2018లో వచ్చిన బాలీవుడ్ హారర్ మూవీ స్ట్రీ కి సీక్వెల్‌గా వస్తున్న స్ట్రీ 2 ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. నూతన దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా అతిధి పాత్రలో కనిపించనుంది. ఆజ్‌కీ రాత్ అంటూ ఒక ఐటెం సాంగ్‌కు స్టెప్పులేసింది. తనదైన స్టయిల్‌తో, స్టెప్పులతో దుమ్మరేపింది.
ఈ సాంగ్ లాంచింగ్ ప్రమోషన్‌లో భాగంగా తమనా తన లేటెస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. రెడ్ తోరణి చీరలో మిల్కీ బ్యూటీ మెరిసిపోయింది. కార్సెట్ బ్లౌజ్‌తో కూడిన తోరణి చీరను ఎంచుకుంది. వేలాడా జుంకీలతో సహా రెడ్ థీమ్‌ను ఫాలో అయిన తమన్నా తన లుక్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఈ చీర ధర 1.26 లక్షలుగా తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే నెలలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.
తమన్నాతో పాటుగా, శ్రద్ధా కపూర్ కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేసింది. పొడవాటి జడ, రెడ్‌థీమ్ అనార్కలీలో అందంగా మెరిసింది. దీని ధర రూ. 1.29 లక్షలని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment