
న్యూఢిల్లీ: కోవిడ్–19 సోకిన ప్రతీ పది మందిలో ఒకరిపై వైరస్ దుష్ప్రభావాలు దీర్ఘకాలం కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా బారిన పడ్డవారి పనితీరు, సామాజిక, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది జర్నల్ జామా ప్రచురించింది. స్వీడన్‌లోని డాండ్రెయెడ్ ఆస్పత్రి, కరోలిన్సా్క ఇనిస్టిట్యూట్ ఈ సామాజిక సర్వేని నిర్వహించింది.
కరోనాతో వాసన, రుచి ఎక్కువ రోజులు కోల్పోవడవం అత్యధిక మందిలో కనిపించిందని ఆ సర్వే వెల్లడించింది. అలసట, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు అంత దీర్ఘకాలం కనిపించలేదు. కరోనా వచ్చి తగ్గిపోయిన వారిలో 2,149 మంది నుంచి ప్రతీ నాలుగు నెలలకి ఒకసారి రక్త నమూనాలు సేకరించి పరీక్షించి చూడగా 10 మందిలో ఒకరిపై వైరస్ దుష్ప్రభావాలు దీర్ఘకాలం ఉన్నట్టు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment