అలాంటి వ్యక్తిని కనుగొనడం చాలా అరుదు: సమంత పోస్ట్ వైరల్! | Samantha Ruth Prabhu Recently Visited The Isha Foundation In Coimbatore And Share Her Meditates Photos | Sakshi
Sakshi News home page

Samantha: అది కావాలంటే ప్రపంచాన్ని శోధించండి: సమంత పోస్ట్ వైరల్!

Published Tue, Jun 11 2024 6:43 PM

tollywood Actress Samantha Post Goes Viral On That Person To Find

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత రూత్ ప్రభు చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్‌ ఇండియా వర్షన్‌లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం సమంత ఏ సినిమాలోనూ నటించడం లేదు. గతేడాది మయోసైటిస్‌ కోలుకున్న సమంత పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. అందులో భాగంగానే ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తోంది తాజాగా సామ్ ఇషా ఫౌండేషన్‌లో మెరిసింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న ఇషా ఫౌండేషన్‌లో  నిర్వహించిన రిలాక్సింగ్ సెషన్‌లో పాల్గొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మనలో చాలా మంది గురువు కోసం వెతుకుతారు. కానీ మీ జీవితంపై అవగాహనతో వెలుగులు నింపి సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని మీరు కనుగొనడం అనేది చాలా అరుదైన సందర్భం. మీకు జ్ఞానం కావాలంటే ఈ ప్రపంచాన్ని శోధించండి. ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు చాలా సంఘటనలు ప్రభావం చూపుచతుంటాయి. మన ఆలోచన సాధారణమో.. అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక్కడ కేవలం పనిచేస్తానంటే సరిపోదు. మీకున్న తెలివిని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం' అంటూ పోస్ట్ చేసింది.

కాగా.. ఇటీవల సమంత ఆమె తన 37వ పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి బంగారం చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌పై రూపొందుతున్న తొలి చిత్రమిదే. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement