బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఒకనొక ఇంటర్వ్యూలో ఈమా దత్షి రెసిపీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. నిజానికి ఈమా దత్షీ రెసిపీ భూటాన్ వంటకం. తన అభిమానులకు ఈ వంటకం గురించి షేర్ చేశారు దీపికా. ఈ రెసిపీ రుచి, తయరీ విధానాల గురించి పంచుకున్నారు. గతేడాది దీపికా ఏప్రిల్ 2023లో భూటాన్ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ ప్రత్యేక భూటాన్ వంటకంపై మనసు పారేసుకున్నానని, ఇప్పుడది తన ఫేవరెట్ డిష్ అని చెప్పుకొచ్చారు ఆమె. ఇంతకీ ఏంటా ఈమా దత్షి రెసిపీ. ఏ కూరగాయాలకు సంబంధించిన వంటకం అంటే..
ఈమా దత్షి అనేధి భూటాన్ జాతీయ వంటకం.దీన్ని పచ్చి ఎర్ర మిరపకాయలు, చీజ్, మిరియాలు, ఉల్లిపాయలు, టొమాటోలతో కలిపి చేసే ఒక విధమైన రెసిపీ. దీన్ని లంచ్ లేదా డిన్నర్ టైంలో కర్రీగా తినదగిన రెసిపీ. దీన్ని ఎవ్వరైనా పదినిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆస్వాదించొచ్చు.
ఎలా చేయాలంటే...?
టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, నల్ల మిరియాలు తదితర పదార్థాలన్నింటిని తీసుకుని వాటిపై కాస్త నూనె పొయ్యండి. పాన్‌లో ఒక కప్పు నీరు పోసి పదార్థాలను బాగా కలపి పెద్దమంటపై ఉంచండి. అలాగే పాన్‌పై మూత పెట్టండి. వేడిని ఎక్కువ పెంచి పది నిమిషాలు ఉడకనివ్వండి. కూరగాయాలు ఉడికన తర్వాత మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది. వెంటనే స్టవ్‌ని మీడియంలో పెట్టి.. కాస్త నెయ్యి, కొద్దిగా చీజ్, కొద్దిగా మసాల వంటివి కూడా వెయ్యండి. అంతే ఈమా దత్షి రెడీ. ఇది అన్నం లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది. జొంగ్ఖా భాషలో ఈమా అంటే మిరపకాయ. ఇక దట్షి అంటే చీజ్ అని అర్థం. వాటితో చేసే రెసిపీ కాబట్టి దీన్ని 'ఈమా దత్షి' అని పిలుస్తారు భూటాన్ వాసులు.
(చదవండి: స్టన్నింగ్ బ్యూటీ శోభితా ధూళిపాళ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!)
Comments
Please login to add a commentAdd a comment