
ఇండోర్: ఆదిదేవుడు శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండెల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బాబు జండెల్ శివుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ శుక్రవారం రాత్రి విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) లీగల్ సెల్ నేత, న్యాయవాది అనిల్ నాయుడు టుకోగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ హన్స్‌రాజ్ సింగ్ చెప్పారు. శివుడిపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే జండెల్‌పై ఇప్పటికే ఇండోర్‌లో కేసు నమోదైందన్నారు. అయితే, తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే జండెల్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియో మారి్ఫంగ్ చేసిందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment