
న్యూఢిల్లీ: భారత్, భూటాన్‌లు తమ మధ్య భాగస్వామ్యాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. రెండు దేశాల మధ్య సహకారంలో ఇంధన రంగం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, టెక్నాలజీపై దృష్టి పెట్టాలని అంగీకారానికి వచ్చాయి.
భారత్‌లో రెండు రోజుల పర్యటనకు గురువారం ఢిల్లీకి చేరుకున్న భూటాన్ రాజు జిగ్మే ఖెసర్ నంగ్యేల్ వాంగ్చుక్ ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించారు. థింపు ఆర్థిక ఉద్దీపన కార్యక్రమానికి తోడ్పాటునిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment