Long term problems
-
లాంగ్ కోవిడ్‌తో అవయవాలకు ముప్పు
లండన్: కోవిడ్–19 మహమ్మా రి బారినపడి, ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగైన వారిలో కూడా అవయవాలు దెబ్బతింటున్నట్లు యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో వివిధ యూనివర్సిటీల సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. లాంగ్ కోవిడ్‌తో శరీరంలోని కొన్ని ప్రధాన అవయవాలు క్రమంగా పనిచేయడం ఆగిపోతున్నట్లు గుర్తించామని పరిశోధకులు చెప్పారు. కరోనా బాధితుల మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) స్కానింగ్లతో ఈ విషయం కనిపెట్టినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలకు లాంగ్ కోవిడ్ ముప్పు మూడు రెట్లు అధికంగా పొంచి ఉందని అన్నారు. మనిషిపై దాడి చేసిన కరోనా వైరస్ తీవ్రతను బట్టి ముప్పు తీవ్ర కూడా పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’ పత్రికలో ప్రచురించారు. 259 మంది కరోనా బాధితులపై అధ్యయనం నిర్వహించారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక 5 నెలల తర్వాత వారి ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలించారు. కరోనా సోకని వారితో పోలిస్తే వారి శరీరంలోని ప్రధాన అవయవాల్లో కొన్ని వ్యత్యాసాలను గుర్తించారు. అన్నింటికంటే ఊపరితిత్తులే అధికంగా ప్రభావితం అవుతున్నట్లు తేల్చారు. గుండె, కాలేయం ఏమాత్రం దెబ్బతినడం లేదని గమనించారు. లాంగ్ కోవిడ్‌కు మరింత ప్రభావవంతమైన చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. -
10 మందిలో ఒకరిపై కరోనా దీర్ఘకాల ప్రభావం
న్యూఢిల్లీ: కోవిడ్–19 సోకిన ప్రతీ పది మందిలో ఒకరిపై వైరస్ దుష్ప్రభావాలు దీర్ఘకాలం కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా బారిన పడ్డవారి పనితీరు, సామాజిక, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది జర్నల్ జామా ప్రచురించింది. స్వీడన్‌లోని డాండ్రెయెడ్ ఆస్పత్రి, కరోలిన్సా్క ఇనిస్టిట్యూట్ ఈ సామాజిక సర్వేని నిర్వహించింది. కరోనాతో వాసన, రుచి ఎక్కువ రోజులు కోల్పోవడవం అత్యధిక మందిలో కనిపించిందని ఆ సర్వే వెల్లడించింది. అలసట, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు అంత దీర్ఘకాలం కనిపించలేదు. కరోనా వచ్చి తగ్గిపోయిన వారిలో 2,149 మంది నుంచి ప్రతీ నాలుగు నెలలకి ఒకసారి రక్త నమూనాలు సేకరించి పరీక్షించి చూడగా 10 మందిలో ఒకరిపై వైరస్ దుష్ప్రభావాలు దీర్ఘకాలం ఉన్నట్టు వెల్లడైంది. -
కశ్మీర్ సమస్యపై ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం
భారత్‌తో శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటున్నాం - పాక్ 69వ స్వాతంత్య్ర వేడుకల్లో ఆ దేశాధ్యక్షుడు హుస్సేన్ ఇస్లామాబాద్: కశ్మీర్ సహా పలు దీర్ఘకాలిక సమస్యలపై భారత్‌తో ద్వైపాకిక్ష చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రకటించారు. భారత్ సహా పొరుగుదేశాలన్నింటితోనూ శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే తమ భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొంటామని అన్నారు. పాక్ 69వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం జరిగాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హుస్సేన్ మాట్లాడారు. సరిహద్దులో ఇటీవలి కాల్పుల ఘటనల విచారం వ్యక్తం చేశారు. కాగా, స్వేచ్ఛ కోసం కశ్మీరీలు చేస్తున్న పోరాటాన్ని పక్కన పెట్టలేమని భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు. పాక్ స్వాతంత్య్రదినం సందర్భంగా ఆ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పాక్ సైన్యం శుక్రవారమూ కశ్మీర్ సరిహద్దులో కాల్పులు జరిపింది. శ్రీనగర్‌లో పాక్ జెండా: పాక్ స్వాతంత్య్ర దినం సందర్భంగా దుఖ్తరన్-ఇ-మిలాత్(డీఈఎం) వేర్పాటువాద సంస్థ నిరసనకారులు శుక్రవారం శ్రీనగర్‌లో పాక్ జెండాను ఎగరేశారు. డీఈఎం నాయకురాలు అసియా అంద్రాబి నేతృత్వంలో నగరంలోని బచ్పోరా ప్రాంతంలో జెండాను ఎగురవేసి, పాక్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఉగ్రవాదంవైపు ఆకర్షితులయ్యేలా యువకులను అంద్రాబీ రెచ్చగొడుతోందని బీజేపీ ప్రతినిధి ఖలీద్ జహంగీర్ ఆరోపించారు. -
సమ్మెకు సైరన్!
- నేటి నుంచి మునిసిపల్ కార్మికుల సమ్మె - పారిశుద్ధ్యం, నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం - ఆందోళనలో ప్రజలు చిత్తూరు(అర్బన్): తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఆరు మునిసిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాటపట్టనున్నారు. రాష్ట్ర కార్మిక సంఘనాయకుల పిలుపు మేరకు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. తమ సమస్యలు తీర్చేవరకు నిరవధిక సమ్మె చేస్తామని గురువారం జిల్లాలోని అన్ని మునిసిపల్, కార్పొరేషన్ల కమిషనర్లకు, అధికారులకు కార్మికులు సమ్మె నోటీసులు జారీచేశారు. కార్మికుల సమ్మె ఫలితంగా నగరాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. జిల్లాలోని చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి మునిసిపాలిటీల్లో దాదాపు 1,100 మంది శాశ్వత ప్రాతిపదికన, 3 వేల మందికి పైగా తాత్కాలిక పద్ధతిన కార్మికులు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రులు సైతం రోడ్లపై చెత్తను తీయడం, కాలువల్లో పూడికలు తీయడం లాంటి పనులను చేస్తున్నారు. అయితే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏడాది కాలంగా ప్రభుత్వానికి పలుమార్లు వినతులు అందచేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొన్ని మునిసిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వీధి దీపాల నిర్వహణ, నీటి కొళాయిల ఆపరేటర్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. తాగునీటి సరఫరాపై సమ్మె ప్రభావం పడనుంది. ఇవీ డిమాండ్లు... - జీవో నెం - 263ను పునరుద్ధరించి 1994 నుంచి పదవీ విరమణ చేసిన పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. - పారిశుద్ధ్య పనుల్లో జీవో నెం - 581ను అమలు చేసి గ్లోబల్ టెండర్లను రద్దు చేయాలి. - 1993 కంటే ముందు నుంచి టైమ్‌స్కేల్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే పర్మినెంట్ చేయాలి. కాంట్రాక్టు కార్మికులను సైతం పర్మినెంట్ చేయాలి. - దశాబ్దాల కాలంగా కార్మికులు నివసిస్తున్న మునిసిపల్ క్వార్టర్స్‌ను రెంట్‌ఫ్రీ క్వార్టర్స్‌గా పరిగణించి కార్మికులకు అప్పగించాలి. - కార్మికులకు వాషింగ్ అలవెన్స్, కుట్టుకూలీ పెంచాలి. వ్యక్తిగత జీపీఎఫ్ నెంబర్లు కేటాయించాలి. - ప్రభుత్వ సెలవు దినాల్లో కార్మికులకు పూర్తిగా సెలవులు అమలు చేయాలి. - సీడీఎంఏ కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలి.