
భోపాల్: జైలులో ఉన్న ఓ వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. తనకు దేవుడు చెప్పాడంటూ మర్మాంగాన్ని కోసుకున్న విచిత్ర ఘటన గ్వాలియర్ జైలులో చోటు చేసుకుంది. విష్ణు సింగ్ రాజ్‌వత్ అనే వ్యక్తి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్నాడు. మంగళవారం నాడు అతను తీవ్ర రక్తస్రావంతో కనిపించాడు. దీనిపై అతడు జైలు అధికారులతో మాట్లాడుతూ.. రాత్రి తనకు కలలో శివుడు ప్రత్యక్షమై, తన పురుషాంగాన్ని త్యాగం చేయాల్సిందిగా కోరాడని, అందుకే ఈ పని చేశానని తెలిపాడు. చెంచాను పదునుగా మార్చి దానితోనే మర్మాంగాన్ని కత్తిరించి శివలింగం వద్ద ఉంచినట్లు పేర్కొన్నాడు. (మహిళల గుండు గీయించి, అర్ధనగ్నంగా ఊరేగిస్తూ)
దీనికి తాను ఏమాత్రం చింతించట్లేదన్నాడు. ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట్ మనోజ్ సాహు మాట్లాడుతూ.. "ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఖైదీ విష్ణు సింగ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాం. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాం. ప్రస్థుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది" అని తెలిపాడు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా అతను ఏడాదిన్నర క్రితం ఓ పోలీసును చంపిన కేసులో కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది. (పోలీసుల అదుపులో ‘బాయ్స్ లాకర్ రూం’ సభ్యుడు)
Comments
Please login to add a commentAdd a comment