item song
-
నితిన్ రాబిన్‌హుడ్.. అది దా సర్ప్రైజ్ అంటోన్న కేతిక శర్మ
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్.'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. 'అది దా సర్ప్రైజ్' అంటూ సాగే ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ కేతిక శర్మ తన డ్యాన్స్‌తో అలరించింది. ముఖ్యంగా కేతిక శర్మ అందాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ పాట రాబిన్ హుడ్‌లో మూవీలో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. అంతుకుముందే కేతిక శర్మ తెలుగులో రంగరంగ వైభవంగా, లక్ష్య లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందించారు. This summer heat is here with the sizzling moves and the blazing beats 🔥🔥#Robinhood third single #AdhiDhaSurprisu ft. @TheKetikaSharma out now ❤️🔥▶️ https://t.co/GvczL8HezzA @gvprakash musical.Lyrics by Academy Award Winner @boselyricistSung by @neetimohan18 &… pic.twitter.com/fRkw35ndnO— Mythri Movie Makers (@MythriOfficial) March 10, 2025 -
దుమ్ముదులిపేసిన మ్యాడ్ స్క్వేర్ ఐటెం పాప ‘రెబా మోనికా జాన్’ (ఫోటోలు)
-
బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ స్త్రీ-2(Stree 2 Movie). గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రానికి స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే ఈ మూవీ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ప్రత్యేక గీతంలో మెరిసింది. ఆజ్ కీ రాత్ అంటూ అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ మూవీ తెలుగు వర్షన్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
'కిస్ కిస్ కిస్ కిస్సిక్'.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను ఊర్రూతలూగించిన సాంగ్ 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా'. పుష్ప చిత్రంలోని ఈ సాంగ్‌లో హీరోయిన్ సమంత తన డ్యాన్స్, గ్లామర్‌తో అదరగొట్టేసింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప-2లోనూ ఇలాంటి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ తీసుకొచ్చారు. కిస్సిక్ పేరుతో వచ్చిన ఐటమ్ సాంగ్ థియేటర్లలో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు.తాజాగా ఈ కిస్సిక్ ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియోను పుష్ప టీమ్ రిలీజ్ చేసింది. ఈ పాటకు హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది. 'దెబ్బలు పడతాయిరో రాజా' అంటూ ఐటమ్ సాంగ్‌తో శ్రీలీల అలరించింది. కాగా.. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. సుభాషిణి ఆలపించారు. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పుష్పరాజ్..ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. రిలీజ్ రోజున మొదలైన వసూళ్లు ఊచకోత ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కలెక్షన్స్ పరంగా ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రెండు వేల కోట్ల మార్కును చేరుకునే ఛాన్స్ ఉంది. -
పుష్ప-2 ఐటమ్ సాంగ్ ఎఫెక్ట్.. శ్రీలీల షాకింగ్ డిసిషన్!
ప్రస్తుతం సినీప్రియులను పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా అలరిస్తోంది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో సినీ ప్రియులను అలరించింది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. కిస్సిక్ అంటూ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం రాబిన్‌హుడ్‌లో నటిస్తోన్న శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో మరింత క్రేజ్ దక్కించుకుంది.అయితే కిస్సిక్ సాంగ్ తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే అవీ హీరోయిన్గా కాదట. ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయట. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ భయంతోనే వరుస ఆఫర్లు శ్రీలీల తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.(ఇది చదవండి: పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)శ్రీలీల షాకింగ్ నిర్ణయం..అయితే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు ఆ తర్వాత కొద్దిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ నితిన్ సరసన రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కావడన్నే పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పింది శ్రీలీల. ఈ సాంగ్ చేయడానికి ప్రత్యేక కారణముందని కూడా వెల్లడించింది.అయితే తనపై ఐటమ్ సాంగ్ హీరోయిన్గా ముద్రపడుతుందేమో అన్న భయం పట్టుకుందన్న వార్త వైరలవుతోంది. అందువల్లే ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయకూడదని శ్రీలీల నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐటమ్ సాంగ్ కోసం చాలామంది నిర్మాతలు శ్రీలీలను సంప్రదించేందుకు యత్నిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఏదేమైనా కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. -
పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. బలమైన కారణం ఉందన్న శ్రీలీల!
ప్రస్తుతం అందరిచూపు పుష్ప-2 ది రూల్‌పైనే ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. అయితే సినిమా రిలీజ్‌కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్లో కిస్సిక్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు శ్రీలీల తన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది.అయితే ఈ సాంగ్ చేయడం వెనక బలమైన కారణం ఉందని హీరోయిన్ శ్రీలీల అన్నారు. రాబిన్‌హుడ్ మూవీ ప్రెస్మీట్లో కిస్సిక్ సాంగ్ చేయడం గురించి మాట్లాడారు. ఇది యావరేజ్ ఐటమ్ సాంగ్ కాదన్నారు. గతంలో ఎన్నో సినిమాలకు ఐటమ్ సాంగ్ చేయమని అడిగారు. కానీ ఇప్పటివరకు నేను చేయలేదు..ఈ సాంగ్ చేయడానికి స్ట్రాంగ్ రీజన్ ఉందని శ్రీలీల అన్నారు. పుష్ప-2 రిలీజైనప్పుడు అదేంటో మీకే తెలుస్తుందని శ్రీలీల పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలీల.. నితిన్ సరసన రాబిన్ హుడ్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ మూవీ రష్మిక మందన్నా శ్రీవల్లిగా అలరించనుంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి టాలీవుడ్ ప్రియులను మెప్పించనున్నారు. -
ట్రైలర్ మాత్రమే కాదు.. సాంగ్ కూడా ఊపేస్తోంది!
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు మరో ఊపు సాంగ్ వచ్చేసింది. పుష్ప-2 నుంచి కిస్సిక్ అంటూ శ్రీలీల డ్యాన్స్ చేసిన ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఈ లిరికల్ పాటను విడుదల చేశారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ మరో అదిరిపోయే సాంగ్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. విడుదలైన కొన్ని గంటల్లోనే కిస్సిక్ సాంగ్ క్రేజీ రికార్డ్ సాధించింది.ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాకుండా సౌత్ ఇండియాలో ఏ సాంగ్ సాధించని రికార్డ్ సృష్టించింది. కేవలం 18 గంటల్లోనే ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సైతం యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఏకంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది.సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ మర పది రోజుల్లోనే బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 ది రూల్ విడుదలవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ ఒపెనవ్వగా రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ పూర్తయ్యాయి. యూఎస్‌లో ఎప్పుడు లేని విధంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. #KissikSong breaks the highest viewed South Indian song record of 24 hours in just 18 hours 💥💥#Kissik Telugu lyrical video hits massive 25 MILLION+ VIEWS in a flash ⚡▶️ https://t.co/JFhLNrZ9ejAn Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14 dance treat 💥💥A… pic.twitter.com/BnGxLfMCHt— Pushpa (@PushpaMovie) November 25, 2024 -
అల్లు అర్జున్ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్ సాంగ్ వచ్చేసింది
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప పేరే వినిపిస్తోంది. ఇటీవల పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ కాగా.. మూవీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ రోజులు లెక్క పెడుతున్నారు ఫ్యాన్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఇదిలా ఉండగా పుష్ప-2 రిలీజ్‌కు కేవలం పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో పుష్ప-2 లోని కిస్సిక్ ఐటమ్ సాంగ్ విడుదల చేశారు. కిస్సిక్ పేరుతో తెరకెక్కించిన ఈ పాటకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల.. బన్నీతో కలిసి స్టెప్పులేసింది. చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్లో లిరికల్ ఐటమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.కాగా.. పార్ట్-1లో ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అనే ఐటమ్ సాంగ్ సినీ ప్రియులను ఓ ఊపు ఊపేసింది. పుష్పలో ఈ పాటకు సమంత తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. పుష్ప-2లో కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల తన స్టెప్పులతో ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా మరోసారి రష్మిక మందన్నా ఫ్యాన్స్‌ను అలరించనుంది. -
పుష్ప 2: శ్రీలీల ఐటం సాంగ్ వచ్చేది ఆ రోజే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమాలో 'ఊ అంటావా మావా..' సాంగ్ ఓ రేంజ్లో హిట్టయింది. ఈ ఐటం సాంగ్‌లో సమంత తన స్టెప్పులతో, హావభావాలతో అదరగొట్టేసింది. ఈసారి ఆ జోష్ ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2లో మరో ఐటం సాంగ్ ప్లాన్ చేశారు. సమంత స్థానంలో డ్యాన్స్ క్వీన్ శ్రీలీలను తీసుకున్నారు.తాజాగా ఈ సాంగ్ రిలీజ్ డేట్ ప్రకటించారు. కిస్సిక్ పేరుతో రానున్న ఈ పాట నవంబర్ 24న రాత్రి 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. అందులో బన్నీ నడుముపై శ్రీలీల వయ్యారంగా వాలింది. పోస్టరే ఇలా ఉంటే పాట ఇంకెంత బాగుంటుందో అని ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సాంగ్ కోసం శ్రీలీల రూ.2 కోట్ల పారితోషికం తీసుకుందని ఫిల్మీదునియాలో టాక్! ఇకపోతే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2: ద రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. #Kissik 📸 song from #Pushpa2TheRule Flashing Worldwide on November 24th from 7:02 PM ❤🔥It is time for Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14 to set the dance floor on fire 🔥A Rockstar @Thisisdsp's Musical Flash⚡⚡GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER,… pic.twitter.com/Qi5E7nRO5X— Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2024 చదవండి: అమరన్ టీమ్ రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి: విద్యార్థి -
పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. ఆ హీరోయిన్ను రిజెక్ట్ చేసిన నిర్మాతలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే పుష్ప మూవీలో సమంత ఐటమ్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఆ సాంగ్‌కు ఫుల్ క్రేజ్ రావడంతో పార్ట్-2లోనూ ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌తో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.అయితే పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం శ్రద్దాకపూర్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ తెలుస్తోంది. ఒక్క పాటకు దాదాపు రూ.5 కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. అయితే అంత భారీస్థాయిలో డిమాండ్ చేయడంతో పుష్ప-2 నిర్మాతలు తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఐటమ్ సాంగ్‌లో శ్రద్ధా కపూర్ డ్యాన్స్ చూడాలనుకున్నా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే గతంలో సమంతకు కూడా దాదాపు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే పుష్ప-2 ఐటమ్ సాంగ్‌లో గుంటూరు కారం భామ శ్రీలీల కనిపించనున్నట్లు లేటేస్ట్ టాక్. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మెప్పించిన భామ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలతో బీజీగా ఉంది. శ్రీలీలతో డీల్ ఓకే అయితే పుష్ప-2 తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించనుంది. కాగా పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా ప్రేక్షకులను అలరించనుంది. -
ఊ అంటావా మావా అంటున్న శ్రీ లీల.. సమంతతో కలిసి పుష్ప 2 ఐటెం సాంగ్
-
'పుష్ప' ఐటమ్ సాంగ్.. ఒకరు కాదు ఇద్దరు!
మరో నెల రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ ఉంది. కానీ ఇప్పటికే షూటింగ్ పెండింగ్‌లోనే ఉంది. దాదాపు చిత్రీకరణ అంతా పూర్తయినప్పటికీ ఐటమ్ సాంగ్ కోసం సరైన బ్యూటీ దొరక్క దాన్ని అలా పక్కనబెట్టేశారు. తొలి భాగంలో 'ఊ అంటావా మావ' అని సమంత కేక పుట్టించగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అనేది భేతాళ ప్రశ్నగా మారిపోయింది. అయితే ఈసారి ఇద్దరు బ్యూటీస్‌తో పుష్పరాజ్ స్టెప్పులు వేయనున్నాడట.తొలి భాగంలో సమంత తనదైన హస్కీ మూమెంట్స్‌తో రచ్చ లేపింది. చేస్తే గీస్తే 'పుష్ప 2'లో అంతకుమించి ఉండాలి తప్పితే తగ్గకూడదనేది టీమ్ ప్లాన్. అందుకే తృప్తి దిమ్రి, శ్రద్ధా దాస్.. ఇలా చాలామంది బాలీవుడ్ బ్యూటీస్ పేర్లు వినిపించాయి. అన్నీ సెట్ అవుతున్నా రెమ్యునరేషన్ దగ్గర తేడాలొస్తున్నాయట. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి మన హీరోయిన్ల దగ్గర మేటర్ ఆగిందట.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలీరెడ్డి)మొన్నటివరకు శ్రద్ధా కపూర్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఈసారి ఐటమ్ సాంగ్‌లో సమంత-శ్రీలీల.. ఇద్దరు పుష్పరాజ్‌తో రచ్చ లేపేందుకు రెడీ అయిపోయారట. మరి ఒకరు కాదు ఇద్దరు అనేది నిజమా లేదా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుందిలే!అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్ నటిస్తున్న 'పుష్ప 2'.. వచ్చే నెల అంటే డిసెంబరు 5న పాన్ ఇండియా రేంజులో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన పాటలు, టీజర్.. మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని హైప్ ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. దీంతో సినిమాపై రూ.1000 కోట్ల అంచనాలు ఉన్నాయి. మరి 'పుష్ప 2' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై?) -
తమన్నా ఐటమ్ సాంగ్.. ఫుల్ వర్షన్ వచ్చేసింది!
టాలీవుడ్లో మిల్కీ బ్యూటీగా అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌తోనూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. జైలర్ మూవీలో తనదైన గ్లామర్, డ్యాన్స్‌తో ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన స్త్రీ-2 చిత్రంలోనూ మెరిసింది. అజ్ కీ రాత్ అంటూ కుర్రకారును ఊర్రూతలూగించింది. శ్రద్దాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో ఈ పాట విడుదల చేయగా.. రెండు నెలల్లోనే 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ప్రస్తుతం కట్ చేసిన సీన్స్‌ను కలిపి తాజాగా ఈ పాటను రీ రిలీజ్ చేశారు. అజ్ కీ రాత్ ఫుల్ సాంగ్ అక్టోబర్ 24న యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చింది.కాగా.. 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొచ్చారు. హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు. -
పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. యానిమల్ బ్యూటీ కాదు.. ఆ హీరోయిన్ కోసం ప్రయత్నాలు!
టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. గతంలో పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కనిపించనుంది.అయితే పుష్ప చిత్రంలో ఓ సాంగ్ అభిమానులను ఊపేసింది. ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ.. అంటూ సాంగే ఐటమ్ సాంగ్ ఓ రేంజ్లో అలరించింది. ఈ పాటకు హీరోయిన్ సమంత తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఐటమ్ సాంగ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సీక్వెల్లోనూ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సాంగ్‌కు హీరోయిన్ ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పుష్ప టీమ్ ఫుల్ ఫోకస్ పెట్టింది.అయితే ప్రస్తుతం ఈ ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ను వెతికేపనిలో ఉంది పుష్ప టీమ్. గతంలో ఈ పాట కోసం బాలీవుడ్ భామ, యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పుడేమో మరో క్రేజీ హీరోయిన్ పేరు బయటకొచ్చింది. స్త్రీ-2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రద్ధాకపూర్‌ను పుష్ప టీమ్ సంప్రదించినట్లు సమాచారం. ఆమెను ఎంపిక చేస్తే బాలీవుడ్‌లోనూ క్రేజ్ వేరే లెవెల్‌కు పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే శ్రద్ధాకపూర్‌ను టీమ్ సభ్యులు కలిశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఐటం సాంగ్ చేస్తా.. కాకపోతే కొన్ని కండీషన్స్!
ఒకప్పుడు ఐటం సాంగ్స్ అంటే హీరోయిన్లు జంకేవారు. కానీ ఇప్పుడు చాలామంది తారలు స్పెషల్ సాంగ్‌లో కనిపించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రత్యేక పాటలో కనిపించేందుకు తనకూ ఎలాంటి అభ్యంతరం లేదంటోంది బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే.. కానీ తనకంటూ కొన్ని కండీషన్స్ ఉన్నాయట!మితిమీరొద్దుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఐటం సాంగ్ చేయడానికి నేను ఒప్పుకుంటాను. కాకపోతే.. ఆ సాంగ్‌లో మరీ అతిగా అందాల ప్రదర్శన ఉండకూడదు. పైగా ఆ సాంగ్‌లో నా పాత్రకు గౌరవం ఇవ్వాలి. కాదు, కూడదు అంటే మాత్రం ఐటం సాంగ్ చేసేందుకు అంగీకరించను. అలాగే పాటలో అమ్మాయిని చూపించే విధానంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. అలాగైతే ఓకేఏళ్ల తరబడి చిత్రీకరిస్తున్న పద్ధతినే ఇప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదు. పాటలో అమ్మాయిని అందంగా చూపించాలి, కానీ ఒక బొమ్మగా చిత్రీకరించొద్దు. ఎక్కడ ఎలా ఉండాలి? ఎలా నడుచుకోకూడదు? అనే అధికారం పూర్తిగా అమ్మాయికే ఇవ్వాలి' అని చెప్పుకొచ్చింది. మరి ఈ లైగర్ బ్యూటీ కోరుకున్నట్లుగా ఎవరైనా ఈ రకంగా ఐటం సాంగ్ రాసుకుని ఈమెను సంప్రదిస్తారేమో చూడాలి! -
చైతూతో ఎంగేజ్మెంట్ తర్వాతా.. మారిపోయిన శోభిత ఇమేజ్...
-
స్త్రీ-2 : రెడ్ థీమ్ సారీలో తళుక్కుమన్న తమన్నా, ఖరీదు ఎంతంటే!
2018లో వచ్చిన బాలీవుడ్ హారర్ మూవీ స్ట్రీ కి సీక్వెల్‌గా వస్తున్న స్ట్రీ 2 ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. నూతన దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా అతిధి పాత్రలో కనిపించనుంది. ఆజ్‌కీ రాత్ అంటూ ఒక ఐటెం సాంగ్‌కు స్టెప్పులేసింది. తనదైన స్టయిల్‌తో, స్టెప్పులతో దుమ్మరేపింది.ఈ సాంగ్ లాంచింగ్ ప్రమోషన్లో భాగంగా తమనా తన లేటెస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. రెడ్ తోరణి చీరలో మిల్కీ బ్యూటీ మెరిసిపోయింది. కార్సెట్ బ్లౌజ్‌తో కూడిన తోరణి చీరను ఎంచుకుంది. వేలాడా జుంకీలతో సహా రెడ్ థీమ్‌ను ఫాలో అయిన తమన్నా తన లుక్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఈ చీర ధర 1.26 లక్షలుగా తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే నెలలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.తమన్నాతో పాటుగా, శ్రద్ధా కపూర్ కూడా ఈ ఈవెంట్లో సందడి చేసింది. పొడవాటి జడ, రెడ్థీమ్ అనార్కలీలో అందంగా మెరిసింది. దీని ధర రూ. 1.29 లక్షలని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Maddock Films (@maddockfilms) -
జైలర్ తర్వాత మరో ఐటమ్ సాంగ్‌లో తమన్నా..!
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్‌తో అలరించిన భామ.. ఇటీవల ఎక్కువగా ఐటమ్ సాంగ్స్‌తోనే మెప్పిస్తోంది. తాజాగా స్త్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఈ మూవీ నుంచి ఆజ్ కీ రాత్ అనే ఐటమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో తమన్నా భాటియా తన అందం, డ్యాన్స్‌తో అభిమానులను కట్టిపడేసింది. కాగా.. ఈ చిత్రంలో ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటిస్తున్నారు. ఈ మూవీని హారర్-కామెడీ చిత్రంగా తెరకెక్కిచారు. ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా.. దినేశ్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో పంకడ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఐటమ్ సాంగ్ రిలీజ్ చేసిన మురళి మోహన్!
చిమటా రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "నేను-కీర్తన". ఈ సినిమా ద్వారా చిమటా రమేష్ బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి "కొంచెం కొంచెం.. గుడుగుడు గుంజం" అనే లిరికల్ వీడియో ఐటమ్ సాంగ్‌ను నటుడు మురళిమోహన్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మురళి మోహన్ మాట్లాడుతూ..'ఏ భాషలోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా అరుదుగా ఉంటారు. చిమటా రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన నేను - కీర్తన మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను విడుదల చేసిన ఐటమ్ సాంగ్ థియేటర్లో కచ్చితంగా విజిల్స్ వేయిస్తుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని అన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శకుడు రమేష్ బాబు తెలిపారు. ఈ చిత్రంలో సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. -
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2: ది రూల్ మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.అయితే వీరిద్దరి కాంబోలో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆర్య సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ 20 ఏళ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం తనకిష్టం లేదని అన్నారు. ఐటమ్ సాంగ్స్ తనకు నచ్చవని సరదాగా కామెంట్స్ చేశారు.సుకుమార్ మాట్లాడుతూ.. 'ఐటమ్ సాంగ్ నాకిష్టం లేదు. అ అంటే అమలాపురం లిరిక్ నాకు నచ్చింది. అది రాసేటప్పుడు టైం లేదు. వేటూరి దగ్గరకు పంపించాను. 'అల్లుగారి పిల్లగాడా' అంటే ఏంటి? అతను నా హీరో ఆర్య.. అల్లుగారి అబ్బాయి కాదు' అని చెప్పా. ఆర్య వచ్చి హీరోయిన్ను వెతుక్కోవాలి కానీ.. అరవింద్ గారి అబ్బాయి అంటే ఈజీగా హీరోయిన్ను పటగొట్టేస్తాడు . ఆర్యకు బైక్ కూడా లేదు.. చాలా పూర్. కేవలం సైకిల్ మాత్రమే ఉంది అంటూ నవ్వారు. నాకిష్టం లేకపోయినా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటం సాంగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. ఐటమ్ సాంగ్ ఉంటే సినిమాను ఇంత దూరం తీసుకెళ్తుందా?.. ఇంత వైబ్ వస్తుందా? అనే మూడ్‌లోకి వచ్చేశాను. కానీ దిల్ రాజు ఏమో ఒక్క ఐటెం సాంగ్ కూడా లేకుండా కళాత్మకంగా సినిమాలు చేస్తున్నారు' అని అన్నారు. -
భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
టాలీవుడ్లో పెళ్లి సందడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తనదైన చలాకీ నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న నటి శ్రీలీల. అలాగే ఆ చిత్రం సక్సెస్ అయినా ఆ వెంటనే మరో అవకాశం రాకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి అంతేనా అనే కామెంట్స్ కూడా దొర్లాయి.అయితే రవితేజ సరసన నటించిన ఢమాకా చిత్రం హిట్ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్‌తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా కోలీవుడ్‌లో భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముందుగా దళపతి విజయ్‌తో స్పెషల్ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది.విజయ్ ప్రస్తుతం గోట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్ జీ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి విలన్ పాత్ర అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రష్యాలో జరుగుతోంది. కాగా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చోటు చేసుకుంటుందట. ఆ పాటలో నటి త్రిష నటించనున్నారనే ప్రచారం జరిగింది.ఆ తరువాత కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె నటించలేని పరిస్థితి అని, దీంతో టాలీవుడ్ యువ స్టార్ కథానాయకి శ్రీలీలను ఆ అవకాశం వరించిందని సమాచారం. అయితే ఆ అవకాశాన్ని శ్రీలీల తిరస్కరించినట్లు తెలిసింది. కారణం కోలీవుడ్‌లో సింగిల్ సాంగ్‌తో ఎంట్రీ అయితే అది కెరీర్ ఎదుగుదలకు బాధింపు ఏర్పడుతుందని భావించడమేనట. ఇది ఆమె బ్రిలియంట్ డెసిషన్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పుడు శ్రీలీల త్వరలో మరో స్టార్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. -
స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్?
దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రం అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా నటీనటులు ఎక్కువగా ఉంటారు. సాంకేతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది. గోట్ చిత్రంలోనూ ఇవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రానికి ముందు చిత్రం గోట్. దీని తరువాత తన 69వ చిత్రం చేసి విజయ్ నటనకు స్వస్తి పలకనున్నారనే టాక్ చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌జీ, మైక్ మోహన్ తదితరు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోట్ చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్ అప్పీరియన్స్‌ను ఇవ్వడానికి టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ చిత్రం గోట్‌నే అవుతుంది. కాగా ఈ అమ్మడు మరో టాప్‌స్టార్ అజిత్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల కోలీవుడ్‌పై దండెత్తబోతున్నారన్నమాట. చూద్దాం ఇక్కడ ఈమె ప్యూచర్ ఎలా ఉండబోతోందో. -
Speed220: ఆకట్టుకుంటున్న గీతామాధురి మాస్ సాంగ్
హేమంత్, గణేష్ ,ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం స్పీడ్ 220. విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హర్ష బెజగం దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘బెజవాడలో బాలాకుమారి, మిర్యాలగూడలో మీనా కుమారి..’ అంటూ సాగే ఈ మాస్ పాటకి సంతోష్ కుమార్ బి లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయని గీతామాధురి అద్భుతంగా ఆలపించింది. యంగ్ టాలెంటెడ్ డాన్సర్ స్నేహ గుప్తా తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాన్ని తెరకెకికస్తున్నామని దర్శకుడు హర్ష తెలిపారు. ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. -
పుష్ప సాంగ్ క్రేజ్.. వారి స్టెప్పులకు సమంత ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఫుష్ప. ఈ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 కూడా రాబోతోంది. అయితే పుష్పలో సమంత ఐటమ్ సాంగ్‌కు స్టెప్పులేయని వారు ఉండరు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ సాంగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చిత్రంలోని 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అనే సాంగ్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. అయితే తాజాగా ముగ్గురు చిన్నారులు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సుకుమార్ భార్య తబిత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన సమంత చిన్నారుల డ్యాన్స్‌కు ఫిదా అయిపోయింది. అంతే కాకుండా తగ్గేదేలే అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చూశాక నేను ఇంకాస్తా బెటర్‌గా చేయాల్సిందని ఫన్నీ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జత చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సమంత ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. -
బార్లో ‘ప్రేమదేశపు యువరాణి’ ఐటెం సాంగ్!
యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఈ క్రియేషన్స్, ఎస్2హెచ్2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘మసకతడి’ అనే ప్రత్యేక గీతాన్ని హైదరాబాద్ మణికొండలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో యామిన్ మాట్లాడుతూ ‘ఓపెన్ బార్లో ప్రేక్షకుల సమక్షంలో పాటను విడుదల చేయడం, వారినుంచి చక్కని స్పందన రావడం చక్కని అనుభూతి కలిగించింది. సెలబ్రిటీల సమక్షంలో ఇలాంటి వేడుక చేయడం రొటీన్ మేమిలా వినూత్నంగా ప్లాన్ చేశాం. దర్శకుడి ఐడియాకు ధన్యవాదాలు’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎమోషనల్‌గా సాగే లవ్‌స్టోరీ ఇది. బార్లో పాట విడుదల చేయడం తప్పని అనుకున్నా ఇలా... కొత్తగా పబ్లిసిటీ చేస్తేనే చిన్న సినిమాలు జనాల్లోకి వెళతాయి. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’అని అన్నారు. -
పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐకాన్ స్టార్ మూవీ 'పుష్ప-2: ది రూల్'. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప పార్ట్-2 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టగా.. ఈ చిత్రం అంతకుమించి ఉంటుందని తెలుస్తోంది. పుష్పలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ 'ఊ అంటా మావ.. ఉఊ అంటావా మావ' క్రేజ్ మామూలుగా లేదు. ఆ పాటకు డ్యాన్స్ చేయకుండా ఉండలేని వారు ఉండరంటే అతియోశక్తి కాదేమో. అంతలా సినీ ప్రేక్షకులను ఊపేసింది. (ఇది చదవండి: భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసిన స్టార్ హీరో! ) అయితే పుష్ప-2లోనూ అదిరిపోయే ఐటమ్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కనిపించనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ మీడియా కథనం ప్రకారం ఈ మూడు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ.6 నుంచి రూ.7 కోట్లు వసూలు తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఊర్వశి కూడా అంతకంటే ఎక్కువే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా.. పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17, 2021న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు.బాలీవుడ్ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈచిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. గతంలో బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన పుష్ప-2 గ్లింప్స్ వీడియోతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) -
పోయే ఏనుగు పోయే: ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని సాంగ్ రిలీజ్..
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'పోయే ఏనుగు పోయే'. కె.శరవణన్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. ధమాకా, బలగం చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలోని 'ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని' అనే లిరికల్ వీడియో సాంగ్‌ను సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా ఆదివారం విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ... 'భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన మా చిత్రంలోని ఐటెమ్ లిరికల్ వీడియో ఈ రోజు లాంచ్ చేశాము. శ్రీ సిరాగ్ ఈ పాటను రచించారు. మా సినిమా కథ విషయానికొస్తే... నిధిని దక్కించుకోవడానికి కొంత మంది ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ఇందులో బాహుబలి ప్రభాకర్, ధన్ రాజ్, రఘు బాబు, తమిళ నటుడు మనోబాల కీలక పాత్రల్లో నటించారు. అలాగే అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దాము. అతి త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదలై ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఉంది' అని తెలిపారు. చదవండి: 30 ఏళ్లుగా హీరోలతో దెబ్బలు తిన్నా..: సింహాద్రి నటుడు -
ఊ అంటావా మావా.. లాంటి పాటలు నేను చేయను: కృతీ శెట్టి
పాన్ ఇండియా సినిమాగా రిలీజైన పుష్పలోని 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే! దక్షిణాది నుంచి ఉత్తరాది దాకా అందరూ ఈ పాట మత్తులో ఊగిపోయారు, తనివితీరా స్టెప్పులేశారు. మొదట ఈ పాట చేయడానికి సమంత ఒప్పుకోకపోయినప్పటికీ అల్లు అర్జున్ నచ్చజెప్పి ఆమెతో ఓకే చెప్పించాడు. బన్నీ ఊహించినట్లుగానే ఈ పాటతో సామ్‌కు నేషనల్ లెవల్లో మరింత గుర్తింపు వచ్చింది. అయితే ఇలాంటి పాటలు తాను అస్సలు చేయనని అంటోంది యంగ్ హీరోయిన్ కృతీ శెట్టి. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం కస్టడీ. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతీకి ఓ ప్రశ్న ఎదురైంది. ఊ అంటావా మావ వంటి ప్రత్యేక గీతాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని విలేకరి సూటిగా ప్రశ్నించాడు. దీనికి కృతీ చేయనని కుండ బద్ధలు కొట్టేసింది. ఆమె మాట్లాడుతూ.. 'ప్రస్తుతానికైతే అలాంటి ఐటం సాంగ్స్‌లో నటించాలనుకోవడం లేదు. ఎందుకంటే నాకు ఆ పాటలపై ఎలాంటి అవగాహన లేదు. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కూడా! నా సినీ ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయమేమిటంటే.. సౌకర్యంగా అనిపించనప్పుడు చేయకపోవడమే మంచిది. శ్యామ్ సింగరాయ్ సినిమాలోని కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో కూడా మనస్ఫూర్తిగా నటించలేకపోయాను. మనసుకు నచ్చనప్పుడు అలాంటివి చేయకుండా ఉండటమే బెటర్ అని అప్పుడే తెలుసుకున్నా. మున్ముందు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగుతా. ఊ అంటావా పాట విషయానికి వస్తే.. సమంత ఒక ఫైర్.. ఆమె చాలా బాగా డ్యాన్స్ చేశారు' అని చెప్పుకొచ్చింది బేబమ్మ. చదవండి: షూటింగ్లో వీజే సన్నీకి గాయాలు, ఆస్పత్రికి తరలింపు! -
ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా: నటి సిమ్రాన్
ఒకప్పుడు తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా వెలిగిపోయిన నటి సిమ్రాన్. తమిళంలో కమలహాసన్ నుంచి అజిత్, విజయ్ అంటూ స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. తెలుగులోనూ అగ్ర కథానాయకిగా రాణించింది. కాగా ఆమె కథానాయకిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించి అలరించింది. తెలుగులో చిరంజీవి కథానాయకుడు నటించిన అన్నయ్య చిత్రంలో సౌందర్య కథానాయకిగా నటించగా సిమ్రాన్ ఓ సాంగ్‌లో నటించింది. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. అదేవిధంగా తమిళంలో విజయ్ హీరోగా నటించిన యూత్ చిత్రంలోనూ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది. అప్పట్లో ఆమె ఆ పాటలో నటించడంపై పలు విమర్శలు వచ్చాయి. కాగా ఇన్నేళ్ల తర్వాత ఇటీవల తన అభిమానంతో ఇన్ స్ట్రాగామ్ లో ముచ్చటించినప్పుడు యూత్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటించడంపై స్పందించింది. ఆమె పేర్కొంటూ ఇది తన జీవితమని, నిర్ణయం కూడా తానే తీసుకోవాలన్నారు. అప్పట్లో విజయ్ హీరోగా నటించిన యూత్ చిత్రంలో సింగిల్ సాంగ్ నటించవద్దని చాలామంది చెప్పారు అంది. అయితే అలాంటి వారి మాటలను లెక్కచేయకుండా తాను ఆ పాటలో నటించానని వెల్లడించింది. ఆ పాట సూపర్ హిట్ అయ్యిందని పేర్కొంది. కొందరు చెప్పినట్లుగా చిత్రంలో నటించకపోతే ఓ మంచి హిట్ చిత్రాన్ని కోల్పోయేదాన్ని అభిప్రాయపడింది. -
ఐటం సాంగ్‌కు రీల్స్ చేయండి, లక్ష పట్టండి.. ఎప్పటివరకు పాల్గొనవచ్చంటే?
ఈశ్వర్, నయన సర్వర్ జంటగా నటించిన చిత్రం "సూర్యాపేట్ జంక్షన్ ". అభిమన్య సింగ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా పూజ ఐటమ్ సాంగ్‌లో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, మ్యాచింగ్ మ్యాచింగ్ లిరికల్ సాంగ్ విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో కాలేజ్ సాంగ్‌ను, ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకున్న "సూర్యా పెట్ జంక్షన్" మూవీనీ ఈ నెలాఖరులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రయూనిట్ మరిన్ని విశేషాలు వెల్లడిస్తూ.. 'ప్రమోషన్లో బాగంగా మ్యాచింగ్ మ్యాచింగ్ ఐటమ్ సాంగ్‌కు సోషల్ మీడియాలో ప్రకటించిన రీల్స్ పోటీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కాంటెస్ట్ విజేతలను త్వరలోనే ప్రకటించి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకరికి లక్ష రూపాయలు, మిగతా పది మందికి 10 వేల రూపాయల చొప్పున, అలాగే మరో పది మందికి 5 వేల రూపాయల చొప్పున అందివ్వనున్నాం. ఏప్రిల్ 25 వరకు ఈ పోటీలో పాల్గొనవచ్చు' అని ఈ చిత్ర యూనిట్ తెలిపింది. -
పుష్ప-2 ఆఫర్ తిరస్కరించిన సమంత.. క్లారిటీ ఇదే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో సమంత ఐటం సాంగ్ మరింత హైలెట్‌గా నిలిచింది. 'ఊ అంటావా మావ ఉఊ అంటావా మావా' అంటూ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. అయితే పుష్ప సినిమా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కాగా.. పుష్ప-2లోనూ సమంతతో ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. దీనికోసం ఇటీవల సమంతను చిత్రబృందం సంప్రదించగా ఆమె ఆఫర్ తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. పుష్ప-2లో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ సమంతను సంప్రదించలేదని ఆమె సన్నిహితులు తెలిపారు. కాగా.. సమంత ప్రస్తుతం సిటాడెల్, ఖుషి, శాకుంతలం చిత్రాల్లో కనిపించనున్నారు. ఇటీవలే సిటాడెల్ షెడ్యూల్‌ను సమంత ముంబైలో పూర్తి చేసుకుంద. గుణశేఖర్ దర్శకత్వంలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన శాకుంతలం ఏప్రిల్ 14, 2023న విడుదల కానుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రంలో నటించనున్నారు. -
SSMB 28: స్పెషల్ సాంగ్‌లో రష్మిక.. పారితోషికం అన్ని కోట్లా?
స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ చేస్తే.. ఆ కిక్కే వేరేలా ఉంటుంది. సినిమాకు హైప్ తీసుకురావడానికి ఐటం సాంగ్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే మన దర్శకనిర్మాతలు స్పెషల్ సాంగ్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటారు. పెద్ద మొత్తంలో పారితోషికం చెల్లించి స్టార్ హీరోయిన్లను ఒప్పిస్తారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా,ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించారు. ఇప్పుడు నేషన్ క్రష్ రష్మిక వంతు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట. దీని కోసం రష్మిక భారీగా డిమాండ్ చేస్తోందట. స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయాలంటే రూ.4 కోట్ల పారితోషికంగా ఇవ్వాలని రష్మిక అడిగిందట. రష్మిక రెమ్యునరేషన్ టాపిక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రష్మిక హిందీలో రెండు సినిమాలతో పాటు తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2'లోనూ, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న 'వారసుడు' మూవీలోనూ నటిస్తోంది. -
ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే..?
-
పుష్ప 2 లో తమన్నా ..!
-
గుడి ఆవరణలో ఐటెం సాంగ్.. కేసు నమోదు!
భోపాల్: గుడి ఆవరణలో ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేసినందుకు ఓ యువతి చిక్కుల్లో పడింది. ఇన్స్టాగ్రామ్ రీల్ రూపంలో ఆ వీడియో వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ యువతిపై పోలీస్ కేసు నమోదు చేయాలని స్వయానా హోం మంత్రి ఆదేశించారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో ఓ దేవాలయం ఆవరణలో అభ్యంతకరంగా నృత్యం చేస్తూ.. సోషల్‌మీడియాలో వైరల్ చేసినందుకుగాను యువతిపై పోలీసు కేసు నమోదు చేయనున్నట్లు హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈరోజు తెలిపారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన నేహా మిశ్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్టోబర్ 1వ తేదీన ఆలయం ప్రాంగణంలో దబాంగ్ చిత్రంలోని మున్నీ బద్నాం హుయి సాంగ్‌పై డ్యాన్స్ చేసి.. ఇన్‌స్టాలో అప్లోడ్ చేసింది. అయితే గుడి ఆవరణలోని మెట్ల మీద.. చినిగిన జీన్స్‌తో ఆమె చేసిన డ్యాన్సులపై బజరంగ్ దళ్ ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన వీడియోపై విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పింది. మతపరమైన మనోభావాలు దెబ్బ తీసినందుకు ఆ వీడియోను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. View this post on Instagram A post shared by 💞𝄟★🦋⃟≛⃝mussu🦋★𝄟💞 (@muskanm125) ఆమె క్షమాపణలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించలేదు. ఆమె వస్త్రధారణ, అలా వీడియో తీయడం అభ్యంతకరకంగా ఉన్నాయి. గతంలో ఇలాంటి జరిగినప్పుడు చర్యలు తీసుకున్నాం. అయినా ఆమె పట్టించుకోకుండా వీడియో తీసింది. అందుకే ఆమెపై కేసు నమోదు చేయబోతున్నాం అని మిశ్రా మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఛతర్పూర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్లు హోం మంత్రి మిశ్రా తెలిపారు. छतरपुर में माता बम्बरबैनी मंदिर परिसर में आपत्तिजनक फिल्मांकन के खिलाफ एफआईआर दर्ज करने के निर्देश पुलिस अधीक्षक को दिए गए हैं। pic.twitter.com/X7euV9Z1qv — Dr Narottam Mishra (@drnarottammisra) October 4, 2022 -
పూజా హెగ్డె ఐటమ్ సాంగ్ షురూ.. ఇక మరింత ఫన్
Pooja Hegde F3 Movie Item Song Starts: ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సుమారు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడుతూ మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్గా మారింది ఈ బ్యూటీ. ఇటీవల 'అరబిక్ కుతు' సాంగ్‌లో విజయ్‌తో కలిసి అదరగొట్టింది. ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా 'రంగస్థలం' సినిమాలో 'జిగేల్ రాణి'గా జిగేలుమనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్‌ల మల్టీస్టారర్ 'ఎఫ్ 3' సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ పాట చిత్రీకరణను శుక్రవారం (ఏప్రిల్ 15) న ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోలో సుమారు 7 ఎకరాల్లో వేసిన అద్భుతమైన సెట్లో ఈ పార్టీ నెంబర్‌ను షూట్ చేయనున్నారు. శుక్రవారం నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలైంది. ఈ సాంగ్‌లో పూజా హెగ్డేతోపాటు సినిమాలోని హీరోహీరోయిన్లు కూడా ఆడిపాడనున్నారట. ఒకే స్క్రీన్‌పై బుట్టబొమ్మ, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీరన్ పిర్జాదా, సోనాల్ చౌహన్ కనిపించడం నిజంగా ఫన్‌గానే ఉండనుంది. ఈ పాటను రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. 'ఎఫ్ 3' చిత్రం నవ్వులు పూయించడానికి మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: ఆ స్టార్ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే Lets get this party started💃 The Ravishing beauty @hegdepooja joins #F3Movie to add spice to our SPECIAL PARTY SONG🎶#F3OnMay27@VenkyMama @IAmVarunTej@AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic @f3_movie pic.twitter.com/SNZRyJFbD1 — Sri Venkateswara Creations (@SVC_official) April 15, 2022 -
‘ఐటెం సాంగ్’ ఆరోపణలు.. మహిళా జడ్జికి భారీ ఊరట
హైకోర్టు న్యాయమూర్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఐటెం సాంగ్‌కు చిందులేయాని బలవంతం చేశారని ఆరోపించిన దిగువ స్థాయి కోర్టు న్యాయమూర్తికి ఊరట లభించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ‘న్యాయవ్యవస్థలో ఐటెం సాంగ్ మరక’గా దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యింది. అయితే ఈ ఉదంతంలో 2014లో రాజీనామా చేసిన ఆమెను.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది. 2014లో సదరు మహిళా న్యాయమూర్తి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని, ఆ కారణంతో ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గురువారం ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. రాజీనామాను స్వచ్చంద విరమణ కింద పరిగణించకూడదంటూ కోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టుకు సూచించింది. అంతేకాదు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమోదించిన ఆమె రాజీనామాను కొట్టేస్తున్నట్లు జస్టిస్ గవాయ్ తెలిపారు. ఏం జరిగిందంటే.. జూలై 2014లో, అదనపు జిల్లా న్యాయమూర్తి అయిన ఆమె.. హైకోర్టు జడ్జి నుంచి తనకు జరిగిన వేధింపుల ఎదురవుతున్నాయని ఆరోపణలకు దిగింది. ఈ వేధింపులపై రాష్ట్రపతి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖలు రాసింది. ఆ తర్వాత ఆమె గ్వాలియర్‌లోని అదనపు జిల్లా న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసేసింది. ఓ ఐటెం సాంగ్‌లో తనను డ్యాన్స్ చేయాలని హైకోర్టు జడ్జి తనను కోరినట్లు లేఖలో ఆరోపించిందామె. అంతేకాదు సుదూర ప్రదేశానికి తనను బదిలీ చేయడాన్ని న్యాయమూర్తి ప్రభావితం చేశారని ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో సదరు జడ్జికి సుప్రీం నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంతేకాదు లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం రాజ్యసభ తరపున ఒక ప్యానెల్ నియమించారు. ఈ ప్యానెల్ గత ఏడాది డిసెంబర్లో నివేదిక ఇస్తూ.. సదరు హైకోర్టు న్యాయమూర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఫిర్యాది మహిళను వేధించడానికి న్యాయమూర్తి తన పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగంలో ఎటువంటి ఆధారం లేదని ప్యానెల్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత.. ఆరోపణలు చేసిన మహిళ.. తనను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని పరిశీలించాలని ఆమె న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆమెకు చుక్క ఎదురు కాగా.. ఇప్పుడు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. -
'ఊ అంటావా' బీట్‌కు 'బీటీఎస్' బ్యాండ్.. 'శ్రీవల్లి' పాటకు ప్రధాని స్టెప్పులు
BTS Band Dance To Samantha Song PM Modi Steps To Srivalli Song: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ సమంత కలిసి అదరగొట్టిన సాంగ్ 'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఒకరకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఆ స్పెషల్‌లో సమంత వంటి అగ్రకథానాయిక స్టెప్పులు వేయనుందని తెలిసినప్పటినుంచి బజ్ విపరీతంగా పెరిగింది. ఆ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, సమంత, అల్లు అర్జున్ స్టెప్పులు పాటను ఓ రేంజ్లో తీసుకెళ్లాయి. ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్లలో వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఈ పాటకు వస్తున్న క్రేజ్ చూసి ఇదివరకే పలువురు కవర్ సాంగ్స్, రీల్స్ చేసి ఆకట్టుకున్నారు. నెటిజన్లు ఈ పాటపై ఎడిటింగ్ వీడియోలు క్రియేట్ చేసి అబ్బురపరుస్తున్నారు. తాజాగా ప్రముఖ కొరియన్ పాప్ సింగింగ్ బ్యాండ్ బీటీఎస్ చేసిన 'బాయ్ విత్ లవ్' వీడియోకు 'ఊ అంటావా మావ' పాటను జత చేసి ఓ నెటిజన్ ప్రత్యేక వీడియోను రూపొందించాడు. 'పుష్ప బీట్‌ను బీటీఎస్ ఫాలో కాలేదు. బీటే బీటీఎస్‌ను ఫాలో అయ్యింది. బీటీఎస్‌లో టీ అంటే టాలీవుడ్' అని రాసుకొచ్చాడు. ఈ వీడియోలో బీటీఎస్ టీమ్ అయిన ఆర్ఎం, జిన్, సుగా, జిమిన్, వి, జంగ్‌కూక్, జె. హోప్ వేసిన స్టెప్పులు తెలుగు పాట బీట్‌కు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో ఈ క్రియేటెడ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by qualiteaposts (@qualiteaposts) అలాగే పుష్పలోని మరొక సూపర్ డూపర్ హిట్ సాంగ్ శ్రీవల్లి. ఈ పాటకు ప్రధాని నరేంద్ర మోదీ స్టెప్పులేసినట్లుగా ఓ యానిమేటెడ్ వీడియోను మరొ నేటిజన్ క్రియేట్ చేశాడు. అలా క్రియేట్ చేసిన ఆ వీడియోను నెట్టింట్లో వదిలేయగా.. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. My favourite WhatsApp forward! The creators in our country don’t sleep 😂 Looking great Modiji! @narendramodi @alluarjun #Pushpa pic.twitter.com/QBkxX51b3a — Akshat Saraf (@AkshatSaraf) January 21, 2022 -
ఊ అంటావా మావా.. పాటకు ప్రగతి స్టెప్పులు
-
ఊ అంటావా మావ అంటూ జిమ్‌లో ప్రగతి స్టెప్పులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప: ద రైజ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 17న థియేటర్లలో విడుదదలైంది. సినిమా రిలీజై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. సినిమానే కాదు ఇందులోని పాటలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. 'చూపే బంగారమాయెనా శ్రీవల్లీ..', 'సామీ నా సామీ..', 'ఏ బిడ్డా ఇది నా అడ్డా', 'దాక్కో దాక్కో మేక..', 'ఊ అంటావా మావా..ఉఊ అంటావా మావా..' పాటలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి. సౌత్ నుంచి నార్త్ దాకా ఎక్కడ చూసినా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు, టీమిండియా క్రికెటర్లు కూడా ఈ పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిత్యం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ దానికి సంబంధించిన వీడియోలు షేర్ చేసే సీనియర్ నటి ప్రగతి తాజాగా 'ఊ అంటావా మావా..' సాంగ్‌కు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసింది. అది కూడా జిమ్‌లోనే స్టెప్పులేయడం విశేషం. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్తా హల్చల్ అవుతోంది. -
సమంత స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసిందిగా.. చూసేందుకు 'ఊ' అనడమే
Samantha Item Song Oo Antava Song Full Video Out: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత డ్యాన్స్ చేసిన 'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ' సాంగ్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఈ ప్రత్యేక సాంగ్‌లో సమంత నటిస్తోందన్ని విషయం తెలిసినపపటి నుంచి ఈ పాటపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది. యూట్యూబ్‌లో సాంగ్ రిలీజైన తర్వాత అదే రేంజ్లో దూసుకుపోయింది. చంద్రబోస్ రాసిన ఈ పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్‌లో ట్రెండ్‌గా మారింది. సుమారు 90 మిలియన్ వ్యూస్‌ని సొంతం చేసుకున్న ఈ సాంగ్ 'టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ గ్లోబల్' జాబితాలో అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్‌లో అల్లు అర్జున్, సమంత స్టెప్పులు, వారి హావభావాలు ప్రేక్షకులు, అభిమానులను కట్టిపడేసేలా ఉన్నాయి. సమంత హీరోయిన్గా రాణిస్తునే స్పెషల్ సాంగ్‌లో నటించి తానేంటో నిరూపించుకుంది. ఈ సాంగ్‌లో చిందేసినందుకు సామ్ ఏకంగా రూ. 1.5 కోట్లు తీసుకుందని సమాచారం. అయితే ఈ సాంగ్ ఫుల్ వీడియో ఎప్పుడెప్పుడూ వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు శుక్రవారం (జనవరి 7) 'ఊ అంటావా' పూర్తి పాటను విడుదల చేసి ఆశ్చర్యపరిచారు మేకర్స్. అలాగే 'పుష్ప: ది రైజ్' సినిమా కూడా శుక్రవారం నుంచే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఇదీ చదవండి: చిన్నారి నోట సమంత పాట.. సామ్, డీఎస్పీ రియాక్షన్ -
సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సమంత
-
పుష్పతో ప్యాన్ ఇండియాను షేక్ చేసిన సామ్
-
చిన్నారి నోట 'ఊ అంటావా' పాట..
-
ఇదెక్కడి మాస్‌రా మావ.. చిన్నారి నోట 'ఊ అంటావా' పాట..
'పుష్ప: ది రైజ్' సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్టార్ హీరోయిన్ సమంత నటించిన 'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ' సాంగ్. ఒక స్పెషల్ సాంగ్‌లో సామ్ నటిస్తొందన్న విషయం తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. రిలీజ్ అనంతరం కూడా ఈ పాట అదే రేంజ్లో యూట్యూబ్‌లో దూసుకుపోయింది. ఈ పాటకు ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. ‘మీ మగ బుద్ది వంకర బుద్ధి’ అనే లిరిక్స్‌పై వివాదం చెలరేగింది. కానీ పాట మాత్రం అదిరిపోయే హిట్ సాధించింది. పాటలో తన సామ్ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఈ ఐటం సాంగ్‌లో చిందేసినందుకు సామ్ ఏకంగా రూ. 1.5 కోట్లు తీసుకుందని సమాచారం. 'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ' పాటను స్పూఫ్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు నెటిజన్స్. అనేక మంది ఇన్ స్టా యూజర్లు ఈ పాటపై తమదైన స్టైల్లో రీల్స్ చేసి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఈ సాంగ్‌పై వచ్చిన మీమ్స్ కూడా ఎంతగానో నవ్వించాయి. అందులో ఒక మీమ్‌ను సమంత షేర్ చేయడం విశేషం. ఈ సాంగ్ విడుదలైనప్పటి నుంచి అనేక మంది నోళ్లలో నానుతూనే ఉంది. ఎక్కడా ఓ చోట ఎవరో ఒక్కరూ ఈ పాటను హమ్ చేస్తున్నారు. తాజాగా తన చిట్టి పొట్టి మాటలతో ఈ పాట పాడుతూ ఆకట్టుకుంటోంది ఓ పాప. ఈ చిన్నారికి తన తల్లి 'హూ (Who)' అనే ఆంగ్ల పదం నేర్పుతూ ఉంటే.. పాప మాత్రం 'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ' అని పాడుతూ నవ్వు తెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అలా వైరల్ అవుతూ సమంత దాకా చేరింది. దీంతో ఈ వీడియోను సామ్ షేర్ చేస్తూ 'డెడ్' అని రాసి.. మూడు లవ్ సింబల్స్‌తో తన ప్రేమను వ్యక్తపరిచింది. సామ్‌తో పాటు పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా 'డామ్ క్యూటీ..' అని షేర్ చేస్తూ వీడియో పోస్ట్ చేసిన యూజర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. Dead 💕💕💕 https://t.co/5qKWCU1pxo — Samantha (@Samanthaprabhu2) December 27, 2021 Thats daaamn Cuteee !! 😍 Thaanku so much @bhavanamar garu ! 🙏🏻🎶 https://t.co/F8fyxLwqKA — DEVI SRI PRASAD (@ThisIsDSP) December 27, 2021 ఇదీ చదవండి: సమంతపై రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్.. మూడు ముక్కల్లో -
స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఎందుకు ఒప్పుకుందో తెలుసా?
Pushpa Director Sukumar Reveals Secrets About Samantha Item Song: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' మూవీ అద్భుతమైన వసూళ్లతో దుమ్మురేపుతుంది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా'.. అనే పాట ఈ చిత్రానికే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రంలోని లిరిక్స్‌పై వివాదం చెలరేగినా, అదే స్థాయిలో సూపర్ హిట్టయ్యింది. సమంత ఐటెం సాంగ్ చేస్తుందనగానే ఈ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విభిన్న పాత్రలతో స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతున్న సమంత అసలు ఐటెం సాంగ్ చేయడానికి ఎలా ఒప్పుకుంది అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ సుకుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొదట స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఒప్పుకోలేదు. అలాంటి పాటలు నాకు కరెక్ట్ కాదేమో అని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో నేనే తనని కన్విన్స్ చేశాను. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు..కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పా. ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఇదో కొత్త అనుభవం..నటిగా ఓ సరికొత్త సమంతను చూస్తారు అని చెప్పా. నా మాట మీద నమ్మకంతో సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించింది అని సుకుమార్ వెల్లడించారు. -
దేవీశ్రీ ప్రసాద్‌కి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్
Raja Singh Warning To Music Director Devi Sri Prasad Over His Comments: 'పుష్ప' సినిమా ఐటెం సాంగ్‌పై వివాదం ఇంకా ముదరుతూనే ఉంది. ఇటీవలె ఈ సాంగ్‌పై వస్తున్న విమర్శలపై దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పుష్ప ప్రమోషన్స్‌లో భాగంగా ఐటెం సాంగ్స్‌ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవీశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దేవీశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే దేవీశ్రీ ప్రసాద్ హిందువులకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన్ను బయట తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. ఐటెం సాంగ్‌లోని కొన్ని లిరిక్స్‌ని దేవుడి శ్లోకాలతో పోల్చాడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజాసింగ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా పుష్ప ప్రమోషన్స్‌లో పాల్గొన్న డీఎస్పీ.. తన దృష్టిలో భక్తి గీతాలు, ఐటెం సాంగ్స్ ఒక్కటేనని మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 'రింగ రింగా', 'ఊ అంటావా మావా' పాటలను సైతం భక్తి గీతాలుగా మార్చి పాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సమంత ఐటెం సాంగ్‌పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
'పుష్ప' సినిమాలో సమంత స్పెషల్‌సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. సమంత తొలిసారిగా చేసిన ఐటెం సాంగ్‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ పాటను బ్యాన్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవలె తమిళనాడులోని పురుషుల సంఘం సైతం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా పుష్ప ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ కాంట్రవర్సరీపై స్పందించారు. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ పాట లిరిక్స్‌పై వస్తున్న వివాదాలపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్ బన్నీని ప్రశ్నించగా... 'లిరిక్స్‌లో తప్పు లేదు, ఇదే నిజం' అంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. "ஊ சொல்றியா மாமே!" பாடலில் வருவது உண்மை தானே...! அல்லு அர்ஜூன் பதில்..#AlluArjun #Pushpa pic.twitter.com/1TLqtscOe7 — Shruti TV (@shrutitv) December 14, 2021 -
పుష్ప ఐటెం సాంగ్ మేల్ వెర్షన్ .. 'ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాప..'
Samantha Special Song In Pushpa Movie Male Version Goes Viral: ఈ మధ్య ఏదైనా పాట కానీ, డైలాగ్‌లు కానీ హిట్ అయ్యాయంటే చాలు వాటిని స్ఫూఫ్‌లు, కవర్స్‌గా మలుస్తున్నారు నెటిజన్లు. ఇటీవల వచ్చిన బుల్లెట్టు బండి పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ సాంగ్‌కు మేల్ వెర్షన్లో పాటను రాశాడు ఓ నెటిజన్. అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు', సూర్యవంశీ మూవీలోని 'నాజా' సాంగ్స్‌ను అనేక మంది కవర్స్‌గా చేసి సోషల్ మీడియాలో వదిలారు. అవి నెట్టింట్లో తెగ ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని సమంత స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా' విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పాటలో లిరిక్స్‌కు తగినట్లుగా ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహన్ తన హస్కీ వాయిస్‌తో మెస్మరైజ్ చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్‌కుపైగా దూసుకెళ్లింది. సమంత నటించిన ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ సాంగ్‌లో మగాళ్లది వంకర బుద్ధి, అందరూ మగాళ్లు ఒకటే అన్నట్లుగా ఉంటాయి లిరిక్స్. అయితే తాజాగా ఈ పాటకు మేల్ వెర్షన్ సాంగ్ వచ్చింది. 'మీ కళ్లల్లోనే వంకర ఉంది.. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి.. ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాప' అంటూ సాగుతోన్న ఈ సాంగ్ వైరల్ అవుతోంది. ఈ మేల్ వెర్షన్ పాటకు సంబంధించిన వీడియోను ఒక ట్విటర్ యూజర్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ పాటకు తగినట్టుగా పలు సినిమాల్లోని వీడియో, డ్యాన్స్ స్టెప్పుల క్లిప్‌లతో వీడియో తయారు చేయడం ఆకట్టుకుంటోంది. మేల్ వెర్షన్ అదిరిపోయిందని కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్స్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రేపు (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పుష్ప రాజ్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌లో అలరించబోతున్నారు. Fun male version of #OoAntavaOoOoAntava 😀 #Pushpa pic.twitter.com/hIeOFjfS2s — Vaali (@vaaalisugreeva) December 15, 2021 -
సమంత ఐటెం సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చుపెట్టారా?
Pushpa Movie Makers Spend Huge Amount on Samantha Item Song: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సమంత ఐటెం సాంగ్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సమంత స్పెషల్ సాంగ్‌తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సమంత చిందేసిన ఈ పాట కోసం మేకర్స్ దాదాపు రూ.5కోట్లు వరకు ఖర్చుపెట్టారని తెలుస్తుంది. ఈ ఒక్క సాంగ్ కోసమే సమంతకు సుమారు కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. దీంతో పాటు భారీ సెట్టింగ్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కించారట. సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సాంగ్ 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సమంత స్పెషల్ సాంగ్
Youtube Records Of Samantha Oo Antava Oo Antava Song In Pushpa: ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'పుష్ప' మ్యానియా కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సమంత తొలిసారిగా ఐటెం సాంగ్ చేయడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట అంటూ సమంత చేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌ను దుమ్మురేపుతుంది. సమంత గ్లామర్, చంద్రబోస్ లిరిక్స్ ఒక ఎత్తైతే, గాయని ఇంద్రావతి చౌహాన్ తన మత్తు వాయిస్‌తో పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.చదవండి: నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే పనులు చేయను: నాగ చైతన్య తాజాగా అన్ని భాషల్లో కలుపుకొని ఈ పాటకి 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా 1.6మిలియన్స్‌కి పైగా లైక్స్ వచ్చాయి. థియేటర్స్‌లో ఈ సాంగ్ మరింత సందడి చేయడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా సమంత పర్ఫార్మెన్స్కి బొమ్మ దద్దరిల్లుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా సినిమాలో ఇంటర్వెల్‌కి ముందుగానే ఈ సాంగ్ సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. చదవండి: సమంత ఐటెం సాంగ్‌కి చిందేసిన బోల్డ్ బ్యూటీ అరియానా నాగ చైతన్య బెస్ట్‌ఫ్రెండ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పిన సమంత 45M+ views with 1.6M+ Likes for the Record Breaking SIZZLING SONG OF THE YEAR💥 -https://t.co/xuag0ghoHu@alluarjun @iamRashmika @Samanthaprabhu2 @aryasukku @ThisIsDSP @adityamusic @TSeries @MythriOfficial #PushpaTheRise#PushpaTheRiseOnDec17 pic.twitter.com/OH3jDPvJhY — Pushpa (@PushpaMovie) December 15, 2021 -
సమంత ఐటెం సాంగ్‌కి చిందేసిన బోల్డ్ బ్యూటీ అరియానా
Ariyana Dancing For Samantha Oo Antava Oo Oo Antava Song In Pushpa: 'పుష్ప' మ్యానియా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తే, సమంత స్పెషల్ సాంగ్‌తో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. సౌత్ ఇండియన్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ వ్యూస్ రాబట్టిన పాటగా దుమ్మురేపుతుంది. ముఖ్యంగా సమంత స్టన్నింగ్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ సైతం ఈ పాటకు తనదైన స్టైల్లో చిందులేసింది. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్17న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
సమంతలా నేను చేస్తానో లేదో చెప్పలేను : రష్మిక
Rashmika Mandanna About Samantha Special Song In Pushpa Movie: వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా దూసుకెళ్తున్న రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ మూవీ 'పుష్ప'. డిసెంబర్17న ఈ చిత్రం ఫస్ట్ పార్ట విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌తో నటించాలనుకున్న తన కోరిక నెరవేరిందని, శ్రీవల్లి క్యారెక్టర్ కొత్త అనుభూతినిచ్చిందని తెలిపింది. ఇక ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయడంపై మాట్లాడుతూ.. సూపర్‌స్టార్‌గా రాణిస్తూనే, స్పెషల్ సాంగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి షాకయ్యా. సాంగ్ షూట్ అవగానే అద్భుతంగా చేశావని సామ్‌కి మెసేజ్ పంపించా. అయితే ఇలాంటి అవకాశం నాకు వస్తే మాత్రం చేస్తానో లేదో కశ్చితంగా చెప్పలేను అని రష్మిక తెలిపింది. -
సమంత స్పెషల్ సాంగ్‌పై 'పురుషుల సంఘం కేసు
హీరోయిన్ సమంత తొలిసారిగా చేసిన స్పెషల్ సాంగ్ వివాదాస్పదమైంది. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఈ పాటలో సమంత గ్లామర్, చంద్రబోస్ లిరిక్స్ ఒక ఎత్తైతే, గాయని ఇంద్రావతి చౌహాన్ తన మత్తు వాయిస్‌తో పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇటీవలె విడుదలైన ఈ పాట ఇప్పటికే మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తుంది. చదవండి: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆ వార్తలపై క్లారిటీ.. ఇదిలా ఉండగా 'మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ సాగిన ఈ సాంగ్ లిరిక్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మగవాళ్లపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఈ పాట ఉందంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. పుష్ప టీంతో పాటు పాటలో నర్తించిన సమంతపై కూడా పురుషుల సంఘం కేసుపెట్టింది. పాటపై నిషేధం విధించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. కాగా ఈ పాట థియేటర్స్‌లో వేరే లెవల్లో ఉంటుందని ఇప్పటికే అల్లు అర్జున్ 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్లో సైతం పేర్కొన్నారు.మరోవైపు సమంత తొలిసారిగా స్పెషల్ సాంగ్‌లో కనిపించడంతో ఈ పాటపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్17న విడుదల కానుంది. చదవండి: భార్య కోసం పాట పాడిన దిల్‌రాజు.. వీడియో వైరల్ -
బ్రహ్మానందాన్ని కాపీ కొట్టిన సమంత!
Pushpa Movie Item Song: పుష్ప సినిమా నుంచి రిలీజైన 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' పాట నిన్నటి నుంచి తెగ ట్రెండ్ అవుతోంది. పాట ఇలా రిలీజైందో లేదో నెటిజన్లు ఈ పాటను తెగ వాడేస్తూ రకరకాల ఎడిటింగ్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సాంగ్‌ను ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందానికి అన్వయిస్తూ ఎడిట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీన్ని రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ రీట్వీట్ చేశాడు. హిలేరియస్, సూపర్‌గా ఎడిట్ చేశారంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. అంతేకాదు బ్రహ్మానందాన్ని కాపీ కొడుతోందంటూ కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 😂🤣😂🤣😂. This is Hilarious !!! Superrr Edit !! 😀😀😀👌🏻👌🏻👌🏻 https://t.co/Ii9AVEEamC — DEVI SRI PRASAD (@ThisIsDSP) December 11, 2021 View this post on Instagram A post shared by Unprofessional Trollers (@unprofessional_trollers) బ్రహ్మీనే కాదు ప్రభాస్‌ను కూడా వాడేస్తూ ఎడిటింగ్ చేసిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఊ అంటావా మావా అనే ఐటం సాంగ్‌లో సమంత సందడి చేయనుంది. ఇక ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. Thq Anna Big Fan Check This Out Too 😍https://t.co/Box3YkmMEy — DHK ™ (@Devineni_Hari) December 11, 2021 -
సమంత ఐటమ్ సాంగ్ పాడిన సింగర్.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా!
Did You Know Singer Who Sing Item Song From Pushpa Samantha: ఎక్కడ చూసినా ప్రస్తుతం పుష్ప సినిమా హవా నడుస్తోంది. రిలీజ్‌కు ముందే పాటలు, ట్రైలర్, డైలాగులు అభిమానులకు పూనకం తెప్పిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన కలిసి నటించిన ఈ సినిమాను సుకుమార్ తెరకెకిస్తున్న విషయం తెలసిందే. డిసెంబర్ 17న మొదటి భాగం విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్లను వేగం చేసింది చిత్ర యూనిట్. మూడు పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయడగా.. తాజాగా పుష్ప నుంచి ఐటమ్ సాంగ్‌ను ప్రజల్లోకి వదిలింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ఆడిపాడిన ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అనే ఐటమ్ సాంగ్ లిరికల్ సాంగ్‌ను శుక్రవారం రిలీజ్ చేసింది. మత్తు వాయిస్‌తో సాగే ఈ పాటలో సమంత తన మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. సామ్ కాస్ట్యూమ్, స్టైల్, లుకింగ్ అన్నీ పాటకు పర్ఫెక్ట్ సెట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి మార్మోగించడంతో సాంగ్ బ్లాక్బాస్టర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. చదవండి: మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత! కాగా చంద్రబోస్ రాసిన ఈ ఐటమ్ పాటను పాడింది ఇంద్రావతి చౌహాన్. తన గొంతుతో ఈ పాటను మరో మెట్టు ఎక్కించింది. దీంతో ఈ సింగర్ ఎవరని వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. ఇంద్రావతి చౌహన్ ప్రముఖ ఫోక్ సింగర్, సినీ నేపథ్య గాయని మంగ్లీ చెల్లెలు. ఈమె కూడా జానపద పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. జార్జిరెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాట కూడా పాడారు. అంతేగాక కోటి న్యాయ నిర్ణేతగా ‘బోల్ బేబీ బోల్’ రియాలిటీ షోలో కూడా పాడారు. -
మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత!
Samantha Oo Antava.. Oo Oo Antava Lyrical Song Out: సమంత.. ఈ పేరు చెప్తేనే కుర్రకారు హుషారెత్తిపోతారు. ఆమె నటనకు, క్యూట్ లుక్స్‌కు ఫిదా కాని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదేమో! తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా స్టార్డమ్ సంపాదించుకున్న సామ్ మొట్టమొదటి సారిగా ఐటం సాంగ్‌లో నటించింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ పుష్పలో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' స్పెషల్ సాంగ్‌లో అలరించింది. 'మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ సాగిన ఈ సాంగ్ లిరికల్ వీడియో శుక్రవారం సాయంత్రం రిలీజైంది. ఈ పాటలో లంగా జాకెట్లో కనిపించిన సమంత తన అందచందాలను ఆరబోస్తూ మరోసారి ఫిదా చేసింది. కాగా ఇప్పటివరకు కెరీర్లో ఒక్కసారి కూడా స్పెషల్ సాంగ్స్ చేయని సామ్ మొదటిసారిగా బన్నీ కోసం ఈ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. దీంతో పుష్ప సినిమాకు సమంత, ఈ స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి 30 లక్షల కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
'ఆర్ఆర్ఆర్ మూవీలో ఐటెం సాంగ్ ఉందా మావా'?
Netizen Tweet About RRR Item Song, See RRR Team Funny Reaction: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్'.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా వస్తోన్న ఈ మూవీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే 'నాటు నాటు', 'దోస్తీ', 'జనని' పాటలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఐటెం సాంగ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయంపై ఓ నెటిజన్ మూవీ టీంను ప్రశ్నించాడు. 'సినిమాలో ఐటం సాంగ్ ఉందా మావా' అంటూ ఆర్ఆర్ఆర్ టీంకు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మూవీ టీం..'ఏ నువ్వు చేస్తావా' అంటూ ఫన్నీగా బదులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. Ye Nuvvu Chesthaaavaa… pic.twitter.com/d2xoLHParR — RRR Movie (@RRRMovie) November 26, 2021 -
'పుష్ప'లో సమంత స్పెషల్ సాంగ్.. అందుకే ఒప్పుకుందా?
Samantha To Perform Special Song In Pushpa: నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా స్పెషల్‌సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని పుష్ప టీం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒకే పాటలో బన్నీతో కలిసి మాస్ స్టెప్పులేయనుంది సమంత. పెళ్లి తర్వాత నుంచి కేవలం పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు సైన్ చేస్తున్న సమంత తాజాగా స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగింది. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయా అని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సాధారణంగానే సుకుమార్ సినిమా అంటేనే స్పెషల్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్. ఆర్య సినిమాలోని అ అంటే అమలాపురం’నుంచి ‘రంగస్థలం’లో జిగేల్ రాణి వరకూ ప్రతి ఐటెమ్ సాంగ్ సూపర్ హిట్టే. దీనితో పాటు రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ అడగడంతో సమంత కాదనలేకపోయిందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిన పుష్ప చిత్రంలో ఈ స్పెషల్‌సాంగ్ మరింత హైలెట్‌గా నిలుస్తుందని చిత్రయూనిట్ భావిస్తుంది. అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ పాట చిత్రీకరణ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాల్లో ఫుల్ బిజీగా ఉన్న సమంత త్వరలోనే బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో సైతం సందడి చేయనున్నట్లు సమాచారం. A big Thank You to the supremely talented @Samanthaprabhu2 garu for accepting our request and doing this sizzling number in #PushpaTheRise 💥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic pic.twitter.com/fD0QRDVYTg — Mythri Movie Makers (@MythriOfficial) November 15, 2021 -
ప్రభాస్ సినిమాలో కత్రినా ఐటమ్ సాంగ్?
Katrina Kaif Item Song In Salaar: ఐటమ్ సాంగ్ లేని సినిమాలు దాదాపు ఉండటంలేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఒక స్పెషల్ సాంగ్‌ని ఫ్యాన్స్ ఆశిస్తారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చర్చ అంతా ఈ హీరో చేస్తున్న ‘సలార్’ సినిమా గురించే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటను భారీగా ప్లాన్ చేస్తున్నారనే వార్త వచ్చింది. అంతేకాదు.. ఇది ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ పాటలో ప్రభాస్‌తో కలసి ఓ హిందీ హీరోయిన్ స్టెప్పులేస్తే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఆ బ్యూటీ ఎవరో కాదు.. కత్రినా కైఫ్ అని సమాచారం. కత్రినా డ్యాన్స్ ఎంత బాగుంటుందో చెప్పడానికి ఆమె చేసిన ప్రత్యేక పాటల్లో ఒకటైన ‘చిక్నీ చమేలీ..’ చాలు. ‘అగ్నిపథ్’లోని ఈ పాటలో కత్రినా స్టెప్స్ అదుర్స్. మరి... ‘సలార్’లో స్పెషల్ సాంగ్ ఉంటుందా? ఉంటే అందులో కత్రినానే నటిస్తారా? అనేది వేచి చూడాలి. -
Gully Rowdy: ‘ఛాంగురే ఐటమ్ సాంగురే’ ప్రోమో అదిరింది
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నేహా శెట్టి హీరోయిన్గా నటించగా, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో నటించారు. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘ఛాంగురే ఐటమ్ సాంగురే...’ అంటూ సాగే పాటను హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ గురువారం విడుదలచేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను సోమవారం విడుదల చేశారు. సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. మంగ్లీ, సాయికార్తీక్, దత్తు ఆలపించారు. సందీప్, స్నేహా గుప్తాలతో డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ హుషారైన స్టెప్పులు వేయించారని ప్రోమో చూస్తే తెలుస్తోంది. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి సంగీతం: చౌరస్తా రామ్, సాయికార్తీక్. -
అప్పట్లో షారుక్ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి
‘చెన్నైఎక్స్ప్రెస్’లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌తో కలిసి ప్రియమణితో చిందేసిన ఐటమ్‌సాంగ్ గుర్తుందా. అదేనండి అప్పట్లో వన్ టూ త్రీ ఫోర్.. గెట్ ఆన్ ది డ్యాన్స్ ఫ్లోర్..అంటూ స్టెప్పులేసిన ఈ పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది ఎందుకు అంటారా? ఇటీవల విడుదలై విశేష ప్రజాదరణ పొందుతున్న ఫ్యామిలీ మ్యాన్-2తో ఆకట్టుకున్న నటి ప్రియమణి ఓ ఇంటర్య్వూలో ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ షూటింగ్ సమయంలోని కబుర్లను గుర్తుచేసుకుంది. అది నా పర్సులో భద్రంగా దాచుకున్నా ఈ సందర్భంగా ఆమె.. ‘‘నాకు అది మరచిపోలేని అనుభవం. షూటింగ్ సమయంలో షారుఖ్ ఐప్యాడ్‌లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఆడుతుంటే రూ.300 ఇచ్చారు. అవి ఇప్పటికీ నా పర్సులో భద్రంగా దాచుకున్నా. షారుఖ్‌ని బాలీవుడ్ బాద్షా అని అనడానికి ప్రత్యేకించి ఒక్క కారణమంటూ లేదు. మనదేశంలో ఉన్న గొప్పనటుల్లో ఆయన ఒకరు. సక్సెస్‌ని ఎప్పుడూ తలకెక్కించుకోరు. షూటింగ్‌లోనూ చాలా సింపుల్‌గా ఉంటారు. షారుక్ వ్యక్తిత్వమే మనల్ని మరింతగా ఆయన్ని ఇష్టపడేలా చేస్తుంది. ఎప్పుడు మరుసటి రోజు సమయం వృథా కాకుండా జాగ్రత్త పడేవారు. అలా షూటింగ్ సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకునే వారు’’ అంటూ షారుఖ్‌తో తన అనుబంధాన్ని ఈ రకంగా చెప్పుకొచ్చింది. చదవండి: ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేకపోయా: జరీన్ ఖాన్ -
'పుష్ప' ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ?
క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉండనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతోంది. పుష్పలో ఓ ఐటెం సాంగ్ ఉండనుందని సమాచారం. బాలీవుడ్ భామ దిశా పటానీ ఈ ఐటైం సాంగ్ చేయనుందట. మాస్ స్టెప్పులకు బన్నీతో కలిసి డ్యాన్స్ చేయనున్నట్లు ఇండస్ర్టీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. ఇందులో మొదటి భాగం అక్టోబర్‌లో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. చదవండి : 'తగ్గేదే లే'.. అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు ఆర్డినరీ హీరోలు ఎక్స్ట్రార్డినరీగా.. రష్మిక వీడియో సందేశం -
ఈ ‘ఐటమ్ సాంగ్’ను స్కూల్లో పాఠంగా చేర్చారు!
‘సినిమా బాగుందా?’ అనే ప్రశ్నతో పాటు ‘ఐటమ్ సాంగ్ ఉందా?’ అనే ఉపప్రశ్న కూడా ఎదురవుతుంటుంది. ‘ఈ సందర్భంలో ఇలాంటి పాట ఉండాలి’ అనేది సినిమా రూల్. అయితే ఐటమ్‌సాంగ్ మాత్రం కచ్చితంగా పక్కాగా మాస్ పాటై ఉండాలి. అలాంటి ఒక మాస్ పాటకు ఇప్పుడు మహర్దశ పట్టింది. సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్’ సినిమాలో ‘మున్నీ బద్నామ్ హుయి’ ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలియంది కాదు. ఈ పాటను ‘ఇంగ్లాండ్ న్యూ మ్యూజిక్ కరికులమ్’లో చేరుస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని డిపార్ట్మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ (డిఎఫ్యి) న్యూ కరికులమ్ గైడ్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. బ్రిటన్‌లోని టీచర్స్, ఎడ్యుకేషన్ లీడర్స్, సంగీతకారులలో నుంచి ఎంపిక చేసిన 15 మంది అత్యున్నత బృందం ‘మోడల్ మ్యూజిక్ కరికులమ్’ను అభివృద్ధి చేసింది. మన శాస్త్రీయ సంగీత పాఠాలతో పాటు భాంగ్రా బీట్, ఐటమ్‌సాంగ్స్‌ను చేరుస్తున్నారు. ‘జయహో’, సహేలిరే, ఇండియన్ సమ్మర్... మొదలైన పాటలు కూడా ఇందులో ఉన్నాయి. అన్ని జానర్స్‌లోని ఈ పాటలు సంగీతం నేర్చుకునే విద్యార్థులకు పాఠాలు, కేస్స్టడీలుగా ఉపయోగపడతాయి. ‘హుషారెత్తించి సంగీతంతో పాటు కలర్‌ఫుల్ విజువల్స్ ఈ పాట ప్రత్యేకం’ అని ‘మున్నీ బద్నామ్ హుయి’ పాటకు కితాబు ఇచ్చింది బృందం. -
పాక్ సినిమాలో ఐటెం సాంగ్; నెటిజన్లు ఫైర్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో కాఫ్ కంగనా పేరుతో ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం నిర్మించిన చిత్రంలోని ఐటెం సాంగ్ వివాదాస్పదమైంది. ఆ పాటపై పాక్ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వివరాల్లోకెళితే.. పాక్ మిలిటరీ పీఆర్ విభాగం నిర్మించిన చిత్రం కాఫ్ కంగనా. ఈ చిత్రంలో నీలమ్ మునీర్ అనే యువతి ఐటెం సాంగ్ చేసింది. మేరే ఖ్వాబోంమే అంటూ సాగే ఈ పాట భారత్‌ను ద్వేషిస్తూ సాగుతుంది. అయితే పాటను అసభ్యకరంగా చిత్రీకరించడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐఎస్పీఆర్ డీజీ ఆసిఫ్ గపూర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారత్‌కు చెందిన యువతి పాత్రను నీలమ్ పోషించిందనీ, పాక్‌కు చెందిన యువతి పాత్ర కాదని సమర్థించుకున్నారు. పాట ఏ సందర్భంలో వచ్చేదీ సినిమా చూస్తే అర్థమవుతుందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాక, ఈ చిత్రం కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు రూపొందించిందనీ, పాట చిత్రీకరణ ఐఎస్పీఆర్ ప్రధాన కార్యాలయంలో కానీ, ఇస్లామాబాద్‌లో కానీ చిత్రీకరించలేదని వివరించారు. ఈ విషయంపై నీలమ్ మునీర్ స్పందిస్తూ.. ఐఎస్పీఆర్ నిర్మించినందునే ఐటెం సాంగ్ చేశానని, దేశం కోసం ఇలా చేయడం తనకు తప్పనిపించలేదని పేర్కొంది. అంతేకాక, నా జీవితంలో ఇదే మొదటి ఐటెం సాంగ్. అలాగే చివరిది కూడా అని తెలిపింది. ఈ వివరణలకు పాక్ నెటిజన్లు శాంతించలేదు. గపూర్‌ను, నీలంను ట్రోల్ చేస్తున్నారు. కశ్మీర్, దేశ రక్షణ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. కంగనా అనే హిందూ యువతి, అలీ ముస్తఫా అనే పాకిస్తాన్ ముస్లిం యువకుడి మధ్య నడిచే ప్రేమ ఈ చిత్ర కథాంశం. ఐఎస్పీఆర్ అనేది పాకిస్తాన్ ఆర్మీకి, ఆ దేశ పౌర సమాజానికి మధ్య వారధిగా పనిచేస్తుంది. సైన్యం గురించిన వివరాలు, చిత్రాలు, విశేషాలు వంటివి అధికారికంగా వెల్లడించే ఒక ఆర్మీ విభాగం. అంతేకాక, సైన్యానికి సంబంధించిన అంశాలు మీడియాకు అందిస్తుంది. ఈ విభాగం నిర్మించిన చిత్రమే కాఫ్ కంగనా. -
ఏం జరిగింది?
ప్రేమ ఉంది. సస్పెన్స్ ఉంది. యాక్షన్ ఉంది.. అన్నీ ఉన్నాయి. అసలేం జరిగింది? అంటే ఇప్పుడు కాదు.. మేలో తెలుస్తుంది. శ్రీరాం, సంచితా పదుకునే జంటగా ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న ‘అసలేం జరిగింది’. షూటింగ్ పూర్తయింది. ‘‘దాదాపు 40 రోజులు చేసిన షూటింగ్లో టాకీ, పాటలు, ఫైట్లు తీశాం. ఫైట్ మాస్టర్ శంకర్ తెరకెక్కించిన భారీ ఫైట్స్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. అలాగే కొత్త కొరియోగ్రాఫర్ ఈశ్వర్, మరో కొరియోగ్రాఫర్ హరి పాటలకు అద్భుతమైన స్టెప్స్ సమకూర్చారు. ఓ మాస్ సాంగ్‌లో దాదాపు రెండు వందల మంది, మరో పాటలో నాలుగు వందల మంది పాల్గొన్నారు. ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. 8కె రెజల్యూషన్ గల రెడ్ మాన్‌స్ట్రో కెమెరాను ఈ సినిమా చిత్రీకరణ కోసం వినియోగించాం. దర్శకుడు ఎన్వీఆర్ అద్భుతంగా తెరకెక్కించారు. మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
అవకాశం వస్తే నేనోద్దంటానా?
సినిమా: సినిమా మారుతోందని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్పు మంచిదే అని చెప్పకతప్పదు. ముఖ్యంగా సాంకేతికపరంగా సినిమా ఎంతో అభివృద్ధి చెందుతోంది. దానితో పాటు సంప్రదాయ కట్టుబాట్లకు తిలోదకాలు ఇవ్వడం అధికం అవుతోంది. ఇక అసలు విషయానికి వస్తే హీరోయిన్ల అందాలారబోత పరిధులు దాటుతోంది. అదే మంటే ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు, మేము అందిస్తున్నామని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కథ డిమాండ్ కారణంగానే అలా నటించాల్సి వస్తోందని హీరోయిన్లు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లని అని తప్పులేదు. నిజానికి గ్లామరస్‌గా నటిస్తేనే వారికి వరసగా అవకాశాలు వస్తాయి. అందుకే మేం గ్లామర్‌కు దూరం అని మడిగట్టుకుని కూర్చున్న వారు కూడా ఇప్పుడు తాము సైతం అనక తప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ బ్యూటీల రాక అధికం కావడంతోనే గ్లామర్‌లోనే శృతి మించడం మొదలైందని చెప్పక తప్పదు. ఒకప్పటి వ్యాంప్ పాత్రలు ఇప్పుడు హీరోయిన్ పాత్రలుగా మారిపోయాయి. అదే విధంగా ఇప్పుడు శృంగార తారల అవసరం లేకపోయ్యింది. హీరోయిన్లే ఆ తరహా పాటల్లో నటించేస్తున్నారు. అందుకు అధిక పారితోషికం ముట్టడమే ప్రధాన కారణం అయినా, వారు మాత్రం వేరే అర్థాలను చెబుతున్నారు. మీల్కీబ్యూటీ తమన్న గ్లామర్ పాత్రలకు ఎప్పుడో సై అనేసింది. కాజల్ అగర్వాల్, శ్రియ, పూజా హెగ్డే, క్యాథరిన్ ట్రెసా ఇలా చాలా మంది ఐటమ్‌సాంగ్‌కు రెడీ అంటున్నారు. మరో బాలీవుడ్ దిగుమతి నటి రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా ఐటమ్ సాంగ్‌లో నటించడంలో తప్పేంటో తనకు అర్థం కావడం లేదంటోంది. ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న కన్నడ చిత్రం కేజీఎఫ్‌లో నటి తమన్న ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టింది. అయితే ఆ పాటలో నటించే అవకాశం ముందు నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌కు వచ్చిందని, తను నో అనడంతో తమన్న ఎస్ అందనే ప్రచారం సాగుతోంది. దీన్ని ఖండించిన రకుల్‌ప్రీత్‌సింగ్ కేజీఎఫ్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం తనకు రాలేదని, వస్తే నేనోద్దంటానా? అయినా అలాంటి సాంగ్స్‌లో నటించడంలో తప్పేంటి అనీ అమ్మడు ప్రశ్నిస్తోంది. -
విశాల్‌తో సన్నీ ఐటమ్‌సాంగ్
సినిమా: నటి సన్నిలియోన్ అన్ని తరహా పాత్రల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరమదేవి అనే చారిత్రక కథా చిత్రంలో వీరనారిగానూ నటిస్తోంది. అయినా ఈ బ్యూటీకి ఐటమ్ గర్ల్ అనే ముద్ర మాత్రం పర్మినెంట్ అయిపోయిందని చెప్పక తప్పుదు. సన్నీ స్టెప్ వేసిందంటే కేక అంటారు. అలా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో తన ఐటమ్ సాంగ్స్‌తో కేక పుట్టిస్తున్న ఈ బాలీవుడ్ జాణ తాజాగా మరోసారి కోలీవుడ్‌లో తన ఆట పాటతో దుమ్మురేపడానికి సై అంది. విశాల్‌తో కలిసి ఐటమ్ సాంగ్‌కు రెడీ అనేసిందన్నది తాజా సమాచారం. విశాల్ ప్రస్తుతం అయోగ్య చిత్రం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. నవ దర్శకుడు, ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్‌మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగులో జూనియన్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా నటిస్తోంది. విశాల్ పోలీస్ అధికారిగా వైవిధ్యభరిత పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఆయన నటి సన్నీలియోన్‌తో కలిసి ఐటమ్ సాంగ్‌లో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. నటుడు పార్థిబన్, దర్శకుడు కేఎస్.రవికుమార్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సీఎస్.శ్యామ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయోగ్య చిత్రాన్ని తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న విశాల్ 2019 ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
తొమిదేళ్ల తర్వాత తొలిసారి!
తొలిసారి డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. అదేంటీ.. ఒకటా రెండా సోనాక్షి డ్యాన్స్‌తో అదరగొట్టిన పాటలు బోలెడు ఉన్నాయి కదా అనుకుంటు న్నారా? అది నిజమే. అయితే కెరీర్లో ఆమె తొలిసారి ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నారని బాలీవుడ్ టాక్. ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్షి ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘టోటల్ ధమాల్’. ఇంద్రకుమార్ దర్శకత్వంలో ధమాల్ సిరీస్‌లో వస్తోన్న థర్డ్ పార్ట్ ఇది. ఈ సినిమాలోనే స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారట సోనాక్షీ సిన్హా. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు తొమిదేళ్ల తర్వాత ఆమె ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం విశేషమే మరి. -
స్పెషల్ గాళ్
స్వింగ్ జర స్వింగ్ జర... స్వింగ్ స్వింగ్ అంటూ తమన్నా ఆ మధ్య ‘జై లవ కుశ’లో చేసిన ఐటమ్ సాంగ్ గుర్తుండే ఉంటుంది. థియేటర్లో ఫ్యాన్స్ ఊగిపోయారు. తమన్నా అంత బాగా డ్యాన్స్ చేశారు. అంతకుముందు ‘అల్లుడు శీను’లో ‘లబ్బర్ బొమ్మ..’, ‘స్పీడున్నోడు’లో ‘బ్యాచిలర్ బాబు..’ అంటూ ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌కూ మంచి స్పందన వచ్చింది. ఇంతేనా కన్నడ ‘జాగ్వార్’లోనూ ఓ ఐటమ్ సాంగ్‌కి కాలు కదిపి, శాండిల్వుడ్నీ తన ఆటతో కట్టిపడేశారు. ఇప్పుడు మరోసారి కన్నడ ప్రేక్షకులకు ఐ–ఫీస్ట్ లాంటి ఐటమ్ సాంగ్‌లో కనిపించనున్నారు తమన్నా. అన్నట్లు.. రీసెంట్గా నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాలో ఫేమస్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు’లో నర్తించడానికి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’లో స్పెషల్ సాంగ్ గురించి చెప్పాలంటే.. నవీన్ కుమార్, శ్రీనిధి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహి స్తున్నారు. ఇందులో తమన్నా చేయబోయే స్పెషల్ సాంగ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ 1970లో నటించిన కన్నడ చిత్రం ‘పరోపకారి’ సినిమాలోని ‘జోకే నన్ను బలియా మించు’ సాంగ్ రీమిక్స్‌లో తమన్నా నటించబోతున్నారు. ఈ సినిమాను కన్నడతో పాటు తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. అదండీ సంగతి. తమన్నాకి ఇక్కడ కూడా క్రేజ్ ఉంది కదా అందుకే.. స్పెషల్ సాంగ్ చేయించి ఉంటారు. మొత్తంగా హీరోయిన్గా, స్పెషల్గాళ్గా తమన్నా కెరీర్ ఫుల్ స్వీంగ్‌లో ఉంది. -
స్పెషల్ సాంగ్!
మహేశ్‌బాబు సినిమాల్లో ఉన్న స్పెషల్ సాంగ్స్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండటమే కాదు ఫుల్ ఫేమస్ కూడా. ఆయన హీరోగా నటించిన ‘పోకిరి’ సినిమాలో ‘ఇప్పటికింకా నా వయసు...’, ‘దూకుడు’ సినిమాలో ‘ఆటో అప్పారావు...’, ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో ‘లండన్ బాబులు’, ‘ఆగడు’లో ‘జంక్షన్లో..’ పాటలే అందుకు ఉదాహరణ. తాజాగా మహేశ్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అశ్వనీదత్, ‘దిల్’ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘అల్లరి’ నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓన్లీ కాలేజ్‌లోనే మహేశ్ గడ్డం లుక్‌లో కనిపిస్తారట. ఆఫ్టర్ కాలేజీ సీన్స్ రెగ్యులర్ లుక్‌లోనే మహేశ్ కనిపిస్తారని టాక్. ఈ సినిమా సెకండాఫ్‌లోనే ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ ఐటమ్‌సాంగ్ ట్రాక్‌ను ఫైనలైజ్ చేశారని టాక్. ఇందుకోసం టాప్ కథానాయికల లిస్ట్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. మరి.. ఈ స్పెషల్ సాంగ్ చేయబోయే స్పెషల్ గాళ్ ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం కాస్త టైమ్ పడుతుంది. అంతేకాక ‘ఆగడు’ సినిమా తర్వాత మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను’ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లేవు. మళ్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగేళ్ల తర్వాత స్పెషల్ సాంగ్ అనగానే అది ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి ఇప్పటి నుంచే ఫ్యాన్స్‌లో మొదలైంది. ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. -
ఐటం బాయ్‌గా మారిన స్టార్ హీరో
చిత్ర పరిశ్రమలో ‘ప్రత్యేక గీతాల్లో’ నర్తించేందుకు కొన్నాళ్ల క్రితం వరకూ ప్రత్యేకంగా నటీమణులను తీసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మంచి పారితోషికం, క్రేజ్ కోసం స్టార్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్స్ వైపు మక్కువ చూపుతున్నారు. అయితే ఇన్నాళ్లు ‘ఐటం గర్ల్స్’కు మాత్రమే సొంతమైన ఈ పాటల్లో ఇక ‘ఐటం బాయ్స్’ కూడా రాబోన్నారు. బాలీవుడ్ చరిత్రలోనే ‘ఐటం బాయ్’గా కాలు కదపనున్న తొలి హీరోగా అర్జున్ కపూర్ నిలవనున్నారు. ఈ యువ హీరో తన కజిన్ హర్షవర్ధన్ కపూర్ నటిస్తున్న ‘భవేష్ జోషి సూపర్‌హీరో’ చిత్రంలో ‘చుమ్మే మేన్ చవాన్‌ప్రాష్’ పాటలో కనిపించబోతున్నాడు. ప్రత్యేక గీతంలో అర్జున్ తోపాటు ‘దండేకర్ సిస్టర్స్’ అనుషా, షిబానీ నర్తించనున్నారు. తాజాగా ఈ పాటకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లో వీరు ముగ్గురూ మాంచి రంగు రంగులు దుస్తుల్లో ఐటం తారలకు ధీటుగా మెరిసిపోతున్నారు. ‘మిర్జ్యా’ చిత్రం తర్వాత హర్షవర్ధన్ నటిస్తున్న చిత్రం ‘భవేష్ జోషి సూపర్‌హీరో’. ఈ చిత్రంలో హర్షవర్ధన్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఫాంటమ్ ఫిల్మ్స్ బ్యానర్లో, విక్రమాదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. -
ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు
సాక్షి, సినిమా : సుమంత్ అశ్విన్ డెబ్యూ మూవీ తూనీగ తూనీగతో తెలుగులో నటించింది మనీషా యాదవ్. అయితే ఆ తర్వాతే ఆమె వరుసగా తమిళ చిత్రాలతో బిజీ అయిపోయింది. కానీ, కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుని.. ఈమధ్యే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ, ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు రావటం లేదు. అందుకు దర్శకుడు వెంకట్ ప్రభు కారణమని ఆమె ఆరోపిస్తోంది. విషయం ఏంటంటే.. చెన్నై 600028(తెలుగులో కొడితే కొట్టాలిరా) చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చెన్నై 600028-2 లో మనీషా యాదవ్ ‘సొప్పన సుందరి’ అనే ఓ పాత్రలో మెరిసింది. అంతేకాదు ఐటెం సాంగ్‌తో కూడా చిందులేసింది. అయితే అది మరీ దారుణంగా ఉండటంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. ఆమె చేసిన పాత్రను(డబుల్ మీనింగ్ డైలాగులకు) ప్రేక్షకులు చీదరించుకున్నారు. దీంతో మొత్తానికి ఆమె కెరీర్ మసకబారిపోయిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అది ఐటెం సాంగ్ కాదని.. సినిమాకు ఎంతో కీలకంగా మారుతుందని దర్శకుడు వెంకట్ ప్రభు నాతో చెప్పాడు. కానీ, నా పాత్రను చాలా దారుణంగా చిత్రీకరించారు. నేను ఆయనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నా. కానీ, ఆయన వమ్ము చేశారు. ఇకపై కొత్త చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా, సరోజా, గోవా, గాంబ్లర్, రాక్షసుడు చిత్రాలతో వెంకట్ ప్రభు తెలుగువారికి కూడా సుపరిచితుడే. -
యాక్షన్ వైపు సన్నిలియోన్
తమిళసినిమా: నటి సన్నిలియోన్ అనగానే గ్లామర్ బాంబ్గానే అందరూ భావిస్తారు. అయితే ఈ బ్యూటీ అలాంటి ఇమేజ్‌కు ఇక టాటా చెప్పాలని నిర్ణయించుకుందట. అసలు విషయానికి వస్తే సన్నిలియోన్ తొలిసారిగా కోలీవుడ్‌లో చారిత్రాత్మక కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. దర్శకుడు వీసీ.వడివుడైయాన్ ఈ బ్యూటీని దక్షిణాదికి నాయకిగా పరిచయం చేయనున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని నవ నిర్మాత పోన్స్ స్టీఫెన్ తన స్టీవ్స్ కార్నర్ పతాకంపై భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కథా చిత్రంలో సన్నిలియోన్‌కు కత్తియుద్ధాలు, గుర్రపు స్వారీలు, యాక్షన్ సన్నివేశాలు భారీగా చోటు చేసుకుంటాయని చిత్ర వర్గాలు తెలిపాయి. అందుకోసం సన్నిలి యోన్ కత్తి పోరాటం, గుర్రపుస్వారీలో శిక్షణ పొందుతోందట. ఆంధ్రా నుంచి ప్రత్యేకంగా శిక్షకుడిని ముంబై పిలిపించుకుని విలు విద్యల్లో తర్ఫీదు పొందుతోందట. ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. నటుడు నాజర్, నవదీప్‌లతో పాటు ఒక ప్రముఖ నటుడు ప్రధాన పాత్ర పోషించనున్నారు. దీన్ని తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలన్నది తన కోరిక అని, ఇలాంటి కథ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని సన్నిలియోన్ వెల్లడించింది. ఈ చిత్రంతో తన గ్లామర్ ఇమేజ్ పూర్తిగా మారిపోతుందనే నమ్మకం వ్యక్తం చేస్తోంది. -
ఐటమ్ అంటే ఆలోచిస్తా!
బిర్యానీ తినగానే వేసుకునే కిళ్లీ ఎంత కిక్ ఇస్తుందో... ప్రేక్షకుల్లో కొందరికి మాంచి మాస్ మసాలా సిన్మాలో ఐటమ్ సాంగులు అంతే కిక్ ఇస్తాయి. అందుకనే వాటికంత క్రేజ్! ఈ క్రేజ్‌ను కొంతమంది కథానాయికలు క్యాష్ చేసుకుంటున్నారు. కానీ, కాజల్ అగర్వాల్ మాత్రం క్రేజ్ అండ్ క్యాష్ రెండిటినీ కోరుకోవడం లేదు. ఆల్రెడీ ‘జనతా గ్యారేజ్’లో ‘పక్కా లోకల్... నేను పక్కా లోకల్’ ఐటమ్ సాంగ్ చేశారు కాజల్. ఆ తర్వాత అటువంటి అవకాశాలు చాలా వస్తే తిరస్కరించారట! కెరీర్‌పై ఐటమ్ సాంగులు ప్రభావం చూపిస్తాయని భయమా? అంటే, అదేం లేదన్నారు. ‘పక్కా లోకల్’ సాంగ్ చేయడానికి కారణం చెబుతూ... ‘‘తారక్ (ఎన్టీఆర్)తో నాకున్న ఫ్రెండ్షిప్ వల్ల చేశా. భవిష్యత్తులోనూ ఛాలెంజింగ్ ఐటమ్ సాంగులొస్తే చేస్తా. కానీ, ఒకటికి రెండుసార్లు ఐటమ్ అంటే ఆలోచిస్తా. ట్యూన్ ఎలా ఉంది? పిక్చరైజేషన్ ఎలా చేయబోతున్నారు? అనేవాటిపై నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది’’ అన్నారు. మామూలుగా బిర్యానీ తయారీకి వాడే మసాలా సరుకుల రేటు కంటే కిళ్లీ రేటు తక్కువే. కానీ, ఒక్కోసారి కిళ్లీని బట్టి రేటు పెరుగుతుంది. ఇండస్ట్రీలోనూ అంతే. సిన్మాలో హీరోయిన్ కంటే ఒక్కోసారి ఐటమ్ సాంగు చేసిన స్టార్ హీరోయిన్‌కు ఎక్కువ డబ్బులు ఇస్తుంటారు. కానీ, కాజల్ మాత్రం ‘‘నాకు ఇప్పుడు డబ్బుల కంటే మంచి పాత్రలు చేయడమే ముఖ్యం’’ అంటున్నారట!! -
6ఐటం గర్ల్‌గా ఓవియ
తమిళసినిమా: కథానాయికలు ఐటం సాంగ్స్‌లో నటించడం ఇప్పుడు పరిపాటిగా మారింది. అయితే ఐటం గర్ల్‌గా మారడం అన్నది అరుదే. కాగా విమల్‌కు జంటగా కళవాణి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమైన కేరళాకుట్టి ఓవియ. తొలి చిత్రమే మంచి విజయాన్ని అందుకోవడంతో తన భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఓవియ కలలు కంది. అనుకున్నట్లుగానే అమ్మడికి వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. ప్రముఖ దర్శకుడు సుందర్.సీ తెరకెక్కించిన కలగలపు చిత్రంలో కథానాయకిగా నటించిన ఓవియ ఆ చిత్రంలో మరోనాయకి అంజిలితో ఒక సాంగ్‌లో పోటీ పడి అందాలారబోసింది. అయితే అలా అందాలొలక బోసిన అంజలి ఆ ముద్ర నుంచి బయట పడగలిగింది కానీ, ఓవియ మాత్రం తప్పించుకోలేక పోయింది. అందుకు కారణం తను నటించిన చిత్రాలు వరుసగా అపజయాలను చవి చూడడం కావచ్చు. తాజాగా అరుళ్‌నిధి హీరోగా నటిస్తున్న ఇరవుక్కు ఆయిరం కన్గళ్ చిత్రంలో సింగిల్ సాంగ్‌తో పాటు, కొన్ని సన్నివేశాల్లో నటిస్తోంది. అదేవిధంగా విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్న సిలుక్కువార్‌పట్టి సింగం చిత్రంలో రెజీనా కథానాయకిగా నటిస్తుండగా ఓవియ ఐటమ్ సాంగ్‌లో నర్తించిందట.ఈ చిత్రాల విడుదల తరువాత ఓవియను ఐటమ్ గర్ల్ లిస్ట్‌లో పెట్టేసినా ఆశ్చర్యపడనక్కరేదు అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
హాట్ సాంగ్‌లో..
హాట్ గాళ్ ఊర్మిళా మాతోండ్కర్ పేరు చెబితే.. ‘రంగీలా’ (తెలుగులో ‘రంగేళి’) గుర్తుకు రాక మానదు. ఆ చిత్రంలో హాట్ హాట్‌గా నటించిన ఊర్మిళ ఆ తర్వాత కూడా పలు చిత్రాలు చేశారు. కానీ, ‘రంగీలా’ ఆమె కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఈ హాట్ స్టార్ తాజాగా ఓ హాట్ ఐటమ్ సాంగ్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్లో అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్న ‘రైతా’ అనే చిత్రంలోనే ఊర్మిళ ప్రత్యేక పాట చేయనున్నారట. అన్నట్లు.. ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేయడం ఇది మొదటిసారి కాదు. 1998లో వచ్చిన ‘చైనా గేట్’ చిత్రంలో ‘చమ్మా.. చమ్మా..’ అనే ఐటెమ్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
అరబ్ గుర్రం అంటున్నారు!
నన్ను అందరూ అరబ్ గుర్రంలా ఉన్నావంటున్నారు అని అంటోది నటి రాయ్‌లక్ష్మి. ఐటమ్ సాంగ్ నుంచి అందాలారబోస్తూ ఎలాంటి పాత్రకైనా రెడీ అనే నటి ఈ అమ్మడు. ఇటీవల తెలుగులో మెగాస్టార్‌తో సింగిల్‌సాంగ్‌లో చిందులేసి యువతకు యమ కిక్ ఇచ్చిన రాయ్‌లక్ష్మి తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో తానెప్పుడూ బిజీ అంటోంది.ఈ బ్యూటీతో చిన్న భేటీ.. ప్ర: కోలీవుడ్‌లో బొత్తిగా నల్లపూసైపోయినట్లున్నారు? జ: అనూహ్యంగా బాలీవుడ్లో బిజీ అవడం వల్ల కోలీవుడ్‌లో కాస్త గ్యాప్ వచ్చిన మాట నిజమే.ఈ గ్యాప్ తరువాత తాజాగా యార్ అనే చిత్రంలో నటిస్తున్నాను.ఇది హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సైకిలాజికల్ కథా చిత్రం. నేనిందులో చాలా స్టైలిష్‌గా కనిపిస్తాను.ప్రేక్షకులకు ఫ్రెష్‌గానూ, మంచి కిక్ ఇచ్చేలా నా పాత్ర ఉంటుంది. ప్ర: తెలుగులో చిరంజీవితో ఐటమ్ సాంగ్‌లో రెచ్చిపోయి అందాలారబోశారట? జ: ఆ పాటలో నటించిన ఎక్స్పీరియన్స్ మరువలేనిది.నేను జూలీ–2 హిందీ చిత్ర షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్న సమయంలో అనూహ్యంగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. చిరంజీవితో ఒక పాటకు ఆట రెడీయాఅని అడిగారు. నేనేమీ ఆలోచించలేదు. ఓకే.ఎప్పుడు అని అడిగాను. రేపే రావాలి అని అన్నారు. కాస్త దడ పుట్టింది. 10 ఏళ్ల తరువాత చిరంజీవితో నటించే అవకాశం. అదీ ఆయన 150 చిత్రంలో. డాన్స్ కు చిరంజీవి చాలా ఫేమస్. ఆయనతో నటించాలన్నది ప్రతి నటికి ఒక కలనే చెప్పాలి. ఆశించకుండానే నాకు అవకాశం వచ్చింది. విషయాన్ని జూలి–2 చిత్ర దర్శక నిర్మాతలకు చెప్పి చిరంజీవితో సింగిల్‌సాంగ్‌లో నటించాను. ఆ పాటకు థియేటర్స్‌లో ఎంత రెస్పాన్సో. ఒకే ఒక్క పాటకు అంత మంచి గుర్తింపు రావడం ఆశ్చర్యమే. ప్ర: హిందీ చిత్రం జూలి–2లోనూ అందాల మోతేనటగా? జ: నిజం చెప్పాలంటే జూలి–2 నా తొలి హిందీ చిత్రం.ఆ తరువాతే ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన అకిరా చిత్రం అంగీకరించాన్ రేంజ్లో కనిపిస్తాను. స్మిమ్మింగ్ డ్రస్ బాగా నప్పాలని చాలా కష్టపడి బరువు కూడా తగ్గాను. ఇప్పుడు నన్నందరూ అరబ్ గర్రంలా ఉన్నావంటున్నారు. నాకు ఎలాంటి డ్రస్ అయినా సూపర్‌గా ఉంటుంది. ఈ చిత్రం విడుదల అనంతరం బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ నేనే టాక్ ఆఫ్ ది సిటీ అవుతాను. చాలా ధైర్యం చేసి నటించిన ఇందులోని నా పాత్ర చాలా గుర్తింపు పొందుతుంది. ప్ర: ఇంతకు ముందు మీ గురించి తరచూ వదంతులు ప్రచారం అయ్యేవి. చదవడానికీ చాలా జాలిగా ఉండేది. ఇప్పుడు తగ్గినట్లుందే? జ: నాకు మాత్రం చాలా అసహనంగా ఉండేది. నేనూ, నా పనిలా ఉండే నాపై వదంతులు సృష్టించేవారు ఎవరు?ఎందుకు అలా రాస్తున్నారో అర్థం అయ్యేది కాదు. మొదట్లో నేనూ ఈజీగా తీసుకున్నాను. తరువాత అది విపరీతంగా మారడంతో చిరాకనిపించేది. ఇప్పుడు అలా కాదు. నాకు మెచ్యూరిటీ వచ్చింది. నా గురించి ఎవరూ గేలి చేయలేరు. ఇకపై నా గురించి గాసిప్స్ రావు. ప్ర: సరే. అందాలరాశిలా ఉన్నారు. మిమ్మల్నెవరూ లవ్ చేయలేదా? మీరెవరినీ లవ్ చేయలేదా? జ: నిజం చెప్పాలంటే నాకు ప్రేమించడానికి సమయమే లేదు.ఇక లవ్ అన్నది ఎప్పుడు? ఎలా? ఎవరిపై పుడుతుందన్నది అనేది ఒక రకమైన హైపోతెడికలానా మ్యాటర్. అది నాకు సెట్ అవుతుందా?అన్నది కూడా తెలియదు. జరగాల్సినవి అవే జరుగుతాయి. కాయ తానుగా పండాలి. కార్బొనైటట్తో పండించకూడదు. -
నందమూరి హీరోతో రత్తాలు..?
మాస్ కమర్షియల్ సినిమా అంటే ఐటమ్ సాంగ్ కంపల్సరీ అయిపోయింది. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్‌కు సై అంటున్నారు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో ఓ మాస్ మాసాలా ఐటమ్ నంబర్ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. గతంలో ఐటమ్ సాంగ్స్ తో ఊపేసిన అందాల భామలతో ఆడిపాడేందుకు రెడీ అవుతున్నారు. సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్‌తో.. ఖైదీ నంబర్ 150లో చిరంజీవితో కలిసి చిందేసిన అందాల భామ లక్ష్మీరాయ్‌తో ఆడిపాడేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. వరుసగా రెండు సూపర్ హిట్ ఐటమ్ నెంబర్స్‌లో నటించిన లక్ష్మీరాయ్‌తో స్పెషల్ సాంగ్ చేయిస్తే తమ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. అందుకే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. -
యార్ అంటున్న రాయ్‌లక్ష్మి
ఇంతకు ముందు తరచూ వార్తల్లో కనిపించిన నటి రాయ్‌లక్ష్మి పేరు ఈ మధ్య ఎక్కడా వినిపించడం లేదు. దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయా అన్న సందేహం కోలీవుడ్ వర్గాల్లో నెలకొంది. అయితే అలాంటిదేమీ లేదని, తాను బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉండడం వల్ల కోలీవుడ్‌పై దృష్టి సారించలేకపోయానంటున్న రాయ్‌లక్ష్మి ఇటీవల టాలీవుడ్లో ఖైదీనంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో ఐటమ్ సాంగ్‌లో చిందులేశారన్నది గమనార్హం. చాలా గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్‌లో మెరవడానికి సిద్ధమయ్యారు.యార్ అనే చిత్రంలో నటిస్తున్నారు.దీని గురించి రాయ్‌లక్ష్మి చెబుతూ తాను హిందీ చిత్రం జూలీ–2 కోసం చాలా రోజులు కేటాయించానన్నారు. దీంతో తమిళ చిత్రాలపై దృష్టి సారించలేకపోయానని చెప్పారు. జూలీ–2 హిందీ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని, ఇక కోలీవుడ్ చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. నెలన్నర క్రితమే యార్ అనే తమిళ చిత్రానికి కమిట్ అయ్యానని తెలిపారు. ఇది థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. స్క్రిప్ట్ ఆసక్తిగా ఉండడంతో ఆ చిత్రాన్ని అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. రవి కొటారకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జూలీ–2 హిందీ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. ఇంతకు ముందు ఏడాదికి ఐదు చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పుడు మూడు చిత్రాలు చేస్తే చాలని భావిస్తున్నట్లు అన్నారు. కారణం వైవి««దl్యభరిత కథా చిత్రాలను ఎంచుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ఈ అమ్మడు ఇప్పటికే మలయాళం చిత్రం 100 డిగ్రీ సెల్సియస్ తమిళ రీమేక్‌లో నటించనున్నట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. -
చిరు-లక్ష్మి 'రత్తాలు..రత్తాలు' వచ్చేస్తోంది!
-
చిరు-లక్ష్మి 'రత్తాలు..రత్తాలు' వచ్చేస్తోంది!
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' ఆడియోకి అదిరిపోయే రెస్పాన్స్‌పై లహరి మ్యూజిక్ స్పందించింది. ఆడియోపరంగా కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపో్తున్న అమ్మడు కుమ్ముడు పాట తాజాగా ఏడుమిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.. అలాగే రెండవ పాట సుందరీ..' పాట 4 మిలియన్ వ్యూస్‌కి చేరుకుంటుండగా, మూడవ పాట 'యు అండ్ మి' పాట 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. దీంతోశ్రోతల నుంచి వస్తున్న సెన్సేషనల్ స్పందనపై ట్విట్టర్ ద్వారా సంతో్షాన్ని వ్యక్తం చేసింది లహరి మ్యూజిక్ సంస్థ. మరోవైపు రత్తాలు..రత్తాలు ఐటం సాంగ్ ఐటమ్ సాంగ్‌ను డిసెంబర్ 31న విడుదల చేయనున్నారు. అదే రోజు ఈ చిత్రంలోని అన్ని పాటలు యూ ట్యూబ్ జూక్‌బాక్స్‌లో అందుబాటులోకి రానుంది. కాగా ఈ మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయట..యు/ఎ సర్టిఫికెట్ లభించింది. రత్తాలు..రత్తాలు..ఐటమ్ సాంగ్ లో లక్ష్మీరాయ్ తో చిరంజీవి స్టెప్పులేశారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి కొణిదెల ప్రొడక్షన్స్ సారధ్యంలో రామ్ చరణ్. నిర్మి సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందించగా చిరంజీవి జోడీగా సరసన కాజల్ నటిస్తోంది. సంక్రాంతికి ఈ మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
నేనెప్పుడూ హద్దులు దాటలేదు
గ్లామర్ విషయంలో తానెప్పుడూ హద్దులు దాటలేదని అంటున్నారు నటి కాజల్ అగర్వాల్. ఐరన్‌లెగ్ ముద్రను నెమ్మదిగా గోల్డెన్ నటిగా మార్చుకున్న నటి ఈ ఉత్తరాది భామ. ఆదిలో బొమ్మలాట్టం అంటూ కోలీవుడ్‌కు పరిచయం అయినా చందమామ చిత్రంతో తెలుగులోనే సక్సెస్ రుచి చూశారు. ఆ తరువాత మగధీర చిత్రం స్టార్ హీరోయిన్ అంతస్తును అందించింది. ఇక కోలీవుడ్‌లో తుపాకీ తన సినీ జీవితానికి వెలుగునిచ్చింది. అలా నటిగా ఎదుగుతూ వచ్చిన కాజల్ ఇప్పుడు ఏకంగా చిరంజీవి సరసన ఆయన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రంలో నటించే లక్కీ చాన్సను దక్కించుకున్నారు. ఇటీవలే నేను పక్కా లోకల్ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌తో ఐటమ్ సాంగ్‌లో లెగ్ షేక్ చేసిన కాజల్‌అగర్వాల్ గ్లామర్ గురించి ఇటీవల చాంతాడంత చెప్పుకొచ్చారు. అదేంటో చూద్దామా! హీరోయిన్లకు గ్లామర్ అన్నది అవసరమే. ఒక్కోసారి అందులో మోతాదు దాటాల్సివస్తుంది. అందుకే హీరోయిన్లు డ్రస్సులు, అలంకార సామగ్రిపై ఆసక్తి కనబరసాల్సి ఉంటుంది. నేనూ గ్లామర్ పాత్రలు పోషించాను. అయితే ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఇటీవల జనతాగ్యారేజ్ అనే తెలుగు చిత్రంలో సింగిల్ సాంగ్‌లో నటించాను కూడా. అది ఐటమ్ సాంగ్ అయినా గ్లామర్ విషయంలో ఎల్లలు దాటలేదు. అందాలారబోతలో నాకంటూ కొన్ని హద్దులు నిర్ణయించుకున్నాను. వాటినెప్పుడూ మీరను. నిజం చెప్పాలంటే స్త్రీకి చీరకట్టులోనే శృంగారం దాగుంటుంది. నేను నన్ను మోడరన్ దుస్తుల్లోనే ఎక్కువ చిత్రాల్లో చూసి ఉంటారు. అయితే అలాంటి చిత్రాల్లో కూడా ఒక్క సన్నివేశంలోనైనా చీరలో కనిపిస్తాను. ఎలాంటి దుస్తులు ధరించామన్నది ముఖ్యం కాదు. ఎంత అందంగా ఉన్నామన్నదే ప్రధానం.నన్ను చూసిన వారు గౌరవించాలి అని పేర్కొన్నారు కాజల్ అగర్వాల్. -
సంపంగి చిందులు!
‘నా ఇంటి పేరు సిల్కూ.. నా ఒంటి రంగు మిల్కూ..’ అంటూ ‘అల్లుడు శీను’లో ఓ ఐటమ్ సాంగులో ఆడిపాడిన తమన్నా, ఈసారి సంపంగిగా సందడి చేయనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’లో తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సంపంగి..’ అంటూ సాగే ఈ పాటను ఇటీవల చిత్రీకరించారు. దాంతో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్ దర్శకత్వంలో చన్నాంబిక ఫిలింస్ పతాకంపై 75 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 6న విడుదల చేయాలనుకుంటున్నారు. సంపంగిగా తమన్నా, నిఖిల్ వేసిన స్టెప్స్ అదిరిపోయాయనీ, ఈ సాంగ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: విజయేంద్ర ప్రసాద్, కెమేరా: మనోజ్ పరమహంస, మ్యూజిక్; ఎస్.ఎస్.తమన్. -
నో ఐటమ్ సాంగ్స్
ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయనంటున్నారు నటి కాజల్ఆగర్వాల్. టాప్ హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్‌లో నటించడం అన్న సంస్కృతి తొలుత బాలీవుడ్లో మొదలై ఆ తరువాత దక్షిణాదికి పాకింది. ఇప్పుడిక్కడ అది సర్వసాధారణంగా మారింది. రెండు మూడు కాల్షీట్స్తో పాటను పూర్తి చేయడం, అందుకు సుమారు అర కోటికిపైగా పారితోషకం ముడుతుండడంతో టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌కు సై అంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్రేజీ భామలు శ్రుతిహసన్, తమన్నా, అనుష్క లాంటి వారు ఐటమ్‌సాంగ్స్‌కు ఆడేశారు. తాజాగా నటి కాజల్‌అగర్వాల్ కూడా తానేమీ తక్కువాఅన్నట్టు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు అంగాంగ ప్రదర్శన చేసేశారు. కాజల్‌అగర్వాల్ ఐటమ్‌సాంగ్‌ను యువత బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కాజల్ అగర్వాల్ ఐటమ్ సాంగ్ చేయడాన్ని ఎగతాళి చేస్తున్నారట. ఈ విషయం ఆమె చెవిన పడింది. దీంతో కాస్త హర్ట్ అయిన కాజల్ తాను నటించిన సాంగ్ ను ఐటమ్ సాంగ్ అనడం సబబు కాదని, అది ప్రత్యేక గీతం అని వివరించే ప్రయత్నం చేశారు. అయినా ఆ పాటలో నటించడంలో మరిన్ని అలాంటి అవకాశాలు వస్తున్నాయన్నారు. తాను జనతాగ్యారేజ్ చిత్రంలో స్నేహం కోసమే ప్రత్యేక పాటలో నటించానని తెలిపారు. ఇకపై అలాంటి సింగిల్ సాంగ్స్‌లో నటించన ని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు జీవాకు జంటగా కవైలైవేండామ్ చిత్రంతో పాటు, అజిత్ తాజా చిత్రంలోనూ, అదే విధంగా తెలుగులో మెగాస్టార్‌తో ఖైదీ నంబర్ 150 చిత్రంతో పాటు దర్శకుడు తేజా దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. ఇక విక్రమ్‌కు జంటగా నటించే అవకాశం కాజల్‌ను వరించిందనే ప్రచారం జరుగుతోంది. -
రెండిచ్చినా నో అంటున్నా శ్రుతి
ఒక్కోసారి కొన్ని విషయాలు ఎలా జరిగినా ఇతరులను సంతోషంలో ముంచేస్తాయి. తాజాగా నటి శ్రుతిహాసన్ విషయంలోనూ అలాంటి సంఘటనే జరిగిందని సమాచారం. శ్రుతి చాలా బోల్డ్. అది వ్యక్తిగతం కావచ్చు, వృత్తిపరమైన అంశం కావచ్చు, ఇంకేమైనా కావొచ్చు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటానని బహిరంగంగానే చెప్పేంత ధైర్యవంతురాలు శ్రుతిహాసన్. కథానాయకిగా టాప్ పొజిషన్లో ఉన్నా మరోవైపు ఐటమ్ సాంగ్ చేయడానికీ ఏ మాత్రం వెనుకాడరు. అయితే అందుకు పారితోషకం మాత్రం భారీగానే డిమాండ్ చేస్తారు. దీన్ని దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతగా భావించవచ్చు. ఇటీవల ఒక సింగిల్ సాంగ్‌కు రెండు కోట్లు పారితోషికం చెల్లిస్తానన్నా నో అని ఖరాఖండిగా చెప్పేశారట. దీంతో తమిళ వర్గాలు శ్రుతి నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు చాలా సంతోషిస్తున్నాయట. దీనికీ, వారికీ సంబంధం ఏమిటనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. శ్రుతిహాసన్ సింగిల్ సాంగ్ చేయనని చెప్పింది ఒక కన్నడ చిత్రానికట.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన కొడుకు నిఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ కన్నడం, తెలుగు భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాగ్వుర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీప్తీసాతి నాయకిగా నటిస్తున్నారు. తన కొడుకు తొలి చిత్రం కావడంతో భారీగా రూపొందించాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారట. ఇందులో ఒక ప్రత్యేక సాంగ్‌లో నటి శ్రుతిహాసన్ నటిస్తే మరింత ప్రచారం లభిస్తుందన్న ఆలోచనతో ఆమెను సంప్రదించి అందుకు రెండు కోట్లు పారితోషికం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు, అయినా శ్రుతిహాసన్ నో అన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇక తమిళ వర్గాల సంతోషానికి కారణం తమిళనాడుకు, కర్ణాటకకు మధ్య కావేరి నీటి సమస్య చాలా కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో శ్రుతిహాసన్ కన్నడ చిత్రంలో నటించడానికి నిరాకరించడం ఇక్కడి వారికి ఆనందాన్ని కలిగించడానికి కారణం అనే ప్రచారం జరుగుతోంది.అయితే శ్రుతిహాసన్ ఆ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయననడానికి అసలు కారణం ఏమిటో తెలియదు గానీ, ఆ పాటలో ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా మెరవనున్నారు. -
మళ్లీ... తమన్నా ఐటమ్!
స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగుల్లో నటించడమనే ట్రెండ్ బాలీవుడ్లో ఎప్పట్నుంచో ఉంది. తెలుగులో ఇటీవల ఈ ట్రెండ్‌ను పాపులర్ చేసిన స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. ‘నా ఇంటి పేరు సిల్కూ.. నా ఒంటి పేరు మిల్కూ’ అంటూ ‘అల్లుడు శీను’లో కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ప్రత్యేక పాట చేయడం అప్పట్లో హాట్ టాపిక్. తర్వాత అదే హీరోతో ‘స్పీడున్నోడు’లోనూ స్పెషల్ సాంగ్ చేశారు. ఆ రెండు పాటలూ హిట్టే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తెలుగులో ప్రత్యేక పాట చేయడానికి తమన్నా రెడీ అయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘జాగ్వార్’. చన్నాంబిక ఫిలింస్ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్నారు. ఎ.మహదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చేయనున్నారు. ఈ నెల 5న ప్రారంభమయ్యే షెడ్యూల్లో ఈ సాంగ్ షూట్ చేస్తారు. ‘‘ఎస్.ఎస్.తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. సెప్టెంబర్ 18న పాటల్ని, అక్టోబర్ 6న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని కుమారస్వామి తెలిపారు. -
తెరపై నిఖిత...అశ్శరభ శరభ
హీరోయిన్ నిఖిత తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. గతంలో పలు సినిమాల్లో నటించిన ఈ పంజాబీ బ్యూటీ ‘అవును-2’, ‘టై’ సినిమాలతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ పాత్రలతో పాటు ఐటమ్ సాంగులకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గత ఏడాది విశాల్ ‘జయసూర్య’లో ఐటమ్ గాళ్‌గా తళుక్కుమన్నారు. ‘కాళిదాసు’లోనూ ఐటమ్ సాంగ్ చేశారు. ఇప్పుడు మరోసారి ఐటమ్ గాళ్‌గా కనిపించనున్నారు. ప్రేక్షకులకు కొత్త ఊపుతేనున్నారు. ఆకాశ్ సహదేవ్, మిస్తీ చక్రవర్తి జంటగా ఎన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం ‘శరభ’. సోషియో - ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిత ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘కోటిగారు మాంచి మాస్ బీట్ కంపోజ్ చేశారు. బాబా భాస్కర్ నృత్యరీతులు సమకూరుస్తున్న ఈ సాంగ్‌లో యాభై మంది డ్యాన్సర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు’’ అన్నారు. జయప్రద, నెపోలియన్, నాజర్, శాయాజీ షిండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమేరా: రమణ సాల్వ, సంగీతం: కోటి, సహ నిర్మాత: సురేశ్ కపాడియా. -
దేశీ లుక్‌లో హాట్‌గా..!
ఏంటమ్మాయ్.. రోజు రోజుకీ బొద్దుగా తయారవుతున్నావ్? అని గతంలో ఎవరైనా పరిణీతీ చోప్రాను ప్రశ్నిస్తే.. ‘ఏం అమ్మాయిలు బొద్దుగా ఉంటే చూడరా? నా శరీరం, నా ఇష్టం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అవకాశాలు ఆవిరయ్యేసరికి చక్కనమ్మ సన్నబడక తప్పలేదు. బొండుమల్లి సన్నజాజిలా మారితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో.. పరిణీతికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. చిక్కినాక ఆఫర్లు పెరిగాయట. ప్రస్తుతం ‘మేరీ ప్యారీ బిందు’లో నటిస్తున్నారామె. ఇది కాకుండా ఓ ఐటమ్ సాంగులోనూ కనిపించనున్నారు. జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్ హీరోలుగా నటిస్తున్న ‘డిషూమ్’లో పరిణీతి ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ముంబైలోని మెహబూబా స్టూడియోలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రత్యేక పాటలో పరిణీతి దేశీ లుక్ హాట్‌గా ఉంటుందని సమాచారం. పరిణీతి కాస్టూమ్స్‌ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేశారు. ఈ బ్యూటీ చేస్తున్న తొలి ఐటమ్ సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ చూడాలంటే వచ్చే నెలాఖరు వరకూ ఆగాల్సిందే. రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఐటమ్ సాంగ్‌లో ఫిలాసఫీ ఏంటి’ అన్నారు!!
పాటతత్వం ఓరోజు పూరీ జగన్నాథ్ నన్నో పాట రాయమని అన్నారు... ‘నేనింతే’ సినిమా కోసం. ఐటెమ్ సాంగ్. అంతకుముందు ‘పోకిరి’లో ‘ఇప్పటి కింకా నా వయసు నిండా పదహారే’ రాశాను. అయితే ఈసారి పాట అలా ఉండకూడదని, ఫిలసాఫికల్‌గా ఉండాలని అన్నారాయన. ఐటెమ్ సాంగ్ అంటే తన అందాల గురించే పాడాలా, మంచి ఫిలాసఫీ చెప్పకూడదా అన్నది ఆయన ఆలోచన. చాలా గొప్ప ఆలోచన. ఆయన ఆలోచనకు రూపమివ్వడానికి నేను సిద్ధపడ్డాను. అప్పుడు నా మనసులో మెదిలిన మొదటి ఫిలాసఫీ... కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు ఈ జీవితం. దాన్ని ఆధారంగా చేసుకుని నా కలం కదిలింది. ‘పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల’ అన్న పాట పుట్టుకొచ్చింది. ఫిలాసఫీ అనగానే పెద్ద పెద్ద పదాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మంచి విషయమైనా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ముఖ్యంగా ఇది సినిమా పాట కాబట్టి నేల టికెట్ తీసుకున్న మాస్ ప్రేక్షకుడి మనసులోకి పాట చొచ్చుకుపోగలగాలి. అందుకే ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగానే పదాలు వేసుకుంటూ పోయాను. ‘పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల... ఈలోపే ఏదో చెయ్యాల/ఏలాల ఏలాల... దునియానే ఏలాల... చకచకచక చెడుగుడు ఆడాల’ జీవితం చాలా చిన్నది. పుట్టుక, చావు మన చేతుల్లో లేవు. మధ్యలో ఉండే జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి సాధించాలి. ‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడొద్దే/ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే’ చాలామంది అవకాశాలు రాలేదని బాధ పడిపోతూ ఉంటారు. అది నిజం కాదు. అవకాశాలు వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు గుర్తించం. కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం. ‘చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే/నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా/నీకై మిగిలివుంది ఇక ఈరోజు/ టర్నే లేని దారులూ ట్విస్టే లేని గాథలూ రిస్కే లేని లైఫులూ బోరు బోరే’ జీవితమన్నాక సంతోషంతో పాటు బాధ, కష్టాలు కూడా ఉంటాయి. వాటిని పాజిటివ్‌గా తీసుకుని ముందుకెళ్లిపోవాలి తప్ప తిట్టుకుంటూ కూర్చుంటే ముందుకుపోలేం. ‘నువ్వెంతో ఎత్తుకు ఎదిగినా బోల్డంత సంపాదించినా ఒరే నాన్నా పొంగిపోకురా/ గెలుపెవ్వడి సొత్తు కాదురా అది నీతో మొదలవ లేదురా/అది ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సురా’ ఓడిపోతే కుంగిపోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీదే తొలి పరాజయం కాదు. అలాగే గెలిస్తే పొంగిపోకూడదు. ఎందుకంటే నీదే తొలి విజయం కాదు. గెలుపోటములన్నవి అనుకోకుండా వస్తాయి. అయితే గెలవొచ్చు. లేదంటే ఓడొచ్చు. దేనినైనా ఒకేలా స్వీకరించాలి. ‘నిలుచుంటే బస్ స్టేషన్లో బస్ వస్తాది ఎక్కొచ్చే/పడిపోతే ఫ్రస్టేషన్లో ఏముంటాది ఎక్కేకే/ఇన్నేళ్లూ చేసిన పొరపాట్లూ సక్సెస్‌తో సర్దేయొచ్చులే/పడినా తిరిగి లేవడం బాల్యం మొదటి లక్షణం/దాన్నే మరచిపోవడం వింతేగా’ బస్టాండులో నిలబడితే బస్ వస్తుంది. ఎక్కుతాం. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే ఫ్లయిట్ వస్తుంది. ఎక్కుతాం. అలాగే జీవితంలో పైకి వెళ్లాలంటే ఏదో ఒక మార్గం ఎంచుకోవాలిగా! పడిపోయి అక్కడే ఉండిపోతే ఎక్కడికి వెళ్ల గలం? బాల్యంలో తప్పటడుగులు వేస్తూ పడి పోతాం. కానీ లేచి మళ్లీ అడుగులేస్తాం. నడక నేర్చుకుంటాం. కానీ పెద్దయ్యాక పడిపోతే మాత్రం ఎందుకు లేవం? పడినచోటే ఎందుకు ఉండిపోతాం? పొరపాట్లు చేయడం సహజం. కానీ విజయం సాధించిన తర్వాత అవి మరుగున పడిపోతాయి. ఏమీ చేయకుండా ఖాళీగా తిరిగి, అల్లర్లు చేసి, గొడవల్లో ఇరుక్కుని చెడ్డపేరు తెచ్చుకుంటాడో వ్యక్తి. అతడు ఉన్న ట్టుండి మారిపోయి, ఏ విదేశాలకో వెళ్లి సెటిలై పోయాడనుకోండి, తన తల్లిదండ్రులను ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడనుకోండి... అతడి పాత జీవితం ఎవరికైనా గుర్తుకొస్తుందా! ‘నిన్ను భయపెట్టే పనులేమిటో అవి చేసేయ్ రోజుకొక్కటీ/ఇక ఆపై జడుపే రాదురా’ మనకు ఏదంటే భయమో దాన్ని చూసి పారిపోతుంటాం. అలా కాకుండా వాటిని చేయడానికి ప్రయత్నిస్తే ఆ భయం పోతుంది. ఇలా స్ఫూర్తినిచ్చే ఎన్నో మాటలు ఇందులో రాశాను. నిజానికి నేను పాటించే సూత్రాలే అవన్నీ. అందుకే ఆ మాటల్లోని నిజాయితీ పాటను నిలబెట్టింది. నేను ఎన్నోసార్లు పడిపోయాను. లేచాను. గెలిచాను. స్క్రీన్‌మీద నా పేరు చూసుకోవాలని వచ్చాను. నా పేరు తెర మీద చూసుకున్నాక వెళ్లిపోవచ్చు. కానీ వెళ్లలేదు. మొదటి ఏడు సినిమాలూ పరాజయాన్ని చవిచూసినా కుంగిపోలేదు. ఓ సమయంలో వెళ్లిపోదాం అనిపించినా మంచి పేరుతో వెళ్లిపోదాం అనుకున్నాను. పేరు వచ్చాక, దాన్ని నిలబెట్టుకోకుండా వదిలేయ కూడదు అనుకున్నాను. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఓడిపోవడం తప్పు కాదు. కానీ గెలవడానికి ప్రయత్నించకపోవడం తప్పు. ప్రయత్నం చేసి ఓడిపోయినా ఫర్వాలేదు కానీ ప్రయత్నమే చేయకుండా వెనకడుగు వేయడం చాలా తప్పు. ఈ వాస్తవాన్నే చెప్పింది నా పాట. ఐటమ్ సాంగ్‌లో ఫిలాసఫీ ఏంటి, ముమైత్‌ఖాన్ ఫిలాసఫీ చెప్తే ఎవరు వింటారు అన్నవాళ్లు ఉన్నారు. వాళ్లు అలా అంటారని ముందే ఊహించినా కావాలనే ఆ ప్రయోగం చేశారు పూరి. అలాంటి గట్స్ ఉన్న డెరైక్టర్ నాలాంటి రచయితకి తోడుగా ఉన్నంతకాలం ఇలాంటి మంచి పాటలు పుడుతూనే ఉంటాయి. - భాస్కరభట్ల, గీత రచయిత -
శ్రీయకు మళ్లీ చాన్స్
నటి శ్రీయ ఒకప్పటి క్రేజీ హీరోయిన్. ఈ బ్యూటీ ఉనక్కు 20 ఎనక్కు18 చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ఉత్తరాది అమ్మడు ఆ తరువాత మళై, తిరువిళైయాడల్ ఆరంభం, అళగీయ తమిళమగన్, శివాజీ చిత్రాల్లో నటించింది. అలా సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి విజయ్, ధనుష్, జయంరవి లాంటి ప్రముఖ నటులకు జంటగా నటించి క్రేజ్ సంపాదించుకున్న శ్రీయ ఆ తరువాత ఇంద్రలోకత్తిల్ నా అళగప్పన్ చిత్రంలో హస్య నటుడు వడివేల్తో ఐటమ్ సాంగ్ చేయడంతో ఆమె ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అజిత్ తదితర స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వెనక్కుపోయాయి.దీంతో తెలుగు చిత్రాలపైనే ఆశ పెట్టుకున్న శ్రీయ అక్కడ కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే రావడంతో నటిగా వెనకపడిపోయిందనే చెప్పాలి. మొదటి నుంచి గ్లామర్‌నే నమ్ముకున్న శ్రీయ నటనకు అవకాశం ఉన్న పాత్రలపై మక్కువ చూపలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ మధ్య పవిత్ర అనే తెలుగు చిత్రంలో వేశ్యగా నటించి ఒక సంచలనం సృష్టించాలని ప్రయత్నించింది.అది బెడిసికొట్టింది. అదే విధంగా కన్నడంలో చంద్రా అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఆ మధ్య తెలుగులో నాగార్జునతో నటించిన మనం చిత్రం మంచి విజయాన్నే సాధించింది.అయితే అందులో సమంత కూడా ఒక హీరోయిన్ కావడంతో శ్రీయకు పెద్దగా ప్లస్ కాలేదనే చెప్పాలి. మొత్తం మీద ఇటు తమిళంలోగానీ అటు తెలుగులో గానీ అవకాశాలు లేని శ్రీయకు తాజాగా కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చిందన్నది సమాచారం. అయితే అది హీరోయిన్ పాత్ర కాదు. మంచి మెచ్యూరిటీ గల ప్రౌఢ పాత్ర అని తెలిసింది. నవ నటుడు కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఏదేమైనా నటి శ్రీయ క్యారెక్టర్ నటిగా మారిపోయినట్లు తెలుస్తోంది. రమ్యక్రిష్ణలా శ్రీయ కూడా ఈ తరహా పాత్రల్లో ఒక రౌండ్ చుట్టేస్తుందే లేదో చూడాలి. -
ఐటం సాంగ్ అయినా నచ్చాల్సిందే!
దేనికైనా తన నిబంధన ఒక్కటే అంటున్నారు నటి పార్వతి మీనన్. తన జాతి పేరును చెప్పుకోవడానికి ఇష్టపడని ఈ కేరళ కుట్టి నటిగా దశాబ్దానికి చేరువయ్యారు. అయితే స్వభాషతో పాటు తమిళం వంటి ఇతర భాషల్లోనూ నటిస్తున్నా.. చేసింది మాత్రం చాలా తక్కువ చిత్రాలే. తమిళంలో పూ చిత్రంతో కేరీర్‌ను ప్రారంభించి చెన్నైయిల్ ఒరు నాళ్, మరియాన్ చిత్రాలలో నటించారు. తాజాగా బెంగుళూర్ నాట్కళ్ చిత్రంలో ఒక హీరోయిన్గా ముఖ్య భూమికను పోషించారు. ఇందులో ఆర్యకు జంటగా నటించారు. బాబీసింహా, రానా, శ్రీదివ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో రాయ్‌లక్ష్మి, సమంత మెరిసిన బెంగుళూర్ నాట్కల్ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది. టాలీవుడ్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. నటి పార్వతి తన అనుభవాలను పంచుకుంటూ బెంగుళూర్ నాట్కళ్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. దీని వరిజినల్ మలయాళ వెర్షన్ బెంగుళూర్ డేస్ చిత్రంలో నటించిన పాత్రనే ఇందులోనూ పోషించానని చెప్పారు. ఈ చిత్ర నిర్మాత నటించమని అడిగినప్పుడు కాదన్నానన్నారు. ఆ తరువాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కలిసి తనను కన్విన్స్ చేయడంతో కొన్ని షరతులతో నటించడానకి అంగీకరించినట్లు తెలిపారు. అందులో ముఖ్యమైనది తన పాత్రలో ఎలాంటి మార్పులు చేయరాదన్నారు. ఇక తన సహ నటీమణులు అధిక చిత్రాల్లో నటిస్తున్నారు. మీరెందుకు నటించడం లేదని అడుగుతున్నారని ఆయితే ఆ విషయం గురించి తాను ఆలోచించడం లేదని బదులిచ్చారు. తాను నటించే పాత్ర తన మనసుకు దగ్గరగా ఉండాలన్నారు. తను చాలా నిరాడంబరంగా ఉంటానంటున్నారని అది తన సహజ గుణం అనీ అన్నారు. తనకు సహాయంగా ఒక వ్యక్తే ఉంటారని నలుగురైదుగురిని నియమించుకుంటే వారితోనే సమయం వృథా అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనకు అన్ని భాషల్లోనూ నటించాలన్న ఆసక్తి ఉందని, ఏ భాషలోనైనా తన నిబంధన ఒకటేననీ, అది ఐటమ్ సాంగ్ అయినా సరే నచ్చాలని పార్వతి స్పష్టం చేశారు. -
అందుకే అంజలిని తీసుకున్నారట..!
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్, ఆ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్ సెట్ చేస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సాలతో గ్లామరస్‌గా కనిపిస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో స్పెషల్ ఎట్రాక్షన్ యాడ్ అయ్యింది. చాలా రోజులుగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ విషయంలో టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. బన్నీ పక్కనే డ్యాన్స్ చేయడానికి, స్టార్ హీరోయిన్ కోసం వెదుకుతున్నారు చిత్రయూనిట్. అనుష్క, ఇళియానా లాంటి స్టార్ల పేర్లు వినిపించాయి. తరువాత లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిశ పటాని బన్ని సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందన్న టాక్ వినిపించింది. అయితే ఇవన్ని కాదని ఓ తెలుగింటి అమ్మాయిని స్పెషల్ సాంగ్‌కు ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు బోయపాటి. డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకుంటున్న అంజలి సరైనోడు సినిమాలో బన్నీతో కలిసి చిందేయడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది అంజలి. అంతేకాదు తననే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవటం వెనుక ఉన్న కారణం కూడా చెప్పింది. శంకరాభరణం సినిమాలో అంజలి చేసిన మాస్ క్యారెక్టర్, ఆ సినిమాలో ఆమె చేసిన 'ఘంటా..' పాటలో తన డ్యాన్స్ చూసిన బోయపాటి బన్ని సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సెలెక్ట్ చేసుకున్నాడని చెపుతోంది ఈ బ్యూటీ -
హాస్య నటుడితో ఐటమ్ సాంగ్
ప్రముఖ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయడం ఇప్పుడు సర్వసాధారణగా మారింది. శ్రుతీహాసన్, తమన్నా వంటి టాప్ కథానాయికలే సింగిల్ సాంగ్స్‌కు రెడీ అంటున్నారు. అలాగే నటి కాదల్ సంధ్య ఐటమ్ సాంగ్స్‌కు పచ్చజెండా ఊపేశారు.తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంధ్య ఆ చిత్రం పేరును తన పేరు ముందు చేర్చుకుని కాదల్ సంధ్యగా మారారు. అలా కథానాయికగా ఎదుగుతున్న సంధ్య కారణాలేమైనా అవకాశాలకు దూరం అయ్యారు. ఇటీవలే మళ్లీ కోలీవుడ్‌లో మెరుస్తున్నారు. అయితే కథానాయికగా కాదు. సహనటిగానో, ఐటమ్ గర్ల్‌గా నో అదీ అప్పుడప్పుడు తెరపై కనిపిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు కత్తుకుట్టి అనే చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు ఆడారు. అదీ చిత్ర కథానాయకుడితో కాదు. హాస్యనటుడు సూరితో స్టెప్స్ వేశారు. నరేన్ సృష్టి, డాంగే జంటగా నటిస్తున్న చిత్రం కత్తుకుట్టి. ఇది తంజావూర్ జిల్లా డెల్టా రైతుల సమస్యలను ఆవిష్కరించే కథా చిత్రం. కాగా సంధ్య ఐటమ్ సాంగ్ చిత్రానికి హైలైట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ చిత్రంతో సంధ్య ఐటమ్ గర్ల్‌గా మారిపోతారేమో. -
సర్దార్ గబ్బర్‌సింగ్‌తో కెవ్వు కేక!
‘గబ్బర్ సింగ్’లో పాటల సందడిని అంత సులువుగా మర్చిపోలేం. మలైకా అరోరాతో పవన్ కల్యాణ్ ‘కెవ్వు కేక...’ అంటూ వేసిన మాస్ స్టెప్పులు చూసి, ‘మా బాస్ కేక’ అని ఆయన అభిమానులు అన్నారు. అదే చిత్రంలో రౌడీ గ్యాంగ్ ఆడే అంత్యాక్షరి కూడా సూపర్. ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో కూడా పాటల జోరు భలేగానే ఉంటుందని సమాచారం. ‘గబ్బర్‌సింగ్’లో ఉన్నట్లే ఈ చిత్రంలో కూడా కెవ్వు కేక అనిపించే ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఆ పాటకు పవన్ కల్యాణ్‌తో కలిసి నటి రాయ్ లక్ష్మి కాలు కదపనున్నారు. పాటలో మాత్రమే కాకుండా కీలక సన్నివేశాల్లో కూడా కనిపిస్తారామె. ‘బలుపు’ చిత్రంలో రవితేజతో కలిసి ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేశారు రాయ్ లక్ష్మి. ఆ తర్వాత ఆమె చేయనున్న ఐటమ్ సాంగ్ ఇదే. పవన్ కల్యాణ్‌తో డ్యాన్స్ చేయనున్నందుకు ఆనందంగా ఉందనీ, చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ రాయ్ లక్ష్మి పేర్కొన్నారు. బాబీ దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి శరత్ మరార్ నిర్మాత. -
నటనను నమ్ముకోలేను!
చాలా మందికి నమ్మకాన్నే కాదు జీవి తాన్నే ఇస్తున్న రంగం సినిమా. అలాంటిది కొంద రు మాత్రం సిని మాల్లో నటిస్తూనే ఆ కళామతల్లిని నమ్ముకోలేమంటూ ఇతర రంగాల్లోకి దృష్టి సా రిస్తున్నారు. ఇలా సినిమా రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ సంపాదిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో తన పర భేదం లేనట్లు రెండు చేతులా గడించేస్తున్నారు. ఇక తారామణుల విషయానికొస్తే నటి నమిత, త్రిష, తమన్న, చాలా మంది ఈ పట్టికలో చేరతారు. తాజాగా నటి ఇనియ చేరారు. తానూ నటనను నమ్ముకోలేనంటున్నా రు. వాగై చూడవా చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన ఈ మలయాళ భా మ ఆ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నా ఆ తరువాత చేసిన చిత్రాలేవీ కేరీర్‌కు పెద్దగా ఉపయోగ పగలేదు.అయినా అమ్మడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం జిత్తన్-2,వైగైఎక్స్‌ప్రెస్, కరైయోరం తదితర చిత్రాలతో పాటు కన్నడ,మలయాళం భాషలలోనూ నటిస్తున్నారు.అంతేకాదు అవకాశం ఉన్నప్పుడల్లా మ్యూజిక్ ఆ ల్బమ్స్,స్టేజ్ డాన్స్‌లు చేస్తున్నారు. ఇనియా మాట్లాడుతూ నటననే నమ్ముకుంటే డబ్బు గడించడం కష్టం అన్నారు. హాలీవుడ్, బాలీవుడ్‌లలో హీ రోయిన్ల సినిమాలతో పాటు ప్రైవెట్ ఆల్బమ్‌లు ఇతర స్టేజీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాదిలోనూ నటిస్తోందని అన్నారు. తానూ ఫాలో అవుతున్నట్లు పేర్కొన్నారు.తగ్గట్టు ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్స్కుసై అంటున్నారు. -
ఐటమ్‌సాంగ్‌తో హీట్ పుట్టిస్తున్న కరీనా
-
యూట్యూబ్‌లో కరీనా ఐటెం సాంగ్
'మేరా నామ్ మేరీ' అంటూ వెండిరంగు దుస్తులతో కరీనా కపూర్ ఖాన్ హొయలొలికించిన పాట టీజర్ యూట్యూబ్‌లో విడుదలైంది. అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న 'బ్రదర్స్' సినిమా కోసం ఈ పాటలో కరీనా నర్తించింది. ఇంతకుముందు కూడా కరీనా కొన్ని ఐటెం సాంగ్స్‌లో మెరిసి మురిపించిన విషయం తెలిసిందే. తాజాగా మేరీ ఐటెం సాంగ్ టీజర్‌ను హీరో అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానుల కోసం షేర్ చేశాడు. 30 సెకండ్ల పాటు ఉన్న ఈ టీజర్లో ఎక్కడా కరీనా ముఖం కనపడదు. వీపు భాగం మాత్రమే కనిపిస్తుంది. ''బ్రదర్స్ 2015 సినిమా కోసం మేరానామ్ మేరీ పాట ఎక్స్‌క్లూజివ్ టీజర్ మీకోసం అందిస్తున్నా.. ఎంజాయ్ చెయ్యండి'' అని అక్షయ్ ట్వీట్ చేశాడు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన బ్రదర్స్ సినిమా.. 2011లో విడుదలైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'వారియర్' సినిమాకు రీమేక్. ఇందులో సిద్దార్థ మల్హోత్రా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జాకీ ష్రాఫ్ తదితరులు నటించారు. సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. Here's the exclusive teaser of #MeraNaamMary from @Brothers2015. Enjoy! http://t.co/Vcf3Q27ZQI — Akshay Kumar (@akshaykumar) July 6, 2015 -
అభిషేక్ మూవీలో సోనాక్షి ఐటం సాంగ్
-
అక్షయ్ సినిమాలో సోనాక్షి ఐటంసాంగ్
-
ఇప్పుడు కన్నడ ఐటమ్
‘ఏక్ పహేలీ లీలా’, కుచ్ కుచ్ లోచా హై’...ఇలా శృంగార తార సన్నీలియోన్ నటించిన చిత్రాలు వరుసగా విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి మన దక్షిణాది దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఎంత పారితోషికం ఇవ్వడానికైనా వెనుకాడట్లేదు. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ చిత్రంలో చిన్న పాత్ర చేశారు సన్నీ. అందులో ఆమె చేసిన ఐటెమ్ సాంగ్ క్లిక్ అయింది. సన్నీ ఇప్పుడు మళ్లీ ఓ కన్నడ చిత్రం ‘లవ్ యు అలియా’లో ఐటెమ్ సాంగ్‌లో నర్తించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మన ‘ఈగ’ ఫేమ్ సుదీప్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. -
అఖిల్ సినిమాలో ఇలియానా?
అక్కినేని వారసుడు అఖిల్ తెరంగేట్రం చేయనున్న కొత్త సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ కనిపించనుంది. గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో కనిపించని ఇలియానా... ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించిందట! ఈ విషయం టాలీవుడ్లో గుప్పుమంటోంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ మొదటి సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ఇలియానా ఐటెం సాంగ్ చేస్తోందని సమాచారం. గతంలో 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్‌కు వెళ్లిన ఇలియానా.. ఆ తర్వాత మళ్లీ ఈమధ్య కాలంలో తెలుగులో కనిపించలేదు. టాలీవుడ్లో అవకాశం వస్తే చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్న ఇల్లీ.. ఎట్టకేలకు ఇలా అఖిల్ సినిమాలో అనుకోని అవకాశం రావడంతో వెంటనే మరో మాట మాట్లాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు. సో.. చాలా కాలం తర్వాత అది కూడా 'స్పెషల్'గా ఇలియానాను తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారన్న మాట!! -
ఐటమ్ గాళ్‌గా..?
నాజూకు నడుము చిన్నది ఇలియానా ఐటమ్ సాంగ్ చేయనున్నారా..! ఈ విషయం గురించి మీడియా కోడై కూస్తోంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ తెరంగేట్రం చేయనున్న చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నర్తించడానికి ఇలియానా ఒప్పుకున్నారట. ‘బర్ఫీ’ చిత్రం ద్వారా హిందీ రంగానికి వెళ్లిన ఇలియానా టాలీవుడ్లో అవకాశం వస్తే చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఐటమ్ సాంగ్‌కు అడగ్గానే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. -
బాహుబలిలో ఐటంసాంగ్స్ సందడి?
-
ఐటెం సాంగా....నేనా...నో..
నేనా...ఐటం సాంగా ... అంత సీన్ లేదంటోంది 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశిఖన్నా. అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో వారసుడు అఖిల్ తొలి చిత్రంలో రాశిఖన్నా ఐటం సాంగ్ చేస్తోందన్న వార్తలను ఆమె ఖండించింది. ప్రస్తుతం తాను చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాననీ.. ఏ సినిమాలోనూ ఐటం సాంగ్ చేయడం లేదని రాశీఖన్నా స్పష్టం చేసింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'జిల్' మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాననీ, అలాగే బెంగాల్ టైగర్ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోందని తెలిపింది. జిల్ చిత్రంలో గోపీచంద్‌తో స్క్రీన్ పంచుకున్న ఈ అమ్మడు...'జోరు' కొనసాగుతోంది. ప్రస్తుతం కిక్ -2 , బెంగాల్ టైగర్ సినిమాల్లో రవితేజతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. -
ఐటమ్ సాంగ్ చేయాలని..
తినగ తినగా గారెలు చేదు అన్న సామెతను గుర్తు చేస్తూ హీరోయిన్ పాత్రల్ని పోషిస్తున్న నటి కాజల్ అగర్వాల్‌కు ఆ జీవితం బోరు కొట్టినట్టుందో లేక సమచరులు శ్రుతి హాసన్, తమన్నలాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకుందో తెలియదు కానీ ఐటమ్ సాంగ్ చేయాలన్న కోరిక బలంగా ఉందట. హీరోయిన్లుగా నటిస్తూనే, మరో పక్క ఐటమ్ సాంగ్స్‌తో హల్ చల్ చేస్తూ అధిక పారితోషికం పొందాలన్న ఆశ ఈ భామకు పుట్టింది. మరో విషయం ఏమిటంటే కాజల్ తెలుగులో గ్లామర్ పాత్ర చేసినా, తమిళంలో మాత్రం మోతాదు మించలేదు. తమిళ ప్రేక్షకులు ఆమెను గ్లామర్‌గా చూడాలని కోరుకుంటున్నారనే అభిప్రాయాన్ని కాజల్ వ్యక్తం చేస్తున్నారు. నాయకీ పాత్రలతో పాటుగా ఐటమ్ గర్ల్‌గాను, అదే విధంగా ప్రతి నాయకీ పోలికలు ఉన్న పాత్రలను చేయడానికి తాను సిద్ధమని కాజల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ధనుష్ సరసన మారీ చిత్రంలో, విశాల్ సరసన సుశీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. -
ప్రత్యేక గీతంలో రాయ్‌లక్ష్మి
కథానాయికలు ఐటమ్ సాంగ్స్ చేయడంలో కొత్తేమీ లేదు. కాజల్, శ్రుతిహాసన్, తమన్న లాంటి ప్రముఖ నాయికలే సింగిల్ సాంగ్స్‌కు ఓకే అంటున్నారు. అయితే రాయ్‌లక్ష్మి నూతన తారలు నటిస్తున్న చిత్రంలో స్పెషల్ సాంగ్ కు చిందేయడం విశేషం. ఈ సంచలన తార ఇంతకుముందు కొన్ని చిత్రాలలో ప్రత్యేక గీతాల్లో ఆడింది. ఆ మధ్య తెలుగులో రవితేజ హీరోగా నటించిన పవర్ చిత్రంలో రాయ్‌లక్ష్మి ఐటమ్‌సాంగ్‌లో అదరగొట్టేసింది. తాజాగా తమిళంలో ప్రముఖ నృత్య దర్శకుడు, దర్శకుడు లారెన్స్ తెరకెక్కిస్తున్న ఒరు టికెట్టుల రెండు సినిమా చిత్రంలో వైవిధ్యపాత్రలో నటిస్తోంది. అదే విధంగా కాదల్ పండిగై అనే చిత్రంలో ఈ బ్యూటి ప్రత్యేక గీతంలో నటించనుందట. విషయం ఏమిటంటే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లలతో సహా అందరూ నూతన తారలే నటిస్తున్నారట. నూతన దర్శకుడు నవమణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. చిత్రంలో అందరూ కొత్తవారు నటిస్తుండంతో రాయ్‌లక్ష్మి లాంటి పాపులర్ నటి ప్రత్యేక గీతంలో ఆడితే చిత్రానికి కమర్షియల్ లుక్ వస్తుందని భావించిన దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారట. పాట, పారితోషికం తదితర అంశాలు నచ్చడంతో రాయ్ లక్ష్మి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గ్లామర్ విషయంలో దుమ్ము రేపే అమ్మడు ఈ చిత్రంలో ఒంటినిండా చీరతో చిందులేయనుందట. ఇది ఉత్సవ పాట కావడంతో రాయ్‌లక్ష్మి చీర సింగారంతో ఆడనున్నారని సమాచారం. -
మహేశ్ బాబుతో...
‘సీమ టపాకాయ్’, ‘అవును’ తదితర చిత్రాల్లో కథానాయికగా చేసిన పూర్ణ గుర్తుంది కదూ! ఆమె ఇప్పుడు మహేశ్‌బాబుతో సినిమా చేయనున్నారు. కథానాయిక కాదండోయ్! ఐటెమ్ సాంగ్‌లో మహేశ్‌తో కలిసి నర్తించనున్నారు. మహేశ్‌బాబు-కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తున్నారట. మహేశ్ లాంటి సూపర్‌స్టార్ పక్కన నటించడమే కాదు, నర్తించడం కూడా గొప్ప అవకాశంగానే భావిస్తుంటారు కథానాయికలు. ఇటీవల ‘ఆగడు’లో శ్రుతీహాసన్ అలాంటి ఛాన్సే కొట్టేశారు. ఆ వెంటనే కొరటాల శివ, మహేశ్‌ల సినిమాలో కథానాయికగా బుక్కయ్యారు. ఇప్పుడు ‘సీమ టపాకాయ్’ పూర్ణ వంతు వచ్చింది. కొరటాల శివ- మహేశ్‌ల చిత్రంలోని ఐటమ్ సాంగ్‌లో పూర్ణ నర్తించనున్నారు. ఇంతమంది కథానాయికలుండగా, పూర్ణనే కొరటాల శివ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అనే విషయంలోకెళ్తే- కథలో ఆ పాట చాలా కీలకమట. పైగా ఆ పాటలో అక్కడక్కడ శాస్త్రీయ నృత్యాన్ని కూడా ప్రదర్శించాలట. పూర్ణ స్వతహాగా ప్రొఫెషనల్ డాన్సర్. పైగా శాస్త్రీయ నృత్యంలో ఆమెకు చక్కని ప్రవేశం ఉంది. అందుకే.. ఏరి కోరి పూర్ణాని ఎంచుకున్నారట. -
శ్రద్ధా ‘బసంతి’..
పక్కింటి అమ్మాయిలా ఒద్దికగా కనిపించే శ్రద్ధా కపూర్.. తాజా చిత్రం ‘ఉంగ్లీ’లో ఒక్కసారిగా అవతారం మార్చేసింది. ఇందులో బసంతిగా ఐటెమ్ సాంగ్‌లో అదరగొట్టేసింది. ఈ ఐటెమ్ సాంగ్ ట్రైలర్ ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఇటీవలే ‘హైదర్’లో నటనకు ప్రశంసలు పొందిన శ్రద్ధా అమాంతం గ్లామర్ అవతారంతో కుర్రకారును ఉర్రూతలూగించే స్టెప్పులేయడం చూసి, ఆమెలో ఈ టాలెంట్ కూడా ఉందా.. అంటూ బాలీవుడ్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
సన్నీ లియోన్‌కు ఇమ్రాన్ హష్మీ నో..
బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీకి ఏమొచ్చిందో ఏమో! సన్నీ లియోన్‌తో నటించేందుకు నో చెప్పేశాడు. ఇమ్రాన్ తదుపరి చిత్రం ‘ఉంగ్లీ’లో ఒక ఐటెమ్ సాంగ్‌లో సన్నీ లియోన్‌తో కలసి స్టెప్పులు వేయాలని చిత్ర నిర్మాతలు కోరితే, నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. అడల్ట్స్టార్తో నటించేది లేదంటూ నిర్మాతలకు తెగేసి చెప్పేశాడు. దీంతో ఈ ఐటెమ్ సాంగ్ కోసం నిర్మాతలు ఇంటర్నేషనల్ మోడల్స్ వెతుకులాటలో పడ్డారు. లీసా హైడన్‌కు డెంగీ.. ఢిల్లీలో ప్రొమో కార్యక్రవూల్లో బిజీ బిజీగా ఉన్న సవుయుంలో ‘షౌకీన్స్’ నటి లీసా హైడెన్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది. వెంటనే ఆమె ప్రొమో కార్యక్రవూలకు ప్యాకప్ చెప్పేసి, ముంబైకి తిరుగు ప్రయూణమైంది. బీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమెను పరీక్షించిన వైద్యులు, ఆమెకు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో ఆమె పాల్గొనాల్సిన ప్రొమో కార్యక్రవూలన్నీ నిలిచిపోయూరుు. అనుష్కా శర్మ తొలి ఐటెమ్ సాంగ్.. పొడవు కాళ్ల సుందరి అనుష్కా శర్మ ‘దిల్ ధడక్నే దో’ చిత్రంలో తొలిసారిగా ఐటెమ్ సాంగ్‌లో కనిపించనుంది. రణవీర్‌సింగ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్కా శర్మ ఐటెమ్ సాంగ్‌ను భారీ స్థాయిలో చిత్రించనున్నారు. ఈ పాటలో ప్రియూంకా చోప్రా, ఫర్హాన్ అక్తర్, అనిల్ కపూర్, షెఫాలీ షా కూడా కనిపించనున్నారు. -
‘అమ్మానాన్న ఊరెళితే’ మూవీ ఐటమ్ సాంగ్ స్టిల్స్
-
ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం : సోనీ అగర్వాల్
‘‘టైటిల్‌కి తగ్గట్టే పూర్తి వినోదాత్మకంగా ఉంటుందీ సినిమా. యువతరమే లక్ష్యంగా చేసిన ఈ చిత్రంలో సోనీ అగర్వాల్ ఓ ప్రత్యేక పాటతో పాటు, కథను మలుపు తిప్పే ఓ సన్నివేశంలో పాల్గొన్నారు. ఆమె పాత్ర సినిమాకే హైలైట్. సెన్సార్ పూర్తయింది. ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం’’ అని అంజి శ్రీను చెప్పారు. ఆయన దర్శకత్వంలో సిద్దార్థ్‌వర్మ, విజయ్, మధు, తేజ, సాయిభవానీరాజు, మహి, శిల్పశ్వి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘అమ్మానాన్న ఊరెళితే’. ‘7/జి బృందావన కాలనీ’ ఫేం సోనీ అగర్వాల్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి వీరవెంకట దుర్గాప్రసాద్ అనగాని, నాగమణి అనగాని నిర్మాతలు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోనీ అగర్వాల్ మాట్లాడుతూ -‘‘చాలా భిన్నమైన కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఇందులో నేను చేసిన ఐటమ్‌సాంగ్ చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం. మంచి టీమ్‌తో కలిసి పనిచేసినందుకు హ్యాపీ’’ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. -
కథే ఈ సినిమాకు హైలైట్
- శ్రీకాంత్ ‘‘పోలీసాఫీసర్ అయిన నేను స్కూల్ టీచర్‌గా వెళ్లి ఏం చేశాను? అలాగే... స్కూల్ టీచర్ అయిన కథానాయిక పోలీసాఫీసర్‌గా వెళ్లి ఏం చేసింది?’ అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందినే చిత్రమే ‘ఢీ అంటే ఢీ’ ’’ అని శ్రీకాంత్ అన్నారు. ఆయన కథానాయకునిగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో సి.ఎన్.రెడ్డి, జి.జ్యోతికలతో కలిసి నిర్మించిన ‘ఢీ అంటే ఢీ’ ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఇందులోని అన్ని పాటలకూ ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతుల్ని సమకూర్చారు. నా స్టెప్స్ ఇందులో కొత్తగా ఉంటాయి. బ్రహ్మానందం పాత్ర ఇందులో హైలైట్. ఆయన పదేళ్ల కొడుకుగా కూడా బ్రహ్మానందమే చేశారు. వైరైటీగా ఉంటుందీ పాత్ర’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రాన్ని నేనే నిర్మించడానికి కారణం కథ. భూపతిరాజా అద్భుతమైన కథ ఇచ్చారు. చంద్రబోస్ రాసిన ఐటమ్ సాంగ్ చాలా బావుంటుంది. ఆయన రాశాక, ఈ పాటను ట్యూన్ చేశాం. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేస్తాం’’ అని జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. -
విక్రమ్‌తో ఐటమ్ సాంగ్
సియాన్ విక్రమ్‌తో ప్రత్యేక గీతానికి రెడీ అవుతోంది చార్మి. ఈ ముద్దుగుమ్మకు ఐటమ్ సాంగ్స్‌లో నటించడం కొత్తేమీ కాదు. ఆ మధ్య టాలీవుడ్లో రగడ చిత్రంలో ఏస్కో...నా ఘుమ ఘుమ ఛాయ్...ఛాయ్ అంటూ అదిరే అందాలతో దుమ్ము లేపారు. అయితే కోలీవుడ్‌లో ఐటమ్‌సాంగ్ చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో చార్మి అతిథి పాత్రలకు, ఐటమ్‌సాంగ్స్ ఎడాపెడా ఒప్పేసుకుంటోంది. ఐ చిత్రం తరువాత విక్రమ్ నటిస్తున్న చిత్రం 10 ఎన్రదు కుళ్ల. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఒక అదిరిపోయే ప్రత్యేక గీతం ఉందట. ఇది సాధారణ సాంగ్ కాదట. తొమ్మిది నిమిషాల నిడివితో సాగే ఈ పాటలో చార్మిని నటించమన్నారన్నది తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే ఈ ప్రత్యేక గీతం కోసం పూణేలో రెండున్నర కోట్ల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారట. ఈ నెల 20 నుంచి ఈ సెట్లో విక్రమ్, చార్మిలతో ఈ పాటను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోందని తెలిసింది. మొత్తం మీద చాలా కాలం తరువాత కోలీవుడ్ అభిమానులు చార్మీ అందాలను తిలకించనున్నారన్నమాట. -
లింగాలో స్పెషల్ సాంగ్ తో మెరవబోతోందా...?
-
ఇమాన్ బుగ్గ గిల్లిన ప్రియా
సాధారణంగా హీరోయిన్లకు ముద్దొస్తే హీరోలను చుంబిస్తుంటారు. అలా స్వకార్యం, స్వామికార్యం నెరవేర్చుకోవాలనుకుంటారు. అయితే నటి ప్రియా ఆనంద్ మాత్రం యువ సంగీత దర్శకుడు డి.ఇమాన్ బుగ్గలపై ముచ్చటపడి తెగ గిల్లేసింది. నిర్మాత శాసన సభ్యుడు మైఖేల్ రాయప్పన్ తన ఇన్ఫోటెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ఒరు ఊరుల రెండు రాజా. విమల్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్య పాత్రను సూర్య పోషిస్తున్నారు. అతిథి పాత్రలో నటి విశాఖ సింగ్, ఐటమ్ సాంగ్‌లో నటి ఇనియా దుమ్ము రేపిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని ఆర్.కన్నన్ నిర్వహిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను ఈ దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, నిర్మాతల మండలి అధ్యక్షుడు కే.ఆర్., నటుడు శివకార్తికేయన్లు ఆవిష్కరించగా తొలి ప్రతిని కార్యక్రమంలో పాల్గొన్న ఇతర అతిథులందరూ అందుకున్నారు. కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ ప్రియా ఆనంద్ సంగీత దర్శకుడు డి.ఇమాన్ బుగ్గలు గిల్లాలనే తన చిరకాల ఆశను ఈ వేదికపై తీర్చుకున్నారు. జాంగ్రీలా ఉన్నాయంటూ ఆయన బుగ్గల్ని తెగ గిల్లేసి ముద్దులు పెట్టుకోవడంతో ఆహూతులందరి దృష్టి వీరిపైనే పడింది. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్, విజయ్ సేతుపతి, విష్ణు, గౌతమ్‌కార్తిక్, నటి ఇనియా, విశాఖ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
దుమ్మురేపుతున్న తమన్న...
-
సూపర్‌స్టార్‌తో ఐటమ్ సాంగ్!?
‘‘బాలీవుడ్డా... అసలు ఆ పేరే ఎత్తొద్దు. చిరాకేస్తుంది’’ అంటున్నారు అందాల భామ త్రిష. హిందీలో అక్షయ్‌కుమార్‌తో ఆమె జతకట్టిన ‘కఠ్ఠా మీఠా’ చిత్రం పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత త్రిష మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు. ఇటీవల చెన్నయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న త్రిషను ‘మళ్లీ బాలీవుడ్లో ప్రయత్నం చేయొచ్చుగా?’ అని మీడియా అడిగితే ఘాటుగా స్పందించారు. ‘‘ఏడాది పాటు సినిమా చేయాలి. మూడు నెలల పాటు ప్రమోషన్లో పాల్గొనాలి. అంత ఓపిక నాకు లేదు. ఆ సమయంలో దక్షిణాదిన రెండు మూడు సినిమాలు చేయొచ్చు. అయినా, ఒక్క సినిమాకే బాలీవుడ్ బోర్ కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణగారితో చేస్తున్నా. ఒక కన్నడ చిత్రం, నాలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నా. ఈ సినిమాలు చాలవా! ఇక బాలీవుడ్ దేనికి?’’ అన్నారు త్రిష. ఇదిలావుంటే... త్రిష గురించి ఓ తాజా వార్త సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘లింగా’ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడానికి త్రిష పచ్చజెండా ఊపేశారట. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసిన ఈ చిత్రం యూనిట్ నేడో రేపో చిత్రీకరణకు దిగనుందట. రజనీతో జత కట్టాలనేది త్రిష చిరకాల వాంఛ. ఆ కోరిక ఈ రకంగా నిజమవుతున్నట్టుంది. -
గోపీచంద్, హంసానందిని లౌక్యం ఐటమ్ సాంగ్ స్టిల్స్
-
ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారు
మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిపై మహిళా న్యాయమూర్తి ఆరోపణలు లైంగిక వేధింపులపై సీజేఐకి లేఖ రాసిన మహిళా న్యాయమూర్తి ఆరోపణలను ఖండించిన హైకోర్టు న్యాయమూర్తి నిజమని తేలితే మరణశిక్షకైనా సిద్ధమని సీజేఐకి లేఖ భోపాల్: అత్యున్నతమైన న్యాయవ్యవస్థను లైంగిక వేధింపుల ఆరోపణలు ఓ కుదుపు కుదిపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గ్వాలియర్‌లోని మహిళా అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సంచలన ఆరోపణలు చేశారు. తనను ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారని, జడ్జి వేధింపులు భరించలేక తాను రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఆర్ఎం లోథాకు 9 పేజీల లేఖ రాశారు. అయితే మహిళా న్యాయమూర్తి ఆరోపణలను సదరు హైకోర్టు జడ్జి తోసిపుచ్చారు. తనపై ఆరోపణలు రుజువైతే మరణ శిక్షను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్లో ఓ న్యాయాధికారి భార్యతో ఫోన్ చేయించి ఓ పెళ్లి వేడుకలో తాను ఓ ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని జడ్జి చెప్పించారని, అయితే అందుకు నిరాకరించానని మహిళా న్యాయమూర్తి సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు జడ్జి ఆదేశాలపై ముగ్గురు న్యాయాధికారులూ తనను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. తనపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తప్పుడు నివేదికలు సమర్పించారని, అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకునే దానినని పేర్కొన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా తనను గత నెలలో గిరిజన ప్రాంతానికి బదిలీ చేయించారని పేర్కొన్నారు. బదిలీపై హైకోర్టు జడ్జితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. తన కోరిక తీర్చకపోవడం వల్ల, ఒంటరిగా తన బంగళాకు రాకపోవడం వల్లే బదిలీ చేసినట్టు చెప్పారని ఆరోపించారు. బదిలీకి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి అపాయింట్మెంట్ కోరితే నిరాకరించారని, గత్యంతరం లేక ఆత్మాభిమానాన్ని, కుమార్తె కెరీర్‌ను కాపాడుకునేందుకు జూలై 15న రాజీనామా చేసినట్టు చెప్పారు. సీబీఐ విచారణకైనా సిద్ధం: హైకోర్టు జడ్జి ఈ ఆరోపణలను ఖండిస్తూ హైకోర్టు న్యాయమూర్తి మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్కులేఖ రాశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని, సీబీఐతో విచారణ చేయించవచ్చన్నారు. మహిళా జడ్జి మాత్రమే కాదు, ఏ మహిళనైనా తాను లైంగికంగా వేధించినట్టు, దూషించినట్టు రుజువైతే మరణశిక్షకూ సిద్ధమని చెప్పారు. ఈ లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి పంపారు. ఇది తీవ్రమైన అంశం.. సీజేఐ ఈ ఆరోపణల అంశం తీవ్రమైనదని, తగిన రీతిలో వ్యవహరిస్తామని సీజేఐ లోథా చెప్పారు. ఈ అంశం ఇంకా తన వద్దకు రాలేదని, అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మరోవైపు మహిళా జడ్జి రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. బదిలీకి సంబంధించి జడ్జి అభ్యర్థనలను నిరాకరించామని, లైంగిక వేధింపులకు సంబంధించి ఆమె ఫిర్యాదు చేయలేదని తెలిపింది. కాగా, మహిళా జడ్జిపై వేధింపులకు పాల్పడిన న్యాయమూర్తిని తక్షణం విధుల నుంచి తప్పించాలని, మహిళా న్యాయమూర్తిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు మహిళా జడ్జి ఆరోపణలకు సంబంధించి హైకోర్టు జడ్జిపై ఎఫ్ఐఆర్ నమోదు, న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. -
ఐటమ్ సాంగ్‌తో గౌరవమే
అవకాశాలు లేక హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌కు సిద్ధం అవుతున్నారన్నది పాత మాట. అధిక పారితోషికం ఆశతో టాప్ హీరోయిన్లు కూడా అలాంటి శృంగార నృత్యాలకు సై అంటున్నారన్నది నేటి మాట. అయితే ఇనియా లాంటి అసలు విజయాలు, అంతగా అవకాశాలు లేని హీరోయిన్లు కూడా ఐటమ్స్ ఆడేస్తూ పైగా హీరోయిన్గా అవకాశాలు లేక కాదు ఆ గీతాలు నచ్చడం వల్లే అంటే వినేవారు నమ్మేస్తారా? వాగైచూడవా వంటి కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఇనియా ప్రస్తుతం ఐటమ్ గర్ల్‌గా వచ్చిన అవకాశాన్ని ఒప్పేసుకుని ఆడేస్తోంది. దీని గురించి ఈ అమ్ముడు వివరిస్తూ ప్రస్తుతం శరత్ కుమార్ సరసన వేళచ్చేరి చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నానని తెలిపింది. తమిళంలో గ్యాప్ రాకూడదని ఇటీవల మూడు చిత్రాల్లో సింగిల్ సాంగ్స్ చేశానని చెప్పింది. రెండవదు పడం చిత్రంలో వెంకట్ ప్రభుతో స్పెషల్‌సాంగ్‌కు ఆడానని తెలిపింది. ఇందులో పాత కథానాయికల గెటప్‌లో నర్తించానని వివరించింది. ఇక పార్తిబన్ దర్శకత్వం వహించిన కథై తిరైకథై, వచనం ఇయక్కం చిత్రంలో ఆయన అడగడంతో పలువురు ప్రముఖ నటీనటుల అతిథి పాత్రలు పోషించిన ఈ చిత్రంలో తానూ భాగం కావాలని భావించి సింగిల్ పాటలో నటించానని తెలిపింది. మూడో చిత్రం ఒరు ఊరుల రెండు రాజా దర్శకుడు కన్నన్ కోరిక మేరకు పాట కూడా నచ్చడంతో ఐటమ్ సాంగ్ చేశానని చెప్పింది. అందుకని హీరోయిన్ అవకాశాలు లేక ఐటమ్ సాంగ్స్ ఒప్పుకుంటున్నట్లు భావించరాదని, అయినా అలాంటి పాటలతోను తన గౌరవం పెరుగుతోందని ఇనియ సెలవిచ్చింది. -
కన్నడంలో సన్నీ ఐటం సాంగ్!
బాలీవుడ్‌ను కిర్రెక్కిస్తున్న సన్నీ లియోన్ తెలుగు, తమిళ సినిమాల్లోనూ ఐటం సాంగ్‌లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె కన్నడ రంగంలోనూ కాలు మోపుతోంది. కన్నడ చిత్రం ‘డీకే’ కోసం ‘శేషమ్మ శేషమ్మ’ అనే ఐటం సాంగ్‌లో అందాలను ఆరబోస్తోంది. మూడు రోజులుగా ఈ ఐటం సాంగ్ షూటింగ్లో సన్నీ బిజీబిజీగా ఉంటోంది. ఒకటి రెండు రోజుల్లో ఐటం సాంగ్ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ‘డీకే’ చిత్ర బృందం తెలిపింది. హాలీవుడ్ చాన్స్ కొట్టేసిన జూహీ జూహీ చావ్లా హాలీవుడ్ చాన్స్ కొట్టేసింది. లాసే హాల్స్ట్రోమ్ దర్శకత్వంలో స్టీవెన్ స్పీల్బర్గ్ నిర్మించనున్న చిత్రంలో జూహీ వృద్ధ మహిళ పాత్ర పోషించనుంది. ఇందులో జూహీ భర్తగా బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురి నటించనున్నాడు. స్పీల్బర్గ్ చిత్రంలో తన పాత్ర చిన్నదే అయినా, కీలకమైనదని జూహీ చెప్పింది. ‘ముంబై సాగా’లో హుమా ఖురేషీ ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన హుమా ఖురేషీకి తాజాగా ‘ముంబై సాగా’లో హీరోయిన్ పాత్ర లభించింది. సంజయ్ గుప్తా రూపొందిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహాం హీరోగా నటించనున్నాడు. మాఫియా ముఠాలకు, రాజకీయ నేతలకు, పోలీసులకు గల పరస్పర సంబంధాల ఆధారంగా రూపొందించుకున్న కథతో సంజయ్ గుప్తా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయి కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
'డీకే' చిత్రంలో సన్నీలియోన్ ఐటెం సాంగ్
ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఐటెం సాంగ్‌లకు డాన్సు చేసిన శృంగార తార సన్నీ లియోన్ ఇప్పుడు తాజాగా కన్నడంలో కూడా రంగప్రవేశం చేసింది. 'డీకే' అనే చిత్రంలో ఆమె ఐటెం సాంగ్ చేస్తోంది. ఈ సినిమాలో ఓ జానపద గీతానికి ఆమె డాన్స్ చేస్తోంది. 'శేషమ్మా.. శేషమ్మా' అంటూ ఈ పాట సాగుతుంది. గత మూడు రోజులుగా ఈ పాట షూటింగ్ సాగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. సోమవారంతో పాట షూటింగ్ ముగిసిపోతుంది. ఈ పాటలో సన్నీలియోన్‌ను చూసి కన్నడ ప్రేక్షకులు ఆనందిస్తారని సినిమా వర్గాలు అంటున్నాయి. సన్నీ లియోన్ వచ్చిందన్న విషయం నగరంలో ప్రచారం అయితే ఆమె స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, అందుకే ఈ పాటను రహస్యంగా చిత్రీకరిస్తున్నామని తెలిపాయి. ఉదయప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న 'డీకే' చిత్రంలో ప్రేమ్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే మంచు మనోజ్ సరసన 'కరెంటుతీగ' చిత్రంలో కూడా సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ చేసింది. తమిళంలో వడా కర్రీ చిత్రంలోనూ ఆమె ఐటెం సాంగ్‌కు డాన్స్ చేసింది. -
అతిలోక సుందరి ప్రపోజల్ నా దగ్గరికి రాలేదు!
కెరీర్‌పై పూర్తి క్లారిటీతో ఉంటారు తమన్నా. ఆమె సినీ ప్రయాణం విజయవంతంగా సాగడానికి కారణం అదే. కెరీర్ మొదలై పదేళ్లు కావొస్తున్నా, కొత్త కొత్త అందాలు తెరను పలకరిస్తున్నా... యువతరంలో తమన్నా క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. రీసెంట్గా ‘అల్లుడు శీను’తో కలిసి ఐటమ్ నంబర్లో అదరహో అనిపించారు. ‘అల్లుడు శీను’ ప్రమోషన్లో పాల్గొన్న ఈ మిల్కీబ్యూటీ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. మీ ఐటమ్ సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉంది? బావుందండీ... అందరూ అభినందిస్తున్నారు. తమన్నా మంచి డాన్సర్ అని అందరూ అంటున్నారంటే కారణం ‘బద్రీనాథ్’ సినిమా. ఆ సినిమాకు దర్శకుడు వినాయక్‌గారే. ఇప్పుడు ఆయన సినిమా కోసమే ఐటమ్ నంబర్ చేయడం ఆనందంగా ఉంది. శ్రీనివాస్‌లో మంచి ఫైర్ ఉంది. తనకు పోటీగా డాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను. హీరోయిన్గా మంచి స్టేజ్‌లో ఉండి.. ఐటమ్ సాంగ్ చేయడానికి ప్రత్యేకమైన కారణం? మంచి మనుషులందరూ కలిసి పని చేసిన సినిమా ఇది. అందుకే... వారితో కాసేపైనా కలిసి పని చేయాలనిపించింది. రెండు మూడు రోజుల్లో పాట చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ టీమ్‌ని వదిలి వెళ్లడం బాధనిపించింది. ఒక్క పాటకు రెండు కోట్లు తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. నిజమేనా? ఆ రాసిన వాళ్ల సంపాదన నేను అడగలేదు కదా. అలాంటప్పుడు నా సంపాదనతో వారికి పనేంటి? నాలాంటి ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఈ సినిమాలో ఓ సాంగ్ చేస్తే సినిమాకి హెల్ప్ అవుతుందని దర్శక, నిర్మాతలు భావించారు. నాకు ఎంతివ్వడం కరెక్టో వారికి తెలుసు. అంతకు మించి అడిగే మనస్తత్వం కూడా కాదు నాది. ఇది స్నేహధర్మంగా చేసిన పాటే. మీ బాలీవుడ్ ఫిలిం ‘హమ్షకల్’ అంతగా ఆడలేదు కదా! అదంత బ్యాడ్ మూవీ ఏం కాదు. కానీ... దానికి అనుకున్నదానికంటే ఎక్కువ విమర్శలొచ్చాయి. ఒక నటిగా సినిమాకు పనిచేస్తాను అంతే.. సినిమా సక్సెస్ అనేది నా చేతిలో ఉండదు కదా. తెలుగులో నేను చేసిన తొలి సినిమా ‘శ్రీ’ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కూడా వరుసగా నాలుగు ఫ్లాపులొచ్చాయి. నా అయిదవ సినిమా ‘హ్యాపీడేస్’. మొదట్లో ఎదురైన ఫ్లాపులకే నేను భయపడి ఉంటే హీరోయిన్గా ఇంత సాధించి ఉండేదాన్ని కాదు కదా. ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ ప్రమోషన్లో ఉన్నట్లున్నారు? అవును... సౌత్‌తో పోలిస్తే బాలీవుడ్లో ప్రమోషన్‌కి ఎక్కువ రోజులు కేటాయించాలి. ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ సినిమా బాగా వచ్చింది. సక్సెస్ అవుతుందనుకుంటున్నా. బాలీవుడ్ కారణంగా సౌత్‌లో సినిమాలు తగ్గినట్టున్నాయి? దక్షిణాదిన బిజీగానే ఉన్నాను. తెలుగులో‘ఆగడు’, ‘బాహుబలి’, తమిళంలో ఆర్య హీరోగా రూపొందుతోన్న సినిమా చేస్తున్నాను. ఇవేమీ ఓ మూడు నెలల్లో పూర్తయ్యే సినిమాలు కావు. అన్నీ భారీ సినిమాలే. టైమ్ పడుతుంది. బాలీవుడ్లో కూడా కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా ఉన్నాను. ఇంతకంటే ఫాస్ట్‌గా సినిమాలు చేయలేను. ‘బాహుబలి’ అనుభవాలు చెప్పండి? ‘బాహుబలి’ సెట్లో ఉన్నంతసేపూ ఓ గొప్ప నటిగా ఫీలవుతున్నాను. సాధారణంగా నాకు ఒంటిగంటకల్లా ఆకలేస్తుంది. కానీ... ఆ సెట్లో ఉంటే ఆకలే వేయడం లేదు. తర్వాత షాట్ ఎలా పెడతారు, ఎలాంటి సీన్ తీస్తారు... ఇవే ఆలోచనలు. ఇందులో నాది వారియర్ ప్రిన్సెస్ పాత్ర. ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. నేను తొలి భాగంలో ఉంటాను. ఇటీవలే నేనూ, ప్రభాస్ పాల్గొనగా ఓ పాట తీశారు. సాధారణంగా రోప్స్ అనేవి ఫైట్లకు వాడతారు. కానీ ఈ పాటకోసం వాడారు. ‘ఆగడు’లో మీరు పోలీస్ అంట కదా? లేదు.. ఇందులో నాది పల్లెటూరి అమ్మాయి పాత్ర. మహేశ్‌తో ఎప్పుడో చేయాల్సింది. ఇన్నాళ్లకు కుదిరింది. శ్రీనువైట్ల ‘రెడీ’లో ప్రత్యేక పాత్ర చేశాను. అప్పట్నుంచి ఆయనతో సినిమా చేయాలని ఉండేది. ఇన్నాళ్లకు కుదిరింది. సినిమా సూపర్బ్‌గా వస్తోంది. మహేశ్ ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఈ సినిమా. ‘జగదేక వీరుడు- అతిలోక సుందరి’ రీమేక్‌లో మీరే కథానాయిక అని టాక్? నేనూ, రాఘవేంద్రరావుగారు, చిరంజీవిగారూ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ కార్యక్రమ వ్యాఖ్యాత...‘జగదేకవీరుడు...’ మళ్లీ తీస్తే చరణ్‌కి జోడీగా ఎవరు బాగుంటారు? అని రాఘవేంద్రరావుగారిని అడిగింది. ఆయన... దానికి సమాధానం చిరంజీవి చెబితే బావుంటుందన్నారు. అప్పుడు చిరంజీవిగారు నా పాత్రను చరణ్, శ్రీదేవి పాత్రను తమన్నా చేస్తే బావుంటుందని అన్నారు. అంతే తప్ప అలాంటి ప్రపోజల్ ఏదీ నా దగ్గరకు రాలేదు. ఈ మధ్య కాస్త తగ్గినట్టున్నారు? హిందీ సినిమా కోసం తగ్గాను. అక్కడ హీరోయిన్లందరూ ఫిట్‌గా ఉంటారు. అందుకే... ఇలా తయారయ్యా. అయిదు కేజీలు తగ్గాను. మరి ఇక్కడ హీరోయిన్లు బొద్దుగా ఉండాలి కదా. ఎలా? మనిషికి ఒక ఎలాస్టిక్ స్వభావం ఉంటే ఎంత బావుణ్ణో కదా. చక్కగా ఇక్కడ లావుగా, అక్కడ సన్నగా కనిపించొచ్చు. ఇంతకీ పెళ్లెప్పుడు ప్లాన్ చేశారు? ప్లాన్ చేసుకొని పెళ్లి చేసుకుంటారా? ప్లాన్ చేసి ప్రేమలో పడతారా? మీరు అలా చేశారా? చెప్పండి? -
'సాహసం'లో నర్గీస్ ఫక్రీ ఐటెం సాంగ్
బాలీవుడ్ తార నర్గీస ఫక్రీ దక్షిణాదికి వచ్చింది. ప్రశాంత్ హీరోగా తమిళంలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా 'సాహసం'లో ఆమె ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. ఇందులో ఆమెతో పాటు వంద మంది డాన్సర్లు పాల్గొంటారు. ఆమె నేరుగా హంగేరీ నుంచి విమానంలో చెన్నై వచ్చి ఈ షూటింగ్లో పాల్గొంటోంది. బిన్నీ మిల్స్ ప్రాంగణంలో దాదాపు వంద మంది డాన్సర్లతో కలిసి ఈ పాట షూటింగ్ జరుగుతోంది. తెలుగులో బన్నీ నటించిన సూపర్‌హిట్ చిత్రం జులాయికి తమిళ రీమేక్ 'సాహసం'. ఈ సినిమాలో తన పాట షూటింగ్ అయిపోయిన తర్వాత చెన్నై వీధుల్లో సరదాగా తిరగాలని కూడా నర్గీస్ ఫక్రీ భావిస్తోంది. ఇప్పటికే ఆమె ప్రశాంత్ బంగారు నగల దుకాణానికి వెళ్లిందని, ఆయన తండ్రి త్యాగరాజన్‌ను కూడా కలిసిందని సినిమా వర్గాలు తెలిపాయి. తాను గత ఏడేళ్లుగా కలవని ఓ స్నేహితుడు కూడా చెన్నైలో కలిశాడంటూ ట్విట్టర్లో ఫొటోతో సహా పెట్టింది. ఈ సినిమాలో ప్రశాంత్ సరసన మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. అరుణ్ రాజ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. Haven't seen my friend in 7 years! N I bump Into him in Chennai !!! Of all places in the... http://t.co/S19iT50drC pic.twitter.com/cVggXeyQwM — Nargis (@NargisFakhri) July 29, 2014 -
అంజలి సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్?
అగ్ర కథానాయికలు ఐటెం పాటల్లో నర్తించే సంప్రదాయం బాలీవుడ్ లో మొదలయి టాలీవుడ్ కు పాకింది. తెలుగు తెరపై టాప్ స్టార్స్ గా వెలుగొందున్న హీరోయిన్లు ఇప్పుడు ప్రత్యేక గీతాల్లో పాదం కదుపుతున్నారు. 'అల్లుడు శ్రీను'లో తమన్నా, 'ఆగడు'లో శృతి హాసన్ ప్రత్యేక పాటల్లో నటించారు. 'చందమామ' భామ కాజల్ అగర్వాల్ కూడా ఐటెం సాంగ్ కు సిద్దమవుతోందని సినిమా వర్గాలంటున్నాయి. అంజలి హీరోయిన్ గా నటించిన గీతాంజలి సినిమాలో ఆమెతో స్పెషల్ సాంగ్ చేయించాలని భావించిన నిర్మాతలు కాజల్ ను సంప్రదించారని చెప్పుకుంటున్నారు. అయితే నిర్మాతలు ఊహించిన దానికంటే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని అంటున్నారు. మొదట ఈ పాట కోసం సమంతను సంప్రదించారని రూమర్లు వచ్చాయి. ప్రస్తుతం 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో రామ్‌చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె స్పెషల్ సాంగ్ చేస్తుందో, లేదో త్వరలోనే తెలుస్తోంది. -
ఐటమ్ సాంగ్స్ అంటే అయిష్టం
ఐటమ్ సాంగ్‌లంటే తనకు అయిష్టమని ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ పేర్కొన్నారు. ఆయన కుమార్తె పుష్పా కందస్వామి రా జం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ఐం దాం తలైమురై సిద్ధ వైద్దియ శిఖామణి. ఎస్ మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో భరత్ హీరోగా నటిస్తున్నారు. ఇది ఈయనకు 25వ చిత్రం కావడం విశేషం. హీరోయిన్గా లక్కీగర్ల్ నందిత నటిస్తోంది. ఈ చిత్రంలో 23 మంది హాస్యనటులు నటించడం మరో విశేషం. యువ దర్శకుడు ఎల్జి.రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సైమ న్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నై వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఆడియోను దర్శకుడు కె.బాలచందర్ ఆవిష్కరించి తొలి ప్రతిని తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కె ఆర్కు అందజేశారు. కె.బాలచందర్ మాట్లాడుతూ సాధారణంగా ఐటమ్ సాం గ్స్ అంటే తనకు ఇష్టం ఉండదన్నారు. అలాం టిది ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ చూసిన తనకు ఆడాలనిపించిందని పేర్కొన్నారు. ఈ పాటలో నటించిన నృత్యదర్శకుడు రాబర్ట్‌ను బాలనటుడిగా అళగన్ చిత్రంలో నటింపజేశానన్నారు. అప్పుడే అతనిలోని ఎనర్జీని కనిపెట్టానన్నారు. హీరో భరత్‌లో మంచి నటుడున్నాడని అభినందించారు. చిత్ర టైటిల్ గురించి తన చిన్న సూచ న ఏమిటంటే సిద్ధ వైద్దియ శిఖామణి అని పెట్టి గ్యాగ్గా ఐందాం తలైమురై అంటే బాగుండేదన్నారు. చిత్ర పాటలు, ప్రచార చిత్రం చూస్తుం టే దర్శకుడి పనితనం కనిపిస్తోందన్నారు. భరత్‌కు గ్యారెంటీ హిట్ నటుడు భరత్ నటించిన 25వ చిత్రం ఐందాం తలైమురై సిద్ధ వైద్దియ శిఖామణిని రూపొం దడం ఆయన అదృష్టంగా భావిస్తున్నట్లు దర్శకుడు చరణ్ పేర్కొన్నారు. కె.బాలచందర్ వం టి ప్రఖ్యాత దర్శకుడి సంస్థలో నటించే అవకా శం రావడమే అందుకు కారణమన్నారు. తాను అజిత్ హీరోగా తెరకెక్కించిన అమర్క లం చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందేనన్నారు. అది అజిత్ 25వ చిత్రమని, అదే విధంగా భరత్ 25వ చిత్రమైన ఈ ఐందాం తలైమురై సిద్ధ వైద్దియ శిఖామణి మంచి విజ యం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త నల్లికుప్పుస్వామి శెట్టి మాట్లాడుతూ కె.బాలచందర్‌తో తన 62 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తమిళ దర్శక మండలి అధ్యక్షుడు విక్రమన్ భరత్, నందిత పాల్గొన్నారు. -
మరోసారి ఐటం నెంబర్లో కరీనా
-
అలాంటివి ఆశించొద్దు
సంస్కృతి సంప్రదాయ ప్రవర్తనలను నా నుంచి ఆశించొద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తోంది బెంగాలీ భామ నీతూ చంద్ర. తమిళంలో యావరుం నలం చిత్రం ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత జయం రవి సరసన ఆదిభగవాన్, యుద్ధం సెయ్ చిత్రంలో అమీర్‌తో ఐటమ్ సాంగ్ లాంటివి చేసేసి పాపులర్ అయ్యింది. ఈ మధ్య గ్రీక్ చిత్రం ఒకటి చేసిన నీతుచంద్ర ఏ విషయంలో అయినా చాలా బోల్డ్‌గా ఉంటుంది. తమిళంలో ఎక్కువ చిత్రాలు చెయ్యడం లేదే అన్న ప్రశ్నకు తాను నటిని మాత్రమే కాదు. నిర్మాతను కూడా. బెంగాలీలో మంచి కథా చిత్రాలను నిర్మించి నిర్మాతగా రాణించాలని ఆశిస్తున్నాను అని పేర్కొంది. అలాగే వైవిద్యభరిత పాత్ర అనిపిస్తే మాత్రమే నటించడానికి అంగీకరిస్తున్నానని చెప్పింది. మూస పాత్రలు చెయ్యదలచుకోలేదని స్పష్టం చేసింది. తన తల్లి తనను సూపర్ స్టార్‌గా భావిస్తారని ఆమె కలలను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మహిళలు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందడం అరుదని పేర్కొంది. అలాంటిది తాను మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది మూడు సార్లు భారత దేశం తరపున అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పింది. ఒక సారి నటుడు జాకీచాన్ నుంచి అవార్డు కూడా అందుకున్నట్లు తెలిపింది. అయినా తన తల్లి అంటే చాలా భయం అని అంది. తాను తరచూ పద్ధతిగా ప్రవర్తించాలంటూ హెచ్చరిస్తుంటారని చెప్పింది. సమాజంలో స్త్రీలకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని గుర్తు చేస్తుంటారని పేర్కొంది. అయితే సంస్కృతి, సంప్రదాయాలను తన నుంచి ఎదురుచూడటం ఆశనిపాతమేనని నీతూచంద్ర అంటోంది. ఈ విషయాలను ఇంత నిర్భయంగా చెప్పడంలోనే ఈ అమ్మాయి ఎంత ఫాస్టో అర్థం అవుతోంది. -
సన్నీ లియోన్ ఆటతో కుల్ఫీ
ఓ కుర్రాడికి సెల్‌ఫోన్ కొనుక్కోవాలనే ఆశ. ఆ ఆశను నెరవేర్చుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న తమిళ చిత్రం ‘వడకర్రి’. జై, స్వాతి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శరవణరాజన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ‘కుల్ఫీ’ పేరుతో నరసింహారెడ్డి సామల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు, కస్తూరి ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో శృంగారతార సన్నీ లియోన్ ప్రత్యేక నృత్య గీతంలో నర్తించారు. ఈ సినిమా విశేషాలు తెలియజేయడానికి సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘నా తొలి ప్రయత్నమిది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ‘వడకర్రి’ తెలుగు అనువాదంతో నా కెరీర్ మొదలవ్వడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాత శృంగారతార సన్నీ లియోన్ ఈ చిత్రంలో ప్రత్యేక నృత్య గీతంలో నర్తించడం మరో విశేషం. యువన్ శంకర్‌రాజా ఆరు భిన్నమైన గీతాలను ఈ సినిమా కోసం స్వరపరిచారు. జూన్ 2న పాటల్ని, అదే నెలలో తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కథ, కథనంతో పాటు పాటల చిత్రీకరణ కూడా భిన్నంగా ఉంటుందని మాటల రచయిత కృష్ణతేజ అన్నారు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే మంచి సినిమా ఇదని నిర్మాణ నిర్వాహకుడు ఎ.ఎన్.బాలాజీ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వెంకటేశ్, సమర్పణ: శ్రీనివాసరెడ్డి సామల, నిర్మాణం: ఎస్.ఎన్.ఆర్ సినిమాస్. -
రజనీకాంత్‌తో ఐటమ్ సాంగ్
రజనీకాంత్ సినిమాలో తమ పేరు రావడమే అదృష్టంగా భావిస్తుంటారు కథానాయికలు. ఆయన సరసన ఒక్క సినిమాలో నటించినా పంట పండినట్టే... అనుకుంటుంటారు. కానీ... నయనతార మాత్రం సూపర్‌స్టార్‌తో సినిమాల మీద సినిమాలు చేసేస్తూ, ఇటీవలి కాలంలో ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన నాయికగా రికార్డుకెక్కేస్తోంది. నయనతార కెరీర్లో తొలి బ్రేక్ - ‘చంద్రముఖి’. ఆ సినిమాలో రజనీతో జతకట్టి రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది నయన. ఆమెతో కలసి నటిస్తే కలిసొస్తోందని అనుకున్నారో ఏమో కానీ... రజనీ తన తర్వాతి సినిమా ‘శివాజీ’లో కూడా నయనతారతో ఓ పాటలో కాలు కదిపారు. ఆ వెంటనే వచ్చిన ‘కథానాయకుడు’ (తమిళంలో ‘కుచేలన్’)లో కూడా రజనీతో జతకట్టేసింది నయన. సూపర్‌స్టార్‌తో కలిసి ఇన్ని సినిమాలు చేసిన ఘనత నేటి తారల్లో నయనతారది మాత్రమే. ఇప్పుడు ఈ వివరణ అంతా దేనికంటే... త్వరలో మరోసారి రజనీ-నయన తెరపై స్టెప్పులేయనున్నారు. రజనీ సరసన అనుష్క, సోనాక్షీ సిన్హా నాయికలుగా నటిస్తున్న ‘లింగా’ చిత్రంలో ఓ కీలక సన్నివేశంలో వచ్చే ఐటమ్‌సాంగ్‌లో నయన నర్తించనున్నట్లు చెన్నై సమాచారం. ఆమె ఐటమ్ సాంగ్ చేయడం ఇదే తొలిసారి. -
ఆ విషయంలో కొన్ని తప్పులు చేశా!
‘జయం’ సినిమాలో నితిన్‌ని ‘వెళ్లవయ్యా వెళ్లూ...’ అంటూ ఆటపట్టించిన పరికిణీ పాప గుర్తుంది కదూ!? ఆ ఒక్క సినిమాతో తారాపథానికి దూసుకుపోయారు నటి సదా. శంకర్ దర్శకత్వంలో ‘అపరిచితుడు’ చేసి, హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత సడన్‌గా కెరీర్లో వెనకబడ్డారు. ఇటీవలే ‘యమలీల-2’లో గెస్ట్ సాంగ్ చేసిన సదా భవిష్యత్ ప్రణాళికలేంటి? కెరీర్ గురించి ఆమె విశ్లేషణేంటి? కొంత విరామం తర్వాత ‘యమలీల 2’లో ఐటమ్ సాంగ్ ద్వారా కనిపించనున్నారు.. ఈ పాట ఎలా ఉంటుంది? అది ఐటమ్ సాంగ్ కాదు. మామూలుగా ఏదైనా సినిమాలో ఒకే ఒక్క పాటకు డాన్స్ చేస్తే చాలు.. ఐటమ్ సాంగ్ అంటారు. ఈ సినిమాకి సంబంధించినంతవరకు ఈ పాటను అలా అనలేం. కథానుసారంగా వచ్చే పాట ఇది. నేను దేవకన్య గెటప్‌లో కనిపిస్తాను. నా కాస్ట్యూమ్స్, డాన్స్.. అన్నీ బాగుంటాయి. కొన్ని కొన్నిసార్లు.. ఒక పాట, ఒక సీన్ కూడా బ్రేక్ తీసుకు రావచ్చంటారు.. మీరేమంటారు? నేనో సినిమా ఒప్పుకున్న తర్వాత, నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలనా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఈ సినిమా మనకు మంచి బ్రేక్ అవుతుందా? లేదా లాంటివి ఆలోచించను. ‘జయం’తో కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత బాగానే సినిమాలు చేశారు. హఠాత్తుగా అవకాశాలు తగ్గడానికి కారణం? అది దర్శక, నిర్మాతలను అడగాలి. నా వరకు నేను చేసిన సినిమాలన్నిటికీ పూర్తి న్యాయం చేశాను. కాకపోతే, కొన్ని సినిమాలు ఆడకపోవడం దురదృష్టకరం. సినిమా పరిశ్రమలో నాకు ‘గాడ్‌ఫాదర్’ లేకపోవడంతో సినిమాల ఎంపిక విషయంలో కొన్ని తప్పులు చేశాను. అది మైనస్ అయ్యింది. ఇలా జరిగినందుకు పశ్చాత్తాపపడుతున్నారా? లేదు. ఎందుకంటే, ‘సదా డెరైక్టర్స్ ఆర్టిస్ట్’ అనిపించుకోగలిగాను. అది చాలు. తప్పులెవరైనా చేస్తారు. నా తప్పులు నాకు మైనస్ అయ్యాయే కానీ, ఎవరికీ కష్టం కలిగించలేదు. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటివరకు నా కెరీర్లో నేనెవర్నీ ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అని అడగలేదు. వచ్చిన సినిమాలు చేశాను. మీరు ఎవరితోనూ స్నేహంగా ఉండకపోవడం కూడా మైనస్ అయ్యిందనుకోవచ్చా? వృత్తిపరమైన లాభం కోసం స్నేహం నటించలేను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా ఆత్మాభిమానం దెబ్బతినే పనులు చేయలేను. ఒకవేళ అవకాశాలు తగ్గడానికి ఇవే కారణం అయ్యుంటే, నేను బాధపడను. ఎందుకంటే, నా గౌరవాన్ని కాపాడుకోగలిగాననే తృప్తి మిగిలింది. దర్శకుడు శంకర్ సినిమాలో నటించిన కథానాయిక కెరీర్ అంతే సంగతులని చాలామంది అంటారు...? అలాంటి సెంటిమెంట్స్ నాకు లేవు. ‘జయం’తో తెలుగులో, ‘అపరిచితుడు’తో ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపు తెచ్చుకోగలిగాను. బిజీగా సినిమాలు చేసేసి ఇప్పుడు ఖాళీగా ఉండటం బోరనిపించట్లేదా? ఆ దేవుడు నాకు కావాల్సినదాని కన్నా ఎక్కువే ఇచ్చాడు. అయినా సరే సంతృప్తి పడకపోతే, ఆయన క్షమించడు. నేనెప్పుడూ బిజీగా ఉండాలని, నెలకోసారి వెండితెరపై కనిపించాలనే ఆకాంక్ష లేదు. ఈ మధ్య వస్తున్న ఓ టీవీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు కదా.. అసలు బుల్లితెరకు పచ్చజెండా ఊపడానికి కారణం ఏంటి? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ నేపథ్యంలో సాగే కార్యక్రమం కాబట్టి, దానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించే చాన్స్ రావడంతో ఎగ్జయిటయ్యా. వెంటనే ఒప్పుకున్నాను. బుల్లితెర ఎలాంటి అనుభూతినిస్తోంది? నేను చేస్తున్నది పిల్లలకి సంబంధించిన షో. పిల్లలందరూ డాన్స్‌లో కనబరుస్తున్న ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. షూటింగ్లో సమయం ఎలా గడిచిపోతోందో కూడా తెలియడంలేదు. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు? ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెళ్ళెప్పుడో ఆలోచించలేదు. జీవితంలో మనకెంతోమంది తారసపడతారు. వాళ్లల్లో మనకు నచ్చినవాళ్లుంటారు. కానీ, జీవిత భాగస్వామిని చేసుకోలేం. అందుకే, బెటర్ హాఫ్‌ని ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి అడుగు లేస్తా. ఇతణ్ణి పెళ్లాడితే మన మిగతా జీవితం ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుందని అనిపిస్తే చాలు... కచ్చితంగా ఆ వ్యక్తిని పెళ్లాడతా. ప్రేమ వివాహాన్ని మా వాళ్లు ఎప్పుడూ వ్యతిరేకించరు. - డి.జి. భవాని -
ఆండ్రియూ ఐటమ్ సాంగ్
స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్స్‌కు చిందేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి పాటలతో హీరోయిన్లకు అధిక మొత్తంలో ఫీజు, ప్రేక్షకులకు మోజు, సినిమాకు క్రేజు, నిర్మాతకు డబ్బు, టోటల్‌గా చిత్రం సేఫ్. ఇది ఐటమ్సాంగ్ల ఫార్ములా. ఇంతకి ఆండ్రియూ ఐటమ్‌సాంగ్ వివరాలు చెప్పలేదు కదూ. హరి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం పూజైలో విశాల్, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా ఉన్నారు. ఈ చిత్రాన్ని విశాల్ తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రత్యేక పాటతో సంచలన నటి ఆండ్రియూ విశాల్‌తో కలిసి ఆడనున్నారు. ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్లో తళుక్కుమన్న ఆండ్రియూ ఐటమ్ సాంగ్ చేస్తున్న తొలి చిత్రం మాత్రం ఇదే కావడం విశేషం. నా. ముత్తుకుమార్ రాసిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీత బాణీలు కట్టారు. చెన్నైలో ఒక భారీ సెట్లో ఈ పాటను చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సెట్లో దర్శకుడు హరి చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. -
తమన్నా ఐటెం సాంగ్?
హీరోయిన్గా వెలుగొందుతున్న తమన్నా ప్రత్యేక గీతంలో కనిపించనుందని గుసగుసలు విన్పిస్తున్నాయి. సమంతా సినిమాలో ఈ శ్వేత సుందరి ఐటెం సాంగ్ చేయనుందని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమవుతున్న సినిమాలో తమన్నా ప్రత్యేక పాటలో కనిపించనుందని ఫిలింనగర్ టాక్. మొదట ఈ సినిమాలో సమంతా, తమన్నాలను హీరోయిన్లుగా తీసుకోవాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో స్క్రిప్ట్‌లో మార్పులు చోటుచేసుకోవడంతో తమన్నాను తప్పించారు. సమంతాకు హీరోయిన్ ఛాన్స్ దక్కింది. రొమాంటిక్ మ్యూజికల్ తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. -
ఉంబక్కుం పాటలో మెరిసిన సల్లూభాయ్ ఫియాన్సీ
బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్‌ఖాన్ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు అర్జున్ కపూర్, స్నేహా ఉల్లాల్, కత్రినా కైఫ్, జరైన్ ఖాన్.. ఇలా అనేకమందిని బాలీవుడ్ ప్రజలకు పరిచయం చేసిన సల్లూభాయ్.. తాను పెళ్లాడబోతున్న రుమేనియా అమ్మడు లులియా వాంటర్ని కూడా తెరమీదకు తీసుకొస్తున్నాడట. అతుల్ అగ్నిహోత్రి తీస్తున్న 'ఓ తేరీ' చిత్రంలో లులియా వాంటర్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. 'ఉంబక్కుం' అంటూ మొదలయ్యే ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో పులకిత్ సామ్రాట్, బిలాల్ అమ్రోహి, సారా జేన్ డయాస్, సారా లోరెన్ తదితరులున్నారు. ఉంబక్కుం పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు మికా సింగ్ పాడాడు. సల్లూభాయ్ నటించిన 'జైహో' చిత్రం షూటింగ్ సమయంలో సెట్ల వద్ద చాలాసార్లు రుమేనియా పాప కనిపించిందట. ఇక ఉంబక్కుం పాట చిత్రీకరణ విషయంలో సహజంగానే సల్మాన్ ఖాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. పాట పూర్తిగా విడుదల అవ్వడానికి ముందు కూడా ఓసారి దాన్ని ప్లే చేయించుకుని చూశాడు. -
ఇప్పుడే పెళ్లేంటి? హాయిగా ఉండనివ్వండి!
ముంబయ్‌లోని ఓ ప్రముఖ ఏరియా అది. కళ్లు చెదిరే భవంతులతో పసందుగా ఉంటుంది. కాస్త దూరం వెళితే.. చిన్న చిన్న ఇళ్లు. దాదాపు మురికివాడ అనొచ్చు. అమ్మ, నాన్న, ముగ్గురు అక్కచెల్లెళ్లతో ఆ ఏరియాలో ఉండేది ముమైత్‌ఖాన్ ఆ రోజుల్లో . ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి చిన్న డాన్స్ ట్రూప్‌లో పదిహేనువందల జీతానికి చేరింది. అక్కడ నుంచి మొదలైన ఆమె కెరీర్ దక్షిణ, ఉత్తరాది భాషల సినిమాల్లో తిరుగులేని ఐటమ్ డాన్సర్‌గా ఎదిగే దాకా వెళ్ళింది! ఇప్పుడు ముంబయ్‌లో ఆమెది కూడా కళ్ళు చెదిరే సొంత భవంతే. ‘హాట్ గాళ్, సెక్సీ గాళ్’ అనే బిరుదులు కూడా సొంతం చేసుకున్న ఈ ముంబై కుట్టీ ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ చేయడం తగ్గించేసింది. అయితే ఈ నిర్ణయం కావాలని తీసుకున్నదా? అసలు ఇప్పుడు తనేం చేస్తోంది? ముమైత్ మాటల్లోనే తెలుసుకుందాం... ఐటమ్ సాంగ్స్ మీద ఎందుకీ అలక? పదమూడేళ్ల వయసులో కెరీర్ ప్రారంభించా. నా కుటుంబం కోసం ఓ పది, పన్నెండేళ్లు విశ్రాంతికి తావు లేకుండా పని చేశా. నచ్చనివి ఎన్నో చేశా! ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశా! ఇప్పుడా అవసరం లేదు. ఆర్థికంగా ఇప్పుడు బాగున్నా. నా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉన్నారు. అందుకే, ఇప్పుడు నా గురించి ఆలోచించడం మొదలుపెట్టా. వీలైనంత విశ్రాంతి తీసుకుంటూ, ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నా. నచ్చినవే చేద్దామనుకుంటున్నాను అంటే.. ఇష్టం లేకుండా ఐటమ్ సాంగ్స్ చేశారా? ఇష్టం లేని పనిని ఎవరూ మనసు పెట్టి చేయలేరు. నేను చేసిన ప్రతి పాటనూ మీరు క్షుణ్ణంగా గమనిస్తే ఎంతో మమకారంతో చేసిన విషయం మీకర్థమవుతుంది. అంత మమకారం ఉంటే దూరమవలేరు కదా. కురచ దుస్తులు వేసుకుని హాట్‌గా యాక్ట్ చేసినందుకు ఏమైనా పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపపడాల్సిన అవసరం నాకు లేదు. నా జాబ్‌ను నేను చాలా సిన్సియర్‌గా చేశాను. ఓ ఐటమ్ డాన్సర్ ఎలా కనిపించాలో అలానే కనిపించాను. అందుకు భిన్నంగా నేను కనిపిస్తే, ఆ పాటకు న్యాయం జరుగుతుందా? నిర్మాత దగ్గర నుంచి తీసుకున్న ప్రతి రూపాయికీ నేను న్యాయం చేసినందుకు గర్వపడుతున్నా. ఇప్పుడున్నట్లు ఓ పదేళ్ల క్రితం లేను. పదేళ్ల క్రితం ఉన్నట్లు పదిహేనేళ్ల క్రితం లేను. మానసిక పరిణతి చాలా పెరిగింది. ఇప్పుడు ఏది చెయ్యాలి? ఏది చెయ్యకూడదు? ఏం చేస్తే నాకు ఆనందంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాను. ఎప్పుడైనా అనుకున్నారా.. ఆ దేవుడు ఆర్థిక ఇబ్బందులు పెట్టడం వల్లే ఇలా ఐటమ్ డాన్సర్‌గా చేయాల్సి వచ్చింది అని? అనుకున్నాను. కానీ, అది కూడా పాజిటివ్‌గా! కష్టపడితేనే కదా సుఖం విలువ తెలుస్తుంది. నాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి, అక్కణ్ణుంచి ఎదగాలనుకున్నాను. ఆ విధంగా జీవితానికో లక్ష్యం దొరికింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. కాబట్టే ఇప్పుడు సుఖంగా ఉంటున్నాను. అందుకే ఆ దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్నాళ్లూ డాన్సరే. ఇప్పుడు సింగర్‌గానూ అవతారమెత్తారే? చిన్నప్పటినుంచీ నాకు పాటలంటే ఇష్టం. చిన్న వయసులోనే కెరీర్ స్టార్ట్ చేయడం, డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకోవడంతో నా కోరిక తీర్చుకోలేకపోయా. ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకున్నా నాకు నష్టం లేదు. అందుకే, కొంత బ్రేక్ తీసుకుని ఆల్బమ్ చేశా. త్వరలో విడుదల చేస్తా. ఈ ఆల్బమ్‌లో ఎన్ని పాటలుంటాయి? ఒకే ఒక్క పాట ఉంటుంది. హాలీవుడ్ పాప్‌స్టార్ షకీరా స్థాయిలో పేరు తెచ్చుకోవాలనే లక్ష్యం ఉంది. భవిష్యత్తులో ఎక్కువ పాటలతో మరిన్ని ఆల్బమ్స్ చేస్తా. మరి సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేస్తారా? చాన్సే లేదు! సినిమాల ద్వారానే కదా నాకు ఇంత మంచి హోదా వచ్చింది. మంచి ఐటమ్ సాంగ్స్ వస్తే కచ్చితంగా చేస్తా. ఏ గ్యాప్కైనా ఒక ఫుల్స్టాప్ ఉంటుంది. నా విరామానికి నేనూ ఫుల్స్టాప్ పెడతా. సినిమాయే నా ‘బ్రెడ్ అండ్ బటర్’ కాబట్టి, వాటికి దూరమై ఏం చేస్తాను? మైసమ్మ ఐపీఎస్, మంగతాయారు టిఫిన్ సెంటర్ లాంటి సినిమాల్లో హీరోయిన్గా చేశారు. మళ్లీ ఎప్పుడు? మంచి కథతో ఎవరైనా అడిగితే చేస్తా. ఐటమ్ సాంగ్స్‌లో ఎంత హాట్‌గా కనిపించానో పాత్ర డిమాండ్ మేరకు అంత నీట్‌గా కనిపించిన సినిమాలూ ఉన్నాయి. ఇటు హాట్,అటు నీట్ ఏది చేసినా చిత్తశుద్ధితో చేస్తా! దాదాపు మూడు నాలుగేళ్ల క్రితం ‘షుగర్ క్యాండీ’ అనే బేనర్ స్టార్ట్ చేశారు. సినిమాలు నిర్మిస్తానన్నారు.. అదేమైంది? నిర్మిస్తా... దానికీ టైమ్ వస్తుంది! ఆల్బమ్‌తో పాటు నిర్మాణానికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తున్నాను, డెరైక్షన్ కూడా చేస్తారేంటి? వై నాట్!! ఆ ఆలోచన కూడా ఉంద వీటన్నిటి మధ్య... పెళ్లెప్పుడు? ఇప్పుడే పెళ్లేంటి? హ్యాపీగా ఉన్నాను. ఇంకొన్నాళ్లు ఇలా హాయిగా ఉండనివ్వండి. ఏం... పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండరా? ఎందుకుండం? ఇన్నాళ్లూ షూటింగ్స్ బిజీ వల్ల లైఫ్‌ని ఎంజాయ్ చేయలేదు. అందుకే కొన్నాళ్లు ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. - డి.జి. భవాని -
లెజెండ్‌లో ఐటంసాంగ్ చేస్తోన్న బిపాసా...?
-
ఆట హంసానందినితోనే!
బాలకృష్ణతో అండర్‌ప్లే చేయిస్తే.. దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో రుచి చూపించిన చిత్రం ‘సింహా’. కోడి రామకృష్ణ, బి.గోపాల్, వి.వి.వినాయక్ తర్వాత బాలకృష్ణను అంత జనరంజకంగా చూపించింది నిజంగా బోయపాటి శ్రీనే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే.. అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా? ‘లెజెండ్’ సినిమా ప్రారంభం నుంచీ బోయపాటి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమాను ఆయన చకచకా పూర్తి చేసిన వైనం... కథపై తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ ఒక్కపాటను ఈ నెల 5 నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్లో తెరకెక్కించనున్నారు. అయితే.. బాలీవుడ్ భామ బిపాసాబసు ఈ పాటలో నర్తిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అది నిజం కాదట. ఈ ప్రత్యేకగీతంలో బాలయ్యతో కాలు కదిపే తార హంసానందిని. ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతుల్ని సమకూరుస్తున్న ఈ పాటలో హంసానందినితో పాటు ఈ చిత్ర కథానాయికల్లో ఒకరైన సోనాలీ చౌహాన్, మరికొందరు తారాగణం కూడా పాల్గొంటారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 7న విడుదల చేసి, సినిమాను ఈ నెల 28న విడుదల చేయనున్నారు నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. రాధికా ఆప్టే ఓ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా కల్యాణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి కొర్రపాటి. -
ఐటంగాళ్ గా ఆండ్రియా
-
పాతిక లక్షలకు ఆటా పాట
నటి ఆండ్రియా ఆటా పాట కావాలంటే పాతిక లక్షలు చెల్లించాల్సిందే. సంచలన నటీమణుల్లో ఆండ్రియా ఒకరు. ఆ మధ్య యువ సంగీత దర్శకుడితో రొమాన్స్ చేసిన దృశ్యాలు ఇంటర్నెట్లో కలకలం సృష్టిం చాయి. అయితే ఈ వ్యవహారంలో నా జీవితం నా ఇష్టం అంటూ ఖరాఖండిగా ప్రకటించి తన ప్రవర్తనను సమర్థించుకున్న ఈ బ్యూటీ విశ్వరూపం చిత్రంలో కమలహాసన్‌తో జత కట్టింది. ఆ చిత్రం విజయంతో మరిన్ని అవకాశాలు వస్తాయని పారితోషికం కూడా పెంచేయవచ్చునని ఆండ్రియా ఆశించింది. అయితే ఈ అమ్మడి ఆశలు అడి ఆశలయ్యాయి. ఒక్క అవకాశం కూడా రాలేదు. మళ్లీ కమలహాసన్ విశ్వరూపం-2లో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తోంది. విశ్వరూపం-2లో తన పాత్రకే అధిక ప్రాధాన్యత వుంటుందని, కమలహాసన్‌తో డ్యూయెట్ కూడా పాడినట్లు చెప్పింది. విశ్వరూపం-2 విడుదలానంతరం అయినా పారితోషికం పెంచడానికి తహతహలాడుతున్న ఆండ్రియాకు శశికుమార్ హీరోగా నటిస్తున్న బ్రహ్మన్ చిత్రంలో ఒక పాటకు ఆడే అవకాశం వచ్చింది. అయితే అందుకామె డిమాండ్ చేసిన పారితోషికం రూ.25లక్షలు. అంత పారితోషికం నిర్మాత ససేమిరా అంటే దర్శకుడు మాత్రం ఆ పాటకు ఆండ్రియా నటిస్తేనే బాగుంటుందని పట్టుపట్టారట. దీంతో చేసేదేమిలేక బ్రహ్మన్ చిత్ర నిర్మాత రూ.25 లక్షలు ఇచ్చి ఆండ్రియాతోనే పాట పాడించి ఆడించారట. దీంతో సింగిల్ సాంగ్ అయినా ఓకే అంటుందట ఈ భామ. -
సూర్యతో చేయూలని...
ప్రముఖ హీరోల సరసన నటిస్తే హీరోయిన్లకు పేరుతో పాటు పారితోషికం అధికంగానే ముడుతుంది. ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుంది. అందుకే వర్ధమాన భామలు అలాంటి అవకాశాల కోసం అర్రులు చాస్తుంటారు. నటి మరియం జకరియ ఇరానీ ముద్దుగుమ్మ. అక్కడ ఐటమ్ సాంగ్‌ల సుందరిగా ప్రాచుర్యం పొందిన ఈ జాణకు మన దేశంలోనూ గిరాకీ పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్లో చిందేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్ స్క్రీన్‌పై తన అందాలారబోతతో మోత మోగించనుంది. లింగుస్వామి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రంలో ఈ శృంగారతార ఆయనతో ఐటమ్‌సాంగ్‌లో ఆడింది. ఈ పాట చిత్రీకరణ ఇటీవలే పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈ ఇరానీ భామ మాట్లాడుతూ హిందీలో ఏజెంట్ వినోద్ చిత్రంలో దిల్మేరా..అనే పాటకు కరీనాకపూర్‌తో కలసి నటించానని చెప్పింది. తమిళంలోనూ నగరం అనే చిత్రంలో ఒక ఐటమ్‌సాంగ్ చేశానని తెలిపింది. తాజాగా సూర్య హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటించమని అడిగారని వెంటనే సంతోషంగా అంగీకరించానని చెప్పింది. సూర్య తనతో చాలా స్నేహంగా మసలుకున్నారని చెప్పింది. ఆయనతో కలసి ఆడుతున్నప్పుడు పని చేస్తున్నట్లే అనిపించలేదని పేర్కొంది. ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ఇంతకుముందు నటించానని, ఇప్పుడు ఆయన సోదరుడు రాజు సుందరం నృత్య దర్శకత్వంలో పని చేయడం సంతోషంగా ఉందని చెప్పింది. తాను సింగిల్ సాంగ్ నటినైనా సూర్యతో ఐటమ్‌సాంగ్ చేసిన తరువాత ఆయనకు జతగా నటించాలనే ఆశ పుట్టిందని మరియం జకరియ చెప్పింది. -
కన్నడంలో పువ్వాయ్ పువ్వాయ్...!
ఈ మధ్యకాలంలో వచ్చిన సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్‌లో ‘పువ్వాయ్ పువ్వాయ్...’ ఒకటి. మహేష్‌బాబు నటించిన ‘దూకుడు’లోని ఈ పాటకు తనతో పాటు పార్వతి మెల్టన్ కాలు కదిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే పాటకు కన్నడంలో నీతుచంద్ర డాన్స్ చేస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా కన్నడంలో ‘దూకుడు’ రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ప్రత్యేక పాటలో నీతూ నర్తిస్తున్నారు. ఇటీవలే పునీత్, నీతు పాల్గొనగా ఈ పాట చిత్రీకరణ ప్రారంభించారు. గణేష్ మాస్టర్ నృత్యదర్శకత్వంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని, స్టెప్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని నీతూ పేర్కొన్నారు. ఈ ట్యూన్ చాలా పెప్పీగా ఉందని కూడా తెలిపారామె. -
బాలీవుడ్ అయితే ఓకే
ఐటమ్‌సాంగ్స్‌కు బాలీవుడ్లో అయితే ఓకేనని దక్షిణాదిలో మాత్రం సింగిల్సాంగ్కు అంగీకరించనని అం టోంది నటి ప్రియమణి. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో తొలి రోజుల్లోనే పరుత్తివీరన్ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకుంది. అయితే ఆ తరువాత ప్రియమణికి మంచి అవకాశాలే రాలేదు. ఇది తన కెప్పటికీ అసంతృప్తిని కలిగించే విషయమేనంటోందీ భామ. తమిళంలో ఈ బ్యూటీ నటించిన చిత్రం విడుదలై మూడేళ్లకు పైనే అయ్యింది. కోలీవుడ్‌లో ఇంత గ్యాప్ రావడానికి కారణమేమిటన్న ప్రశ్నకు మంచి అవకాశాలు రాకపోవడమేనని పేర్కొంది. ఆ మధ్య టాలీవుడ్లో బిజీగా నటించిన ప్రియమణికి ఇప్పుడు అక్కడ అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం కన్నడం, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తోందట. ప్రియమణి తెలుపుతూ మలయాళంలో ట్రూ స్టోరీ అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. ఇది యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం అంది. కన్నడంలో అంబరిషా అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. హిందీ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో సింగిల్ సాంగ్‌లో నటించారు. ఆ తరువాత అక్కడ అవకాశాలు రాలేదా? అన్న ప్రశ్నకు వస్తున్నాయని అయితే మంచి పాత్ర అనిపిస్తేనే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.దక్షిణాదిలోనూ సింగిల్ సాంగ్‌లో నటిస్తారా అన్న ప్రశ్నకు అలాంటి అవకాశం వస్తే షారూక్ , అమీర్, సల్మాన్‌ఖాన్, హృతిక్ రోషన్ చిత్రాల్లో నటించడానికి అభ్యంతరం లేదని అంది. దక్షిణాదిలో సింగిల్ సాంగ్‌కు ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇక్కడ అలా నటిస్తే ఐటమ్ గర్ల్‌గా ముద్ర వేస్తారనే అభిప్రాయాన్ని ప్రియమణి వ్యక్తం చేసింది. -
ఐటమ్ నం.1
స్టార్ హీరోల సినిమా అంటే... కథ, కథనం, నిర్మాణ విలువలు, సాంకేతిక హంగులు ఇవి మాత్రమే కాదు. వాటితో పాటు కాస్త మసాలా ఐటమ్స్ కూడా తోడవ్వాలి. ఆ మాత్రం ఘాటు లేకపోతే మాస్ ఇష్టపడరు. దర్శకుడు సుకుమార్‌కి ఆ విషయం బాగా తెలుసు. యువతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం పడాల్సిన శ్రమంతా పడతారాయన. సుకుమార్ సినిమాల్లోని రొమాంటిక్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఫన్, ఐటమ్ నంబర్లు విపరీతంగా పేలతాయంటే కారణం అదే. ప్రస్తుతం మహేష్‌తో ఆయన ‘1’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఫైనల్‌గా మిగిలివున్న ఐటమ్ సాంగ్‌ని ముంబయ్‌లో చిత్రీకరిస్తున్నారు సుకుమార్. ఐటమ్‌సాంగ్స్ చిత్రీకరణలో సుకుమార్‌ది ఓ ప్రత్యేక శైలి. ‘ఆర్య’లోని ‘అ అంటే అమలాపురం’, ‘ఆర్య-2’లోని ‘రింగ రింగ’, ‘100%లవ్’లోని ‘పిల్లా నీ బావనిస్తవా’... ఇలా ఆయన ఐటమ్‌సాంగ్స్ అన్నీ బంపర్హిట్లే. వాటిని తలదన్నేలా ఈ ఐటమ్ నంబర్ని దేవిశ్రీప్రసాద్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ పాటలో సూపర్‌స్టార్‌తో జతకట్టే అవకాశాన్ని సోఫీ చౌదరి కొట్టేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. మహేష్ తనయుడు గౌతమ్ బాలనటునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కీర్తి సనన్ కథానాయిక. నాజర్, సయాజీ షిండే, కెల్లీ డోర్జీ, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: పీటర్హెయిన్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్. -
నంబర్‌వన్ ఐటమ్‌సాంగ్
టాలీవుడ్లో ఐటమ్సాంగుల హంగామా మొదలైంది ‘ఆర్య’ నుంచి. అందులోని ‘ఆ అంటే అమలాపురం...’ పాట తెలుగునేలను ఓ ఊపు ఊపేసింది. అప్పట్నుంచి సుకుమార్ తన దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమాలో కచ్చితంగా ఓ ఐటమ్ నంబర్ ఉండేలా చూసుకుంటున్నారు. దేవిశ్రీ-సుకుమార్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన అన్ని ఐటమ్సాంగులూ అదరహో అనిపించినవే. ఈ సందర్భంలో మహేశ్ ఐటమ్సాంగుల గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి. ‘పోకిరి’లో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...’ పాట నుంచి నిన్న మొన్న వచ్చిన ‘దూకుడు’లోని ‘ఆటో అప్పారావు..’ పాట వరకూ దాదాపు మహేశ్ నర్తించిన అన్ని ఐటమ్ సాంగులూ మాస్‌ని ఉర్రూతలూగించినవే. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికి అనుకుంటున్నారా? మహేశ్, సుకుమార్, దేవిశ్రీ... ఈ ముగ్గురు కలిసి ప్రస్తుతం ‘1’ చిత్రానికి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆనవాయితీ ప్రకారం సుకుమార్ ఇందులో కూడా ఓ ఐటమ్నంబర్ని పెట్టేశారు. సుకుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ ఐటమ్‌సాంగ్ అంటే మూమూలుగా ఉండకూడదు కదా! అందుకే... ఐటమ్నంబర్లలోనే తలమానికం అనిపించేలా ఈ సాంగ్‌ని సుకుమార్ చిత్రీకరించినట్లు సమాచారం. బాలీవుడ్ మోడల్ సోఫియా ఈ సాంగులో ప్రిన్స్‌తో కాలు కదిపారు. ప్రేమ్క్ష్రిత్ నేతృత్వంలో ముంబైలో చిత్రీకరించిన ఈ పాట యువతరాన్ని ఉర్రూతలూగిస్తుందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ‘1’ ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆ మిగిలిన ఉన్న పాటను చిత్రీకరించనున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ 22న వినూత్నంగా పాటలను, జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు. -
కోలీవుడ్‌లో చిందుకు సన్ని లియోన్ రెడీ
నటి సన్ని లియోన్ గురించి తెలియనివారుండరు. ఎందుకంటే, సంచలన బాలీవుడ్ చిత్రం జిస్మి-2లో ఈ బ్యూటీ అందాలు యువతను గిలిగింతలు పెట్టించాయి. ప్రస్తుతం హిందీలో క్రేజీ నటిగా వెలుగొందుతున్న ఈ భామ తాజాగా కోలీవుడ్ తెరపై చిందు వేయడానికి సిద్ధం అవుతోంది. యువ నటుడు జయ్ ఊహా సుందరిగా ఆయనతో కలిసి ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయ్ నటిస్తున్న తాజా చిత్రం వడకరై. స్వాతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి మెగా ఎంటర్టైన్ మెంట్ పతాకంపై దయానిధి అళగిరి నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు శిష్యుడు శరవణన్ నాగరాజన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఇండో, కెనడియన్ బ్యూటీ సన్ని లియోన్ సింగిల్ సాంగ్‌కు నర్తించనుంది. ఈ పాటను డిసెంబర్లో భారీ సెట్లో చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా ఈ జిస్మి-2 బేబీ యువ నటుడు భరత్ నటిస్తున్న హిందీ చిత్రం జాక్పాట్లో కూడా నటించిందనేది గమనార్హం. -
బాలయ్యతో సై అంటున్న సమీరా
తెలుగు అమ్మాయి సమీరా రెడ్డికి కూడా చాలాకాలంగా ఛాన్స్‌లు కరువయ్యాయి. దీంతో క్రిష్ డైరెక్షన్లో వచ్చిన కృష్ణం వందే జగద్గురం సినిమాలో దగ్గుబాటి రానా సరసన సమీరా అందాలు ఆరబోసి ఆకట్టుకుంది. ఇపుడు తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య హీరోగా వస్తున్న లేజండ్ సినిమాలో మరోసారి ఐటమ్ సాంగ్‌లో మెరవడానికి రెడీ అవుతుంది. అయితే హీరోయిన్....లేదంటే కనీసం ఐటమ్బాంబ్. ఇదీ నయాట్రెండ్. హీరోయిన్లుగా పరిచయమైన భామలు ఛాన్స్‌లు లేకపోతే స్పెషల్ సాంగ్స్ చేసుకుని టైమ్‌పాస్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయాలంటే పెద్ద గగనంగా ఉండేది. ఇపుడు ట్రెండ్ మారింది. ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. మాస్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు సినిమాలో మసాలా ఐటమ్ సాంగ్ తప్పనిసరి. ఇలాంటి ప్రత్యేక గీతం లేని సినిమా ప్రస్తుతం ఉండడం లేదు. ఫామ్‌లో ఉన్న హీరోయిన్ చేసి మాస్ మసాలాతో అందాల ఆరబోస్తే రిపీటెడ్ ప్రేక్షకులను రప్పించవచ్చేనేది సక్సెస్ మంత్రగా మారింది. అందుకే హీరోయిన్లు అడపాదడపా ఇలాంటి స్పెషల్ సాంగ్స్‌లో మెరిసిపోతున్నారు. అప్పట్లో కొంతమంది డైరెక్టర్లు మాత్రమే ఈ స్పెషల్ సాంగ్స్‌ను వాడే వారు. హీరోయిన్లుగా పరిచయం అయ్యి రెండు మూడు సినిమాల తర్వాత ఛాన్స్‌లు తక్కువైతే ఐటమ్ సాంగ్‌లు చేయడానికి కూడా వెనుకాడడం లేదు ఈ భామలు. గతంలో కొమరం పులితో హీరోయిన్గా పరిచయమైన నికిషాపటేల్కు పెద్దగా అవకాశాలు రాలేదు. చాలా కాలం గ్యాప్ వచ్చింది. దీంతో తమిళంలో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయింది. మరో హీరోయిన్ శృతీహాసన్ ఈ పాటకు గాత్రం అందించింది. శ్రియ కూడా ఐటం సాంగ్స్‌లో నర్తించిన విషయం తెలిసిందే. -
ఐటమ్ గాళ్స్గా మారుతున్న సీనియర్లు
-
‘రామ్ లీలా ’ లో ఐశ్వర్య స్పెషల్ సాంగ్ లేదు
గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న అందాల తార ఐశ్వర్యరాయ్ ఓ ఐటం సాంగ్‌తో రీఎంట్రీ ఇస్తుందన్న వార్తను దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కొట్టిపారేశారు. భన్సాలీ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ‘రామ్ లీలా ’ సినిమాలో ఐష్ ఐటెం సాంగ్‌ను నర్తిస్తుందన్న వార్తలు బాలీవుడ్లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రూమర్సులో ఎలాంటి వాస్తవం లేదని భన్సాలీ స్పష్టం చేశారు. ఐశ్వర్య రాయ్ ఒక బిడ్డకు జన్మినిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దాంతో ఐష్ రీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో 'రామ్ లీలా' చిత్రంలో తమ అభిమాన తార ఐటం సాంగ్ చేస్తుందనే వార్తలు వారికి సంతోషాన్ని ఇచ్చాయి. భన్సాలీ దర్శకత్వం వహించిన 'దేవదాస్', 'గుజారీష్' చిత్రాల్లో ఐశ్వర్య నటించటంతో ...ఆ సాన్నిహిత్యం, గౌరవం కారణంగానే సంజయ్ అడగ్గానే ఐశ్వర్యారాయ్ ప్రత్యేక గీతం చేసేందుకు ఒప్పేసుకుందని కథనాలు వెలువడ్డాయి. మొదటి సోనాక్షి సిన్హా అన్నారు, ఆ తర్వాత మాధురి దీక్షిత్ అన్నారు...ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ఎలా ప్రచారంలోకి వస్తాయో అర్థం కావడం లేదంటూ భన్సాలీ వ్యాఖ్యానించారు. భన్సాలీ వివరణతో ఐశ్వర్యారాయ్ ఐటం సాంగ్ రూమర్స్‌కు తెరపడినట్లుయింది. ఇక ఐశ్వర్యారాయ్ తన సమయాన్ని అంతా కుమార్తె ఆరాధ్యకే కేటాయిస్తోంది. ప్రస్తుతం ఐష్.... ఆరాధ్యకే ప్రాధాన్యత ఇస్తుందని, ఆరాధ్య కంటే తనకు ఏదీ ముఖ్యంగా కాదని ఐశ్వర్య భావిస్తుందని ఆమె సన్నిహితులు తెలిపారు. అయితే మంచి కథ దొరికితే త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని పేర్కొన్నారు. కాగా 1983లో వచ్చిన 'మసూమ్' సినిమా రీమేక్‌లో ఐశ్వర్య రాయ్ నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. దాదాపు 30 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. శేఖర్ కపూర్ రూపొందించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, షబానా అజ్మి జంటగా నటించారు. ఇప్పుడు వారి పాత్రల్లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ నటిస్తారని వార్తలొస్తున్నాయి. హిమేష్ రేషమ్మియా ఈ చిత్రాన్ని తాజాగా నిర్మించబోతున్నాడు. ఐశ్వర్య సౌలభ్యం మేరకు షెడ్యూల్ రూపొందించుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో త్వరలో ఐష్ రీఎంట్రీ మాత్రం ఖాయమనేది తెలుస్తోంది.