
ప్యారిస్ ఫ్యాషన్ వీక్ 2025లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తన మెస్మరైజింగ్ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపర్చింది. మార్చి 3-11వరకు ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్యారిస్ 2025-2026 (ఫాల్/వింటర్ విమెన్స్‌వేర్)లో క్లాసిక్ వింటేజ్ లుక్‌లో అదరగొట్టింది. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన మార్క్‌ను చాటుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆమె లుక్‌ను 'ఐకానిక్' అంటూ తెగ పొగిడేశారు. ఐఫిల్ టవర్‌కు సమాంతరంగా దీపిక ఫోజులు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.'

లూయిస్ విట్టన్ ఫాల్/వింటర్ 2025-2026 కలెక్షన్ ఆవిష్కరణ కోసం పారిస్‌కు వెళ్లిన ఈ కల్కి నటి మరోసారి హై ఫ్యాషన్ పట్ల తనకున్న అనుబంధాన్ని నిరూపించుకుంది. లూయిస్ విట్టన్‌లో క్లాసిక్ మోనోక్రోమ్ లుక్‌లో లగ్జరీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ గ్లోబల్ స్టార్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీపికా పదుకొణే దీనికి సంబంధించి ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఐకానిక్ లుక్, ఫ్యాషన్ స్టైల్‌కి ఫిదా అయిపోయారు. ఓర్రీ, సోఫీ చౌదరి "లవ్" ఎమోజీలతో తమ సంతోషాన్ని ప్రకటించారు. మరోవైపు దీపికా భర్త రణవీర్ సింగ్ ("Lord have mercy on me") చక్కటి మెసేజ్‌ను పోస్ట్ చేశారు.
దీపికా ఐకానిక్ ఐఫిల్ టవర్‌కు ఎదురుగా ఫోజులిచ్చింది. తెల్లటి భారీ కోటు, స్టైలిష్ టోపీ, స్కార్ఫ్, డీప్ రెడ్ లిప్‌స్టిక్, బ్లాక్ హీల్స్, గ్లోవ్‌లతో పారిసియన్ గాంభీర్యానికి పరాకాష్టగా నిలిచింది. ఈ ఫోటోలు అటు ఫ్యాషన్ ఔత్సాహికులు, విమర్శకులు ప్రశంసలందుకున్నాయి. ఐకానిక్ భవనం ది కోర్ కారీ డు లౌవ్రేలో దీపిక ఎంట్రీ అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. దీపికా పదుకొనేతో పాటు, ఎమ్మా స్టోన్, జాడెన్ స్మిత్, జౌ డోంగ్యు, జెన్నిఫర్ కోన్నెల్లీ, అనా డి అర్మాస్ లాంటి అనేక గ్లోబల్ స్లార్లు ఈ షోలో కనిపించారు. కె-పాప్ స్టార్ లిసా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్‌మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?
కాగా రణవీర్‌తో పెళ్లి, కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్రముఖ డిజైనర్ సబ్యసాచి షోలో అద్భుతమైన ప్రదర్శనతో రీఎంట్రీ ఇచ్చింది. దుబాయ్‌లో జరిగిన కార్టియర్ 25వ వార్షికోత్సవ వేడుకలకు అద్భుతమైన నల్లటి దుస్తులలో మెరిసిపోవడం దగ్గర్నుంచి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్, అబుదాబిలో జరిగిన ఫోర్బ్స్ సమ్మిట్‌లో గోల్డెన్ గర్ల్‌గా గుర్తింపు పొందడం వరకు ఆమె ఫ్యాషన్ ఎంపికలు వార్తల్లో నిలుస్తూ వచ్చాయి. ప్రపంచ ఫ్యాషన్‌లో భారతీయ ప్రాతినిధ్యానికి, ఆమె సిగ్నేచర్ స్టైల్‌కు ఇది గొప్ప మైలురాళ్లు. లూయిస్ విట్టన్, కార్టియర్ రెండింటికీ గ్లోబల్ అంబాసిడర్‌గా సంతకం చేసిన తొలి భారతీయురాలు దీపికా.
Comments
Please login to add a commentAdd a comment