Bhutan
-
భూటాన్‌లో అనిల్ అంబానీ ప్రాజెక్ట్‌లు అభివృద్ధి
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ భూటాన్‌లో ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో 1,270 మెగావాట్ల సౌర, జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో పెట్టుబడులు పెంచేందుకు భూటాన్ ప్రభుత్వ వాణిజ్య విభాగం డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (డిహెచ్ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.రిలయన్స్ ఈ వెంచర్ కోసం రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. దీన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రమోట్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. ఇది సోలార్, హైడ్రో ప్రాజెక్టులతో సహా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతుందని తెలిపింది. భూటాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఇది వచ్చే రెండేళ్లలో పూర్తవుతుంది. 770 మెగావాట్ల సామర్థ్యంలో ‘చమ్ఖర్చు-1’ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ భూటాన్ అంతటా స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్, మీటరింగ్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!ఈ ఏడాది సెప్టెంబర్ నెల 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. గ్రూప్ సంస్థలు వాటి షేర్ విలువను పెంచుకుంటున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఊరటనిచ్చింది. సంస్థ బకాయిలను క్లెయిమ్ చేయాలని మహారాష్ట్ర రాష్ట్ర పన్నుల శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది. -
భారత్.. భూటాన్ మధ్య ఒప్పందం: ఎందుకంటే?
దేశ రాజధానిలో జరిగిన గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ సందర్భంగా.. భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (BFDA)తో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్, భూటాన్ మధ్య ఆహార భద్రత అమలుకు సంబంధించిన ఒప్పందం జరిగిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం.. ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఎఫ్డీఏ మధ్య సాంకేతిక సహకారం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఆహార భద్రత, వాణిజ్య సౌలభ్యం విషయంలో భూటాన్‌తో మా భాగస్వామ్యంలో కీలకమైన అభివృద్ధిని సూచిస్తుందని.. ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ జీ కమల వర్ధనరావు పేర్కొన్నారు. బీఎఫ్డీఏతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా రెండు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే బలమైన, సమర్థవంతమైన ఆహార భద్రత ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాలను నెలకొల్పడంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నాయకత్వాన్ని అంగీకరించామని బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా (Gyem Bidha) పేర్కొన్నారు. భారత్, భూటాన్ మధ్య సురక్షితమైన ఆహార వాణిజ్యాన్ని సులభతరం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని అన్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఈ సమావేశానికి ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో భూటాన్ దేశానికీ చెందిన బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా, బీఎఫ్డీఏ ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ విభాగానికి చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు. భారత్ నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ సీనియర్ అధికారులు హాజరయ్యారు.India and Bhutan Deepen Cooperation on Food Safety and Regulatory StandardsThis Agreement underscores a mutual commitment to enhance food safety, aligning regulatory frameworks, simplifying the Food Import Procedure and fostering technical collaborationRead here:…— PIB India (@PIB_India) September 22, 2024 -
570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం
అదానీ గ్రూప్ భూటాన్‌లో 570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు తాజాగా భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే, గౌతమ్ అదానీలు ఒప్పందంపై సంతకాలు చేశారు.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. భూటాన్‌లోని చుఖా ప్రావిన్స్‌లో 570 మెగావాట్ల జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ దేశంలోని డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ ఆధ్వర్యంలో జరుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధిని అదానీ ప్రశంసించారు. భూటాన్‌లో హైడ్రోపవర్, ఇతర ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్నగౌతమ్అదానీ తన ఎక్స్‌ఖాతాలో ఈ పర్యటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గేతో సమావేశంకావడం చాలా సంతోషంగా ఉంది. చుఖా ప్రావిన్స్‌లో 570 మెగావాట్ల గ్రీన్ జలవిద్యుత్తు ప్రాజెక్ట్ ఏర్పాటుకు డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందం జరిగింది. అనంతరం భూటాన్ కింగ్ జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో సమావేశమయ్యాం. మౌలికసదుపాయాలు అభివృద్ధి చేయడానికి భూటాన్ చేస్తున్న కృషి అభినందనీయం’ అన్నారు. -
భూటాన్‌లో ప్రధానికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శుక్రవారం(మార్చ్ 22) ఉదయం భూటాన్ వెళ్లారు. ప్రధానికి భూటాన్‌లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆ దేశ ప్రధాని షెరిగ్ టోబ్గే ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయమై ప్రధాని చర్చలు జరుపుతారు. భూటాన్ రాజుతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గత వారమే భూటాన్ ప్రధాని భారత్‌లో ఐదు రోజుల పాటు పర్యటించి వెళ్లారు. నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింంది. భూటాన్‌తో భారత్ సంబంధాలు విశిష్టమైనవని తెలిపింది. కాగా, భూటాన్‌లో షెరిగ్ టోబ్గే ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరింది. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ చెప్పినా నిర్ణయం మారదు -
ప్రధాని మోదీ భూటాన్ పర్యటన వాయిదా.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల భూటాన్ దేశ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. ‘భూటాన్‌లోని పారో విమనాశ్రయం వద్ద గల ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మార్చి 21-22 తేదీల్లో ప్రధాని భూటాన్ పర్యటనను వాయిదా వేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. కొత్త తేదీలపై ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే తెలియజేస్తాం’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రేపు(గురువారం) ప్రధాని భూటాన్ బయలుదేరాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఆ దేశంలో మోదీ పర్యటించాల్సి ఉంది. భారత్ సన్నిహిత, సరిహద్దు దేశం భూటాన్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడుతాయని అంతా ఆకాంక్షించారు. అయితే షెడ్యూల్ సందర్శనకు ఒక రోజు ముందు పర్యటన వాయిదా పడినట్లు ప్రకటన వెలువడింది. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో భూటాన్‌లోని రోడ్లమీద.. మోదీకి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున పోస్టర్లు అంటించారు. ఇదిల ఉండగా గత వారం భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే అయిదు రోజులపాటు భారత్‌లో పర్యటించారు. గత జనవరిలోభూటాన్ ప్రధానిగా బాధ్యతలు స్పీకరించిన తర్వాత టోబ్గే తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని ఆయన ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోడీ అంగీకరించారు. చదవండి: రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని మోదీ ఫోన్ కాల్.. -
దీపికా పదుకొనే మెచ్చిన 'ఈమా దత్షి' రెసిపీ!
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఒకనొక ఇంటర్వ్యూలో ఈమా దత్షి రెసిపీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. నిజానికి ఈమా దత్షీ రెసిపీ భూటాన్ వంటకం. తన అభిమానులకు ఈ వంటకం గురించి షేర్ చేశారు దీపికా. ఈ రెసిపీ రుచి, తయరీ విధానాల గురించి పంచుకున్నారు. గతేడాది దీపికా ఏప్రిల్ 2023లో భూటాన్ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ ప్రత్యేక భూటాన్ వంటకంపై మనసు పారేసుకున్నానని, ఇప్పుడది తన ఫేవరెట్ డిష్ అని చెప్పుకొచ్చారు ఆమె. ఇంతకీ ఏంటా ఈమా దత్షి రెసిపీ. ఏ కూరగాయాలకు సంబంధించిన వంటకం అంటే.. ఈమా దత్షి అనేధి భూటాన్ జాతీయ వంటకం.దీన్ని పచ్చి ఎర్ర మిరపకాయలు, చీజ్, మిరియాలు, ఉల్లిపాయలు, టొమాటోలతో కలిపి చేసే ఒక విధమైన రెసిపీ. దీన్ని లంచ్ లేదా డిన్నర్ టైంలో కర్రీగా తినదగిన రెసిపీ. దీన్ని ఎవ్వరైనా పదినిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆస్వాదించొచ్చు. ఎలా చేయాలంటే...? టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, నల్ల మిరియాలు తదితర పదార్థాలన్నింటిని తీసుకుని వాటిపై కాస్త నూనె పొయ్యండి. పాన్‌లో ఒక కప్పు నీరు పోసి పదార్థాలను బాగా కలపి పెద్దమంటపై ఉంచండి. అలాగే పాన్‌పై మూత పెట్టండి. వేడిని ఎక్కువ పెంచి పది నిమిషాలు ఉడకనివ్వండి. కూరగాయాలు ఉడికన తర్వాత మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది. వెంటనే స్టవ్‌ని మీడియంలో పెట్టి.. కాస్త నెయ్యి, కొద్దిగా చీజ్, కొద్దిగా మసాల వంటివి కూడా వెయ్యండి. అంతే ఈమా దత్షి రెడీ. ఇది అన్నం లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది. జొంగ్ఖా భాషలో ఈమా అంటే మిరపకాయ. ఇక దట్షి అంటే చీజ్ అని అర్థం. వాటితో చేసే రెసిపీ కాబట్టి దీన్ని 'ఈమా దత్షి' అని పిలుస్తారు భూటాన్ వాసులు. View this post on Instagram A post shared by Leaping Windows (@leapingwindows) (చదవండి: స్టన్నింగ్ బ్యూటీ శోభితా ధూళిపాళ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
"పెనిస్ విలేజ్"! ఆ గ్రామంలోని ఏ గోడపై చూసినా..!
అత్యంత విచిత్రమైన గ్రామం. ఇక్కడ ఏ గోడ చూసినా విస్తుపోతాం. ప్రతి ఇంటి గోడపైనే ఆ చిత్రమే ఉండటం విశేషం. గోడలపై చిత్రించే ఆ చిత్రాలు ఎంతలా అవి భాగమంటే ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలపై కూడా అదే చిత్రం. కొత్తగా వచ్చినా పర్యాటకులు ఈ గ్రామం తీరుని చూసి ఖంగుతింటారు. ఆ ఆకృతి పట్ల ఉన్న నమ్మకం వింటే నవ్వు వచ్చేలా ఉంటుంది. ఆ చిత్రాలు చూడటానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. అక్కడ ప్రజలు దీన్ని ఓ ఆచారంగానే గాక అవే తమకు మంచి చేశాయని ప్రగాడంగా నమ్మడం మరింత విచిత్రంగా ఉంటుంది. ఇంతకీ అక్కడ గోడలపై ఎలాంటి చిత్రాలు ఉంటాయంటే.. భూటాన్‌లోని థింపు నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే ఈ పునాఖా లోయలోని సోప్సోఖా అనే గ్రామానికి వెళ్లగలుగుతాం. అక్కడ కనిపించే ప్రతి గోడపై నిటారుగా 'మానవ పురుషాంగం" ఆకృతి దర్శనమిస్తుంది. వినేందుకు ఇబ్బందిగా ఉన్న ఇది నిజం. ఆ గ్రామంలో ప్రతి ఇంటి మీదే కాదు! దేవాలయాలు, ప్రభుత్వ సంస్థల గోడలపై కూడా ఆ ఆకృతి ఉంటుంది. ఇది వారి ఆచారం, నమ్మకాలకు సంబంధించింది. ఈ ఆకృతిలో ఉండే హస్తకళ దుకాణాలు కూడా ఎక్కువే. ఎలాంటి నిషేధం లేకుండా యథేచ్ఛగా ఈ ఆకారంలోని బొమ్మలు, శిల్పాలు అక్కడ అముమ్మతుండటం విశేషం. ఆఖరికి టీ షర్టు, పోస్టర్లపై కూడా ఈ ఆకృతి తప్పనిసరిగా ఉంటుంది. ఈ సంప్రదాయనికి మూలం 15వ శతాబ్దపు బౌద్ధ సన్యాసి ద్రుక్పా కున్లేకి చెందినదని చెబుతారు అక్కడి ప్రజలు. అతను బౌధ్ధమతాన్ని వ్యాప్తి చేసే సాంప్రదాయేతరు పద్ధతులకు అత్యంత ప్రసిద్ధి. లోతైన ఆధ్యాత్మక సందేశాలను తెలియజేయడానికి ఇలా ఫాలస్(పురుషాంగం ఆకృతిలో)లో ఉండే వాటిని వినియోగించడంతో ఇలా అక్కడ వాళ్లంతా తమ ఇంటి గోడలపై ఆ చ్రితాన్ని తప్పనిసరిగా వేయించుకుంటారు. అంతేగాదు ఆయనకు చెందిన మఠం ఆగ్రామంలోనే ఉంది. దీంతో ప్రజలు ఆ గ్రామాన్ని ప్రముఖ తీర్థక్షేత్రంగా భావించి తండోపతండాలు వచ్చి ఆ మఠాన్ని దర్శించుకుంటారు . ముఖ్యంగా మహిళలు, సంతానలేమితో బాధపడే జంటలు ఈ గ్రామంలోని మఠాన్ని సందర్శించడానికి వస్తారు. దీన్ని సంతానోత్పత్తి క్షేత్రంగా చెబుతారు. అక్కడకు వచ్చిన భక్తులను ఫాలస్ ఆకృతిలో ఉన్న చెక్కతోనే ఆశ్వీరదించడం మరింత విచిత్రం. ఈ ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత ఆ జంటలకు తప్పనిసరిగా సంతానం కలుగుతుందని అక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు అలా సంతానం కలిగిన జంటల గాథలు కూడా అక్కడ దేవాలయంలో ఉంటాయి. ఆఖరికి పుట్టిన పిల్లల పేర్లు కూడా ఆ మఠం లేదా ఆ సన్యాసి పేరు మీదగా పేర్లు పెడుతారు. ఈ చిహ్నం వారిని దుష్టశక్తులకు దూరం చేసి, సంతానోత్పత్తిని కలిగించే అదృష్ట గుర్తుగా విశ్వసిస్తారు అక్కడి ప్రజలు. అక్కడ భూటాన్‌లోని ప్రతి ఇంట్లో ఈ గ్రామం నుంచి కొనగోలు చేసిన ఫాలస్(పురుషాంగం ఆకృతి)లు తప్పనిసరిగా ఉంటాయి. ఈ నమ్మకం కాస్త నవ్వు తెప్పించినప్పటికీ.. అక్కడ అడుగు పెట్టాలంటే కఠిన నిబంధనలు అనుసరించాల్సిందే. అంతేగాదు భూటాన్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం కూడా. అందుకు ఇది కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చు. (చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?) -
భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరమై పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. తన ట్రీట్మెంట్లో భాగంగా రకరకాల థెరపీలను ట్రై చేస్తోంది సమంత. ఇటీవలె క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం భూటాన్‌లో ఉన్న సమంత.. డాట్‌షో (హాట్ స్టోన్ బాత్) అనే ఆయుర్వేద చికిత్సను తీసుకుంటుంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ వల్ల కలిగే ఉపయోగాలను సైతం పంచుకుంది. భూటాన్‌లో హాట్ స్టోన్ బాత్ అనే ఆయుర్వేద ట్రీట్మెంట్ బాగా ఫేమస్. దీనిపై సమంత స్వయంగా తన పోస్టులో షేర్ చేస్తూ..''వేల ఏళ్ల క్రితం నుంచే భూటన్లో ఈ ఆచారం ఉంది. ఆయుర్వేదలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న భూటాన్ ప్రజలు స్టోన్ బాత్‌ని ఆచరిస్తున్నారు. నదులలో ఉన్న రాళ్లను ఎర్రగా కాలుస్తారు. వాటిని నీటిలో వేస్తారు. రాళ్లల్లో ఉన్న మినరల్స్ కరిగి భూటానీస్ హాట్ టబ్‌లోకి చేరుతాయి. ఈ ప్రక్రియలో కెంపా అనే మూలికలు కూడా వాడతారు. ఆ స్టోన్స్, మూలికలు ఈ హాట్ వాటర్ లో కరిగి వాటి శక్తి నీళ్లకు అందగా దీంట్లో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న బాడీ పెయిన్స్, అలసట, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత.. ఇలాంటివి అన్ని మాయం అవుతాయి. కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి'' అంటూ ఆ ప్రాసెస్‌ని వివరించింది సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) మజిల్ పెయిన్, ట్రావెల్ సిక్నెస్, మజిల్ - బోన్ రిలేటెడ్ ట్రబుల్స్కీ, ఆర్తిరైటిస్, స్పాండిలైటిస్, జాయింట్ పెయిన్స్, స్టొమక్ సిక్నెస్ వంటివాటికి అన్నిటికీ ఈ బాత్ ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ వంటి ప్రదేశాలకు వెళ్లింది. ఇప్పుడు భూటాన్‌లో ఆయుర్వే చికిత్సను తీసుకుంటూనే మరోపక్క అక్కడి ప్రకృతి ప్రదేశాలు, బుద్ధుడి ఆలయాలను సందర్శిస్తుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
చైనా కొత్త ఎత్తులు
ప్రపంచమంతా కొత్తగా రాజుకున్న ఇజ్రాయెల్ – గాజా లడాయిపై దృష్టి కేంద్రీకరిస్తున్న తరుణంలో చడీచప్పుడూ లేకుండా చైనా పావులు కదిపింది. మన సన్నిహిత దేశాలైన భూటాన్, శ్రీలంకలతో ఒప్పందాలు కుదుర్చుకుని మనల్ని ఇరకాటంలో పడేసింది. చైనాలో పర్యటించిన భూటాన్ విదేశాంగమంత్రి తాండీ దోర్జీతో చైనా ఉప విదేశాంగమంత్రి సన్ వీ డాంగ్ సంప్రదింపులు జరిపి ఇరుదేశాల సరిహద్దు వివాదాన్నీ పరిష్కరించుకోవటానికి ఉమ్మడి సాంకేతిక నిపుణుల బృందం ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకున్నారు. రెండు దేశాల మధ్యా దౌత్యసంబంధాలు ఏర్పాటుచేసు కోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అటు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే కూడా చైనా సందర్శించి ఆ దేశం తలపెట్టిన బృహత్తర ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ)లో తమ దేశం పాలుపంచుకుంటుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై త్వరలో సంతకాలవుతాయని సంయుక్త ప్రకటనలో తెలిపారు. భూటాన్, శ్రీలంక రెండూ సార్వభౌమాధి కారం వున్న దేశాలు. తమ ప్రయోజనాలకు తగినట్టు అవి నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఆ ఒప్పందాల పర్యవసానాలు భారత్ భద్రతతో ముడిపడివుండటం మనల్ని కలవరపరిచే అంశం. శ్రీలంక మాటెలావున్నా భూటాన్‌తో మనకు ప్రత్యేక అనుబంధం వుంది. 2007 వరకూ భూటాన్‌తో వున్న స్నేహ ఒడంబడిక ప్రకారం మన దేశం ఆమోదించిన 21 దేశాలతో మాత్రమే అది దౌత్య సంబంధాలు ఏర్పర్చుకునేది. యూపీఏ హయాంలో ఈ ఒప్పందం గడువు ముగిసినా మన దేశం చొరవ తీసుకోకపోవటం, ఈలోగా ఆ ఒప్పందం కింద భూటాన్‌కి అప్పటివరకూ ఇచ్చే సబ్సిడీలు ఆగిపోవటం సమస్యలకు దారితీసింది. ఆ దేశంలో ఒక్కసారిగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పోయాయి. వాస్తవానికి భూటాన్ ఉత్తర సరిహద్దులో వున్న చంబీలోయ ప్రాంతాన్ని తమకు ధారాదత్తం చేయమని చైనా కోరినా అది భారత్ భద్రతకు సమస్యలు తెచ్చిపెడుతుందన్న ఏకైక కారణంతో భూటాన్ తిరస్కరించింది. 2005లో భూటాన్ రాజు ఐచ్ఛికంగా రాచరిక ఆధిప త్యాన్ని వదులుకుని రాజ్యాంగబద్ధ పాలనకు బాటలు పరిచారు. అటు తర్వాత నుంచి భూటాన్ ఆలోచన మారింది. దేశానికి గరిష్ఠంగా మేలు చేసే విదేశాంగ విధానం అనుసరించాలన్న అభి ప్రాయం బలపడింది. అలాగని 2017లో డోక్లామ్‌లో చైనాతో వివాదం తలెత్తినప్పుడు భూటాన్ మన సాయమే తీసుకుంది. అయితే మన దేశం మరింత సాన్నిహిత్యంగా మెలిగివుంటే అది చైనా వైపు చూసేది కాదు. డోక్లామ్‌కు దగ్గరలో చైనా భూగర్భ గిడ్డంగుల్ని నిర్మిస్తోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మన దేశాన్ని నిరుడు హెచ్చరించింది. అలాగే అక్కడికి సమీపంలో ఒకటి రెండు గ్రామాలను సృష్టించి ప్రజలను తరలించిందన్న వార్తలొచ్చాయి. డోక్లామ్ ప్రాంతం భారత్– భూటాన్– చైనా సరిహద్దుల కూడలి. అలాంటిచోట చైనా రోడ్డు నిర్మాణానికి పూనుకోవటం వల్ల 2017లో వివాదం తలెత్తింది. మన దేశం గట్టిగా అభ్యంతరాలు తెలపటంతో చైనా వెనక్కు తగ్గింది. కానీ ఆనాటి నుంచీ భూటాన్‌ను బుజ్జగించే ప్రయత్నాలు అది చేస్తూనేవుంది. ఒకపక్క మనతో వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడ్డ వివాదాల పరిష్కారానికి ఏ మాత్రం సిద్ధపడకుండా, చర్చల పేరుతో కాలయాపన భూటాన్‌తో మాత్రం సన్నిహితం కావటానికి చైనా ప్రయత్నించటంలోని ఉద్దేశాలు గ్రహించటం పెద్ద కష్టం కాదు. ఇటు శ్రీలంక సైతం మన అభ్యంతరాలను బేఖాతరు చేసి బీఆర్ఐ ప్రాజెక్టులో పాలుపంచు కునేందుకే నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు పక్షాలూ అంగీకరించాయి. హిందూ మహా సముద్ర ప్రాంతంలో మనల్ని దెబ్బతీసేందుకు మనకు సన్నిహితంగా వుండే దేశాలను రుణాలతో, భారీ ప్రాజెక్టులతో తనవైపు తిప్పుకునే చైనా ప్రయ త్నాలు ఈనాటివి కాదు. భారీ నౌకాశ్రయాలు, రహదారులు, విమానాశ్రయాలు నిర్మించేందుకు తమ ఎగ్జిమ్ బ్యాంకు ద్వారా చైనా అందించిన రుణాలు లంకను కుంగదీశాయి. విదేశీ మారకద్రవ్యం నిల్వలు చూస్తుండగానే అడుగంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థ గుల్లయింది. ధరలు పెరిగిపోవటం, నిత్యావసరాల కొరత ఏర్పడటం పర్యవసానంగా నిరుడు తీవ్ర నిరసనలు పెల్లుబికి రాజపక్స సోద రులు, వారి కుటుంబసభ్యులు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మన దేశం శ్రీలంకకు తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. బీఆర్ఐ ప్రాజెక్టుకు అంగీకరించి, చైనా ఇస్తున్న రుణాలకు ఆమోదముద్ర వేస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని ఈనెల 11న కొలంబోలో జరిగిన హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల సదస్సు సందర్భంగా మన విదేశాంగమంత్రి జైశంకర్ హెచ్చరించారు. నిరుడు దేశంలో సంక్షోభం తలెత్తినప్పుడు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర 20 దేశాలున్న పారిస్ క్లబ్‌తో పాటు మన దేశం కూడా శ్రీలంకకు ఒక షరతు పెట్టింది. రుణాల చెల్లింపులో ఒకే విధమైన నిబంధనలు అనుసరించాలని, ద్వైపాక్షిక ఒప్పందం పేరుతో ఎవరికీ వెసులు బాటు ఇవ్వరాదని తెలిపాయి. అయినా చైనా విషయంలో అందుకు భిన్నమైన మార్గాన్ని శ్రీలంక ఎంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం జాగ్రత్తగా అడుగులేయాలి. మన వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బతీసే రీతిలో చైనాతో ఒప్పందాలు కుదుర్చుకొనరాదని శ్రీలంక, భూటాన్‌లకు నచ్చజెప్పాలి. ఏ కారణాలు వారిని చైనా వైపు మొగ్గు చూపేందుకు దారితీస్తున్నాయో గ్రహించి మనవైపు ఏమైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకోవాలి. సకాలంలో సరైన కార్యాచరణకు పూనుకుంటే మనకు సానుకూల వాతావరణం ఏర్పడటం పెద్ద కష్టం కాదు. -
భూటాన్ వెళ్లేవారికి శుభవార్త! ఆ ఫీజు సగానికి తగ్గింపు
హిమాలయ పర్యాటక దేశమైన భూటాన్ తమ దేశానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త చెప్పింది. తమ దేశంలో పర్యటించే టూరిస్టులకు విధించే డైలీ ఫీజును సగానికి తగ్గించింది. ఇప్పటి వరకు 200 డాలర్లు (రూ.16,500) ఉన్న డైలీ ఫీజును 100 డాలర్లు (రూ.8,250)లకు తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. "సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు" పేరుతో పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న ఈ డైలీ ఫీజును గత సంవత్సరం సెప్టెంబర్‌లో 65 డాలర్ల నుంచి ఏకంగా 200 డాలర్లకు పెంచింది భూటాన్. ఈ మొత్తాన్ని కాలుష్య నివారణకు వెచ్చించనున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు తగ్గించిన డైలీ ఫీజు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తుందని, నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్నేళ్ల ముందు వరకూ బయటి దేశాలతో సంబంధాలు లేకుండా భూటాన్ 1974లో తొలిసారిగా 300 మంది పర్యాటకులను తమ దేశ సందర్శనకు అనుమతించింది. 2019లో ఈ సంఖ్య 3,15,600కి పెరిగింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 15.1 శాతం పెరిగింది. పర్యాటకుల రద్దీని పెద్దగా ఇష్టపడని భూటాన్.. తమ దేశంలోని శిఖరాల పవిత్రతను కాపాడేందుకు పర్వతారోహణను నిషేధించింది. సందర్శన ఫీజు వసూలు కారణంగా ఆ దేశంలో పర్యటించేవారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే 3 బిలియన్ డాలర్లున్న తమ ఆర్థిక వ్యవస్థ మరింత పెంచుకోవాలని భావిస్తున్న భూటాన్ ఇందుకోసం పర్యాటక రంగం నుంచి వస్తున్న 5 శాతం ఆదాయాన్ని 20 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. ప్రధానంగా బౌద్ధ దేశమైన భూటాన్‌లో అనేక మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు సెప్టెంబర్-డిసెంబర్ కాలంలో ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో డైలీ ఫీజును సగానికి తగ్గించడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆ దేశ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ దోర్జీ ధ్రాధుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత జూన్‌లోనే పర్యాటకుల బస రుసుములపై ప్రభుత్వం నిబంధనలను సడలించింది. కానీ ఆశించినస్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరగలేదు. గత జనవరి నుంచి 56,000 మందికిపైగా పర్యాటకులు భూటాన్‌ను సందర్శించారని, ఇందులో దాదాపు 42,000 మంది భారతీయులే ఉన్నారని ధ్రాధుల్ చెప్పారు. -
అసోం హై అలర్ట్.. భూటాన్ చేసిన పనితో..
అసోం: వరదలతో ఉత్తరాది వణికిపోతున్న వేళ.. అసోం సహా పలు రాష్ట్రాలకు కొత్తగా మరో ముప్పు పొంచి ఉంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అసోంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. దాదాపు 4000 మంది వరకు ప్రజలు వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిశ్వనాథ్, బొంగైగాన్, ఛిరంజ్, ధేమాజీ, దిబ్రుగర్హ్, కోక్రజార్హ్, నల్బరి, టిన్సుకియా ప్రాంతాలు ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. అయితే.. తూర్పు భూటాన్‌లోని కురిచ్చు ప్రాజెక్టును డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(డీజీపీసీ) నిర్వహిస్తోంది. కాగా.. ఈ రిజర్వాయర్ నుంచి వరద నీటిను విడుదల చేయనున్నట్లు జులై 13 అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. నియంత్రిత పద్దతిలో కనీసం 9 గంటలపాటు నీటిని విడుదల చేయనున్నామని స్పష్టం చేసింది. దీంతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అప్రమత్తమయ్యారు. ఆయా ముంపుకు గురయ్యే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. జాగ్రత్తగా పరిస్థితులను గమనించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కురిచ్చు రిజర్వాయర్ వరదతో భేకీ, మనాస్ నదులు విజృంభించే అవకాశం ఉందని చెప్పారు. The Royal Government of Bhutan has informed us that tonight there will be an excess release of water from the Kurichu Dam. We have alerted our district administrations to remain vigilant and assist the people in every possible way in case the water breaches the Beki and Manas… — Himanta Biswa Sarma (@himantabiswa) July 13, 2023 అసోంలోని బ్రహ్మపుత్ర, భేకీ, డిసాంగ్ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 179 జిల్లాలు, 19 రెవెన్యూ సర్కిళ్లు, ముంపులో ఉన్నాయి. 2211.99 హెక్టార్ల పంట నష్టం జరిగింది. ధేమాజీ, ఛిరంగ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అసోం విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రస్తుతం భూటాన్ ప్రాజెక్టు నుంచి విడుదల అయ్యే నీటితో ఇంకా ఎంత నష్టం జరగనుందో అని ప్రజలు ఆందోళనలో చెందుతున్నారు. ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
‘డోక్లాం’పై భూటాన్‌తో టచ్‌లో ఉన్నాం
న్యూఢిల్లీ: డోక్లాం అంశానికి సంబంధించి భూటాన్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా తెలిపారు. రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగెల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు ద్వైపాక్షిక అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి ఐదుసూత్రాల రోడ్‌మ్యాప్‌ను వాంగ్‌చుక్ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. భేటీ వివరాలను క్వాట్రా మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డోక్లాంపై ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. భద్రతకు సంబందించిన అన్ని అంశాల్లోనూ ఇరు దేశాలు పరస్పరం సహకారం ఇచ్చి పుచ్చుకుంటున్నట్టు చెప్పారు. దీన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు భూటాన్ రాజు పర్యటన దోహదపడుతోందన్నారు. అసోంలోని కోక్రాఝార్ నుంచి భూటాన్‌లోని గెలెపు వరకు రైల్ లింక్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఇటీవలి కాలంలో భూటాన్ క్రమంగా చైనాకు దగ్గరవుతోందన్న అభిప్రాయాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాంగ్‌చుక్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయంటూ మోదీ ట్వీట్ చేశారు. ఆయన గౌరవార్థం విందు ఇచ్చారు. డోక్లాం.. అతి కీలకం వ్యూహాత్మకంగా డోక్లాం భారత్‌కు అత్యంత కీలకం. 2017లో అక్కడ భారత, చైనా సైనికులు ఏకంగా 73 రోజుల పాటు ఎదురెదురుగా మోహరించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం తెలిసిందే. భూటాన్‌లో తమదిగా చెప్పుకుంటున్న ప్రాంతంలో రోడ్డు వేసేందుకు చైనా ప్రయత్నించడం ఘర్షణకు కారణమైంది. దాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భూటాన్‌కు చైనాతో 400 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. విపత్తుల స్పందనకు సమగ్ర వ్యవస్థ: మోదీ ప్రాకృతిక విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమగ్రమైన సన్నద్ధత వ్యవస్థ అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక ప్రాంతంలో తలెత్తే విపత్తులు దానికి సుదూరంలో ఉన్న ప్రాంతాలపై కూడా భారీ ప్రభావం చూపించే ఆస్కారముందని గుర్తు చేశారు. విపత్తుల నిర్వహణ సన్నద్ధత వ్యవస్థపై జరిగిన ఐదో అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవలిషన్ ఫర్ డిజాస్టర్ రెజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో ఇప్పటికే 40 దేశాలు భాగస్వాములు కావడం హర్షనీయమన్నారు. ఈ విషయమై ఒక్క తాటిపైకి వచ్చేందుకు అభివృద్ధి చెందుతున్న చిన్న, పెద్ద దేశాలకు ఈ సదస్సు చక్కని వేదికగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. విపత్తు బాధితుల్లో ప్రతి ఒక్కరినీ పూర్తిస్థాయిలో ఆదుకునేలా వ్యవస్థను అభివృద్ధి చేసుకునే దిశగా కృషి జరగాలని ప్రధాని పిలుపునిచ్చారు. విపత్తుల వేళ తక్షణ ఉపశమనంతో పాటు సాధ్యమైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొనేలా చూడటంపై దృష్టి సారించాలన్నారు. ఇందుకు రవాణా సదుపాయాలతో పాటు సామాజిక, డిజిటల్ సదుపాయాలు కూడా చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
డోక్లామ్‌పై భూటాన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు
ఆరేళ్లుగా డోక్లామ్ అంశంపై భారత్, చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ అంశంపై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది కూడా. ఈ నేపథ్యంలో భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ చేసిన వ్యాఖ్యలు భారత్‌ని టెన్షన్లో పడేశాయి. ఇంతవరకు చైనా ఆ ప్రదేశంలోకి అక్రమంగా చోరబడుతోందని విశ్వసిస్తుంటే..ఈ వివాదం పరిష్కరించడంలో భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్ ప్రధాని షెరింగ్ అన్నారు. దీనిపై చర్చించేందుకు తాము సిద్దంగానే ఉన్నామని, భారత్, చైనాలు కూడా రెడీగా ఉంటే చర్చింకుందాం. అయినా మూడు సమాన దేశాలే. ఇందులో పెద్ద లేదా చిన్నా దేశాలు లేవు కదా అని అన్నారు. ఒకరకంగా భూటాన్ తాను చర్చలకు సుముఖంగా ఉన్నట్లు నేరుగానే సంకేతమిచ్చింది. కాగా, భారత్, చైనా, భూటాన్ కూడలిలో ఉండే ప్రాంతమే డోక్లాం. దీన్ని ట్రై జంక్షన్ అని కూడా పిలుస్తారు. ఐతే ఈ ఎత్తైన పీఠభూమి(డోక్లాం) సిలిగురి కారిడార్‌కి సమీపంలో ఉంది. సరిగ్గా చైనా ఈ ప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టి విస్తరించే యోచన చేసింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడమే గాక భారత్ బలగాలు ఆ పనులను అడ్డుకున్నాయి కూడా. వాస్తవానికి సిలిగురి కారిడార్ ఈశాన్య భారత రాష్ట్రాలను భారత్‌లోని మిగతా భూభాగంతో కలిపే ప్రాంతం. గతంలో 2019లో ఈ ట్రై జంక్షన్ పాయింట్ వద్ద ఏకపక్షంగా ఎటువైపు నుంచి ఎవరూ ఏమి చేయకూడదన్న ఒప్పందానికి భూటాన్ ప్రధాని షెరింగ్ చేసిన ప్రకటన చాలా విరుద్ధంగా ఉంది. దశాబ్దాలుగా ఈ ట్రై జంక్షన్ పాయింట్ అంతర్జాతీయ పటంలో బటాంగ్ లా ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతం చైనాకి ఉత్తరాన, భూటాన్‌కి ఆగ్నేయం, భారత్‌కి పశ్చిమాన ఉంది. అయితే చైనా ఆ ట్రై జంక్షన్‌ని బటాంగ్ లా నుంచి దక్షిణాం వైపు దాదాపు 7 కి.మీ దూరంలో ఉన్న మౌంట్ గిమ్‌మోచి అనే శిఖరానికి మార్చాలనుకుంటోంది. అదే జరిగితే మొత్తం డోక్లాం భూభాగం చైనాలో భాగమవుతుంది. ఇది భారత్‌కి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. చైనా 2017 నుంచి డోక్లాం విషయంలో వెనక్కి తగ్గినట్లే తగ్గి..డోక్లాం వెంబడి నేరుగా తూర్పున భూటాన్ భూభాగంలో ఉన్న అమోచు నది లోయం వెంబడి విస్తరించే యత్నం చేసింది. ఈ భూటాన్ భూభాగం గుండా అనేక గ్రామాల మధ్య చైనా రహదారిని నిర్మిచింది. తద్వారా భూటాన్ తన భూభాగాన్ని చైనా అప్పగించవలసి వచ్చిందన్న అక్కసుతో ప్రధాని షెరింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. భూటాన్ భూభాగంలోకి చైనా చొరబడిందని పలు వార్తలు వచ్చినప్పటికి భూటాన్ దాన్ని ఖండిస్తూ ఎలాంటి చొరబాటు జరగలేదని సమర్థించుకుంది. పైగా చైనా దొంగతనంగా ఆక్రమించిన భూభాగాలను భూటాన్ ప్రాంతాలు కాదని భూటాన్ వాదిస్తోందని భారత్ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు డాక్టర్ బ్రహ్మ చెల్లానీ అన్నారు. అంతేగాదు గతేడాది ఇరుపక్షాలు(చైనా, భూటాన్ నిపుణలు) కున్మింగ్లో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు 20 రౌండ్లకు పైగా చర్చలు జరిపింది. సానుకూల ఏకాభిప్రాయానికి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు భూటాన్ పేర్కొంది. చైనాతో తనకు పెద్దగా సరిహద్దు సమస్యలు లేవని, ఇంకా కొన్ని భూభాగాలను గుర్తించలేకపోయినట్లు చెప్పుకొచ్చింది. పైగా ఒకటో, రెండో సమావేశాల తదనంతరం విభజన రేఖను ఏర్పాటు చేసుకుంటామంటూ.. చైనాను వెనకేసుకు వచ్చే యత్నం చేస్తోంది. (చదవండి: ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..) -
రూ.37 వేలకే తులం బంగారం! ఇలా చేస్తే మీ సొంతం
భారతీయులకు బంగారం అంటే అత్యంత ప్రీతి. దాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. ముఖ్యంగా మహిళలయితే బంగారం ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో రోజూ బంగారం ధరలు ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉంటారు. ఇదీ చదవండి: Currency Notes: రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన! దేశంలో బంగారం 90 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. 2022 ఏడాదిలో విదేశాల నుంచి దాదాపు 706 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది భారత్. ఇందుకోసం దాదాపు 36.6 బిలియన్ డాలర్లు వెచ్చించింది. బంగారంపై భారతీయులకు ఉన్న ఆసక్తిని గ్రహించిన భూటాన్.. భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫుయంషోలింగ్, థింపులకు వచ్చేవారు ఎలాంటి ట్యాక్స్ లేకుండానే బంగారం కొనుగోలు చేసేందుకు అనుమతిస్తోంది. దీంతో భారత్‌లో కంటే తక్కువ ధరకే అక్కడ బంగారం కొనుక్కోవచ్చు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! భూటాన్ దేశ నూతన సంవత్సరం, భూటాన్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 21న ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తమ పర్యాటక ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు భూటాన్ అధికారిక పత్రిక డైలీ కౌన్సెల్ ప్రచురించింది. భారత్‌తో పోలిస్తే ధరలు కాస్త తక్కువగా ఉండటంతో ప్రస్తుతం చాలా మంది భారతీయులు దుబాయ్ వెళ్లి బంగారం కొంటున్నారు. తులం బంగారం రూ.37 వేలే.. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం భారత్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,600పైగానే ఉంది. అదే భూటాన్‌లో 10 గ్రాముల బంగారం 37,588.49 భూటనీస్ ఎన్‌గూల్ట్రమ్ (బీటీఎన్)గా ఉంది. ఒక బీటీఎన్ భారత రూపాయితో దాదాపు సమానంగా ఉంది. అంటే భారతీయులు రూ.37,588కే తులం బంగారం కొనుక్కోవచ్చన్న మాట. మరి షరతులు? భూటన్లో భారతీయులు పన్ను రహిత బంగారం కొనుగోలు చేయాలంటే సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఫీ (ఎస్డీఎఫ్) రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆ దేశ ప్రభుత్వం గుర్తింపు పొందిన టూరిస్ట్ సెర్టిఫైడ్ హోటల్లో ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది. టూరిస్టులు అమెరికా డాలర్లతోనూ బంగారం కొనుగోలు చేయొచ్చు. ఈ ఎస్డీఎఫ్ టూరిజం ట్యాక్స్‌ను 2022లోనే భూటాన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. భారతీయులు ఒక వ్యక్తి.. ఒక రోజుకు రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లించాలి. ఇతర దేశస్థులయితే 65 నుంచి 200 డాలర్ల వరకు చెల్లించాలి. ఈ ఎస్డీఎఫ్ ట్యాక్స్ కట్టిన వారు మాత్రమే ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనేందుకు అర్హులు. ఈ బంగారాన్ని లగ్జరీ వస్తువులు విక్రయించేడ్యూటీ ఫ్రీ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చేయొచ్చు. ఎంత బంగారం తెచ్చుకోవచ్చు? కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ విభాగం నిబంధనల ప్రకారం విదేశాల నుంచి భారత్‌లోకి మగవారైతే రూ.50 వేల విలువైన బంగారం, మహిళలయితే గరిష్టంగా రూ.లక్ష విలువైన బంగారం తెచ్చుకోవచ్చు. అంతకు మించి తీసుకువస్తే కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్! In a bid to boost tourism Indian and other SDF fee paying tourists coming to Phuentsholing or Thimphu in Bhutan can now buy tax free gold. The only condition being you have to stay in a tourist certified hotel and pay SDF. The gold will be much more cheaper than in India. — Tenzing Lamsang (@TenzingLamsang) February 24, 2023 -
ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం
PM Modi Conferred With Bhutan's Highest Civilian Award: భారత ప్రధాని మోదీకి భూటాన్ దేశం నుంచి అరుదైన గౌరవం లభించింది. భూటాన్ దేశం తమ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని అత్యున్నత పౌర పురస్కారం నాడగ్ పెల్ గి ఖోర్లోతో సత్కరించింది. ఈ క్రమంలో భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ అత్యున్నత గౌరవ పౌర పురస్కారం అయిన న్గదాగ్ పెల్ గి ఖోర్లోతో నరేంద్ర మోడీని సత్కరించడం తమకు చాలా సంతోషంగా అనిపించిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతేకాదు గత కొన్నేళ్లుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో మోదీజీ తమకు అందించిన స్నేహపూర్వక సహాయసహకారాలు, మద్దతును గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పైగా భూటాన్ ప్రజలు మోదీజీని గొప్ప ఆధ్యాత్మిక మహోన్నత వ్యక్తిగా భావిస్తున్నారని అన్నారు. ఈ మేరకు తాము ఈ అత్యున్నత పురస్కార వేడుకను వైభవోపేతంగా జరుపుకోవాలని భావిస్తూ భారత ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నాం అని భూటాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఫేస్బుక్లో పేర్కొంది. (చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!) -
కోవిడ్ సక్సెస్ స్టోరీ.. ఒకే ఒక్క మరణం
సాక్షి, హైదరాబాద్: గతనెల 7న భూటాన్ రాజధాని థింపూలోని ఒక ఆసుపత్రిలో 34 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో మృతి చెందాడు. అతడు అప్పటికే కాలేయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఆ వ్యాధి నుంచి బయటపడ లేకపోయాడు. అయితే ఏడాదికి పైగా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా భూటాన్‌లో నమోదైన ఒకే ఒక్క కరోనా మరణం అదే. సోమవారం నాటికి ఈ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 866 మాత్రమే. అగ్రరాజ్యం అమెరికా సహా సైన్స్‌లో ముందంజలో ఉంటూ, అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలతో సుసంపన్న దేశాలుగా ఉన్న ఐరోపా, ఇతర పశ్చిమదేశాల్లో నేటికీ కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఏడాది క్రితం బయటపడ్డ ఈ ప్రాణాంతక వైరస్ ధనిక, పేద దేశాలు అనే తేడా లేకుండా ఆయా దేశాల్లోని వైద్య, ఆరోగ్య వ్యవస్థలను పూర్తిగా తల్లకిందులు చేసింది. ఆర్థిక వ్యవస్థలు సైతం కుదేలయ్యాయి. ఈ పరిస్థితుల్లో చిన్న దేశం, అంతగా ఆర్థిక.ఇతర వనరులు, మౌలికసదుపాయాలు లేని భూటాన్ కోవిడ్‌ను పూర్తిగా నియంత్రించడమే కాకుండా... ఇప్పటికీ ఒకే ఒక మరణం వంటి అద్భుతమైన రికార్డ్‌ను ఎలా సాధించగలిగింది? మొత్తం 337 డాక్టర్లు మాత్రమే... ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మొదలై ఇబ్బడిముబ్బడిగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న సందర్భంలో భూటాన్ పని అయిపోయినట్టేనని కొందరు భావించారు. మొత్తం 7,60,00 జనాభాకు వారి వద్ద ఉన్నది 337 మంది డాక్టర్లు మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి. భూటాన్‌లో డాక్టర్ల నిష్పత్తి డబ్ల్యూహెచ్‌వో సూచించిన దాంట్లో సగం మాత్రమే. వీరిలో ఒక్కరు మాత్రమే అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్‌లో శిక్షణ పొందారు. కేవలం 3 వేల మంది మాత్రమే హెల్త్‌కేర్ వర్కర్లున్నారు. కరోనా శ్యాంపిల్స్ పరీక్ష చేసేందుకు ఒకే ఒక పీసీఆర్ మిషన్ అందుబాటులో ఉంది. ఐరాస లెక్కల ప్రకారం... అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశం. తక్కువస్ధాయిలో తలసరి జీడీపీ ఉన్న దేశం. అయినా ఈ మహమ్మారిని సమర్థంగా ఎలా ఎదుర్కొంది? అత్యంత వేగంగా కార్యాచరణ అమలు... మొదటి కరోనా హెచ్చరికలు అందగానే వెంటనే, వేగంగా ఈ దేశం స్పందించింది.కచ్చితమైన, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను అమలు చేసింది. 2019 డిసెంబర్ 31న చైనా అంతు తెలియని న్యూమోనియా వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసింది. ఆ వెంటనే జనవరి 11న భూటాన్ జాతీయ సన్నద్ధ ప్రణాళికను సిద్ధం చేసి, జనవరి 15 నుంచే శ్వాసకోశ సంబంధిత లక్షణాలున్న వారి స్క్రీనింగ్ మొదలుపెట్టింది. తమ అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇతర ప్రాంతాల నుంచి దేశంలోకి వచ్చే ఎంట్రీ పాయింట్లలో ‘ఇన్ఫ్రారెడ్ ఫీవర్ స్క్రీనింగ్’చేపట్టింది. మార్చి 6న కోవిడ్–19 మొదటికేసు వచ్చినట్టు ప్రకటించింది. అది కూడా 76 ఏళ్ల అమెరికన్ టూరిస్ట్. మరో 6 గంటల 18 నిముషాల్లోనే అతడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంటాక్ట్‌లో వచ్చేందుకు అవకాశమున్న 300 మందిని గుర్తించి వారిని క్వారంటైన్‌కు పంపించేసింది. కరోనా బారిన పడిన వ్యక్తిని విమానంలో అమెరికాకు పంపించింది. చావు తప్పదని భావించిన ఆ వ్యక్తిని కూడా భూటాన్‌లో తొలుత తీసుకున్న చర్యలే రక్షించాయంటూ అమెరికన్ డాక్టర్లు పేర్కొనడం విశేషం. నిబంధనలు కచ్చితంగా పాటించారు... మార్చి నుంచి భూటాన్ ప్రభుత్వం ప్రతీరోజు కరోనా సంబంధిత అప్డేట్స్ను ప్రకటించడంతో పాటు హెల్ప్లైన్లను ఏర్పాటుచేసింది. ఇతర దేశాల పర్యాటకులపై నిషేధం విధించింది. స్కూళ్లు, ప్రభుత్వసంస్థలు, జిమ్‌లు, సినిమా థియేటర్లను మూసేసింది. మాస్క్‌లు, చేతుల పరిశుభ్రత, వ్యక్తుల మధ్య దూరం వంటి వాటిని కఠినంగా, నిరంతరంగా అమలు చేసింది. కోవిడ్‌ను మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన ఆరు రోజులకు అంటే మార్చి 16న వైరస్ సోకే అవకాశముందని భావించిన వారందరినీ తప్పనిసరి క్వారంటైన్‌కు పంపించింది. వీరిలో వేలాది మంది వివిధ దేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న భూటాన్ పౌరులున్నారు. టూరిస్ట్ హోటళ్లలో క్వారంటైన్లో ఉన్న వారందరికీ ఉచిత వసతి, ఆహారం అందించింది. పాజిటివ్ కేసులుగా తేలిన వారందరినీ విడిగా ఐసోలేట్ చేసింది. వారందరికీ కూడా వెంటనే వైద్య సహాయం అందించడంతో పాటు ‘సైకలాజికల్ కౌన్సెలింగ్’ఇప్పించే ఏర్పాటు చేసింది. మార్చి చివరకల్లా ఆ దేశ వైద్యశాఖ అధికారులు తప్పనిసరి క్వారంటైన్ కాలాన్ని కూడా 14 రోజుల నుంచి 21 రోజులకు (డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన దాని కంటే వారం ఎక్కువ) పెంచారు. ఈ విధంగా లక్షణాలున్న వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా క్వారంటైన్లో ఉన్న వారిని ఎప్పటికప్పుడు పరీక్షించి తగిన వైద్యాన్ని అందజేశారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాని వ్యాప్తి నియంత్రణ చర్యలపై పెద్దగా దృష్టి పెట్టని కాలంలోనే భూటాన్ భారీస్థాయిలో టెస్టింగ్, ట్రేసింగ్ కార్యక్రమాన్ని చేపట్టడంతో, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఒక మొబైల్ యాప్‌ను సైతం తయారు చేసింది. గత ఆగస్టు నెలలో క్వారంటైన్ వెలుపల తొలి కోవిడ్–19 కేసును గుర్తించారు. దీంతో మూడువారాల లాక్డౌన్ అమలుచేశారు. టెస్టింగ్, ట్రేసింగ్ మరింత ఉధృతం చేయడంతో పాటు దేశంలోని ప్రతీ ఒక్క కుటుంబానికి ఆహారం, నిత్యావసరాలు, మెడిసిన్ అందజేశారు. గత డిసెంబర్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్కు సంబంధించి తొలి కేసును గుర్తించారు. దీంతో మరోసారి మరింత కఠినమైన లాక్డౌన్ విధించారు. మళ్లీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలతో వైరస్ బారిన పడకుండా ప్రజలను మేల్కొలిపారు. ఆపన్నులను ఆదుకున్నారు... గత ఏప్రిల్‌లో భూటాన్ రాజు జింగ్మే ఖేసర్ నామ్జ్యేల్ వాంగ్‌చుక్ ఓ సహాయనిధిని ప్రారంభించి దాని ద్వారా జీవనోపాధిని కోల్పోయిన 35 వేల మందికి 19 మిలియన్ అమెరికన్ డాలర్ల సహాయాన్ని అందజేశారు. 60 ఏళ్లకు పైబడిన వారికి, అసహాయులుగా ఉన్న వారు కలిపి మొత్తం 51 వేల మందికి శానిటైజర్లు, విటమిన్లున్న మందులు, ఆహార వస్తువులు, ఇతర కేర్ ప్యాకేజ్‌లు అందజేశారు. నిబద్ధత, అవగాహన.. ప్రజల భాగస్వామ్యం దేశ ప్రధాని మొదలుకుని మంత్రులు, ఇతర స్థాయిల్లోని నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు రాత్రి పగలు అనే తేడాలు లేకుండా మహమ్మారిని ఎదుర్కునే విధుల్లో నిమగ్నమయ్యారు. దేశ ఆరోగ్య మంత్రి వాంగ్మో కొన్ని వారాలపాటు ఇంటికి వెళ్లకుండా రాత్రిళ్లు మంత్రిత్వశాఖ కార్యాలయంలోనే ఉండిపోయారు. ప్రధానమంత్రి లోటే త్సెరింగ్ స్వయానా ప్రముఖ ఫిజీషియన్. లాక్డౌన్ కాలంలో తన ఆఫీసులోని కిటికీ వద్దనున్న కూర్చీలోనే ఆయన రాత్రిళ్లు నిద్రించారు. క్వారంటైన్ కేంద్రాల కోసం యజమానులు తమ హోటళ్లను ఉచితంగా అందించారు. రైతులు తమ పంటలను విరాళం ఇచ్చారు. వేలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి నేషనల్ కార్ప్స్ ఆఫ్ ఆరెంజ్ యూనిఫామ్డ్ వాలంటీర్లు ‘డే సూంగ్’లో చేరి ప్రజలకు సేవలందించారు. అప్రమత్తత కలిగిన సమర్థ నాయకత్వం, ప్రజారోగ్య సూచనలు పాటించడానికి ప్రజల వద్ద తగినంత నిత్యావసరాలు, మందులు, డబ్బు ఉండేలా చూసుకోవడం, దేశ ఉమ్మడి హితం కోసం వ్యక్తిగతంగా, సాముహికంగా కొన్ని త్యాగాలు చేయకతప్పదనే అవగాహన ప్రజలు కలిగి ఉండటం (సామాజిక బాధ్యత)... ఇవన్నీ భూటాన్ కోవిడ్‌ను విజయవంతంగా అదుపు చేయడానికి దోహదం చేశాయి. చిన్నదేశమైనా ఈ దేశ ప్రజల నుంచి అగ్రరాజ్యం అమెరికా, సంపన్న పశ్చిమ దేశాలు, చివరకు మనం కూడా నేర్చుకోవాల్సింది కొంతైనా ఉందని చెప్పొచ్చు. -
డోక్లాంలో చైనా గ్రామం.. ఖండించిన భూటాన్
న్యూఢిల్లీ : తమ భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసిందంటూ వస్తోన్న వార్తల్ని భూటాన్ ఖండించింది. అలాంటిది ఏం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్సాప్ నామ్‌గైల్ ‘మా భూభాగంలో చైనా గ్రామం ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఏం జరగలేదు’ అని స్పష్టం చేశారు. ‘చైనా, భూటాన్ ప్రాదేశిక ప్రాంతంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఓ గ్రామాన్ని ఏర్పాటుచేసింది’ అంటూ చైనాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ షెన్ షివే ట్వీట్ చేశారు. దీనిపై భారత్ భూటాన్ రాయబారి స్పందించారు. ‘నేను ఆ ట్వీట్‌ని చూశాను. ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ అది. ఇలాంటి ఊహాగానాల గురించి నేను పట్టించుకోను’ అన్నారు. ఇక చైనా తాజాగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంటున్న గ్రామం మూడేళ్ల కిందట భారత్-చైనా సైన్యాలు ఘర్షణ పడిన డోక్లామ్కి సమీపంలోనే ఉండటం గమనార్హం. చైనా మీడియా సీజీటీఎన్ న్యూస్‌లోని సీనియర్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వహిస్తోన్న షెన్ షివే ట్విట్టర్లో ‘ఇప్పుడు కొత్తగా స్థాపించబడిన పాంగ్డా గ్రామంలో శాశ్వత నివాసితులు నివసిస్తున్నారు. ఇది యాడోంగ్ కౌంటీకి దక్షిణాన 35 కిలోమీటర్ల దూరంలో లోయ వెంబడి ఉంది. డోక్లాం ప్రాంతం పరిష్కారం తరువాత ఖచ్చితమైన స్థానాన్ని సూచించింది’ అంటూ దీనికి సంబంధించిన ఫోటోలని ట్వీట్ చేశారు. అయితే, తర్వాత దాన్ని తొలగించారు. షెన్ షివే చేసిన ట్వీట్‌ను భారత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు రీట్వీట్ చేశారు. ‘భూటాన్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనడానికి ఇదే సాక్ష్యం’ అని తెలిపారు. ‘భారత్-చైనాల మధ్య కొనసాగిన డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి 9 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందని చైనా జర్నలిస్ట్ షేర్ చేసిన మ్యాప్‌ను బట్టి అర్ధమవుతుంది’ అన్నారు. అంతేకాదు, భూటాన్ భూభాగంలో రెండు కిలోమీటర్ల చొచ్చుకొచ్చినట్టు తెలియజేస్తుందని పేర్కొన్నారు. (చదవండి: సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ) చైనా ‘ఐదు వేళ్ల’ వ్యూహం సరిహద్దు భూభాగాలపై కన్నేసిన చైనా వాటిని ఆక్రమిచుకోవడానికి ‘ఐదు వేళ్ల’ వ్యూహాన్ని అమలు చేస్తోది. దానిలో భాగంగా టిబెట్‌ని కుడి చేతి అరచేయిగా భావించగా.. లద్దాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ప్రదేశ్లని ఐదు వేళ్లలాగా భావిస్తోంది. ఇక బీజింగ్ ‘సలామి స్లైసింగ్’ వ్యూహాన్ని తాజాగా నేపాల్‌లో అమలు చేసి చేసింది. దానిలో భాగాంగా నేపాల్ భూభాగాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించినట్లు సమాచారం. న్యూఢిల్లీ-ఖట్మాండ్ల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన సమయంలో డ్రాగన్ ఈ దుశ్చర్యకు పూనుకున్నట్లు తెలిసింది. ఇక ఈ చర్యలని ఉద్దేశిస్తూ ‘మావో కలని నిజం చేయడానికి జిన్‌పింగ్ కృషి చేస్తున్నాడని’ చైనా మీడియా ప్రశంసిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే భారత్ 17,000 అడుగుల ఎత్తులో లిపులేఖ్ ప్రాంతంలో రహదారి నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. దీని వల్ల కైలాస్ మానససరోవర యాత్రికులకు ప్రయాణ సమయం కలిసి వస్తుంది. (చదవండి: తప్పు ఒప్పుకున్న ట్విట్టర్ ) -
సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ
న్యూఢిల్లీ: డోక్లాం పీఠభూమి ప్రాంతంలో అన్ని కాలాలలో రహదారి మార్గం సుగమం చేసుకోవడానికి రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను చైనా వేగవంతం చేసినట్లు ఎన్డీటీవీ సేకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వెల్లడయ్యింది. ఈ ప్రాంతంలో 2017లో చైనా భారత్ మధ్య 70 రోజుల పాటు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలోని చైనా నిర్మాణ కార్మికులు ఉపరితల సొరంగమార్గాన్ని 500 మీటర్ల వరకు పొడిగించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. శీతాకాలంలో ఈ మార్గం అంతా మంచుతో కప్పబడి ఉంటుందని, దానికోసమే ఏ కాలంలోనైనా ప్రయాణించేలా ఈ రవాణా సౌకర్యాన్ని పెంచుకున్నట్లు స్పష్టమౌతోందని సైనిక నిపుణులు భావిస్తున్నారు. డోక్లాం పీఠభూమి తమ భూభాగంలోనిదేనంటూ చైనా, భూటాన్ ప్రకటించుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్, భూటాన్‌కి మద్దతిస్తోంది. -
వర్షం.. పర్వతాలను సైతం కదిలిస్తుందట!
బ్రిటన్: వర్షాలు మావనాళి మనుగడకు ఎంతో అవసరం.. అదే ఉగ్రరూపం దాలిస్తే.. ఎంతటి భయంకర పరిస్థితులు తలెత్తుతాయో గత వారం రోజులుగా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి ఏటా వర్షాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నష్టాని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారీ వర్షాలకు నదులు కోసుకుపోవడం.. వరద బీభత్సం వంటి వాటి గురించి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వర్షాలకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వర్షాలు భారీ శిఖరాలను సైతం కదిలిస్తాయని బ్రిస్టల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. భూగర్భ శాస్త్రవేత్తలకు పర్వతాలపై వర్షం ఎలా ప్రభావం చూపిస్తుందో సమర్థవంతంగా అధ్యయనం చేయడంలోనే కాకుండా, వందల ఏళ్ల క్రితం శిఖరాలు, లోయలు ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధనలు సహకరిస్తాయి. (చదవండి: కలిసికట్టుగా ఊడ్చేశారు.. టీంవర్క్ అంటే ఇది) పీర్-రివ్యూ జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించబడిన ‘క్లైమెట్ కంట్రోల్స్ ఆన్ ఎరోషన్ ఇన్ టెక్టోనికల్లీ యాక్టీవ్ ల్యాండ్‌స్కేప్స్’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనాన్ని డాక్టర్ బైరాన్ ఆడమ్స్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం నిర్వహించింది. ఇందుకు గాను, బ్రిస్టల్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన బృందం తూర్పు హిమాలయాల్లో భాగామైన భూటాన్, నేపాల్‌లో అధ్యయనం నిర్వహించింది. బ్రిస్టల్ క్యాబోట్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ రాయల్ సొసైటీ డోరతీ హోడ్కిన్కి చెందిన డాక్టర్ బైరాన్ ఆడమ్స్ ఈ అధ్యయనం కోసం అరిజోనా స్టేట్ యూనివర్శిటీ (ఏఎస్యూ), లూసియానా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులతో కలిసి పనిచేశారు. నదులు వాటి క్రింద ఉన్న రాళ్ళను క్షీణింపజేసే వేగాన్ని కొలవడానికి వారు ఇసుక రేణువుల లోపల విశ్వ గడియారాలను ఉపయోగించారు. టెక్టోనిక్స్పై వాతావరణం ప్రభావాన్ని అధ్యయనం చేయడం ఈ స్టడీ ప్రధాన లక్ష్యం. (చదవండి: 'విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు') ఈ స్టడీ ప్రధాన రచయిత, డాక్టర్ బైరాన్ ఆడమ్స్ మాట్లాడుతూ, భూటాన్, నేపాల్ అంతటా గమనించిన "ఎరోషన్ రేట్ ప్యాటర్" ను పునరుత్పత్తి చేయడానికి బృందం అనేక సంఖ్యా నమూనాలను పరీక్షించింది. కోత రేటును ఖచ్చితంగా అంచనా వేయగల ఒక నమూనాను వారు గుర్తించగలిగారు. ఆ తర్వాత, వర్షపాతం "కఠినమైన భూభాగాలలో కోత రేటు" ను ఎలా ప్రభావితం చేస్తుందో అంచనా వేయడానికి పరిశోధకులు ఈ నమూనాను ఉపయోగించారు. -
కొత్త పంచాయితీ ఎత్తుకున్న చైనా
న్యూఢిల్లీ: కయ్యానికి కాలు దువ్వే డ్రాగన్ కంట్రీ మరోసారి భూటాన్‌తో సరిహద్దు పంచాయితీ ఉందంటూ కొత్త రాగం అందుకుంది. పొరుగునున్న భూటాన్‌తో తూర్పు ప్రాంతంలో సరిహద్దు వివాదాలున్నాయని చైనా తొలిసారి అధికారికంగా ప్రకటించింది. చాలా ఏళ్లుగా నెలకొన్న ఈ వివాదం ఇంకా ముగియలేదని తెలిపింది. చైనా, భూటాన్ సరిహద్దుల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో నెలకొన్న వివాదాల్లో.. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో వివాదాలు సమసిపోయాయని, తూర్పు ప్రాంతంలో వివాదం అలాగే ఉందని చైనా శనివారం వెల్లడించింది. అయితే, భూటాన్‌తో ఉన్న సరిహద్దు వివాదంలో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా భారత్‌ను ఉద్దేశించి చైనా స్పష్టమైన సూచన చేసింది. కాగా, చైనా చెప్తున్న తూర్పు ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్నందున భారత్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. (చదవండి: లవ్ ఇండియా : ట్రంప్ వైరల్ ట్వీట్) ఇదిలాఉండగా.. 1984 నుంచి 2016 వరకు చైనా భూటాన్ మధ్య 24 సార్లు చర్చలు జరిగాయి. ఇవన్నీ ఇరు దేశాల మద్య ఉన్న పశ్చిమ, మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినవేనని భూటాన్ పార్లమెంట్ డాటా ప్రకారం తెలుస్తోంది. రెండు దేశాల మధ్య ఎన్నోసార్లు చర్చలు జరిగినప్పటికీ.. తూర్పు సరిహద్దు ప్రాంతంపై ఎలాంటి వివాదాలు తెరపైకి రాలేదని భూటాన్ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక చైనా తాజా ప్రకటనపై భారత్ ఇంకా స్పందించలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటన నేపథ్యంలోనే డ్రాగన్ దేశం తాజా వివాదాన్ని లేవనెత్తిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో భూటాన్‌తో ఉన్న తూర్పు ప్రాంత వివాదం కొత్తదేమీ కాదని, ఏళ్లుగా నలుగుతోందని చైనా తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటోంది. (చదవండి: రాయని డైరీ: జిన్‌పింగ్ (చైనా అధ్యక్షుడు)) -
ఆ వార్తలు అవాస్తవం: భూటాన్
గువాహాటి: అస్సాంకు, భూటాన్ నుంచి వచ్చే నీటి సరఫరా సహజంగానే ఆగిపోయిందని, ఇరు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తలేదని భారత ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అస్సాంకు వచ్చే నీటిని భూటాన్ నిలిపివేయడంతో పాకిస్తాన్, చైనా, నేపాల్ మాదిరిగా ఇప్పుడు భూటాన్ కూడా సరిహద్దుల్లో భారత్‌ను ఇబ్బందులకు గురిచేస్తుందంటూ గురువారం మీడియాల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను భూటాన్ ఖండిస్తూ ‘నీటి పారుదల సహజంగానే ఆగిపోయింది. అంతే కానీ మేము నీటిని నిలిపివేయలేదు. అస్సాంకు సరఫరా అయ్యే నీటిలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మరమ్మత్తులు కూడా చేయిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడిస్తూ.. భూటాన్, అస్సాం నీటి సరిహద్దు వివాదామంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రకటించింది. (ఈ 10 దేశాలు, నగరాలు తప్పక చూడాల్సిందే!) #WATCH: Assam Chief Secy Kumar Sanjay Krishna says, "Irrigation water comes to Assam from hills of Bhutan, but there was boulder which stopped the flow. We talked to Bhutan & they immediately cleared it. There's no dispute & to say that they stopped the water to Assam is wrong." pic.twitter.com/aNPNxclgJO — ANI (@ANI) June 26, 2020 దీనిపై భూటాన్ అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ... ‘‘మేము అస్సాంలోని ప్రాంతాలకు నీటిపారుదల సరఫరాను నిలిపివేశామని ఆరోపించి ప్రచరించిన మీడియా నివేదికలు అవాస్తవం. ఇది నిజంగా బాధ కలిగించే విషయం. స్నేహపూర్వక ప్రజలు(భూటాన్-అస్సాం) మధ్య వివాదం సృష్టించేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారు. ఇది స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల వ్యవసాయం కోసం భూటాన్‌లో నిర్మించిన ఈ డాంగ్ ఛానెల్ నీటిని 1953 నుంచి అస్సాం, భూటాన్ రైతులు వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నారు. అస్సాం వరిసాగుకు ఈ నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీంతో భూటాన్ నీటి సరఫరాను నిలిపివేసినట్లు వార్తలు రావడంతో సరిహద్దుల్లో అస్సాం రైతులంతా ధర్నా చేసినట్లు గువాహటి ప్రజలు పేర్కొన్నారు. -
కోహ్లికి కోహ్లి రాయునది...
న్యూఢిల్లీ: అత్యద్భుతమైన ఆటతో, అనితర సాధ్యమైన ఘనతలు సాధిస్తూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పుడు క్రికెట్ శిఖరాన ఉన్నాడు. 11 ఏళ్ల క్రితం అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. అయితే అంతకంటే ముందే మరో ఐదేళ్లు వెనక్కి వెళ్తే అప్పటికే ఆటలో తనదైన ముద్ర కోసం కోహ్లి తపిస్తున్నాడు. కానీ లక్ష్యం చేరగలడో లేదో తెలీదు. కానీ ప్రయాణం మాత్రం అద్భుతంగా ఉంటుందనే నమ్మకం. ఆ సమయంలో తోడుగా తండ్రి కూడా ఉన్నాడు (కోహ్లి 18 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు). మొత్తంగా 15 ఏళ్ల కుర్రాడిలో ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు! మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా కోహ్లి ఆ కుర్రాడి అంతరంగాన్ని ఆవిష్కరించాడు. గొప్ప క్రికెటర్‌గా ఎదగాలనుకుంటున్న ఒక 15 ఏళ్ల కుర్రాడి కథతో రూపొందించిన ‘సూపర్ వి’ అనే యానిమేటెడ్ సిరీస్ కోసం విరాట్ ఈ తరహా ప్రయత్నం చేశాడు. ఒకవైపు తన గురించి తాను (కోహ్లి ముద్దు పేరు చీకూ) లేఖలో రాస్తూనే మరోవైపు అదే వయసు పిల్లలకు ఒక దిశానిర్దేశం చేశాడు. మంగళవారం తన 31వ పుట్టిన రోజు సందర్భంగా రాసిన ఈ లేఖలోని విశేషాలు చూస్తే... ‘హాయ్ చీకూ...నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఎన్నో అడగాలనుకుంటున్నా నేను కొన్నింటికే సమాధానమిస్తా. రాబోయే రోజుల్లో ఏం జరగనుందో తెలియనప్పుడు ఆపై దక్కేది మధురంగా, ప్రతీ సవాల్ అద్భుతంగా ఉంటుంది. ప్రతీ నిరాశ కొత్త అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ రోజు నీకు అర్థం కాకపోవచ్చు. లక్ష్యంకంటే ప్రయాణం ముఖ్యం. ఆ ప్రయాణం మాత్రం అద్భుతంగా ఉంటుంది. విరాట్... నీకు లభించే ప్రతీ అవకాశం ఉపయోగించుకోవడం ముఖ్యం. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దు. జీవితంలో ఓటములు సహజం. కానీ ప్రయత్నించడం మాత్రం మరచిపోవద్దు. నిన్ను ప్రేమించేవాళ్లు, ఇష్టపడనివాళ్లూ ఉంటారు. వాటిని పట్టించుకోకుండా నీపై నువ్వు నమ్మకముంచు. డాడీ బహుమతిగా షూస్ ఇవ్వలేదని బాధపడవచ్చు. అంతకంటే ఎక్కువగా పంచిన ప్రేమను ఆస్వాదించు. కొన్ని సార్లు ఆయన కఠినంగా ఉన్నా అది నీ బాగు కోసమే. తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవడం లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ బేషరతుగా మనల్ని ప్రేమించేది వారే. నీ కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించే క్రమంలో నీ మనసు చెప్పిందే విను. పెద్ద కలలు కనడం కూడా ఎంత ముఖ్యమో ఈ ప్రపంచానికి చూపించు. చివరగా ఆ పరోఠాల రుచిని బాగా ఆస్వాదించు. మున్ముందు అవి మరీ ప్రియంగా మారిపోవచ్చు’ -
ఈ 10 దేశాలు, నగరాలు తప్పక చూడాల్సిందే!
న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో ప్రపంచంలో తిరగాల్సిన పది దేశాలు, పది ప్రాంతాలు, పది నగరాల జాబితాను ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకం విడుదల చేసింది. తప్పకుండా సందర్శించాల్సిన పది దేశాల్లో మొదటి స్థానం భూటాన్‌కు దక్కగా రెండో స్థానం ఇంగ్లండ్‌కు, మూడోస్థానం మెర్సిడోనియా దక్కింది. అరూబా, ఎస్వాటిని, కోస్టారికా, నెదర్లాండ్స్, లైబీరియా, మొరాకో, ఉరుగ్వే దేశాలు వరుసగా ఆ తర్వాత స్థానాలకు ఆక్రమించాయి. ఆ తర్వాత పర్యటించాల్సిన ప్రాంతాల్లో సెంట్రల్ ఆసియాలోని సిల్క్ రోడ్, ఇటలీలోని లే మార్షే, జపాన్‌లోని తొహొకు, అమెరికాలోని మెయిన్, బఫలో, ఇండోనేసియాలోని టెంగారా, భారత్‌లోని మధ్యప్రదేశ్, హంగేరిలోని బుడాపేస్ట్ తదితరాలు ఉన్నాయి. తప్పక చూడాల్సిన పది నగరాల్లో సాల్ట్‌బర్గ్, వాషింఘ్టన్ డీసీ, కైరో మొదటి స్థానాల్లో ఉన్నాయి. జర్మనీలో బాన్, బొలీవియాలోని లా పాజ్, వాంకోవర్, భారత్‌లోని కోచి, యూఏయీలోని దుబాయ్, కొలరాడోని డెన్వర్ నగరాన్ని ‘లోన్లీ ప్లానెట్’ ఎంపిక చేసింది. కొండలు, గుట్టలు, పచ్చని వాతావరణంతో రమణీయంగా కనిపించే భూటాన్‌ను చూడాల్సిన మొదటి దేశంగా, ‘టైమ్‌లెస్ ట్రెజర్’గా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్‌లో చారిత్రక కట్టడాలు, చర్చులు చూడ ముచ్చటగా ఉంటాయని పేర్కొంది. అలాగే తాము ఎంపిక చేసిన ఇతర దేశాలు, ప్రాంతాలు, నగరాలు వేటికి ప్రసిద్ధో, వాటిని ఎందుకు చూడాలో ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకంలో వివరించింది. -
చిరుత హెలికాప్టర్ పేలి ఇద్దరు పైలెట్లు మృతి
థింపూ/భూటాన్: భారత రక్షణ దళానికి చెందిన చిరుత హెలికాప్టర్ పేలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. భారత సైనిక శిక్షణ బృందం(ఐఎమ్‌టీఏఆర్)కు సంబంధించిన చాపర్ తూర్పు భుటాన్ యంగ్‌పుల్లా డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం క్రాష్ అవ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోగమంచుతో కూడిన వాతావరణం వల్లే హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. భారత ఆర్మీకి భూటాన్‌లో శిక్షణను ఇస్తున్న నేపథ్యంలో వాతావరణం అనుకులంగా లేకపోవడంతో..ఐఎమ్‌టీఏఆర్‌ను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిర్ముకు చేరుకోగానే రెడియో సిగ్నల్స్ తెగిపోయాయి. ఈ క్రమంలో హెలికాప్టర్ ప్రమాదాన్ని అంచనా వేయలేక పోయామని భారత ఆర్మీ అధికారి కొల్ అమన్ అనంద్ పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే అక్కడికి చేరుకుని.. భారత వైమానిక దళం, ఆర్మీ హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టామన్నారు. మరణించిన వారిలో భూటాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ రాయల్, ఏవియేషన్ కార్ప్స్ లెఫ్టినెంట్ కల్నల్ ఉన్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. -
యువత అద్భుతాలు చేయగలదు
థింపూ: భవిష్యత్ తరాలపై ప్రభావం చూపగలరీతిలో అద్భుతాలు చేయగల శక్తిసామర్థ్యాలు భూటాన్ యువతలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నైపుణ్యవంతులైన యువత భూటాన్‌ను సరికొత్త ఎత్తుకు తీసుకెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయనీ, ఈ సమస్యలకు పరిష్కారం కొనుగొనేందుకు మనకు తెలివైన యువతీయువకులు ఉన్నారని వెల్లడించారు. ఆలోచనలు, సృజనాత్మకతపై ఎలాంటి పరిమితులు విధించుకోవద్దని ప్రధాని సూచించారు. భూటాన్ పర్యటనలో భాగంగా ఆదివారం థింపూలోని ‘రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్’లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మోదీ మాట్లాడారు. యువత లక్ష్యాన్ని గుర్తించాలి.. ‘ప్రపంచం గతంలో ఎన్నడూలేనన్ని అవకాశాలను ఈరోజు ఇస్తోంది. సాంకేతిక ఆవిష్కరణలు, ఇతర రంగాల్లో భూటాన్ దూసుకుపోతే మీ 130 కోట్ల మంది స్నేహితులు మౌనంగా ఉండరు. ఆనందం, గర్వంతో చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం భారత్ పలురంగాల్లో చరిత్రాత్మక రీతిలో పురోగమిస్తోంది. పాఠశాల స్థాయి నుంచి అంతరిక్షం, డిజిటల్ చెల్లింపులు, విపత్తుల నిర్వహణవరకూ భూటాన్‌తో కలిసి పనిచేసేందుకు మేం ఆసక్తిగా ఉన్నాం’ అని మోదీ పేర్కొన్నారు. ‘అంతరిక్షం’లో సహకారం బలోపేతం.. అంతరిక్ష రంగంలోనూ భారత్ భూటాన్‌తో సంబంధాలను పటిష్టం చేసుకుంటోందని ప్రధాని మోదీ చెప్పారు. ‘మేం ‘థింపూ గ్రౌండ్ స్టేషన్ ఆఫ్ సౌత్ఏసియా శాటిలైట్’ను ప్రారంభించాం. ఉపగ్రహాలతో టెలిమెడిసిన్, దూరవిద్య, సహజవనరుల మ్యాపింగ్, వాతావరణాన్ని అంచనా వేయడంతో పాటు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయవచ్చు. మేం ఇటీవల చంద్రుడిపైకి చంద్రయాన్–2ను ప్రయో గించాం. భూటాన్ కూడా త్వరలోనే ఓ చిన్న ఉపగ్రహాన్ని సొంతంగా సమకూర్చుకోబోతోంది. భవిష్యత్‌లో భూటాన్‌కు చెందిన యువ శాస్త్రవేత్తలు భారత్‌కు వచ్చి తమ ఉపగ్రహాన్ని డిజైన్ చేసుకోవడంతో పాటు ప్రయోగాన్ని వీక్షిస్తారని ఆలోచిస్తేనే చాలా సంతోషంగా ఉంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. తాను రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ ప్రశంసించడంపై స్పందిస్తూ, గౌతమబుద్ధుని ప్రభావంతోనే ఆ పుస్తకం రాసినట్లు మోదీ చెప్పారు. భూటాన్ అర్థం చేసుకుంది: సంతోషం ప్రాముఖ్యతను భూటాన్ అర్థం చేసుకుందని ప్రధాని మోదీ చెప్పారు. ‘భూటాన్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలాఉంది. ఇక్కడ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతులు ఒకదానితో మరొకటి సంఘర్షణ పడకుండా కలిసి ముందుకు సాగుతాయి. సంతోషం యొక్క ప్రాముఖ్యతను, దయాగుణం గొప్పతనాన్ని భూటాన్ అర్థం చేసుకుంది’ అని మోదీ తెలిపారు. తర్వాత మోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు.