Isha Foundation
-
ఆధ్యాత్మికత ముసుగులో చిన్నారులపై లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్యాత్మికత ముసుగులో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కేంద్రంగా మారిందని ఈషా ఫౌండేషన్ పాఠశాల మాజీ ఉపాధ్యాయురాలు యామిని రాగాని, ఆమె భర్త సత్య ఎన్ రాగాని ఆరోపించారు. తమ కుమారుడిని తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు చెందిన పాఠశాలలో చదివించామని, ఆ సమయంలో అతడిపై తోటి విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించారు. ఇటీవల అక్కడి ఈషా హోమ్స్కూల్లోనూ విద్యార్థులపై ఈ తరహా ఉదంతాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే ఈషా యోగా కేంద్రంలో విద్యా కార్య క్రమాల పేరుతో ఈషా సంస్కృతికి చెందిన బాలికలతో అర్ధనగ్నంగా ఆధ్యాత్మిక దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ (సద్గురు)కు అన్ని విషయాలు తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. రాజమండ్రికి చెందిన ఈ దంపతులు కొంతకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈషా ఫౌండేషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.ఎన్నో దురాగతాలుయామిని రాగాణి మాట్లాడుతూ.. ఈషా ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు ఈషా విద్య, ఈషా సంస్కృతి, ఈషా హెూమ్ స్కూళ్లలో 8 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నట్లు తెలిపారు. ఈషా పాఠశాలలో 8 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం జరిగిన విషయాన్ని బయటికి రానివ్వలేదన్నారు. అదేవిధంగా 13 ఏళ్ల బాలుడిని 3 సంవత్సరాల పాటు వేధించినట్టు ఆరోపణలు వచ్చాయని, యాజమాన్యం నిర్లక్ష్యంతో 12వ తరగతి విద్యార్థి ఒకరు ఈ ఏడాది జూన్ 21న మృతి చెందాడని చెప్పారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడం, తమ కుమారుడు సైతం లైంగిక వేధింపులకు గురికావడంతో కలత చెందిన తాము ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చామని వెల్లడించారు.సద్గురుపై ఉన్న భక్తి, విశ్వాసంతో తాము కూడా తమ కుమారుడిని ఈషా పాఠశాలలో చదివించామని వివరించారు. లైంగిక వేధింపుల విషయం యాజమాన్యం దృష్టికి, తద్వారా జగ్గీ వాసుదేవ్ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. అంతర్గతంగా ఈ పాఠశాలల్లో జరుగుతున్న విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు తాను వలంటీర్ టీచర్‌గా ఫౌండేషన్‌లో రెండేళ్లు పనిచేసినట్టు యామిని రాగాని తెలిపారు. విద్యార్థులను బూతులు తిట్టడం, మానసికంగా, శారీరకంగా హింసించడం తాను ప్రత్యక్షంగా చూసి నట్టు చెప్పారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు హిందుత్వం అనే పదాన్ని వాడుతున్నారని ఆరోపించారు.బాధితులను నిర్వాహకులు బెదిరిస్తున్నారు‘తెల్లవారుజామున యోగా పేరిట బాలికలను సైతం అర్ధనగ్నంగా కూర్చోబెడుతున్నారు. ఈ విషయం గురించి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్, మరో ఇద్దరు ముఖ్యుల మధ్య ఈమెయిల్స్ నడిచాయి..’ అని యామిని, సత్య వెల్లడించారు. దీనిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటివరకు ఏడు బాధిత కుటుంబాలు తమ వెంట వచ్చాయని, మిగిలిన బాధితులతో కూడా కలిసి ముందుకు వెళతామన్నారు. అయితే ఫౌండేషన్ నిర్వాహకులు బాధితుల ను బెదిరిస్తున్నారని, స్థానిక పోలీసులను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, జగ్గీ వాసుదేవ్ వ్యవహారాలన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మాకు ప్రాణహాని ఉందిఈషా పాఠశాలలో చదువుతున్న తన ఏడేళ్ల కూతురుపై ఆ పాఠశాలలో పీఈటీ రెండేళ్ల పా టు అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు బాలిక తల్లి ఫోన్‌కాల్‌లో మీడియాకు తెలిపారు. ‘మేం ఎంతో మనోవేదన అనుభవించాం. ఈషా ఫౌండేషన్‌లో దుర్మార్గాలు బయట పెట్టాలంటే భయంగా ఉంది. మాకు ప్రాణహాని ఉంది. అందుకే నా వివరాలు చెప్పలేకపోతున్నాను. కానీ త్వరలోనే నేను కూడా మీడియా ముందుకు వస్తా..’ అని పేరు, వివరాలు చెప్పడానికి ఇష్టపడని ఆ బాధిత మహిళ వెల్లడించారు. -
ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
న్యూఢిల్లీ: తమిళనాడులో కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఇషా ఫౌండేషన్‌పై మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈషా ఫౌండేషన్‌లో తమ కూతుళ్లకు బ్రెయిన్ వాష్‌చేసి సన్యాసం వైపు మళ్లించారని ఆరోపిస్తూ ప్రొఫెసర్ వేసిన కేసు విచారణను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ కేసులో మద్రాస్ హైకోర్టు పూర్తి అనుచితంగా వ్యవహరించిందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇద్దరు మహిళలు గీత(42), లత(39) మేజర్లు కావడం, వారి ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో నివసిస్తున్నందున ఈ పిటిషన్ చట్టవిరుద్దమని, దీనిని తిరస్కరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.కాగా పిటిషనర్ కూతుళ్లలో ఒకరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను, నా సోదరి స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే ఈషా ఫౌండేషన్‌లో నివసిస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం, ఒత్తిడి లేదు. మా తండ్రి ఎనిమిదేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నారు’ అని కోర్టుకు తెలిపారు.కేసు పుర్వాపరాలు..ఈషా ఫౌండేషన్‌పై తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇద్దరు కుమార్తెలు గీత, లత ఈషా యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండి పోయారని, ఈశా కేంద్రంలో వారికి బ్రెయిన్ వాష్ చేసి సన్యాసంవైపు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఇద్దరు కుమార్తెలను తమకు అప్పగించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈషా యోగా కేంద్రంపై ఇప్పటి వరకు ఎన్ని క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి వివరాలు దాఖలు చేయాలని పోలీసులకు ఉత్తర్వులిచ్చింది. ఆశ్రమంలో ఉన్న అందరినీ విచారించాలని ఆదేశించింది. ప్రొఫెసర్ ఆరోపణలను ఈషా యోగా కేంద్రం తోసిపుచ్చింది. తాము ఎవర్నీ పెళ్లి చేసుకోమనిగానీ.. సన్యాసం తీసుకోవాలని గానీ సలహాలు ఇవ్వమని, ఎవరికి వారు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రకటన విడుదల చేసింది.దీనిపై ఈషా యోగా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం స్టే విధించింది. అలాగే స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసును స్పష్టం చేసింది. తాజాగా ఇద్దరు మహిళలు ఆ శ్రమంలో స్వచ్ఛందంగానే ఉంటున్నారని అత్యున్నత న్యాయస్థానానికి పోలీసులు వివరాలు సమర్పించారు. దీంతో కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. -
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సమంత.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో పయనిస్తోంది. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్.. సినిమాలేవీ పెద్దగా చేయడం లేదు. బాలీవుడ్లో సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీలో కనిపించనుంది. ఇందులో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.గతంలో ఆధ్యాత్మిక యాత్రలు చేసిన సమంత మరోసారి అమ్మవారికి పూజలు నిర్వహించింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో నవరాత్రుల సందర్భంగా పూజలో పాల్గొంది. దేవి అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది.కాగా.. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌తో సమంత పేరు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య- సమంత విడాకులను ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై టాలీవుడ్ ప్రముఖులంతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే నాగార్జునపై మంత్రిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సుప్రీం కోర్టులో ఈశా ఫౌండేషన్‌కు ఊరట
ఢిల్లీ: ఈశా ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని ఇటీవల పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఈశా ఫౌండేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. ఆశ్రమంలో పోలీసుల సోదాలు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు మహిళలతో ఆన్లైన్లో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నామని ఇద్దరు యువతులు తెలిపారు. ఈశా యోగా ఆశ్రమంలో తమిళనాడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. ఇక.. ఈ కేసులో పూర్తి స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 18కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.ఇక.. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ యోగా కేంద్రాన్ని మంగళవారం దాదాపు 150 మంది పోలీసు సిబ్బంది ప్రభుత్వ అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. -
కోర్టు ఆదేశాలు.. ఈశా ఫౌండేషన్‌లో పోలీసుల సోదాలు
చెన్నై: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన సొంత కూతురికి పెళ్లి చేసి సంప్రదాయబద్ధంగా స్థిరపడేలా ఏర్పాటు చేసిన వాసుదేవ్.. యువతులను ప్రాపంచిక వృత్తిని త్యజించమని, తల దువ్వుకుని, తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించింది.సోమవారం హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు ఎస్ఎం సుబ్రమణ్యం, వి.శివజ్ఞానం ఎదుట విచారణ విచారణకు వచ్చింది. విచారణ జరిగే సమయంలో కీలక కామెంట్స్ చేసింది. ఈశా పౌండేషన్‌కు సంబంధించి సమగ్ర నివేదికను సెప్టెంబర్ 4 (శుక్రవారం) లోపు కోర్టుకు అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ (69)హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో తన ఇద్దరు కుమార్తెల్లో శక్తి సామర్ధ్యాలను తగ్గేలా మందులు ఇచ్చారని, జుత్తు కత్తిరించుకుని తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించమని ప్రోత్సహించినట్లు ఆరోపించారు. ఈశా ఫౌండేషన్‌లో చేరితన పెద్ద కుమార్తె ..ప్రతిష్టాత్మక యూకే యూనివర్శిటీ నుంచి మెకాట్రానిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. 2008లో విడాకులకు ముందు అత్యధిక వేతనంతో ఉద్యోగం కూడా చేసింది. వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయారని, ఆ తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టినట్లు కామరాజ్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆమె ఈశా ఫౌండేషన్‌లో యోగా తరగతులకు హాజరుకావడం ప్రారంభించింది. కొంత కాలానికి ఐటీ ఉద్యోగం చేసిన నా చిన్న కుమార్తె సైతం ఈశా ఫౌండేషన్‌లో చేరింది. చివరికి శాశ్వతంగా ఆశ్రమంలోనే నివసించాలని నిర్ణయించుకున్నారు.న్యాయం చేయండిఇప్పుడు ఇంటికి రావడం లేదని, తన కుమార్తెల జీవితాన్ని జగ్గీ వాసుదేవ్ నాశనం చేశారని పిటిషనర్ కామరాజ్ తెలిపారు. కుమార్తెల జీవితం నాశనం అవ్వడంతో తన భార్య అనారోగ్యానికి గురయ్యారని, తనకు న్యాయం చేయాలని కోరారు. తన కుమార్తెలతో పాటు ఎందరో తల్లిదండ్రులకు దూరంగా ఈశా ఫౌండేషన్‌లో చేరి వారి జీవితాల్ని నాశనం చేసుకున్నట్లు చెప్పారు.క్రిమినల్ కేసులు నమోదుఇప్పటికే ఈశా ఫౌండేషన్‌లో పనిచేస్తున్న వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదైన విషయాన్ని పిటిషనర్ పిటిషన్లో ప్రస్తావించారు. ఇటీవల అదే సంస్థలో పనిచేస్తున్న ఓ వైద్యుడు ఆదివాసీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 మంది బాలికలను వేధించాడని,ఆయనపై పోక్సో కింద క్రిమినల్ కేసు నమోదయ్యాయని, అందుకు గల ఆధారాల్ని కోర్టుకు అందించారు. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణరిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ప్రతిస్పందనగా విచారణ మొదలైంది. తన ఇద్దరు కుమార్తెలను కేంద్రంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఉంచారని కామరాజ్ పేర్కొన్నారు. ఇషా ఫౌండేషన్ వ్యక్తుల బ్రెయిన్‌వాష్ చేసి, వారిని సన్యాసులుగా మారుస్తోందని, వారి కుటుంబాలతో సంబంధాలు కొనసాగించకుండా అడ్డుకుంటున్నదని కామరాజ్ ఆరోపించారు.ప్రతి స్పందనగా ఇషా ఫౌండేషన్ తరపు న్యాయవాది కె.రాజేంద్ర కుమార్, ఫౌండేషన్‌ను సమర్థించారు. ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించడంతోపాటు వారి జీవితాల గురించి వారి సొంత ఎంపికలు చేసుకునే హక్కు పెద్దలకు ఉందని నొక్కి చెప్పారు. ఈశా ఫౌండేషన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు కామరాజ్ ప్రయత్నించారని, తమ సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాదించారు. ఇరు పక్షాల వాదనలు హైకోర్టు ఎస్ఎం సుబ్రమణ్యం,వి.శివజ్ఞానం న్యాయమూర్తులు ఈశా ఫౌండేషన్‌లోని పద్ధతులపై ప్రశ్నలను లేవనెత్తారు. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసి స్థిరపడేలా చేశారని, కానీ యువతులను సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు.. ఈశా ఫౌండేషన్‌లో సోదాలుఅనంతరం, జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కోయంబత్తూర్ రూరల్ డిస్ట్రిక్ అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే. కార్తికేయన్ నేతృత్వంలో ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్లు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు 150 మంది పోలీసు అధికారుల బృందం కోయంబత్తూరులోని తొండముత్తూర్లోని మంగళవారం వెల్లియంగిరి పాదాల వద్ద ఉన్న ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో విచారణ చేపట్టారు.ఈ సోదాలపై ఈశా యోగా సెంటర్ ప్రతినిధులు అధికారికంగా స్పందించారు. ‘కోర్టు ఆదేశాల మేరకు..ఎస్పీలు ఇషా యోగా సెంటర్లో సాదారణంగా తనిఖీలు నిర్వహించారు. యోగా సెంటర్లో ఉండే వారిని, వాలంటీర్లను వారి జీవన విధానం ఎలా ఉంటుంది? ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా ఉంటున్నారు?’ అని ప్రశ్నలు వేసినట్లు చెప్పారు. -
అలాంటి వ్యక్తిని కనుగొనడం చాలా అరుదు: సమంత పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ ఇండియా వర్షన్లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం సమంత ఏ సినిమాలోనూ నటించడం లేదు. గతేడాది మయోసైటిస్ కోలుకున్న సమంత పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. అందులో భాగంగానే ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తోంది తాజాగా సామ్ ఇషా ఫౌండేషన్‌లో మెరిసింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న ఇషా ఫౌండేషన్‌లో నిర్వహించిన రిలాక్సింగ్ సెషన్లో పాల్గొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మనలో చాలా మంది గురువు కోసం వెతుకుతారు. కానీ మీ జీవితంపై అవగాహనతో వెలుగులు నింపి సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని మీరు కనుగొనడం అనేది చాలా అరుదైన సందర్భం. మీకు జ్ఞానం కావాలంటే ఈ ప్రపంచాన్ని శోధించండి. ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు చాలా సంఘటనలు ప్రభావం చూపుచతుంటాయి. మన ఆలోచన సాధారణమో.. అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక్కడ కేవలం పనిచేస్తానంటే సరిపోదు. మీకున్న తెలివిని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల సమంత ఆమె తన 37వ పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి బంగారం చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై రూపొందుతున్న తొలి చిత్రమిదే. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ (ఫొటో గ్యాలరీ)
-
ఏఐపై భవిష్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సామాన్యులు సైతం సులభంగా వినియోగించేలా చాట్‌జీపీటీ తరహాలో భారత్ సైతం చాట్ బాట్లను తయారు చేయాలని ఓలా అధినేత భవిష్ అగర్వాల్ పిలుపునిచ్చారు. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో జరిగిన ఇన్సైట్: ది డిఎన్ఎ ఆఫ్ సక్సెస్ 12వ ఎడిషన్‌లో అగర్వాల్ మాట్లాడారు. రోజువారీ వినియోగంలో ఏఐ పాత్రపై ఆయన నొక్కి చెప్పారు. ఏఐ గురించి మాట్లాడుతూ..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారత్ ప్రపంచ దేశాలకు దిశా నిర్ధేశం చేసే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ‘ఏఐ రెవెల్యూషన్ వేగంగా జరుగుతోంది. ఇది మనుషుల ప్రొడక్టివిటీని పెంచుతుంది. సైన్స్ ,ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది.అంతేకాదు జ్ఞానం, సృజనాత్మకత సరిహద్దులను చెరిపేస్తుంది. సాంకేతిక, ఆర్థిక పురోగతితో పాటుగా రీసెర్చ్ ,మెటాఫిజికల్ అన్వేషణ వంటి వివిధ ఏఐ అంశాలలో భారత్ అగ్రగామిగా వృద్ది సాధిస్తుందని భవిష్ అగర్వాల్ అభిప్రాయ పడ్డారు. -
ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!
తెలుగులోకి ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. పాత వాళ్లు మెల్లమెల్లగా కనుమరుగైపోతుంటారు. అలా పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా దాదాపు 20 ఏళ్ల క్రితమే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హీరోయిన్ గా చేస్తే రాని గుర్తింపు ఐటమ్ సాంగ్స్ తో సంపాదించింది. అలా ఓ ఐదేళ్ల పాటు వరసపెట్టి ఈమెని అవకాశాలు వరించాయి. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఇప్పుడేమో సడన్ గా ఓ ఆశ్రమంలో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఏం జరిగింది? ఈమె ఆమెనే పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు హంస నందిని. మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2004లో 'ఒక్కటవుదాం' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, ఈగ తదితర చిత్రాల్లో నటించింది. ఎప్పుడైతే ప్రభాస్ 'మిర్చి'లో ఐటమ్ సాంగ్ చేసిందో ఈమె ఫేట్ మారిపోయింది. స్పెషల్ సాంగ్స్ ల్లో అవకాశాలు వరసపెట్టి వచ్చాయి. అలా దాదాపు ఐదేళ్ల పాటు డ్యాన్సులతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. (ఇదీ చదవండి: క్రేజీ అడ్వెంచరస్ వెబ్ సిరీస్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్) ఐటమ్ గర్ల్ గా! 'మిర్చి'లో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత హంస నందిని.. భాయ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, జై లవకుశ చిత్రాల్లోని ప్రత్యేక గీతాలతో అలరించింది. 2018లో చివరగా గోపీచంద్ 'పంతం'లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. క్యాన్సర్ బారిన పడి! అయితే హంస నందిని సినిమాల్లో కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి మర్చిపోయారు. సడన్ గా 2021 చివర్లో ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను క్యాన్సర్ బారిన పడ్డాడని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. త్వరలో కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చెప్పినట్లుగానే మెల్లమెల్లగా ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడింది. ఈ మధ్యనే కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో కనిపించింది. ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈమెని నెటిజన్స్ తొలుత గుర్తుపట్టలేకపోయారు గానీ కాసేపటికి గుర్తుపట్టేశారు. ఎంతలా మారిపోయిందోనని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) (ఇదీ చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) -
Save Soil: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!
మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేశాడు. చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. గ్రహాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నాడు. ఆ గ్రహాల మీద నీరు... మట్టి కోసం అన్వేషిస్తున్నాడు. ప్రాణికోణి నివసించే అవకాశం ఉందా అని పరిశోధిస్తున్నాడు. భూమికి ఆవల ఏముందో తెలుసుకునే ప్రయత్నమిది. అయితే... భూమి ఏమవుతుందోననే స్పృహను కోల్పోతున్నాడు. మన కాళ్ల కింద నేల ఉంది... ఆ నేల మట్టితో నిండినది. ఆ మట్టిని కాపాడుకున్నప్పుడే మనకు మనుగడ. ‘మట్టి ప్రమాదంలో పడింది... మట్టి ఆరోగ్యాన్ని కాపాడుదాం’... ... అని నినదిస్తున్నారు సేవ్ సాయిల్ యాక్టివిస్ట్ ప్రొఫెసర్ జయలేఖ. కేరళలో పుట్టి తెలుగు నేల మీద పెరిగిన ప్రొఫెసర్ జయలేఖ కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడింది. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆమె బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ కోర్సు చేశారు. తొలి ఉద్యోగం ఇక్రిశాట్లో. ఆ తర్వాత బేయర్ మల్టీనేషనల్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేశారామె. పెర్ల్ మిల్లెట్ బ్రీడర్‌గా రిటైర్ అయిన తర్వాత ఆమె పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్నారు. ఆమె చదువు, ఉద్యోగం, అభిరుచి, అభిలాష అంతా నేలతో మమైకమై ఉండడంతో ఆమె ఉద్యమం కూడా నేలతో ముడివడి సాగుతోంది. మట్టికోసం సాగుతున్న ‘సేవ్ సాయిల్ గ్లోబల్ మూవ్మెంట్’లో చురుకైన కార్యకర్త జయలేఖ. ఆమె సాక్షితో మాట్లాడుతూ... ‘నేలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంద’న్నారు. ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్’ ప్రపంచాన్ని నిద్రలేపుతోంది. మట్టి ప్రమాదంలో పడిందని హెచ్చరిస్తోంది. వ్యవసాయ నేలల్లో 52 శాతం నిస్సారమైపోయాయని గణాంకాలు చెప్పింది. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే 2050 నాటికి 90 శాతం నేల నిస్సారమవుతుందని, ప్రపంచం ఆకలి కేకలకు దగ్గరవుతుందని ‘యూఎన్‌సీసీడీ’ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులు 30 శాతం పడిపోయాయి. ఇప్పుడు కూడా ఉద్యమించకపోతే... నిర్లిప్తంగా ఉండిపోతే... ఇది నా సమస్య కాదు... ఇందులో నేను చేయాల్సింది ఏమీ లేదు... అని నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే... వందేళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తోందని కూడా చెప్తోంది. సేవ్ సాయిల్ సామాజికోద్యమం అలా పుట్టిందే’ అని వివరించారు జయలేఖ. చైతన్య యాత్ర పిచ్చుక అంతర్థానమైన తర్వాత పర్యావరణం గురించి ఆలోచించాం. కానీ మట్టి విషయంలో చేతులు కాలిన తర్వాత చేయగలిగిందేమీ ఉండదు. అందుకే ముందుగానే అప్రమత్తం కావాలి. మట్టి ప్రమాదంలో పడిందని ఇప్పటి వరకు తెలిసింది మేధావులకు మాత్రమే. ఈ వాస్తవం సామాన్యుడికి కూడా తెలియాలి. సామాన్యుల్లో చైతన్యం రావాలి. అందుకే ‘మట్టిని రక్షించు’ అని యాత్ర మొదలైంది. కాన్షియస్ ప్లానెట్ చొరవతో మొదలైన సేవ్ సాయిల్ థీమ్ ఇది. ఈశా ఫౌండేషన్, సద్గురు జగ్గీవాసుదేవ్ చేపట్టిన వంద రోజుల బైక్ యాత్ర మార్చి 21న లండన్‌లో మొదలైంది. మే నెల 29 నాటికి మనదేశంలోకి వచ్చిన సేవ్ సాయిల్ యాత్ర... ఐదు రాష్ట్రాలను చుట్టి ‘మట్టిని రక్షించు’ నినాదంతో ఈరోజు హైదరాబాద్‌కు చేరనుంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడే ప్రభుత్వాలు తమ దేశంలో వాతావరణానికి, నేలతీరుకు అనుగుణంగా పాలసీలను రూపొందించడానికి ముందుకు వస్తాయి. అప్పుడే ఈ బృహత్తర కార్యక్రమం సఫలమవుతుంది. ఆ ఫలితం కోసమే మా ప్రయత్నం’’ అన్నారు జయలేఖ. – వాకా మంజులారెడ్డి మట్టికి ఆక్సిజన్ అందాలి మట్టి చచ్చిపోతోంది... చెట్టు ఎండిపోతోంది. మనిషి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన స్థితి. మట్టి సారం కోల్పోతే సంభవించే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే... ఆహార కొరత, నీటి కొరత, జీవ వైవిధ్యత నశించడం, వాతావరణంలో పెనుమార్పులు, జీవన భద్రత కోల్పోవడం, పొట్ట చేత పట్టుకుని వలసలు పోవడం వంటివన్నీ భవిష్యత్తు మానవుడికి సవాళ్లవుతాయి. ఎంత తెలుసుకున్నప్పటికీ చేయగలిగిందేమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. జీవం కోల్పోతున్న మట్టికి జవజీవాలనందివ్వాలి. వ్యవసాయ నేలలో ఏటా తప్పనిసరిగా యానిమల్ వేస్ట్, ప్లాంట్ డెబ్రిస్ ఇంకిపోవాలి. నేలను బీడు పెట్టకూడదు. చెట్టు పచ్చగా ఉంటే నేల చల్లగా ఉంటుంది. నేల సారవంతంగా ఉంటే చెట్టు ఏపుగా పెరుగుతుంది. ఈ రెండూ గాడిలో ఉన్నప్పుడే మనిషి విశ్వాన్ని జయించగలిగేది. (క్లిక్: మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?) మట్టికి ఏమైంది? మట్టిలో ఉండాల్సిన మైక్రో ఆర్గానిజమ్స్ నశించిపోతున్నాయి. అంటే మట్టిలో ఉండాల్సిన జీవం నిర్జీవం అవుతోంది. దాంతో మట్టిలోని సారం నిస్సారమవుంది. ఈ ఉపద్రవంలో కూడా అగ్రరాజ్యం అమెరికా పాత్ర తొలిస్థానంలో ఉంది. ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందనేది మనకు తెలియడం లేదు. కానీ ఇది భూగోళానికి మొదటి ప్రమాద హెచ్చరిక వంటిది. నేలలో సేంద్రియ పదార్థాల స్థాయి మూడు నుంచి ఆరుశాతం ఉండాలి. అలాంటిది యూరోపియన్ దేశాల్లో రెండు శాతానికి పడిపోయింది. మన దేశంలో అయితే 0.5 శాతమే ఉంది. ఆఫ్రికాదేశాల్లో మరీ అధ్వాన్నంగా 0.3 శాతం ఉంది. ఇలాంటి గణాంకాలు, నివేదికలు తెలిసిన వెంటనే ఇందుకు రసాయన ఎరువుల వాడకమే కారణం అంటూ... రైతును నిందిస్తుంటారు. అది పూర్తిగా తప్పు. వరదల కారణంగా భూమి కోతకు గురికావడం, అవగాహన లేక పంటలను మార్చకుండా ఒకే పంటను మళ్లీ మళ్లీ వేయడం... భూమిని బీడుగా వదిలేయడం వంటి అనేక కారణాల్లో రసాయన ఎరువులు ఒక కారణం మాత్రమే. అలాగే ఊరికి ఒకరో ఇద్దరో రైతులు ముందడుగు వేస్తే సరిపోదు. ప్రభుత్వాలు ముందుకు వచ్చి పాలసీలు రూపొందించాలి. – ప్రొఫెసర్ ఎ.కె. జయలేఖ, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి, savesoil.org -
ఈశా వేడుకల్లో సింగర్ మంగ్లీ స్వరాలు
సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుత సంగీత ప్రపంచంలో గాయని మంగ్లీది ప్రత్యేక స్థానం అని చెప్పనవసరం లేదు. జానపదాలు మొదలు బతుకమ్మ పాటల వరకు తన గానామృతంతో అందరినీ అలరిస్తోంది. ప్రతి పండుగకు తన కొత్త పాట సందడి చేయాల్సిందే. తన యాసతో ప్రకృతి, సంస్కృతి మిళితమైన జానపదాలు మొదలు సినిమా పాటల్లోనూ దూసుకుపోతుంది. వీటితో పాటు దక్షిణ భారతదేశంలో ఎవరికీ దక్కని అవకాశం మంగ్లీకి దక్కింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపెద్ద వేదికైన కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ నిర్వహించే మహాశివరాత్రి వేడుకల్లో తన గొంతును వినిపించనుంది. ప్రతి శివరాత్రికి ఈశా యోగా కేంద్రంలో ఘనంగా వేడుకలు జరగడం విదితమే. అయితే ఈసారి కోవిడ్ కారణంగా isha.sadhguru.org/msrలో ఇంగ్లిష్తో పాటు 11 భారతీయ భాషల్లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహాశివుడిని స్మరిస్తూ ఐదు పాటలు పాడనున్నట్లు మంగ్లీ తెలిపింది. కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు పార్థివ్ గోహిల్, ఆంధోని దాసన్, కబీర్ కేఫ్, సందిప్ నారాయణ్ తదితరులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
ఉపాధి పెంచే పెట్టుబడులు రావాలి
ఆర్థికంగా పురోగమించడంతో గడిచిన 20 ఏళ్లలో 24 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని... కరోనా వైరస్ కారణంగా ఎందరో పేదలు, వలస కార్మికులు మళ్లీ దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయే ప్రమాదం కనిపిస్తోందని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సద్గురు జగ్గీ వాసుదేవ్ హెచ్చరించారు. భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ పరిస్థితిని నివారించే అవకాశం ఉందన్నారు. ‘‘కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచదేశాలు తమ తయారీ వ్యవస్థల కోసం చైనా వెలుపలికి చూస్తున్నాయి. దీన్ని భారత్ అందిపుచ్చుకోవాలి’’ అని చెప్పారు. ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధితో ఆర్థికాంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారాయన. ఆ వివరాలివీ... ► కోవిడ్‌తో తయారీ రంగంలో చైనా ఆధిపత్యానికి బ్రేకులు పడొచ్చనే అంచనాలున్నాయి. అలా బయటకు వచ్చే సంస్థలు ఇండియావైపు చూసే అవకాశం ఉందా? కరోనా మహమ్మారితో మన ఆర్థికవ్యవస్థ కూడా బాగా దెబ్బతినేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభా ఉన్నా... ఆ స్థాయి ఆర్థిక వ్యవస్థ మనకు లేదు. ధనికులు ఈ పరిస్థితిని తట్టుకోవచ్చు కానీ రోజు కూలీలు చాలామంది ఎంతో దుర్భర స్థితిని ఎదుర్కొంటారు. వచ్చే రెండేళ్లలో భారీ పెట్టుబడులు గానీ రాకపోతే పెద్ద ఎత్తున జనం దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయే ప్రమాదముంది. చైనాపై ఇతర దేశాలకు నమ్మకం తగ్గుతోంది. అక్కడ భారీ పెట్టుబడులు పెట్టిన జపాన్... తమ కంపెనీలు చైనా నుంచి బయటకు వస్తే ప్రోత్సాహకాలిస్తోంది. ఇక అమెరికా ఇంతకన్నా ఎక్కువే చేయొచ్చు. అప్పుడు చైనాలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంతైనా ఇక్కడకు తరలిస్తే మనకు కలిసొస్తుంది. మన దేశానికి భౌగోళికంగా ఎన్నో అనుకూలతలున్నాయి. ఆయా దేశాలతో మనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ల పెట్టుబడులు ఇక్కడ సురక్షితమనే భావన కలిగించటం ముఖ్యం. ► చైనా వదిలి రావాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? చైనాలో 300కు పైగా విదేశీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో కొన్నయినా బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తాయి. అదే జరిగితే దాదాపు 150 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలిపోతాయి. వాటిలో కొంతయినా వచ్చే రెండేళ్లలో ఇక్కడికి వస్తే ఉపాధి గురించి ఆందోళన ఉండదు. కాకపోతే దీనికోసం ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థల నుంచి గట్టి ప్రయత్నాలు జరగాలి. అధికార పరమైన అడ్డంకులు లేకుండా, భూమి, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించడంతో పాటు.. అన్ని రకాల ఆమోదాలను ఒకే వేదికపై అందించే ఏర్పాట్లుండాలి. ► రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకోవాలంటారా? రాష్ట్రాలు ఇలాంటి భారీ పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుగా చట్టపరమైన మార్పులు తేవాలి. పరిశ్రమలన్నీ ఒకే చోట కాకుండా దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తరించాలి. దేశంలో వచ్చే పదేళ్లలో 20 కోట్ల మంది ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తారని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అదే జరిగితే నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. అందుకే వ్యాపారాలు నగరాల్లోనే కేంద్రీకృతం కాకూడదు. మన న్యాయవ్యవస్థలో జాప్యం ఎక్కువ కనుక భారీగా పెట్టుబడులు పెట్టేవారికి, వ్యాజ్యాల నుంచి కనీసం ఐదేళ్ల వరకైనా రక్షణ కల్పించాలి. ► కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ సరైనదేనా? వలస కార్మికులు, పేదలకు ఇంకా ఏం చేయాలి? రాజకీయ ఉద్యమాలతోనో, మిలిటరీ బలంతోనో దేశం అభివృద్ధి చెందదని అర్థం చేసుకోవాలి. వ్యాపారాభివృద్ధితోనే ఇది సాధ్యం. దురదృష్టవశాత్తు దేశంలో సోషలిస్టు భావాలున్న శక్తులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు ఏ ఆర్థిక సాయం చేసినా... ‘ధనికులు మరింత ధనికులు అవుతున్నారు’ అంటూ వీళ్ళు మాట్లాడతారు. డబ్బులివ్వడం ద్వారా పేదవారిని దారిద్య్రం నుంచి బయటకు తీసుకురాలేం. సరైన పరిశ్రమలతోనే ఇది సాధ్యం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కావాలి. అందరికీ గౌరవప్రదమైన జీవన భృతి దొరికేది అప్పుడే. (సాక్షి, బిజినెస్ ప్రతినిధి) -
సమానత్వం, రక్షణతోనే కులరహిత సమాజం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక సమానత్వం, సామాజిక రక్షణ సాకారమైనప్పుడే కులవ్యవస్థ రూపుమాసిపోతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీవాసుదేవ్ అన్నారు. దేశంలోని యువత శక్తిమంతానికి ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన యూత్ అండ్ ట్రూత్ (యువతా సత్యాన్ని తెలుసుకో) కార్యక్రమం గురించి వివరించేందుకు ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘దేశంలోని పలు ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎం కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో, మరోవైపు ఆన్లైన్లో ఇప్పటికే ఈ ప్రచారం ప్రారంభమైంది. మనదేశంలో 90 శాతంమంది యువత సరైన మార్గనిర్దేశనం, ప్రోత్సాహం లేక లక్ష్యం వైపు వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి వారి సందేహాలు నివృత్తి చేసి, సంకల్పబలం నింపి వారి ని లక్ష్యానికి చేరువ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం’అని జగ్గీ వివరించారు. కుటుంబంలో పర్యవేక్షణ కొరవడటం వల్లే కుటుంబంలో సరైన పర్యవేక్షణ కొరవడటం, సామాజిక పరిస్థితులను పిల్లలతో చర్చించకపోవడం వల్లే యువత మాదకద్రవ్యాలు, మానభంగాలు, ఇతర నేరప్రవృత్తికి అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 300 ఏళ్ల క్రితం ప్రపంచంలోని ప్రతీ అన్వేషకుడు భారత్ చేరడం లక్ష్యంగా సముద్రయానం చేశారని, ప్రస్తుతం మన యువత దేశాలు దాటిపోతోందని ఆవేదన చెందారు. విద్యార్థులు వ్యవసాయ రంగంపైనా అవగాహన పెంచుకోవాలన్నారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలనీ, వారంలో ఒకరోజు ఖాదీ వస్త్రాలు ధరించాలన్నారు. స్కూలు పిల్లలకు ఖాదీ వస్త్రాలనే యూనిఫారంలుగా వాడాలన్నారు. కేరళ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తోందని, మిగిలిన రాష్ట్రాలూ ఆ బాటలో నడవాలని హితవుపలికారు. చేనేత పరిరక్షణకు త్వరలోనే తాము అమెరికా, యూరోప్‌లో ప్రచారం చేస్తామన్నారు. సోమవారం పోచంపల్లిలో పర్యటించనున్నానని వెల్లడించారు. దేశంలో యువత ఆత్మహత్యలపై జగ్గీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది 8,600 మంది యువత ఆత్మహత్యకు పాల్పడగా, అందులో 7వేలకుపైగా 15 ఏళ్లలోపు వారు ఉండటం ఆందోళన కలిగించిందన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితులుగా ఉండాలన్నారు. తమ ఆశలను తీర్చేయంత్రాలుగా చూడకూడదని స్పష్టంచేశారు. ‘యువతా, సత్యాన్ని తెలుసుకో’కార్యక్రమాన్ని (ఇన్–హౌస్ ఈవెంట్) సెప్టెంబర్ 18న నల్సార్ ఆడిటోరియంలో నిర్వహించనున్నామన్నారు. ఆ తరువాత విద్యార్థులతో ‘‘వన్ నేషన్ – వన్ పోల్’’అనే అంశంపై చర్చ జరుపుతామన్నారు. -
పల్లెల్లో సౌకర్యాలు లేవు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో సౌకర్యాలు లేవని, గ్రామాలు, పట్టణాల మధ్య సౌకర్యాల్లో అంతరం తగ్గితేనే ప్రజల్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ హాలులో సీఆర్డీఏ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు జరిగే హ్యాపీ సిటీస్ సమ్మిట్ (ఆనంద నగరాల సదస్సు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సంభాషించారు. సౌకర్యాలన్నీ పట్టణాల్లోనే కేంద్రీకృతమవుతుండటంతో పల్లెల నుంచి జనం పట్టణాలకు తరలివస్తున్నారని, దీనివల్ల పట్టణ జనాభా పెరిగి సౌకర్యాలు తగ్గిపోతున్నాయని చెప్పారు. పల్లెల్లోనూ ఆహ్లాద, వినోద కార్యకలాపాలు పెరిగితే పట్టణాల్లో జనసమ్మర్థం తగ్గుతుందన్నారు. ఆనందం అనేది మానవులకే కాదని, అది అన్ని జీవరాశులకు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తూ అమరావతిని ఆనందనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రపంచ సంతోష నగరాల సదస్సును దేశంలో తొలిసారిగా అమరావతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐజీబీసీ–2018 గ్రీన్‌సిటీ ప్లాటినమ్ రేటింగ్ అవార్డుకు అమరావతి నగరం ఎంపికైందని సదస్సులో ప్రకటించిన ఆ సంస్థ చైర్మన్ ప్రేమ్ జైన్ దాన్ని సీఎం చంద్రబాబుకు అందించారు. అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దే మాస్టర్‌ప్లాన్‌ను జగ్గీవాసుదేవ్ ఆవిష్కరించారు. -
కోయంబత్తూరులోఆది యోగి విగ్రహం ఆవిష్కరణ
-
ప్రపంచశాంతికి యోగా
యోగాతో నేను నుంచి మనంకు ప్రయాణం ► సమాజంలో శాంతియుత సహజీవనం అవసరమన్న ప్రధాని ► కోయంబత్తూరులోఆదియోగి విగ్రహం ఆవిష్కరణ సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచమంతా శాంతిని కోరుకుంటోందని.. అందరూ కోరుకునే శాంతి యోగాతోనే సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాలకు యోగా పాస్‌పోర్టు వంటిదని చెప్పారు. కోయంబత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రంలో 112 అడుగుల ఎత్తున్న నూతనంగా నిర్మించిన ‘ఆదియోగి’ విగ్రహాన్ని ప్రధాని మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. ‘అందరూ ఆశిస్తున్న శాంతి యోగాతోనే సాధ్యం. యోగా కళను కాపాడుకోవడం ఎంతో అవసరం. మనిషిలోని శక్తిని యోగా కాపాడుతుంది, జీవం నుంచి శివం వద్దకు తీసుకెళుతుంది. మనస్సు, శరీరం, అంతరాత్మలను ఏకం చేసి నేను అనే స్వార్థం నుంచి మనం అనే నిస్వార్థం వైపు మళ్లించి అందరినీ ఏకం చేస్తుంది. అహం నుంచి నిరహంకార స్థితికి తీసుకెళ్లి జీవాత్మను పరమాత్మగా మారుస్తుంది’ అని మోదీ తెలిపారు. యోగా మనిషిలో నైతిక విలువలను పెంచుతుందని ప్రధాని తెలిపారు. శివుడు సర్వాంతర్యామి! ‘మహాదేవుడైన శివుడు సర్వాంతర్యామి. కాశీ నుంచి కోయంబత్తూరు వరకు ఆయన వ్యాపించి ఉన్నారు. ఇక్కడికి విగ్రహావిష్కరణకు ఎన్నో దేశాల నుంచి వివిధ సంప్రదాయాల వారు వచ్చినా అందరిలోని ఆధ్యాత్మికచింతన ఒక్కటే. శివుని మెడలో సర్పం, వినాయకుని వాహనం ఎలుక, సుబ్రహ్మణ్య స్వామి వద్ద నెమలి జన్మతః పరస్పరం శత్రువులు. అయితే శివైక్యం కావడం వల్ల అన్నీ కలిసి జీవిస్తున్నాయి. ఇదే భారతదేశంలోని శాంతియుత సహజీవనానికి నిదర్శనం. భిన్నధృవాలు కలిగిన మనిషి కూడా విభేదాలు విస్మరించి ఆధ్యాత్మిక చింతనతో ఏకీకృతం కావాలి. పాత ఆలోచనల స్థానంలో కొత్త చింతనలను స్వాగతించడం మన సంప్రదాయం, వాటిని సంస్కరించుకుని దైనందిన జీవితంలోకి తెచ్చుకుంటున్నాం. శివరాత్రి పండగ.. ప్రకృతిని కాపాడుకోవటంతోపాటు ఈ ప్రకృతికి అనుగుణంగా మన కార్యాచరణను రూపొందించుకునే జాగరూకత స్ఫూర్తికి నిదర్శనం’ అని మోదీ అన్నారు. ప్రకృతే దైవం ప్రకృతి, దేవుడు ఒక్కటేనని ప్రధాని మోదీ అన్నారు. అందుకే మన పూర్వీకులు ఈ విషయాన్ని వివిధ రకాల ప్రకృతి ఆరాధన ద్వారా మనకు అందించారన్నారు. అప్పటికీ, ఇప్పటికీ యోగా పద్ధతులు మారాయని.. ఎన్ని మార్పులొచ్చినా యోగాలోని మాధుర్యం మాత్రం తగ్గలేదన్నారు. భవిష్యత్ తరాలు యోగాను అర్థం చేసుకుని ఆచరించేలా ప్రేరేపించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ప్రధాని తెలిపారు. భిన్నత్వం ఘర్షణకు కారణం కాదని.. అదే మన సంస్కృతిలోని గొప్పదనమని ప్రధాని తెలిపారు. మోదీకి నిరసన దళితుల భూమిని లాక్కుని ఆదియోగి విగ్రహం నిర్మించారని, ఈ కార్యక్రమానికి మోదీ రాకను నిరసిస్తూ ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల బెలూన్లను వదిలి నిరసన తెలిపారు. రోడ్లపై ఆందోళనకు దిగిన 500 మంది కార్యకర్తలను కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు నినాదాలు చేశారు. మోదీ యోగా సాధన భేష్! అంతకుముందు ఆదియోగి విగ్రహానికి ప్రధాని మోదీ హారతినిచ్చి పుష్పాంజలి ఘటించారు. ఆదియోగి విగ్రహాన్ని ఎనిమిది నెలల్లో నిర్మించినట్లు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ వెల్లడించారు. యోగాను నిత్యం సాధన చేసే మోదీని ఆయన ప్రశంసించారు. ధ్యానలింగ మండపంలో కాసేపు మోదీ యోగాసనంలో కూర్చున్నారు. ‘ఆదియోగ’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా యువకులు చేసిన యోగానృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు, కోయంబత్తూరుకు చేరుకున్న మోదీకి తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి కే పళనిస్వామి స్వాగతం పలికారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ , పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రేపు బాబుతో జగ్గీ వాసుదేవన్ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవన్ ఆదివారం భేటీ కానున్నారు. మదీనగూడలోని చంద్రబాబు ఫాంహౌస్‌లో ఆయన కలుస్తారు. ఈ భేటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా పాల్గొంటారు. జగ్గీ వాసుదేవ్ గతంలో ఏపీ మంత్రులు, అధికారులకు యోగాలో శిక్షణనిచ్చారు. ఆ తర్వాత ఆయన సంస్థలు ఏర్పాటు చేసేందుకు కృష్ణా జిల్లాలో 400 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై అప్పట్లో రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలపడంతో ప్రభుత్వం వెనక్కితగ్గిన విషయం తెలిసిందే. -
రూ.1000 కోట్ల భూ దందా!
► విద్యాసంస్థల స్థాపన పేరుతో జగ్గీ వాసుదేవ్‌కు నజరానా ► కారుచౌకగా త్రిలోచనాపురం అటవీ భూముల విక్రయానికి సిద్ధం ► ఇషా ఫౌండేషన్‌కు కట్టబెట్టేందుకు యత్నాలు ► ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తున్న మంత్రి గంటా ► కేంద్ర ప్రభుత్వ ఆమోదం రావడమే తరువాయి నగర సమీపంలో రూ.1000 కోట్ల భూదందాకు రంగం సిద్ధమైంది. విద్యాసంస్థల స్థాపన పేరుతో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు అటవీ భూమిని ధారాదత్తం చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేశారు. ప్రభుత్వ పెద్దలు దగ్గరుండి మరీ ఈ తంతు నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : వెయ్యి కోట్ల రూపాయల విలువైన అటవీ భూమిని కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు వ్యూహం పన్నారు. ఇందుకు విద్యా సంస్థల స్థాపన పేరు సాకుగా చెబుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు ధారాదత్తం చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం అటవీ భూమిని ఇందుకు ఎంచుకున్నారు. చదునైన భూమి కావడం, పచ్చని చెట్ల మధ్య ఉండడం, చల్లని వాతావరణానికి అనుకూలమైన ప్రాంతం కావడంతో ఈ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. నాలుగు రోజుల కిందట పరిశీలన... త్రిలోచనాపురంలోని అటవీ భూములను ఈ నెల 15న మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ బాబు.ఎ, అటవీ శాఖ జిల్లా అధికారి రాజశేఖర్‌తో పాటు పలువురు రెవెన్యూ, అటవీ అధికారులు, యోగా గురువు జగ్గీ వాసుదేవ్ కలిసి పరిశీలించారు. వాసుదేవ్ ఈ భూమిని తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు గంటా ప్రకటించారు. ఆయన ఇషా ఫౌండేషన్ పేరుతో తమిళనాడులోని కోయంబత్తూరులో పలు విద్యా సంస్థలు నడుపుతున్నారు. విద్యా సంస్థలు కొత్త రాజధాని ప్రాంతానికి కావాలని, అందుకు వాసుదేవ్ ముందుకు వచ్చారని మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే విజయవాడ పరిసరాల్లో ఎన్నో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీలు ఉన్నాయి. ఇంత మొత్తంలో స్థలం ఇస్తే కాలేజీలు పెట్టేందుకు ముందుకు వచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. పైగా ఇషా ఫౌండేషన్ వారు పెడుతున్నది కొత్త కోర్సులేమీ కావు. లా కాలేజీ, ఎంబీఏ, సీఏ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు స్వయంగా వాసుదేవ్ చెప్పుకొన్నారు. 500 ఎకరాలు అప్పగించేందుకు ప్రతిపాదనలు... ఇక్కడ చదునైన భూమి 400 ఎకరాలు ఉంది. మరో 100 ఎకరాలు కొండ ప్రాంత భూమి కలిపి ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రి గంటా శ్రీనివాసరావు అటవీ భూమిని పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయించే పనిలో ఉండడంతో ఎలాగైనా వాసుదేవ్‌కు ఈ భూమిని అప్పగించేందుకు పావులు కదుపుతున్నారని అర్థమవుతోంది. అటవీ భూముల్లో అనుమతుల్లేకుండా చెట్లు కొట్టకూడదు. త్రిలోచనాపురం అటవీ ప్రాంతంలో భూమిని మాత్రం పూర్తిస్థాయిలో చెట్లు కొట్టి చదును చేశారు. ఎందుకు ఇలా జరిగిందంటే అటవీ శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు. ఎకరా రూ.2 కోట్లు... ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. ఇబ్రహీంపట్నానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఉంది. ఇంత విలువైన భూమిని ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు ఇచ్చేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తోందనేది చర్చనీయాంశంగా మారింది. ఇందులో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయనేది సుస్పష్టమని పలువురు పేర్కొంటున్నారు. ఇంకా ఫైనల్ కాలేదు -డీఎఫ్‌వో రాజశేఖర్‌బాబు త్రిలోచనాపురంలోని అటవీ భూములను ప్రైవేటు వారికి ఏ నిబంధన ప్రకారం ఇస్తున్నారనేది ఇంకా ఫైనల్ కాలేదని డీఎఫ్‌వో రాజశేఖర్‌బాబు చెప్పారు. ఇషా ఫౌండేషన్‌కు అటవీ భూములు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండడాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా.. మంత్రి, ఇతర అధికారులు వచ్చి చూసి వెళ్లారని తెలిపారు. అటవీ భూములు తీసుకోవాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.