Lord shiva
-
ఎత్తైన పంచముఖ మహాశివలింగం, కొలువైన శివపరివారం ఎక్కడో తెలుసా?
36 అడుగుల పంచముఖ మహాశివలింగం 12 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు, 40 అడుగుల ఎత్తున్న ఓంకార స్థూపం, అర్ధనారీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, శివపరివారం విగ్రహాలు ఇవన్ని ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా.. అదేనండీ అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ మొగల్రాజ పురంలోని శివగిరిపైన కొలువుదీరి భక్తులతో పూజలందుకుంటున్నాయి. శివపరివారాన్ని సాధారణంగా చిత్రపటాల్లోనే చూస్తు ఉంటాం కాని ఇక్కడ విగ్రహాల రూపంలో శివ పరివారాన్ని దర్శించుకోవచ్చు. అదెక్కడంటే విజయవాడ మొగల్రాజపురంలోని శ్రీవాగ్దేవీ జ్యోతిర్లింగ క్షేత్రం (శివగిరి)పై 36 అడుగుల ఎత్తు ఉన్న పంచముఖ మహాశివలింగం, శివలింగానికి ఎదురుగా 12 అడుగుల ఎత్తులో నందీశ్వరుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. 40 అడుగుల ఎత్తు్తన్న ఓంకార స్థూపం విజయవాడ నగరం మొత్తం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవే కాకుండా 36 అడుగుల పంచముఖ శివలింగం చుట్టూ దాద్వశ జ్యోతిర్లింగాలను శైవాగమం ప్రకారం ప్రతిష్టించారు. శివగిరిపైన శివపార్వతులు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, అయ్యప్ప, నంది, శృంగి, భృంగి, అర్ధనారీశ్వరుడు, నందీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, కనకదుర్గ, గజలక్ష్మి, సరస్వతి అమ్మవార్ల విగ్రహాలు కూడా కొలువుతీరాయి. గోశాలతోపాటుగా హోమగుండం కూడా ఉన్నాయి. శ్రీ చక్ర ఆకారంలో అష్టాదశ శక్తిపీఠాలను కూడా శివగిరిపై ప్రతిష్టించారు. (ప్రదోష కాలం అంటే ఏంటి, ప్రదోష పూజ ఎలా చేయాలి?) ఏడు అడుగుల నాగ పడగ, నాగదేవత విగ్రహాలు కూడా ఇక్కడ భక్తులతో పూజులు అందుకుంటున్నాయి. ప్రతి ఏడాది మహా శివరాత్రి రోజున చితాభస్మంతో శివలింగానికి అభిషేకం, కపాల హారతి నిర్వహిస్తుంటారు. ఉజ్జయిని నుంచి నాగసాధువులు, అఘోరాలు వివిధ అఖండాల (అఘోరాలు ఉండే అశ్రమాలు) నుంచి శివగిరిపై పూజలు నిర్వహిస్తారు. శివగిరి కొండపైన మరో వైపున 27 అడుగుల ఎత్తులో అభయ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. కొండ దిగువ నుంచి ఈ విగ్రహాన్ని చూసినప్పుడు కొండపై నుంచి ఆంజనేయస్వామి భక్తులకు అభయాన్ని అందిస్తున్నట్లుగా ఉంటుంది. పూజ చేస్తున్న ముస్లిం మహిళఎలా వెళ్ళాలంటే...ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల దగ్గర ఉన్న సున్నపుబట్టీల సెంటర్ నుంచి శివగిరిపైకి చేరుకోడానికి మెట్ల మార్గం ఉంది. శివగిరిపైనే పూజలకు అవసరమైన పూజాద్రవ్యాలతో పాటుగా తాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. కార్తికమాసం అన్ని రోజులు శివగిరిపై ప్రత్యేక పూజలతో పాటుగా ప్రతిరోజూ అన్నదానం నిర్వహిస్తారు. శివరాత్రి రోజున హిమాలయ నాగసాధువులచే చితాభస్మాభిషేకం, శివకళ్యాణంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివరాత్రి నాటితో పాటుగా కార్తికమాసంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను విజయవాడలోని రహదారులపై ఊరేగింపు జరుగుతుంది. ఈ విధంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో అక్కడ ఉండే ఒక ముస్లిం మహిళ వచ్చి శివుడుకి హారతులు ఇస్తారు. శివగిరిపైన భక్తులు వారి సొంత ఖర్చులతో శివలింగాన్ని ప్రతిష్టించుకోవచ్చునని శివగిరి వ్యవస్థాపకుడు మల్లికార్జునశర్మ చెప్పారు. (అన్నీ వింత సందేహాలే...బుర్ర తిరిగిపోతోంది..!) అంతా శివయ్య మహిమే!మా తల్లిదండ్రులు శివయ్యను పూజించేవారు. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, నాకు ఒకరోజు కలలో స్వామి వారు దర్శనం ఇచ్చి కొండపై పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించు, నీకు సాధ్యం అవుతుంది, అంతా నేను చూసుకుంటా అని చెప్పినట్లుగా అనిపించింది. అప్పటి నుంచి ఇంటి దగ్గర ఉన్న కొండపై ఈ పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించాను. శివయ్యే నా ద్వారా ఇదంతా చేయిస్తున్నాడు. మల్లికార్జున శర్మ, శివగిరి వ్యవస్థాపకుడు మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి శివయ్యను దర్శించుకుని వద్దాం. .పదండి...– కొండిబోయిన సుబ్రమణ్యం – సాక్షి, మొగల్రాజపురం, విజయవాడ తూర్పు -
ప్రదోష కాలం అంటే ఏంటి, ప్రదోష పూజ ఎలా చేయాలి?
జాతకంలోని ఎలాంటి దోషాన్నైనా శివుడు తొలగిస్తాడు. అందుకు ప్రదోష కాలంలో శివార్చన చేయాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గత జన్మలలో చేసిన పాపాలు కూడా ప్రదోషకాల పూజలో పాల్గొంటే తొలగిపోతాయి. అలాగే ప్రదోష వ్రతాన్ని ఆచరించే వారికి సకలసంపదలు చేకూరుతాయని శాస్త్రోక్తి. రోజూ సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాలు, తర్వాత 24 నిమిషాలు.. అంటే మొత్తం 48 నిమిషాలను ప్రదోష కాలం అంటారు. ఇది నిత్య ప్రదోషకాలం. కృష్ణపక్ష త్రయోదశిని పక్ష ప్రదోషం అంటారు. శుక్లపక్ష త్రయోదశి తిథిలో వచ్చే ప్రదోషాన్ని మాస ప్రదోషం అంటారు ముఖ్యంగా శనివారం, శుక్లపక్ష త్రయోదశి తిథిలో వచ్చే ప్రదోషాన్ని మహా ప్రదోషం అంటారు. దీన్నే శని మహాప్రదోషం అని పిలుస్తారు. దేవతలు పాలకడలిని చిలికినప్పుడు వెలికి వచ్చిన విషాన్ని శివ పరమాత్ముడు తీసుకుని.. లోకాన్ని సంరక్షించిన రోజును శనిప్రదోషంగా పిలుస్తారు. సంవత్సరమంతా వచ్చే ప్రదోషాలకు ఉపవాసం వుండకపోయినా పర్లేదు. కానీ శనివారం వచ్చే ప్రదోషం రోజున ఉపవసించి.. శివార్చన చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని.. ఆ సమయంలో దేవాలయాల్లో వెలసిన మహేశ్వరుడిని స్తుతించడం, ఆరాధించడం, పూజించడం, అభిషేకించడం ద్వారా జాతకదోషాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం. ప్రదోష కాల పూజ చేస్తే.. శివుడిని మాత్రమే కాదు.. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. (అన్నీ వింత సందేహాలే...బుర్ర తిరిగిపోతోంది..!) ఇదీ చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలు ఇంకా నందీశ్వరుడికి తగిన గౌరవం ఇచ్చేది ప్రదోషకాల పూజనే. నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నందీశ్వరుడిని ప్రదోష కాలంలో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అన్ని చదువులున్నా.. నందీశ్వరుడు వినయంతో వుంటాడని.. శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నందీ శ్వరుడు నివృత్తి చేస్తాడని నమ్మకం. ప్రదోషకాల పూజలో పాల్గొంటే బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం దక్కు తుంది. ప్రదోష కాలంలో ఆవు పాలతో శివునికి అభిషేకం చేయించి, బిల్వ పత్రాలు, శంఖుపూలను సమర్పించుకుని స్తుతిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం 4.30 నుంచి ఆరుగంటల వరకు గల సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో శివార్చన ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి.ఈ శని ప్రదోషాల్లో స్వామిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. -
లవణాసుర సంహారం
కృతయుగంలో లోల అనే దానవ స్త్రీ ఉండేది. ఆమె కొడుకు మధువు. దానవుడే అయినా మధువు ధర్మం తప్పక దేవతలతో మైత్రి కలిగి ఉండేవాడు. బ్రాహ్మణులను ఆదరించేవాడు. ఆపన్నులను ఆదుకునేవాడు. మధువు పరమశివుడి కోసం తపస్సు చేశాడు. పరమశివుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. తన శూలం నుంచి మరో శూలాన్ని పుట్టించి, వరప్రసాదంగా ఇచ్చాడు. ‘నువ్వు దేవ బ్రాహ్మణులకు అపచారం చేయనంత కాలం ఈ శూలం నీ వద్ద ఉంటుంది. ఇది నీ శత్రువులను నాశనం చేస్తుంది’ చెప్పాడు పరమశివుడు.‘పరమేశ్వరా! ఈ శూలం నా వంశంలో కొనసాగేలా అనుగ్రహించు’ ప్రార్థించాడు మధువు.‘అది కుదరదు. నీ కొడుకు వరకు మాత్రం ఉంటుంది’ అన్నాడు శివుడు.తర్వాత మధువు ఒక సుందర ప్రదేశంలో భవంతిని, దాని చుట్టూ సుందర నగరాన్ని నిర్మించుకున్నాడు. కుంభీనసి అనే దానవకాంతను పెళ్లాడాడు. కొంతకాలానికి వారిద్దరికీ లవణుడు పుట్టాడు.పెరిగి పెద్దయ్యే కొద్ది లవణుడు దుష్టుడిగా తయారయ్యాడు. కొడుకు చేష్టలకు మధువు కలతచెందేవాడు. కొంతకాలానికి మధువు తనకు శివుడు ప్రసాదించిన శూలాన్ని కొడుక్కు అప్పగించి, వరుణ లోకానికి వెళ్లిపోయాడు.తండ్రి నుంచి శివప్రసాదిత శూలం చేజిక్కిన తర్వాత లవణుడి ఆగడాలు మరింతగా శ్రుతిమించాయి. అతడిని ఎదిరించడానికి రాజులందరూ భయపడేవారు. రావణ సంహారం తర్వాత అయోధ్యలో కొలువుదీరిన రాముడి వద్దకు ఒకనాడు కొందరు మునులు, బ్రాహ్మణులు వచ్చి, లవణుడి ఆగడాలను గురించి మొరబెట్టుకున్నారు. ‘రామా! లవణాసురుడు నానాటికీ శ్రుతి మించుతున్నాడు. ఎందరో రాజులను వేడుకున్నాం. వారందరూ అతడిని ఎదిరించడానికి భయపడుతున్నారు. రావణుడిని సంహరించిన నువ్వే మాకు దిక్కు అని నీ వద్దకు వచ్చాం’ అని చెప్పారు.వారి మొర విన్న రాముడు తన తమ్ముళ్లను పిలిచాడు.‘మీలో ఎవరు లవణుడిని సంహరించడానికి వెళతారు?’ అని అడిగాడు.ముందుగా భరతుడు ‘నేను వెళతా’ అంటూ సిద్ధపడ్డాడు. అంతలో శత్రుఘ్నుడు కలగజేసుకుని, ‘అన్నా! నువ్వు అరణ్యవాసం చేసి, అయోధ్యకు తిరిగి వచ్చేంత వరకు భరతుడు నానా కష్టాలు పడ్డాడు. ఇకనైనా భరతుణ్ణి సుఖంగా ఉండనివ్వు. నేను వెళ్లి లవణాసురుణ్ణి చంపి వస్తాను’ అని చెప్పాడు. ‘తమ్ముడా! నువ్వు సర్వసమర్థుడివి. నువ్వా రాక్షసుణ్ణి చంపి, అతడి రాజ్యాన్ని ధర్మయుక్తంగా పాలించుకో’ అన్నాడు. వెంటనే పురోహితులను పిలిపించి, శత్రుఘ్నుడికి పట్టాభిషేకం చేశాడు. ‘లవణుడి వద్ద శివప్రసాదిత శూలం ఉంటుంది. దానిని అతడు ఇంటివద్ద వదిలి, దూరంగా వెళ్లినప్పుడే అదను చూసి అతణ్ణి చంపాలి’ అని చెప్పి, అనేక దివ్యాస్త్రాలను తమ్ముడికి ఇచ్చాడు.శత్రుఘ్నుడు చతురంగ బలగాలతో బయలుదేరాడు. లవణుడు ఆహారం కోసం బయటకు వెళ్లి, పట్టణానికి తిరిగి వచ్చేసరికి పట్టణ ప్రవేశద్వారం వద్ద శత్రుఘ్నుడు ధనుర్బాణాలు ధరించి నిలిచి ఉన్నాడు. చుట్టూ సైన్యం మోహరించి ఉంది. ‘ఎవడ్రా నువ్వు? ఆయుధాలతో నా పట్టణం ముందు నిలబడ్డావు. నీలాంటి వాళ్లెందరో నాకు ఆహారమైపోయారు. మర్యాదగా అడ్డు తొలగు’అన్నాడు లవణుడు. ‘నేను దశరథ పుత్రుణ్ణి. శ్రీరాముడి తమ్ముణ్ణి. నీతో యుద్ధానికి వచ్చాను’ నిదానంగా బదులిచ్చాడు శత్రుఘ్నుడు.‘అలాగా! నా మేనమామ రావణుణ్ణి చంపినవాడి తమ్ముడివన్నమాట! నీ కోరిక తప్పక తీరుస్తాను. లోపలకు వెళ్లి నా ఆయుధాన్ని తెచ్చుకోనీ’ అన్నాడు. ‘చేతికి చిక్కిన శత్రువును విడిచిపెట్టేంత అమాయకుణ్ణి కాదు. ఇప్పుడే నా బాణాలతో నిన్ను యమపురికి పంపిస్తాను’ అంటూ శత్రుఘ్నుడు ధనుష్టంకారం చేశాడు. చిర్రెత్తిపోయిన లవణుడు పక్కనే ఉన్న భారీ చెట్టునొకటి పెరికి, శత్రుఘ్నుడి మీదకు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం మొదలైంది. చెట్లతో లవణుడు, బాణాలతో శత్రుఘ్నుడు హోరాహోరీగా పోరాడారు. పరస్పరం గాయపరచుకున్నారు. లవణుడు విసిరిన భారీ చెట్టు శత్రుఘ్నుడి తలను తాకడంతో అతడు స్పృహ తప్పాడు.శత్రుఘ్నుడు మరణించాడని తలచిన లవణుడు తన శూలం కోసం ఇంటికి పోకుండా, అక్కడే ఉండి తెచ్చుకున్న ఆహారం తినడం ప్రారంభించాడు.ఈలోగా స్పృహలోకి వచ్చిన శత్రుఘ్నుడు తనకు రాముడు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని సంధించి, లవణుడి మీదకు వదిలాడు. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకొచ్చిన ఆ దివ్యాస్త్రం లవణుడి గుండెల్లోంచి దూసుకుపోయి, పాతాళానికి వెళ్లి తిరిగి వచ్చి శత్రుఘ్నుడి అమ్ముల పొదిలోకి చేరింది. లవణుడు హాహాకారాలు చేస్తూ మరణించాడు. -
ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు
విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ . మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటివారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.కాగా ‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించినట్లు వెల్లడించి, ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు’ అని ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై ఉంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. -
'ఉనకోటి': నేలకు దిగివచ్చిన కైలాసం..!
నేలకు దిగివచ్చిన కైలాసం. ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ. త్రిపురలోని అందమైన పర్యాటక ప్రదేశం. ప్రకృతి ఒడిలో కొలువైన భారీ శిల్పాలు. హెరిటేజ్ సైట్ హోదా సొంతమైన చరిత్ర.ఈశాన్య రాష్ట్రాల టూర్లో ప్రకృతి పచ్చదనానిదే పైచేయి. జనారణ్యానికి దూరంగా వెళ్లే కొద్దీ అచ్చమైన స్వచ్ఛత ఒడిలోకి చేరుకుంటాం. చెట్లు చేమలు నిండిన పచ్చటి కొండలు బారులుతీరి ఉంటాయి. రఘునాథ హిల్స్‌లో పచ్చదనం లోపించిన కొండవాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరికించి చూస్తే అందమైన రూపాలు కనువిందు చేస్తాయి. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, దుర్గాదేవి, గంగ, ఇతర కైలాసగణమంతా కొలువుదీరినట్లు ఉంటుంది. ఇంతటి భారీ శిల్పాలను ఎవరు చెక్కి ఉంటారు? ఎప్పుడు జరిగిందీ వింత? ఉనకోటి శిల్పాల సముదాయాన్ని ఏడు నుంచి తొమ్మిది శతాబ్దాల మధ్యలో చెక్కి ఉండవచ్చనేది ఆర్కియాలజిస్టుల అంచనా. ‘కల్లు కుమ్హార్’ అనే గిరిజన శిల్పకారుడు ఈ శిల్పాలను చెక్కినట్లు స్థానికులు చెబుతారు. కైలాస పర్వతంలోని శివపార్వతులను దర్శించుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, ఆ రూపాలను, కైలాసాన్ని కళ్లకు కట్టడానికే ఈ శిల్పాలను చెక్కాడని చెబుతారు.క్రీ.శ 16వ శతాబ్దంలో కాలాపహాడ్ అనే మొఘలు గవర్నర్ భువనేశ్వర్‌లోని శివుడిని, ఉనకోటికి సమీపంలో ఉన్న తుంగేశ్వర శివుడిని ధ్వంసం చేశాడని, ఈ ప్రదేశం మీద దాడిచేయడానికి అతడు చేసిన ప్రయత్నం కుదరక వదిలేసినట్లు చెబుతారు. ఇక్కడ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ‘అశోకాష్టమి మేళా’లో ఈశాన్యరాష్ట్రాలన్నింటి నుంచి వేలాదిగా భక్తులు పాల్గొంటారు. జనపద కథనం...శివుడితోపాటు కోటిమంది కైలాసగణం కాశీయాత్రకు బయలుదేరింది. ఈ ప్రదేశానికి వచ్చేసరికి చీకటి పడింది. ఆ రాత్రికి ఈ అడవిలోనే విశ్రమించారంతా. తెల్లవారక ముందే నిద్రలేచి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని, ఆలస్యమైతే రాళ్లలా మారిపోతారని, నిద్రకుపక్రమించే ముందు శివుడు అందరినీ హెచ్చరిస్తాడు. చెప్పిన సమయానికి శివుడు తప్ప మరెవరూ నిద్రలేవలేకపోవడంతో మిగిలిన వారంతా శిలలుగా మారిపోయారు. కోటి మంది బృందంలో శివుడు మినహా మిగిలిన వారంతా శిలలు కావడంతో ఈ ప్రదేశానికి ‘ఉనకోటి’ అనే పేరు వాడుకలోకి వచ్చిందని స్థానికులు ఆసక్తికరమైన కథనం చెబుతారు. ఆ కథనం ప్రకారమైతే ఈ శిల్పాల సముదాయంలో శివుడి శిల్పం ఉండకూడదు, కానీ శివుడి శిల్పం కూడా ఉంది. దేశంలో అత్యంత పెద్ద శివుడి శిల్పం ఇదే. వాస్తవాల అన్వేషణకు పోకుండా ఆ శిల్పాల నైపుణ్యాన్ని ఆస్వాదిస్తే ఈ టూర్ మధురానుభూతిగా మిగులుతుంది. పెద్ద శివుడు ఈ భారీ శివుడి పేరు ఉనకోటేశ్వర కాలభైరవుడు. విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంటుంది. తలమీద ఎంబ్రాయిడరీ చేసిన తలపాగా ధరించినట్లు చెక్కారు. ఆ తలపాగా ఎత్తు పది అడుగులుంది. తలకు రెండు వైపులా సింహవాహనం మీద దుర్గాదేవి, గంగామాత శిల్పాలుంటాయి. నంది విగ్రహం సగానికి నేలలో కూరుకుపోయి ఉంటుంది. గణేశుడు ప్రశాంతంగా మౌనముద్రలో ఉంటాడు. ఈ శిల్పాలు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్నాయి. ప్రధానమైన వాటిని చూడడంతోనే మనకు శక్తి తగ్గిపోతుంది. కొన్ని శిల్పాలను సమీప గ్రామాల వాళ్లు ఇళ్లకు పట్టుకుపోగా మిగిలిన వాటి కోసం ఇండియన్ ఆర్కియాలజీ సర్వే నోటిస్ బోర్డులుంటాయి. ఏఎస్ఐ అడవినంతా గాలించి, పరిశోధించింది. ఏఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ప్రదేశం హెరిటేజ్ సైట్ల జాబితాలో చేరింది. యునెస్కో గుర్తించి సర్టిఫికేట్ జారీ చేసే లోపు చూసివద్దాం.ఉనకోటి ఎక్కడ ఉంది!త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి 178 కి.మీ.ల దూరంలో ‘కైలాస్‌హర’ పట్టణానికి దగ్గరగా ఉంది. ఎలా వెళ్లాలంటే... సమీప విమానాశ్రయం అగర్తలలో ఉంది. సమీప రైల్వేస్టేషన్ కుమార్‌ఘాట్‌లో ఉంది. ఇది ఉనకోటికి 20 కి.మీ.ల దూరంలో ఉంది.ఎప్పుడు వెళ్లవచ్చు!ఇది పర్వతశ్రేణుల ప్రదేశం కాబట్టి వర్షాకాలం మంచిది కాదు. అక్టోబర్ నుంచి మే నెల మధ్యవాతావరణం అనువుగా ఉంటుంది. – వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: భావోద్వేగాల 'కిజిక్ తివాచీ'..!) -
శివయ్య ప్రీతికి ‘శంఖు’ నాదం : దంపతులకు అవార్డు
రాజమహేంద్రవరం రూరల్: శివయ్యను ప్రసన్నంచేసుకునేందుకు భక్తులు అనేకమార్గాలను అనుసరిస్తారు. శంఖాన్ని ఏకబిగిన పూరిస్తూ మహాదేవుడిని ఆనందింపచేస్తారు మరికొందరు. శ్వాసను బిగించి ఏకధాటిగా దాదాపు ఇరవై నిముషాల పాటు శంఖాన్ని పూస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తున్న ఎస్పీఎఫ్ కమాండెంట్ నర్సింహరావు, అలివేలు మంగాదేవి దంపతులకు ఆధ్మాత్మిక సంపూర్ణత్వంతో పాటు, భౌతికంగా కూడా అవార్డులు వరిస్తున్నాయి. వీరు చేసే ఆధ్యాత్మిక సేవ అవార్డుల కోసం కాకపోయినప్పటికీ శంఖనాదంలో వీరి నిపుణతకు హైదరాబాదుకు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కామధేను –2024 అవార్డ్స్‌లో భాగంగా జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆదివారం (డిసెంబరు 14) హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో నరసింహారావు దంపతులు ఈపురస్కారాన్ని అందుకోనున్నారు.ఈ సందర్భంగా తమ ఆధ్యాత్మిక మార్గం, శంఖునాదం సాధన గురించి నర్సింహరావు మాటల్లో.. డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా పి.గన్నవరం తమ స్వగ్రామం. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఏపి ప్రత్యేక రక్షణ దళం(ఏపీఎస్పీఎఫ్) కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా. తన భార్య అలివేలు మంగాదేవి గృహిణి. తమకు శివుడు అంటే ఎనలేని భక్తి. తాను 1989లో పశ్చిమబెంగాల్ సిలిగురి ప్రాంతంలో సరిహద్దు భద్రత దళంలో పనిచేసే సమయంలో బెంగాలీ పూజారి చక్రవర్తి వద్ద శంఖం పూరించడంలో మెలుకువలు నేర్చుకున్నాను. అదే స్పూర్తితో తన భార్య మంగాదేవికి కూడా ఈ విద్యలో పట్టుసాధించారు. దీంతో తమకు ‘అఖండ శంఖారావ యుగళం’గా పేరొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళ,తమిళనాడు ,కర్ణాటక, డిల్లీ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో 35 ఏళ్లుగా సొంత ఖర్చులతో ఇంతవరకు నాలుగువేలకు పైగా కార్యక్రమాలు తమ శంఖారావంతో ఆరంభమయ్యాయంటారు ఈ దంపతులు ఇంకా గోదావరి,కృష్ణాపుష్కరాలు, ఇబ్రహీంపట్నం పవిత్ర నదీసంగమ అనుసంధానం వంటి పెద్దపెద్ద కార్యక్రమాల్లో శుభసూచికంగా అఖండ శంఖారావం పూరించాం. ఈసందర్బంగా పలు సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లు, అవార్డులు, సత్కారాలు, సువర్ణ ఘంటాకంకణాలు లభించాయన్నారు. ఇదంతా కేవలం సాధనతోనే సాధ్యమైందని, పదేళ్లపాటు దీన్ని సాధన చేశామని నరసింహారావు దంపతులు పేర్కొన్నారు. -
ఉపమన్యుడి వృత్తాంతం
ఉపమన్యుడి పసితనంలోనే అతడి తండ్రి వ్యాఘ్రపాదుడు కన్నుమూశాడు. వ్యాఘ్రపాదుడి అకాల మరణంతో అతడి భార్య కొడుకు ఉపమన్యుడితో పాటు పుట్టింటికి చేరుకుంది. మేనమామల ఇంట ఉపమన్యుడికి ఆదరణ కరవైంది. మేనమామల పిల్లలు రుచికరమైన పదార్థాలు భుజిస్తుండేవారు. పుష్కలంగా పాలు తాగుతుండేవారు. ఉపమన్యుడికి ఆకలి వేసినప్పుడు తగినన్ని పాలు కూడా దొరికేవి కాదు. ఉపమన్యుడు మేనల్లుడే అయినా, అతడి తల్లి తమ తోబుట్టువే అయినా, వారు అనాథలు కావడంతో మేనమామలు వారిని తగిన విధంగా ఆదరించేవారు కాదు.ఒకనాడు ఉపమన్యుడు పాలకోసం తల్లి వద్ద మారాం చేశాడు. కొడుకు అవస్థకు కన్నీళ్లు పెట్టుకున్న ఆ తల్లి తన కన్నీళ్లలోనే కాసింత పేలపిండిని కలిపి, అవే పాలు అని ఇచ్చింది. ఒక్క గుక్క తాగగానే అవి పాలు కాదని గ్రహించిన ఉపమన్యుడు, వాటిని తోసిపుచ్చాడు. పట్టరాని దుఃఖంతో, ఉక్రోషంతో ఏడుపు లంకించుకున్నాడు.నిస్సహాయురాలైన ఆ తల్లి అతడిని రకరకాలుగా లాలించింది. తన పరిస్థితిని వివరించింది. దుఃఖం నుంచి తేరుకున్న ఉపమన్యుడు తల్లి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ‘అమ్మా! నన్ను దీవించి పంపించు. శివుడి కోసం తపస్సు చేసి, పాల సముద్రాన్నే తెచ్చుకుంటాను’ అని ఆవేశంగా పలికాడు. సరేనన్న ఆ తల్లి అతడికి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించింది. ‘నాయనా! మన శైవులకు పంచాక్షరి మంత్రమే మహాయుధం. దీనినే అఘోరాస్త్రం అంటారు. ఎంత ఘోరమైన ఆపదనైనా తప్పిస్తుంది’ అని చెప్పి, తన భర్త నుంచి సంక్రమించిన విరజా భస్మాన్ని కొడుకు చేతికిచ్చింది. తపస్సు చేసుకోవడానికి అనుమతిస్తూ, శీఘ్రసిద్ధి కలగాలంటూ ఆశీర్వదించి సాగనంపింది.తల్లి అనుమతితో ఇల్లు విడిచిన ఉపమన్యుడు అడవుల బాట పట్టాడు. కాలినడకన కొన్నాళ్లకు ఒక దట్టమైన కీకారణ్యానికి చేరుకున్నాడు. ఒక చెట్టు కింద కూర్చుని, పంచాక్షరి జపం మొదలుపెట్టాడు. జపం క్రమంగా ధ్యానంగా మారింది. ధ్యానం తపస్సుగా మారింది. అడవిలో ఉన్న రాకాసి మూక అతడిని భయపెట్టి, తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నించింది. ఉపమన్యుడు చలించలేదు. అతడిని జయించలేక రాకాసులందరూ అతడికి కింకరులుగా మారిపోయారు.ఉపమన్యుడి తపస్సు ఊపందుకుంది. నానాటికీ తపస్సులో ఉగ్రత పెరగసాగింది. అతడి తపస్సు వేడిమి స్వర్గం వరకు ఎగబాకింది. దేవతల అరికాళ్లు చుర్రుమన్నాయి. ఈ పరిణామానికి హడలెత్తిన దేవతలు విష్ణువును వెంటబెట్టుకుని, పరమశివుడి వద్దకు చేరుకున్నారు. ‘పరమేశ్వరా పాహిమాం! పాహిమాం! ఆ బాలుడు నీ కోసమే తపస్సు చేస్తున్నాడు. వెంటనే వెళ్లి అతడికి ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించు. అతడి తపస్సును విరమింపజేయి. నువ్వు జాప్యం చేస్తే, అతడి తపస్సు పుట్టించే తాపానికి మేమంతా తప్తమైపోకుండా కాపాడు’ అని మొరపెట్టుకున్నారు.‘సరే’నని దేవతలకు మాట ఇచ్చాడు శివుడు.అయితే, ఉపమన్యుడిని పరీక్షించదలచాడు. ఇంద్రుని రూపంలో అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘కుమారా! ఏం వరం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను’ అన్నాడు.‘నేను శివుడి కోసం తపస్సు చేస్తుంటే, నువ్వొచ్చావేమిటి దేవేంద్రా? నీ వరాలేవీ నాకు అక్కర్లేదు. సాక్షాత్తు పరమశివుడే నా ముందు ప్రత్యక్షం కావాలి. అతడే నా మనోరథాన్ని ఈడేర్చాలి. ప్రయాసపడి వచ్చావుగాని, నువ్వు దయచేయవచ్చు’ అన్నాడు ఉపమన్యుడు.ఇంద్రుడి వేషంలో ఉన్న పరమశివుడు ఉపమన్యుడికి తన పట్ల గల అచంచల భక్తికి పరమానందం చెందాడు. నిజరూపంలో పార్వతీ సమేతంగా సాక్షాత్కరించాడు. పార్వతీ పరమేశ్వరులు తన కళ్లెదుట కనబడగానే ఉపమన్యుడు పారవశ్యంతో తబ్బిబ్బయ్యాడు. అతడికి నోట మాట పెగలలేదు. ఉపమన్యుడు నోరు తెరిచి అడగకపోయినా, పరమశివుడు అతడికి పాల సముద్రాన్ని, పెరుగు సముద్రాన్ని ధారాదత్తం చేశాడు. ‘నువ్వు నా బిడ్డవురా!’ అంటూ అతడిని చేరదీసి, ముద్దాడి గణాధిపత్యం కూడా ఇచ్చాడు.‘నాకు మాత్రం బిడ్డ కాడా’ అంటూ పార్వతీదేవి కూడా ఉపమన్యుడిని ఎత్తుకుని ముద్దాడింది. తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించింది. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఉపమన్యుడికి నిత్య కుమారత్వం సిద్ధించింది.‘పరమేశ్వరా పాహిమాం! పాహిమాం! ఆ బాలుడు నీ కోసమే తపస్సు చేస్తున్నాడు. వెంటనే వెళ్లి అతడికి ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించు. అతడి తపస్సును విరమింపజేయి. ∙సాంఖ్యాయన -
పరమ పవిత్రం.. కార్తీక మాస విశేషాలివిగో
దీపావళి సంబరాలు ముగిశాయి. ఆ వెంటనే పవిత్ర కార్తీక మాసం హడావిడి మొదలైంది. శివ కేశవుల భక్తులంతా ఏంతో ఆసక్తిగా ఎదురు చూసే సమయమిది. ఈ పుణ్య మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1న సూర్యోదయ సమయంలో అమావాస్య ఘడియలు ఉన్నందున ఆ మరుసటి రోజు నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలనేది పండితుల మాట. శివనామస్మారణలతో ఆలయాలన్నీ మార్మోగుతాయి. వేకువ ఝామునే చన్నీటి స్నానాలు, దీపారాధన, శివరాధనలో భక్తులు పరవశిస్తారు.కార్తీకమాసం అంతా ధూప దీపాలు, శివనామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. శివాలయంలోనో మరేదైనా దీపం వెలగించడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగి పోతాయని భక్తులు నమ్ముతారు. కనీసం ఇంట్లో తులసికోటముందు దీపాలు వెలిగించినా పుణ్యం దక్కుతుందని భావిస్తారు. ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలు, మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు.ప్రత్యేకంగా మహిళలు నిష్టగా పూజలు చేస్తారు. దీపారాధనలు, ఉపవాస దీక్షలు, కార్తీకపురాణ పఠనం చేస్తూ శివకేశవులిద్దరనీ ఆరాధిస్తారు. ఈ పురాణంలో శివారాధన, దీపారాధన వైశిష్ట్యం, ఫలితాల గురించి విపులంగా ఉంటుంది. అలాగే శక్తి కొలదీ దానం చేయం, సాత్విక జీవనం లాంటి విషయాలతో పాటు, ఆరిపోతున్న దీపపు ఒత్తిని సరిచేసి, దీపాన్ని వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతుంది. నిష్టగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, ఉసిరి దీపాలు, దీపదానం చేస్తే నేరుగా స్వర్గానికి వెడతారని చెబుతుంది. అలాగే తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని కార్తీక పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వీటితో పాటు నాగుల చవితి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశితోపాటు, కార్తీకపూర్ణిమ ( నవంబర్ 15వతేదీ శుక్రవారం) రోజులు అతిపవిత్రమైనవి భక్తులు భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం. అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి సమీపంలోని నదులు,చెరువులలో వదిలే దృశ్యాలు కన్నుల పండువలా ఉంటాయి. అలాగే జ్వాలాతోరణం ఉత్సవం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.అయ్యప్ప దీక్షలు, పడిపూజలుకార్తీక మాసం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం. అయ్యప్పదీక్షలు కార్తీక మాసం నుంచి,మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాల ధారణ చేస్తారు. 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో దీక్షను కొనసాగిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు, నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తారు. స్వామి చింతనలో, సాత్విక జీవనాన్ని పాటిస్తారు. తెల్లవారుజామునే చన్నీటి స్నానం భజనలు, పూజలతో గడుపుతారు. దిండ్లు పాదరక్షలు కూడా వాడకుండా నేలపై పడుకుంటారు. బ్రాహ్మచర్యాన్ని పాటిస్తూ మండలం అనగా 41రోజులు పాటు ఈ నియమాలను భక్తి, శ్రద్ధలతో ఆచరిస్తారు. సంక్రాంతిలో రోజు మకర జ్యోతి దర్శనంతో దీక్షలను విరమిస్తారు. -
Dream Wedding Destination ఇక్కడ పెళ్లి జరగాలంటే అదృష్టం ఉండాలి!
హరహర మహదేవ శంభో అంటూ చార్ధామ్ యాత్రలో పరవశించిపోతారు భక్తులు. ఈ మార్గంలో చాలా తక్కువ మందికి తెలిసిన మరో విశిష్టమైన ఆలయం కూడా ఉంది. అదే త్రియుగినారాయణ దేవాలయం. ఇది చాలామందికి డ్రీమ్ వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా. దీని గురించి విశేషాలు తెలుసుకుందాం రండి.ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది సుందరమైన గ్రామంలో కొలువు తీర ఉన్నది త్రియుగినారాయణ ఆలయం.దీని విష్ణువు అని భావిస్తున్నారు. ఇది ఎత్తు సముద్ర మట్టానికి 1,980 మీటర్లు (6,500 అడుగుల ఎత్తులో ప్రకృతి రమణీయ దృశ్యాలతో చూడముచ్చటగా ఉండే పవిత్ర వైష్ణవ దేవాలయం. చార్ధామ్ ప్రదేశాలలో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది ఇది కూడా. ఈ ఆలయంలో స్వామివారి నుండి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు, గర్వాల్ హిమాలయాల ఉత్కంఠ భరితమైన దృశ్యాలను వీక్షించవచ్చు. త్రియుగినారాయణ ఆలయం వెనుకున్న కథ ఏమిటి?మూడు యుగాలుగా లేదా "త్రియుగం"గా ఉన్న వైష్ణవ పుణ్యక్షేత్రం ఇది. పార్వతి దేవి , శివుడు వివాహం చేసుకున్న ప్రదేశంగా ఇది ప్రతీతి. ఇక్కడ విష్ణువు ముందు శివపార్వతుల కళ్యాణం జరిగిందట. అందుకే వారి గౌరవార్థం త్రియుగి నారాయణ్ ఆలయం నిర్మించారని చెబుతారు.శ్రీ మహావిష్ణువు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ప్రజలు విశ్వసిస్తారు. పార్వతీ దేవికి సోదరుడిగా, తల్లిగా విష్ణుమూర్తి వ్యవహరిస్తే, బ్రహ్మ దేవుడు వివాహంలో పూజారి పాత్రను పోషించాడట. హోమగుండం, బ్రహ్మశిలపార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన హోమగుండం మూడు యుగాలుగా నిర్విరామంగా వెలుగుతోంది. ఈ ఆలయం ముందు పవిత్రమైన అగ్ని అనంతంగా వెలుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని అఖండ ధుని ఆలయం అని కూడా పిలుస్తారు పెళ్లి చేసుకునే జంటలు ఏడడుగులు వేసి (సాత్ ఫేర్)పవిత్ర బంధంతో ఏకమవ్వాలని ఎదురు చూస్తారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి కావాలని మొక్కుకుంటారట. ఇక్కడ కలపను నైవేద్యంగా సమర్పించి, విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు. త్రియుగినారాయణ ఆలయంలో బ్రహ్మ శిల ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇదే శివపార్వతుల కళ్యాణానికి వేదిక. దేవాలంయంలోకి అడుగు పెట్టగానే విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి వెండి విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు.దేవతలు వివాహం చేసుకున్నటువంటి పవిత్రమైన,గౌరవప్రదమైన ప్రదేశంలో వివాహం చేసుకోవాలని ఎవరు కోరుకోరు? దేశ విదేశాలకు చెందిన జంటలు ఇక్కడ ఏడు అడుగులువేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతారు. అలాగే కొత్త జంటలు, వేలాదిమంది భక్తులు, పర్యాటకులు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించి విష్ణువు ఆశీర్వాదం పొందుతారు. కేదార్‌నాథ్‌కు సుమారు 25 కి.మీ.దూరం. అలాగే రుద్రప్రయాగ నుండి 70 కిలోమీటర్ల దూరం. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కూడా చాలా ప్రసిద్ధి చెందింది.ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4-8 గంటల వరకు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. -
శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేపై కేసు
ఇండోర్: ఆదిదేవుడు శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండెల్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బాబు జండెల్ శివుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ శుక్రవారం రాత్రి విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) లీగల్ సెల్ నేత, న్యాయవాది అనిల్ నాయుడు టుకోగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ హన్స్‌రాజ్ సింగ్ చెప్పారు. శివుడిపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే జండెల్పై ఇప్పటికే ఇండోర్‌లో కేసు నమోదైందన్నారు. అయితే, తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే జండెల్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియో మారి్ఫంగ్ చేసిందని చెబుతున్నారు. -
ప్రపంచ వచనాలు
‘పాప పుణ్యాలనేటటువంటివి/ మీ చేతుల్లో ఉన్నవి/ అయ్యా అంటే స్వర్గం/ ఒరే అంటే నరకం/ కూడల సంగమదేవా!’ ఇది బసవన్న చెప్పిన ఎన్నో వచనాల్లో ఒకటి. కన్నడిగుల విశిష్ట సారస్వతం వారి ‘వచనాలు’. కన్నడ ఉపనిషత్తులుగా ఇవి కీర్తినొందాయి. వీరశైవ భావధార ఉద్ధృతంగా ప్రవ హించిన పన్నెండో శతాబ్దంలో ఇవి వెలువడ్డాయి. ఈ వచనకారులు ఒక్కరు కాదు, లెక్కకు మిక్కిలి. ‘పారేనదికి/ ఒళ్లంతా కాళ్లు/ మండే నిప్పుకి/ ఒళ్లంతా నోళ్లు/ వీచే గాలికి/ ఒళ్లంతా చేతులు/ గుహేశ్వరా/ నీ వాళ్లకి/ ప్రతి అంగం లింగమే’ అన్నాడు అల్లమ ప్రభు. ఛందస్సును అనుసరించకుండా, పాండిత్య ప్రకర్ష లేకుండా, సరళంగా, భావ ప్రధానంగా రాసిన ఈ వచనాలు అందులోని పదాల తూగు వల్ల ఒక లయను కలిగివుంటాయి. కొంతమంది శాస్త్రీయ సంగీత గాయకులు వీటిని ఆలపించడం కద్దు. మానవత్వాన్నీ, కాయక ధర్మాన్నీ ఈ వచనాలు చాటిచెప్పాయి. కులాల మధ్య, స్త్రీ పురుషుల మధ్య తేడాలను నిరసించాయి. జంగముడు ఏ కులానికి, ఏ వృత్తికి చెందినవాడైనప్పటికీ శివునిలా పూజనీయుడే; సహపంక్తి భోజనాదులకు అర్హుడే. ఈ విశాల దృక్పథంతో చెప్పి నందువల్లే వచనాలు భక్తేతరుల ఆదరణనూ చూరగొన్నాయి. వీరశైవ భక్తులను ‘శరణులు’ అన్నారు కాబట్టి, వాళ్లు రాసింది ‘శరణ సాహిత్యం’ అయ్యింది. ఈ సాహిత్యాన్ని మరింతగా ప్రపంచానికి చేరువ చేసే ప్రయత్నాలను బెంగళూరులోని ‘బసవ సమితి’ చేస్తోంది. 173 మంది వచనకారుల ఎంపిక చేసిన 2,500 వచనాలను వివిధ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో భిన్న భాషల్లోకి అనువదింప జేస్తోంది. ఇప్పటికే అరబ్బీ, పర్షియన్ లాంటి సుమారు 30 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైన వీటిని 2025 జనవరి కల్లా స్పానిష్, జర్మన్, జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, నేపాలీల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. పన్నెండో శతాబ్దంలో కళ్యాణకటకము నేలిన బిజ్జలుని కొలువులో బసవేశ్వరుడు మంత్రిగా పనిచేశాడు. వీరశైవ మతానికి ఎనలేని ప్రాబల్యాన్ని కల్పించాడు. బసవడు ఎంతటి కవియో అంతటి తాత్వికుడు. ‘ఉన్నవాళ్లు/ గుళ్లు గోపురాలు కట్టిస్తారు/ లేనివాణ్ణి/ నేనేమి చెయ్యాలి?/ నా కాళ్ళే స్తంభాలు/ కాయమే కోవెల/ శిరసే బంగారు శిఖరం/ కూడల సంగమదేవా! విను/ చెడితే స్థావరం చెడుతుంది గాని/ జంగమం చెక్కుచెదరదు’ అన్నాడు. బసవన్న స్థాపించిన ఆధ్యాత్మిక సంఘం ‘అనుభవ మంటపం’. దానికి వేదిక ఆయన ఇల్లే. దీనికి అధ్యక్షుడు అల్లమ ప్రభు. అధ్యక్ష సింహాసనం పేరు శూన్య సింహాసనం. అనుభవ మంటపం అనే ఆలోచనే మేధా మథనానికీ, ప్రజాస్వామిక భావమార్పిడికీ ఉత్తేజాన్ని ఇచ్చేది. ఇందులో సుమారు 300 మంది శరణులు పాల్గొనేవారు. వాళ్లలో ‘వీరరాగిణి’ అక్క మహాదేవి సహా 36 మంది స్త్రీలు ఉండటం విశేషం. వీరిలో రకరకాల వృత్తులవాళ్లు ఉన్నారు. ‘కట్టెలమ్ముకొనే మోళిగెయ మారయ్య, చెప్పులు కుట్టే మాదార చెన్నయ్య, తోళ్లు పదునుపెట్టే దోహర కక్కయ్య, బట్టలుతికే మడివాల మాచయ్య, వెదురు బుట్టలల్లే మేదర కేతయ్య, పడవ నడిపే అంబిగర చౌడయ్య...’ వీళ్లు ‘రామనాథా’, ‘సకలేశ్వరదేవా’, ‘అమరగుండ మల్లికార్జునా’, ‘సిద్ధ మల్లికార్జునా’ అంటూ తమ ఇష్టదైవాలను మకుటంగా చేర్చుకొని తమ వచనాలను చెప్పారు. ‘పిడకలు ఏరటంలోనే/ అయిపోతోంది బ్రతుకంతా/ ఇక నేను/ అన్నం వండేదెప్పుడు,/ తినేదెప్పుడు? కూడల సంగమదేవా’ అన్నాడు బసవన్న. ‘సువిశాలమైన కన్నడ సాహిత్య క్షేత్రంలో విహరిస్తుంటే వచనాల దగ్గరకు వచ్చేసరికి మనం ఒక తపోవనంలో అడుగు పెట్టినట్లుగా అనిపిస్తుంది. అక్కడ మనకు తారసపడేవారందరూ రుషులూ, సాధువులే! కల్మషంతో నిండిన మనుషుల అంతరంగాలు శుభ్రపడటానికి వారి బోధలు చాలు అనిపిస్తుంది’ అంటారు ఈ వచనాల్లో కొన్నింటిని ‘మాటన్నది జ్యోతిర్లింగం’గా పాతికేళ్ల క్రితమే తెలుగులోకి అనువదించిన దీవి సుబ్బారావు.తెలుగులో మొట్టమొదట మల్లికార్జున పండితుడు ‘శివతత్వ సారం’లో బసవన్నను స్తుతించాడు. పాల్కురికి సోమనాథుడు ద్విపదల్లో బసవ పురాణము రచించి వీరశైవాన్ని ప్రచారం చేశాడు. ఒక తెలుగు కవి తొలిసారిగా రాసిన స్వతంత్ర పురాణం ఇది. శివభక్తులకు శ్రీశైలం మహోజ్జ్జ్వల సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. బసవన్నకు ముందువాడని చెప్పే దేవర దాసిమయ్య శ్రీశైలం వచ్చి ఆగమాలు, పురాణాలు చదువుకొన్నాడు. అల్లమ ప్రభు శ్రీశైలంలో సమాధి నొందాడు. అక్క మహాదేవి శ్రీశైల కదళీవనంలో కాలం గడిపింది. ‘కొండల్లో కాక కంచెల్లో ఆడుతుందా నెమలి? /కొలనుల్లో కాక కాలువల్లో ఈదుతుందా హంస/ ...చెన్నమల్లికార్జునుడు కాక అన్యుల్ని తలుస్తుందా నా మనస్సు?’ అంటూ తన జీవితాన్ని ఆ చెన్నమల్లికార్జునుడికే అర్పించుకుంది. ‘మిణుగురులు ఎగిరితే/ నా ఆకలిదప్పులు అణగారినాయనుకొంటా/ మబ్బులు కరిగితే/ నా స్నానం కొరకు పంపిన జలమనుకొంటా/ కొండరాయి జారిపడితే/ నా తల్లో తురిమిన పూవనుకొంటా/ నా కంఠం తెగితే/ చెన్నమల్లికార్జునా!/ అది నీకర్పితమనుకొంటా’ అని పాడుకుంది. ఆమె తపస్సు చేసిందని చెప్పే ‘అక్క మహాదేవి గుహలు’ ఏ శ్రీశైల యాత్రికుడికైనా దర్శనీయ స్థలం.‘ఆవగింజంత సుఖానికి/ సాగరమంత సంకటం/ తన్నే కోల్పోయి/ నిధిని సాధించానంటే/ అందమేముంది?/ గుహేశ్వరా’ అన్నాడు అల్లమ ప్రభు. భక్తి పరవశంలో రాసినవైనప్పటికీ, అంతకుమించిన తాత్విక చింతననూ, మానవ స్వభావాన్నీ ఈ వచనాలు ఆవిష్కరించాయి. అంతేనా? ప్రతి భాషా మేలిమి సాహిత్యాన్నీ అలా పూనిక వహించి ఎల్లలు దాటించాలన్న ప్రేరణను కూడా ఇస్తున్నాయి. -
ఆట కదరా శివా!
పాండిచ్చేరి పట్టణానికి చెందిన ఉన్నత విద్యావంతుడైన ఓ యువకుడికి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయాలనిపించింది. అనుకున్నదే తడవుగా అరుణాచలం బస్సు ఎక్కాడు. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుని రాజగోపురం వద్ద నిలబడి వినాయకుణ్ణి ప్రార్థించి నడక ప్రారంభించాడు. అష్టలింగాలను చూస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలని అతడి ఆలోచన.నడుస్తూ నడుస్తూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు. అక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన ఓ ఆధ్యాత్మిక వేత్త పరిచయం అయ్యాడు. ‘‘అలజడి లేని జీవితాన్ని గడ΄ాలంటే ఏమి చేయాలి?’’ అని ఆసక్తిగా ఆ ఆధ్యాత్మికవేత్తను అడిగాడు యువకుడు. ఆధ్యాత్మిక వేత్త చిరునవ్వు ముఖంతో ‘‘ఇద్దరూ ఆడగలిగి, ఇద్దరూ గెలవగలిగే ఆట ఆడాలి’’ అని బదులిచ్చాడు. అర్థం కాని ముఖం పెట్టాడు ఆ యువకుడు. ఆధ్యాత్మికవేత్త యువకుడి హావభావాలు పట్టించుకోకుండా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ‘ఇద్దరు ఆడితే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ, ఇద్దరూ ఎలా గెలుస్తారు?’ అని ఆలోచనలు మొదలయ్యాయి ఆ యువకుడిలో. సమాధానం తెలుసుకుందామని తను కూడా వేగం పెంచాడు. వల్లలార్ ఆశ్రమం వద్ద మళ్ళీ ఆధ్యాత్మిక వేత్త కనిపించాడు. ఆశ్చర్యంగా ‘‘మీరు చెప్పింది ఎలా సాధ్యం?’’ అని ప్రశ్నించాడు. ‘‘ఆలోచించు. నీకే అర్థమవుతుంది. తమాషా ఏమిటంటే ఇద్దరే కాదు, ఆ ఆటని యాభై మంది ఆడినా... అందరూ గెలుస్తారు. అంతేకాదు... అది అందరూ ఆడగలిగిన ఆట కూడాను’’ అంటూ ఆధ్యాత్మిక వేత్త వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మొదటికి వచ్చింది యువకుడి పరిస్థితి. ఎవరినైనా అడిగి తెలుసుకుందామని ముందూ వెనుకా చూశాడు. తెలిసిన ముఖాలేవీ కనిపించలేదు. చేసేదేం లేక ఆధ్యాత్మికవేత్తను వెదుక్కుంటూ వెళ్ళాడు.ఎలాగైతేనేమి ఈశాన్య లింగం వద్ద కనిపించాడు. గెసపోసుకుంటూ చెమటలు కారుస్తూ వెళ్ళి‘‘మీరు సమాధానం చెప్పక΄ోతే నా తల బద్దలై ΄ోయేలా ఉంది’’అని దిగులుగా ముఖం పెట్టాడు. యువకుడి భుజం తడుతూ ఆ ఆధ్యాత్మికవేత్త ‘‘విచిత్రం ఏమిటంటే... వందమంది ఆ ఆట ఆడినా, వందమందీ గెలుస్తారు. అదేమిటంటే... ఎదుటివారిని ప్రేమించే ఆట. అక్కడ అందరూ విజేతలే. ఓటమి పాలయ్యేవారు ఎవ్వరూ ఉండరు’’ అని సమాధానమిచ్చి అక్కడినుంచి మెరుపు వేగంతో వెళ్ళి΄ోయాడు.‘‘నిజమే. జీవితమనేది ఒక ఆటలాంటిది. ప్రేమ విత్తనాలు వెదజల్లే ఆట ఆడటం ప్రారంభిస్తే జీవితం పూల తోట అవుతుంది. దానికి వయస్సు, భాష, లింగం, ్ర΄ాంతం, కులం, మతం అనే హద్దులు ఉండవు ’’ అనుకుంటూ ఆ యువకుడు గిరి ప్రదక్షిణ పూర్తి చేశాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
భక్తిలో విశ్వాసం..!
భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా కేవలం యాంత్రికంగా ఎన్ని రకాల, ఎన్ని వర్ణాల పూలతో పూజ చేసినా ఉపయోగం ఉండదు. విశ్వాసం లేకుండా చేసే తీర్థయాత్రల వల్ల, గంగా స్నానాల వల్ల ఫలితం ఉండదు. గంగలో మునక వేస్తే పాపాలు హరిస్తాయంటారు కానీ నిజంగా అలా జరుగుతుందని నమ్మకం ఏమిటి? అనే అవిశ్వాసం తోనే చాలా మంది ఉంటారు. మనుషులలో సందేహ జీవులే ఎక్కువ.ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఈ విషయం గురించే ‘నిత్యం గంగలో ఎంతోమంది స్నానం చేస్తూ, శివస్మరణ చేస్తున్నారు కానీ ఎవరిలోనూ పూర్తి విశ్వాసం కనిపించటం లేదని అనుకుంటారు. నిజమైన భక్తి ఎవరిదో పరీక్షిద్దామని అనుకుని వృద్ధ దంపతుల రూపంలో గంగా తీరానికి వెళతారు. అక్కడ వృద్ధుడు ఒక గోతిలో పడిపోతాడు. భార్య దుఃఖిస్తూ ఎవరైనా చేయందించి తన భర్తను కాపాడమని అక్కడ చుట్టూ చేరిన వారిని కోరుతుంది.వాళ్ళు ముందుకు రాబోతుంటే ఆమె ‘మీలో ఎప్పుడూ ఏ పాపం చేయని వాళ్ళు మాత్రమే నా భర్తను కాపాడండి. లేకుంటే, చేయందిస్తున్నప్పుడు మీ చేయి కాలిపోతుంది’ అంది. అక్కడ ఉన్నవారంతా గంగా స్నానం చేసినవారు. నిరంతరం శివ స్మరణ చేసేవారు. అయినా, తమ భక్తి మీద తమకు నమ్మకం లేదు. ఎవరూ ముందుకు రాలేదు. వృద్ధుణ్ణి కాపాడే ప్రయత్నం చేయలేదు.అంతలో ఒక దొంగ అక్కడకి వచ్చాడు. వృద్ధురాలు చెప్పిన విషయం తెలుసుకుని, వెంటనే గంగలో మూడు మునకలు వేశాడు. వృద్ధుణ్ణి కాపాడాడు. గంగలో మునిగిన తర్వాత తన పాపాలన్నీ నశించిపోయాయని అతని నమ్మకం. వృద్ధునికి చేయందించినపుడు అతని చేయి కాలలేదు. అదీ విశ్వాసమంటే! ఆ తర్వాత అతడు దొంగతనాలు మాని శివభక్తుడయ్యాడు. అపనమ్మకంతో, సందేహంతో చేసే పనులు ఏవీ సత్ఫలితాన్నివ్వవు. చేసే పనిపై విశ్వాసం ఉండాలి. – డా. చెంగల్వ రామలక్ష్మి -
'అంధకాసుర వధ'! ఒకనాడు కైలాస పర్వతంపై..
శివపార్వతులు ఒకనాడు కైలాస పర్వతంపై ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. శివుడిని ఆటపట్టించడానికి పార్వతీదేవి వెనుక నుంచి ఆయన కళ్లు మూసింది. పరమేశ్వరుడి కళ్లు మూయడంతో కొన్ని క్షణాలు అంతటా చీకటి ఆవరించింది. అప్పుడు అంధుడైన ఒక బాలుడు జన్మించాడు. సంతానం కోసం తన గురించి తపస్సు చేస్తున్న హిరణ్యాక్షుడికి శివుడు ఆ బాలుడిని అప్పగించాడు. పుట్టు అంధుడు కావడం వల్ల ఆ బాలుడికి అంధకుడనే పేరు వచ్చింది.అంధకుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అంధకుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతడి అంధత్వాన్ని పోగొట్టడమే కాకుండా, అనేక వరాలనిచ్చాడు. వరగర్వితుడైన అంధకుడు ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టాడు. ఒకనాడు అంధకుడు కైలాసంలో సంచరిస్తున్న శివపార్వతులను చూశాడు. అతడికి పార్వతీదేవిపై మోహం కలిగింది. పార్వతీదేవిని తనకు అప్పగించాలని, లేకుంటే తనతో యుద్ధానికి సిద్ధపడాలని శివుడికి కబురు పంపాడు. అంధకుడి అనుచితమైన కోరిక తెలుసుకున్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అంధకుడితో యుద్ధానికి తలపడ్డాడు. అవంతీ దేశంలోని మహాకాలవనంలో ఇద్దరికీ భీకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో అంధకుడు శివుడిని నానా రకాలుగా బాధించాడు. సహనం నశించిన పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకు అంధకుడి శరీరం నుంచి రక్తం ధారలు కట్టింది. ఆ రక్తధారల నుంచి అనేక అంధకాసురులు పుట్టుకొచ్చారు. శివుడు సంహరించే కొద్ది మరింత మందిగా పుట్టుకు రాసాగారు.అంధకుడి నెత్తురు కిందపడకుండానే తాగేయడానికి మహేశ్వరి, బ్రహ్మీ, కౌమారి, మాలినీ, సౌవర్ణీ తదితర 189 మాతృకా శక్తులను శివుడు సృష్టించాడు. ఈ మాతృకా శక్తులు అంధకాసురుడి శరీరం నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని తాగేశారు. అంధకాసురుడి రక్తం తాగి తృప్తి చెందిన మాతృకలు కొద్దిసేపు ఆగారు. ఈలోగా మరింతమంది అంధకాసురులు పుట్టుకొచ్చి రకరకాల ఆయుధాలతో పరమశివుడిని బాధించడం ప్రారంభించారు.అంధకాసురుడి బాధ భరించలేక శివుడు చివరకు మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు హుటాహుటిన అక్కడకు చేరుకుని, శుష్కరేవతి అనే శక్తిని సృష్టించాడు. ఆ శక్తి వెళ్లి అంధకాసురుడి శరీరంలోని రక్తాన్ని చుక్కయినా వదలకుండా పీల్చేసింది. దాంతో కొత్త అంధకాసురులు పుట్టడం ఆగిపోయింది. పోరులో మిగిలిన అంధకాసురులను శివుడు సంహరించాడు.చివరకు శివుడు తన త్రిశూలంతో అసలు అంధకుడిని పొడిచాడు. అతడు నేలకూలి మరణించబోతూ శివుడిని భక్తిగా స్తుతించాడు. మరణానంతరం తనకు శివ సాన్నిధ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. అంధకాసురుడు తృప్తిగా కన్నమూశాడు. అంధకాసురుడి మరణం తర్వాత రక్తం రుచి మరిగిన 189 మాతృకలకు ఇంకా ఆకలి తీరలేదు. వారంతా శివుడి వద్దకు వచ్చి, ‘శంకరా! మా ఆకలి ఇంకా తీరలేదు. చాలా ఆకలిగా ఉంది. నువ్వు అనుమతిస్తే, సమస్త ప్రాణులనూ భక్షిస్తాం’ అన్నారు. మాతృకల కోరిక విని శివుడు దిగ్భ్రాంతి చెందాడు. ‘మాతృకలారా! మీ ఆలోచన తప్పు. మీరంతా లోకాన్ని రక్షించాలి గాని, భక్షించాలని కోరుకోవడం దారుణం’ అన్నాడు.మాతృకలు శివుడి మాటలను లెక్కచేయకుండా, ముల్లోకాలలోనూ ప్రాణులను భక్షించడం మొదలుపెట్టారు. మాతృకల ఆగడానికి దేవ దానవ మానవులందరూ హాహాకారాలు ప్రారంభించారు. శివుడు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. తాను సృష్టించిన మాతృకలను తానే సంహరించలేక, కనీసం వాని నిలువరించలేక సతమతమయ్యాడు. చివరకు శివుడు నరసింహావతారాన్ని స్మరించాడు. మెరిసే జూలుతో కూడిన సింహం తల, పదునైన గోళ్లు, పెద్దకోరలతో సాగరఘోషను మించిన భీకర గర్జన చేస్తూ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు నరసింహుడిని పరిపరి విధాలుగా స్తుతించాడు. ‘స్వామీ! నేను సృష్టించిన మాతృకలు నా అదుపు తప్పారు. నా మాటను లక్ష్యపెట్టకుండా లోకాలను భక్షిస్తున్నారు. నా చేతులతో సృష్టించిన వారిని నేను నాశనం చేయలేకపోతున్నాను. కనుక నువ్వే మాతృకలను అదుపు చేయాలి’ అని ప్రార్థించాడు.శివుడి విన్నపాన్ని ఆలకించిన నరసింహుడు వాగీశ్వరి, మాయ, భగమాలిని, కాళి అనే నాలుగు శక్తులను, వారికి అనుచరులుగా ఉండటానికి మరో ముప్పయిరెండు దేవతా శక్తులను సృష్టించాడు. నరసింహుడి ఆజ్ఞతో ఈ శక్తులన్నీ కలసి లోకాలను భక్షిస్తున్న మాతృకలపై మూకుమ్మడిగా దాడి చేశాయి. నృసింహ శక్తుల ధాటికి తట్టుకోని మాతృకలు పరుగు పరుగున వచ్చి నరసింహుడి పాదాల ముందు మోకరిల్లి శరణు వేడుకున్నాయి. నరసింహుడు వారికి అభయమిచ్చాడు.‘మాతృకలారా! దేవతా శక్తులు మానవులను దయతో పాలించాలి, వారిని భక్షించకూడదు. నా మాట ప్రకారం మీరు ఈనాటి నుంచి లోకాలను పాలిస్తూ, అందరూ పరమేశ్వరుణ్ణి పూజించేలా చేయండి. నా భక్తులకు, శివభక్తులకు, మీకు బలులు సమర్పించేవారికి రక్షణ కల్పిస్తూ, వారు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తూ ఉండండి. రానున్న కాలంలో మీరందరూ మానవుల పూజలు అందుకుంటారు’ అని చెప్పి, నరసింహుడు తాను సృష్టించిన శక్తులతో పాటు అంతర్ధానమయ్యాడు. మాతృకలు ఆనాటి నుంచి నరసింహుడు ఆజ్ఞాపించిన ప్రకారం శాంతియుతంగా మారి లోకాలను కాపాడుతూ వస్తున్నారు. – సాంఖ్యాయనఇవి చదవండి: 'క్రమశిక్షణ' అంటే వెంటనే గుర్తుకొచ్చేది...! -
కైలాసంలో శ్రీకృష్ణుడు! 'ఒకనాడు శుభముహూర్తం చూసుకుని'..
శ్రీకృష్ణుడు పుత్రసంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు శుభముహూర్తం చూసుకుని, ద్వారకా నగరం నుంచి బయలుదేరి, గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి, శరీరమంతా భస్మ లేపనాలు పూసుకున్న మునులు రుద్ర మంత్రాలను జపిస్తూ ఉన్నారు. శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి, శ్రీకృష్ణుడు నమస్కరించారు. వారందరూ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి, ఆహ్వానించారు. వారు వెంట రాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగు పెట్టాడు.శ్రీకృష్ణుడిని చూసి ఉపమన్యుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. లేచి ఎదురేగి, కృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ప్రభూ! పరమయోగులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది. నీ రాక నాకు అమితానందం కలిగిస్తోంది. నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా?’ అని అడిగాడు.పరమ యోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి, ‘మహాత్మా! నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను. నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి. ఏం చేస్తే నేను పరమేశ్వరుణ్ణి చూడగలను?’ అని అడిగాడు. ‘భక్తితో తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయి’ అని చెప్పాడు ఉపమన్యుడు.ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి, శరీరమంతా భస్మాన్ని పూసుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశమార్గంలో నిలబడి శ్రీకృష్ణుడికి దర్శనం ఇచ్చాడు. కిరీటం, త్రిశూలం, పినాక ధనువు, పులిచర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు, శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించిన విష్ణురూపంలో మరోవైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వర దర్శనం కలిగింది. పరమశివుడికి అంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు, హంస వాహనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు, నంది, కుమారస్వామి, గణపతి సహా మహా మునిపుంగవులందరూ పరమశివుడితో కలసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు పరమానందభరితుడై పరమశివుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పఠించాడు.పరమశివుడు ఆదరంగా శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని, ‘కృష్ణా! నువ్వే అందరి కోరికలు తీర్చేవాడివి కదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వెవరివో నీకు జ్ఞాపకం రావడం లేదా? నువ్వే అనంతుడివి, అప్రమేయుడివి, సాక్షాత్తు నారాయణుడివని తెలుసుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘శంకరా! నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను. అందుకే తపస్సు చేశాను. నాకు నాతో సమానుడైన వాడు, పరమ శివభక్తుడు అయిన కుమారుడు కావాలి. అనుగ్రహించు’ అన్నాడు. కృష్ణుడి భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమితానందం చెందారు. తమతో పాటు కొన్నాళ్లు కైలాసంలో గడపవలసిందిగా కోరి, అతణ్ణి ఆకాశమార్గాన కైలాసానికి తీసుకుపోయారు. కృష్ణుణ్ణి కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు. కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహరించసాగాడు.కృష్ణుడు ద్వారకానగరంలో కనిపించి అప్పటికే చాలా రోజులు గడచిపోయాయి. కృష్ణుణ్ణి చూసిపోదామని ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడు. పరిస్థితి తెలుసుకుని, కృష్ణుణ్ణి వెదకడానికి బయలుదేరాడు. ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకకు వెనుదిరిగాడు. సరిగా అప్పుడే, కృష్ణుడు లేడని తెలుసుకుని, కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు. గరుత్మంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు.కొన్నాళ్లకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుడిని చూసి, అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా పురప్రజలు ఆయన చుట్టూ చేరి, ‘మహర్షీ! మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్లి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన క్షేమ సమాచారాలు ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగారు.‘ప్రజలారా! భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు. అక్కడ ఆయన ఆనందంగా విహరిస్తున్నాడు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల ఆతిథ్యం పొందుతున్నాడు. నేను ఆయనను చూసే ఇక్కడకు వచ్చాను’ అని చెప్పాడు.నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరి వెళ్లి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు దివ్యసింహాసనంపై పరమశివుడి పక్కనే ఆసీనుడై కనిపించాడు. గరుత్మంతుడు పరమేశ్వరుడికి, కృష్ణుడికి నమస్కరించాడు.కృష్ణుడి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకా వాసులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ద్వారకకు నాతో పాటు రావలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు.కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకుని, గరుత్మంతుడిని అధిరోహించి ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణుడు నగరంలో అడుగుపెడుతూనే ద్వారకా వాసులు ఆయనకు ఘనస్వాగతాలు పలికి, అడుగడుగునా మంగళహారతులతో నీరాజనాలు పట్టారు.కొంతకాలానికి శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు జన్మించాడు. సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడిగా, పరమ శివభక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. – సాంఖ్యాయన -
Maha Shivratri 2024 ఉపవాసం, జాగారం, ఇంట్రస్టింగ్ సంగతులు
మహా శివరాత్రి అంటే సృష్టి, స్థితి, లయకారులలో శివుడికి లయకారుడైనా మహాశివుడకి ఎంతో ప్రీతి పాత్రమైన రోజు. భక్తితో కొలిచే తన భక్తులతోపా పాటు క్రిమికిటకాదులకు కూడా మోక్షమిచ్చి సాక్షాత్కరించే బోళా శంకరుడు. భక్తజన రక్షకుడు. సనాతనుడు, భూతనాథుడు, వైద్యనాథుడు, పశుపతి నాథుడు, చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు, చంద్రశేఖరుడు. ప్రతిమాసంలోనూ బహుళ పక్షం వచ్చే చతుర్ధశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి. అన్నింటిలోనూ మహిమాన్వితమైనది మహాశివరాత్రి. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం. శివ పార్వతులిరువురికి సంబంధించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం. శివరాత్రి పర్వదినం క్షీరసాగర మథనంలో అమృతంకంటే ముందు పుట్టిన హలాహలం ముల్లోకాలను దహించివేస్తుందన్న ప్రమాదమున్న కారణంగా ముక్కోటి దేవతలు పరమేశ్వరుణ్ణి వేడుకోవడంతో ఆ గరళాన్ని గొంతులో బంధించి గరళ కంఠుడుడయ్యాడు. కంఠం నీలంగా మారి మారడంతో నీలకంఠుడయ్యాడు. సంప్రదాయ ప్రియులు జరుపుకునే ప్రతి పండుగకూ ఏదో ఒక పురాణగాథ ఉన్నట్లే మహాశివరాత్రికీ ఒకటి రెండు ఐతిహ్యాలున్నాయి. పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప ’ అని వాదించుకున్నారు. ఈ వివాదం పెరిగి పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధానికి త్రిలోకాలూ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మవిష్ణువుల మధ్య వెలసింది. ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పో రు కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగి ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తిగా మారింది. దాంతో బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు శ్వేతవరాహరూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు. ఎంతదూరం ఎగిరినా బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహరూపంలో ఉన్న విష్ణువు పా పాతాళందాటి వెళ్లినా లింగం మొదలు కనిపించ లేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ మొగలిపువ్వును ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన సంవాదాన్ని వివరించి, తనకు సహాయం చేయమని అడిగాడు. ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజ మేనని సాక్ష్యం ఇవ్వమనిప్రా పాధేయపడ్డాడు బ్రహ్మ. సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేకపో యింది మొగలిపువ్వు. వారిద్దరూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపో యానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలిపువ్వును అడగమని చెప్పా డు. ‘నిజమే’నంది మొగలిపువ్వు.దాంతో తాను ఓడిపో యానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం అంటే మొగలిపువ్వు నాటినుంచి తనను అర్చించడానికి అవకాశం లేదన్నాడు. అంతేకాదు భక్తులెవ్వరూ మొగలిపువ్వులతో తనను పూజించరాదని శాసించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండీ అల్పవిషయంలో అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకుని, భూలోకంలో తనతో సమానంగా పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఈశ్వరుణ్ణి శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చుండబెట్టారు. హారాలు, నూపురాలు, కిరీటం, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్త్రాలు, పూలమాలలు, పువ్వులు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, శ్వేతఛత్రం, వింజామరలు వంటి దివ్యమైన వస్తువులను సమర్పించి షోడశోపచారంగా పూజించారు. ఆ పూజకు ఈశ్వరుడు ఎంతగానో సంతోషించాడు. ఆ ఈ రోజు తనను మూర్తిని, లింగాన్ని పూజించే వారికి మోక్షం లభిస్తుందన్నాడు. శివరాత్రినాడు పార్వతీసమేతంగా తనను అర్చించే వారు మహోన్నత ఫలాలు పొందే విధంగా అనుగ్రహించాడు. మహాశివరాత్రి పండుగ శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపా పాన్ని ధ్యానిస్తూ, శివ నామస్మరణం చేయడం. మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు.. నాలుగు జాములు నిద్రపో కుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కాంధ పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పా పాపా పాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో, ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివ గాథలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజుకి ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపా పాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రి కి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. ఉపవాసం ఎలా? శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, మినహా శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా, శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఉపవాసం అంటే ‘దగ్గరగా ఉండడం’ అని! ఆరోగ్యపరంగా చూసినప్పుడు, ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతోపాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉప వసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం కష్టం. శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. అంతేకాదు జాగారం వుండి శివ పంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారాయన భక్తులు. కనుకనే మహాశివరాత్రి నాడు నమశ్శివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ. ‘త్రయంబకం యజామహే...‘ అంటూ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలూ తగ్గి, పూర్ణాయుష్షు లభిస్తుందని ప్రతీతి. శివరాత్రి నాడు కలిగినంతలో దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. ఇవేవీ చేయ(లే)కపో యినా నిర్మలమైన మనస్సు తో వీలైనన్ని సార్లు ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేసినా చాలు, ఆ బోళాశంకరుడుపొంగిపో యి వరాలిస్తాడు. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కో అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపా పాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. శివుడి దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. రెండు స్వరూపాలు శివుడు కేవలం రుద్రస్వరూపుడే కాక ప్రేమస్వరూపుడు కూడా. రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. జగతః మాతా పితరౌ శివ పార్వతులు తమ కల్యాణ మహోత్సవానికి చక్కగా చిగిర్చే పూచే వసంతకాలాన్ని మనకిచ్చి ఆకులు రాలే శిశిరాన్ని ఎంచుకున్నారు ఆ దంపతులు. వెన్నెల మెండుగా కాసే పున్నమిని మనకిచ్చి కన్ను పొడుచుకున్నా కానరాని బహుళ చతుర్దశిని తాము తీసుకున్నారు. రాత్రివేళ అయితే అది మనకి ఇచ్చింది అని భావించి తెల్లవారుజామున మంచిదనుకున్నారు ఆ తలిదండ్రులు. మల్లెల్నీ మొల్లల్నీ మనకి విడిచి వాసన, రూపసౌందర్యం లేని తుమ్మిపూవుల్ని సిద్ధం చేసుకున్నారు. చందనాన్ని మన పరం చేసి విభూతిని పులుముకున్నారు. ఊరేగింపునకి ఎద్దునీ, అలంకారాలుగా పా పాముల్నీ ... ఇలా జగత్తుకోసం ఇన్ని త్యాగాలు చేసిన ఆ ఆది దంపతుల కల్యాణ మహోత్సవానికి పిల్లలమైన మనం తప్పక హాజరు కావాలి. ఆశీస్సులు అందుకోవాలి. అందుకే ఈ జాగరణం. -
శివతాండవానికి సరస్వతీపుత్రుడి తెలుగు నట్టువాంగం
ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా ప్రచారంలో ఉన్న “జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం” సంస్కృత స్తోత్రమే గుర్తుకు వస్తుంది. ఇది రావణాసురుడు రాసి, ఎకో సిస్టంలో దిక్కులు పిక్కటిల్లేలా క్రమ, ఘన, ఝట పద్ధతుల్లో స్వయంగా పాడాడని ఆ స్తోత్రం చివర ఉంటుంది. కానీ- మంత్ర శాస్త్ర రహస్యాలు తెలిసినవారు- ఇది రావణాసురుడు రాసినది కాదని అనాదిగా వాదిస్తున్నారు. తెలుగులో అంతటి శివతాండవం ఉంది. “సరస్వతీపుత్ర” పుట్టపర్తి నారాయణాచార్యులు రచించి, గానం చేసిన శివతాండవం అర్థం చేసుకోవడానికి సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాల పరిచయం అవసరం. శ్రీ వైష్ణవుడై ఉండి నారాయణాచార్యులు శివతాండవం రాయడం ఒక విశేషం. ఆరు దశాబ్దాల పాటు ఆయన రాసిన నూట పది కావ్యాల్లో శివతాండవం ఒక్కటే అన్నిటినీ పక్కకు నెట్టి…వెలుగుతూ ఉండడం మరో విశేషం. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పుట్టపర్తిని తెలుగువారు గుర్తించాల్సినంతగా గుర్తించలేదు. ఆ బాధ ఆయన మాటల్లో తెలిసేది. నిజానికి బాధపడాల్సింది మనం. పదమూడో ఏట ఆయన రాసిన చిన్న కావ్యం “పెనుగొండ లక్ష్మి” విద్వాన్ పరీక్షలో ఆయనకే పాఠం. ప్రపంచ సాహితీ చరిత్రలో ఇంకే కవికి ఇలాంటి సందర్భం బహుశా వచ్చి ఉండదు. పుట్టపర్తి వారి శివతాండవంలో శివుడు తెలుగు మువ్వలు కట్టుకుని, తెలుగులో ఎలా తాండవం చేశాడో చూద్దాం. ఇప్పటికి కనీసం పదిహేనుసార్లు ముద్రితమయిన శివతాండవం కావ్యానికి రెండు, మూడు ముద్రణలకు పుట్టపర్తివారే ముందుమాటగా, చివరి మాటగా కొంత వివరణ ఇచ్చారు. శివుడి తాండవ ఉద్ధృతికి తగినట్లు తాండవగతి అంతా మహోద్ధతిలో సాగుతుంది. పార్వతి లాస్యభాగం చాలా మృదువైనది. ఆ రచన తేలికగా, పూల అలంకరణలా సాగుతుంది. భాష తెలియకపోయినా ఆసేతుహిమాచలం శివతాండవం ఆయన పాడగా విని ఊగిపోయింది. ఆ శబ్దమే శివతాండవాన్ని కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది. నిజానికి ఆ శైలి చదవడం కోసం కాదు. పాడడం కోసం. ఆ పాట కూడా శివుడి నాట్య వేగంతో సమానంగా సాగే సామగానసహిత సాహిత్య ప్రవాహం. పుట్టపర్తి శివతాండవం పాడగా విన్నవారిది అదృష్టం. పుట్టపర్తివారి శివతాండవ కావ్యసారమిది అని చెప్పేంత మంత్ర, నాట్య, సంగీత, సాహిత్య శాస్త్రాల పరిజ్ఞానం నాకు లేదు. ఇరవై ఏళ్ల వయసులో హిందూపురంలో ప్రఖ్యాత తెలుగు విద్వాంసుడు కర్రా వేంకట సుబ్రహ్మణ్యం సార్ దగ్గర కొన్నేళ్లపాటు తెలుగు, సంస్కృత వ్యాకరణం, ఛందస్సు- అలంకారాలు నేర్చుకునే భాగ్యం కలిగింది. ఆయన దగ్గరికి వెళ్లేవరకూ తెలుగులో పుట్టపర్తి నారాయణాచార్యులు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్న రెండు సాహితీ హిమవన్నగాలు ఉన్నాయనే నాకు తెలియదు. భాషలో ఏ ఉదాహరణ అయినా వీరిద్దరి కావ్యాల ప్రస్తావనతోనే చెప్పేవారు. కడప రామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఆయన పుట్టపర్తివారితో కలిసి పనిచేశారు. అలా నాకు శివతాండవమంటే పులకింత. పూనకం. ఒళ్లు తెలియదు. అర్థం తెలియకుండానే కొన్నేళ్లపాటు పాడుకుంటూ ఉండేవాడిని. శివతాండవం మొదలు కావడానికంటే ముందే ప్రకృతి పరవశించి సిద్ధమవుతోంది. గాలులు పులకింతతో చల్లగా వీస్తున్నాయి. గాలి తాకిడికి కొమ్మల్లో పూలు నేల రాలుతున్నాయి. రాలుతున్న పూలు ముసి ముసిగా మువ్వల్లా నవ్వుతున్నాయి. పార్వతి మెడలో పూలహారం అలంకారంగా వెళుతున్నాం కదా! శివతాండవాన్ని ముందు వరుసలో కూర్చుని చూడబోతున్నామని రాలే పూలు మెరిసిపోతున్నాయి. మురిసిపోతున్నాయి. జింకలు చెంగు చెంగున ఎగురుతూ కళ్లల్లో ఆనందబాష్పాలు చిందిస్తున్నాయి. తాండవానికి సిద్ధమవుతున్న శివుడిని జింకలు అలా కన్నీళ్లతో కాళ్లు కడిగాయి. పైన మబ్బులు బంగారు వర్ణం పులుముకుని గొడుగు పడుతున్నాయి. అప్సర యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పక్షుల కిలకిలలు వేదనాదాలుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మ దగ్గరుండి శివుడికి ఒక్కొక్క పామును ఒక్కో ఆభరణంగా వాటి ఆకార పరిమాణాన్ని బట్టి సర్దుబాటు చేస్తున్నాడు. తుమ్మెదల గుంపు శ్రుతి పడుతోంది. సెలయేళ్లన్నీ ఉప్పొంగుతున్నాయి. సాయం సూర్యుడు కొండల్లో దిగిపోకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో శివ తాండవం మొదలయ్యింది. శివుడి తలపై గంగ అలలు అలలుగా ఎగసిపడుతోంది. నెలవంక అటు ఇటు కదులుతోంది. నుదుటిమీద ముంగురులు నాట్యమాడుతున్నాయి. మూడో కంట్లో నుండి నిప్పులు రాలుతున్నాయి. పెదవిమీద నవ్వులు నాట్యమాడుతున్నాయి. శివుడి నాట్యవేగానికి పాములు జారిపోతూ మళ్లీ గట్టిగా చుట్టుకుంటున్నాయి. సముద్రం పొంగినట్లు, కొండలు ఎగిరినట్లు, భూగోళం తిరిగినట్లు, బ్రహ్మాండాలు బంతులాడినట్లు చూస్తున్నవారికి రెండు కళ్లు చాలలేదు. మొగలిపూల వాసనలు చల్లినట్లు మత్తెక్కుతోంది. అంతదాకా లేని వసంత శోభ ఒక్కసారిగా విచ్చుకుంటోంది. ఆ నాట్యం నవ్వుకు నడకలు నేర్పుతోంది. మువ్వలకు మాటలు నేర్పుతోంది. సూర్యుడికి వెలుగునిస్తోంది. తీగలకు సోయగమిస్తోంది. భంగిమల్లో విశ్వమంతా ప్రతీకలుగా ఒదిగిపోతోంది. ముద్రల్లో భావాలు భాష్యాలు పలుకుతున్నాయి. కైలాస శిఖరం అంచులు నిక్కి నిక్కి తేరిపార చూస్తున్నాయి. ఆకాశం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసి ఆనందిస్తోంది. ముందువరుసలో కూర్చున్న విష్ణువు ఆనందం పట్టలేక కళ్లతోనే మాట్లాడుతున్నాడు. ఆ కంటిబాసకు శివుడు నాట్యం చేస్తూనే స్పందనగా ఒక నవ్వు విసిరాడు. ఇద్దరి నవ్వులో లోకాలు ఆనంద నర్తనం చేశాయి. శివుడు విష్ణువయ్యాడు. విష్ణువు శివుడయ్యాడు. చివరికి ఇద్దరూ ఒకటయ్యారు. “ఆడెనమ్మా శివుడు. పాడెనమ్మా భవుడు. ఏమానందము? భూమీతలమున! శివ తాండవమట! శివ లాస్యంబట!” ఈలోపు పార్వతిలాస్యం మొదలయ్యింది. కళ్లలో నవ్వుల కాంతులు చిందుతున్నాయి. చిరుపెదవిలో శివుడి కళలు, కలలు కదులుతున్నాయి. సాక్షాత్తు పార్వతి కాలు కదిపితే తాము పక్కవాద్య సహకారమందించాలని కోటివీణలు తమకు తాముగా కదిలి మధురగానం చేస్తున్నాయి. ఆమె కాలి గజ్జెల్లో ప్రతి మువ్వ ఒక్కొక్క భావాన్ని పలికిస్తోంది. బ్రహ్మ మొదలు రుషులందరూ ఆమె లాస్యానికి తలలూపుతూ తన్మయంతో తేలిపోతున్నారు. పార్వతి లాస్యానికి పరవశుడై శివుడు కూడా చేయి కలిపాడు. శివపార్వతులు ఒక్కటై నాట్యం చేస్తున్నారు. సరస్వతి చేతి వీణ కచ్ఛపి మీటువేగం పెరిగింది. దిక్కులన్నీ పూలు చల్లాయి. దిగ్దిగంతాల్లో శివపార్వతుల నాట్యమే ప్రతిఫలిస్తోంది. ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడికి కావ్యం సమాప్తం. శివ అంటే చైతన్యం. ప్రాణం. స్పందన. శుభం. మంగళం. శివతాండవం అంటే ఆ ప్రాణ స్పందనకు ప్రతిరూపం. లేదా విశ్వ స్పందనకు సంకేతం. ఈశా అన్న మాటే శివ అవుతుంది. ప్రాణముంటే శివం. ప్రాణం లేకపోతే శవం. పార్వతి ప్రకృతి. శివపార్వతుల నాట్య, లాస్యాలు- ప్రాణి, ప్రకృతి స్పందనల సంకేతాలు. కడప ఆకాశవాణి వారు పుట్టపర్తివారు శివతాండవం పాడగా రికార్డు చేశారు. అయితే అప్పటికే ఆయన ఏడు పదులకు దగ్గరగా ఉన్నారు. బహుశా అంతంత గంభీర సమాసాలు ఊపిరి బిగబట్టి పాడడం సాధ్యం అయి ఉండకపోవచ్చు. కానీ అర్ధ శతాబ్దం పాటు ఆయన తిరిగిన ప్రతిచోటా శివతాండవం పాడారు. శివుడి తాండవాన్ని తన శబ్దాలతో, గాన గంగా ప్రవాహంతో ప్రత్యక్ష ప్రసారంగా చూపించారు. కొన్ని వేల వ్యాసాలు రాసినా, వందల విమర్శలు చేసినా, వందకు పైగా కావ్యాలు రాసినా…పుట్టపర్తి అంటే శివతాండవం. శివతాండవమంటే పుట్టపర్తి. సరస్వతీ పుత్రుడి కీర్తి కిరీటంలో శివతాండవమే కలికి తురాయి. నారాయణాచార్యులు కడప జిల్లా ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయంలో నలభై రోజులు నిష్ఠగా ప్రదక్షిణలు చేస్తూ అక్కడే కూర్చుని రాసిన కావ్యమిది. శివుడి తాండవానికి, పార్వతి లాస్యానికి తెలుగు నట్టువాంగమిది. పోతనచేత రాముడు భాగవతాన్ని రాయించినట్లు- పుట్టపర్తి చేత అగస్తేశ్వరుడు రాయించిన శివతాండవమిది. చదవాలంటే అదృష్టం ఉండాలి. వినాలంటే రాసిపెట్టి ఉండాలి. శివతాండవం శైలిలో కృష్ణ తాండవం కూడా పుట్టపర్తి రాస్తే చూడాలని లోకం కోరుకుంది. కుదరలేదు. హిందీలోకి శివతాండవాన్ని ఆయనే అనువదించాలని అనుకున్నారు కానీ- సాధ్యపడలేదు. ఆకాశవాణిలో పనిచేసి రిటైరయిన ఆయన కూతురు పుట్టపర్తి నాగపద్మిని శివతాండవాన్ని అదే ఉద్ధతిలో హిందీలోకి అనువదించి అనేక వేదికల మీద పాడారు. పాడుతున్నారు. ఆ హిందీ అనువాద గ్రంథం ఇటీవల ముద్రణకు నోచుకుంది. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018 -
మహాశివరాత్రి : "శివ శివ" అంటూ తలచుకుంటే..!
మహాకవి ధూర్జటి 'శ్రీ కాళహస్తీశ్వర శతకం'లో శివనామ ప్రాభవం, ప్రభావం గురించి అద్భుతమైన పద్యం చెప్పాడు. "పవి పుష్పంబగు,అగ్ని మంచగు.. శత్రుం డతిమిత్రుడౌ..విషము దివ్యాహారమౌ..." అని అంటాడు. "శివ శివ" అంటూ శివుడిని తలుచుకుంటే చాలు! అన్నీ నీకు వశమవుతాయని అంటాడు. మహాశక్తివంతమైన వజ్రాయుధం లలిత లావణ్యమైన పుష్పంగా రూపు మార్చుకుంటుంది. అగ్ని పర్వతం కూడా మంచు పర్వతంగా మారిపోతుంది, సముద్రమంతా ఇంకిపోయి, మామూలు నేలగా మారిపోతుంది. పరమశత్రువు కూడా అత్యంత స్నేహితుడవుతాడు, విషము దివ్యమైన ఆహారంగా మారిపోతుంది. ఇలా...ఎన్నో జరుగతాయని, అనూహ్యమైన ఫలితాలు, పరిణామాలు ఎన్నెన్నో సంభవిస్తాయని ఈ పద్యం అందించే తాత్పర్యం. అంతటి వశీకరణ శక్తి శివనామానికి వుంది. అతి శీఘ్రంగా భక్తులను కరుణించి, వరాల వర్షాలు కురిపించే సులక్షణభూషితుడు హరుడు. భోళాశంకరుడు, భక్తవశంకరుడు శివదేవుడు. పాల్కురికి సోమనాథుడు నుంచి శ్రీనాథుడు వరకూ,పోతన నుంచి విశ్వనాథ వరకూ,ధూర్జటి నుంచి కొప్పరపు కవుల వరకూ మహాకవులెందరో శివుడిని ఆరాధించినవారే. పంచాక్షరీ మంత్రోపాసనలో పరవశించినవారే. కవులందరూ శివులే. భవ్యకవితావేశంతో శివమెత్తినవారే. శివరాత్రి వేళ స్త్రీ,బాల, వృద్ధులందరూ ఉరిమే ఉత్సాహంతో శివమెత్తి నర్తిస్తారు. ఆ ఉత్సాహం ఉత్సవమవుతుంది. హిందువులకు,ముఖ్యంగా శివారాధకులకు 'మహాశివరాత్రి' గొప్ప పండుగరోజు. శివపార్వతుల కల్యాణ శుభదినంగా, శివతాండవం జరిగే విశేషరాత్రిగా పరమపవిత్రంగా పాటించి వేడుకలు జరుపుకోవడం తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. శివపురాణం ప్రకారం శివుడు లింగాకారుడుగా మారే రోజుగా శివపురాణం చెబుతోంది. ఏ రీతిన చూసినా, ఏ తీరున చెప్పినా, ఏ లీలగా భావించినా ఇది పుణ్యదినం, భక్తులకు ధన్యదినం. శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం, రాత్రంతా జాగారం చేయడం, శివ తపో ధ్యానాలతో తన్మయులవడం సర్వత్రా దర్శనమవుతూ ఉంటాయి. శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా విశేషాల కథా పారాయణలు కోట్లాదిమంది ప్రపంచమంతా జరుపుతారు. బిల్వపత్రాలతో అర్చన చేస్తే శివుడు అత్యంతంగా ఆనందిస్తాడని భక్తులు నమ్ముతారు. "మా రేడు నీవని ఏరేరి తేనా? మారేడు దళములు నీ పూజకు " అన్నాడు వేటూరి. ప్రపంచంలో ఏ దేశంలో వున్నా, శివభక్తులు తెల్లవారుజామునే లేవడం క్రమశిక్షణగా పాటిస్తారు. విభూతి ధారణ చేసి "ఓం నమఃశివాయ" అంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే ఎంతో శక్తి చేకూరుతుందని, ఎన్నో విశేషఫలితాలు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు. తపస్సు, యోగాభ్యాసం, ధ్యానం గొప్ప ఫలితాలను అందిస్తాయన్నది అనాదిగా పెద్దలు చెబుతున్నది. మంత్రోపాసనలు గొప్ప వైభవాన్ని, రక్షణను కలిగిస్తాయని ఆర్యవాక్కు. పంచాక్షరీ మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం విశేషంగా భావిస్తారు. శివుడిని ప్రధానంగా యోగకారకుడుగా అభివర్ణిస్తారు. మహాశివరాత్రి నాడు జాగరణ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆధ్యాత్మిక శోభ, గొప్ప ఆరోగ్యం లభిస్తాయనే విశ్వాసంతో కోట్లాదిమంది తరతరాల నుంచి మహాశివరాత్రిని పరమనిష్ఠగా జరుపుకుంటున్నారు. రాత్రంతా సంగీత,సాహిత్య, నాటక,కళా ప్రదర్శనలతో మార్మోగి పోతుంది. ఎంతోమంది ద్వాదశ లింగాల దర్శనానికి సమాయిత్తమవుతారు. రుద్రాభిషేకం విశేషంగా జరుపుకోవడం పరిపాటి. తెలుగునాట ఎన్నో సుప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నాయి. పల్నాడు ప్రాంతంలోని కోటప్పకొండ ప్రభ తీరే వేరు. కోటప్పకొండ తిరునాళ్ల చాలా ప్రసిద్ధి. శ్రీశైలం,శ్రీకాళహస్తి, భీమేశ్వరం వంటి క్షేత్రాలలో జరిగే విశేషపూజలు, భక్తుల కోలాహలం చెప్పనలవి కాదు. తెలంగాణలో రుద్రేశ్వరస్వామి వెయ్యి స్థంభాల ఆలయం, కీసరగుట్ట, వేములవాడ మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఐశ్వర్యప్రదాతలై విలసిల్లుతున్నాయి. శివుని ఆరాధన సర్వశక్తికరం, సర్వముక్తిప్రదం. శివరాత్రి నాడు జరిగే పూజలను దర్శించుకున్నా పుణ్యప్రదం. నాలుగు యామాలుగా పూజలు నిర్వహిస్తారు. అత్యంత శక్తివంతమైన శివ పంచాక్షరీ మంత్రం ప్రకృతిలో భాగమైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో ముడిపెట్టుకొని ఉంటుంది. శివుడిని పంచముఖునిగా, పంచబ్రహ్మలుగా భావిస్తారు. చైతన్యం దీని మూలసూత్రం. శివతత్త్వమే పరమోన్నతం. నిస్వార్థం, నిరాడంబరత ఆయన సుగుణధనాలు. మహాశివస్మరణ సంబంధియైన మహాశివరాత్రి అర్చనలు మానసిక ప్రశాంతతకు మూలం, శారీరక శక్తికి కేంద్రం, ముక్తికి సోపానం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కాశీ నుంచి కాళహస్తి దాకా, నేపాల్ నుంచి పాకిస్తాన్ దాకా కోటి ప్రభలతో,కొంగ్రొత్త శోభలతో కోలాహలంగా సాగే 'మహాశివరాత్రి' ధరిత్రిని పవిత్రంగా నిలిపే పుణ్యరాత్రి, శివగాత్రి. పాకిస్తాన్ లోని కరాచీలో శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంతో ప్రసిద్ధం. కొన్ని వేలమంది ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మన వలె ఉపవాస దీక్ష ఆచరిస్తారు, సముద్రస్నానం చేస్తారు. శివరాత్రిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరకంగా పిలుచుకుంటారు. కశ్మీర్ లో 'హరరాత్రి' అంటారు. ఒరిస్సావారు 'జాగరా' అంటారు. జాగరా అంటే జాగారం చేయడం, అంటే నిద్రపోకుండా మేల్కొని ఉండడం. పంజాబ్‌లో శోభాయాత్రలు నిర్వహిస్తారు. ఇలా ఏ పేరుతో కొలిచినా, తలచేది శివుడినే. దివ్యశివరాత్రి మనలో భవ్య భావనలు నింపుగాక! - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
Maha Shivratri: శివయ్య అనుగ్రహం కలగాలంటే..
విద్యలన్నింటిలోనూ వేదం గొప్పది. వేదాలన్నింటిలోనూ సంహితకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం గొప్పది. అందులోనూ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం గొప్పది. పంచాక్షరిని పలుకలేకున్నా, అందులో ‘శివ’ అనే రెండక్షరాలు చాలా గొప్పవి అని శాస్త్ర వచనం. శివుడినే శంకరుడని కూడా అంటారు. శంకరోతి ఇతి శంకరః అని వ్యుత్పత్తి. అంటే శమనం లేదా శాంతిని కలిగించేవాడు అని అర్థం. ‘శివ శివ శివ యనరాదా... భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నాడు గాని, అచంచల భక్తితో శివనామాన్ని స్మరిస్తే చాలు, భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైనది. ఉపవాస దీక్షలతో, జాగరణలతో రోజంతా శివనామ స్మరణలో, అభిషేక, అర్చనాది శివారాధన కార్యక్రమాలలో నిమగ్నమై పునీతమవుతారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు తొలుత హాలాహలం ఉద్భవించింది. దాని ధాటికి ముల్లోకాలూ దగ్ధమై భస్మీపటలం కాగలవని భయపడిన దేవదానవులు తమను కాపాడాలంటూ శివుడికి మొర పెట్టుకోవడంతో, శివుడు హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధిస్తాడు. హాలాహలం వేడిమికి శివుడి కంఠమంతా కమిలిపోయి, నీలంగా మారుతుంది. ఈ కారణంగానే శివుడు నీలకంఠుడిగా, గరళకంఠుడిగా పేరుగాంచాడు. ఇది జరిగిన రోజు మాఘ బహుళ చతుర్దశి. లోకాలను కాపాడిన శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు జనులందరూ జాగరణ చేస్తారు. అప్పటి నుంచి మహాశివరాత్రి రోజున శివభక్తులు జాగరణ చేయడం ఆచారంగా మారిందని ప్రతీతి. మహాశివరాత్రిని ఎలా పాటించాలంటే... మహాశివరాత్రి రోజున వేకువజామునే నిద్రలేచి, సూర్యోదయానికి ముందే స్నానాదికాలు ముగించుకోవాలి. ఇంట్లో నిత్యపూజ తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. ఉపవాస దీక్షలు పాటించేవారు పండ్లు, పాలు మాత్రమే స్వీకరించాలి. లౌకిక విషయాలను ఎక్కువగా చర్చించకుండా వీలైనంతగా భగవత్ ధ్యానంలో గడపాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. వీలుంటే మహాశివునికి అభిషేకం జరిపించడం మంచిది. మరునాటి సాయంత్రం ఆకాశంలో చుక్క కనిపించేంత వరకు జాగరణ ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఉపవాస, జాగరణ నియమాలను పాటించకపోయినా, సాత్విక ఆహారం తీసుకుని, వీలైనంతగా శివ ధ్యానంలో గడపాలని శాస్త్రాలు చెబుతున్నాయి. -
Mahashivratri 2024 : ఒక చైతన్య జాగృతి
చతుర్దశి నాడు మహాశివరాత్రిని భక్తులు శివుని జన్మదినంగా వైభవంగా జరుపుకుంటారు. ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం. ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే బహుళ (రాత్రిగల) చతుర్దశినాడు మాసశివరాత్రిగా జరుపుకుంటారు. పరమ శివునికి ఎంతో ప్రీతికరమైన∙శివరాత్రినాడు పగలంతా ఉపవాసం ఉండి, రోజంతా శివనామస్మరణతో గడుపుతూ, ప్రదోషవేళ శివుని అభిషేకించి, బిల్వదళాలతో పూజించాలి. అ రోజున శివాలయంలో దీపం వెలిగించడం వలన విశేష ఫలం లభిస్తుంది. ఉపవాసం, శివార్చన, జాగరణ.. ఈ మూడూ శివరాత్రినాడు ఆచరించవలసిన విధులు. ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో వసించడం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండడమే నిజమైన నియంత్రణ. అదే నిజమైన ఉపవాసం. భౌతిక రుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివసంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకొని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం. మహాశివరాత్రినాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మాసశివరాత్రులు/మహాశివరాత్రినాడు రుద్రాభిషేకాలు శివార్చనలు, బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్యఐశ్వర్య ప్రదం. ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తిచేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన చేసి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని నక్షత్రవ్రతం అంటారు. సోమవారం ’ఇందుప్రదోషం’ గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్ర వచనం.16 సోమవారాలు నియమ పూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభీష్టాలు నెరవేరతాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపం అయినప్పటికీ, శివ రూపమే సనాతనం. ఇదే సకల రూపాలకు మూలం. సాక్షాత్తు శివుడు గుణాతీతుడు. కాలాతీతుడు. నిత్యుడు, అద్వితీయుడు, అనంతుడు, పూర్చుడు, నిరంజనుడు, పరబ్రహ్మ పరమాత్మ. గుణనిధి అనే ఒక దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో శివరాత్రినాడు శివాలయంలో శివుని వెనుక దాగున్నాడు. కొండెక్కుతున్న దీపం వత్తిని కాకతాళీయంగా ఎగదోసి, తన ఉత్తరీయపు కొంగులను చించి వత్తిగా చేసి దానికి జత చేసి ఆవునెయ్యి పోసి దీపప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లవారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడచినా శివరాత్రినాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్య ఫలితంగా మరుజన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి అపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసఖుడయ్యాడన్న కథ శ్రీనాథుడి కాశీఖండంలో ఉంది. శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగరతీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నది ఈ రోజునే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుణ్ణి కృష్ణుడు ప్రార్థించాడనే కథనం వ్యాప్తిలో ఉంది. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివరాత్రివేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్ధివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడోజాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు. శివ తత్త్వం శివతత్త్వం ఎవరికీ అంత సులువుగా అర్థమైనది కాదు. శివుని కన్నా పెద్దది గాని, చిన్నది గాని సాటి మరొకటి లేదనేది తత్త్వ సాధకులు మోక్ష సాధకులకు ఆశ్రయించదగ్గ ఏకైక రూపం శివస్వరూపం. శివతత్త్వంలోని నిగూఢమైనటువంటి విషయాలలో ప్రప్రథమమైనవి జ్యోతిర్లింగాలు. శివుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాలలో ఉన్నాడని, ఇది శివతత్త్వంలో భాగమేనని జ్యోతిర్లింగమనగా చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు (అనగా జ్ఞానము) ప్రసాదించేది అని జ్యోతిర్లింగాల తత్త్వం తెలియచేస్తుంది. శివతత్త్వంలో మరొకటి లింగాకారం. శివలింగాకారం పై భాగం లింగంగా కింద పానపట్టం యోని రూపంలో ప్రకృతీ పురుషుల ప్రతీకగా ప్రకృతీ పురుషులలో ఒకరు లేనిదే మరొకరు లేరు అని చెప్పేటటువంటి తత్త్వం. శివతత్త్వంలో మరొక తత్త్వం ప్రళయ తత్త్వం. ప్రళయతత్త్వం మూడు విధాలుగా ఉన్నది. రాత్రి సమయంలో నిద్ర ఇది ప్రళయతత్త్వంలో ఒక భాగం (నిద్ర) ప్రాపంచిక మాయ నుండి మరపునిస్తుంది. రెండవది మరణం. ఇది స్థూల శరీరానికి సంబంధించినటువంటి ప్రళయం. మూడవది మహా ప్రళయం. సమస్తం శివునిలో కలసిపోవటం. నాలుగవది త్రిమూర్తితత్త్వం (శివ, విష్ణు, బ్రహ్మ). శివుని నుండి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ ఆవిర్భవించారనేది శాస్త్రం. బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు నడిపించి శివుడు అంతం చేయటం లోకోక్తి. పంచభూతలింగాల తత్త్వం. పంచభూతాలు అనగా అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, జలం. అన్నిటిలోను శివుడున్నాడు అనేటటువంటి తత్త్వం. రుద్రతత్త్వం అంటే శివుడిని పూజించేటటువంటి పద్ధతి. రుద్రంలో మహన్యాసం, నమకం, చమకం అనే విధానం. మహన్యాసం అంటే చేసేది శివుడే, నీవు శివుడవే అని నిర్ధారిస్తుంది. శివతత్త్వంలో శివస్వరూపంలో దాగివున్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. శివరాత్రులు ఐదు రకాలు 1. నిత్యశివరాత్రి: ప్రతిరోజూ శివారాధన చేస్తారు. 2. పక్ష శివరాత్రి : ప్రతి మాసంలో శుక్ల, బహుళ పక్షాలలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం. 3. మాస శివరాత్రి : ప్రతి మాసంలో బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహాశివరాత్రి : మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్ఠమనదగిన శివరాత్రి. 5. యోగ శివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన. ఆ రూపంలోనే అంతా! శివుని తలపై గంగ ప్రవాహం ఒక తరంనుండి మరొక తరానికి జ్ఞానం ప్రసారమవుతుందని సూచిస్తుంది. శివుని తలపై చంద్రుడు భగవంతుడిపై ధ్యాస ఎల్లవేళలా ఉండాలని సూచిస్తుంది. శివునికి మూడో కన్ను చెడును, అజ్ఞాన నాశనాన్ని చూపిస్తుంది. శివుని వద్ద ఉన్న త్రిశూలం జ్ఞానం, కోరిక, అమలు అనేటటువంటి మూడింటి స్వరూపం. శివుని ఢమరుకం వేదగ్రంథాలు వేదస్వరాన్ని తెలియచేసే ఢమరుకం. శివుని మెడపై ఉన్న సర్పం అహం నియంత్రణను సూచిస్తుంది. శివుడు ధరించే రుద్రాక్ష స్వచ్ఛతను, ధరించే మాలలు ఏకాగ్రతనూ సూచిస్తాయి. నడుముకు చుట్టుకునే పులి చర్మం భయం లేనటువంటి తత్త్వాన్ని సూచిస్తుంది. క్షీరసాగర మథన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడు ఆ గరళాన్ని తన గళాన నిలిపి ముల్లోకాలనూ కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. ‘నిర్ణయసింధు’లోని నారద సంహితలో శివరాత్రి వ్రతవిధానం ఉంది. మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్మనారు, అక్కమహాదేవి, బెజ్జ్ఞ మహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. – చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఆధ్యాత్మికవేత్త. -
కన్నప్ప లో శివుడి పాత్రలో ప్రభాస్..!
-
శంకరులు చెప్పిన చరమకాంక్ష
గంగాదేవి ఎంత గొప్పదంటే... ‘మాతా జాహ్నవీ దేవీ !’ అని సంబోధించారు ఆది శంకరులు. గంగాష్టకం చేస్తూ..‘‘మాతర్జాహ్నవి శంభూసంగమిలితే మౌషౌ నిధాయాఞ్జలిం/ త్వత్తిరే వపుషో వాసనసమయే నారాయణాం ఘ్రిద్వయమ్ / సనన్దమ్ స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే / భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ’’ అన్నారు. అమ్మా! అని పిలిచారు. నా శరీరం నుంచి ప్రాణాలు ఊర్థ్వముఖమై పోతుంటాయి. ఏదో ఒక సమయంలో శరీరం విడిచి పెట్టాలి కదా! ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ /తస్మాదపరిహార్యే ర్థేన త్వం శోచితుమర్హసి’’పుట్టినవాడు శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. అమ్మా! నా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు నీ ఒడ్డున నిలబడి నా రెండు చేతులు తలమీద పెట్టి అంజలి ఘటించి నీవంక చూస్తూ.... నా ప్రాణాలు పైకి వెళ్ళిపోతుంటే... మిగిలిన వాళ్ళందరూ ఏడ్వ వచ్చుగాక! కానీ నాకు అది ఉత్సవం కావాలి’’ అన్నారు. భగవంతుడు లోపలినుంచి బయటికి ఉత్సవమూర్తిగా వస్తుంటే పరమానందంతో రెండు చేతులెత్తి నమస్కరించి ఎగిరెగిరి చూసినట్లు – నా ప్రాణాలు పైకి లేచిపోతుంటే – అమ్మా నేను ఆనందపడిపోవాలి. ఇంతకాలం ఎవరి పాదాలు పట్టి స్మరించానో ఎవరి గురించి చెప్పుకున్నానో వారి పాదపంజరం లోకి వెళ్ళిపోతున్నా.. ఈ శరీరం వదిలి పెట్టేస్తున్నా..... అని .. చెమటపట్టిన బట్టను ఎంత తేలిగ్గా వదిలేస్తామో, అంత తేలిగ్గా నా శరీరాన్ని వదిలిపెట్టేస్తూ, నా తల మీద నారాయణ మూర్తి పాద ద్వయాన్ని స్మరిస్తూ శివకేశవుల మధ్య భేదం లేకుండా బతికిన నేను చిట్టచివరన శరీరం విడిచిపెట్టేటప్పుడు ‘అమ్మా! నిన్ను చూడాలి’ అని అంటారు. గంగమ్మ వైభవాన్ని గురించి చెబుతూ ఆయన... ‘‘ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం/ పశ్చాత్పన్నగ శాయినో భగవతః పాదోదకం పావనమ్ / భూయః శంభుజటావిభూషణ మణిర్జహ్నోర్మహర్షే రియం / కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ దృశ్యతే’’ అన్నారు. ఆమె మొట్టమొదట శ్రీమహావిష్ణువు పాదాలను కడగడానికి పనికొచ్చింది. బ్రహ్మ సృష్టికర్త. ఆయన తన కమండలంలోని నీటితో విష్ణువు పాదాన్ని కడిగారు. అంటే ఆ కమండలంలో ఉన్నది గంగే. తరువాత శంభుని తలమీద పడింది. తరువాత జహ్ను మహర్షి తాగి తాను మళ్ళీ విడిచి పెట్టాడు. అలా ఋషి స్పర్శ పొందింది. అటువంటి గంగమ్మా! నా పాపాలన్నీ తొలగించు.. అని వేడుకున్నారు. దీక్షితార్ వారు దీనినంతటినీ దృష్టిలో పెట్టుకుని గంగే మాం పాహి.. గిరీశ శిరస్థితే... అన్నారు తన కీర్తనలో. గంగ శివుని తలను తాకింది.. ఎలా? వినయంతో తాకిందా !!! నిజానికి పైనుంచి పడిపోయేటప్పుడు చాలా అహంకారంతో పడింది. ‘ఈడ్చి అవతల పారేస్తాను పాతాళానికి..’’ అంటూ పడింది. అలా పడుతుంటే పరమ శివుడు..‘‘ఇంత అహంకరిస్తోంది గంగ. ఎలా వెళ్ళిపోతుందో, నన్నెంత లాగేస్తుందో చూస్తా..’ అనుకుంటూ.. పాండురంగడు నిలుచున్నట్లు నడుం మీద రెండు చేతులు పెట్టుకుని పైకి చూస్తూ నిలుచున్నాడు. పైనుంచి గంగ పడంగానే జుట్టుతో కట్టేసాడు.. జటాజూటంలో. అలా దానిలోకి ఏళ్లతరబడి అలా పడుతూనే ఉంది. శాస్త్రాలుగానీ మరేదయినా గానీ చదువుకోని దీక్షితార్ వారు చిన్న చిన్న పదాలతో చాలా గంభీరమైన భావాల్ని తన కీర్తనల్లో అద్భుతంగా పలికించారు. అదంతా గురువుల శుశ్రూష ఫలితంగా అబ్బిన విద్యాగంధం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తాగుబోతు చేత ప్రమాణం
-
రామప్ప చెరువు మధ్యలో ఎత్తయిన శివుడి విగ్రహం
-
కాశీలో ఈ వివరాలు ఇస్తే చాలు..!
-
శివుడిని హడలెత్తించిన వృకాసురుడు.. చివరికి తలపై చేయిపెట్టి
పూర్వం వృకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. నిష్కారణంగా అమాయకులను రకరకాలుగా వేధిస్తూ ఆనందించేవాడు. కొన్నాళ్లకు వాడికో దుర్బుద్ధి పుట్టింది. ‘బలహీనులైన మనుషులను, చిన్నా చితకా దేవతలను ఏడిపిస్తే ఏముంది? ఏడిపిస్తే మహాదేవుడని పిలిపించుకుంటున్న శివుణ్ణే ఏడిపించాలి. అప్పుడు కదా నా ఘనత ఏమిటో ముల్లోకాలకూ తెలిసి వస్తుంది’ అనుకున్నాడు. శివుణ్ణి ఏడిపించాలంటే, ముందు అతను తనకు ప్రత్యక్షమవ్వాలి కదా! వృకాసురుడు ఈ ఆలోచనలో ఉండగానే నారద మహర్షి అటువైపుగా వస్తూ కనిపించాడు.వృకాసురుడు ఎదురేగి నారదుడికి నమస్కరించాడు. ‘స్వామీ! పరమశివుడు ప్రత్యక్షం కావాలంటే ఏం చేయాలి?’ అని అడిగాడు. ‘భగవంతుణ్ణి వశం చేసుకోవాలంటే ఒకటే మార్గం. అందుకు తపస్సు చెయ్యాలి. శుచివై, దీక్షతో తపస్సు చెయ్యి నీకు తప్పక పరమశివుడు కనిపిస్తాడు’ బదులిచ్చాడు నారదుడు. నారదుడి సలహాతో వృకాసురుడు శుచిగా నదీ స్నానం చేశాడు. ఒక చెట్టు కింద కూర్చుని శివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. ఎన్నాళ్లు గడిచినా శివుడు ప్రత్యక్షం కాలేదు. ముక్కుమూసుకుని చేసే ఉత్తుత్తి తపస్సుకు శివుడు ప్రత్యక్షం కాడేమో! రాక్షసోచితంగా ఉగ్రతపస్సు చేస్తే ప్రత్యక్షమవుతాడేమోనని తలచి, ఎదుట హోమగుండం వెలిగించి ఉగ్రతపస్సు ప్రారంభించాడు. తన శరీరం నుంచి మాంసఖండాలను కోసి హోమగుండంలో వేయసాగాడు. శరీరంలోని మాంసమంతా కోసి హోమగుండంలో వేసినా శివుడు ప్రత్యక్షం కాలేదు. వృకాసురుడికి పట్టుదల పెరిగింది. ఏకంగా తన తలను తెగనరుక్కుని హోమగుండంలో వేసేందుకు సిద్ధపడ్డాడు. అంతా కనిపెడుతున్న పరమశివుడు ఇక క్షణమైనా ఆలస్యం చేయలేదు. వెంటనే వృకాసురుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘వృకాసురా! నీ సాహసానికి మెచ్చాను. అయ్యో! శరీరంలోని మాంసమంతా కోసేసుకున్నావే! నేను అనవసరంగా ఆలస్యం చేశాను. అయినా ఇప్పుడు వచ్చాను కదా! నీకు ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు. ‘స్వామీ! నువ్వు నాకు దర్శనం ఇవ్వడమే పదివేలు. ఇక నాకు వరాలెందుకు? అయినా, నువ్వు కోరుకొమ్మని అంటున్నావు గనుక కోరుకుంటున్నాను. నా చెయ్యి ఎవరి నెత్తిన పెడితే వారి తల వెయ్యి వక్కలై చచ్చేటట్లు వరం ఇవ్వు చాలు’ అన్నాడు వృకాసురుడు. శివుడు అవాక్కయ్యాడు. ‘వీడు ఉత్త వెర్రివాడిలా ఉన్నాడు. నేను ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడిగితే ఇలాంటి వరం కోరుకున్నాడేమిటి?’ అనుకున్నాడు. ‘ఇదేమిటి? ఇలాంటి వరం కోరుకున్నావు? నీకు ఉపయోగపడేది ఏదైనా కోరుకోరాదా?’ అన్నాడు శివుడు. ‘స్వామీ! నువ్వు కోరుకొమ్మంటేనే నేను కోరుకున్నాను. వరం ఇవ్వడం ఇష్టం లేకపోతే, ఆ ముక్క చెప్పి పోరాదా!’ అన్నాడు దెప్పిపొడుపుగా. శివుడికి అహం దెబ్బతింది. ‘నేను వరం ఇవ్వలేకపోవడం ఏమిటి? ఇచ్చాను. పుచ్చుకుని పో! నీ కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’ అని చెప్పి వెళ్లిపోబోయాడు. వృకాసురుడు వెకిలిగా నవ్వుతూ ‘మహాదేవా! ఆగాగు. నీ కర్మకాలే నాకీ వరం ఇచ్చావు. మొట్టమొదట నీ నెత్తి మీద చెయ్యిపెట్టి, వర ప్రభావాన్ని పరీక్షించుకుంటాను’ అంటూ చెయ్యి పైకెత్తి ముందుకొచ్చాడు. శివుడు హడలి పోయాడు. వృకాసురుడి చెయ్యి నెత్తిన పడకుండా చటుక్కున తప్పించుకుని, దిక్కు తోచక పరుగు లంకించుకున్నాడు. వృకాసురుడు కూడా శివుడిని వెంబడిస్తూ పరుగు తీయసాగాడు. ముందు శివుడు, వెనుక వృకాసురుడు– ఒకరి వెనుక ఒకరు పరుగు తీస్తున్న దృశ్యాన్ని ఆకాశమార్గాన వెళుతున్న నారదుడు తిలకించాడు. దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. వెంటనే వైకుంఠానికి బయలుదేరి వెళ్లి, విష్ణువుకు వృకాసురుడు పరమశివుడిని తరుముతున్న సంగతి చెప్పాడు. పరమశివుడిని ఎలాగైనా రక్షించాలని కోరాడు. శివుడిని కాపాడటం కోసం విష్ణువు తక్షణమే బయలుదేరాడు. బాల బ్రహ్మచారి వేషం ధరించి వృకాసురుడు వస్తున్న దారిలో నిలిచాడు. పరుగుతో ఆయాసపడుతున్న వృకాసురుడు బాల బ్రహ్మచారిని ‘ఏమయ్యా! శివుడు ఇటుగా వెళ్లడం చూశావా?’ అని అడిగాడు. ‘పరుగున వెళుతుంటే చూశాను. ఆ కొండల మాటుగా పరుగు తీస్తూ పోయాడు. అప్పటికీ ఎందుకు పరుగు తీస్తున్నావని నేను అడిగాను కూడా’ అన్నాడు.‘ఏం చెప్పాడేమిటి?’ అడిగాడు వృకాసురుడు. ‘నా భక్తుడు వృకుడు నన్ను తాకుతానంటూ వెంబడిస్తున్నాడు. తాకితే ఇబ్బందేమీ లేదుగాని, ఒళ్లంతా కండలు కోసేసుకుని, దుర్గంధమోడుతున్న శరీరంతో ఉన్నాడు. కనీసం శుచిగా స్నానమైనా చేసి ఉంటే, తాకనివచ్చేవాణ్ణే అని చెప్పాడు’ అన్నాడు బాల బ్రహ్మచారి రూపంలోని విష్ణువు. ‘ఇదీ సమంజసంగానే ఉంది. పరమశివుడు ఎంతైనా దేవుడు. అతణ్ణి తాకేటప్పుడు శుచిగా ఉండటం ధర్మం’ అనుకుని పక్కనే ఉన్న నదిలో స్నానానికి దిగాడు. మెడ లోతు వరకు దిగాక, శిఖ ముడి విప్పుకోవడానికి నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు. అంతే! తల వెయ్యి వక్కలై చచ్చాడు. -
ముక్కంటిని మనువాడిన 27 ఏళ్ల యువతి.. ఎందుకంటే..?
లక్నో: పచ్చని పందిళ్లు, మేలతాళాలు, వేదమంత్రాలు, బంధువుల చిరునవ్వులు, ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకునే కుటుంబ సభ్యుల హడావిడి మధ్య పెళ్లిమండపానికి సిగ్గు పడుతూ వస్తోంది వధువు. ఇదంతా చెబుతుంటే ఎవరిదో వివాహం అని అర్థమవుతోంది కదా..! కానీ ఇది మీరు పురాణాల్లో తప్పా మరెక్కడా చూడని పెళ్లి. భక్తితో పరమ శివున్నే వివాహం చేసుకున్నది ఓ యువతి.. ఏంటో ఈ కథ తెలుసుకుందాం పదండి.. మంచి వరుడు కావాలని ప్రతి యువతి కలలు కంటుంది. ఏ దుర్గునాలు లేని వాడితో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడతారు. అయితే.. మనుషుల్లో అలాంటివారు ఉండరనుకుందో ఏమో? కానీ ఓ యువతి ఏకంగా ముక్కంటినే వివాహం చేసుకుంది. పరమేశ్వరుని మీద భక్తితో శివలింగాన్నే వరునిగా భావించి మనువాడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శివుని సేవలోనే.. ఝాన్సీలో అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి తన తల్లిదండ్రులతో జీవిస్తోంది. వారి కుటుంబమంతా చాలా ఏళ్లుగా బ్రహ్మకుమారి సంస్థతో అనుసంధానమై ఉన్నారు. అనునిత్యం శివుడి సేవలో ఉన్న యువతి.. అపారమైన భక్తి విశ్వాసాలను పెంచుకుంది. దీంతో శివుడినే వివాహమాడుతానని తల్లిదండ్రులకు తెలిపింది. వారు కూడా అందుకు అంగీకరించడంతో యువతి అభీష్టం నెరవేరింది. నెలరోజుల ముందే.. పెళ్లికి నెలరోజుల ముందే వారి కుటుంబమంతా అన్ని ఏర్పాట్లు చేసింది. పెళ్లిమండపాలు వెయించడం, బంధువులకు పత్రికలు పంచడం, పెళ్లి బట్టలు ఖరీదు చేయడం ఇలా అన్నీ పనులు మనుషుల పెళ్లికి చేసినట్లు చేశారు. మేలతాళాల చప్పుళ్లతో బంధువుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ విభిన్నమైన వివాహాన్ని చూడటానికి చుట్టపక్కల ప్రాంతాల ప్రజలు ఆసక్తికనబరిచారు. ఇదీ చదవండి: మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక.. -
శివనామస్మరణతో మారుమోగిన నల్లమల్ల అడవి
-
శివుడి పాటలతో లైవ్ లో ఉర్రూతలూగించిన సింగర్స్
-
మార్మోగిన శివనామ స్మరణ
సాక్షి, చైన్నె: చిదంబరం నటరాజస్వామి వారి సన్నిధిలో ఆదివారం కనులపండువగా రథోత్సవం జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం శివనామ స్మరణను మార్మోగించారు. నటరాజ స్వామి ఓ రథంలో, శివగామసుందరి అమ్మవారు మరోరథంలో, సుబ్రమణ్యంస్వామి, వినాయకుడు, చండీశ్వర్ వేర్వేరు రథాల్లో ఆశీనులై దర్శనం ఇచ్చి భక్తులను కనువిందు చేశారు. కడలూరు జిల్లా చిదంబరంలో వెలసిన నటరాజస్వామి ఆలయం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రతిఏటా ఆణి, మార్గళి మాసాలలో రెండు మార్లు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాదిలో తొలి బ్రహ్మోత్సవంగా ఆణి తిరుమంజనోత్సవాలు ఈనెల 17వ తేదీ నుంచి కనులపండువగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ఇప్పటి వరకు స్వామివారు ప్రతిరోజూ చంద్రప్రభ, సూర్యప్రభ, వెండి, వృషభ, గజ, బంగారు కై లాశ వాహనాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉత్సవాలలో 9వ రోజైన ఆదివారం రథోత్సవ వైభవం అత్యంత వేడుకగా జరిగింది. రథోత్సవం.. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత రథోత్సవానికి ఉంది. ఈ ఉత్సవం కోసం ఆదివారం వేకువజామునే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కనక సభ నుంచి మూలవిరాట్ నటరాజస్వామిని, శివగామసుందరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వెయ్యి కాళ్ల మండపం వద్దకు తీసుకొచ్చారు. పంచమూర్తులతో కలిసి స్వామి వారు బ్రహ్మాండ రథంపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే, మరో రథంపై అమ్మవారు భక్తులను కటాక్షించారు. స్వామి అమ్మవార్ల రథాలకు ముందుగా గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, చండీశ్వర్ స్వాములు వేర్వేరు రథాలలో ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఒకటి తర్వాత మరొకటి రథాలు ఆలయం నుంచి పురవీధుల వైపుగా కదిలాయి. శివనామ స్మరణలు మార్మోగగా, వేలాదిగా తరలివచ్చిన భక్త జనం రథంలో ఆశీనులైన స్వామి, అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు. ఒకే సమయంలో ఒక రథాన్ని మరొకటి అనుకరిస్తూ ముందుకు సాగడంతో రథోత్సవం కనులపండువగా జరిగింది. భక్తులు శివుడి, నటరాజస్వామి వేషాలలో రథాలకు ముందుగా శివనామస్మరణను మార్మోగిస్తూ అడుగులు వేశారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం సోమవారం జరగనుంది. వేకువజామున వెయ్యికాళ్ల మండపంలో నటరాజస్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. సాయంత్రం ఆణి తిరుమంజనోత్సవం జరగనుంది. రాష్ట్రం నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి రానుండడంతో చిదంబరంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. సుశీంద్రంలో.. కన్యాకుమారి జిల్లా సుశీంద్రంలో దనుమలయ ఆలయంలో నటరాజస్వామిగా పరమ శివుడు కొలువై ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి ఉత్సవాలలో భాగంగా ఆణి ఉత్తరం రోజైన ఆదివారం స్వామి వారికి 16 రకాల వస్తువులతో తిరుమంజనసేవ కనులపండువగా జరిగింది. ఉదయం అభిషేక మండపంలో వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామి వారికి చందనం, పాలు, పెరుగు, కొబ్బరినీరు, పన్నీరు, చెరకు రసం, పంచామృతం సహా 16 రకాల వస్తువులతో అభిషేకం జరిగింది. అనంతరం స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. -
పరమశివ తత్వాన్ని కలిగించేలా శివ మూర్తుల వైభవం
అధునాతన సాంకేతికతకు ఆలవాలమైన సిలికాన్ లోయ, (USA)మహాదేవుని పదవిన్యాసపు ఆనంద అనుభూతిలో ఓ సాయంకాలం సేదదీరిన వైనం.. సనాతన ధర్మాన్ని సనూతనంగా నిలుపుకుంటూన్న భారతీయ బంధువులు ధర్మ సంపదను వారసత్వంగా ముందుతరాలకు అందిస్తున్న విన్యాసం.. సామవేద సారమంతా వెల్లువయ్యి, శివపద మంజీరాల నాదధారలుగా పొంగి చైతన్యపు స్రవంతులు పశ్చిమ పర్వతసానువులను పులకింపచేసిన అద్భుతం.. బుడిబుడి నడకల బుజ్జాయిలు సైతం పరమశివ తత్వాన్ని కలిగించేలా గత ఆదివారం అమెరికాలో శాన్ హొసె (కాలిఫోర్నియా)లో నిర్వహించిన సామవేదం షణ్ముఖశర్మ విరచిత శివపదం సంకీర్తనలు “శివ మూర్తుల వైభవం” విశేషంగా నిలిచాయి. వాణి గుండ్లాపల్లి నిర్వహణలో 12 మంది గురువులు కూచిపూడి, భరతనాట్య, మోహినీ ఆట్టం, కథక్, ఒడిసి రీతులన్నీ అలవోకగా మేళవిస్తూ సమ్మోహనపరచాయి. గురువులు: గురు బిదిషా మొహంతీ (ఒడిసీ) గురు నైన శాస్త్రి (భరతనాట్యం) గురు పెండేకంటి సునీత (కూచిపూడి) రాజేష్ చావలి (కూచిపూడి) చందన వేటూరి (కూచిపూడి, భరతనాట్యాలు) గురు భైరవి నెడుంగడి (మోహిని ఆట్టమ్) గురు గణేశ్ వాసుదేవన్ (భరత నాట్యం) అఖిలరావు (భరతనాట్యం) గురు దీపాన్విత సేన్ గుప్త (కథక్) సీమ చక్రబర్తి గురు సుప్రియ సుధాకర్, నూతి ప్రసూన (కూచిపూడి ) శిష్యబ్రుందంతో ఒక సరికొత్త సాంప్రదాయంగా రూపొందింది. భారత ప్రభుత్వ కన్సులేట్ జనరల్ (శాన్ ఫ్రాన్సిస్కో) డాక్టర్ T.V. నాగేంద్ర ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే - "షణ్ముఖ శర్మ గారి గీతాలకు నృత్య రూపం ఇచ్చిన ఈ కళాకారులు ఈ Bay Area ను శివమయం చేశారు. అద్భుతంగా అలరించింది. ఇప్పుడిక్కడ ఉద్యోగాలున్నాయి.. భవిష్యత్తులో ఉద్యోగాలన్నీ మన ఇండియాలోనే అంటే షణ్ముఖ శర్మకి ఆయన పాదాభివందనం చేశారు. కంబోడియాలోని ఖ్మేర్ తమిళ సంఘం ప్రతినిధి డాక్టర్ రామేశ్వరాన్ని, ప్రదర్శించిన గీతాలకు పెయింటింగ్సు వేసిన దెందుకూరి రఘునాథుని కూడా సత్కరించారు. కాలిఫోర్నియా ప్రభుత్వ ప్రతినిధి Assemblyman Josh Hoover పంపిన అభినందన పత్రాన్ని నాగేంద్ర ప్రసాద్ బహూకరించారు. -
Maha Shivaratri 2023: పాహి పాహి పరమేశ్వరా
సృష్టి, స్థితి, లయకారులలో శివుడికి లయకారుడని పేరు. అయితేనేం, ఆయన పరమ బోళావాడు. భక్తజన రక్షకుడు. సనాతనుడు, భూతనాథుడు, వైద్యనాథుడు, పశుపతి నాథుడు, చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు, చంద్రశేఖరుడు. భక్తితో కొలిచే తన భక్తులతోపా పాటు క్రిమికిటకాదులకు కూడా మోక్షమిచ్చి సాక్షాత్కరించే శివయ్య దర్శనం సర్వ పా పాపహరణం. నేడు మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదినాన ఆ శుభకరుడి గురించి చెప్పుకోవడం ఎంతో మంగళప్రదం. మనం ప్రతి నెలలోనూ తెలుగు క్యాలెండర్లలోనూ, పంచాంగాల్లోనూ పండుగలు– పర్వదినాలలో మాస శివరాత్రి అని ఉండటాన్ని చూస్తూంటాం. ఇంతకీ మాస శివరాత్రి అంటే ఏమిటి, మహాశివరాత్రికీ, మాస శివరాత్రికీ గల వ్యత్యాసం ఏమిటో చూద్దాం. ప్రతిమాసంలోనూ బహుళ పక్షం వచ్చే చతుర్ధశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి. వాటన్నింటిలోనూ తలమానికమైనది, మహిమాన్వితమైనది మహాశివరాత్రి. తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందురోజు – రాత్రి చతుర్దశి కలిగి ఉన్న రోజుని జరుపుకోవాలని నిర్ణయ సింధు చెబుతోంది. ‘మహా’ అని ఎక్కడ అనిపించినా అన్నింటికంటే గొప్పదని అర్థం చేసుకోవాలి. శివ పా పార్వతులిరువురికి సంబంధించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం. అందుకే శివరాత్రి నాడు అయ్యకి – అమ్మకి కూడా ఉత్సవం జరుగుతుంది. శివ అంటే మంగళకరమైన అని. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం. ఇంతకీ శివరాత్రి ఎందుకని అంతటి పర్వదినమైందో చూద్దాం. క్షీరసాగర మథనంలో అమృతంకంటే ముందు హాలాహలం పుట్టిన విషయం తెలిసిందే. అది ముల్లోకాలను దహించివేస్తుందన్న ప్రమాదం ఉండడంతో దేవదానవులందరు భీతావహులై తమను రక్షించాలంటూ పరమేశ్వరుణ్ణి వేడుకోవడంతో లోక రక్షణార్థం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి గరళ కంఠుడుగా పేరుపొందాడు. ఈ హాలాహల ప్రభావానికి ఆయన కంఠం నీలంగా మారడంతో నీలకంఠుడయ్యాడు. లోకాలన్నీ ఆ లోకనాయకుడి మూలాన స్థిమితపడిన రోజు పర్వదినం గాక మరేమిటి?అయితే... సంప్రదాయ ప్రియులు జరుపుకునే ప్రతి పండుగకూ ఏదో ఒక పురాణగాథ ఉన్నట్లే మహాశివరాత్రికీ ఒకటి రెండు ఐతిహ్యాలున్నాయి. ఆది మధ్యాంత రహితుడు పరమేశ్వరుడు ఆది మధ్యాంత రహితుడనడానికి సంబంధించిన ఈ గాథని చూద్దాం: పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప ’ అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్తా వివాదం గా మారింది. రానురానూ అది మరింతగా పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధానికి త్రిలోకాలూ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మవిష్ణువుల మధ్య వెలసింది. ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పో రు కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగి ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తిగా మారింది. దాంతో బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు శ్వేతవరాహరూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు. ఎంతదూరం ఎగిరినా బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహరూపంలో ఉన్న విష్ణువు పా పాతాళందాటి వెళ్లినా లింగం మొదలు కనిపించ లేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ మొగలిపువ్వును ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన సంవాదాన్ని వివరించి, తనకు సహాయం చేయమని అడిగాడు. ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజ మేనని సాక్ష్యం ఇవ్వమనిప్రా పాధేయపడ్డాడు బ్రహ్మ. సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేకపో యింది మొగలిపువ్వు. వారిద్దరూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపో యానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలిపువ్వును అడగమని చెప్పా డు. ‘నిజమే’నంది మొగలిపువ్వు.దాంతో తాను ఓడిపో యానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం అంటే మొగలిపువ్వు నాటినుంచి తనను అర్చించడానికి అవకాశం లేదన్నాడు. అంతేకాదు భక్తులెవ్వరూ మొగలిపువ్వులతో తనను పూజించరాదని శాసించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండీ అల్పవిషయంలో అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకుని, భూలోకంలో తనతో సమానంగా పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఈశ్వరుణ్ణి శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చుండబెట్టారు. హారాలు, నూపురాలు, కిరీటం, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్త్రాలు, పూలమాలలు, పువ్వులు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, శ్వేతఛత్రం, వింజామరలు వంటి దివ్యమైన వస్తువులను సమర్పించి షోడశోపచారంగా పూజించారు. ఆ పూజకు ఈశ్వరుడు ఎంతగానో సంతోషించాడు. జ్యోతిర్లింగరూపంలో బ్రహ్మకు, విష్ణువుకు తాను కనిపించిన సమయాన్ని లింగోద్భవకాలంగా పరిగణించాలని, ఇకనుంచి మాఘబహుళ చతుర్ధశి శివరాత్రి అనే పేరుతో తన పూజలకు శ్రేష్ఠమైనదిగా వర్థిల్లుతుందని చెప్పా డు. అంతేకాదు, ఆ తిథినాడు తన మూర్తిని, లింగాన్ని పూజించే వారికి మోక్షం లభిస్తుందన్నాడు. శివరాత్రినాడు పా పార్వతీసమేతంగా తనను అర్చించే వారు మహోన్నత ఫలాలు పొందే విధంగా అనుగ్రహించాడు. మహాశివరాత్రి పండుగను జరుపుకోవడంలో మూడు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపా పాన్ని ధ్యానిస్తూ, శివ నామస్మరణం చేయడం. మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు.. నాలుగు జాములు నిద్రపో కుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కాంధ పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పా పాపా పాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో, ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివ గాథలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజుకి ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపా పాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రి కి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. ఉపవాసం ఎలా? శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేషప్రా పాధాన్యం ఉంది. శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపా పానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా, శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం ‘దగ్గరగా ఉండడం’ అని! భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు, ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పా పాటు శరీరంలోప్రా పాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం కష్టం. శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. అంతేకాదు జాగారం వుండి శివ పంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారాయన భక్తులు. కనుకనే మహాశివరాత్రి నాడు నమశ్శివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ. ‘త్రయంబకం యజామహే...‘ అంటూ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలూ తగ్గి, పూర్ణాయుష్షు లభిస్తుందని ప్రతీతి. శివరాత్రి నాడు కలిగినంతలో దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. ఇవేవీ చేయ(లే)కపో యినా నిర్మలమైన మనస్సు తో వీలైనన్ని సార్లు ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేసినా చాలు, ఆ బోళాశంకరుడుపొంగిపో యి వరాలిస్తాడు. ఆయన రూపం అపురూపం శివుడు నిరాకారుడు. సాకారుడు కూడా. అదే ఆయన ప్రత్యేకత. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపా పాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. శివుడి దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. రెండు స్వరూపా పాలు శివుడు కేవలం రుద్రస్వరూపుడే కాక ప్రేమస్వరూపుడు కూడా. రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. జగతః మాతా పితరౌ శివ పార్వతులు తమ కల్యాణ మహోత్సవానికి చక్కగా చిగిర్చే పూచే వసంతకాలాన్ని మనకిచ్చి ఆకులు రాలే శిశిరాన్ని ఎంచుకున్నారు ఆ దంపతులు. వెన్నెల మెండుగా కాసే పున్నమిని మనకిచ్చి కన్ను పొడుచుకున్నా కానరాని బహుళ చతుర్దశిని తాము తీసుకున్నారు. రాత్రివేళ అయితే అది మనకి ఇచ్చింది అని భావించి తెల్లవారుజామున మంచిదనుకున్నారు ఆ తలిదండ్రులు. మల్లెల్నీ మొల్లల్నీ మనకి విడిచి వాసన, రూపసౌందర్యం లేని తుమ్మిపూవుల్ని సిద్ధం చేసుకున్నారు. చందనాన్ని మన పరం చేసి విభూతిని పులుముకున్నారు. ఊరేగింపునకి ఎద్దునీ, అలంకారాలుగా పా పాముల్నీ ... ఇలా జగత్తుకోసం ఇన్ని త్యాగాలు చేసిన ఆ ఆది దంపతుల కల్యాణ మహోత్సవానికి పిల్లలమైన మనం తప్పక హాజరు కావాలి. ఆశీస్సులు అందుకోవాలి. అందుకే ఈ జాగరణం. – డి.వి.ఆర్. -
Maha Shivratri 2023: సైకత శివయ్య
సంగారెడ్డి టౌన్: మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డిలోని ఫసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 19.5 అడుగుల సైకత మహా లింగాన్ని బుధవారం రాత్రి ఆవిష్కరించారు. విద్యాపీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, గానుగాపూర్ పీఠాధిపతి వల్లభానంద సరస్వతి, కూడలి శృంగేరి శంకరాచార్య పీఠాధిపతి అభినవ విద్యారణ్య భారతి స్వామి ముఖ్య అతిథులుగా సైకత శివలింగాన్ని ఆవిష్కరించారు. 360 టన్నుల ఇసుకతో ప్రపంచంలోనే అతి పెద్దదైన సైకత శివలింగాన్ని రూపొందించినట్టు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. -
విషాదం.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలిన శివుడి వేషధారి..
ఈ మధ్యకాలంలో ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరిని గుండెపోటు మరణాలు వెంటాడుతున్నాయి. అప్పటి వరకు బాగానే చలాకీగా ఉన్నవారు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వారు అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు. సైలెంట్ హార్ట్ ఎటాక్‌లతో అక్కడికక్కడే అర్థాంతరంగా తనవు చాలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జాన్‌పూర్‌లోని బెలాసిన్ గ్రామంలో సోమవారం రామ్‌లీలా నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్ అనే కళాకారుడు శివుడి పాత్ర వేశారు. నాటకం మధ్యంలో పూజారి హరతి ఇస్తున్న సమయంలో శివుడి వేషధారణలో ఉన్న వ్యక్తి వేదికపైనే అమాంతం కుప్పుకూలిపోయాడు. గమనించిన పక్కనున్న వారు అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. చదవండి: మైనర్ల వివాహం వైరల్.. విస్తుపోయే విషయాలు దీనికి సంబంధించిన వీడియోన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మరణించిన రామ్ ప్రసాద్ అలియాస్ చబ్బన్ పాండే ఆరేళ్లుగా ఈ శివుడి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ఇక ఇటీవల ప్రదర్శన ఇస్తూ హనుమంతుడు, రావణుడు పాత్రలు పోషిస్తున్న ఇద్దరు కళాకారులు మరణించిన విషయం తెలిసిందే. आरती के दौरान अचानक मंच पर गिर पड़ा शख्स | Unseen India pic.twitter.com/M8wdUhu1NF — UnSeen India (@USIndia_) October 11, 2022 -
శివయ్యను తాకిన సూర్య కిరణాలు.. పెదపులివర్రులో అపురూప దృశ్యం
పెదపులివర్రు (భట్టిప్రోలు/గుంటూరు): భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొలువైన బాలా త్రిపుర సుందరీ సమేత రాజరాజ నరేంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం స్వామి వారి లలాటాము, అమ్మవారి పాదాల కింద సూర్య కిరణాలు తాకాయి. ఉదయం 6:40 గంటల నుంచి 16 నిముషాల పాటు ఈ కిరణాలు ప్రసరించాయి. దీనినే షోడశ కళలు అని పేర్కొంటారని వేద బ్రాహ్మణుడు ఆమంచి సృజన్ కుమార్ తెలిపారు. ఈ దేవాలయంలో సూర్య కిరణాలు సంవత్సరంలో మే, జూన్, జూలై, ఆగస్టు నాలుగు నెలలు సూర్య కిరణాలు ప్రసరిస్తాయన్నారు. సూర్యుడు మేష రాశి నుంచి ప్రవేశించినప్పుడు ఒక సారి, వృషభ రాశిలో ఒకసారి, మిథున రాశిలో ఒక మారు, కర్కాటక రాశిలో ఒక సారి కిరణాలు ప్రసరిస్తాయన్నారు. ఈదృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. (చదవండి: మంగళగిరిలో 51 అడుగుల పరమ శివుడి విగ్రహం.. ఆవిష్కరించిన దత్తన్న) -
మంగళగిరిలో 51 అడుగుల పరమ శివుడి విగ్రహం.. ఆవిష్కరించిన దత్తన్న
మంగళగిరి (గుంటూరు): మంగళగిరిలో గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి (శివాలయం) వద్ద దాతలు మాదల వెంకటేశ్వరరావు, గోపికృష్ణ, వెంకటకృష్ణ దంపతులు నిర్మించిన 51 అడుగుల పరమ శివుడి విగ్రహాన్ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ సభలో పేర్లు చదివే సమయంలో ఒక్క మహిళ పేరు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. తాను గతంలో మంగళగిరి విచ్చేసిన సందర్భంలో నృసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. 51 అడుగుల పరమశివుడి విగ్రహాన్ని నిర్మాణం చేసిన మాదల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తనచేత ఆవిష్కరింపచేయడం సంతోషంగా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సహకరిస్తానని తెలిపారు. తొలుత బీజేపీ నాయకుడు జగ్గారపు శ్రీనివాసరావు నివాసంలో అల్పాహారం స్వీకరించి అనంతరం లక్ష్మీనృసింహస్వామి వారిని, గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకోగా ఆలయ ఈఓలు ఏ.రామకోటిరెడ్డి, జేవీ నారాయణలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, మార్కెట్ యార్డు చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి, శివాలయం ట్రస్ట్ బోర్టు చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మీరాధిక, బోర్డు సభ్యులు కొల్లి ముసలారెడ్డి, కొల్లి వెంకటబాబూరావు, అద్దంకి వెంకటేశ్వర్లు, నక్కా సాంబ్రాజ్యం, రేఖా వకులాదేవి, జంపని చిన్నమ్మాయి తదితరులు పాల్గొన్నారు. పరమ శివుడి విగ్రహ ఆవిష్కరణ అనంతరం కొబ్బరికాయ కొట్టిన గవర్నర్ దత్తాత్రేయ దేశం సుభిక్షంగా ఉండాలన్నదే ఆకాంక్ష.. గుంటూరు మెడికల్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారని, దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డులోని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు గృహంలో ఆయన విందు స్వీకరించారు. పలువురు బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ గుంటూరు నగర బీజేపీ నేతలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో మాదిరిగా అలై బలై కార్యక్రమాన్ని ఏపీలో కూడా నిర్వహిస్తామన్నారు. గుంటూరులో ఉన్న శ్రేయోభిలాషులను కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ నేతలు మాగంటి సుధాకర్ యాదవ్, జూపూడి రంగరాజు, యడ్లపాటి స్వరూపారాణి, మాధవరెడ్డి, రంగ, వెలగలేటి గంగాధర్, విజయ్, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, పారిశ్రామిక వేత్త అరుణాచలం మాణిక్యవేల్, విశ్రాంత డీఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, ఉన్నారు. -
శివుడి పాట.. ఫర్మానీ నాజ్‌పై ముస్లిం పెద్దల నారజ్
Farmani Naaz Har Har Shambhu:: యూట్యూబ్ సెన్సేషన్, ఇండియన్ ఐడల్ ఫేమ్ ఫర్మానీ నాజ్‌పై ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. ఆమె పాడిన హర్ హర్ శంభూ పాట వైరల్ కావడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. హిందూ దైవం శివుడి మీద పాట పాడిన కారణంతో ముస్లిం సంఘాలు ఫర్మానీ నాజ్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఇది ఇస్లాం వ్యతిరేక చర్య అంటూ ఫత్వా జారీ చేశాయి. ఆమె తన యూట్యూబ్‌లో ఛానెల్లో పాటను పోస్ట్ చేయగా.. వ్యూస్‌తో పాటు విమర్శలూ వెల్లువెత్తున్నాయి. ఈ చేష్టను ఇస్లాం వ్యతిరేక చర్యగా ఆరోపిస్తున్నాయి మతపెద్దలు.. ఇస్లాంలో, అందునా మహిళలు ఇలాంటి పనులు చేయడం మత విరుద్ధమేనని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్ దియోబంద్ను చెందిన మతపెద్ద అసద్ ఖ్వాస్మీ దీన్నొక ‘పాపం’గా, ఘోరమైన నేరంగా అభివర్ణిస్తున్నారు. సంగీతానికి ఆమె దూరంగా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. స్టూడియోలో రికార్డింగ్ వెర్షన్‌ను ఆమె యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. శ్రావణ మాసం సందర్భంగా పాటను రిలీజ్ చేయగా.. హిందూ సంఘాలు, మరికొందరు అభినందిస్తుండగా, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫర్మానీ నాజ్ ఎవరంటే.. ఉత్తర ప్రదేశ్ ముజఫర్‌నగర్‌కు చెందిన ఫర్మానీ నాజ్.. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె యూట్యూబ్‌కు 3.84 మిలియన్లకు పైగా సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఇండియన్ ఐడల్ సీజన్ 12లో పాల్గొనడం ద్వారా ఆమెకు ఒక స్టార్ డమ్ దక్కింది. ఆమె వివాహిత. 2017లో ఆమెకు వివాహం అయ్యింది. అయితే కొడుకు పుట్టడం, ఆ కొడుక్కి జబ్బు చేయడంతో భర్త కుటుంబం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించింది. దీంతో బిడ్డను తీసుకుని ఆమె తన పుట్టింటికి వెళ్లి.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆమె గొంతు బాగుండడంతో స్థానికంగా ఉండే ఓ కుర్రాడు.. ఆమె పాటల్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. అలా యూట్యూబ్ సెన్సేషన్‌గా, ఇ-సెలబ్రిటీగా గుర్తింపు పొందిన ఆమె, ఆపై ఇండియన్ఐడల్లో పాల్గొన్నారు. అయితే కొడుకు ఆరోగ్యం క్షీణించడంతో ఇండియన్ ఐడల్ మధ్యలోనే ఆమె వెనక్కి వచ్చేశారు. అయినా కూడా ఆమె కెరీర్ ముందుకు సాగిపోతూ వచ్చింది. ఏనాడైనా సాయం చేశారా? విమర్శలపై స్పందించిన ఫర్మానీ.. తనది పేద కుటుంబం అని, ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తన మానాన తాను బతుకుతుంటే.. ఇప్పుడు అడ్డుకోవాలని చూడడం, విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఆమె. అన్నింటికి మించి కళాకారులకు మతంతో సంబంధం ఉండదని గుర్తించాలంటూ ఆమె చెబుతున్నారు. అలా అనుకుంటే.. సలీం మోహమ్మద్ రఫీ లాంటి వాళ్లు భజన, హిందూ భక్తి పాటలు ఆలపించేవాళ్లు కాదు కదా.. దయచేసి హిందూ మతానికి, సంగీతానికి ముడిపెట్టొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారామె. అంతేకాదు తనకున్న రెండు చానెల్స్‌లో ఒకటి భక్తి గీతాల చానెల్ అని, అందులో కచ్చితంగా అన్ని మతాలకు సంబంధించిన ఆల్బమ్స్ అప్లోడ్ చేసి తీరతానని, అల్లా ఆశీస్సులు తనపై ఉంటాయని అంటున్నారామె. హిందూ సంఘాల మద్దతు ఇక తాజాగా శివుడి మీద పాట వైరల్ కావడంతో.. ఆమె మీద పలువురి అభినందలు సైతం కురుస్తున్నాయి. బీజేపీ నేత సంజీవ్ బాల్యన్.. ఆమె కొడుకు ట్రీట్మెంట్కు అవసరమయ్యే సాయం అందిస్తానని మాటిచ్చారు. మరోవైపు ముస్లిం సంఘాలు ఫర్మానీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడంపై వీహెచ్‌పీ మండిపడింది. వాళ్లు(ముస్లిం సంఘాలు) పేదలు, నిస్సహాయులకు మాత్రమే ఫత్వా జారీ చేస్తారు. ఇంతకాలం ఆమె యూట్యూబ్ ద్వారా పాడిన సంగతి మరిచిపోయినట్లు ఉన్నారు అంటూ ముస్లిం మత పెద్దలపై విమర్శలు గుప్పిస్తోంది. -
శ్రీశైల మల్లన్న సన్నిధికి కాలినడకన భక్తులు (ఫొటోలు)
-
ఏడు నృత్య రీతుల్లో గురు దక్షిణ
ఆది గురువు పరమ శివుడికి అద్భుతమైన గురు దక్షిణ సమర్పించారు ప్రవాస భారతీయులు. ద్వాదశ జ్యోతిర్లింగాల మహిహను ఏడు సంప్రదాయ నృత్య రీతుల్లో అమోఘంగా ప్రదర్శించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని సామవేదం షణ్ముఖశర్మ రచించిన శివపద కీర్తనలకు అమెరికా , రష్యా దేశాల్లో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. జులై 23వ తేదిన రుషిపీఠం వేదికగా ఈ వర్చువల్ నృత్య ప్రదర్శన జరిగింది. మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడి ఆవిర్భావఘట్టం నుంచి మొదలు పెట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలను వర్ణిస్తూ సామవేదం షణ్ముఖశర్మ రచించిన కీర్తనలకు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేశారు. ప్రముఖ నాట్యకారిణి వాణీ గుండ్లపల్లి వన్ నెస్ ఆఫ్ గాడ్ అనే కాన్సెప్ట్‌తో భారత దేశం లోని పన్నెండు జ్యోతిర్లింగాల విశిష్టతను ఏడు శాస్త్రీయ నృత్య రీతులలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అమెరికా, రష్యా దేశాలకు చెందిన 11 నృత్య శిక్షణాలయాలకు చెందిన 58 మంది గురు- శిష్యుల బృందం పాల్గొన్నారు. ఆది గురువు పరమ శివుడి జ్యోతిర్లింగాలతో పాటు పరమేశ్వరుడి మహిమను కళ్లకు కట్టినట్టుగా కూచిపూడి, భరతనాట్యం, మొహినియాట్టం, మణిపురి , ఒడిస్సి , కథక్ , ఆంధ్రనాట్య నృత్య రీతులలో సమ్మోహనకరంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో రాజేష్ శిష్యబృందం (కూచిపూడి), చందన శిష్యబృందం, నైనా శిష్య బృందాలు (భరత నాట్యం), భిధీష, సీమ శిష్యబృందాలు (ఒడిస్సీ) సరస్వతి శిష్యబృందం (మోమినియట్టం), హేమ శిష్యబృందం (ఆంధ్ర నాట్యం), మిత్ర శిష్యబృందం (మణిపురి), ప్రగ్య , దిపన్విత శిష్యబృందాలు (కథక్)లు ప్రదర్శించారు. గురుపౌర్ణమి సందర్భంగా పరమ శివుడి గొప్ప నృత్య రూపకంగా గొప్పగా ప్రదర్శించారంటూ వాణీ గుండ్లపల్లి , రవి గుండ్లపల్లిలను సామవేదం షణ్ముఖ శర్మ అభినందించారు. సామవేదం షణ్ముఖ శర్మ తెలుగు, సంస్కృత భాషలలో 1100 పైగా శివపదం కీర్తనలు రచించారు. వాటిలో దాదాపు 200 పైగా కీర్తనలకు స్వరకల్పన జరిగింది. -
Guru Purnima: ఆదియోగి తనను ఆదిగురువుగా మార్చుకున్నారు
గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. నిండు పున్నమి రోజు ఉండే స్పందన, ప్రకంపనాలు, ఆ రోజు ఉండే అనుభూతి, మిగతా రోజులలో కన్నా చాలా వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక పధంలో ఉండేవారికి ఈ రోజు ప్రకృతి నుండి లభించిన ఒక వరం లాంటిది. సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురు పూర్ణిమ ఒకటి. యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. మొట్ట మొదటి గురువు జన్మించిన రోజుని గురుపూర్ణిమ అంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేశారు. అనంతరం నిశ్చలుడయ్యాడు. తాము అర్ధం చేసుకోలేని గాఢ అనుభూతినేదో ఆయన పొందుతున్నారని ఆయన్ని చూసినవారు అనుకున్నారు. తమతో సంభాషిస్తాడేమో అని శివుడి కోసం జనాలు ఎదురు చూడడం మోదలుపెట్టారు. కాని అక్కడ జనాలు ఉన్నారన్న స్పృహ శివుడికి లేదు. దీంతో కొంతకాలం ఎదురు చూసి అంతా వెళ్లిపోయారు. కేవలం ఏడుగురు మాత్రం అలాగే వేచి ఉన్నారు. ఈ ఏడుగురు ఆయన వద్ద నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో అక్కడే ఉన్నారు. చివరకు “మీకు తెలిసింది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం” అని వారు ఆయనను బతిమిలాడారు. శివుడు వారిని పట్టించుకోలేదు, “ అజ్ఞానులారా! మీరున్న స్ధితిలో కోట్ల సంవత్సరాలైనా మీకేమీ తెలియదు. ముందు మీరు అందుకు కావాలిసిన యోగ్యత పొందాలి. ఇందుకోసం ఎంతో సాధన చేయవలిసి ఉంటుంది. ఇది వినోదం కాదు” అంటూ తోసిపుచ్చాడు. శివుడి సూచనలకు తగ్గట్టు వారు యోగ్యత పొందేందుకు సిద్ధమయ్యారు. దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి సంసిద్ధమవుతూనే ఉన్నారు. 84 ఏళ్ల సాధన తరువాత, ఒక పున్నమి రోజున, సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశలోకి మారుతున్నప్పుడు, మన సంప్రదాయంలో దక్షిణాయనం ఆరంభమవుతుందనే కాలంలో ఆదియోగి ఈ ఏడుగురిని చూశారు. 84 ఏళ్లుగా సాధన చేస్తున్న వారిని శివుడు పట్టించుకోకుండా ఉండలేకపోయారు. 28 రోజుల పాటు వారిని నిశితంగా గమనించారు. మళ్ళీ పూర్ణ చంద్రోదయమైన రోజున, ఆయన గురువుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆదియోగి తనను తాను ఆదిగురువుగా మార్చుకున్నారు. దక్షిణ దిశవైపుకి తిరిగి, యోగ శాస్త్రం వారికి చెప్పడం ప్రారంభించారు. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు. మన మనసులో తెలుసుకోవాలి అనే ఒక గాఢమైన కోరిక ఏర్పడ్డప్పుడు .... మనకు గురువు లభిస్తారు. ఉత్తమమైన గురువు కోసం వెతుక్కుంటూ వెళ్లక్కర్లేదు. మనలో తీవ్రమైన తపన ఉంటే గురువు తనంతట తానుగా సంభవిస్తాడు, -
తనికెళ్ళ భరణి.. వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!
వెబ్‌డెస్క్: సంప్రదాయాన్ని ఎవరైనా నిలబెడుతున్నారంటే చాలూ ‘నమస్తే అన్నా..’ వాళ్ల కోసం ఎంత దూరమైన వెళ్తాడు ఆయన. బహుశా సినీ రంగంలో ఇంత సాహితీ యావ ఉన్న నటుడు మరోకరు లేరేమో!. ఈ తోట రాముడు... పరమశివుడినే ‘ఏరా’ అంటూ జిగిరీ దోస్తుగా సంభోధిస్తుంటాడు. అదేమంటే... గది గంతే అంటాడు. ఆ ముక్కంటి ప్రియ భక్తుడైనందుకేమో.. ఈ భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!. కళాధరణి ఈ సాహితీ భరణి 1954, జులై 14న సికింద్రాబాద్‌లో పుట్టాడు తనికెళ్ళ భరణి. నటుడికన్నా ముందు ఆయన ఒక మంచి రచయిత.. సాహితీవేత్త. నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే ‘కలం మడిచి జేబులో పెట్టేశాన’ని అంటుంటాడు. కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార... మాటలతో ఆయన ఆడుకునే తీరు.. చూస్తే ఎవరైనా ఆయన వీరాభిమానిగా అయిపోవటం ఖాయం. ‘‘కదలిపోతోంది... భావన వదిలి పోతోంది. వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది. ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను. కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను. కవితలను రాసి రాసి అలసిపోయాను. అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది. తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి. బాధలో నా భావనలను చెదరగొట్టాను. వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయాయి. భావనలు వెళ్లిపోయాయి నన్ను వదిలి వెళ్లిపోయాయి’’... అని ఆయన చెప్తుంటే ‘వాహ్ వా... వాహ్ వా...’ అనకుండా ఉండలేం మరి! గురువు రాళ్లపల్లి లేకుంటేనా.. డెబ్భై దశకం మధ్యలో తనికెళ్ల భరణి సరదాగా నాటకాలు వేస్తుండేవాడు. ఆ టైంలోనే నటుడు రాళ్లపల్లి పరిచయం అయ్యారు. భరణిలోని రచనా పటిమను గుర్తించి ప్రోత్సహించాడు రాళ్లపల్లి. అలా నాటకాలకు డైలాగులు రాయడం మొదలుపెట్టాడు. అటుపై థియేటర్ ఆర్ట్స్‌లో డిప్లోమా చేశాడు. గురువు రాళ్లపల్లి ప్రోత్సాహంతో చెన్నైకి చేరి సినిమా డైలాగుల రచయితగా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఆనాడు రాళ్లపల్లి లేకుంటే.. ఈనాడు తనికెళ్ళ భరణి ఇలా మన ముందు ఉండేవాడు కాదేమో. ఇలాంటి వ్యక్తిని తెలుగు ప్రజానీకానికి అందించిన రాళ్లపల్లికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి. లేకుంటే చెడు సావాసాలతో ఈ సాహితి పిపాసి జైలుకు పోయేవాడేమో! శివుడంటే ప్రాణం తెలంగాణా యాసలో ఇంత చక్కటి శివస్తుతిని పలికించగలగడం భరణి ఇస్టయిల్. నిషాని వాడిలా శివుడిని పూజిస్తూ ఆయన చెప్పిన పద్యాలు శభాష్ శంకరా. శివుడి లయలో ఈ ప్రపంచపు అన్ని కోణలని తాకతూ అభినవ భక్త కన్నప్పలా ఆయన వర్ణించిన తీరు సామాన్యుడికి సైతం అర్థమయ్యే భాషలో రచించిన తనికెళ్లకు సలాం కొట్టక ఉండలేం. సర్వం శివమయం జగత్ అనే శివ ఫిలాసఫీని సింపుల్ గా చెప్పగలిగిన సాహితివేత్త తనికెళ్ల భరణి. ‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్... చిటికెడు బూడిద పోస్తే బస్... వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శబ్బాష్‌రా శంకరా...’ అన్నాడు. అది వింటే శివుడు కూడా భరణి భుజంపై చేయి వేసి హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడేమో! నైజాం అభిమానం యాదగిరి, భువనగిరి అంటూ పేర్లు పెడుతూ కమెడియన్లకు, విలన్లకు తెలంగాణ యాసను అంటగట్టి గేలి చేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం కావడం మనం చూశాం.. చూస్తున్నాం. కానీ, నైజాం భాషను, తెలంగాణ యాసను ఎలా పలకాలో తెలియకనే సినిమాల్లో వ్యంగ్యంగా వాడుతున్నారనేది భరణి అభిప్రాయం. ‘‘సినీ పరిశ్రమలోని ఏ వ్యక్తికీ తెలంగాణ భాషపై కోపంగానీ, దాన్ని అవమానించాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదు. ఉచ్ఛరించే విధానం తెలీకనే కామెడీ కోసం ఆ భాషను వాడేసుకుంటున్నారని’’ ఆయన చెప్తుంటారు. అంతేకాదు ఓ హీరోయిన్ ను పూర్తి స్థాయి తెలంగాణలో మాట్లాడించాలన్న ఉద్దేశంతోనే విజయశాంతితో మొండిమొగుడు-పెంకి పెళ్లాం చిత్రాన్ని తీసినట్లు ఆయన చెప్తుంటారు. గతి మార్చింది ‘శివ’నేనా? దొరబాబు, పాతసామాన్లోడు, నానాజీ, తోటరాముడు, మాణిక్యంగాడు, చేపలక్రిష్ణగాడు.. ఇట్లా 800 సినిమాలకు నటనతో అలరించాడు తనికెళ్ల భరణి. ప్రారంభంలో కామెడీ వేషాలు వేసిన ఆయన.. ‘శివ’తో నానాజీ పాత్రతో విలన్‌గా ఓ మెట్టు పైకి ఎక్కాడు. ఇది కూడా శివుడి ఆజ్ఞ ఏమో!.. అప్పటి నుంచి విలన్ క్యారెక్టర్లలో భరణి నటన కొనసాగింది. అటుపై కమెడియన్‌గా, సపోర్టింగ్ రోల్స్, కమెడియన్ విలన్‌గా.. 2000 సంవత్సరం తర్వాత తండ్రి, బాబాయ్ లాంటి హుందా క్యారెక్టర్లతో అలరిస్తోంది భరణి నటన. అన్నట్లు దర్శకత్వ కోణంతో ఆయన అందించిన ‘మిథునం’.. తెలుగు ప్రేక్షకులకు మాంచి అనుభూతిని కూడా పంచింది. -
Instagram: శివుడి చేతిలో మందు గ్లాసు.. సెల్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ వివాదంలో చిక్కుకుంది. యాప్‌లో ఉన్న జిఫ్ ఫొటోలలో శివుడి చేతిలో మందు గ్లాస్.. సెల్‌ఫోన్ ఉన్నాయని ఓ బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫొటోలు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఇన్స్టాగ్రామ్ సీఈఓపై ఆ నాయకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లోని సెర్చ్ బాక్స్‌లో శివ్ అని టైప్ చేస్తే శివుడు రూపాలు రాగా వాటిలో ఒక ఫొటోలో శివుడు చేతిలో మందుగ్లాస్, సెల్‌ఫోన్ పట్టుకుని ఉన్నట్లు ఉంది. ఇది చూసిన ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకుడు మనీశ్ సింగ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్టాగ్రామ్ సీఈఓ, ఆ సంస్థపై ఢిల్లీలోని పార్లమెంట్ వీధిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించాడు. జిఫ్ స్టిక్కర్ అభ్యంతరకరంగా ఉందని పోలీసులకు చూపించాడు. అతడి ఫిర్యాదును పోలీసులు పరిశీలిస్తున్నారు. కోట్లాది ప్రజలు శివుడిని పూజిస్తారని.. అలాంటి వారి మనోభావాలు దెబ్బతినేలా అభ్యంతరకరంగా జిఫ్ స్టిక్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రూపొందించారని మనీశ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపాడు. ఆదిదేవుడిగా పూజించే శివుడిని అలా చిత్రీకరించడం దారుణమని.. ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించాడు. అందుకే ఇన్స్టాగ్రామ్ సీఈఓపై క్రిమినల్ కేసు పెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. మనీశ్ సింగ్ గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి. -
వైరల్ వీడియో: ఓం నమః శివాయ అంటున్న ఇజ్రాయెల్ వాసులు
-
ఓం నమః శివాయ అంటున్న ఇజ్రాయెల్ వాసులు
జెరూసలెం: కోవిడ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్ని భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. తమకు తోచిన మేర సాయం చేస్తూ.. సంఘీభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక కొన్ని దేశాలు వైద్య పరికరాలు, సామాగ్రి రూపంలో మానవతా సహాయం అందిస్తున్నాయి. ఈ జాబితాలో ఇజ్రాయెల్ కూడా ఉంది. భారత్‌కు మద్దతుగా రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, రెస్సిరేటర్స్ పంపి సాయం చేసింది. ఇదేకాక ఆ దేశ ప్రజలు భారత్ కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ‘ఓం నమః శివాయః’ అంటూ పరమేశ్వరుడిని స్మరిస్తున్నారు. ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ అధికారి పవన్ కె పాల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇటీవల ఈ వీడియో పోస్టు చేశారు. వందలాది ఇజ్రాయెల్ ప్రజలు టెల్ అవీవ్‌లోని ప్రధాన కూడలిలో శివలింగాలను ఏర్పాటుచేసి మరీ ‘ఓం నమః శివాయ’ అంటూ ప్రార్థనలు జరపడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. దీనిలో ఇజ్రాయేల్ ప్రజలు వైరస్‌తో విలవిల్లాడుతున్న భారత దేశ ప్రజలను కాపాడాలని కోరుతూ పరమేశ్వరుడిని స్మరిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన భారతీయ నెటిజనులు ఇజ్రాయెల్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు చేసిన ఈ కార్యక్రమం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, త్వరలోనే ఇండియా కోవిడ్ నుంచి ముక్తి పొందాలని కోరుకుంటున్నామని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: హృదయం ముక్కలైంది.. సోనూసూద్ ఎమోషనల్ -
Chaganti Koteswara Rao: కళ్ల ఎదుటే కైలాసం
ఒక హరిప్రసాద్ చౌరాసియా, ఒక బిస్మిల్లా ఖాన్... మహానుభావులు ఎంతమంది ఎన్నిరకాల వాద్యాలతో, తమ తమ గాత్రాలతో భారత దేశ కీర్తిపతాకాన్ని ప్రపంచమంతటా ఎగరేశారు. మహాతల్లి, ప్రాతఃస్మరణీయురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి మహాస్వామివారు రాసిన కీర్తనను ఐక్యరాజ్యసమితిలో పాడితే సభ్యులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేసారు. ఇప్పటీకీ ఆమె పాట వినబడితే అలా నిశ్చేష్టులై నిలబడి పోతాం. సంగీతాన్ని ఉపాసన చేసిన మహానుభావులు నేదునూరి కృష్ణమూర్తి, బాల మురళీకృష్ణ, పినాకపాణి.. ఎంతమంది ఈ దేశ వైభవాన్ని చాటినవారు. భారతీయ సాంస్కృతిక వైభవం.. అంటే ఒక్కొక్క కళతో ఈశ్వరుడిని ఆరాధించి, ఈశ్వరుడిని పొంది, ఈశ్వరుడిని మన అందరికి కూడా అందించి ఈశ్వరునిలో లయమయ్యారు. నృత్యాన్నే తీసుకోండి. భారతీయ నృత్యం రాజోపచారాల్లోకి చేరింది. నృత్యమంటే ఏదో అర్థంపర్థం లేని పాదాల కదలిక కాదు. ఆంగికం, లాస్యం అని రెండు ఉంటాయి. ఆంగికం అంటే శరీరావయవాలు కదలడం. లాస్యమంటే ముఖంలో భావాలను ప్రకటించడం. అసలు పార్వతీ పరమేశ్వరులు ఎక్కడుంటారు! కేళీవిలాసంలో. అంటే... ప్రపంచమంతా కూడా లాస్య తాండవ సమన్వయంగా ఉంటుంది. ఒక్కొక్కటి చెబుతున్నప్పుడు ముఖం లో ఒక్కొక్క భావన వస్తుంది. చూసేవారుకూడా సంతోషంతో ఆ భావనను ప్రకటిస్తుంటారు. అప్పుడది లాస్యం. అమ్మవారి రూపం. లాస్యప్రియ, లయకరి.. అని లలితా సహస్రంలో స్తుతిస్తాం. తాండవం శివస్వరూపం. తాండవం, లాస్యం రెండూ నాలో ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఇక్కడున్నట్లే.. అంటే ఇదే కైలాసం. అది మరెక్కడో ఉండదు. మన కళ్ళెదుటే ఉంటుంది. అటువంటి అద్భుత నృత్యం మనదేశంలో పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఒక గొప్ప మార్గం. దీనిని రాజోపచారంగా ఎందుకు తీసుకు వస్తారంటే... తిరగడానికి అలవాటుపడిన మనసును పూజలో నిగ్రహించి ఒక్కో ఉపచారం చేస్తున్నప్పుడు దానిని అక్కడ నిలపాలి. యజ్ఞోపవీతం సమర్పయామి.. అన్నప్పుడు ఏదో నోటితో అని వదిలేయడం కాదు.. ఎదురుగా రామచంద్రమూర్తి ఉన్నాడు. ఆయనకు యజ్ఞోపవీతం వేయాలి అంటే ఆయన ఉత్తరీయం అడ్డొస్తున్నది. దానిని తొలగించినప్పుడు స్వామి వారి విశాల వక్షస్థలం, ఆయన బాహువులు చూసి... మనసులో దర్శనం చేస్తూ తన్మయత్వంతో పొంగిపోతాం. ఏకాగ్రతతో అలా పూజచేస్తున్నప్పుడు అలా నిలబడిన మనసు కొంతసేపటికి డస్సిపోతుంది. దానికి మధ్యలో విరామం కావాలి. ఇప్పుడు బ్రేక్ అంటున్నారు కదూ... అది ఇప్పటిది కాదు. మనవాళ్ళు ఎప్పుడో నేర్పినటువంటిది. పూజలో కొనసాగుతూండాలి, మనసుకు కొద్దిగా విరామం ఇస్తూండాలి, భగవంతుడిని మాత్రం వదలకుండా కాసేపు రంజకత్వం పొందడానికి ఇచ్చిన అవకాశమే రాజోపచారంలో.. నృత్యం దర్శయామి అనడం. అప్పుడు నృత్యం చేయడానికి ఒకావిడ వస్తుంది... కస్తూరీ తిలకం ... అంటూ అక్కడ నెమలీకను చూపిస్తారు. ఇక్కడ నృత్యం చేస్తున్నామె కనపడడం లేదు. కృష్ణుడు కనిపిస్తున్నాడు.. ఆయనని చూస్తూ మనసు సంతోషాన్ని పొందుతుంది. కానీ భగవద్దర్శనాన్ని మాత్రం వదిలిపెట్టదు. అందుకని రాజోపయోగంలోకి తీసుకున్నారు. అదీ భారతీయ నృత్య ప్రయోజనం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఒకే శరీరం.. త్రిమూర్తుల శిరస్సులు
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలు ఒకే విగ్రహంగా ఉన్న అరుదైన శిల్పం వెలుగుచూసింది. చరిత్ర పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి 13వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహాన్ని గుర్తించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలోని శిథిల నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఇది బయటపడింది. ఆ ఆలయాన్ని పదిలం చేసుకునే కసరత్తులో భాగంగా స్థానికులు శుభ్రపరుస్తుండగా ఈ విగ్రహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు శివనాగిరెడ్డి అక్కడికి వెళ్లి దాన్ని పరిశీలించారు. ఒకే శరీరానికి మూడు తలలున్న ఆ విగ్రహం ఎంతో ప్రత్యేకమైందని, ఇప్పటివరకు హరి, హర, పితామహ రూపాలు ఒకే విగ్రహంలో ఉండటం అరుదని అన్నారు. ఈ విషయమై కొత్త తెలంగాణ చరిత్ర బృంద ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు జైశెట్టి రమణయ్యలను సంప్రదించగా, గతంలో ఈ రూపంలో విగ్రహం వెలుగుచూసిన దాఖలాలు లేవని వారు పేర్కొన్నట్టు నాగిరెడ్డి వెల్లడించారు. తొలితరం కాకతీయులు జైన ఆరాధకులని, రుద్రదేవుడి నుంచి శైవంపట్ల మొగ్గుచూపారని పేర్కొన్నారు. గణపతిదేవుడి కాలంలో హరిని, హరుడిని విడిగా ఆరాధించేవారి మధ్య ఆధిపత్య పోరు పెరగకుండా ఉండేందుకు, అంతాసమానమనే భావన కల్పించేందుకు ఇలాంటి శిల్పాన్ని ఏర్పాటు చేయించి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామ చివరన ఉన్న పురాతన శివాలయం వద్ద 13వ శతాబ్దానికి చెందిన ఆసీన వీరభద్ర, భద్రకాళి, భైరవ, మహిషాసుర మర్ధిని, అగస్త్య మహాముని విగ్రహాలు వెలుగు చూశాయని ఆయన పేర్కొన్నారు. అరుదైన విగ్రహాలతో కూడిన మందిరాలను పరిరక్షించాలని హెరిటేజ్ తెలంగాణ అధికారులను ఆయన కోరారు. -
శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా!
స్టేజ్‌పై అల్లరి చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రముఖ యాంకర్ శ్రీముఖిలో ఎవరిక తెలియని టాలెంట్ ఉంది. మహశివరాత్రి సందర్భంగా శ్రీముఖిలోని చిత్రకారిణికి బయటకు వచ్చింది. జాగరణ చేస్తూ తను శివుడి బొమ్మ గీసినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘శివరాత్రి రోజు రాతంత్రా జాగారం చేశాను. నిద్ర రాకుండా ఉండేందుకు ఈ శివుడి బొమ్మ గీశాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ల స్టోరీ షేర్ చేసింది. శ్రీముఖీ గీసిన శివుడి బొమ్మ ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘తనలో ఈ టాలెంట్ కూడా ఉందా’, ‘స్టేజ్‌పై చిన్న పిల్లలా అల్లరి చేసే శ్రీముఖిలో ఓ చిత్రకారిణిని దాగుంది’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఆమె నటించిన క్రేజీ అంకుల్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో ప్రముఖ గాయకుడు మనో, రఘుకుంచెతో నటుడు రాజ రవీంద్ర కీలక పాత్రలో నటించారు. -
శివుడికి మూడో కన్ను నిజంగానే ఉందా?
ఏ దేవుడికీ మూడు కళ్లు లేవు... మరి శివుడికే ఎందుకు..అందవికారంగా ఉంటాడుగా మూడో కన్ను ఉంటే... శివుడికి మూడోకన్ను ఉండకపోతే ముక్కంటి ఎందుకవుతాడు... త్రయంబకేశ్వరుడు ఎలా అవుతాడు.. త్రినేత్రుడు అనే పేరును ఎలా సంపాదించుకుంటాడు.. మూడు కళ్ల శివుడు కొలువై ఉన్న ప్రదేశానికే త్య్రయంబకేశ్వరం అనే పేరు వచ్చింది. పవిత్ర గోదావరి నది అక్కడ ప్రభవించింది. తప్పు చేసినా, సాధుసజ్జనులను హింసించినా మూడో నేత్రం అగ్ని ప్రళయాన్ని సష్టిస్తుంది. మూడో కంటి గురించి పండితులు చెప్పే మాట ఇలా ఉంది... శివుడి మూడో కన్ను భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని. ప్రతి మనిషిలోను అంతర్నేత్రం ఉంటుంది. అదే అంతర్జ్యోతి, జ్ఞాన జ్యోతి ప్రసాదిస్తుంది. దానినే మనోనేత్రం అంటాం. ప్రతి మనిషిలోని జ్ఞానజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగును దర్శించుకోగలిగిన వారు మహాపురుషులు అవుతారు. మనకున్న రెండు కళ్లతో ఒక్కోసారి న్యాయమేదో అన్యాయమేదో చూడలేకపోతాం. అందుకే న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి, మనోనేత్రంతో వాస్తవాన్ని వీక్షించాలంటారు న్యాయశాస్త్రవేత్తలు. మూడో కన్ను ప్రత్యేకత... మనోనేత్రంతో కోరికలను జయించాలి. సాక్షాత్తు మన్మథుడు వచ్చి శివుడిని ప్రేరేపించటానికి ప్రయత్నించిన సందర్భంలో ఆయన ఆ కాముడిని తన మూడోకంటితో భస్మం చేశాడు శివుడు. అంటే తన మనో నేత్రంతో కామ వాంఛను జయించాడని అర్థం. అందుకే మనలోనూ మూడో నేత్రం ఉండాలంటున్నాడు శివుడు. ప్రతి సామాన్య మానవుడికి సమతుల్యత, సాధుత్వం, దూరదష్టి ఉండాలి. పరస్త్రీని తల్లిగా భావించాలి, ఇతరుల ధనం కోసం ఆశపడకూడదు, సన్మార్గంలో యశస్పు గడించాలి. ఈ మూడు లక్షణాలకు, పైన చెప్పిన మూడు గుణాలకు త్రినేత్రాలు ప్రతీకలు. మనిషిలో మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు కంటికి కనిపించే వస్తువులు కాకుండా, పోతన చెప్పినట్లు పెను చీకటికి ఆవల ఉన్న పరమాత్మను దర్శించగలుగుతారని యోగీశ్వరులు చెబుతారు. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మూడో నేత్రం గురించి, ‘ఇది జ్ఞానానికి యాంటెన్నా’ అని చెబుతున్నారు. సిద్ధి పొందటానికి ఈ మూడో నేత్రమే దోహదపడుతుందని, భౌతిక శరీరంతో జీవిస్తున్నప్పటికీ సిద్ధి కలుగుతుందని వేదాంతులు చెబుతున్నారు. అదే మూడో నేత్రం. ఒకసారి శివుడు తపోదీక్షలో నిమగ్నమైపోయాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సమయంలో పార్వతీదేవి అక్కడకు వచ్చి, శివుడిని ఆటపట్టించటానికి ఆయన రెండు కళ్లను తన చేతులతో మూసింది. వెంటనే ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది. ముల్లోకాలలోనూ అయోమయం ఏర్పడింది. స్వర్గాధిపతి కూడా భయపడ్డాడు. శివుడు తనకున్న దివ్యశక్తితో, మూడో కన్నును సృష్టించి, తన నుదుటి మీద నిలిపాడు. ఆ కంటి నుంచి అగ్ని ప్రజ్వరిల్లింది. ఆ అగ్ని వల్ల ముల్లోకాలలోనూ చీకటి తొలగింది. శివుని రెండు కళ్లను మూసిన పార్వతి రెండు చేతులూ చెమర్చాయి. పార్వతిపరమేశ్వరుల కారణంగా ఏర్పడిన చెమట ఒక బాలుడిగా పరిణమించింది. ఆ బాలుడే అంధకుడు. మహాదేవుని పరమభక్తుడైన ఒక దానవుడు, అంధకుడిని దత్తతు తీసుకున్నాడు. ఆ కథ వేరు. – డాక్టర్ వైజయంతి పురాణపండ -
కావ్యాలు చదవకూడదు, పాడుకోవాలి
‘సంధ్యారంభవిజృంభితమ్’ .. అని శంకరాచార్యులవారు అంటారు శివానందలహరిలో. సంధ్యా కాలం లో శివుడు నాట్యం చేస్తాడు–అంటాడు. సంధ్య.. అంటే? చీకటి వెళ్ళిపోయి సూర్యుడు వస్తున్నాడు..ఆ మధ్య కాలంలో ఆకాశం ఎర్రబడుతుంది. అది ప్రాతః సంధ్య. మధ్యాహ్నం నడినెత్తి మీదికి వస్తాడు.. అది మాధ్యాహ్నిక సంధ్య. సాయంకాలం.. చీకటి వస్తుంటుంది. పగలు వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మళ్ళీ ఆకాశం ఎర్రబడుతుంది... అది సాయం సంధ్య. ఒక అవస్థలోంచి మరొకదానిలోకి మారుతున్న మధ్య కాలానికి సంధ్య అనిపేరు. దోషమ్ అంటే చీకటి. ప్రదోషమ్.. చీకటికి ముందు వెలుతురు అస్తమిస్తున్న కాలం. ఈ రెంటికీ మధ్య ఉంది కాబట్టి ప్రదోషమ్–సంధ్యాకాలం. సంధ్యాకాలంలో నిశ్శబ్దం ఉంటుంది. సంధ్య మారుతుంటే కాలం నడుస్తుంటుంది. శుక్లపక్షం, కృష్ణపక్షం, మాసాలు, రుతువులు.. నడుస్తాయి. అవి నడిస్తే సుఖం, దుఃఖం అనుభవంలోకి వస్తుంటాయి. సంధ్యలలో కాలం మారిపోతుండాలి. ఈ నడకకి సంధ్య ప్రధానం. సంధ్యాకాలం ఉంటే తప్ప విజృంభణం అన్నది ఉండదు. అంటే అసలు శివుడు ఎక్కడ ఉంటాడు? ఊపిరికీ, ఊపిరికీ మధ్యలో... నేను ఊపిరి లోపలికి తీసుకుంటున్నప్పుడూ ఆ తరువాత నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మనసు లో ఆలోచించి లోపలికి తీసుకున్న ఊపిరిని మళ్ళీ వాక్యంగా మార్చి ఆవిష్కారం చేస్తుంటాను. ఆ మధ్యలో ఆయన లోపల విజంభిస్తుంటాడు. మాటలు మాట్లాడేటప్పుడయితే...‘సంధ్యారంభ విజృంభితమ్’ అంటాం. మరి సంగీతంలో అయితే...!!! శృతి, స్వరం శబ్దంగా పైకొచ్చి వెనక్కి వెడతాయి. రెండుగా ఉన్నవి ఒకటిగా మారిపోతాయి, లోపల అణిగి పోతాయి. ఇక్కడినుంచే ‘ఝుమ్’ అన్న నాదం వస్తుంటుంది. రెండు చెవులు గట్టిగా మూసుకుంటే వినబడుతుంటుంది. మనలోంచే వస్తుంటుంది. నాదోపాసన చేసే విద్వాంసుడు పాట పాడుతూ పాడుతూ వెనక్కి వెళ్లిపోయి శృతినీ, స్వరాన్ని కలిపి నాదంలోకి తీసుకెడతాడు. ఆ నాదాన్ని వింటాడు. అప్పుడు ఒక లిప్తకాలం ఆగిపోతాడు. ఆగి నాదోపాసన చేస్తాడు. అలా నాదాన్ని ఉపాసన చేయడమే శివోపాసన. అదే ఈశ్వరోపాసన. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్రసరస్వతి మహాస్వామి వారు.. ప్రదోష కాలంలో చంద్ర మౌళీశ్వరునికి అభిషేకం చేసి చిట్టచివర చిన్న వీణ చెవి దగ్గర పెట్టుకుని తీగలు మీటుతూ నాదోపాసన చేస్తుండేవారు. నాదోపాసనం సంగీత విద్య. దానితో భగవంతుడిని చేరుకుంటారు. అంతగొప్ప స్థితి భారతీయ సంగీతానికి ఉన్నది. అందుకే అది సంస్కృతిగా వికసనాన్ని ఇస్తుంది. ఎక్కడ సంగీతాన్ని పరమ సంతోషంతో ఆలపించే అలవాటు ఉంటుందో అక్కడ రెండు లక్షణాలు పొటమరిస్తుంటాయి. ఒకటి–భక్తితో అద్భుతమైన దర్శనం కలిగి భావాలుగా ప్రకటితమవుతుంటాయి. అంటే వాగ్గేయకార స్థితి ఏర్పడుతుంది. రెండు–తాను ఆ పాట పాడుతున్నప్పుడు దానితో రమించిపోయి–వెనక్కి వెళ్ళి నాదంతో ఒకటయిపోయి నిలబడిపోతాడు. అందుకే ఆ భావుకత ఏర్పడినప్పుడు ఆయన ఎంత స్థాయికి వెడతారంటే– బ్రహ్మ సృష్టిని తాను అనుకున్నట్లు ఎలా చేస్తాడో, కవి కూడా అలాగే తాను అనుకున్నట్లు కావ్య నిర్మాణం చేస్తాడు. భావుకు డయిన సంగీత కర్త, ఉపాసకుడు, విద్వాంసుడు అలా ఉపాసన చేస్తూ గానం చేసేటప్పుడు పరదేవత ఆనందానికి కారణమవుతాడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం లో అమ్మవారిని ‘కావ్యాలాప వినోదినీ’ అని స్తుతిస్తాం. అందుకే మనకు కావ్యాలను శ్లోకాలుగా చదువుకోమని ఇవ్వలేదు.. తన్మయత్వంతో ఆలపించమని ఇచ్చారు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: అర్జునుడు అంగారపర్ణునితో ఏమన్నాడు? ప్రకృతి స్వరాలు... వికృతి స్వరాలు -
ప్రకృతి స్వరాలు... వికృతి స్వరాలు
‘‘సద్యోజాతాది పంచవక్త్రజ స–రి–గ–మ–ప–ద–ని వర సప్తస్వర విద్యాలోలమ్...’’ అన్నారు త్యాగరాజ స్వామి. జ–అంటే పుట్టినది–అని. సద్యోజాతాది పంచవక్త్రజ...పరమ శివుడికి ఐదు ముఖాలు–సద్యోజాతం, అఘోరం, సత్పురుషం, వామదేవం... పైన ఉండే ముఖం–ఈశానం. ఇది మోక్షకారకం. ఈ సప్తస్వరాలు పరమశివుడి ఐదు ముఖాల్లోంచి వచ్చాయి. వేదం కూడా భగవంతుని ముఖం లోంచే వచ్చింది కాబట్టే దాన్ని అపౌరుషేయం అంటారు. అంటే ఎవ్వరి చేత రాయబడినది కాదు–అని. శృతి–గురువుగారి దగ్గరి నుంచి స్వరంతో మంత్రాన్ని విని శిష్యడు వేదాన్ని నేర్చుకుంటాడు. అంతే తప్ప మంత్రాలు పుస్తకాల్లో రాసుకుని చదువుకోరు. వేదాలు ఎలా భగవంతుని ముఖం నుండి వచ్చాయో, అలాగే ఏ సంగీతం ఏడు స్వరాల మీద ఆధారపడిందో అది పరమశివుని ఐదు ముఖాలు... సద్యోజాతాది పంచవక్త్రజ... సద్యోజాతం మొదలయిన ఐదు ముఖాలనుండి పుట్టింది. స్వరాలు ఏడయినప్పుడు మరి మిగిలిన రెండు స్వరాల సంగతేమిటి? ఏయే స్వరాలు పరమశివుని ముఖాన్నుండి వచ్చాయి, రాని రెండు ఏవి ? అసలు స్వరాలు పరమశివుని ముఖాన్నుండి వచ్చాయి అంటే దానర్థం వాటికన్నా ముందే పరమ శివుడు ఉన్నాడనేగా. అంటే మిగిలిన రెండు స్వరాలు పరమశివుని ముఖం నుండి రాలేదా ..? సప్తస్వరాలు–షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం. వీటినే స–రి–గ–మ–ప–ద–ని అని అంటాం. ఇందులో షడ్జమం–నెమలి కూత లోంచి, రిషభం–ఎద్దు రంకె లోంచి, గాంధారం– మేక అరుపు లోంచి, మధ్యమం–క్రౌంచ పక్షి చేసే శబ్దం లోంచి, పంచమం–కోయిల కూత లోంచి, దైవతం–గుర్రం సకిలింపులోంచి, నిషాదం–ఏనుగు ఘీంకారంలోంచి వచ్చాయి. స–రి–గ–మ–ప–ద–ని అనే ఏడు స్వరాలకూ ఆరోహణ, అవరోహణ ఉంటాయి. భగవంతుడి నుండి విడిపోతే అవరోహణ. మళ్ళీ పైకిపోతే ఆరోహణ... అంటే ఈశ్వరుడిలో ఐక్యం కావడం... అదీ సంగీతం ద్వారా. సప్త స్వరాల్లో రెండు– షడ్జమం, పంచమం..ఈ రెండూ శివుడి పంచముఖాల్లోంచి రాలేదు. అంటే శివుడు ఎప్పటినుంచి ఉన్నాడో అప్పటినుంచి ఉన్నాయి. అందుకే వాటిని ప్రకృతి స్వరాలని అంటారు. ఇవి అనాది–అవి ఎప్పటినుంచి ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. మిగిలిన ఐదు వికృతి స్వరాలు. అవి శివుని ముఖాల్లోంచి వచ్చాయి. ‘‘సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీ వరసప్తస్వర విద్యాలోలం విదలితకాలం విమలహృదయ త్యాగరాజపాలం’’...కాలుడిని.. యముడిని కూడా చంపినవాడు, కాలాతీతుడయిన శివుడున్నాడే... ఆయన విమలమైన మనసు ఉన్న త్యాగరాజును పరిపాలించే ‘నాదతను మనిశం శంకరం నమామి మే మనసా శిరసా’... ఆ శివుడికి నమస్కరిస్తున్నాను. బాలమురళీకృష్ణ గారు ఒకసారి ఫ్రాన్సులో కచేరీ చేస్తుండగా.. ఒకతను ఫ్రెంచిభాషలో ఒక గీతాన్ని రాసి పాడమన్నారు. దానిని చదివి ఆకళింపు చేసుకుని, భారతీయ సంగీతంలోని సప్త స్వరాలలోకి, రాగంలోకి, తాళంలోకి తీసుకొచ్చి ఆయన అత్యద్భుతంగా ఆలపించారు. ఆ దేశస్థులు నివ్వెరపోయారు. గొప్ప బిరుదిచ్చి సత్కరించారు. భారతీయ సంగీతంలోకి ఇమడని ఇతర సంగీతం లేదు. మన సంగీతం ఇతర సంగీతాలలోకి ఇమడదు. అదీ మన సంస్కృతి గొప్పదనం. మనం దానికి వారసులంగా గర్విస్తూ వాగ్గేయకారులకి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలం !!! -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అన్నపూర్ణ అనుగ్రహం ఉంటే ఆకలి ఎందుకు ఉంటుంది ?
కైలాసంలో పరమశివుడు ప్రగాఢ ధ్యానంలో లయించి ఉన్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పార్వతీదేవి ఏదో ఆటగా శివుని కళ్ళు మూసి ఆనందపడింది. పరమేశ్వరుని కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. అందువలన తక్షణమే అంధకారం సమస్త లోకాలను అలముకుంది. జనులు తల్లడిల్లి పోయారు. అది చూసి పరమశివుడు " దేవీ! ఏం పని చేశావు నువ్వు? అదిగో! లోకులం దరూ అంధకారంలో కొట్టుమిట్లాడుతున్నారు, గమనించావా?" అన్నాడు. అంతా చీకటి మయం కావడంతో నానా ఇబ్బందులు పడడం పార్వతీదేవి కళ్ళారా చూసింది.ఆమె బాధ పడింది. " నాథా! తెలియక చేసిన నా అపరాధాన్ని క్షమించండి. ఈ అంధకారం పోయి వెలుతురు వచ్చే మార్గం చూడండి " అంది పార్వతిదేవి. వెంటనే శివుడు తన పాలనేత్రం తెరిచాడు. జగమంతా వెలుతురుతో నిండి పోయింది. భూలోకంలో ప్రజలు తమ దిన చర్యలో పడ్డారు. పార్వతీదేవి తను తప్పు పని చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోనెంచి తను కొంతకాలం తపస్సు చేస్తానంటు భర్త అనుమతి కోరింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో నీవు లోకమాతవు నీకు పాపం అంటదు. తపస్సుకి వెళ్ళనవసరం నీకు లేదు అని అన్నాడు. ఆమె భర్తతో ఏకీభవించలేదు. దేవతలైనా మనుషులైనా తప్పుకు ప్రాయశ్చిత్తం అవసరమే. ఆ ధర్మమాన్ని మనమే అతిక్రమిస్తే లోకులు మనలనే అనుసరిస్తారు, పాపం పెరిగి పోతుంది అంది హిమరాజతనయ. పార్వతీదేవి భర్త అనుమతి తీసుకుని ఆకాశ మార్గానికి దక్షిణ దిశకు బయలు దేరింది. కాశినగరం మీదుగా వెళ్తూ ఉంటే భూలోకవాసులు ఆకలితో అలమ టించడం ఆమె కంట పడింది. రెండు సంవత్సరాలుగా వర్షాలు లేని కారణంగా క్షామం నెలకొని ఉంది. వారి ఆకలి బాధ చూడలేక అక్కడ దిగి ఒక భవనాన్ని నిర్మించుకొని అన్నపూర్ణ అన్న పేరుతో వంటలు వండి వారికి కడుపు నిండుగా భోజనాలు పెట్టసాగింది. కాశిరాజుకి ఈ విషయం తెలిసి ఎవరీ అన్నదాత అని ఆశ్చర్యపోయాడు. అతని కోశాగారంలో బంగారం, వెండి అమూల్య రత్నాలు నాణేలు ఉన్నాయి. కొందామన్నా ఆహార దినుసులు అంగళ్ళలో లేవు. కాశిరాజు ఆ మాతృమూర్తిని చూడాలని వెళ్ళాడు. కోరినంత ధనం ఇస్తాను, ధాన్యాదులు ఇవ్వమంటాడు. ఆమే నేను అమ్మడానికి రాలేదు.మీరందరు నా సంతానం. మీ ఆకలి బాధ తీర్చడానికి వచ్చాను. నువ్వూ పంక్తిలో కూర్చుని తిను అంది ఆమె. " అమ్మా ! మీరు సామాన్య మానవమాత్రులు కారు. చెప్పండి మీరే దేవతో " అన్నాడు రాజు. ఆమె నిజ అవతారం దాల్చి నేను అన్నపూర్ణను అంది. "అమ్మా! అన్నపూర్ణేశ్వరీ! మీరు స్థిరంగా కాశినగరంలో ఉండిపోవాలని నా ప్రార్ధన" అన్నాడు. అది సాధ్యం కాదు నేను తపస్సు కని కైలాసం నుంచి వస్తున్నాను. కొంత కాలం తరువాత పరమేశ్వరునితో పాటు వచ్చి వుంటాను. ఇక మీదట కాశి నగరంలో కరువుకాటకాలు ఉండవు అంటూ అన్నపూర్ణ అంతర్ధానమైంది. అప్పుడే అక్కడ వర్షం మొదలైంది. అన్నపూర్ణ అనుగ్రహం ఉంటే ఆకలి ఎందుకు ఉంటుంది? -గుమ్మా ప్రసాద రావు చదవండి: అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఉత్తరాయణంలో ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు? -
ఎంతబాగా ఆలపించావురా సామగానం!
‘‘ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి ర్బ్రహ్మణోధిపతి ర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్’’... శివుడే నటరాజు. అన్ని కళలూ ఆయన నుండే వచ్చాయి. అంత వేగంగా నృత్యం చేస్తున్నంత మాత్రాన ఆయన రజోగుణ తమోగుణాలకు వశపడతాడనుకోవలసిన అవసరం లేదు. ‘సదాశివోమ్’... ఎల్లప్పుడూ శివుడే. పరమ ప్రశాంతంగా, కళ్యాణమూర్తిగా, భద్రమూర్తిగా, శ్రేయోమూర్తిగా ఉంటాడు. అలా ఉండగలగడం..రాశీభూతమైన సామవేద సారం శివుడే. సామగానం ఆలపించడం అంటే మరేమీ కాదు, పరమశివుడిని ఉపాసన చేయడమే. యాజ్ఞవాల్క్య మహర్షి వీణమీద అనేక రహస్యాలు చెప్పాడు. అందులో ఒకటి.. ఎవరయినా వీణ వాయించేటప్పుడు గురుముఖతః నేర్చుకుని స్వరం తప్పకుండా వీణవాయిస్తూ కళ్ళు మూసుకుని తనలోతాను పరవశించ గలిగితే... ఇక వాడికి ఇతరమైన ఏ ఉపాసనలు అక్కర్లేదు. వాడు పరమేశ్వరుడిని చేరిపోతాడు–అని మహర్షి చెప్పారు. అంత గొప్పది. అందుకే అసలు ఆ వీణ చేత్తో పట్టుకున్నంత మాత్రాన శాంతిని పొందుతాం. ఆ శాంతమే శివుడు. అందుకని ..‘‘నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా’’ అనీ,... ‘‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్ వారమ్’’ అంటే వారమ్ వారమ్ అంటే వారానికోసారి అని కాదు... మళ్ళీ మళ్ళీ అని.. పరమసంతోషాన్ని పొంది..ఆ శాంతి స్థానమే శివుడిగా వచ్చిందని తెలుసుకుని మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ నేను నమస్కరిస్తున్నాను...అన్నాడు త్యాగరాజు. ఆ శివుడికి తనువంతా నాదమే. శివుడిలోంచి సంగీతం వచ్చింది. అది మనోరంజకత్వం కోసం వచ్చింది కాదు. ‘‘సద్యోజాతాది పంచ వక్త్రజ స–రి–గ–మ–ప–ద–ని వర సప్త–స్వర విద్యా లోలమ్...’’ లోలమ్ అంటే దానిమీద విపరీతమైన వ్యామోహం...అని. అది వినేటప్పటికి ప్రసన్నుడయిపోతాడు. ఒకప్పుడు...కాశీపట్టణాన్ని గజాసురుడు పాడుచేస్తుంటే పరమశివుడు వాడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం జరుగుతోంది... వీడితో సమయం పాడుచేసుకోవడం ఎందుకని పరమ శివుడు ఏనుగురూపంలో వచ్చాడు. వాడిని త్రిశూలానికి గుచ్చి పైకెత్తి పక్కన పెట్టుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. మరి ఆయన శాంతమూర్తికదూ! ప్రశాంతంగా కూర్చున్నాడు. పైనున్న ఏనుగు దాని బరువుకు అదే త్రిశూలానికి దిగబడిపోతోంది.ప్రాణాలు పోతున్నాయని తెలుసుకున్న గజాసురుడు సామగానం చేసాడు. వెంటనే పరమశివుడు ప్రసన్నుడయి తలెత్తి చూసాడు. ‘ఎంతబాగా ఆలపించావురా సామగానం !’ అంటూ సంతోషపడి చూసాడు. దానికి గజాసురుడు ..‘‘ శంకరా ! నాదొక కోరిక. దీనికి రక్తం ఎప్పుడూ ఇంకకూడదు. మాంసం ఎండకూడదు. ఈ తోలు ఎండి గట్టిపడకూడదు. దుర్గంధభూయిష్టం కాకూడదు. దీన్ని నీవు ఎప్పుడూ కట్టుకుని కాశీ పట్టణంలో తిరుగుతూ ఉండాలి. నా శరీరం వదిలేసాక తోలువలిచి నీవు కట్టుకోవాలి. ’’ అని ప్రాథేయపడగా ఆయన ‘తథాస్తు’ అన్నాడు. అందుకని ఏనుగు తోలు కట్టుకుని ‘కృత్తివాసీశ్వరుడు’ అన్న పేరుతో కాశీపట్టణంలో వెలిసాడు. ఇప్పటికీ అక్కడ శివలింగం ఏనుగు పష్ఠభాగం ఆకారంలో కనబడుతూ ఉంటుంది. త్యాగరాజుగారు... సామగాన సారంగా నిలబడి, నాదమును తనువుగా పొందిన శివుడిని వారమ్ వారమ్ .. మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను... అన్నాడు. భారతీయ సంగీతం అంతా స–రి–గ–మ–ప–ద–ని..అనే ఏడు స్వరాల నుంచి వచ్చింది. మన సంగీత వైభవానికి ఈ సప్త స్వరాలే ప్రాణం పోస్తున్నాయి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కలలో ప్రత్యక్షం: శివుడి కోసం సమాధిలోకి మహిళ
లక్నో: భక్తి, మూఢనమ్మకాల మాటున మానవులు వింతవింత చేష్టలు చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో జరిగిన ఘోరమైన ఘటన మరువకముందే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ సంఘటన జరిగింది. ఓ మహిళ జీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కొందరి సహాయంతో అడ్డుకోవడంతో ఆమె బతికింది. అయితే తాను శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు జీవ సమాధి అవుతానని 50 ఏళ్ల మహిళ రాద్ధాంతం చేసింది. దీనికి గ్రామస్తులంతా సహకరించడం వింత. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కాన్పూర్ నగర్ జిల్లాలోని ఘటంపూర్ ప్రాంతంలో ఉన్న సజేటి గ్రామానికి రామ్ సంజీవన్, గోమతిదేవి భార్యాభర్తలు. వీరు శివభక్తులు. ఆమె భక్తిభావనలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో తాను జీవ సమాధి కావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇంటి బయట గొయ్యి తవ్వి అందులో తనను సమాధి చేయాలని కుటుంబసభ్యులను కోరింది. శివుడు తనకు కలలో కనిపించాడని, మహాశివరాత్రికి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు తాను సమాధి కావాలని పట్టుబట్టింది. దీంతో ఆమెను సమాధి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇంటి బయట నాలుగు అడుగుల గొయ్యిని తవ్వించారు. ఆ తర్వాత మంచంపై ధ్యానముద్రలో కూర్చుని ఉన్న గోమతిదేవిని గొయ్యిలో దించారు. దీనికి స్థానికులంతా సహకరించారు. అనంతరం అందరూ భజనలు చేస్తూ పూలు, మట్టిని ఆమెపై చల్లారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆమెను సమాధి చేయడం చూసి ఖంగు తిన్నారు. వెంటనే గోమతిదేవిని గొయ్యి లోపలి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు రావడం ఆలస్యమై ఉంటే ఆమె జీవ సమాధి అయ్యి ఉండేది. మూఢ నమ్మకాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. -
శివుని భయంకరమైన రూపమే ఈ అవతారం
న్యూఢిల్లీ: కాల భైరవ జయంతిని శివుని భక్తులు పవిత్రమైన రోజుగా భావిస్తారు. కాల భైరవ జయంతిని నేడు అన్ని ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మార్గశిర (హిందూ క్యాలెండర్ కార్తీక మాసం తర్వాత నెల) కృష్ణ పక్షంలో కాల భైరవ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. కాలభైరవుడు శివుని భయంకరమైన రూపం. ఈ జయంతిని కాల భైరవ అష్టమి అని కూడా పిలుస్తారు. కాల భైరవుని ఆరాధించడం ద్వారా ధైర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సాధారణ నైవేద్యాలతో సులభంగా సంతోషించే శివుడి రూపమే కాల భైరవ అవతారం. భైరవుడు కుక్క మీద కూర్చున్నందున, భక్తులు కుక్కలకు ప్రసాదాన్ని తినిపిస్తారు. హల్వా పూరీని నైవేద్యంగా సమర్పిస్తారు. శనివారాన్ని ఈయన పర్వ దినంగా భావించి కొలుస్తారు. జయంతి నిర్వహించే సమయం అష్టమి తిథి ప్రారంభం: ఈ రోజు సాయంత్రం 6:47 నిమిషాలు అష్టమి తిథి ముగింపు: రేపు సాయంత్రం 5:17 నిమిషాలు కాల భైరవుని ప్రాముఖ్యత కాల భైరవునికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం, శివుని ఈ రూపం భయాన్ని దూరం చేస్తుంది. దురాశ, కోపం, కామాన్ని జయించవచ్చని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం దేవతలు, అసురుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షస వినాశనం కొరకు శివుడు కాల భైరవున్ని సృష్టించాడు. తరువాత అష్ట భైరవులు సృష్టించబడ్డారు. వీరు భయంకరమైన రూపం కలిగిన అష్టా మాత్రికలను వివాహం చేసుకున్నారు. ఈ అష్ట భైరవులు, అష్టా మాత్రికల నుంచి 64 మంది భైరవులు, 64 యోగినిలు సృష్టించబడ్డారు. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్పవారో నిరూపించడానికి చర్చించారని, చర్చ మధ్యలో బ్రహ్మ.. శివుడిని విభేదించడంతో అతని కోపంతో కాల భైరవుడు జన్మించాడని ఒక నమ్మకం. భారత్‌లో ప్రసిద్ధ కాల భైరవ మందిరాలు ►కాల భైరవ ఆలయాలు సాధారణంగా దేశంలోని శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ దేవాలయాల చుట్టూ కనిపిస్తాయి. ►షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని కాల భైరవ ఆలయం ప్రత్యేకమైనది. భక్తులు దేవతకు మద్యం ఆర్పిస్తారు. ►వారణాసిలోని కాల భైరవ మందిరాన్ని వారణాసి యొక్క కొత్వాల్ అని నమ్ముతారు, ఇది తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఒకటి. ►కాలభైరవేశ్వర కర్ణాటకలోని ఒక పురాతన ఆలయం, దీనిని ఆదిచుంచనగిరి కొండలలోని కాలభైరవేశ్వర క్షేత్ర పాలక అని పిలుస్తారు. ►ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని అజైకాపాడ భైరవ ఆలయం ఒడిశాలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి ►తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని కలభైరవర్ ఆలయం కాల భైరవ రూపానికి అంకితం చేయబడింది. ►రాజస్థాన్‌లో జుంజూన్ జిల్లాలోని చోముఖ భైరవ ఆలయం శైవుల ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. ►మధ్యప్రదేశ్‌లోని అడెగావ్లోని శ్రీ కాల భైరవనాథ్ స్వామి ఆలయం దేశ నలుమూలల నుంచే కాకుండా నేపాల్‌తో సహా దేశాలు సందర్శించే పవిత్ర ప్రదేశం. ►భారతదేశంలోని కాల భైరవ దేవాలయాలు సాధారణ శివాలయాలకు భిన్నంగా ఉంటాయి. నైవేద్యాలు కూడా ప్రత్యేకమైనవి. -
కలలో దేవుడు: మర్మాంగాన్ని కోసుకున్న ఖైదీ
భోపాల్: జైలులో ఉన్న ఓ వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. తనకు దేవుడు చెప్పాడంటూ మర్మాంగాన్ని కోసుకున్న విచిత్ర ఘటన గ్వాలియర్ జైలులో చోటు చేసుకుంది. విష్ణు సింగ్ రాజ్వత్ అనే వ్యక్తి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్నాడు. మంగళవారం నాడు అతను తీవ్ర రక్తస్రావంతో కనిపించాడు. దీనిపై అతడు జైలు అధికారులతో మాట్లాడుతూ.. రాత్రి తనకు కలలో శివుడు ప్రత్యక్షమై, తన పురుషాంగాన్ని త్యాగం చేయాల్సిందిగా కోరాడని, అందుకే ఈ పని చేశానని తెలిపాడు. చెంచాను పదునుగా మార్చి దానితోనే మర్మాంగాన్ని కత్తిరించి శివలింగం వద్ద ఉంచినట్లు పేర్కొన్నాడు. (మహిళల గుండు గీయించి, అర్ధనగ్నంగా ఊరేగిస్తూ) దీనికి తాను ఏమాత్రం చింతించట్లేదన్నాడు. ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట్ మనోజ్ సాహు మాట్లాడుతూ.. "ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఖైదీ విష్ణు సింగ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాం. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాం. ప్రస్థుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది" అని తెలిపాడు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా అతను ఏడాదిన్నర క్రితం ఓ పోలీసును చంపిన కేసులో కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది. (పోలీసుల అదుపులో ‘బాయ్స్ లాకర్ రూం’ సభ్యుడు) -
కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకర ఘటన
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా రాజకీయ నేతలు, ప్రముఖుల కోటాలో రైలు టికెట్లను కేటాయిస్తారు. కానీ కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మాత్రం ఏకంగా దేవుడికే ఓ సీటును రిజర్వు చేశారు. అంతేకాదు శివుడి పేరుతో ప్రత్యేక బెర్త్ కూడా ఏర్పాటు చేశారు. బి5 కోచ్‌లోని సీట్ నెంబర్ 64 పూర్తిగా దేవుడికే కేటాయించారు. అంతటితో ఆగిపోకుండా అందులో శివుడి చిత్రపటాన్ని పెట్టి సీటును పూలతో డెకరేట్ చేశారు. ప్రయాణికులు ఎవ్వరు ఈ సీట్ పైకి ఎక్కకూడదు అంటూ బోర్డు పెట్టారు. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని ఎంత కాలం వరకు దేవుడి పేరుతో కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ప్రయాణికులంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా యూపీలో కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు ఇండోర్ నుంచి కాశీకి ప్రతి రోజూ రాకపోకలను జరుపుతుంది. మార్గంలో మధ్యలోని మూడు జోతిర్లాంగాల క్షేత్రాలైన.. ఓంకారేశ్వర్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌ని చుట్టుకుంటూ కాశీని చేరుకుంటుంది. సుమారు 1131 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ మూడు జోతిర్లాంగాల క్షేత్రాలను చుట్టేస్తుంది. ప్రతి కోచ్ లో భక్తి సంగీతం చిన్నగా వినిపిస్తూ ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భక్తి భావం కలిగేలా ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతో పాటు శాకాహార భోజనం కూడా అందించే ఏర్పాట్లు చేశారు. కాగా భారతీయ రైల్వే కాకుండా పూర్తిగా ప్రైవేటు సంస్థ తయారు చేసిన మూడో రైలు కాశీ మహాల్ ఎక్స్ ప్రెస్ కావడం విశేషం. -
మహా ‘శివ’రాత్రి మార్మోగిపోయేలా
ముక్కోటి దేవతలలో శివుడు సనాతనుడు. శివుడు భోళాశంకరుడు. శివుడు భక్త వశంకరుడు. శివుడు పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు. శివుడు భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు. సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు. ఏదో మాట వరసకు జన్మానికో శివరాత్రి అంటారు గాని, నిజానికి ఏటా మహాశివరాత్రి పర్వదినం వస్తూనే ఉంటుంది. లోక రక్షణ కోసం శివుడు గరళాన్ని దిగమింగి కంఠంలో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా, ముందుగా హాలాహలం పుట్టింది. హాలహల విషజ్వాలలు ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తుండటంతో దేవదానవులంతా పరమశివుడిని శరణు వేడుకున్నారు. భక్త వశంకరుడైన శివుడు మరో ఆలోచన లేకుండా, హాలాహలాన్ని ఒడిసి పట్టి, దానిని దిగమింగి గొంతులో బిగించి బంధించాడు. గరళమైన హాలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయి నీలిరంగులోకి మారడంతో నీలకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడు స్పృహతప్పిపోయాడు. పార్వతీదేవి భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖించసాగింది. జరిగిన పరిణామానికి దేవదానవులందరూ భీతిల్లారు. శోకసాగరంలో మునిగిపోయారు. శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు అందరూ జాగరం చేశారు. నాటి నుంచి శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివుని పూజించి, జాగరం చేయడం ఆనవాయితీగా మారినట్లు పురాణాల కథనం. పురాణాలే కాదు, వాటి కంటే పురాతనమైన వేదాల కంటే ముందు నుంచే భారత ఉపఖండంలో ప్రజలు శివారాధన చేసేవారు. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌భెట్కా గుహలలోని కుడ్యచిత్రాలు ఆనాటి శివారాధనకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. అవి క్రీస్తుపూర్వం ఎనిమిదివేల ఏళ్ల నాటివని చరిత్రకారుల అంచనా. భీమ్‌భెట్కా గుహలలో శివతాండవ దృశ్యాలు, శివుడి త్రిశూలం, ఆయన వాహనమైన నంది చిత్రాలు నేటికీ నిలిచి ఉన్నాయి. సింధులోయ నాగరికత కాలంలో హరప్పా మొహెంజదారో ప్రాంతాల్లోని ప్రజలు శివుడిని పశుపతిగా ఆరాధించేవారనేందుకు మొహెంజదారోలో జరిపిన తవ్వకాలలో ఆధారాలు దొరికాయి. వేద వాంగ్మయం శివుడిని ప్రధానంగా రుద్రుడిగా ప్రస్తుతించింది. రుగ్వేదంలో మొదటిసారిగా ‘శివ’నామం కనిపిస్తుంది. రుద్రాంశ ప్రళయ బీభత్సాలకు దారితీసే ప్రకృతి వైపరీత్యాలకు కారణమైతే, శివాంశ కాలానుకూలమైన మంచి వర్షాలకు కారణమవుతుందని వేద స్తోత్రాలు చెబుతున్నాయి. గ్రీకు దేవుడు ‘డయోనిసిస్’కు శివుని పోలికలు ఉండటంతో భారత భూభాగంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ ఇక్కడి శివుడిని ‘ఇండియన్ డయోనిసిస్’గా అభివర్ణించాడు. కాలక్రమేణా భారత ఉపఖండంలో శివుడినే పరమదైవంగా పరిగణించే శైవమతం వ్యాప్తిలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలో శైవమతం విస్తృతంగా వ్యాపించింది. భగవద్గీత కంటే ముందునాటి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత మూలాలు కనిపిస్తాయి. భారత ఉపఖండమే కాకుండా, శ్రీలంక, కంబోడియా, వియత్నాం, ఇండోనేసియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. సనాతన మతాలలో శైవమతం శాక్తేయానికి దగ్గరగా ఉండటంతో పలుచోట్ల శివుడితో పాటు శక్తి ఆరాధన జమిలిగా జరిగేది. అందుకే చాలాచోట్ల శైవక్షేత్రాలు, శక్తి పీఠాలు సన్నిహితంగా కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలో చాలా రాజ్యాలు శైవాన్ని బాగా ఆదరించాయి. ఆ కాలంలోనే విస్తృతంగా శివునికి ఆలయ నిర్మాణాలు జరిగాయి. అందరివాడు శివుడు అందరివాడు. బ్రహ్మవిష్ణు దేవేంద్రాది దేవతలే కాదు, రావణుడు, బాణాసురుడు, భస్మాసురుడు వంటి దానవులు, వాలి వంటి వానరులు, సమస్త రుషులు, ఆది శంకరాచార్యుల వంటి ఆధ్యాత్మిక గురువులు, కన్నప్ప వంటి గిరిజనులు శివుని ఆరాధించిన వారే. కాళహస్తి మహాత్మ్యం కథనం ప్రకారం సాలెపురుగు, సర్పం, ఏనుగు కూడా శివుని పూజించినట్లు తెలుస్తోంది. దేవ దానవ మానవులకే కాదు, చరాచర సృష్టిలోని సమస్త జీవులకు శివుడే దైవమని పురాణాలు చెబుతున్నాయి. రామాయణ, మహాభారత కాలాల నాటికే శైవమత వ్యాప్తి విస్తృతంగా ఉండేది. బ్రహ్మ సృష్టికారకుడని, విష్ణువు స్థితికారకుడని, శివుడు లయకారకుడని పలు పురాణాలు చెబుతున్నా, శైవమతం ప్రకారం సృష్టి స్థితి లయలకు శివుడే కారకుడు. శివుడే పరబ్రహ్మ స్వరూపుడు. శివుడే ఆదిదేవుడు. సమస్త విశ్వానికీ శివుడే అధినాథుడు. కర్ణాటకలోని మురుడేశ్వరుడు శివుడిని వివిధ భంగిమల్లోని విగ్రహమూర్తిగానే కాకుండా, లింగరూపంలో పూజిస్తారు. చాలాచోట్ల శివాలయాల్లో శివుని పూర్తి విగ్రహాలకు బదులు శివలింగాలే కనిపిస్తాయి. శివపురాణం, లింగపురాణాల్లో శివుని మహిమలకు సంబంధించిన గాథలు విపులంగా కనిపిస్తాయి. అంతేకాదు, మిగిలిన పురాణాల్లోనూ శివుని ప్రస్తావన, శివునికి సంబంధించిన గాథలు కనిపిస్తాయి. సనాతన మతాలైన వైష్ణవ, శాక్తేయాల్లోనూ శివునికి సముచిత ప్రాధాన్యం కనిపిస్తుంది. స్మార్త సంప్రదాయంలోని పంచాయతన దేవతల్లో శివుడికీ స్థానం కల్పించారు. వైష్ణవం పుంజుకోక ముందు ఉత్తర దక్షిణ భారత ప్రాంతాల్లోని పలు రాజ్యాల్లో శైవానికి విపరీతమైన ఆదరణ ఉండేది. ప్రతి రాజ్యంలోనూ శివాలయాలు వెలిశాయి. వాటికి సంబంధించిన స్థల పురాణాలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కుషానుల పాలనలో చలామణీలో ఉన్న బంగారు నాణేలపై నంది వాహనంతో శివుని బొమ్మను ముద్రించారంటే ఆనాటి కాలంలో శైవానికి ఎలాంటి ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు శైవ క్షేత్రాల్లో ప్రధానమైనవి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఈ పన్నెండు క్షేత్రాలనూ శైవులు అత్యంత పవిత్ర క్షేత్రాలుగా పరిగణిస్తారు. గుజరాత్‌లోని సోమనాథ క్షేత్రం, జామ్‌నగర్‌లో నాగేశ్వర క్షేత్రం, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలంలోని మల్లికార్జున క్షేత్రం, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినిలోని మహాకాలేశ్వర క్షేత్రం, ఇండోర్ సమీపంలోని ఓంకారేశ్వర క్షేత్రం, ఉత్తరాఖండ్‌లో కేదారనాథ క్షేత్రం, మహారాష్ట్రలో పుణె సమీపంలోని భీమశంకర క్షేత్రం, నాసిక్ వద్ద త్రయంబకేశ్వర క్షేత్రం, ఎల్లోరా వద్ద ఘృష్ణేశ్వర క్షేత్రం, ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని విశ్వేశ్వర క్షేత్రం, జార్ఖండ్‌లో దేవ్‌గఢ్ వద్ద వైద్యనాథ క్షేత్రం, తమిళనాడులో రామేశ్వరంలోని రామనాథ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఆంధ్రప్రదేశ్‌లో పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో ఐదు శైవ క్షేత్రాలు పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అవి: అమరావతిలోని అమరలింగేశ్వరుని ఆలయం, ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం, భీమవరంలోని సోమేశ్వర ఆలయం, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర ఆలయం, సామర్లకోటలోని కుమార భీమేశ్వర ఆలయం. ఇవి అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం, భీమారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. పంచభూత క్షేత్రాలు ఐదు శైవ క్షేత్రాలు పంచభూత క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వీటిలో నాలుగు తమిళనాడులో ఉంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉంది. తమిళనాడులోని జంబుకేశ్వరం జల క్షేత్రంగా, అరుణాచలం అగ్ని క్షేత్రంగా, కంచిలోని ఏకాంబరేశ్వరాలయం పృథ్వీక్షేత్రంగా, చిదంబరంలోని నటరాజ ఆలయం ఆకాశ క్షేత్రంగా, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందాయి. ఆదియోగి మన పురాణాలు ఆదియోగి శివుడేనని చెబుతాయి. పరమయోగులందరికీ శివుడే గురువని చెబుతాయి. సనాతన మతాలలో యోగసాధనకు విస్తృత ప్రాధాన్యం ఉంది. జీవుని అంతిమ లక్ష్యం కైవల్యమేనని, కైవల్యపథాన్ని చేరుకోవడానికి యోగమే మార్గమని, యోగసాధనతోనే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. యోగ విద్యలో వివిధ పద్ధతులు ఉన్నా, శైవ సంప్రదాయానికి చెందిన గ్రంథాలు ఎక్కువగా హఠయోగానికే ప్రాధాన్యమిచ్చాయి. క్రీస్తుశకం ఒకటో శతాబ్దికి చెందిన ‘ఈశ్వర గీత’, పదో శతాబ్దికి చెందిన ‘శివసూత్ర’, ‘శివసంహిత’ వంటి గ్రంథాలు శైవ సంప్రదాయంలో యోగసాధనకు గల ప్రాశస్త్యాన్ని విపులంగా వివరిస్తాయి. భవబంధాలలో చిక్కుకున్న మనుషులు నిరంతరం ఈతిబాధల్లో కొట్టుమిట్టాడుతుంటారని, పరమాత్మను చేరుకోవాలంటే మనుషులకు యోగమే తగిన మార్గమని పదో శతాబ్దికి చెందిన కాశ్మీర శైవ పండితుడు అభినవగుప్తుడు తన రచనల్లో చెప్పాడు. ఉపఖండానికి వెలుపల... భారత ఉపఖండానికి వెలుపల సైతం ప్రాచీనకాలం నుంచి శివారాధన ఉండేది. ఇండోనేసియాలో శివుడిని ‘బటరగురు’గా ఆరాధిస్తారు. ‘బటరగురు’ అంటే ఆదిగురువు అని అర్థం. ‘బటరగురు’ శిల్పరూపం, ఆరాధన పద్ధతులు దాదాపు మన దేశంలోని దక్షిణామూర్తిని పోలి ఉంటాయి. ఇండోనేసియాలోని లువులో పురాతనమైన ‘బటరగురు’ ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిది. ఆగ్నేయాసియాలో బౌద్ధ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కాలంలో సైతం జావా దీవుల్లో శివారాధన కొనసాగేది. అక్కడి ప్రజలు శివుడిని బుద్ధుడు, జనార్దనుడు (విష్ణువు)తో సమానంగా ఆరాధించేవారు. అక్కడి ప్రజలు బుద్ధుడిని శివుని తమ్ముడిగా భావిస్తారు. కుషానుల కాలంలో మధ్య ఆసియా ప్రాంతంలోనూ శైవమత ప్రాబల్యం ఉండేది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న సోగ్డియా, యుతియాన్ రాజ్యాలలో శివారాధన జరిగేది. జపానీయులు పూజించే ఏడుగురు అదృష్టదేవతలకు శివతత్వమే మూలమని చరిత్రకారులు భావిస్తారు. తాంత్రిక ఆచారాలు పాటించే వజ్రయాన, మహాయాన బౌద్ధులు శివుడిని కూడా పూజిస్తారు. పరమశివునికి పదివేల పేర్లు ప్రసిద్ధ దేవతలను సహస్రనామ స్తోత్రాలతో అర్చించడం పరిపాటి. అదే కోవలో శివ సహస్రనామ స్తోత్రం కూడా వాడుకలో ఉంది. అంతేకాదు, మహన్యాసంలో శివునికి దశసహస్రనామాలు ఉన్నాయి. అందులోని పదివేల పేర్లూ పరమశివుని గుణ విశేషాలను స్తుతించేవే! మహాదేవుడిగా, మహేశ్వరుడిగా, త్రినేత్రుడిగా, రుద్రుడిగా, హరుడిగా, శంభునిగా, శంకరునిగా భక్తులు శివుడిని ఆరాధిస్తారు. యోగముద్రలో ఉన్న శివుడిని దక్షిణామూర్తిగా, తాండవ భంగిమలోని శివుడిని నటరాజుగా కూడా పూజిస్తారు. శివరాత్రి ప్రశస్తి మహాశివరాత్రి నేపథ్యానికి సంబంధించి క్షీరసాగరమథన ఘట్టం అందరికీ తెలిసినదే. అయితే, ఇదేరోజు ఆదియోగి అయిన శివుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడని యోగ, తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున జాగరం ఉంటూ యోగసాధన చేయడం ద్వారా కుండలినీ శక్తి జాగృతమవుతుందని కొందరు నమ్ముతారు. శివరాత్రి రోజున యోగసాధనలో గడిపేవారు తక్కువే గాని, ప్రసిద్ధ శైవ క్షేత్రాలు మొదలుకొని గ్రామ గ్రామాల్లో ఉండే శివాలయాలకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకుని పూజలు, భజనల్లో పాల్గొంటారు. ఆలయ ప్రాంగణాలలో రాత్రంతా జాగరం ఉండేలా నృత్యగాన కార్యక్రమాలతో సందడిగా గడుపుతారు. మన దేశంలోని వివిధ ఆలయాలతో పాటు నేపాల్‌లోని పశుపతినాథ ఆలయంలోను, పాకిస్తాన్‌లోని ఉమర్‌కోట్‌లో ఉన్న శివాలయంలోను శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మారిషస్‌లో శివరాత్రి రోజున భక్తులు ‘గంగాతలావొ’ సరస్సులో పవిత్రస్నానాలను ఆచరిస్తారు. -
శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు
సాక్షి, నార్కట్‌పల్లి(నల్గొండ) : హర హర మహాదేవ.. శంభో శంకర.., ఓం నమః శివాయ.. అంటూ శివనామస్మరణ మిన్నంటింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమం వైభవంగా సాగింది. ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, అర్చకులు సతీష్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ, సురేష్, పవన్, సిద్దులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ వాహనంపై స్వామి వారిని, వీరమూర్తి ప్రభను అగ్నిగుండం వరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్నిగుండాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు భక్తి శ్రద్ధతో ఓం నమః శివాయ.. హర హర మహాదేవ.. శంభో శంకర అంటూ.. అగ్నిగుండం నుంచి నడుచుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే కాకుండా పరిసర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా హాజరయ్యారు. శివసత్తుల ప్రత్యేక పూజలు.. స్వామి వారి అగ్ని గుండాలకు శివసత్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేసి అగ్నిగుండంలో నడిచారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా నృత్యాలు చేశారు. భక్తులు వారితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, దేవాలయ అబివృద్ధి కమిటీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, తహసీల్దార్ రాధ, ఎంపీడీఓ సాంబశివరావు, ఈఓ అన్నెపర్తి సులోచన, సర్పంచ్ మల్గ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలీసు భారీ బందోబస్తు.. అగ్ని గుండాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సీఐ శంకర్‌రెడ్డి, ఎస్ఐ విజయ్‌కుమార్‌తో పాటు పోలీసు బృందంతో ప్రత్యేక చర్యలు తీసుకుని అగ్ని గుండంలో నడిచే వారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ హయాంలోనే ఆలయాల అభివృద్ధి నార్కట్‌పల్లి : రాష్ట్రంలోని దేవాలయాలు టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన గట్టుకు విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అర్చకులు మంత్రితో పాటు నూతన కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డికి పూర్వకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని.. ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి రూ.2.50 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ ఆలయ చైర్మన్ మల్లికార్జున్‌రెడ్డి, ఈఓ సులోచన మంత్రికి విన్నవించారు. స్పందించిన ఆయన త్వరలో నిధులు మంజూరీకి కృషి చేస్తానన్నారు. కార్యక్రమలలో జేసీ చంద్రశేఖర్, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు చిన్న వెంకట్‌రెడ్డి, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్షేత్రపాలకుడు
క్షేత్ర పాలకుడు అంటే ఆ క్షేత్రాన్ని పాలించేవాడు, రక్షించేవాడు అని అర్థం. ముఖ్యంగా క్షేత్రాలలోని ఆలయాలకు తప్పకుండా ఈ క్షేత్రపాలకుడు ఉంటాడు. భక్తులు తప్పనిసరిగా ఆ స్వామిని దర్శించుకోవడం క్షేత్రనియమంగా వస్తోంది. సాధారణంగా క్షేత్రపాలకుడంటే శివుడే అని శైవాగమాలు చెప్తున్నాయి. వైష్ణవాగమాల్లో కూడా దండపాణిగా శివుడే క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తాడు. శివాలయంలో ఈయన ముఖ్యదేవతగా ఉంటాడు. శివాలయంలో ఆగ్నేయదిక్కున ఈ స్వామి ఆలయం ఉంటుంది. భక్తులు ముందుగా ఈయనను దర్శించి శివ దర్శనం.. శివార్చన కొరకు అనుమతి పొందిన తరువాతే ఆలయంలోకి అడుగుపెట్టాలనే నియమం కూడా ఉంది. ఈ నియమం ఒక్క భక్తులకే కాక అర్చనాది కైంకర్యాలు జరిపే అర్చకులకు కూడా ఉంది. ముఖ్యంగా అర్చకులు శివాలయానికి వేసిన తాళాలను ఈ క్షేత్రపాలకుడి వద్దే ఉంచి వెళ్తారు. ఉదయాన్నే ఆలయం తెరిచే ముందు ఈయన అనుజ్ఞ తీసుకొని అర్చనాది కార్యక్రమాలు మొదలుపెడతారు. ఈశ్వరుడి వెయ్యో అంశగా క్షేత్రపాలకుడు ఉద్భవించినట్లు సుప్రభేదాగమం చెప్పింది. గ్రామానికి ఈశాన్యంలో లోకరక్షణ కోసం ఈయనకు ప్రత్యేకంగా ఆలయం కూడా నిర్మించాలని ఆగమశాస్త్ర నియమం. క్షేత్రపాలకుడు నల్లని మబ్బులవంటి శరీరవర్ణంతో.. గుండ్రటి కన్నులతో.. నగ్నంగా.. పదునైన పళ్లకోరలతో.. భ్రుకుటిని ముడిచి.. ఎర్రటి పొడవైన కేశాలతో.. శరీరంపై కపాలమాలలతో.. చేతుల్లో త్రిశూలం, కపాలం వంటి ఆయుధాలతో నిలుచుని.. భైరవవాహనంతో ఉంటాడు. కాశ్యప శిల్పశాస్త్రం ఆయన చేతులు, ధరించే ఆయుధాలను బట్టీ సాత్త్విక, రాజస, తామస మూర్తులుగా విభజించింది. తెల్లగా.. శాంతముఖంతో.. రెండు/నాలుగు చేతులతో.. అభయ–వరదముద్రలతో.. రెండు ఆయుధాలతో ఉన్న స్వామి సాత్త్విక క్షేత్రపాలకుడు.ఎర్రగా..ఉగ్రముఖంతో ఆరు చేతుల్లో ఆయుధాలు పట్టిన మూర్తి రాజసిక క్షేత్రపాలకుడు. నల్లగా.. తీక్షణంగా చూస్తూ.. మూడు కన్నులతో.. నాగాభరణాలతో.. ఎనిమిది చేతులతో తామసిక క్షేత్రపాలకుడు ఉంటాడు. శ్రీవిద్యార్ణవ తంత్రం క్షేత్రపాలకుడు.. అనల, అగ్నికేశ,కరాళ, ఘంటికారవ, మహాకోప, పిశితాశ, పింగాక్ష, ఊర్ధ్వకేశులనే అష్ట (8) కింకరులను కలిగి ఉంటాడని పేర్కొంది. క్షేత్రపాలకుడు ఆలయానికి.. గ్రామానికి.. క్షేత్రానికి ముఖ్యమైన దేవుడనీ.. తొలుత ఆయన్నే పూజించాలని శాస్త్రోక్తి. జననానుడిలో.. కొన్ని స్థలమాహాత్మ్యాల్లో మాత్రం శివక్షేత్రానికి విష్ణువు.. విష్ణుక్షేత్రాలలో శివుడు క్షేత్రపాలకులని ఉంది. ఉదాహరణకు తిరుమల ఆలయంలో ఈశాన్యంలో క్షేత్రపాలక రుద్రశిల ఉంది. అలాగే గోగర్భం జలాశయం వద్ద ఉన్న ఒక పెద్దరుద్రశిలను భక్తులు దర్శిస్తారు. అలాగే పంచారామ క్షేత్రాలన్నింటికీ విష్ణువు క్షేత్రపాలకుడై ఉన్నాడు. వీరేగాక భద్రాచలం, కొన్ని నృసింహ క్షేత్రాలకు ఆంజనేయస్వామి, శ్రీశైలానికి వీరభద్రుడు, బద్రీనాథ్ క్షేత్రానికి ఘంటాకర్ణుడు, వారణాసి, శ్రీకాళహస్తి, ఉజ్జయిని క్షేత్రాలలో కాలభైరవుడు క్షేత్రపాలకులు. క్షేత్రపాలకుడి దర్శనం, పూజ విశేష ఫలితాలిస్తాయి. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
పుట్టిన రోజు
ఎవరికయినా సరే, పుట్టినరోజు అత్యంత ప్రధానమైన పండగ. శాస్త్రంమీద గౌరవం ఉన్న వాళ్ళు ‘నేను పుట్టినరోజు పండగ చేసుకోను’ అని అనకూడదు. జీవితంలో ఒక లక్ష్యం ఉండాలంటే దానికో శరీరం ఉండాలి. ఆ శరీరాన్ని పరమేశ్వరుడు మనకిచ్చిన గొప్పరోజు అది. అందుకే ఆరోజు దానిని పండగలా చేసుకోమని చెప్పారు. ఎవరికయినా ఒక పుట్టిన రోజు మాత్రమే ఉంటుంది. కానీ అమ్మకు ఎంతమంది బిడ్డలున్నారో అన్ని పుట్టిన రోజులతోపాటూ తను పుట్టిన రోజు కూడా ఉంటుంది. ‘‘అమ్మా! ఈ బిడ్డడిని ప్రసవిస్తే మీరు చనిపోతారు’’ అని చెప్పారు డాక్టర్లు మా అమ్మకు. దానికి మా అమ్మగారన్నారట...‘‘వాడు బతికితే చాలు, నేను ఉండకపోయినా ఫరవాలేదు’’ అని. కానీ ఈశ్వరానుగ్రహం, నా అదృష్టం– ఆవిడ బతికింది, నేనూ బతికాను. మృత్యువు రెండు కోరల మధ్యలోకి చేరి, జారి కిందపడి బతికిన రోజు మా అమ్మకది. అంటే మా అమ్మకు అది మరో పుట్టిన రోజేగా... అందుకే ప్రతి బిడ్డ పుట్టిన రోజు అమ్మకు మరో పుట్టిన రోజవుతుంది. అందుకే పుట్టిన రోజును ఎలా చేసుకోవాలి? అమ్మకు కొత్త చీర పెట్టి, నమస్కారం చేసి తరువాత మాత్రమే తాను కొత్తబట్టలు కట్టుకోవాలి. అది మర్యాద. సంస్కారవంతుల లక్షణం. అమ్మ సృష్టికర్త, ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె బ్రహ్మ. తన నెత్తురును పాలగా మార్చి బిడ్డ వృద్ధికి కారణమవుతుంది.. అందువల్ల ఆమె స్థితికర్త. ఓ గైనకాలజిస్టు ‘మాతృదేవోభవ’ పేరుతో ఒక పుస్తకం రాసారు. దానిలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. బిడ్డ పుట్టగానే తల్లి స్తన్యంలో ‘కొలోస్ట్రమ్’ అనే ఒక పసుపు పచ్చటి పదార్థం ఊరుతుంది. గర్భసంచీలో కటిక చీకట్లో అప్పటిదాకా ఉన్న బిడ్డ బయటికి వచ్చాక అంత వెలుతురు, అన్ని పెద్ద పెద్ద ఆకారాలు చూసేటప్పటికి లోపల ఉన్న మలం నల్లగా రాయిలా మారిపోతుంది. అది బయటకు వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తుల, గుండె పనితనాన్ని మందగింపచేస్తుంది. ప్రాణోత్క్రమణం అవుతున్న స్థితిలో పరమ ప్రేమతో అమ్మ బిడ్డను దగ్గరగా తీసుకుని స్తన్యమిచ్చినప్పుడు ఆ కొలోస్ట్రమ్ బిడ్డ కడుపులోకి వెళ్లి లోపల అడ్డుపడిన నల్లటి మలం బయటకు వచ్చేసి వాడు ఆయుర్దాయం పొందుతాడు. అందుకే అమ్మ స్థితికర్త. అమ్మ ప్రళయ కర్త కూడా. ప్రళయం అంటే చంపేయడం కాదు. నిద్రపుచ్చడం స్వల్పకాలిక ప్రళయం. పరమేశ్వరుడు చేసే మహోత్కృష్టమైన క్రియల్లో అదొకటి. అన్ని ప్రాణులకు నిద్రనిస్తాడాయన. అవి నిద్రలో సుఖాన్ని పొందుతాయి. బ్రహ్మ, విష్ణువు, శివుడు... ముమ్మూర్తుల సమాహార స్వరూపం అమ్మ. అందుకే ‘మాతృదేవోభవ’ అని మొదటి నమస్కారాన్ని అందుకుంటుంది. అమ్మతనం కేవలం స్త్రీయందే ప్రకాశిస్తుంది. అమ్మతనాన్ని చూడలేక ఆడతనాన్ని చూసినవాడు హింసింపబడి, నశించిపోతాడు. దేవీ భాగవతంలో అమ్మవారి మహిషాసుర మర్దని స్వరూపం అది. ఎక్కడ ఎవడు ఆడతనంలో అమ్మతనాన్ని చూసి గౌరవించి నమస్కరిస్తాడో వాడు దీర్ఘాయుర్దాయాన్ని పొంది భవిష్యత్ బ్రహ్మ అవుతాడు. -
సర్వోత్తమం సుబ్రహ్మణ్య షష్టి
లోకసంరక్షణార్ధం తారకుడనే రాక్షసుని సంహరించడానికి దేవతల కోరిక మేరకు లోకనాయకుడు పరమశివుడి అంశతో మార్గశిర శుద్ధ షష్టి నాడు జన్మించాడు సుబ్రహ్మణ్య స్వామి. దీనికే ‘సుబ్రహ్మణ్య షష్టి‘ లేదా ‘స్కంద షష్టి‘ అని పేరు. సుబ్రహ్మణ్యస్వామి పేర్లు ►కుమారస్వామి నామాలు, వాటి వివరణ ►షణ్ముఖుడు –– ఆరు ముఖాలు కలవాడు. ►స్కందుడు పార్వతీదేవి పిలిచిన పేరు. ►కార్తికేయుడు కృత్తికానక్షత్రాన జన్మించినందుకు ►వేలాయుధుడు శూలాన్ని ఆయుధంగా కలిగిన వాడు. ►శరవణుడు –శరవణం (రెల్లు వనం) లో జన్మించాడు కాబట్టి. ►సేనాపతి – దేవతలకు సేనాధిపతి. ►స్వామినాథుడు ––శివునకు ప్రణవ మంత్ర అర్ధాన్ని చెప్పినాడు కనుక. ►సుబ్రహ్మణ్యుడు –బ్రహ్మజ్ఞానం కలిగినవాడు. ►మురుగన్ ఈ తమిళ నామానికి ‘అందమైన వాడు‘ అని అర్థం. తారకాసుర సంహారం కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేసారు. కుమారస్వామి తారకాసురుని సంహరించేందుకు ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించి లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొంది దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు. సుబ్రహ్మణ్య కావడి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి శిరస్నానమారించి పాలు, పంచదారలతో నిండిన కావడులను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామ పూజలు చేస్తారు. భక్తులు కావడులతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కులను బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడు రాష్ట్రంలో విశేషంగా ఆచరణలో ఉంది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కల్యాణం స్కంద షష్టి నాడు సుబ్రహ్మణ్య దేవాలయాలలో ‘శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి‘ కళ్యాణం నిర్వహిస్తుండడం పరిపాటి. ఈ వివాహాన్ని వీక్షిస్తే అవివాహిత యువతీ యువకులకు ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయని, సత్సంతానం కలుగుతుందని పెద్దల మాట. నేడు పాటించాల్సిన నియమాలు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నదీస్నానం ఆచరించాలి (సమీపాన నది ఉంటే) లేదా శిరఃస్నానం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలు లేదా పాలు నైవేద్యంగా సమర్పించాలి. సుబ్రహ్మణ్య స్వామి విజయ గాథలు చదవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కీర్తనలు ఆలాపించాలి. దగ్గరలోని స్వామి ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి. వీలైనంత దానధర్మాలు చేయాలి. రోజంతా ఉపవాస దీక్ష ఆచరించాలి. పూజ ఫలితం విశేషించి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్పించినా సత్సంతానప్రాప్తి, వారి కుటుంబంలోనూ, రాబోయో తరాలవారికి కూడా వంశవృద్ధి జరుగుతుందని విశ్వాసం. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. స్కంద షష్ఠినాడు సుబ్రహ్మణ్య కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి దేశం నలుమూలలా దేవాలయాలున్నాయి. వాటిలో తిరుచానూరు పద్మావతీ దేవి ఆలయ పుష్కరిణికి సమీపంలోని ఆలయం, మోపిదేవిలో, మంగళగిరి వద్ద గల నవులూరులోనూ, వరంగల్ జిల్లా పరకాలలోని ఆలయం, హైదరాబాద్ పద్మారావు నగర్‌లోని ఆలయాలు సుప్రసిద్ధమైనవి. ఇక తమిళనాట గల ఆలయాల సంగతి సరేసరి. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. భక్తులకు స్వామి అనుగ్రహం లభించాలని కోరుకుందాం. – కృష్ణకార్తీక జాతకంలో సర్పదోషం, నాగదోషం, కాలసర్పదోషం ఉన్న వారు దోష పరిహారం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. రాహుకేతు దోషాన్నే కాలసర్పదోషంగా పరిగణించి ఈ రెండు గ్రహాలకు పూజలు చేయడం పరిపాటి. జాతకంలో గ్రహాలన్నీ లగ్నంతో సహా రాహు కేతుగ్రహాల మధ్య ఉంటే కాలసర్పదోషంగా చెబుతారు. మరలా ఇందులో అధోముఖ కాలసర్ప, ఊర్థ్వముఖ కాలసర్పదోషమని రకాలుంటాయి. సర్పానికి రాహువును నోరుగా, కేతువును తోకగా భావిస్తారు. అందువల్ల ఈ రెండింటి మధ్య జాతక చక్రంలో గ్రహాలు ఎంత శుభస్థితిలో ఉన్నా, ఉచ్చంలో ఉన్నా ఆ శుభ ఫలాలు జీవితంలో కనిపించవని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఈ దోష నివారణకు రాహు కేతు గ్రహాలకు ప్రత్యేక పూజలు చేసుకోవాలి. ఈ పూజలకు కాళహస్తి, మోపిదేవి, చిన కాకాని, కర్ణాటకలో కుక్కి ప్రశస్తం. సుబ్రహ్మణ్య షష్ఠినాడు ఈ దోష నివారణ పూజలు మరింత సత్ఫలితాలు ఇస్తాయి. స్వామిని సర్పరూపంలో పూజించి నాగులను చంపిన పాపాలు, వాటి పట్ల చేసిన దోషాలు పోవాలని ప్రార్థించాలి. సుబ్బారాయుని గుడిలోనే కాక గ్రామాలలో ఉన్న పాముల పుట్టల దగ్గర కూడా పూజలు చేయడం కొన్ని ప్రాంతాలలో ఆచారం ఉంది. – గుమ్మా రామలింగస్వామి, జ్యోతిష శాస్త్ర నిపుణులు -
ఆట కదరా భరణీ
కార్తీకం శివుడికి ప్రీతికరమైనది. భరణికి శివుడు ప్రియాతిప్రియమైనవాడు. ‘ఆట కదరా శివా..!’ అనేంత అఫెక్షన్. ‘నావాడు’ అంటాడు. ‘నిను వీడను ఏనాడూ’ అంటాడు. కన్నప్ప శివుడికి కన్నిచ్చి భక్తకన్నప్ప అయ్యాడు. భరణి శివుడికి ఏమీ ఇవ్వలేదు. తనే శివుణ్ని లోపలికి లాగేసుకున్నాడు. శివుణ్ణే.. భక్తశివుణ్ణి చేసేసుకున్నాడు! దేవుడా.. అంటే.. ‘అవును దేవుడే.. ఇంత ఫ్లెక్సిబిలిటీ నా శివయ్య దగ్గర నాకు ఉంది’ అంటాడు. భరణి శివుడి గురించి చెబుతున్నంతసేపూ.. ‘ఆట కదరా భరణీ’ అనిపించింది మాకు!! కార్తీక మాసం అంటే శివుడికి ప్రత్యేకం. పైగా మీరు మాల కూడా ధరిస్తారు కాబట్టి ఆ విశేషాలు చెబుతారా? తనికెళ్ల: మామూలుగా ఈ మాసంలో దీక్ష తీసుకుంటాను. దేవుడు, దైవకార్యాలు ఏమైనా కూడా ఆరోగ్యంతో లింక్ అయ్యుంటాయి. అంటే ఏడాది పొడవునా ముప్పూటలా తింటాం కాబట్టి.. మండలం (40 రోజులు) పాటు ఆహార నియమాలు పాటిస్తాం. మాల ధరించిన ఆ నలభై రోజులు మన జీవన విధానం ఓ క్రమ పద్ధతిలో ఉంటుంది. సైంటిఫిక్‌గా మనలో ఉన్న టాక్సిన్స్ అన్నీ 20 రోజులకు పోతాయి. చెత్త అంతా పోయాక అక్కడ్నుంచి శక్తి ఆరంభమవుతుంది. 40 రోజులు ముగిసేసరికి ఓ కొత్త శక్తి వస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. శివ దీక్ష, బాబా దీక్ష, అయ్యప్ప దీక్ష.. ఏ దీక్ష అయినా 40 రోజులు అని అందుకే నిర్ణయించారు. కానీ కొందరు 20 రోజులు, 3 రోజులు... ఇలా కూడా దీక్ష తీసుకుంటుంటారు కదా? దురదృష్టవశాత్తు వాళ్ల సౌకర్యం కోసం చేసేవాళ్లు ఉన్నారు. అసలు చేయపోతే నష్టం ఏంటి? చేస్తే 40 రోజులు.. లేకపోతే ఓ నమస్కారం పెట్టుకోండి. ఏ దేవుడూ నా దీక్ష తీసుకోకపోతే నేను ‘సర్వైవల్’ కాలేను అనడు కదా. నేనైనా, ఎవరైనా... దీక్ష తీసుకుంటే పాటించాల్సిన నియమం ఏంటంటే.. ఏకభుక్తం (ఒక పూట భోజనం, సాయంత్రం అల్పాహారం) భూశయనం (నేల మీద నిద్రపోవడం), బ్రహ్మచర్యం (కామ, క్రోధ, లోభాలకు దూరంగా ఉండాలి. అలాగే మందు.. పాన్‌పరాగ్ వంటి చెత్తాచెదారానికి దూరంగా ఉండటం). సౌకర్యంలోనే కాదు.. అసౌకర్యంలో కూడా ఉండగలను అనడానికి భూశయనం. నడుము నొప్పి ఉన్నవారిని డాక్టర్ తలగడ లేకుండా కింద పడుకోమంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇవి అలవాటు అయితే రేపు ఆస్పత్రికి వెళ్లే ఖర్మ ఉండదు. ఒక దీక్ష వెనకాల ఇంత అర్థం ఉంటుంది. దీన్ని చాలామంది అర్థం చేసుకోవడం లేదు. కొంచెం కఠినంగానే చెబుతున్నాను. రేపు మాల వేసుకుంటున్నాడంటే తెల్లవారు జాము వరకూ మందు తాగుతాడు. మాల తీసేసిన గంటకే పాన్ పరాగ్, సిగరెట్ మొదలుపెట్టేస్తాడు. ఇలా దీక్ష తీసుకోపోతే ఏం? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మూడ భక్తిని మనం ప్రచారం చేయొద్దు. అవకాశం ఉంటే ఖండిద్దాం. ఎందుకంటే ఈ మధ్య భక్తి పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే.. సాయిబాబా అంటే ఫ్రెండ్లీగా, శివుడంటే కొంచెం భయంగా ఉంటుందని కొందరు అంటారు.. సాయిని తిరగేస్తే ‘యిసా’. యిసా అంటే శివుడే. వీడితో కూడా ఫ్రెండ్లీగా ఉండండి. దేవుడిని చూసి భయపడకండి. పాపాన్ని చూసి భయపడండి. మనకు ఉండాల్సింది దైవభక్తి, పాపభీతి. పాపం చేస్తే నాశనమవుతాం లేదా నరకానికి పోతాం అనే భయం ఉండాలి. అంతేకానీ దేవుడంటే భయం ఉండకూడదు. దేవుడు కరుణా సముద్రుడు. వాడంటే భయం ఎందుకు? దేవుడికీ దెయ్యానికీ తేడా తెలియకపోతే ఎట్లా? ఖర్మ. దేవుడిని వాడు వీడు అనొచ్చా? మనలోని మైనస్ పాయింట్లను దేవుడికి అంటకట్టాం. దేవుడు తల్లివంటివాడు. మంచి స్నేహితుడు. వాడికి గౌరవం ఇచ్చి దూరం పెట్టకండి. దగ్గర చేసుకోండి. అయ్యప్ప దీక్షకి అయితే ‘పీఠం’ పెడతారు. శివుడి దీక్షకు? శివుడికి పీఠం పెట్టక్కర్లేదు. శివుడికి తక్కువ నియమాలు ఉంటాయి. అయ్యప్ప మాల వేసుకుని, శబరిమలకే వెళ్లాలి. అయితే ‘సర్వం శివమయం’ అంటారు. శివ మాలను ఎక్కడైనా ఏ శివుడి గుడిలో అయినా తీయొచ్చు. అయ్యప్పకు చేసినట్లుగా ఇరుముడి అక్కర్లేదు. ‘ఇరుముడి’ అంటే రెండు ముడులు అని అర్థం. హోటల్స్ లేని కాలంలో ఒక మూటలో తమ వంట కోసం బియ్యం, పప్పు తీసుకెళ్లేవాళ్లు. మరో మూటలో దేవుడికి సమర్పించడానికి కొబ్బరికాయ, దానికి చిన్న చిల్లు పెట్టి, నెయ్యి పోసి తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఇరుముడి అవసరంలేదు. సంప్రదాయం రాను రాను ఓ స్టాంప్ అయిపోయింది. శివమాల ఎప్పుడు మొదలుపెట్టారు? 1970ల్లో ఓ మలయాళీని చూసి మా గురువు రాళ్లపల్లిగారు అయ్యప్ప మాల వేసుకోవడం ప్రారంభించారు. ఆయన్ను చూసి నేనూ దీక్ష మొదలుపెట్టాను. ఓ పదిసార్లు శబరిమలకు వెళ్లాను. మదరాసు నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాక ఓ తమాషా సంఘటన జరిగింది. నేను, నా మిత్రుడు సుబ్బారావు, దేవరకొండ కుమార్ మాల వేసుకున్నాం. వీళ్లలో ఒకరి బంధువులు పోయారు. మరొకరికి సెలవు దొరకలేదు. దాంతో విరమించుకున్నారు. మన దగ్గర అప్పుడు రూపాయిలు లేవు (నవ్వుతూ). వీళ్లతో వెళ్తే ఖర్చులు కలిసొస్తాయనుకుంటే వీళ్లిద్దరూ డ్రాప్. అప్పుడు ఏం చేద్దాం అనుకొని సర్లే.. అయ్యప్ప దగ్గరకి ఏం వెళ్తాం. అయ్యప్ప అబ్బ దగ్గరకు వెళ్దాం అని శ్రీశైలం వెళ్లాను మాల విరమణకి. అక్కడ మూడు రోజులు ఉన్నాను. అప్పుడు నాలోకి శివుడు ప్రవేశించాడు. ఆ తర్వాత ఏడాదికి దాదాపు రెండుసార్లు శివమాల వేసుకుంటున్నాను. ఏదైనా కొత్తగా రాద్దాం అనుకున్నప్పుడు మాల వేసుకుంటాను. శివమాల దాదాపు 25 సార్లు వేసి ఉంటాను. ఈసారి న్యూజిల్యాండ్ తెలుగు మహాసభలకు వెళ్లాను. అక్కడే మాల విరమణ చేశాను. ఓంకారం ప్రత్యేకత గురించి చెబుతారా? ఓంకారం ‘అ ఉ మ’ అనే మూడు శబ్దాల సంకలనం. ఓంకారంకి సైంటిఫిక్‌గా చెప్పినది ఏంటంటే గుడి గంట కొట్టినప్పుడు ఆ ఘంటారావానికి కొన్ని కోట్ల క్రిములు, సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. నేల రాలిపోతాయి. సేమ్ ఎఫెక్ట్ ఓంకారానికి కూడా ఉంటుంది. ఓంకారం గనుక కరెక్ట్‌గా నేర్చుకొని చెబితే నీ చుట్టూ ఓ ‘ఆరా’ ఏర్పడుతుంది. వైబ్రేషన్స్ వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది. రసూల్ çపుకుట్టి సౌండ్ ఇంజినీర్‌గా ఆస్కార్ అందుకున్నప్పుడు ‘ప్రపంచానికి ఓంకారం అందించిన దేశం నుంచి వచ్చాను’ అని చెప్పాడు. మంత్రం ఓంకార సహితమైనప్పుడు ఎనరై్జజ్ అవుతుంది. నమశ్శివాయ కన్నా ‘ఓం నమశ్శివాయ’ ఎక్కువ ఎఫెక్ట్. ఓంకారం దీపంలాంటిది. కార్తీక మాసంలో దీపం పెడతాం. అజ్ఞానం అనే చీకటిని దీపం తొలగిస్తుంది. వన భోజనాల గురించి? వనభోజనాలనేది అద్భుతమైన కాన్సెప్ట్. అందరం ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తలో చేయి వేసి వంట చేసుకుంటాం. అయితే వన భోజనం అంటే వనం ఉండాలి. ఇప్పుడు వనం లేదు. బయట క్యాటరింగ్ వాడికి చెప్పేసి భోజనాలు చేయిస్తున్నారు. అందులో ఉండే మూలాలు పోగేట్టేస్తున్నాం. ఇంకా ఘోరమైన విషయమేంటంటే కార్తీక భోజనాలు కులపరంగా విడిపోవడం. వాళ్ల కార్తీక వనభోజనాలు.. వీళ్ల కార్తీక భోజనాలు... అంటూ విడిపోతున్నాం. అది దౌర్భాగ్యం. ఫైనల్లీ.. శివుడితో మీకు ఉన్న మానసిక సంబంధం గురించి? శివుడిని ఏ రూపంలో చూసినా అనుభూతి చెందుతాను. ఒళ్లు పులకరిస్తుంది. ఇలాంటి అనుభూతికి చాలామంది లోనవుతారనుకుంటున్నాను. దేవుడికి ఇంటెలిజెన్స్ కన్నా ఇన్నోసెన్స్ నచ్చుతుంది. నేను దేవుడిని ఫ్రెండ్‌లా ట్రీట్ చేస్తాను. ఫ్రెండ్‌తో ఉన్న అనుబంధం ఇచ్చే అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం. – డి.జి. భవాని మాలధారణ సమయంలో పాటించే నియమాల వల్ల కలిగే మేలు గురించి కొంచెం వివరంగా చెబుతారా? దీక్షలో ఉన్నప్పుడు తెల్లవారు జాము చన్నీటి స్నానం చేస్తాం. సైన్స్ పరంగా కానీ, ఆయుర్వేదం పరంగా కానీ చన్నీటి స్నానం వల్ల చాలా మేలు జరుగుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది. చర్మ వ్యాధులు రావు. చెంబుడు చల్లని నీళ్లు శరీరం మీద పడగానే లోపల గిర్రున తిరగడం ప్రారంభిస్తుంది. అందుకే ఫస్ట్ చెంబుడు నీళ్లు చల్లగా ఉంటాయి. ఆ తర్వాత వెచ్చదనం మొదలవుతుంది. ఇలా మనవాళ్లు ఏం పెట్టినా ఆరోగ్యపరమైన కారణం ఉంటుంది. -
శివుడి ప్రీతి కోసం కావడి వ్రతం
కావడి వ్రతం ఎన్ని వందల ఏళ్ల క్రితం మొదలైంది అనడానికి సరైన ఆధారాలు లేవు. తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని పుణ్యక్షేత్రాలకు తిరిగిన శ్రావణ కుమారుడు వారిని హరిద్వార్‌లో పుణ్యస్నానం చేయించి తిరిగి వస్తూ ఘటంలో గంగాజలం తెచ్చుకున్నాడట. అలా ఈ ఆచారం మొదలైందని అంటారు. ఉత్తరాదిన శ్రావణ మాసం జూలై ద్వితీయార్థం నుంచే మొదలైపోతుంది. శ్రావణ మాసం రాగానే ‘హరిద్వార్’, ‘గోముఖి’, ‘గంగోత్రి’ వంటి పుణ్యక్షేత్రాలు ‘కన్వరీయల’తో కిటకిటలాడతాయి. ‘కన్వరీయులు’ శివ భక్తులు. వీరు శ్రావణ మాసంలో గంగా నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలను చేరుకుని అక్కడి గంగాజలాలను కావడిలో నింపుకుని చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు చేరుకుని ఆ జలాలతో శివుని అభిషేకం నిర్వహించడం ద్వారా వ్రతాన్ని ముగిస్తారు. తమ సొంత ఊరి వరకూ చేరుకుని ఊళ్లోని శివుని గుడిలో అభిషేకం ముగిస్తారు. ‘కన్వర్ యాత్ర’, ‘కావడి యాత్ర’గా పేరుగడించిన ఈ యాత్ర ప్రస్తుతం ఆచరణలో ఉంది. కొందరు భక్తులు శ్రావణ మాసంతో మొదలుపెట్టి శివరాత్రి మధ్యకాలంలో ఎప్పుడైనా కావడి యాత్రను చేస్తారు. కాని ఎక్కువగా శ్రావణమాసంలోనే ఈ వ్రతం ఆచరించడం పరిపాటి. శివుడికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం శివునికి ఇష్టమైన మాసం అనీ ఈ మాసంలోనే శివుడు పార్వతిని పరిగ్రహించాడని భక్తుల నమ్మకం. అందువల్ల ఉత్తరాదిన ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యాణా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హరిద్వార్‌కు లేదా గంగానది పరివాహక పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ కాషాయ వస్త్ర ధారణ చేస్తారు. ఆ తర్వాత ఒక కావడి బద్దకు ఇరువైపులా స్టీలు, ఇత్తడి, లేదా ప్లాస్టిక్ ఘటాలను కట్టుకుని వాటిలో గంగాజలం నింపుకుంటారు. ఈ వ్రతం పూర్తయ్యేవరకు కావడి పవిత్రమైనది. దానిని భుజాన మోస్తూ బోసి పాదాలకు దగ్గరిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రానికి గానీ, లేదా తమ సొంత ప్రాంతంలోని శైవ క్షేత్రానికి గాని చేరుకుంటారు. తీసుకొచ్చిన గంగాజలంతో శివుడికి అభిషేకం జరిపిస్తారు. ఈ వ్రతాన్ని ఒక్కరుగా చేస్తారు. లేదా బృందాలుగా చేస్తారు. ఈ కావళ్లలో రకాలు ఉన్నాయి. ‘వ్యక్తి కావళ్లు’, ‘వాహన కావళ్లు’ అనే విభజనలు ఉన్నాయి. వ్యక్తి కావళ్లు పట్టిన వాళ్లు దారి మధ్యలో కావడిని దించవచ్చు. విశ్రాంతి, కాలకృత్యాలకు విరామం తీసుకోవచ్చు. కాని కొన్ని రకాల కావడి వ్రతంలో కావడిని కిందకు దించకూడదు. అందువల్ల ఆరుమంది సభ్యుల బృందం మార్చుకొని మార్చుకొని కావడి మోస్తూ గమ్యం చేరుకుంటుంది. ఎప్పుడు మొదలైంది కావడి వ్రతం ఎన్ని వందల ఏళ్ల క్రితం మొదలైంది అనడానికి సరైన ఆధారాలు లేవు. తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని పుణ్యక్షేత్రాలకు తిరిగిన శ్రావణ కుమారుడు వారిని హరిద్వార్‌లో పుణ్యస్నానం చేయించి తిరిగి వస్తూ ఘటంలో గంగాజలం తెచ్చుకున్నాడట. అలా ఈ ఆచారం మొదలైందని అంటారు. కాని పరశురాముడు ఈ ఆచారాన్ని మొదలెట్టాడని అనేవారు కూడా ఉన్నారు. పురాణ ఉదాహరణ తీసుకుంటే క్షీరసాగర మథనంలో వెలువడ్డ హాలాహలాన్ని శివుడు కంఠాన నిలిపాక ఆయన కంఠం నీలంగా మారింది. దాంతో పాటు ఒక సన్నటి శిఖ ఆ హాలాహలం నుంచి రేగి శివుడిని ఇబ్బంది పెట్టసాగింది. ఇది తెలిసిన దేవతలు గంగానదికి వెళ్లి గంగాజలాన్ని తెచ్చి ఆయనకు అభిషేకం జరిపించారు. అలా చేయడం వల్ల ఆ శిఖ చల్లబడి శివుడికి సౌకర్యం కలుగుతుందని భావించారు. అప్పుడు అలా మొదలైన ఆచారం ఇప్పటికీ కొనసాగుతుందని భక్తులు నమ్ముతారు. కాలకూట విషాన్ని గొంతులో మోస్తున్న శివుడిని చల్లబరిచే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ బోళా శంకరుడు ప్రసన్నమై భక్తుల కోర్కెలు నెరవేరస్తాడని భావిస్తారు. చాలా పెద్ద ఉత్సవం కావడి వ్రత సమయంలో ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు వ్రతబద్ధులు అయిన కన్వరీయుల సౌకర్యం కోసం మార్గమధ్యంలో ఎన్నో ఏర్పాట్లు చేస్తాయి. వారికి ఆహారం ఉచితంగా ఇవ్వబడుతుంది. తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు ఉంటాయి. కావడి నేల మీద పెట్టకుండా ఉండేందుకు ప్రత్యేకమైన స్టాండ్లు కూడా అందుబాటులోకి తెస్తారు. అలహాబాద్, వారణాసి, దియోఘర్ (జార్ఘండ్), సట్లజ్గంజ్ (బీహార్) వంటి క్షేత్రాలలో కూడా కన్వరీయులు దీక్ష బూనడం ఈ శ్రావణ మాసంలో కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనవైపు అయ్యప్ప దీక్షతో సమానంగా ఉత్తరాదిన కావడి దీక్ష ఆచరణలో ఉంది. -
శివాయ... పరమేశ్వరాయ
శివుడు.. భోళా శంకరుడు.శివుడు.. భక్త వశంకరుడు.పత్రం పుష్పం ఫలం తోయం...వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు.భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులనుఆనందంగా అనుగ్రహిస్తాడు...జన్మానికో శివరాత్రి అంటారు గానీ,మహాశివరాత్రి పర్వదినంఏటేటా వస్తూనే ఉంటుంది.మనలో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది. త్రిమూర్తులలోనే కాదు, సమస్త దేవతలలోనూ శివుడు భక్తసులభుడు. అందుకే అతడిని భోళాశంకరుడని అంటారు. శంకరుడు భక్తవశంకరుడు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భీతావహులయ్యారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి అతడి కంఠం కమిలి, నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది. శివారాధన చరిత్ర క్షీరసాగర మథనానికి సంబంధించిన గాథ ప్రస్తావన చాలా పురాణాలలో ఉంది. మన పురాణ సాహిత్యం క్రీస్తుశకం మూడో శతాబ్ది నుంచి క్రీస్తుశకం పదో శతాబ్దికి చెందినదిగా ఆధారాలు ఉన్నాయి. మన దేశంలో శివారాధన మాత్రం పురాణాలకు శతాబ్దాల మునుపటి నుంచే వాడుకలో ఉంది. క్రీస్తుపూర్వం మూడువేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తుపూర్వం 1500–1200 నాటికి చెందిన రుగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిది. అయితే, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు, సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుశకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్ ఫ్లడ్ వంటి చరిత్రకారుల అంచనా. పురాణాల రచన మొదలైన తర్వాత శివపురాణం, లింగపురాణం వంటి వాటి ద్వారా శైవానికి ప్రాచుర్యం పెరిగింది. అతి ప్రాచీన శివాలయాలు అప్పటికే కొన్ని ఉనికిలో ఉండేవి. క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన హ్యుయాన్ సాంగ్ భారత ఉపఖండంలో పర్యటించాడు. హిందూకుష్ పర్వతశ్రేణుల వద్దనున్న నూరిస్తాన్ తదితర ప్రాంతాల్లో శైవాలయాలను తిలకించినట్లు తన రచనల్లో వివరించాడు. క్రీస్తుశకం 5–11 శతాబ్దాల కాలం నాటికి దేశంలోని తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో సైతం ప్రధాన శైవక్షేత్రాల్లోని ఆలయాల నిర్మాణం జరిగింది. బాదామి, ఎలిఫెంటా, ఎల్లోరా గుహాలయాలు, ఖజురహో, భువనేశ్వర్, చిదంబరం, మధురై, కంచి వంటి ప్రాంతాల్లోని శివాలయాలు ఆ కాలానికి చెందినవే. అప్పటికే శైవమతం బాగా వ్యాప్తిలో ఉండేది. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దికి చెందిన శంకరాచార్యుల కాలానికి శైవమతంలో పాశుపత, లకులీశ, కాపాలిక, తాంత్రిక శైవ అనే నాలుగు ప్రధాన శాఖలు కూడా ఏర్పడ్డాయి. వైష్ణవ ఆళ్వార్లు, భక్తి ఉద్యమం వ్యాప్తికి ముందు దక్షిణ భారతదేశంలో బౌద్ధ, జైన మతాలతో పాటు శైవమతానికి చాలా ప్రాచుర్యం ఉండేది. మహాభారతం వంటి ఇతిహాసాలలో శైవ, వైష్ణవాల రెండింటి ప్రస్తావనా ఉన్నప్పటికీ, దక్షిణాదిలో వైష్ణవం కంటే శైవమే పురాతనమైనదని చరిత్రకారుల అంచనా. వైష్ణవానికి చెందిన వైఖానస వంటి ఆగమ సంప్రదాయాలను శైవమతం ప్రభావితం చేసింది. ఆగమ సంప్రదాయాలపై శైవ ప్రభావానికి ‘ఈశ్వర సంహిత’, ‘పద్మ సంహిత’, ‘పరమేశ్వర సంహిత’ వంటి ప్రాచీన గ్రంథాలే నిదర్శనంగా నిలుస్తాయి. దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల పురాతన స్వయంభూ శివలింగాలు, ఆలయాలు కనిపిస్తాయి. చోళుల కాలంలో ఈ ప్రాంతంలో శైవాలయాలు లెక్కకు మిక్కిలిగా నిర్మితమయ్యాయి. హిమాలయ ప్రాంతం నుంచి చైనా, టిబెట్ ప్రాంతాలకు శైవం కొంత వ్యాపించినా, దక్షిణ భారత ప్రాంతం నుంచి ఆగ్నేయాసియాకు మరింతగా విస్తరించింది. ఇండోనేసియా, మలేసియా, కంబోడియా, వియత్నాం, థాయ్‌లాండ్‌లలోని పురాతన ఆలయాల్లో శైవ ఆరాధనకు చెందిన చిహ్నాలు కనిపిస్తాయి. ఇవన్నీ క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నుంచి ఏడో శతాబ్ది కాలానికి చెందినవి. ఇండోనేసియాలో శివుడిని ‘భట్టరగురు’ పేరిట ఆరాధించేవారు. క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో ఇండోనేసియా, మలేసియాలలో ఇస్లాం వ్యాప్తి మొదలవడంతో శైవ, బౌద్ధ సంప్రదాయాలు మరుగున పడ్డాయి. యోగ సంప్రదాయంలో శివుడు యోగ సంప్రదాయంలో శివుడిని ఆదియోగిగా పరిగణిస్తారు. చాలా శివాలయాల్లో శివుడిని లింగరూపంలో ఆరాధిస్తారు. శివుడిని మూర్తిరూపంలో ఆరాధించే ఆలయాల్లో ఎక్కువగా శివుడు యోగముద్రలోనే కనిపిస్తాడు. నాథయోగ సంప్రదాయంలో శివుడిని మత్సే్యంద్రనాథునిగా, గోరఖ్నాథునిగా ఆరాధిస్తారు. శివుడిని నాట్యాభినయ కళలకు అధిదేవునిగా భావిస్తారు. నృత్య నాటక ప్రదర్శనలలో శివుని నటరాజ మూర్తిని ఆరాధించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. బాదామి గుహలు, ఎల్లోరా గుహలు, ఖజురహో, చిదంబరం వంటి చోట్ల నటరాజ భంగిమలో శివుని పురాతన విగ్రహాలు కనిపిస్తాయి. యోగ సంప్రదాయంలో మాత్రమే కాదు, జైన బౌద్ధ మతాల్లోనూ శైవ ప్రభావం కనిపిస్తుంది. నాథయోగులు ఆరాధించే మత్సే్యంద్రనాథుని బౌద్ధులు కూడా ఆరాధిస్తారు. నేపాల్ రాజధాని కఠ్మాండూలోని ‘సెతో మచీంద్రనాథ్’ ఆలయంలో హిందువులతో పాటు బౌద్ధులు కూడా పూజలు, ప్రార్థనలు జరుపుతారు. బౌద్ధులకు చెందిన బోధిసత్వునిలో శివుని లక్షణాలు చాలా వరకు కనిపిస్తాయి. శైవంలోని తాంత్రిక ఆరాధన రీతిలోనే జైనులు తమదైన తాంత్రిక ఆరాధన పద్ధతిని ఏర్పరచుకున్నారు. పదకొండో శతాబ్దికి చెందిన జైన గ్రంథం ‘భైరవ పద్మావతికల్ప’లో ప్రస్తావించిన ‘పద్మావతి’కీ శైవ శాక్తేయాలలోని ‘త్రిపుర భైరవి’కీ మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు శివుడిని లింగ రూపంలో ఆరాధించడమే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. శివుడిని మూర్తి రూపంలో పూజించే ఆలయాలు చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తాయి. లింగ రూపంలో శివుడిని ఆరాధించే ఆలయాల్లో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత ప్రధానమైనవి. నిరంతరం భక్తుల సందడి కనిపించే ఈ క్షేత్రాలలో ఏటా కార్తీక మాసంలోను, మహాశివరాత్రి పర్వదినంలోను మరింతగా భక్తజన సందోహం కనిపిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఇవే: సోమనాథ్: గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్రభాస్ పట్టణంలో వెలసిన క్షేత్రం ఇది. చంద్రుడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించడంతో ఇది సోమనాథ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. సోమనాథ క్షేత్రంలో తొలి ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారనే దానిపై ఎలాంటి ఆధారాలూ లేవు. తొలినాటి ఆలయం జీర్ణ స్థితికి చేరుకోవడంతో క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన యాదవ రాజులు పాత ఆలయం ఉన్న చోటే కొత్తగా ఆలయ నిర్మాణం చేశారు. సిం«ద్ ప్రాంతాన్ని పాలించిన అరబ్ రాజప్రతినిధి దండయాత్రలో యాదవ రాజులు నిర్మించిన సోమనాథ ఆలయం నాశనమైంది. ఇదేచోట గుర్జర–ప్రతీహార రాజు రెండో నాగభట్ట క్రీస్తుశకం 815లో కొత్త ఆలయాన్ని నిర్మించాడు. ఎర్రరాతితో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ నిలిచి ఉంది. శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో దట్టమైన నల్లమల అడవులలో కొండగుట్టల నడుమ వెలసిన క్షేత్రం ఇది. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబికగా వెలిశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకటిగా శ్రీశైలం ప్రసిద్ధి పొందింది. శ్రీశైల క్షేత్రం ప్రస్తావన పురాణాలలో కనిపిస్తుంది. ఇది కచ్చితంగా ఏనాటిదో చెప్పేందుకు చారిత్రక ఆధారాలు లేవు. క్రీస్తుశకం ఆరో శతాబ్దికి చెందిన మైసూరు కదంబ రాజుల తాల్గుండి శాసనంలో శ్రీశైలం పేరు కనిపిస్తుంది. శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే చాలు మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. దేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటైన ఉజ్జయిని శక్తిపీఠం కూడా. అమ్మవారు ఇక్కడ మహాకాళిగా వెలసింది. ఇక్కడి కాలభైరవ ఆలయం కూడా అత్యంత ప్రసిద్ధమైనది. మహాకాలేశ్వర క్షేత్రంలో శివుడు దక్షిణామూర్తి రూపంలో దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాడు. ఇక్కడి పురాతన ఆలయాలు ఏనాటివో తెలియదు. క్రీస్తుశకం ఆరో శతాబ్దికి చెందిన మహాకవి కాళిదాసు ఈ క్షేత్రంలోనే కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్నట్లు ప్రతీతి. క్రీస్తుశకం పదమూడో శతాబ్దిలో ఇల్టట్మిష్ దాడిలో మహాకాళేశ్వర ఆలయం కొంత దెబ్బతిన్నది. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మరాఠా సేనాని రాణోజీ సింధియా ఆలయ పునర్నిర్మాణం చేశాడు. ఓంకారేశ్వర్: ఇది కూడా మధ్యప్రదేశ్‌లోనే ఉంది. నర్మదా నదిలో ఏర్పడిన దీవిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం వెలసింది. ఈ దీవిని అమలేశ్వరంగా, అమరేశ్వరంగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఖాండ్వా జిల్లా శివపురి పట్టణం పరిధిలో ఈ క్షేత్రం ఉంది. ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలసినట్లు పురాణాల్లో ఒక కథనం ఉంది. వింధ్య పర్వతం తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ వెలసినట్లు మరో కథనం. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రంలోనే ఒక గుహలో తపోధ్యానంలో ఉన్న తన గురువు గోవిందపాదులను కలుసుకున్నారు. బైద్యనాథ్: జార్ఖండ్‌లోని దేవగఢ్ జిల్లాలో వెలసిన క్షేత్రం ఇది. రావణాసురుడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాల కథనం. రావణుడు ఒకసారి గాయపడినప్పుడు సాక్షాత్తు శివుడే అతడికి వైద్యం చేసి స్వస్థత చేకూర్చాడని, అందుకే వైద్యనాథుడిగా ప్రసిద్ధి పొందాడని ప్రతీతి. కార్తీకమాసంలోను, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాత్రమే కాదు, ఏటా శ్రావణమాసంలో జరిగే ‘శివమేళా’కు లక్షలాదిగా భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. వైద్యనాథ క్షేత్రాన్ని దర్శించుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుందని భక్తుల విశ్వాసం. భీమశంకర్: మహారాష్ట్రలోని పుణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల వద్ద భీమా నది ఒడ్డున వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. త్రిపురాసుర సంహారం తర్వాత మహాశివుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు పురాణాల కథనం. పురాతనమైన ఈ ఆలయాన్ని గురించిన ప్రస్తావన క్రీస్తుశకం పదమూడో శతాబ్దికి చెందిన సాహిత్యంలో కనిపిస్తుంది. నాథ సంప్రదాయానికి చెందిన యోగి, కవి జ్ఞానేశ్వర్ పదమూడో శతాబ్దిలో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాడు. నాగర శైలిలో నిర్మితమైన ఈ ఆలయం ఏనాటిదో కచ్చితమైన ఆధారాల్లేవు. బాజీరావు పీష్వా సోదరుడు చిమాజీ పీష్వా పద్దెనిమిదో శతాబ్దిలో బహూకరించిన రోమన్ శైలి గంటలు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. వీటిలోని భారీ గంటపై జీసస్, మేరీమాతల బొమ్మ ఉండటం విశేషం. రామేశ్వరం: తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడు అర్చించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాశీలోని గంగాజలాన్ని తెచ్చి రామేశ్వరలింగాన్ని అభిషేకించి, ఆ తర్వాత రామేశ్వర తీరంలోని ఇసుకను తీసుకుపోయి కాశీలో కలపడం అనాది సంప్రదాయం. రామేశ్వర తీరం నుంచి రాముడు వానరుల సాయంతో సేతువును నిర్మించి లంకా యుద్ధానికి బయలుదేరాడట. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్యా పాతకాన్ని నిర్మూలించుకోవడానికి రాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాల కథనం. పదో శతాబ్దికి చెందిన శ్రీలంక చక్రవర్తి పరాక్రమబాహు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పన్నెండో శతాబ్ది నుంచి పలువురు రాజులు ఈ ఆలయ నిర్మాణాన్ని మరింత విస్తరించారు. నాగేశ్వర్: గుజరాత్‌లోని ద్వారక వద్ద దారుకావనంలో నాగేశ్వర జ్యోతిర్లింగం వెలసింది. పలు పురాణాలలో దారుకావన ప్రస్తావన కామ్యకవనంగా, ద్వైతవనంగా, దండకవనంగా కనిపిస్తుంది. దారుకావనాన్ని దారుకుడనే రాక్షసుడు పాలించేవాడు. అతడు ప్రజలను నానా హింసలు పెట్టేవాడు. అమాయకులను నిర్బంధించేవాడు. ఒకసారి సుప్రియుడనే శివభక్తుడిని ఖైదులో బంధించాడు. సుప్రియుడు ఖైదులోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి, తోటి బందీలతో కలసి పంచాక్షరి గానాన్ని ప్రారంభించాడు. దారుకుడి భటులు అతడిని సంహరించేందుకు సిద్ధపడగా, శివుడే ప్రత్యక్షమై సుప్రియుడికి ఒక దివ్యాయుధాన్ని అనుగ్రహించాడు. ఆ ఆయుధంతో సుప్రియుడు రాక్షసులపై విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సుప్రియుడు ప్రతిష్ఠించిన శివలింగమే నాగేశ్వర జ్యోతిర్లింగంగా పూజలందుకుంటోంది. వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని కాశీగా ప్రసిద్ధి పొందిన వారణాసిలో గంగా తీరాన శివుడు విశ్వనాథుడిగా వెలిశాడు. ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాలలో ఒకటైన కాశీ నగర ప్రస్తావన చాలా పురాణాలలో కనిపిస్తుంది. విశ్వనాథ ఆలయంతో పాటు విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాలు అత్యంత ప్రాచీనమైనవి. కాశీ మోక్షక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కాశీ నగరాన్ని సాక్షాత్తు పరమశివుడే స్థాపించాడని పురాణాల కథనం. క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన హ్యుయాన్‌సాంగ్ కాశీ నగరాన్ని సందర్శించాడు. కాశీ నగరం కళలకు, సంప్రదాయాలకు కేంద్రంగా ఉందని అతడు తన యాత్రానుభవాల్లో రాసుకున్నాడు. నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ వద్ద వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వర క్షేత్రం. అగ్ని, సూర్య చంద్రుల తేజస్సు కలిగిన త్రినేత్రాలుగా శివుడు ఇక్కడ వెలసినందున త్రయంబకేశ్వరంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. పవిత్ర గోదావరి నది పుట్టిన చోటు ఇదే. బ్రహ్మగిరి, నీలగిరి, కాలగిరి అనే మూడు కొండల నడుమ వెలసిన ఈ క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మరాఠా రాజు బాలాజీ బాజీరావు పీష్వా నిర్మించాడు. కేదార్నాథ్: ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల దిగువన మందాకినీ తీరంలో కేదారేశ్వర జ్యోతిర్లింగం వెలసింది. చలి తీవ్రత ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల కేదారేశ్వర ఆలయాన్ని ఏటా వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ పర్వదినం నుంచి కార్తీక పూర్ణిమ వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. సముద్ర మట్టానికి దాదాపు పదకొండువేల అడుగులకు పైగా ఎత్తున కేదారేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవడమంటే సాహస యాత్రకు తలపెట్టడమే. అత్యంత పురాతనమైన ఈ ఆలయం ఏనాటిదో ఎవరికీ తెలియదు. చాలా పురాణాలలో కేదారేశ్వర ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆలయానికి సొంత పూజారి కూడా ఎవరూ లేరు. బదరీనాథ్ క్షేత్రానికి చెందిన పూజారులే ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఘృష్ణేశ్వర్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఘృషేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఇక్కడ వెలసిన ఘృష్ణేశ్వరుడినే ధుష్మేశ్వరుడని, కుసుమేశ్వరుడని కూడా అంటారు. ఎల్లోరా గుహలకు అతి చేరువలో ఉన్న ఘృష్ణేశ్వర ఆలయం క్రీస్తుశకం పదమూడు–పద్నాలుగు శతాబ్దాల కాలంలో జరిగిన ముస్లింల దండయాత్రల్లో బాగా దెబ్బతిన్నది. శివాజీ తాత మాలోజీ భోస్లే పదహారో శతాబ్దిలో ఆలయాన్ని పునర్నిర్మించినా, మళ్లీ జరిగిన దాడుల్లో నాశనమైంది. ఆ తర్వాత పద్దెనిమిదో శతాబ్దికి చెందిన ఇండోర్ రాణి అహల్యాబాయి ఆధ్వర్యంలో ఘృష్ణేశ్వర ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఇప్పటికీ ఇదే నిలిచి ఉంది. సౌర వైష్ణవ శాక్తేయాల్లోనూ శివారాధన సనాతన మార్గంలోని సౌర వైష్ణవ శాక్తేయ మతాలకు చెందిన వారు కూడా తమ తమ ప్రధాన దేవతలతో పాటుగా శివారాధన చేసేవారు. విగ్రహారాధనే ప్రధానంగా వివిధ స్మృతుల ఆధారంగా ఏర్పడిన స్మార్త సంప్రదాయంలో నిర్వహించే పంచాయతన పూజల్లో శివుడిని ఇతర దేవతలతో కలిపి ఆరాధించే పద్ధతి ఇప్పటికీ ఉంది. శివ కేశవులకు భేదం లేదని స్కంద పురాణం చెబుతోంది. ‘శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ అని శ్రుతి. శివకేశవులు ఇద్దరూ కలసి ఉన్న పురాతన ఆలయాలు భారత్‌లోనే కాకుండా, ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. సౌర మతం వాయవ్య, తూర్పు భారత ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉండేది. శైవానికీ, సౌరానికీ కూడా సాన్నిహిత్యం ఉండేది. శైవ గ్రంథమైన ‘శ్రీకంఠీయ సంహిత’లో సౌర మతానికి చెందిన ఎనభై ఐదు గ్రంథాల ప్రస్తావన ఉంది. అయితే, ఆ గ్రంథాలేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. ముస్లింల దండయాత్రలో అవన్నీ నాశనమై ఉంటాయని చరిత్రకారులు భావిస్తున్నారు. అలాగే సౌరానికి చెందిన ‘సౌర సంహిత’లో శైవ గ్రంథమైన ‘వాథూల కాలోత్తర’ ప్రస్తావన ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన శివలింగాలు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత అరుదైన రెండు శివలింగాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అత్యంత ప్రాచీనమైన శివలింగమైతే, మరొకటి పరిమాణంలో అత్యంత పెద్ద స్వయంభూ శివలింగం. అత్యంత ప్రాచీన స్వయంభూ శివలింగం చిత్తూరు జిల్లా గుడిమళ్లం గ్రామంలో కనిపిస్తుంది. ఇది క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నుంచి క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ది మధ్య కాలానికి చెందినది కావచ్చని పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా. ఇక అత్యంత పెద్దదైన స్వయంభూ శివలింగం శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామంలో ఉంది. దీని ఎత్తు ఏకంగా యాభై ఐదు అడుగులు. వానర వైద్యుడు సుషేణుడు ఇక్కడ తపస్సు చేసి శివసాయుజ్యం పొందాడని, హనుమంతుడు అతడి కళేబరాన్ని ఖననం చేసిన చోట స్వయంభూ శివలింగం వెలసిందని పురాణాల కథనం. -
హరిహరమూర్తి
శివుడు వేరు, విష్ణువు వేరు అని అందరూ అనుకుంటారు కానీ వారిద్దరూ ఒక్కటే.వారిలో ఎటువంటి భేదాలూ లేవని భక్తులకు తెలియజెప్పడానికి శివుడు ధరించిన రూపమే హరిహరమూర్తి రూపం. పూర్వం దేవతలు లోకం అశాంతిగా ఉందని విష్ణువు వద్దకు వెళ్లారు. శాంతినిచ్చేవాడు శంకరుడే అని విష్ణువు వారికి తెలిపాడు. అందరూ కలిసి కైలాసం వెళ్లి చూస్తే అక్కడ శివదర్శనం కాలేదు. అప్పుడు దేవతలంతా ఒక వ్రతం ఆచరించారు. చివరగా విష్ణు హృదయంలోని అక్షయ లింగాన్ని కూడా ఆరాధించారు. చివరికి శివుడు వారికి హరిహరమూర్తి రూపంలో దర్శనమిచ్చాడు. తమిళనాడులోని తిరునెల్వేలి దగ్గర శంకరన్ కోవిల్ అనే ఊరిలో శంకరనారాయణ స్వామి ఆలయం ఉంది.అందులో ప్రధాన దైవం శంకరనారాయణమూర్తి. ఈ స్వామి విగ్రహంలో నిలువుగా కుడి సగం ఈశ్వరుడిగా, ఎడమసగం విష్ణురూపంగా ఉంటుంది. ఇక విగ్రహం రూపురేఖలు వర్ణిస్తే కుడివైపు జటాజూటం, చెవికి తాటంకం, మెడలో నాగరాజు, కుడిచేత అభయముద్రను, వెనుక చేతిలో గొడ్డలి, పులి చర్మం ధరించి చందనపు పూతతో శివుడు దర్శనమిస్తే, ఎడమవైపు రత్నకిరీటం, చెవికి మకరకుండలం, మెడలో బంగారుహారాలు, కుడిచేతిని నడుము వద్ద ఉంచుకుని కటిముద్రతో, వెనుక చేతిలో శంఖాన్ని పట్టుకుని, పట్టు పీతాంబరాలు ధరించి నీలవర్ణంలో విష్ణువు దర్శనమిస్తాడు. ఈ స్వామి దర్శనంతో భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ స్వామిని చూచిన భక్తులకు ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం తథ్యం అని శైవాగమాలు చెబుతున్నాయి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
మకర తోరణం ఎందుకు ఉంటుంది?
వివిధ దేవాలయాలలో ద్వారతోరణమధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానికే మకరతోరణమని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణమధ్యంలో ఎందుకు అలంకరిస్తారో చెప్పే కథ ఒకటి స్కందమహాపురాణంలో కనిపిస్తుంది. పూర్వం ‘కీర్తిముఖుడ‘నే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలను పొందాడు. అలా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనాలలోని సంపదలను సొంతం చేసుకున్నాడు. దాంతో అతడికి తాను త్రిమూర్తులకన్నా అధికుడినన్న అహం అతిశయించి చివరకు దేవతలనందరినీ తూలనాడసాగాడు. కోపించిన మహేశ్వరుడు అతనిని మింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. ఆ అగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలలో తిరిగి చివరకు పరమశివుని శరణు వేడాడు. భక్తవశంకరుడైన శివుడు ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవకన్నుగా ధరించాడు. కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉందని, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు ‘నిన్ను నువ్వే తిను‘ అని చెప్పాడు. శివుని వచనానుసారం మొసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోకభాగంనుంచి తినటం మొదలు పెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. నీవు ఈ నాటినుంచి సమస్తదేవతాలయాలలో తోరణాగ్రభాగాన్ని అలంకరించు. దైవదర్శనానికి వచ్చే వారిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను తింటూ ఉండు. అందరికీ పూజనీయుడవు అవుతావు‘ అని వరమిచ్చాడు. ఆనాటినుంచి కీర్తిముఖుడు ఆలయాలలోని తోరణ మధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తూ విరాజిల్లుతున్నాడు. అందుకనే దేవతామూర్తుల వెనుకనుండే తోరణానికి మకరతోరణం అని పేరు వచ్చింది. -
ఉగ్రదీప్తి... శరభమూర్తి
ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చాలా ప్రసిద్ధమైనది.ఇక్కడ స్వామి అమ్మవార్లు ప్రత్యేక దేవస్థానాలలో కొలువు తీరి ఉన్నారు. మల్లేశ్వరస్వామిదేవాలయం విమానగోపురం ప్రాచీన తెలుగు శిల్పకళకు తార్కాణంగా నిలుస్తుంది. ఈ ఆలయ విమానం పడమటి వైపు అద్భుతమైన శిల్పం దర్శనమిస్తుంది. రెండు సింహపు శరీరాలు కంఠం వరకు విడివిడిగా అక్కడి నుండి కలిసి మధ్యలో నడుము నుండి మానవశరీరంతో ఉగ్రమైన సింహముఖంతో, రెండు రెక్కలతో రెండు వైపులా కూర్చున్న రాక్షసులతో మెడలో కపాల(పుర్రె) మాలతో ఆరు చేతులలో ఒక శిల్పం కనిపిస్తుంది. అది ఏ దేవుడి శిల్పం? అక్కడ ఎందుకు ఉంది? అనే ప్రశ్న భక్తుల మనసులో మెదులుతుంది. అది మరెవరి శిల్పమో కాదు. సాక్షాత్తూ శివరూపమే. శివుడు ధరించిన అనేక లీలా రూపాలలో ఇరవై ఐదు ప్రముఖమైనవి కాగా వాటిలో శరభమూర్తి రూపం ఒకటి. ఈ రూపం దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి అవతారసమాప్తి కోసం వీరభద్రుడు ధరించింది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రతను తగ్గించక ప్రజలు భయపడుతుండటంతో శివుడు వీరభద్రుని పంపి ఉగ్రత్వాన్ని తగ్గించుకోమని చెబుతాడు. అయినా వినక శివనింద చేస్తాడు. అప్పుడు వీరభద్రస్వామి శరభావతారం ధరిస్తాడు. సూర్య చంద్ర అగ్నులే అయన కళ్లు. ఆయన నాలుక బడబానలం. కడుపు కాలాగ్ని. గోళ్లు ఇంద్రుని వజ్రాయుధం కంటే బలమైనవి. ఆయన రెండు రెక్కలలో కాళీ–దుర్గా అనే దేవతలు, ఆయన రెండు తొడలలో కాలుడు–మృత్యువులుంటారు. హృదయంలో భైరవుడుంటాడు. చండమారుతవేగంతో శత్రువులను చీల్చి చెండాడుతాడు. ఆరు చేతులతో కత్తి–డాలును, అంకుశం–హరిణాన్ని, పాశం–రక్తపాత్రను పట్టుకుని ఉంటాడు. శత్రుబాధలున్నవారు ఈయనను ప్రతిష్టించి పూజిస్తే ఆ బాధలు పోతాయి. యుద్ధంలో గెలుపు, ఋణ విముక్తి, అనారోగ్యం నుండి ఉపశమనం, సకలశుభాలు కలుగుతాయని శైవాగమాలు చెబుతున్నాయి. శర అంటే ఆత్మ. భ అంటే ప్రకాశం. ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు గనుక ఆయన శరభమూర్తి. ఈయనను శివాలయంలో విమానగోపురంపై గానీ, కోష్ఠ దేవతగా గాని ప్రతిష్టించి పూజించాలని ఆగమ శిల్పశాస్త్రాలు చెప్పాయి. మారీచం, మశూచి, రాచపుండు, క్షయవంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడే దేవత కనుక లోకక్షేమం కోసం ఈ శిల్పాన్ని అక్కడ ప్రతిష్టించి పూజిస్తున్నారు. ఈయనకే అష్టపాదమూర్తి, సింహఘ్నమూర్తి, శరభేశమూర్తి, శరభసాలువ పక్షిరాజం అనే పేర్లు కూడా ఉన్నాయి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
డెకో గణపతి
ఎకో గణపతిలా.. ఈయన ‘డెకో’ గణపతి. ఎకో గణపతికి రంగులు ఉండవు. స్వచ్ఛమైన మట్టి ముద్దతో తయారౌతాడు. ఆ మట్టి గణపయ్యను డెకరేట్ చేస్తే ఆయనే.. డెకో గణపతి. బుజ్జి గణపతిని ఎలా సింగారించినా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. మట్టితో రూపమిచ్చి, ప్రకృతిలో దొరికే వస్తువులతో ఆ రూపానికి అలంకరణ చేస్తే అంతకు మించిన అందం ఉండదేమో అనిపిస్తుంది. ఇందుకోసం పెద్దగా కష్టపడనక్కర్లేదు. చిన్న చిన్న మార్పులతో, ఇంట్లో దొరికే వస్తువులతోనే గణపయ్యను అందంగా అలంకరించవచ్చు. మనసారా గణపయ్యను అలంకరించుకొని భక్తిగా కొలుచుకోవచ్చు. పూసల తలపాగా అట్ట ముక్కను తలపాగాకు కావల్సిన పరిమాణంలో కత్తిరించి, ‘గ్లూ’తో సెట్‌చేయాలి. తెల్లని పూసలను వరుసలుగా ఆ తలపాగాకు గ్లూతో అతికించాలి. మధ్య ఒక నెమలి పింఛాన్ని అతికిస్తే గణపతి తలపాగా రెడీ. ఇదే అట్టముక్కకు రంగు రంగుల నెట్ ఫ్యాబ్రిక్, చమ్కీలు వాడి మరో అందమైన తలపాగాను సిద్ధం చేయవచ్చు. పూల సింహాసనం ఎరుపు రంగు పేపర్ చార్ట్‌ని తామర పువ్వు రేకలుగా ఒకే సైజులో కత్తిరించాలి. ఒక్కో పువ్వు రేక చుట్టూతా బంగారు రంగు లేస్‌ని అతికించాలి. లేదంటే పసుపు రంగు స్కెచ్‌తో డిజైన్ని కూడా గీయవచ్చు.రెండు తెల్ల చార్ట్‌లను గుండ్రంగా కత్తిరించి, సిద్ధంగా ఉన్న పువ్వు రేకలను చార్ట్‌కు అతికించాలి. రెండు వరసలుగా అతికించిన పువ్వు రేకలను పై వరుస పైకి, కింద వరస కిందకు అమర్చాలి. ఈ తామరపువ్వు సింహాసనం.. గణేషుడిని ఉంచడానికి సిద్ధమైనట్టే. గట్టి కాటన్ బాక్స్‌ను తగినంత పరిమాణంలో కత్తిరించి, దానికి వెల్వెట్ పేపర్, లేసు, చమ్కీలు, పూసలు వాడి సింహాసనాన్ని సిద్ధం చేయవచ్చు. రంగోలి అలంకరణ పసుపు, కుంకుమ, బియ్యప్పిండి కాంబినేషన్లతోనే మట్టి గణపయ్యకు రంగులుగా వాడవచ్చు. అదే పసుపు, కుంకుమ, పిండిలతో అందమైన రంగవల్లులను గణపతి ప్రతిమను ఉంచే పీఠం ముందు తీర్చిదిద్దవచ్చు. నెమలిపింఛం హిందూమతంలో నెమలిపింఛానికి ఓ ప్రత్యేక స్థానం. కృష్ణుడి తల మీదనే కాదు, గణపతి చేతిలో రాయడానికి అనువుగా నెమలి పింఛం ఉన్నట్టు దేవతామూర్తుల ఫొటోలలో చూస్తుంటాం. గణేశ ప్రతిమను ఉంచే చోట ఓ నెమలి పింఛాన్ని ఫ్లవర్‌వేజ్‌లో వేసి, ఉంచితే ఆ అలంకరణలో ఓ ప్రత్యేక కళ వచ్చేస్తుంది. రంగు రంగుల కర్టెన్లు గణపతి ప్రతిమ వెనక భాగంలో రంగు రంగుల కర్టెన్లను వేలాడదీస్తే చాలు అలంకరణలో ఒక కొత్త కళ కనిపిస్తుంది. వీటికి ప్లెయిన్ సిల్క్ తెరలను వాడచ్చు. గుమ్మాలకు, కిటికీలకు వేలాడదీసేవే కాకుండా డెకొరేటివ్ కర్టెన్లు కూడా విడిగా మార్కెట్లో లభిస్తున్నాయి. చమ్కీల గొడుగులు గణనాథుడికి పట్టే గొడుగును ఇంట్లోనే అందంగా తయారుచేసుకోవచ్చు. పేపర్ చార్ట్‌తో గొడుగును తయారు చేసి, దానికి వెల్వెట్ పేపర్, ఆ పైన చమ్కీలు, పూసలు గ్లూతో అతికించి అలంకరించవచ్చు. పూల దండలు వరుసలుగా కట్టిన రంగు రంగుల పూలదండలు గణపతి ప్రతిమ వెనకాల మండపానికి అలంకరణ కోసం ఉపయోగిస్తే పండగ కళ పరిమళమై వికసిస్తుంది. – ఎన్.ఆర్ -
మహా గుణపతి
విఘ్నేశ్వరుడు గణాలకే కాదు... గుణాలకూ అధిపతే! మన సంప్రదాయంలో ఓ దైవం గురించీ, ఓ పూజ గురించీ దేన్ని గురించైనా సరే తెలుసుకోదగ్గ ఎన్నో విశేషాలను తెలుసుకోగలుగుతున్నాం. అలా తెలుసుకోగలిగినంత సమాచారం మనకి అందేలా చేయాలని భావించిన నాటి రుషులు అంతంతటి సమాచారాన్ని చిన్న చిన్న శ్లోకాల్లో పెట్టి మనకి అందించి ఉంచడం మరింత గొప్పదనం నిజంగా. వీటిప్రాముఖ్యాన్నీ ప్రాశస్త్యాన్నీ గమనించిన వాళ్లు కాబట్టే నాటి వారంతా నేటికాలంలో లాగా ఏ విధమైన దృశ్య– శ్రవణ మాధ్యమాలు లేకున్నా అలా నిత్యం పఠిస్తూ పఠింపజేస్తూ కేవలం నోటి ద్వారా చెవి ద్వారా మనందరికీ వాటిని సంప్రదాయపు ఆస్తి సుమా అంటూ అందజేసి వెళ్లారు. వీటిని పరిరక్షించుకో(లేని) పక్షంలో నిజమైన కళ్లున్న గుడ్డివాళ్లం అనేది వాస్తవం. ఈ నేపథ్యంలో మన మహాగణపతి మనకి ఎలా ఉండాలో, ఏయే గుణాలు మనకి అవసరమో ఆవశ్యకమో అద్భుతంగా తెలియజేశాడు తనని పఠిస్తుండే శ్లోకంలో ఇమిడిపోయి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదర శ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః అష్టా వష్టౌ చ నామాని యః పఠే చ్ఛృణుయా దపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. వినాయకునిలో నుండి గ్రహించవలసిన గుణాలని చెప్పే నామాలు 8. వినాయకుని రూపాన్ని వర్ణిస్తూ ఆ రూపం ద్వారా ఆయన గుణ సౌందర్యాన్ని అర్థం చేసుకుంటూ కళ్లలో ఆయన రూపాన్ని నిలుపుకునేలా చేసే నామాలు 8. మొత్తం 16 నామాలు పై శ్లోకంలో ఉన్నాయి. ఈ విశేషాన్ని గుర్తించవలసినదిగా చెప్పేందుకే అష్టౌ అష్టౌ చ నామాని అని కనిపిస్తుంది శ్లోకంలో. రూపాన్ని వర్ణించదలచడం ప్రస్తుత వ్యాస శీర్షిక ప్రకారం అప్రస్తుతం కాబట్టి నేరుగా ఆయన గుణాలని గురించి వివరించుకుంటూ, ఇలాంటి గుణాలని మనం ఆయన నుండి నేర్చుకోవాలనే యథార్థాన్ని తెలుసుకుందాం! 1 సుముఖః సు– ముఖః అంటే ఎవరు ఏ కోరికను తన ముందుకొచ్చి చెప్పదలిచినా, మనసులో అనుకుంటున్నా ఆ అభిప్రాయాన్ని ఎంతో సుముఖునిగా ఉంటూ (వినాలనే ఆసక్తితోనూ, చెప్పేవానికి తప్పక తన పని తీరుతుందనే నమ్మకం కలిగేలాగానూ ఆ విషయాన్నంతటినీ వింటాడాయన. లోకంలో కొందరి దగ్గరకు పోయి ఏదైనా చెప్పుకోదలిస్తే, ఏదో పరాకుగా వింటూనో మధ్యమధ్యలో ఎవరినుండో వచ్చిన మాటల్ని వింటూనో ఆ మధ్య మధ్యలో ‘ఏం చెప్పా?’వంటూ అడుగుతూనో వినే మనుషులుంటారు. అలాంటి వాళ్లకి వినాయకుడు చెప్తాడు– వినదలిస్తే సుముఖునిగా ఉండి విను. లేదా తర్వాత వింటానని చెప్పు తప్ప వింటున్నట్టుగా వినకుండా ఉండటం సరికాదని. సు–ముఖః అనే పదంలో ముఖమనే మాటకి చక్కని నోరు కలవాడనేది కూడా అర్థం. అందుకే ముఖం కడిగావా? అనే వాక్యానికి దంతధావన చేశావా? అనేదే అర్థం. ‘నీ మొహం అంటాం. అంటే నోటితో చెప్పే ఆ మాటలెంత పేలవంగా ఉన్నాయో గుర్తించు!’ అని చెప్పడం దాని భావం. ఇలా ముఖమనే మాటకి నోరు అనేదే అర్థం. వినాయకుడు చక్కని నోరు కలవాడనేది దీనర్థం. నోటితో సంభాషిస్తాం కాబట్టి నొప్పించకుండా మాట్లాడేవాడనేది ఈయనకున్న మరో చక్కని గుణమన్నమాట. ఎందరిలోనో కొరవడేది ఇదే కదా!కాబట్టి ‘సుముఖ’ నామం ద్వారా ఎవరేది తనకి చెప్పుకోదలిచి ఏదైనా చెప్పదలిచి వచ్చినా – తల్లి తన బిడ్డ తన దగ్గరకొచ్చి ఏదో చెప్పదలిచి వస్తే – ఎలా వింటుందో అలా వినాలన్నమాట. రెండవది దానికి సమాధానాన్ని కూడా అతని కష్టం. తీరేలాగా చక్కని శైలిలో చక్కని స్వరంలో చెప్పాలన్నమాట. ఆయన నోటి నుండి అంతా విన్నాక ‘ఆ మాటొచ్చింది. చాలు’ అనుకున్నానని అంటుంటామే! అలా మాట్లాడుతాడన్నమాట గణపతి. ఆ గుణం మనకి రావాలని ఆయన చెబుతున్నట్లుగా ఆయన నామాన్ని బట్టి మనం గ్రహించాలి. 2 ఏక+దంతః గజ ముఖం కలిగిన ఆయనకి నిజంగా 2 దంతాలుండాలి. వ్యాసుడంతటివాడు భారత గ్రంథమంతనీ తన బుద్ధిలో నిలుపుకుని ‘నేను చెప్తూంటే రాయగల బుద్ధిమంతుడెవరా?’ అని బ్రహ్మ గురించి ప్రార్థిస్తే ఆయన గణపతి పేరుని చెప్పాడు. గణపతిని ప్రార్థిస్తే ఆయన – తప్పక రాస్తాను. అయితే నా రాత వేగానికి సరిపోయేలా నువ్వు కవిత్వాన్ని చెప్పా–లనే నియమాన్ని పెట్టాడు. (...భవేయం లేఖకోహ్యహమ్). దాన్ని విని వ్యాసుడు మరో నియమాన్ని పెడుతూ – ‘నేను చెప్పే ప్రతి అక్షరాన్నీ నువ్వు అర్థం చేసుకున్నాక మాత్రమే రాయాలి తప్ప ఏదో యథాలాపంగా రాయకూడ’దన్నాడు. (అబుద్ధ్వామా విఖ! క్పచిత్) వ్యాసుని నియమాన్ని వింటూనే మహాగ్రంథాన్ని రాయబోతే తప్ప తనంతటివానితో ఇలాంటి ఒప్పందాన్ని చేయనే చేయదలచడని భావించిన గణపతి ఆ రాయబోయే గ్రంథాన్ని తన చేతులతో బిగించడం కోసం తన దంతాన్నే పెరికి (పెకలించి) గంటంగా చేసి మరీ రాశాడు.దీన్ని గమనిస్తూ మనమూ అర్థం చేసుకోగలగాలి. మన శరీరంలోని ఏ అవయవమైనా అవతలివానికి సహాయపడేలా చేయాలని. దధీచి మహర్షి తన వెన్నెముకని రాక్షస వధ కోసం ఇంద్రునికి వజ్రాయుధంగా చేశాడంటేనూ, అలర్కుడనే మహారాజు తన కన్నుల్ని దానం చేశాడంటేనూ... ఇలాంటివన్నీ దీనికుదాహరణలే. మరి మన స్థాయిలో మనం చేదోడు వాదోడు (పనిలో సహాయపడటం – మాట సహాయం చేయడం)గా ఉండగలిగితే చాలు. నిందని ఎదుటివాళ్ల మీద నెట్టేలా సముఖంలో మాట్లాడటం, చాటున చాడీలు చెప్పడం వంటివి మానేస్తే చాలు. ఒక్కొక్కరికి ఓ వింత వ్యాధి ఉంటూంటుంది. ఈ రోజు ఆకాశానికెత్తెయ్యడం, రేపటి రోజున పాతాళంలోకి పడేస్తూ పదిమంది మధ్య అవమానించడం. ఇదుగో ఇలాంటివన్నీ మానాలని చెప్పడం దీని భావం. శరీరావయవాలన్నీ ఎదుటివారికి తోడ్పడేలా చేయగలగాలి. 3 కపిలః రెండు రంగులు కలిసిన తనాన్ని ‘కపిల’మంటారు. ఇటు శివ లక్షణమూ అటు విష్ణు విధానమూ కలిగినవాడు కాబట్టి కపిలుడు (శుక్లాం బరధరం విష్ణుమ్... కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా!) దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరైనా నేరాన్ని చేస్తే ‘వాడు మనవాడా? మనకి ఉపయోగపడేవాడా?’ అని ఈ తీరుగా లెక్కించి తప్పుచేసినా రక్షించదలిచే (రావణుడికి కుంభకర్ణునిలా) చేయరాదనీ శిక్షించే తీరాలని చెప్తుంది ఒక పద్ధతి. అదే తీరుగా ధర్మబద్ధంగా పనిచేస్తూ ఉండేవాణ్ని మెచ్చుకోవడమే కాక వానికి కొంత వెసులుబాటుని కల్పించాలని కూడా దీని భావంగా అర్థం చేసుకోవాలి! 4 గజకర్ణికః ఏనుగు చెవులే తనకి చెవులుగా కలవాడనేది పై అర్థం. ఏనుగుకున్న లక్షణాల్లో రెండు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. అంత ఎత్తున్న ఏనుగుకున్న ఆ చిన్న కళ్లు నేలమీద పడ్డ సూదిని కూడా గుర్తించగలవు.అలాగే ఆ చెవులు దూరంగా పాము బుసకొడుతూంటే వినగలిగినంతటి శక్తిమంతమైనవి. చెవుల వరకే దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరు మన ప్రవర్తన గురించి తేడాగా అనుకుంటున్నారో గమనించుకుంటూ ఉండాలి. లోకం నుండి అపవాదు వస్తుందేమో అనే భయంతో మన ప్రవర్తన ఉండాలి తప్ప ‘ఎవ్వరేమనుకున్న నాకేమి సిగ్గు?’ అన్నట్టుగా ఉంటే పశువుకీ వీనికీ భేదం లేనట్టే. ఇక ఏనుగు తన చెవుల్ని నిరంతరం ఆడిస్తూనే ఉంటుంది. ఇదే తీరుగా అధికారికి ఎందరెందరో ఇచ్చకాలు పలుకుతూ పొగిడేస్తూ దగ్గరైపోతుంటారు. మరోపక్క గిట్టనివారి మీద చెప్పేస్తూ వ్యతిరేకతని నూరిపోస్తూ ఉంటారు. అంటే వేటిని వినాలో వేటిని వినకూడదో గమనించుకోవాలి తప్ప చెవికి చేరిన అన్నిటినీ నమ్మడం సరికాదని. 5 లంబోదరః పెద్ద బొజ్జ ఉన్నవాడనేది దీనిపై అర్థం. ‘లంబ’మనే మాటకి వేలాడుతున్న (లంబమానః) అనేది సరైన అర్థం. బొజ్జ మరింతగా అయినప్పుడు కిందికి వేలాడుతూ ఉంటుంది.‘నా కడుపులో ఎన్నో రహస్యాలని దాచుకున్నా’నంటుంది తల్లి. అలా రహస్యాలెందరు తనకొచ్చి చెప్పినా వాటికి తన పైత్యాన్ని కూడా జోడించి ప్రచారం చేయడం కాకుండా ‘కడుపులో దాచుకోగలగడ’మనే గొప్ప లక్షణాన్ని అలవర్చుకోవాలనేది గణపతి మనకి చెప్తున్నాడన్నమాట! 6 వికటః కటమంటే చెక్కిలి. ఏనుగు రూపం అయిన కారణంగా ఏటవాలుగా అయి దృఢంగా అయిన చెక్కిలి కలవాడనేది దీనర్థం. దీన్ని మనకి అన్వయించుకుంటే చెక్కిలి (కటం) అనేదే వ్యక్తి చెప్పదలిచిన అభిప్రాయాన్ని చెప్పించగల ముఖ్య అవయవం ముఖంలో. అందుకే ఆంజనేయుడికి ‘హనుమాన్’ చక్కని హనువులు కలవాడనే పేరు. ఏ పదం తర్వాత ఏ పదాన్ని పలకాలో, ఎంతగా ఊది ఏ పదాన్ని పలకాలో దేన్ని తేల్చి పలకాలో, ఏ మాటని ముందు చెప్పి తర్వాత దేన్ని పలకాలో ఆ విశేషాన్ని వివరించేది ఈ నామం. మనం కూడా స్పష్టంగా అవగాహనతో నిదానించి మాట్లాడాలనే గుణాన్ని గ్రహించాలన్నమాట. 7 విఘ్నరాజః ప్రారంభించబడ్డ పని – ఇక ఎప్పటికీ ముడిపడనే పడ–దన్న రీతిలో వచ్చిన అభ్యంతరాన్ని విఘ్నమంది శాస్త్రం. (ప్రారబ్ధం కర్మ విశేషేణ ఘ్నంతీతి విఘ్నః) అలాంటి విఘ్నాలకి రాజు ఆయన అని అర్థం.రాజుకి చతురంగ బలాలు (పదాద్రి–అశ్వ–గజ–రథ) ఉన్నట్లే విఘ్నాలని తొలగించేందుకై నాలుగు విధాలుగా ప్రయత్నించడం నలుగురి సహాయాన్ని అర్ధించడం నాలుగు చోట్లకి వెళ్లి విచారించి ఆ విఘ్నాన్ని తొలగించుకోవాలి తప్ప విఘ్నం వచ్చిందనుకుంటూ దుఃఖిస్తూ ఉండిపోవడం సరికానిదని గణపతి చెప్తున్నాడన్నమాట! 8 గణాధిపః యక్ష కింనర కింపురుష గంధర్వ విహంగ నాగ రాక్షస దేవ... మొదలైన అన్ని గణాలకీ అధిపతి అనేది దీనర్థం.లోకంలో ఏ ఒక్కరూ శత్రువంటూ లేనివాళ్లుండరు. కాబట్టి ఏక–గ్రీవంగా (ముక్తకంఠంతో) ఎన్నుకోవడమనేది అసాధ్యమైన అంశం. అయితే వినాయకుడు మాత్రం సర్వగణాధిపతి కాగలిగాడంటే దాని ద్వారా ‘అందరూ మెచ్చుకునే తీరులో తన ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ నడుచుకోవాలనే గుణాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట.మరో విశేషమేమంటే పైన కనిపిస్తున్న అన్ని గుణాలవీ ఒకే తీరు లక్షణం కలవి కావు. ఎవరి తీరు వారిది అయితే అలాంటి భిన్న భిన్న లక్షణాలున్న అందరినీ ఒకే తీరుగా అంగీకరించేలా చేసి ఆధిపత్యాన్ని సాధించగలిగాడంటే ఆ తీరుగా అధికారి ఉండాల్సిందేనని చెప్తున్నాడన్నమాట గణపతి.తనకి తగిన శక్తి లేకపోయినా తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తూ నారాయణాష్టాక్షరీ మంత్ర మననం చేస్తూ విజయాన్ని సాధించగలిగాడు కాబట్టీ, గణాధిపుడు ఆ కారణంగానే కాగలిగాడు కాబట్టీ అధికారికి ఉండాల్సింది దైవ విశ్వాసమూ తన తల్లిదండ్రుల మీద గౌరవమున్నూ – అని గణపతి తెలియజేస్తున్నాడన్నమాట! ఇలాంటి 8 గుణాలలో సంవత్సరానికొకటి చొప్పున అయినా పొందగలిగే ప్రయత్నాన్ని ప్రారంభిస్తే వ్యక్తిలో మార్పు సంభవం అవుతుంది. లేని పక్షంలో పూజావస్తువులు కొన్న మూల్యం, పూజ చేసిన కాలం దండగ అవుతాయి. కాలక్షేప పూజే అవుతుంది!ఈ 8 గుణాలనీ అర్థం చేసుకున్నాక ఈ మొత్తం మీద మనకి అర్థమయ్యే మరో గుణం – దాన్ని 9వ గుణం అనుకోవచ్చు – గురించి అనుకుందాంగణాధిపత్యాన్ని పొందడానికి – ఎవరు అన్ని నదీ నద సముద్ర జలాల్లో స్నానం చేసి వస్తే వాళ్లు అర్హు–లనేది విషయం. ఈ మాటని వింటూనే సన్న శరీరం వాడూ, నెమలి వాహనం వాడూ అయిన కుమారస్వామి వాయు వేగంతో ఆకాశంలోకి దూసుకుపోతూంటే వినాయకుడు అసూయపడలేదు. తమ్మునికి పరాజయం లభించేలా శపించవలసిందనో అనుకూలత లేకుండా చేయవలసిందనో ప్రార్థించలేదు – లేదా – తనకి తానే ఓ మంత్రాన్ని మననం చేయడం చేయలేదు.మనకి అసాధ్యమైన పనిని మరొకరు చేస్తూంటే దాన్ని చెడగొట్టించుదాం – చెడగొడదామనే ఆలోచన లేకపోవడాన్ని నేర్చుకోవాలి గణపతి నుండి. తనకి ఆ పదవి ఎలాగైనా లభించేలా ఏ అకృత్యాన్నో చేయవలసిందని అనలేదు – తల్లిదండ్రుల్ని తూలనాడలేదు. గమనించుకోవాలి. లోకంలో ఎందరో చేసే సర్వసాధారణమైన పని ఇదే.వినాయకుడు చేసింది – తన అçశక్తతని అంగీకరిస్తూ తల్లిదండ్రుల దగ్గరికి మౌనంగా వెళ్లి కన్నీరు పెట్టడం. అంటే ఏమన్నమాట? గుండె నిండు దుఃఖానికి మన అశక్తత గాని కారణమయ్యుంటే, ఆ బాధ నుండి తాము బయటపడాలంటే శత్రువుని ఓడించడం, ఓడించే ప్రయత్నాలని ఇతరుల ద్వారా చేయించడం, తనవాళ్లని నిందించడం కాదు – కనిపించే దైవాల్లా ఉండే తల్లిదండ్రుల్ని ఆరాధించడమే అని చెప్తున్నాడన్నమాట! ఎంత గొప్ప ఉపాయం ఇది! ఎవరైనా తమ తల్లిదండ్రులకి గౌరవాన్నిస్తూ చూసుకుంటూ ఉంటే – వీళ్లెవరో తనలాగా తల్లిదండ్రుల పట్ల గౌరవం కలవాళ్లనే అభిప్రాయంతో విజయాన్నిస్తాడన్నమాట! ఎంత గొప్ప గుణం అది!! – డా. మైలవరపు శ్రీనివాసరావు పౌరాణిక ప్రవచకులు -
గణపతిని పూజించిన శివుడు
ఒకసారి శివుడు తన గణాలను తీసుకుని ఒక రాక్షసుడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి వెళ్లే తొందరలో గణపతిని కలిసి తాను Ðð ళుతున్న పని గురించి చెప్పి, అనుమతి తీసుకోవడం మరచిపోయి హడావుడిగా వెళ్లడంతో అడుగడుగునా ఆయనకు, ఆయన పరివారానికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతి పనిలోనూ విఘ్నాలు ఏర్పడుతుంటాయి. శివుడు వాటిని పట్టించుకోకుండా రథం ఎక్కబోయాడు. రథచక్రం కాస్తా ఊడిపోవడంతో తన వాహనమైన నందిని పిలిచాడు. నంది రావడం తోటే అధిరోహించబోయాడు. ఉత్సాహంగా ముందుకు ఉరకబోయిన నందికి కాలు మడతబడినట్లయి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. ఏమి చేద్దామా అన్నట్లుగా తన పరివారం వైపు చూస్తాడు శివుడు. వారంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా నిరాశానిస్పృహలతో, కళ తప్పిన ముఖాలతో కనపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన అనుభవాలు లేకపోవడంతో ఏమి జరుగుతోందో చూద్దామని కన్నులు మూసుకోగానే మనోనేత్రం ముందు బాలగణపతి నవ్వుతూ దర్శనమిచ్చాడు. అప్పుడు గుర్తుకొచ్చింది శివుడికి... విష్ణుమూర్తి సహకారంతో గజాసురుడి ఉదరం నుంచి వెలికి వచ్చిన తర్వాత తన సతిని చూద్దామన్న వేగిరపాటుతో తన నివాసానికి రావడం, వేలెడంత కూడా లేని బుడత ఒకడు తనను లోనికి వెళ్లనివ్వకుండా అడ్డగించడం, తాను ఆగ్రహంతో ఆ బాలుడి శిరస్సు ఖండించడం, పార్వతి ద్వారా అసలు విషయం తెలుసుకుని, ఆ బాలుడికి ఏనుగు తల అతికించి తిరిగి బతికించిన సందర్భంలో... ‘‘నాయనా! గణేశా! ఇకపై దేవదానవ యక్ష గంధర్వ కిన్నర కింపురుషుల దగ్గర నుంచి, మామూలు మనుషులు, మహిమాన్విత గుణాలు కలిగిన రుషులు ఏ పూజలు, వ్రతాలు, శుభకార్యాలూ చేసినా ప్రథమ పూజ నీకే. నూత్నంగా ఎవరు ఏ పని తలపెట్టినా ముందుగా నిన్ను తలచుకుని, నీకు పూజ చేయనిదే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదు, అందుకు త్రిమూర్తులమైన మేమూ అతీతులం కాము సుమా’’ అని చెప్పిన మాట, ఇచ్చిన వరం గురించి. వరమిచ్చిన తానే దానిని విస్మరించి, తన కుమారుడే కదా అన్న తేలికపాటి దృష్టితో యుద్ధానికి బయలు దేరేముందు గణపతిని స్మరించకుండా వచ్చేసినందుకే తనకూ, తన పరివారానికీ అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయని గ్రహించాడు. దాంతో ఎంతో నొచ్చుకుని వెంటనే వెనక్కు వెళ్లి, తన పరివారంతో గణపతి పూజ చేయించాడు. తాను కూడా గణపతిని కలిసి తాను యుద్ధానికి వెళుతున్నాననీ, తనకు ఏ విఘ్నాలూ లేకుండా విజయం సాధించేలా చూడమని గణపతికి చెప్పి, వీడ్కోలు తీసుకుని తిరిగి వచ్చి ఈ సారి యుద్ధంలో ఘన విజయం సాధించాడు శివుడు. పిల్లలతో అబద్ధం చెప్పకూడదని, దొంగతనం, అవినీతి, లంచగొండితనం నేరమని చాలా నీతులు చెబుతూ ఉంటాం. కానీ, తీరా మన దగ్గరకొచ్చేసరికి వాటన్నింటినీ పక్కన పెట్టేస్తాం. అది చాలా తప్పు. ఏ మంచినైనా ముందు మనం ఆచరిస్తేనే, పిల్లలు కూడా వాటిని అనుకరిస్తారని తెలుసుకోవడమే ఇందులోని నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
విశ్వ వినాయకమ్
సెప్టెంబర్ 13 వినాయకచవితి సనాతన సంప్రదాయం ప్రకారం ఏ పూజలు చేపట్టినా, ఏ యజ్ఞ యాగాదులు చేపట్టినా వినాయకుడికే తొలిపూజ చేసి, ఆ తర్వాత మిగిలిన క్రతువులను కొనసాగించడం ఆనవాయితీ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు ప్రమథ గణాలకు ఆధిపత్యం పొందినందున గణపతిగా, విఘ్నాలను నివారించే దేవుడు కనుక విఘ్నేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. పార్వతి తయారు చేసిన వినాయకుడు శివుడి చేతిలో ప్రాణాలు కోల్పోగా, ఏనుగు తలను తగిలించి తిరిగి బతికించినందున గజాననుడిగా, ఒకే దంతం మిగిలినందున ఏకదంతుడిగా, మోదకాలంటే ఇష్టం కలిగిన వాడు కావడంతో మోదకప్రియుడిగా, పెద్ద ఉదరం కలిగి ఉన్నందున లంబోదరుడిగా, మూషికాన్ని వాహనం చేసుకున్నందున మూషిక వాహనుడిగా, స్కందుడిగా పేరుపొందిన కుమారస్వామికి అన్న అయినందున స్కందాగ్రజుడిగా వినాయకుడు వినుతికెక్కాడు. వినాయకుడికి గల సహస్రనామాలు, ఆయన గురించిన ప్రసిద్ధ పురాణగాథలు వినాయక వ్రతకల్పంలో జనానికి తెలిసినవే. వినాయకుడి గురించిన కొన్ని అరుదైన అపురూపమైన విశేషాలు... పార్వతీదేవి స్నానం చేస్తుండగా నలుగుపిండి ముద్దతో వినాయకుడిని రూపొందించి, అతడికి ప్రాణం పోసిందనే కథనం అందరికీ తెలిసిందే. బాల వినాయకుడిని కావలి ఉంచగా, అతడు బయటి నుంచి కైలాసానికి తిరిగి వచ్చిన శివుడిని అడ్డగించి తలపడటం, శివుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడం, ఏనుగు తలను తగిలించి అతడిని బతికించడం కూడా దాదాపు అందరికీ తెలిసిన సంగతే. వినాయక వ్రతకల్పంలోని గాథ వినాయకుడి సృష్టి ఎలా జరిగిందో మాత్రమే చెబుతుంది. అయితే, పార్వతీ పరమేశ్వరులు గణపతిని ఎందుకు సృష్టించారనే దానికి సంబంధించిన గాథ స్కాంద పురాణంలో ఉంది. ఇది వ్రతకల్పంలోని గాథకు కొంత భిన్నమైనది. గణపతిని ఎందుకు సృష్టించారంటే..? స్వర్గలోకం సకల భోగాలకు నిలయం. భూలోకంలో జీవితాంతం అలాంటి భోగాలను అనుభవించడం అసాధ్యం. జరామరణాలతో కూడిన మర్త్య జీవితం కంటే, స్వర్గాన్ని చేరి అమర సౌఖ్యాలను అనుభవిస్తేనే కదా సార్థకత అనుకున్న మానవులు ఘోర తపస్సులు ఆచరిస్తూ, తపః ఫలితంగా ఒక్కొక్కరే స్వర్గానికి వెళ్లసాగారు. స్వర్గంలో దేవతల కంటే మనుషులే ఎక్కువయ్యారు. స్వర్గంలో తమ ఆధిక్యత పెరగడంతో మానవులు ఏకంగా దేవతల మీద ఆధిపత్యం చలాయిస్తూ స్వైరవిహారం చేయడం ప్రారంభించారు. మానవులంటేనే దేవతలు భయపడే పరిస్థితి దాపురించింది. మానవులకు భయపడుతూ బతకడం దుస్సహంగా ఉందని, వాళ్లను ఎలాగైనా నియంత్రించాలని స్వర్గంలోని దేవతలందరూ దేవేంద్రుడితో మొరపెట్టుకున్నారు. తపస్సులు సాగించి స్వర్గానికి వచ్చిన వాళ్లను ఎలా నియంత్రించాలో దిక్కుతోచని దేవేంద్రుడు నేరుగా కైలాసానికి బయలుదేరాడు. కైలాసంలో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులకు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి, వారిని పరిపరి విధాల స్తుతించాడు. ‘దేవేంద్రా! నీ రాకకు కారణమేమిటి?’ అని పరమేశ్వరుడు ప్రశ్నించగా, తన మొర వినిపించాడు. ‘పరమేశ్వరా! ఘోర తపస్సులు చేసి, తపః ఫలాల కారణంగా స్వర్గానికి చేరుకున్న మానవులు దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇదేమని నిలదీసిన దేవతలను నానా రకాలుగా బాధిస్తున్నారు. వారి దాష్టీకాలకు స్వర్గంలో ప్రశాంతత లేకుండా పోయింది. మానవజాతి అంటేనే దేవతలు భయభ్రాంతులయ్యే పరిస్థితి దాపురించింది. మానవుల బెడద నుంచి మమ్మల్ని నీవే కాపాడాలి తండ్రీ!’ అని వేడుకున్నాడు. దేవేంద్రుడి మాటలు విన్న పరమేశ్వరుడు సాలోచనగా పార్వతీదేవి వైపు చూసి చిరునవ్వు చిందించాడు. అప్పుడు పార్వతీదేవి మట్టి తీసుకుని తన చేతులతో ఒక ఆకృతిని రూపొందించింది.ఏనుగు ముఖం, పెద్దబొజ్జ, భారీ శరీరం, నాలుగు చేతులు కలిగిన వింత ఆకారం ప్రాణం దాల్చి, పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, పార్వతీదేవితో ఇలా అన్నాడు. ‘అమ్మా! నన్ను ఎందుకు సృష్టించారో చెబుతారా?’అందుకు పార్వతీ దేవి, ‘నాయనా! నీవల్ల నెరవేరవలసిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్లు. అక్కడ స్వర్గానికి వెళ్లాలనుకుంటున్న మానవులకు విఘ్నాలు కలిగించు. ఈ బృహత్కార్యంలో నీకు నంది, మహాకాలుడు సహాయకులుగా ఉంటారు’ అని బదులిచ్చింది. ప్రమథ గణాలకు అధిపతిగా తానే స్వయంగా గణేశుడికి అభిషేకం చేయించింది. ఈ కార్యక్రమాన్ని తిలకించిన దేవతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గణేశునికి జయజయ ధ్వానాలతో ఆశీస్సులు పలికి, పుష్పవృష్టి కురిపించారు. పరమేశ్వరుడు గణపతికి పరశువును, బ్రహ్మ తికాలజ్ఞతను, విష్ణువు బుద్ధిని, కుబేరుడు ఐశ్వర్యాన్ని , సూర్యుడు పరాక్రమాన్ని, చంద్రుడు కాంతిని, దేవేంద్రుడు సౌభాగ్యాన్ని, పార్వతీదేవి మోదకపాత్రను ఇచ్చారు. కుమారస్వామి మూషికాన్ని గణేశునికి వాహనంగా బహూకరించాడు. ఇలా దేవతలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చి, గణేశుని గణాధిపత్యాన్ని ఆమోదించడంతో అతడు అమిత బలశాలిగా మారి, పార్వతీదేవి అనుజ్ఞతో దేవతలంతా తనపై ఉంచిన కార్యభారాన్ని నెరవేర్చేందుకు భూలోకానికి పయనమయ్యాడు. స్వార్థబుద్ధులై స్వర్గప్రాప్తిని ఆశించే మానవులకు ప్రతి పనిలోనూ విఘ్నాలు కలిగించడం ప్రారంభించాడు. వినాయకుడు కల్పించిన విఘ్నాలను అధిగమించడం మానవులకు దుస్సాధ్యంగా మారింది. వినాయకుడి ప్రభావంతో స్వర్గలోకానికి వెళ్లే మానవుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.స్వర్గంలో తిరిగి ప్రశాంతత ఏర్పడింది. మానవుల్లో గణపతి పట్ల భయభక్తులు ఏర్పడ్డాయి. అందుకే ఏ పని మొదలుపెట్టినా, విఘ్నాలు తొలగించుకోవడం కోసం వినాయకుడికి తొలిపూజలు చేయడం ప్రారంభించారు. భక్తి శ్రద్ధలతో పూజించి వినాయకుడి అనుగ్రహం పొందిన వారు తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని, ఆయనకు ఆగ్రహం కలిగిస్తే విఘ్నాలు తప్పవనే నమ్మకం బలపడింది. వినాయకుడు అవతరించిన రోజైన భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక వ్రతం ఆచరించడం అప్పటి నుంచే మొదలైందని ప్రతీతి. వినాయకుడు ఎలా ఏకదంతుడయ్యాడంటే..? వినాయకుడికి గల గజముఖానికి మొదట్లో రెండు దంతాలూ ఉండేవట. పరశురాముడి గొడ్డలి దెబ్బ వల్ల ఒక దంతాన్ని పోగొట్టుకుని ఏకదంతుడయ్యాడట. అదెలాగంటే... కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరుశురాముడు పరమశివుడి దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని అడ్డగించి, ‘ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడద’న్నాడు. ‘పరమేశ్వరుడిని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవ్వడివి‘ అంటూ పరుశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాటా మాటా పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలైంది. వినాయకుడు తన తొండంతో పరశురాముడిని పైకెత్తి గిరగిరా తిప్పి కిందకు పడేశాడు. దెబ్బకు పరశురాముడి కళ్లు బైర్లుకమ్మాయి. కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడి పైకి విసిరాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీపరమేశ్వరులు బయటకు వచ్చారు. దంతం విరిగి నెత్తురోడుతున్న బాల గణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముడిని మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు. అంతటి ఆ కథ ముగిసినా, వినాయకుడు ఏకదంతుడిగా పేరుపొందాడు. ప్రణవరూపుడు వినాయకుడు ప్రణవరూపుడు. ప్రణవనాదమైన ఓంకారం ఆకారంలోనే వినాయకుడు కనిపిస్తాడు. దేవనాగరి లిపిలోని ఓంకారం ఆకారంలోనే చాలా వరకు పురాతన వినాయక విగ్రహాలు కనిపిస్తాయి. అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఉపపురాణాలలో వినాయకుని ప్రస్తావన కనిపిస్తుంది. వినాయకుని గురించిన విపులమైన కథనాలు గణేశ పురాణంలోను, ముద్గల పురాణంలోను కనిపిస్తాయి. ముద్గల పురాణం ప్రకారం వినాయకునికి ఎనిమిది అవతారాలు ఉన్నాయి. అవి: వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు. ఈ ఎనిమిదింటిలోనూ ఐదు అవతారాలకు వినాయకుని వాహనం ఎలుక. వక్రతుండ అవతారానికి సింహం, వికటావతారానికి నెమలి, విఘ్నరాజ అవతారానికి శేషువు వాహనాలు. గణేశ పురాణం ప్రకారం వినాయకునికి నాలుగు అవతారాలు ఉన్నాయి. అవి: మహోటక అవతారం, మయూరేశ్వర అవతారం, ధూమ్రకేతు అవతారం, గజానన అవతారం. మహోటక అవతారానికి సింహం, మయూరేశ్వర అవతారానికి నెమలి, ధూమ్రకేతు అవతారానికి గుర్రం, గజానన అవతారానికి ఎలుక వాహనాలుగా ఉన్నట్లు గణేశ పురాణ కథనం. చారిత్రకంగా చూసుకుంటే తొలినాటి వినాయక శిల్పాలలో ఎక్కడా ఎలుక వాహనం కనిపించదు. ఏడో శతాబ్ది తర్వాతి నాటి శిల్పాలలో మాత్రమే వినాయకునితో పాటు ఎలుక వాహనం కనిపిస్తుంది. పురాణాల్లో చూసుకుంటే మత్స్య పురాణంలో వినాయకుని మూషిక వాహన ప్రస్తావన తొలిసారిగా కనిపిస్తుంది. ఎలుకను తామస ప్రవృత్తికి చిహ్నంగా భావిస్తారు. ఎలుకపై స్వారీ చేయడం ద్వారా వినాయకుడు మానవులలోని కామ క్రోధ లోభ మోహాది తామస ప్రవృత్తిని నియంత్రిస్తాడని ప్రతీతి. వినాయకుని ముందు ఎందుకు గుంజీలు తీస్తారంటే..? వినాయక వ్రతం ఆచరించిన వారు పూజ ముగించిన తర్వాత వినాయకుడి ముందు గుంజీలు తీయడం ఆచారంగా వస్తోంది. ఈ ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. పార్వతీదేవికి శ్రీమహావిష్ణువు సోదరుడు. అందుకే పార్వతీదేవిని నారాయణి అని కూడా అంటారు. బావగారైన శివుడిని చూడటానికి ఒకసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడు. సుదర్శనం, గద తదితర ఆయుధాలన్నీ తీసి పక్కనపెట్టి, శివుని పక్కన కూర్చుని ముచ్చట్లలో పడతాడు. అక్కడే ఆడుకుంటున్న బాల గణపతి స్వర్ణకాంతులతో ధగధగలాడుతున్న సుదర్శనచక్రాన్ని తీసుకుని, అమాంతం అప్పడంలా నోట్లో వేసుకుని మింగేశాడు. శివుడితో కబుర్లలో మునిగిన విష్ణువు దీనిని గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనిపించలేదు. ఎక్కడ ఉంచానో మరచానేమోనని సుదర్శనం కోసం వెదకడం ప్రారంభిస్తాడు. విష్ణువు వెదుకులాడుతుండటం చూసిన వినాయకుడు ‘మామా! దేనికోసం వెదుకుతున్నావు?’ అని అడిగాడు. ‘నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో మరచాను. దాని కోసమే వెదుకుతున్నాను’ అని చెప్పాడు విష్ణువు. ‘ఓహో! సుదర్శనమా! దానిని నేను మింగేశాగా!’ అని నవ్వుతూ అన్నాడు వినాయకుడు. బాలుడైన వినాయకుడిని ఏమీ చేయలేక తన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని నానా రకాలుగా బతిమాలుకుంటాడు. గణపతి విష్ణువు బతిమాలుతున్న కొద్దీ నవ్వుతూ అతడిని ఆటపట్టిస్తాడు. అప్పుడు అంతటి మహావిష్ణువు తన కుడిచేత్తో ఎడమ చెవిని, ఎడమచేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెడతాడు. విష్ణువు గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు పగలబడి నవ్వుతాడు. విపరీతంగా నవ్వడంతో అతడి కడుపున ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది. విష్ణువు ఆ చక్రాన్ని తీసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువంతటి వాడు వినాయకుడి ముందు గుంజీలు తీయడంతో వినాయక వ్రత పూజ తర్వాత గుంజీలు తీయడం ఆచారంగా మారింది. వినాయకుడి కుంటుంబం వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడని సాధారణంగా తెలిసిన విషయం. అయితే, వినాయకుని జననానికి సంబంధించి పురాణాలలో రకరకాల గాథలు ఉన్నాయి. పార్వతి నలుగు పెట్టుకునేటప్పుడు నలుగుపిండితో వినాయకుడిని రూపొందించినట్లుగా చెబుతున్న గాథ ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే, శివుడే ఇతడిని సృష్టించాడని, పుణ్యక వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి వినాయకుడిని కన్నదని, పార్వతీ పరమేశ్వరులు వినాయకుడిని సృష్టించారని, స్వయంభువుగా వెలసిన వినాయకుడిని పార్వతీ పరమేశ్వరులు కనుగొన్నారని... ఇలా రకరకాల గాథలు ఉన్నాయి. వినాయకుడి తమ్ముడు కుమారస్వామి. ఇతడికే కార్తికేయుడని, స్కందుడని కూడా అంటారు. వినాయకుడు బ్రహ్మచారి అని కొన్ని గాథలలోను, అతడికి సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారని మరికొన్ని గాథలలోను ఉంది. శివపురాణం ప్రకారం వినాయకుడికి క్షేమం, లాభం అనే ఇద్దరు పుత్రులు కూడా ఉన్నారని ప్రతీతి. సనాతన సంప్రదాయంలో ఆరు మతాలు ఉన్నాయి. వీటినే షణ్మతాలు అంటారు. అవి: శైవ వైష్ణవ సౌర శాక్తేయ గాణపత్య స్కంద మతాలు. వీటిలో శైవ వైష్ణవ మతాలు మాత్రమే ఇప్పటికీ ప్రధానంగా ఉనికిలో ఉన్నాయి. శాక్తేయం కొంతవరకు ఉనికిలోల ఉన్నా, ఆరాధన పద్ధతులు చాలావరకు మారాయి. చరిత్రను తరచి చూస్తే క్రీస్తుశకం ఆరో శతాబ్ది వరకు స్కంద ఆరాధన ఎక్కువగా ఉండేది. స్కందుని పూజను వీర పూజ అనేవారు. ఆరో శతాబ్ది తర్వాతి నుంచి వినాయకుని ఆరాధన క్రమంగా పెరిగింది. వినాయకుని ఆరాధనకు ప్రాచుర్యం పెరిగిన తొలినాళ్లలో గాణపత్య మతం ప్రత్యేక మతంగా ఉనికిలో ఉండేది. గాణపత్యాన్ని అవలంబించే వారిలో కొందరు గణపతిని తాంత్రిక పద్ధతుల్లో పూజించేవారు కూడా. ఉచ్చిష్ట గణపతి సాధన వంటి తాంత్రిక ఆరాధనలు అప్పట్లో మొదలై ఉంటాయని చరిత్రకారుల అంచనా. వినాయకుని తొలినాటి శిల్పాలు అఫ్ఘానిస్థాన్‌లో దొరికాయి. ఇవి క్రీస్తుశకం నాలుగో శతాబ్దం నాటివని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉదయగిరి గుహలు, రామగఢ్ కొండ, భుమరా ఆలయంలో కూడా వినాయకుని అతి పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఇవన్నీ గుప్తుల కాలం నాటివని, అంటే సుమారు క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటివని చెబుతున్నారు. గణపతిని ప్రధాన దైవంగా ఆరాధించే గాణపత్య మతం క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికి బాగా ప్రాచుర్యంలో ఉండేదని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. విదేశాల్లో వినాయకుడు భారత ఉపఖండం నుంచి వినాయకుడు అనతి కాలంలోనే సముద్రాలకు ఆవల ఉన్న పలు ఇతర దేశాలకూ విస్తరించాడు. నౌకా వాణిజ్య సంబంధాల కారణంగా వినాయకుని ఆరాధన విదేశాలకూ పాకింది. చైనాలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నాటికే వినాయకుని ఆరాధన ఉండేదనేందుకు అక్కడ దొరికిన గణపతి శిల్పాలే నిదర్శనం. గణపతి ఆరాధన క్రీస్తుశకం ఐదు–ఆరు శతాబ్దాల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చినా, దీనికి మూలాలు సింధులోయ నాగరికత కాలంలోనే ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇరాన్‌లోని లోరెస్తాన్ ప్రావిన్స్‌లో జరిపిన తవ్వకాల్లో దొరికిన లోహఫలకంపై గణపతిని పోలిన ఆకారం ఉండటంతో గజాననుడి ఆరాధనకు మూలాలు క్రీస్తుపూర్వం మూడువేల ఏళ్ల కిందటే ఏర్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వైదిక సాహిత్యాన్ని తీసుకుంటే రుగ్వేదంలో వినాయకుని ప్రస్తావన ‘బ్రాహ్మణస్పతి’ అనే పేరిట కనిపిస్తుంది. కృష్ణ యజుర్వేదంలోను, తైత్తరీయ అరణ్యకంలోను కూడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వమే ఏర్పడిన జైన, బౌద్ధ మతాలు కూడా గణపతి ఆరాధనను స్వీకరించాయి. ఈ మతాలు వ్యాపించిన దేశాల్లో కూడా గణపతి ఆరాధన విభిన్నమైన విలక్షణమైన పద్ధతుల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. నేపాల్‌లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. హేరంబ రూపంలోని వినాయకునికి ఐదు తలలు ఉంటాయి. హేరంబుని వాహనం సింహం. నేపాల్, టిబెట్లలో నృత్యముద్రలో ఉన్న గణపతిని కూడా ఆరాధించేవారు. శ్రీలంక, బర్మా, చైనా, జపాన్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా దేశాల్లో కూడా వినాయకుడు విలక్షణ రూపాల్లో కనిపిస్తాడు. జైన గ్రంథాలలో వినాయకుని ప్రస్తావన లేకున్నా, జైనులు మాత్రం వినాయకుడిని ఆరాధిస్తారు. జైనులు తమ సంప్రదాయంలో గణేశునికి కొన్ని కుబేరుని లక్షణాలను ఆపాదించినట్లు కనిపిస్తుంది. బౌద్ధ గ్రంథాలలో అక్కడక్కడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. – పన్యాల జగన్నాథదాసు -
మరోసారి శివుడిగా దర్శనమిచ్చిన మాజీ మంత్రి
పట్నా : రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నాయకుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ యువ నేత తన వివాహ సందర్భంగా ఆదిదంపతులు శివపార్వతుల రూపంలో తన ఫోటోలను ప్రింట్ చేయించుకుని హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తేజ్ మరోసారి శివుడి అవతారాన్ని ధరించారు. శివాలయంలో పూజలు నిర్వహించడానికి తేజ్ ప్రతాప్, ఏకంగా శంకరుని వేషధారణలో ఆలయానికి బయలు దేరారు. ఒంటి మీద పులిచర్మం, చేతిలో త్రిశూలం ధరించి డియోఘడ్‌లో ఉన్న బైద్యనాథ్ ధామ్ ఆలయానికి వెళ్లారు. గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఢమరుకం మోగిస్తూ, హారతి సమయంలో శంఖాన్ని ఊదుతూ పూజ కొనసాగించారు. ఈమధ్య తేజ్ ప్రతాప్.. ఓ సైకిల్ యాత్ర చేశారు. అయితే సైకిల్ యాత్ర సందర్భంగా ఆయన పట్టు తప్పి కింద పడిపోయారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ ఆయన సైకిల్ యాత్రను చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలసి యాత్రను ప్రారంభించిన ఆయన ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. దాంతో పట్టు కోల్పోయి కింద పడ్డారు. -
రాహుల్ ప్రధాని కావాలంటే..
జైపూర్, రాజస్థాన్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 48 వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు రాహుల్ పేరున జైపూర్ శివాలయంలో భారీ ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ సురేష్ మిశ్రా...‘ఈ రోజు మా పార్టీ అధ్యక్షడు రాహుల్ గాంధీ పుట్టినరోజు. రాహుల్ జీ పుట్టిన రోజు వేడుకలను చాలా పెద్ద ఎత్తున నిర్వాహించాలనుకుంటున్నాము. 2019లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి, రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. ఇందుకు దేవుని ఆశీర్వాదం కూడా అవసరమే. అందుకే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని జైపూర్ సంగనీర్ రోడ్‌లోని శివాలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నాము’. అన్నారు. ప్రత్యేక కార్యక్రమాలు... రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ ‘రన్ ఫర్ రాహుల్ గాంధీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రజస్వామ్యం కోసం ప్రతి ఒక్కరు పోరాడాలనే సందేశాన్ని ప్రచారం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇదే కాక ప్రదేశ కాంగ్రెస్ కమిటి, నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, సేవా దళ్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కమిటిలు రాహుల్ పుట్టిన రోజును పురస్కరించుకొని పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపాయి. రాహుల్ గాంధీ 48వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్లో ‘రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు రాహుల్ గాంధీ’ అంటూ ట్వీట్ చేసారు. -
నటుడి సోదరుడిపై కేసు!
మీరట్ : హిందువులు ఆరాధించే పరమశివుడి ఫొటోను కించపరిచే రీతిలో ఫేస్బుక్లో పోస్టు చేసిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ సోదరుడు అయాజుద్దిన్ సిద్ధిఖీపై కేసు నమోదైంది. అయాజుద్దీన్ పోస్టుపై హిందూ యువవాహిని (హెచ్‌వైవీ) కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేయడంతో మీరట్‌లోని బుధానా పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీ సెక్షన్ 153ఏ (మతం, జాతి, ప్రాంతం ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం) కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. శివుడి ఫొటోను అభ్యంతరకర రీతిలో పోస్టు చేసిన అయాజుద్దీన్ వెంటనే అరెస్టు చేయాలని హెచ్‌వైవీ నేత భరత్ ఠాకూర్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, నిజానికి శివుడి పట్ల అభ్యంతరకర పోస్టును ఖండిస్తూ.. అయాజుద్దీన్ ఫేస్బుక్లో పోస్టు పెట్టారని, అయితే, శివుడి అభ్యంతరకర ఫొటోను ఆయన కాపీ చేసి.. తన పోస్టులో పెట్టడంతో హెచ్‌వైవీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ముజఫర్‌నగర్ డీఎస్పీ హరిరామ్ యాదవ్ తెలిపారు. ఆయన పోస్టు ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని, ఫేస్బుక్లో ఇలాంటి అభ్యంతకరమైన ఫొటోలు షేర్ చేయకూడదని, అలాంటి వాటిని తాను తిరస్కరిస్తున్నానని ఆయన తన పోస్టులో పేర్కొన్నారని డీఎస్పీ చెప్పారు. ‘శివుడిపై ఓ వ్యక్తి అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. దానిపై నేను అతడితో పోట్లాడాను. మత మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి పోస్టులు పెట్టకూడదని కోరుతూ నేను పోస్టు పెట్టాను. కానీ నాపైనే కేసు నమోదు చేశారు’ అని అయాజుద్దీన్ సిద్ధిఖీ మీడియాకు తెలిపారు. -
శివుడు శ్మశానవాసి అని ఎందుకంటారు?
‘అరిష్టం శినోతి తనూకరోతి’ అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం. శ్మశానం అంటే ఎటువంటి భయాలు, ఆశలు, కోరికలు, కోపాలు, ఆందోళనలు, బంధాలు లేని ప్రదేశం. అక్కడున్న శరీరాలు ఎండకు, చలికి, వర్షానికి... ఇలా దేనికీ చలించవు. ఎవరు ప్రతి కర్మను (పనిని) కర్తవ్యంగా చేస్తారో, నిత్యం ప్రశాంతంగా ఉంటారో, సుఖ దుఃఖాలను సమానంగా చూస్తారో, ప్రతి విషయానికి ఆవేశ పడరో, అటువంటి వారి మనసులో శివుడుంటాడని అర్థం. భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టం అని చెప్పాడు. మనం ఆలోచిస్తే మనం ఆందోళన పడకపోతేనే అన్ని పనులు సక్రమంగా, అనుకున్న కాలానికన్నా ముందే, మరింత గొప్పగా పూర్తి చేయగలుగుతాం. అంతేకాదు ఎంతగొప్పవాడైనా, బీదవాడైనా, ఎంత తప్పించుకుందామన్నా ఆఖరున చేరేది స్మశానానికే. అలాగే ప్రతి జీవుడు(ఆత్మ) ఆఖరున ఏ పరమాత్మను చేరాలో, ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో, ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో, ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం అని అర్థం. అందుకే శివుడు స్మశానవాసి అన్నారు. అంతేకాని శివుడు స్మశానంలో ఉంటాడు కనుక ఆయన్ను ఆరాధించకూడదని, శివాలయానికి వెళ్ళరాదని ఎక్కడ చెప్పలేదు... -
శివుడిగా తేజ్.. పార్వతిగా ఐశ్వర్య..!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆర్జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను తేజ్ శనివారం పెళ్లి చేసుకోబోతున్నారు. దాణా కుంభకోణం కేసుల్లో జైలులో ఉన్న లాలూ.. కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్‌పై బయటికు వచ్చారు. ఈ పెళ్లి కోసం లాలూ కుటుంబం ఘనంగా ఏర్పాట్లు చేసింది. అటు ఆర్జేడీ అభిమానులు, కార్యకర్తల కోలాహలం కూడా పెద్దస్థాయిలో ఉంది. పెళ్లి చేసుకోబోతున్న తేజ్ ప్రతాప్ కటౌట్లు, పోస్టర్లు పెద్ద ఎత్తున ఆర్జేడీ కార్యకర్తలు నిలబెట్టారు. ఇందులో లాలూ నివాసం వద్ద ఏర్పాటుచేసిన ఓ కటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి కొడుకు తేజ్‌ప్రతాప్‌ను శివుడిగా, పెళ్లికూతురు ఐశ్వర్యను పార్వతిగా చిత్రీకరించిన ఈ కటౌట్‌ను కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్నాలోని వెటినరీ కాలేజీ కాంపౌండ్‌లో జరుగబోతున్న ఈ పెళ్లికి అతిరథ మహారథులు వేంచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలకు, ప్రముఖులకు, మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్‌లు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20వేల మంది వరకు ఈ పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారని బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు రామ్ చంద్ర పూర్వే చెప్పారు. -
సూర్యుడికో నీటి చుక్క
జార్ఖండ్ రాజధాని రాంచీలో మంచి వేసవిలో ‘మాండా ఉత్సవం’ జరుగుతుంది. ఇది గిరిజన పండుగ. గిరిజనులు చేసుకునే పండుగ. ఎండాకాలం వస్తే రాంచీ భగభగమని మండిపోతుంది. చుట్టు పక్కల అడవుల్లో కుంటలు, చెలమలు ఆవిరైపోతాయి. హతియ, రుక్కా, కంకె వంటి డ్యాముల్లో నీళ్లు అడుగంటుతాయి. అడవుల్లో ఉండే జీవులకే కాదు గిరిజనులకు కూడా ఇది కష్ట సమయం. అందుకే ఏప్రిల్ నెలలో వీరు మాండా ఉత్సవం జరుపుకుంటారు. రాంచీ చుట్టుపక్కల నూరు కిలోమీటర్ల పరిధిలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఎక్కడిక్కడ ఊళ్లలో శివుడి దేవాలయాలు గిరిజనులతో కిటకిటలాడతాయి. శివుడి నెత్తిన గంగమ్మ ఉంటుంది. కనుక శివుణ్ణి నమ్ముకుంటే మంచి ఎండల్లో నాలుగు వానలు పడి నీళ్లు వస్తాయని వీళ్లు ఉత్సవం చేస్తారు. సూర్యుడికి వందనం సమర్పిస్తు కలశ ప్రదర్శన చేస్తారు. ఆ నీళ్లను శివుడికి అర్పిస్తారు. ఈ క్రతువును ఆడవాళ్లు నిర్వహిస్తారు. ఉషాదేవి మాట సూర్యుడు, గంగమ్మ మాట శివుడు విన్నప్పుడు ఈ స్త్రీ భక్తుల మాట సదరు దేవుళ్లు వినకుండా ఉంటారా? ఎండల్లో నాలుగు వానలు కురిపించకపోతారా? -
మహాయజ్ఞానికి సర్వం సిద్ధం
ఎచ్చెర్ల క్యాంపస్ : ఎచ్చెర్ల మండలం కొంచాల కూర్మయ్యపేట సమీపంలోని శ్రీచక్రపురం పీఠంలో శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకు 1001 మేరువుల కోటి శివలింగాల సంస్థాన మహాయజ్ఞం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం ఏడు గంటల నుంచి మహాయాగ పూజలు ప్రారంభం కానున్నాయి. శ్రీచక్రపురం పీఠాధిపతి తేజోమూర్తుల బాలభాస్కరశర్మ, కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మహాయజ్ఞం అనంతరం కోటి శివలింగాల మహాక్షేత్రం నిర్మాణం చేపట్టనున్నారు. రోజుకు ఆరువేల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు, అన్న సంతర్పణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్పటిక లింగాన్ని ఊరేగించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. జిల్లా స్థాయిలో భారీగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమం కావడంతో నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు కోటి రుద్రాక్షలతో రుద్రాభిషేకం, కోటి కుంకుమార్చన కార్యక్రమాలతో పూజ ప్రారంభం కానుంది. టస్ట్రు కమిటీ సభ్యులు హనుమంతు కృష్ణారావు, కోరాడ రమేష్, టి.నాగేశ్వరరావు, దుప్పల వెంటకరావు, పప్పల రాధాకృష్ణ, రమేష్, పైడి చంద్, అంధవరపు వరహా నర్సింహం, పొన్నాల జయరాం, గీతా శ్రీకాంత్ గురువారం యాగస్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లు పూర్తి చేశాం.. మహాయజ్ఞానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం. రోజుకు ఆరు వేల మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నాం. రుద్రాక్ష యాగం, స్పటిక లింగానికి నిరంతరం క్షీరాభిషేకం చేయడంతతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. రోజుకు 300 దంపతులు పూజల్లో పాల్గొంటారు. సంప్రదాయ దుస్తులు ధరించి భక్తులు హాజరుకావాలి. – తేజోమూర్తుల బాలభాస్కరశర్మ,శ్రీచక్రపురం పీఠాధిపతి -
నేటి నుంచి సలేశ్వరం బ్రహ్మోత్సవాలు
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ అమర్నాథ్ క్షేత్రంగా పేరుగాంచిన సలేశ్వరం బ్రహ్మోత్సవా లు గురువారం నుంచి ప్రారంభంకానున్నా యి. వచ్చేనెల 2 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. దట్టమైన నల్లమల అరణ్యంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే సాహస యాత్ర చేయకతప్పదు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో శివుడు కొలువైన ఈ క్షేత్రం ఉంది. పోలీసులు, అటవీ అధికారుల భద్రతా ఏర్పాట్ల నడుమ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. చైత్ర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సలేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు చాలా దూరం కాలినడకన ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి వెళ్లే మట్టి రోడ్డుపై 20 కిలోమీటర్ల దూరం అతి కష్టం మీద వాహనాలపై ప్రయాణం సాగించాలి. ఆ తర్వాత 3 లోయలను కాలినడకన దాటుతూ వెళ్లాలి. లోయల్లో చేతిలో కర్ర లేనిదే అడుగు ముం దుకు వేయలేని పరిస్థితులు ఉంటాయి. పున్న మి వెన్నెల కాంతుల మధ్య ఈ యాత్ర చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ఐదు కిలోమీటర్ల కాలినడక అనంతరం భక్తులు లోయలోకి వెళ్లి జలపాతాలను చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని పూజిస్తారు. ఉత్సవాలకు సుమారు 10 లక్షలమంది వస్తారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. చెంచులే పూజారులు వందలాది ఏళ్లుగా అడవినే నమ్ముకుని జీవిస్తున్న చెంచుల ఆరాధ్య దైవమైన సలేశ్వరుడిని ఇక్కడ వారు మల్లయ్య దేవునిగా పిలుచుకుంటారు. స్వామివారికి నిత్య పూజాది కార్యక్రమాలు కూడా చెంచులే నిర్వహిస్తారు. కేవలం ఉత్సవాల సమయంలోనే అడవిలోకి వెళ్లేందుకు అనుమతి ఉండటంతో ప్రకృతి అందాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. -
శివోహం
విద్యలన్నింటిలోనూ వేదం గొప్పది. వేదాలన్నింటిలోనూ సంహితకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం గొప్పది. అందులోనూ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం గొప్పది. పంచాక్షరిని పలుకలేకున్నా, అందులో ‘శివ’ అనే రెండక్షరాలు చాలా గొప్పవి అని శాస్త్ర వచనం. శివుడినే శంకరుడని కూడా అంటారు. శంకరోతి ఇతి శంకరః అని వ్యుత్పత్తి. అంటే శమనం లేదా శాంతిని కలిగించేవాడు అని అర్థం. ‘శివ శివ శివ యనరాదా... భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నాడు గాని, అచంచల భక్తితో శివనామాన్ని స్మరిస్తే చాలు, భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైనది. ఉపవాస దీక్షలతో, జాగరణలతో రోజంతా శివనామ స్మరణలో, అభిషేక, అర్చనాది శివారాధన కార్యక్రమాలలో నిమగ్నమై పునీతమవుతారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు తొలుత హాలాహలం ఉద్భవించింది. దాని ధాటికి ముల్లోకాలూ దగ్ధమై భస్మీపటలం కాగలవని భయపడిన దేవదానవులు తమను కాపాడాలంటూ శివుడికి మొర పెట్టుకోవడంతో, శివుడు హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధిస్తాడు. హాలాహలం వేడిమికి శివుడి కంఠమంతా కమిలిపోయి, నీలంగా మారుతుంది. ఈ కారణంగానే శివుడు నీలకంఠుడిగా, గరళకంఠుడిగా పేరుగాంచాడు. ఇది జరిగిన రోజు మాఘ బహుళ చతుర్దశి. లోకాలను కాపాడిన శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు జనులందరూ జాగరణ చేస్తారు. అప్పటి నుంచి మహాశివరాత్రి రోజున శివభక్తులు జాగరణ చేయడం ఆచారంగా మారిందని ప్రతీతి. రాశులు... జ్యోతిర్లింగాలు శైవక్షేత్రాలన్నింటిలోనూ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవి. ఏడాది పొడవునా భక్తుల సందడితో కనిపించే ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినాన మరింతగా భక్తులతో కిటకిటలాడుతాయి. మహాశివరాత్రి రోజున జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఏదో ఒక క్షేత్రాన్ని దర్శించుకోవడంపై చాలామంది ఆసక్తి చూపుతారు. మన దేశంలో ఉన్న ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకు రాశిచక్రంలోని ద్వాదశ రాశులకు సంబంధం ఉన్న సంగతి చాలామందికి తెలియదు. జ్యోతిర్లంగాలను సందర్శించుకోవాలనుకునే వారు తమ జన్మరాశులకు చెందిన జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం శుభదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగం ఏ రాశికి చెందుతుందంటే... రామేశ్వరం – మేషం మేషరాశికి చెందిన వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం. త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం ఇది. తమిళనాడులో సముద్ర తీరాన వెలసిన రామేశ్వరం తీరం నుంచే వానరులు లంక వరకు సేతువును నిర్మించారు. దీని మీదుగానే వానరసేనతో రామలక్ష్మణులు లంకకు చేరుకున్నారు. రావణుడి రాక్షస సేనతో యుద్ధం చేసిన శ్రీరాముడు చివరకు రావణుడిని సంహరించాడన్న రామాయణ గాథ అందరికీ తెలిసిందే. బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించడం వల్ల చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి శ్రీరాముడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. సోమనాథ్ – వృషభం వృషభ రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం సోమనాథ్. ద్వాపరయుగంలో దీనిని శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించాడు. గుజరాత్లో సముద్ర తీరాన వెలసిన క్షేత్రం ఇది. మహమ్మద్ ఘజనీ దాడిలో విధ్వంసానికి గురైన సోమనాథ్ ఆలయాన్ని స్వాతంత్య్రానంతర కాలంలో చాళుక్య శిల్ప శైలిలో పునర్నిర్మించారు. దక్షుడి శాపానికి గురైన చంద్రుడు ఇక్కడి జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం వల్ల తిరిగి తేజస్సును పొందగలిగాడని, అందువల్ల దీనికి చంద్రుడి పేరిట సోమనాథ క్షేత్రమనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. నాగేశ్వరం – మిథునం మిథున రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం. ఇది గుజరాత్లో సముద్రతీరాన ద్వారకలోని దారుకావనంలో ఉంది. ఒకప్పుడు దారుకావన ప్రాంతాన్ని దారుకుడనే రాక్షసుడు పాలించేవాడు. జనాలను విపరీతంగా పీడించేవాడు. తనకు నచ్చని వారిని నిష్కారణంగా చెరసాలలో బంధించేవాడు. ఒకసారి సుప్రియుడనే శివభక్తుడిని కూడా అలాగే చెరసాలలో బంధించాడు. సుప్రియుడు ప్రార్థించడంతో శివుడు దారుకుడిని సంహరించి అక్కడ స్వయంభువుగా జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని శివపురాణం చెబుతోంది. ఓంకారేశ్వరం – కర్కాటకం కర్కాటర రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం ఓంకారేశ్వర లింగం. ఇది మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో వింధ్య పర్వత శ్రేణుల్లో వెలసిన క్షేత్రం. ఓంకారేశ్వర లింగం ఆవిర్భావానికి సంబంధించి పురాణాల్లో పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత మహారాజు చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంలో ఆవిర్భవించినట్లు ఒక గాథ ఉంది. వైద్యనాథ్ – సింహం సింహ రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసినది వైద్యనాథ లింగం. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ జిల్లాలో ఉన్న వైద్యనాథ క్షేత్రాన్ని స్థానికంగా బైద్యనాథ్‌గా పిలుస్తారు. వైద్యనాథ లింగం సాక్షాత్తు పరమశివుని ఆత్మలింగమేనని ప్రతీతి. లంకకు రక్షణగా సాక్షాత్తు శివుడినే ప్రతిష్ఠించాలనే సంకల్పంతో రావణుడు కైలాసానికి వెళ్లి, శివుడిని ఆత్మలింగం కోరాడు. అతడికి ఆత్మలింగం అనుగ్రహించిన శివుడు, మార్గమధ్యంలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచరాదని షరతు విధిస్తాడు. అలా ఉంచితే అది అక్కడే శాశ్వతంగా ఉండిపోతుందని హెచ్చరిస్తాడు. రావణుడు ఆత్మలింగంతో లంకకు చేరుకుంటే ముల్లోకాలకు మరింత ప్రమాదకారిగా పరిణమించగలడని తలచిన దేవతలు అతడికి ఆటంకం కలిగించేందుకు వరుణుడి సాయం కోరుతారు. వరుణుడి ప్రభావంతో రావణుడికి మార్గమధ్యంలో లఘుశంక తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో బ్రాహ్మణ రూపంలో తారసపడిన వినాయకుడి చేతికి ఆత్మలింగం ఇచ్చి, దానిని జాగ్రత్తగా పట్టుకుని, తాను రాగానే తన చేతికి ఇవ్వాలని కోరాడు. అయితే, నిమిషంలోగా రాకుంటే శివలింగాన్ని వదిలేసి తన దారిన తాను పోతానని చెబుతాడు. రావణుడు నిమిషంలోగా తిరిగి రాలేకపోవడంతో వినాయకుడు దాన్ని అక్కడే వదిలేసి మాయమవడంతో ఆత్మలింగం అక్కడే ఉండిపోయిందని శివపురాణం చెబుతోంది. మల్లికార్జునుడు – కన్య కన్య రాశి వారు దర్శించుకోవలసినది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున జ్యోతిర్లింగం. శివపార్వతులు తన కంటే ముందుగా వినాయకుడిని వివాహం చేయడంతో కార్తికేయుడు అలిగి కైలాసాన్ని వీడి, క్రౌంచపర్వతం మీదకు చేరుకుని అక్కడ జపతపాలు ప్రారంభిస్తాడు. కార్తికేయుడిని బుజ్జగించి ఎలాగైనా అతడిని తిరిగి కైలాసానికి తీసుకురావాలనే సంకల్పంతో శివపార్వతులిద్దరూ అక్కడకు బయలుదేరుతారు. తన తల్లిదండ్రులు అక్కడకు వస్తున్నట్లు దేవతల ద్వారా తెలుసుకున్న కార్తికేయుడు క్రౌంచపర్వతాన్ని వీడి వెళ్లడానికి సిద్ధపడతాడు. అయితే, దేవతలు నచ్చజెప్పడంతో అతడు అక్కడే ఉంటాడు. ఆ ప్రాంతానికి చేరుకున్న శివుడు జ్యోతిర్లింగంగా శ్రీశైలంపై ఆవిర్భవించి,. మల్లెపూలతో అర్చనలు అందుకోవడం వల్ల మల్లికార్జునుడిగా ప్రసిద్ధి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహాకాళేశ్వరం – తుల తుల రాశి వారు దర్శించుకోవలసినది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడి జ్యోతిర్లింగం ఆవిర్భావానికి కారణాలుగా పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. శివుడు ఇక్కడ స్వయంభువుగా జ్యోతిర్లింగ రూపంలో వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. తన భక్తుడైన రాజు చంద్రసేనుడిపై శత్రురాజులు దండెత్తినప్పుడు అతడికి రక్షణగా శివుడు మహాకాళుడిగా వచ్చి, శత్రువులను సంహరించాడు. ఆ తర్వాత ఇక్కడ జ్యోతిర్లింగంగా ఉద్భవించినట్లు పురాణాల కథనం. ఘృష్ణేశ్వరం – వృశ్చికం వృశ్చిక రాశి వారు దర్శించుకోవలసినది ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. దీనినే ధూషణేశ్వర లింగం అని, కుశేశ్వర లింగం అని కూడా అంటారు. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ఎల్లోరా గుహలకు అత్యంత చేరువలో ఉంది. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావంపై అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు పార్వతీదేవి తన పాపిట తిలకం దిద్దుకోవడం కోసం అరచేతిలో కుంకుమపువ్వ, పసుపు నీటితో కలుపుతూ ఉండగా ఆశ్చర్యకరంగా అది తేజోవంతమైన శివలింగాకృతి ధరించింది. నేలపై ఉంచగానే అది నేలలో కూరుకుపోయింది. శివుడు ఈ విషయం చెప్పగా, తన తేజోరూపమైన జ్యోతిర్లింగం పాతాళంలో కూరుకుపోయిందని చెప్పి, దానిని తన త్రిశూలంతో పైకి తీసుకొస్తాడు. శివుడు త్రిశూలంతో తవ్విన చోట ఉద్భవించిన గంగ ఇక్కడ ఎలగంగానదిగా ప్రవహిస్తోంది. విశ్వేశ్వరం – ధనుస్సు ధనుస్సు రాశి వారు దర్శించుకోవలసినది విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ భక్తులు అత్యధికంగా దర్శించుకునేది కాశీలోని పవిత్ర గంగా తీరంలో ఉన్న విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్నే. కాశీలోని విశ్వనాథ ఆలయం అత్యంత పురాతనమైనది. పలు పురాణాలలో కాశీ క్షేత్ర ప్రాశస్త్యం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇది మోక్ష క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. కాశీలో మరణిస్తే మరుజన్మ ఉండకుండా నేరుగా మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రాణాలు వదిలిన వారిని యమభటులు ఏమీ చేయరని వారు విశ్వసిస్తారు. నిర్గుణ నిరాకారుడిగా ఉన్న శివుడు సుగుణుడిగా జ్యోతిర్లింగ స్వరూపంతో ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని పురాణాలు చెబుతాయి. సాక్షాత్లు శివుడే కాశీ నగరాన్ని సృష్టించాడని ప్రతీతి. భీమశంకరం – మకరం మకర రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం భీమశంకర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని పూణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల వద్ద భీమా నది తీరాన వెలసింది భీమశంకర క్షేత్రం. త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు దేవతల కోరిక మేరకు సహ్యాద్రికి చేరుకుని, ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో స్వయంభువుగా వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. కేదారేశ్వరం – కుంభం కుంభ రాశి వారు దర్శించుకోవలసినది కేదారే«శ్వర జ్యోతిర్లింగం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల వద్ద కైలాస పర్వతానికి సమీపంలో ఉంది కేదార్నాథ్ క్షేత్రం. నాలుగు పవిత్ర ధామాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఇది. కృతయుగంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కేదార మహారాజు పేరిట ఈ క్షేత్రానికి కేదార్నాథ్ అనే పేరు వచ్చిందని చెబుతారు. పురాణాల కథనం ప్రకారం... కురుక్షేత్ర సంగ్రామంలో సోదరులను వధించిన పాపం నుంచి విముక్తి పొందడానికి పాండవులు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేశారు. పాండవులు చేసిన పాపం తక్కువేమీ కాకపోవడంతో శివుడు వారికి అంత తేలికగా పాప విమోచనం కల్పించరాదని భావించాడు. వారికి పరీక్ష పెట్టడం కోసం వృషభ రూపంలో వారి ఎదుట రంకెలు వేస్తూ నిలిచాడు. భీముడు వృషభాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అతడు మూపురాన్ని మాత్రమే పట్టుకోగలిగాడు. ఆ మూపురమే ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలసిందని పురాణాలు చెబుతాయి. త్రయంబకేశ్వరం – మీనం మీన రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసినది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. త్య్రయంబకేశ్వర క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉద్భవించిన ప్రదేశానికి చేరువలో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూడు ముఖాలు ఈ జ్యోతిర్లింగంపై ఉండటం ఇక్కడి విశేషం. పాండవుల నాటిదిగా చెప్పుకొనే రత్నఖచిత కిరీటం కూడా ఈ క్షేత్రంలోని ప్రత్యేకత. ప్రతి సోమవారం ప్రదోష వేళ... అంటే సాయంత్రం సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో ఈ కిరీటాన్ని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. పురాణాల కథనం ప్రకారం... గౌతమ మహర్షి చేతిలో మాయ గోవు మరణిస్తుంది. గోహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి గౌతమ మహర్షి శివుడి కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేస్తాడు. గౌతముడి తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో స్వయంభువుగా అవతరించాడు. గౌతముడి కోరికపై గంగను గో కళేబరం మీదుగా ప్రవహింపజేసి, అతడికి పాప విమోచనుడిని చేశాడు. గో కళేబరం మీదుగా గంగ ప్రవహించడంతో ఇక్కడ ఆవిర్భవించిన నదికి గోదావరి అనే పేరువచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మరాఠా రాజు బాలాజీ బాజీరావు నిర్మించాడు. త్రయంబకేశ్వర క్షేత్ర పరిసరాల్లో నీలాంబిక, మాతాంబిక మందిరాలు, దత్తాత్రేయ ఆలయం వంటి సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. మహాశివరాత్రిని ఎలా పాటించాలంటే... మహాశివరాత్రి రోజున వేకువజామునే నిద్రలేచి, సూర్యోదయానికి ముందే స్నానాదికాలు ముగించుకోవాలి. ఇంట్లో నిత్యపూజ తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. ఉపవాస దీక్షలు పాటించేవారు పండ్లు, పాలు మాత్రమే స్వీకరించాలి. లౌకిక విషయాలను ఎక్కువగా చర్చించకుండా వీలైనంతగా భగవద్ధ్యానంలో గడపాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. వీలుంటే మహాశివునికి అభిషేకం జరిపించడం మంచిది. మరునాటి సాయంత్రం ఆకాశంలో చుక్క కనిపించేంత వరకు జాగరణ ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఉపవాస, జాగరణ నియమాలను పాటించకపోయినా, సాత్విక ఆహారం తీసుకుని, వీలైనంతగా భగవద్ధ్యానంలో గడపాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మహా శివభక్తుడు కన్నప్ప శివ భక్తులందరిలోనూ మహాభక్తుడైన కన్నప్ప ఉదంతమే వేరు. అతడి అసలు పేరు తిన్నడు. బోయవాడు. రోజూ అడవిలో వేటాడేవాడు. ఒకసారి అతడికి ఎవరూ లేని గుడిలో శివలింగం కనిపిస్తుంది. శివుడిని తనతో ఇంటికి రమ్మని వేడుకుంటాడు. శివలింగం నుంచి ఎలాంటి బదులు రాకపోవడంతో తాను అక్కడే ఉండిపోయి, రోజూ ఉదయం శివలింగాన్ని, ఆలయాన్ని శుభ్రపరచేవాడు. తర్వాత అడవిలోకి వెళ్లి రెండు చేతుల్లోనూ పట్టినన్ని బిల్వపత్రాలు, నోట పట్టినన్ని నీళ్లు తీసుకొచ్చేవాడు. శివలింగాన్ని నోట ఉన్న నీటితో అభిషేకించి, బిల్వపత్రాలతో అలంకరించేవాడు. వేటాడిన జంతువుల మాంసాన్ని నివేదించేవాడు. ఒకసారి శివలింగం కన్నుల నుంచి రక్తం కారడం గమనించి కలత చెందుతాడు. ముందుగా ఒక కంటిని బాణంతో పెకలించి శివుడికి అర్పిస్తాడు. శివలింగం రెండో కంటి నుంచి రక్తం కారుతుండటంతో గుర్తుగా దానిపై కాలి బొటనవేలిని ఉంచి, రెండో కంటిని పెకలించేందుకు సిద్ధపడగా, శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడికి కంటిని సమర్పించడం వల్ల కన్నప్పగా ప్రసిద్ధి పొందుతాడు. – పన్యాల జగన్నాథదాసు