టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది యశోద మూవీతో మెప్పించిన సామ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఆ తర్వాత కోలుకుంది. ఇప్పుడిప్పుడే తన మళ్లీ రీస్టార్ట్ అవుతోంది. టాలీవుడ్ హీరో నాగచైతన్యను పెళ్లాడిన ముద్దుగుమ్మ ఆ తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండియా టుడే కాన్‌క్లేవ్ -2024లో పాల్గొన్న సామ్ తాను అందంగా.. ఇతర అమ్మాయిల్లాగా కూడా కనిపించడం కూడా లేదని వెల్లడించింది. అంతే కాకుండా పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడంపై సమంత మాట్లాడింది.
సమంత మాట్లాడుతూ... 'రాజీ (ఫ్యామిలీ మ్యాన్-2) చేయడం లాంటిదే ఇలాంటి నిర్ణయం. మీ చుట్టూ మంచి వ్యక్తులు లేకపోతే.. మన అభిప్రాయాలను గౌరవించుకోవడం మంచి విషయంగా భావిస్తున్నా. మరో వైపు నేను తప్పులు చేయాలి.. వాటి నుంచి నేర్చుకోవాలి. అలాగే నా గట్స్‌ను పెంచుకోవాలి. పుష్ప చిత్రంలో ఊ అంటావా.. అనే సాంగ్ చేయాలనే నిర్ణయం నాదే. నేను ఒక నటిగా ఆ కోణాన్ని అన్వేషించాల్సి సమయం వచ్చిందని' తెలిపింది.
ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఎప్పుడూ చాలా అసౌకర్యంగా ఉంటా. ఆ విషయంలో నాపై నాకు పూర్తి నమ్మకంగా లేను. నేను అందంగా లేను అనే భావన ఉంది. అంతే కాదు ఇతర అమ్మాయిల్లాగా కూడా కనిపించను" అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సెక్సీ అనే పదం తనకు సెట్ కాదని తెలిపింది. కాగా.. సమంత చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్‌తో కలిసి స్పై సిరీస్ సిటాడెల్ ఇండియన్ వర్షన్‌లో కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment