కశ్మీర్ సహాపలు దీర్ఘకాలిక సమస్యలపై భారత్‌తో ద్వైపాకిక్ష చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రకటించారు...
భారత్‌తో శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటున్నాం
- పాక్ 69వ స్వాతంత్య్ర వేడుకల్లో ఆ దేశాధ్యక్షుడు హుస్సేన్
ఇస్లామాబాద్: కశ్మీర్ సహా పలు దీర్ఘకాలిక సమస్యలపై భారత్‌తో ద్వైపాకిక్ష చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రకటించారు. భారత్ సహా పొరుగుదేశాలన్నింటితోనూ శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే తమ భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొంటామని అన్నారు. పాక్ 69వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం జరిగాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హుస్సేన్ మాట్లాడారు. సరిహద్దులో ఇటీవలి కాల్పుల ఘటనల విచారం వ్యక్తం చేశారు. కాగా, స్వేచ్ఛ కోసం కశ్మీరీలు చేస్తున్న పోరాటాన్ని పక్కన పెట్టలేమని భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు. పాక్ స్వాతంత్య్రదినం సందర్భంగా ఆ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పాక్ సైన్యం శుక్రవారమూ కశ్మీర్ సరిహద్దులో కాల్పులు జరిపింది.
శ్రీనగర్‌లో పాక్ జెండా: పాక్ స్వాతంత్య్ర దినం సందర్భంగా దుఖ్తరన్-ఇ-మిలాత్(డీఈఎం) వేర్పాటువాద సంస్థ నిరసనకారులు శుక్రవారం శ్రీనగర్‌లో పాక్ జెండాను ఎగరేశారు. డీఈఎం నాయకురాలు అసియా అంద్రాబి నేతృత్వంలో నగరంలోని బచ్‌పోరా ప్రాంతంలో జెండాను ఎగురవేసి, పాక్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఉగ్రవాదంవైపు ఆకర్షితులయ్యేలా యువకులను అంద్రాబీ రెచ్చగొడుతోందని బీజేపీ ప్రతినిధి ఖలీద్ జహంగీర్ ఆరోపించారు.