ప్రపంచమంతా శాంతిని కోరుకుంటోందని.. అందరూ కోరుకునే శాంతి యోగాతోనే సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాలకు యోగా పాస్‌పోర్టు వంటిదని చెప్పారు. కోయంబత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రంలో 112 అడుగుల ఎత్తున్న నూతనంగా నిర్మించిన ‘ఆదియోగి’ విగ్రహాన్ని ప్రధాని మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. ‘అందరూ ఆశిస్తున్న శాంతి యోగాతోనే సాధ్యం. యోగా కళను కాపాడుకోవడం ఎంతో అవసరం.