న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల భూటాన్ దేశ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. ‘భూటాన్‌లోని పారో విమనాశ్రయం వద్ద గల ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మార్చి 21-22 తేదీల్లో ప్రధాని భూటాన్ పర్యటనను వాయిదా వేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. కొత్త తేదీలపై ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే తెలియజేస్తాం’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా రేపు(గురువారం) ప్రధాని భూటాన్ బయలుదేరాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఆ దేశంలో మోదీ పర్యటించాల్సి ఉంది. భారత్ సన్నిహిత, సరిహద్దు దేశం భూటాన్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడుతాయని అంతా ఆకాంక్షించారు. అయితే షెడ్యూల్ సందర్శనకు ఒక రోజు ముందు పర్యటన వాయిదా పడినట్లు ప్రకటన వెలువడింది.
మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో భూటాన్‌లోని రోడ్లమీద.. మోదీకి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున పోస్టర్లు అంటించారు. ఇదిల ఉండగా గత వారం భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్‌గే అయిదు రోజులపాటు భారత్‌లో పర్యటించారు. గత జనవరిలోభూటాన్ ప్రధానిగా బాధ్యతలు స్పీకరించిన తర్వాత టోబ్‌గే తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని ఆయన ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోడీ అంగీకరించారు.
చదవండి: రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని మోదీ ఫోన్ కాల్..
Comments
Please login to add a commentAdd a comment