పుష్ప సాంగ్‌ క్రేజ్‌.. వారి స్టెప్పులకు సమంత ఫిదా! | Samantha Shares Pushpa Song Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Samantha: నేను ఇంకా బాగా చేయాల్సింది: సమంత పోస్ట్ వైరల్

Published Thu, Apr 18 2024 9:24 AM | Last Updated on Thu, Apr 18 2024 10:29 AM

Samantha Shares Pushpa Song Video Goes Viral On Social Media - Sakshi

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, రష్మిక జంటగా  నటించిన ఫుష్ప. ఈ సినిమా క్రేజ్ ‍గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 కూడా రాబోతోంది. అయితే పుష్పలో సమంత ఐటమ్‌ సాంగ్‌కు స్టెప్పులేయని వారు ఉండరు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ సాంగ్ క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చిత్రంలోని 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అనే సాంగ్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. 

అయితే తాజాగా ముగ్గురు చిన్నారులు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సుకుమార్ భార్య తబిత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన సమంత చిన్నారుల డ్యాన్స్‌కు ఫిదా అయిపోయింది. అంతే కాకుండా తగ్గేదేలే అంటూ పోస్ట్‌ చేసింది. ఈ వీడియో చూశాక నేను ఇంకాస్తా బెటర్‌గా చేయాల్సిందని ఫ‍న్నీ ఎమోజీతో పాటు లవ్‌ సింబల్‌ జత చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సమంత ఇండియన్ వర్షన్‌ సిటాడెల్‌  వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్‌ సరసన నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement