
బాలీవుడ్ లెజెండ్రీ నటుడు రాజ్ కపూర్ మనవడు, నటుడు అదార్ జైన్, అలేఖా అద్వానీని హిందు సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 12న గోవాలో గోవాలో పెళ్లి చేసుకున్న ఈ జంట మరోసారి(ఫిబ్రవరి 21, శుక్రవారం) హిందూ వివాహంతో తమ ప్రేమను చాటుకున్నారు. ఈ గ్రాండ్ వేడుకకు పలువురు బాలీవుడ్ స్టార్లు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రణ్‌బీర్ కపూర్ అలియా, సైఫ్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా, నీతూ కపూర్‌తో పాటు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులు, అనిల్ అంబానీ, టీనాజంట, సీనియర్ నటి రేఖ, అగస్త్య నందా వేదిక సందడి చేశారు.
వధువు అలేఖా అద్వానీ ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ తయారు చేసిన ఎథ్నిక్ మాస్టర్ పీస్‌లో అందంగా ముస్తాబైంది. రెడ్ వెల్వెట్ లెహెంగాపై వాటర్‌ఫాల్ స్టైల్ గిల్డెడ్ డబ్కా ఎంబ్రాయిడరీతో రూపొందించారు. దీనికి జతగా గోల్డ్ జర్దోజీ ఎంబ్రాయిడరీతో హాఫ్-స్లీవ్డ్ వెలోర్ క్రాప్డ్ బ్లౌజ్ మంచి ఎలిగెంట్ లుక్ ఇచ్చింది. అలాగే లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా డబుల్ మ్యాచింగ్ క్రిమ్సన్ ఆర్గాన్జా దుపట్టాలో అలేఖా అందంగా మెరిసింది. ఇంకా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌గా పోల్కి కుందన్స్ పచ్చలు పొదిగిన నెక్లెస్ మాంగ్ టీకా ఆభరణాలను ధరించింది.
వరుడు ఆదర్ జైన్ ఐవరీకలర్ షేర్వానీ, ఎటాచ్‌డ్ దుపట్టా, క్లాసిక్ వైట్ స్ట్రెయిట్ ఎథ్నిక్ ప్యాంటు, తలపాగా ధరించారు. ఇక ఆభరణాల విషయానికి వస్తే, పచ్చల లేయర్డ్ నెక్లెస్ ,తలపాగామీద ఎమరాల్డ్ స్టేట్మెంట్ గోల్డ్ నగలతో రాజసంగా కనిపించాడు. కుటుంబ సభ్యులు , స్నేహితుల సమక్షంలో వివాహ వేడుక తర్వాత ఆదర్ తన భార్య అలేఖ అద్వానీ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు.దీంతో అలేఖా సిగ్గుల మొగ్గే అయింది. దీంతో కొత్తగా పెళ్లైన జంటను ఆశీర్వదించారు.
