Samantha Item Song Oo Antava Song Full Video Out: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత డ్యాన్స్ చేసిన 'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ' సాంగ్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఈ ప్రత్యేక సాంగ్‌లో సమంత నటిస్తోందన్ని విషయం తెలిసినపపటి నుంచి ఈ పాటపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది. యూట్యూబ్‌లో సాంగ్ రిలీజైన తర్వాత అదే రేంజ్‌లో దూసుకుపోయింది. చంద్రబోస్ రాసిన ఈ పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్‌లో ట్రెండ్‌గా మారింది. సుమారు 90 మిలియన్ వ్యూస్‌ని సొంతం చేసుకున్న ఈ సాంగ్ 'టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ గ్లోబల్' జాబితాలో అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డ్ నెలకొల‍్పింది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్‌లో అల్లు అర్జున్, సమంత స్టెప్పులు, వారి హావభావాలు ప్రేక్షకులు, అభిమానులను కట్టిపడేసేలా ఉన్నాయి. సమంత హీరోయిన్‌గా రాణిస్తునే స్పెషల్ సాంగ్‌లో నటించి తానేంటో నిరూపించుకుంది. ఈ సాంగ్‌లో చిందేసినందుకు సామ్ ఏకంగా రూ. 1.5 కోట్లు తీసుకుందని సమాచారం. అయితే ఈ సాంగ్ ఫుల్ వీడియో ఎప్పుడెప్పుడూ వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు శుక్రవారం (జనవరి 7) 'ఊ అంటావా' పూర్తి పాటను విడుదల చేసి ఆశ్చర్యపరిచారు మేకర్స్. అలాగే 'పుష్ప: ది రైజ్' సినిమా కూడా శుక్రవారం నుంచే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.
ఇదీ చదవండి: చిన్నారి నోట సమంత పాట.. సామ్, డీఎస్పీ రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment