Oo Antava Maava Song Funny Video Shared by Devi Sri Prasad and Samantha - Sakshi
Sakshi News home page

Oo Antava Item Song: చిన్నారి నోట సమంత పాట.. సామ్‌, డీఎస్పీ రియాక్షన్‌

Published Mon, Dec 27 2021 7:42 PM | Last Updated on Mon, Dec 27 2021 9:29 PM

Samantha Shocking Reaction on Oo Antava Item Song Sung By Baby - Sakshi

'పుష్ప: ది రైజ్‌' సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన 'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ' సాంగ్‌. ఒక స్పెషల్‌ సాంగ్‌లో సామ్ నటిస్తొందన్న విషయం తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. రిలీజ్‌ అనంతరం కూడా ఈ పాట అదే రేంజ్‌లో యూట్యూబ్‌లో దూసుకుపోయింది. ఈ పాటకు ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చిందో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. ‘మీ మగ బుద్ది వంకర బుద్ధి’ అనే లిరిక్స్‌పై వివాదం చెలరేగింది. కానీ పాట మాత్రం అదిరిపోయే హిట్‌ సాధించింది. పాటలో తన సామ్‌ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఈ ఐటం సాంగ్‌లో చిందేసినందుకు సామ్‌ ఏకంగా రూ. 1.5 కోట్లు తీసుకుందని సమాచారం. 

'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ' పాటను స్పూఫ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేశారు నెటిజన్స్‌. అనేక మంది ఇన్‌ స్టా యూజర్లు ఈ పాటపై తమదైన  స్టైల్‌లో రీల్స్‌ చేసి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఈ సాంగ్‌పై వచ్చిన మీమ్స్‌ కూడా ఎంతగానో నవ్వించాయి. అందులో ఒక మీమ్‌ను సమంత షేర్‌ చేయడం విశేషం. ఈ సాంగ్‌ విడుదలైనప్పటి నుంచి అనేక మంది నోళ్లలో నానుతూనే ఉంది. ఎక్కడా ఓ చోట ఎవరో ఒక్కరూ ఈ పాటను హమ్‌ చేస్తున్నారు. తాజాగా తన చిట్టి పొట్టి మాటలతో ఈ పాట పాడుతూ ఆకట్టుకుంటోంది ఓ పాప. ఈ చిన్నారికి తన తల్లి 'హూ (Who)' అనే ఆంగ్ల పదం నేర్పుతూ ఉంటే.. పాప మాత్రం 'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ' అని పాడుతూ నవ్వు తెప్పిస్తోంది.  

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అలా వైరల్‌ అవుతూ సమంత దాకా చేరింది. దీంతో ఈ వీడియోను సామ్‌ షేర్‌ చేస్తూ 'డెడ్‌' అని రాసి.. మూడు లవ్‌ సింబల్స్‌తో తన ప్రేమను వ్యక్తపరిచింది. సామ్‌తో పా​‍టు పుష్ప మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ కూడా 'డామ్‌ క్యూటీ..' అని షేర్ చేస్తూ వీడియో పోస్ట్‌ చేసిన యూజర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. 
 


ఇదీ చదవండి: సమంతపై రామ్‌ చరణ్‌ ఆసక్తికర కామెంట్‌.. మూడు ముక్కల్లో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement