, చైనాల సంప్రదాయ, సాంస్కృతిక స్నేహ సంబంధాలను గుర్తు చేసుకున్నారు. తమ రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రపంచ పురోగతిలో కీలక పాత్ర పోషించే సమర్థత భారత్, చైనాలకుందని స్పష్టం చేశారు. భేటీ అనంతరం తొలి రోజు చర్చలు విస్తృతంగా, ఫలప్రదంగా ముగిశాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రెండో రోజు చర్చలు నేడు ఉదయం ప్రారంభం కానున్నాయి. సరిహద్దు వివాదాలు సహా ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపైనే వీరిరువురు చర్చించారు. ఇరుదేశాల మధ్య ఇలాంటి చర్చలు తరచూ జరుగుతూ ఉండాలని మోదీ అభిలషించారు. 2019లో భారత్‌లో జరిగే ఈ తరహా చర్చలకు రావాలని జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనమే బలం: భారత్, చైనాలు కలసి పనిచేస్తే తమ దేశాల ప్రజలతోపాటు ప్రపంచానికి మేలు చేసేందుకు గొప్ప అవకాశం లభిస్తుందని మోదీ తెలిపారు. భారత్–చైనాల మధ్య శతాబ్దాల బంధాన్ని మోదీ గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత్, చైనాలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ‘గత 2వేల ఏళ్లలో దాదాపు 1600 ఏళ్ల పాటు భారత్, చైనాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి. ఈ రెండు దేశాలే దాదాపు 50 శాతం భాగస్వామ్యాన్ని కలిగున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. బీజింగ్‌కు వెలుపల రెండుసార్లు జిన్‌పింగ్ స్వాగతం పలికిన తొలి భారత ప్రధానిగా నిలవటం గర్వంగా ఉందని మోదీ తెలిపారు. ఇది భారత ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల కోసం ‘ఉమ్మడి ఆలోచన, సమాచార మార్పిడి, బలమైన బంధం, పరస్పర ఆలోచన విధానం, పరస్పర పరిష్కారం’ అనే ఐదు అంశాలను మోదీ ఈ భేటీలో ప్రతిపాదించారు. సంయుక్త భాగస్వామ్యంతో..: ఇలాంటి చర్చలు భవిష్యత్తులో కూడా జరుగుతాయని ఆశిస్తున్నట్లు జిన్‌పింగ్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల్లో ఈ భేటీ కొత్త అధ్యాయానికి తెరలేపనుందని ఆయన తెలిపారు. ‘గంగా, యాంగ్జీ నదులు నిరంతరం ప్రవహిస్తున్నట్లే ఇరుదేశాల మధ్య స్నేహం కూడా కొనసాగుతూనే ఉండాలి. భారత్–చైనా సహకారానికి బంగారు భవిష్యత్తు ఉందని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ‘ఐదేళ్లుగా మనం చాలా సాధించాం. సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకున్నాం. ఈ దిశగా సానుకూల ఫలితాలు సాధిస్తున్నాం. మరింత అభివృద్ధి జరిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన భాగస్వామ్య ప్రభావం స్పష్టంగా కనబడుతోంది’ అని జిన్‌పింగ్ తెలిపారు. ‘మీతో కలిసి పలు అంశాలపై మరింత లోతైన భాగస్వామ్యం ఏర్పడాలని కోరుకుంటున్నాను’ అని ఆయన మోదీతో తెలిపారు. ‘మన దేశాలకు పునరుత్తేజం కల్పించేందుకు అవసరమైన సుస్థిరత కల్పించుకోవటం, అన్ని రంగాల్లో అభివృద్ధి, పరస్పర అభివృద్ధికి సహకారాన్ని బలోపేతం చేసుకోవటం, ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం పనిచేయటంపై భారత్–చైనా దృష్టిపెట్టాలి’ అని చైనా అధ్యక్షుడు పేర్కొన్నారు. అమెరికా సహా పలు దేశాలు రక్షణాత్మక వ్యూహాలు అమలుచేస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఘనస్వాగతం పలికిన జిన్‌పింగ్: శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ వుహాన్ చేరుకున్నారు. మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ కార్యక్రమాల అనంతరం అనధికార చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య బంధాన్ని వ్యూహాత్మకంగా, దీర్ఘకాల లాభాలను దృష్టిలో పెట్టుకుని సమీక్ష జరుపుతారని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు. ‘ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకున్నారు’ అని ఆయన చెప్పారు. జిన్‌పింగ్‌కు అద్భుతమైన కానుక: ఈ చర్చల సందర్భంగా ప్రఖ్యాత చైనా కళాకారుడు జు బీహోంగ్ వేసిన చిత్రాన్ని జిన్‌పింగ్‌కు మోదీ కానుకగా ఇచ్చారు. ప్రస్తుత పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీలో 20వ శతాబ్దపు ప్రారంభంలో బీహోంగ్ చిత్రలేఖనం బోధించేవారు. ఆధునిక చైనా చిత్రకళను ఈయన ప్రపంచానికి పరిచయం చేశారు. ‘స్ట్రెంత్’కు మోదీ నిర్వచనం: చైనా పర్యటనలో ప్రధాని మోదీ భారత్, చైనా ప్రజల మధ్య బంధాల బలోపేతాన్ని కాంక్షిస్తూ స్ట్రెంత్ అనే పదానికి కొత్త నిర్వచనాన్నిచ్చారు. స్ట్రెంత్ పదంలోని ఆంగ్ల అక్షరాలకు వరుసగా ఎస్ అంటే ఆధ్యాత్మికత (స్పిరిచువాలిటీ), టీ అంటే సంప్రదాయం, వాణిజ్యం, సాంకేతికత (ట్రెడిషన్, ట్రేడ్, టెక్నాలజీ), ఆర్ అంటే బంధం (రిలేషన్షిప్), ఈ అంటే వినోదం (ఎంటర్టైన్మెంట్ – సినిమాలు, కళలు, నృత్యాలు మొదలైనవి), ఎన్ అంటే పర్యావరణ పరిరక్షణ (నేచర్ కన్జర్వేషన్), జీ అంటే క్రీడలు (గేమ్స్), టీ అంటే పర్యాటకం (టూరిజం), హెచ్ అంటే ఆరోగ్యం (హెల్త్, హీలింగ్) అని పేర్కొన్నారు. అప్పుడు సీఎంగా.. ఇప్పుడు పీఎంగా! గుజరాత్ సీఎంగా స్టడీ టూర్లో భాగంగా ‘త్రీ గార్జెస్ డ్యామ్’ను సందర్శించినట్లు మోదీ తెలిపారు. ‘వేగంగా పూర్తయిన ఈ డ్యామ్ నిర్మాణం, దీని ఎత్తు నన్ను అబ్బురపరిచాయి. ఓ రోజంతా డ్యామ్ దగ్గరే గడిపి దీని విశేషాలు తెలుసుకున్నాం’ అని మోదీ తెలిపారు. యాంగ్జీ నదిపై నిర్మించిన ఆ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు. 2.3 కిలోమీటర్ల పొడవు, 185 మీటర్ల ఎత్తు, 32 హైడ్రో పవర్ టర్బో జనరేటర్లు, ఐదు దశల షిప్ లాక్, షిప్ లిఫ్ట్ వ్యవస్థతో అధునాతన ప్రాజెక్టుగానూ ప్రత్యేకతను చాటుకుంది. డోక్లామ్, సీపీఈసీలను లేవనెత్తండి! న్యూఢిల్లీ/మంగళూరు: చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా డోక్లాం, చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)ల గురించి చర్చించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎలాంటి అజెండా లేకుండానే ఈ సమావేశాలు జరుగుతున్నప్పటికీ భారత్‌కు నష్టం కలిగించే అంశాలను భేటీలో ప్రస్తావించాలన్నారు. చైనా పర్యటన సందర్భంగా మోదీ కాస్త టెన్షన్‌గా కనిపించారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీకి తమ పార్టీ మద్దతుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈస్ట్ లేక్ ఒడ్డున డిన్నర్ చర్చలు చర్చల అనంతరం ఇరువురు నేతలు హుబీ ప్రావిన్షియల్ మ్యూజియంను సందర్శించారు. ఈ మ్యూజియంలో పెద్ద సంఖ్యలో చైనా చారిత్రక, సాంస్కృతిక స్మారకాలున్నాయి. సాయంత్రం ఇరువురు నేతల మధ్య చర్చల్లో ఇరుదేశాల నుంచి ఆరుగురు అధికారుల చొప్పున పాల్గొన్నారు. రాత్రి ఈస్ట్ లేక్ ఒడ్డున ఉన్న అతిథిగృహంలో వీరిద్దరు మాత్రమే భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు. దీంతో తొలిరోజు చర్చలు ముగిశాయి. శనివారం ఉదయం పదిగంటలనుంచి (స్థానిక కాలమానం ప్రకారం) మళ్లీ ఇరువురు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. ద్వైపాక్షిక ఒప్పందాలు, సంయుక్త ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా ఒత్తిడిలేని వాతావరణంలో ఈ అనధికార సదస్సు జరగాలని ముందుగానే నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2014లో మోదీ పగ్గాలు చేపట్టాక పలు అంతర్జాతీయ వేదికలపై 12సార్లకు పైగా వీరు కలుసుకున్నారు. అయినప్పటికీ.. ఇద్దరు దేశాధినేతలు మనసువిప్పి మాట్లాడుకోవటం ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య ఉన్న పలు సమస్యల పరిష్కారంపై తరచూ సమీక్షలు నిర్వహించాలనే ఆలోచనలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానిగా మోదీకి ఇది నాలుగో చైనా పర్యటన. వుహాన్‌లోని ఓ ఎగ్జిబిషన్లో వాద్యపరికరాన్ని వాయిస్తున్న మోదీ -
ఉత్తర కొరియా వైఖరి మారుతోందా?
వాషింగ్టన్ : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వైఖరిలో అనూహ్యంగా కాస్త మార్పు రావటంతో.. శాంతి చర్చలకు త్వరపడాలని అగ్రరాజ్యం అమెరికాకు పలు ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే పొరుగు దేశం దక్షిణ కొరియాతో చర్చలకు కిమ్ సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా ఇచ్చిన సందేశంలో కిమ్ శాంతి ప్రస్తావన తేవటం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘ఉత్తర కొరియా ప్రజలు కోరుకునేది ఒక్కటే.. శాంతి. ఒంటరిగా ఓ దేశం అభివృద్ధి సాధించటం జరిగే పని కాదు. అందుకు పొరుగు దేశాల సహకారం చాలా అవసరం. దక్షిణ కొరియాతో దౌత్యానికి ఉత్తర కొరియా ఎల్లప్పుడూ సిద్ధం’’ అన్న కిమ్ సందేశాన్ని ప్యోంగ్యాంగ్, సియోల్ లోని అన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. దౌత్యపరమైన సంబంధాల ద్వారానే అది సాధ్యమంటూ అందులో కిమ్ పేర్కొన్నట్లు ఆయా కథనాలు ఉటంకించాయి. ఇక చర్చల ప్రతిపాదనను సియోల్(దక్షిణ కొరియా) వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే అమెరికా మాత్రం ఆ విషయంలో షరా మాములుగా అనుమానాలనే వ్యక్తం చేస్తోంది. కిమ్‌ను నమ్మలేం : అమెరికా కిమ్ వైఖరిలో మార్పును అంత తేలికగా నమ్మటం మంచిది కాదన్న భావనలో అమెరికా ఉంది. ‘‘ఉత్తర కొరియా ప్రకటను తక్షణమే స్వాగతించలేం. అణ్వాయుధాల నిషేధం అమలు.. కవ్వింపు చర్యలను పూర్తిగా నిలిపివేశాకే చర్చల గురించి ఆలోచించటం ఉత్తమం. దక్షిణ కొరియాకు మేం సూచించేది కూడా అదే.’’ అని అమెరికా తరపున ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హలే చెబుతున్నారు. మరి అమెరికా శాంతి చర్చలకు ముందుకు వస్తుందా? అన్న ప్రశ్నకు మాత్రం ఆమె దాటవేత ధోరణిని ప్రదర్శించారు. తెరపైకి ‘ఫ్రీజ్ ఫర్ ఫ్రీజ్’ అగ్రిమెంట్... ఉత్తర కొరియా వైపు నుంచి కవ్వింపు చర్యలు తగ్గినట్లు కనిపిస్తుండటంతో స్వచ్ఛందంగా దౌత్యానికి అమెరికానే ముందుకు రావటమే మంచిదని సీనియర్ రక్షణ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు మాటల యుద్ధానికి తెరదించి ఆపై ఇరు దేశాలు తటస్థ వేదికగా చర్చలు జరపటం ఉత్తమమని.. ఈ మేరకు రష్యా, చైనాలు చొరవతో గతంలో ప్రతిపాదించిన ‘ఫ్రీజ్ ఫర్ ఫ్రీజ్ ఒప్పందం’ అమలు చేయటం పెద్ద కష్టమైన పనేం కాదని వారంటున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలన్నింటిని అమెరికా తక్షణమే ఎత్తివేయాల్సి ఉంటుంది. అదే సమయంలో దశల వారీగా అణు క్షిపణుల విషయంలో ఉత్తర కొరియా నియంత్రణ పాటిస్తూ నిషేధం దిశగా అడుగులు వేయాలి. తద్వారానే శాంతి చర్చలు దశల వారీగా ముందుకు కొనసాగుతుంటాయి. ఇది కూడా చదవండి... కిమ్.. నీ కంటే నాది పెద్దది : ట్రంప్ -
కశ్మీర్ సమస్యపై ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం
భారత్‌తో శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటున్నాం - పాక్ 69వ స్వాతంత్య్ర వేడుకల్లో ఆ దేశాధ్యక్షుడు హుస్సేన్ ఇస్లామాబాద్: కశ్మీర్ సహా పలు దీర్ఘకాలిక సమస్యలపై భారత్‌తో ద్వైపాకిక్ష చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రకటించారు. భారత్ సహా పొరుగుదేశాలన్నింటితోనూ శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే తమ భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొంటామని అన్నారు. పాక్ 69వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం జరిగాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హుస్సేన్ మాట్లాడారు. సరిహద్దులో ఇటీవలి కాల్పుల ఘటనల విచారం వ్యక్తం చేశారు. కాగా, స్వేచ్ఛ కోసం కశ్మీరీలు చేస్తున్న పోరాటాన్ని పక్కన పెట్టలేమని భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు. పాక్ స్వాతంత్య్రదినం సందర్భంగా ఆ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పాక్ సైన్యం శుక్రవారమూ కశ్మీర్ సరిహద్దులో కాల్పులు జరిపింది. శ్రీనగర్‌లో పాక్ జెండా: పాక్ స్వాతంత్య్ర దినం సందర్భంగా దుఖ్తరన్-ఇ-మిలాత్(డీఈఎం) వేర్పాటువాద సంస్థ నిరసనకారులు శుక్రవారం శ్రీనగర్‌లో పాక్ జెండాను ఎగరేశారు. డీఈఎం నాయకురాలు అసియా అంద్రాబి నేతృత్వంలో నగరంలోని బచ్పోరా ప్రాంతంలో జెండాను ఎగురవేసి, పాక్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఉగ్రవాదంవైపు ఆకర్షితులయ్యేలా యువకులను అంద్రాబీ రెచ్చగొడుతోందని బీజేపీ ప్రతినిధి ఖలీద్ జహంగీర్ ఆరోపించారు.