objectionable remarks
-
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. రాహుల్‌పై పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్ గాం«దీని రాంచీలోని మెజిస్టీరియల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జార్ఖండ్ ప్రభుత్వానికి, బీజేపీ నేత నవీన్ ఝాకు నోటీసు జారీ చేసింది. రాహుల్ దాఖలు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కింది కోర్టులో రాహుల్‌పై విచారణ నిలిపివేయాలని తేల్చిచెప్పింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. -
శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేపై కేసు
ఇండోర్: ఆదిదేవుడు శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండెల్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బాబు జండెల్ శివుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ శుక్రవారం రాత్రి విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) లీగల్ సెల్ నేత, న్యాయవాది అనిల్ నాయుడు టుకోగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ హన్స్‌రాజ్ సింగ్ చెప్పారు. శివుడిపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే జండెల్పై ఇప్పటికే ఇండోర్‌లో కేసు నమోదైందన్నారు. అయితే, తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే జండెల్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియో మారి్ఫంగ్ చేసిందని చెబుతున్నారు. -
అస్సాం సీఎం శర్మకు ఈసీ నోటీసు
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారం సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో ఈనెల 18వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో హిమాంత శర్మ మాట్లాడుతూ..‘ఒక చోటికి ఒక అక్బర్ వచ్చాడంటే అతడు మరో 100 మంది అక్బర్లను పిలుస్తాడు. అందుకే సాధ్యమైనంత త్వరగా అక్బర్‌ను పంపించివేయాలి. అలా చేయలేకపోతే కౌశల్య మాత పుట్టిన ఈ నేల అపవిత్రమవుతుంది’ అంటూ రాష్ట్ర కేబినెట్లోని ఏకైక ముస్లిం మంత్రి మహ్మద్ అక్బర్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తమకు సమాధానమివ్వాలని ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
బిహార్‌లోనూ హిజాబ్ లొల్లి
ముజఫర్‌పూర్: హిజాబ్ తొలగించేందుకు నిరాకరించినందుకు టీచర్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ విద్యార్థిని ఆరోపించడం బిహార్‌లో దుమారం రేపింది. ముజఫర్‌పూర్‌లోని మహంత్ దర్శన్ దాస్ మహిళా కాలేజీలో ఆదివారం ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష పాసైన వారే ఇంటర్ ఫైనల్ పరీక్షకు అర్హులవుతారు. చెవులు కనిపించేలా హిజాబ్‌ను తొలగించాలని ఓ ఇన్విజిలేటర్‌గా వచ్చిన టీచర్ కోరగా పరీక్షకు హాజరైన ఓ విద్యార్థిని తిరస్కరించింది. దీంతో, టీచర్ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారంటూ ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారంపై పరీక్ష నిర్వాహకులు రెండు వర్గాల వారితో మాట్లాడి సర్ది చెప్పి పంపించారు. విద్యార్థులు కొందరు మొబైళ్లు, హెడ్ ఫోన్లతో పరీక్ష హాల్లోకి వస్తున్నారని, బ్లూటూత్‌ను ధరిస్తున్నారనే అనుమానంతోనే ఇన్విజిలేటర్ ఆమెను హిజాబ్‌ను చెవులు కనిపించేలా వెనక్కి తప్పించాలని అడిగారే తప్ప, తీసివేయాలని కాదని కాలేజీ ప్రిన్సిపాల్ కాను ప్రియ తెలిపారు. సదరు విద్యార్థిని చేసిన ఆరోపణలు అవాస్తవాలని తమ విచారణలో తేలిందని అన్నారు. -
నూపుర్ శర్మ కోసం పోలీసుల గాలింపు!
ఢిల్లీ: ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపర్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆమె జాడ తెలియరావడం లేదని ముంబై పోలీసులు చెప్తున్నారు. ముంబైతో పాటు ఢిల్లీ, కోల్‌కతా పోలీసులు సైతం ఆమె ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్ల తర్వాత ఢిల్లీ వాసి అయిన నూపుర్ శర్మకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమెకు గట్టి భద్రత కల్పించారు పోలీసులు. అయితే అదే సమయంలో.. పలు రాష్ట్రాల్లో ఆమెపైనా డజన్ల కొద్దీ కేసులు నమోదు అయ్యాయి. రజా అకాడమీ అనే ఇస్లాం సంస్థ కార్యదర్శి ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు సైతం నూపుర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను ప్రశ్నించేందుకు ముంబై పోలీసుల టీం ఒకటి.. ఢిల్లీకి వెళ్లింది. అయితే ఆమె ఎక్కడ ఉందనే సమాచారం మాత్రం ఇప్పటిదాకా వాళ్లకు తెలియలేదు. గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ముంబై పోలీసులు నూపుర్ కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ‘నూపుర్‌ను అరెస్ట్ చేయడానికి ముంబై పోలీసులకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. కోల్‌కతా పోలీసులు కూడా నూపుర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టీఎంసీ మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ సోహైల్ ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ఆమె స్టేట్మెంట్ను కోల్‌కతా పోలీసులు నమోదు చేయాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు సైతం ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈలోపే ఆమెకు బెదిరింపులు రావడంతో.. ఆమె కుటుంబానికి భద్రత కల్పించారు. అయితే ఆమె ఎక్కడ ఉందనే సమాచారం ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు సైతం తెలియదట!. ఓ టీవీ డిబేట్లో జ్ఞానవాపి మసీదు అంశంపై మాట్లాడుతున్న కమ్రంలో.. ముహమ్మద్ ప్రవక్త వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేశారామె. ఆ వ్యాఖ్యలను ముస్లిం సంఘాలతో పాటు 15 ఇస్లాం దేశాలు ఖండించాయి. గల్ఫ్ దేశాలు సైతం అక్కడున్న భారతీయ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసి.. వివరణ, క్షమాపణలు కోరాయి. అయితే వ్యాఖ్యల దుమారం మొదలైన వెంటనే నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఆమె వ్యాఖ్యలను సైతం ఖండించింది బీజేపీ. ఇక తన వ్యాఖ్యలపై భేషరతు క్షమాపణలు చెప్పిన నూపుర్ శర్మ.. పదే పదే మహాదేవుడ్ని(శివుడ్ని) అవమానించడం, అగౌరవపర్చడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు కూడా. చదవండి: భారత్‌ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త! -
వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత: మరిన్ని చిక్కుల్లో నూపుర్ శర్మ
న్యూఢిల్లీ: ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకీ ఆమెను మరిన్ని చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా సస్పెండెడ్ బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతోపాటు నవీన్ జిందాల్ జర్నలిస్ట్ సబా నఖ్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్‌పై కూడా ఎఫ్ఐఆర్ దాఖలైంది. మొత్తం ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. సోషల్ మీడియాలో మత విద్వేశాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించారని పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంబంధిత వార్త: గుజరాత్లో నూపుర్ శర్మ వ్యతిరేక పోస్టర్లు.. అరెస్ట్‌కు డిమాండ్ అసలేం జరిగిందంటే కాగా ఓ టీవీ డిబెట్లో పాల్గొన్న నూపుర్ మహమ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ బీజేపీ మీడియా ఇంచార్జీ నవీన్ కుమార్ జిందాల్ కూడా మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర ట్వీట్లు చేశారు. వీరిద్దరి వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనలు రేపాయి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 1500 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దిద్దుబాటు చర్యగా నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ వెల్లడించింది..అలాగే పార్టీ సస్పెండ్ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నూపుర్ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అయినా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహా జ్వాలలు చల్లారలేదు. దేశంలోనే కాకుండా అరబ్ దేశాల్లోనూ దుమారం రేపాయి. తమ మత విశ్వాసాలను కించపరిచితే ఊరుకునేది లేదని ఇస్లామిక్ దేశాలు మండిపడుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే భారత్ వస్తువులు, సినిమాలు నిషేధించాలంటూ పిలుపునిచ్చే స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు -
ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు
న్యూఢిల్లీ/దుబాయ్: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసింది అధికార బీజేపీకి చెందిన నేతలు కావడంతో పలు ముస్లిం దేశాలు వాటిని కేంద్ర ప్రభుత్వ వైఖరిగా పరిగణిస్తున్నాయి. 57 ముస్లిం దేశాల సమాఖ్య ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ (ఓఐసీ) ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే గాక భారత్‌లో ముస్లిం మైనారిటీల భద్రతపై జోక్యం చేసుకోవాలంటూ ఐరాసకు విజ్ఞప్తి చేసింది! ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన దేశాల జాబితాలో తాజాగా ఇండొనేసియా, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, అఫ్గానిస్తాన్ కూడా చేరాయి. దీనిపై తమ తీవ్ర అభ్యంతరాలను జకార్తాలోని భారత రాయబారికి తెలియపరిచినట్టు ఇండొనేసియా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. యూఏఈతో పాటు మక్కా గ్రాండ్ మాస్క్, మదీనా ప్రాఫెట్స్ మాస్క్ వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ కూడా ఇలాంటి ప్రకటనలే చేశాయి. సౌదీ విదేశాంగ శాఖ ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండిస్తూనే, సదరు నేతలపై బీజేపీ చర్యలను స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. ఖతార్, కువైట్ ఒక అడుగు ముందుకేసి భారత్ క్షమాపణకు కూడా డిమాండ్ చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈలతో కూడిన ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక యూనియన్ అయిన గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. జీసీసీ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ విద్వేష ప్రచారం భారత ఉత్పత్తులను బహిష్కరిస్తామని ఇస్లామిక్ దేశాల్లోని పలు ప్రముఖ సంస్థలు ప్రకటనలు చేస్తుండటం వివాదాన్ని మరింత జటిలంగా మార్చింది. తమ సూపర్ మార్కెట్లలో టీ పొడి తదితర భారత ఉత్పత్తుల విక్రయాలను ఆపేయాలని యోచిస్తున్నట్టు కువైట్‌లోని అల్–అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ వంటివి ఇప్పటికే ప్రకటించాయి. పలు ముస్లిం దేశాల్లో ఇప్పటికే భారత ఉత్పత్తుల బహిష్కరణ మొదలైంది! అరబ్ ప్రపంచమంతా వాటిని నిషేధించాలంటూ ట్విట్టర్ తదితర సోషల్ మాధ్యమాల్లో ట్రెండింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం హుటాహుటిన నష్ట నివారణ చర్యలకు దిగింది. అటు ఓఐసీ వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండిస్తూనే, అవి కొందరు వ్యక్తుల అనాలోచిత వ్యాఖ్యలే తప్ప భారత ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించేవి కానే కావని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీతో పాటు పలు ముస్లిం దేశాల్లోని భారత రాయబారులు స్థానికంగా కూడా ప్రకటనలు చేశారు. బలమైన ఆర్థిక బంధం అరబ్ ప్రపంచం నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలను శాంతింపజేసేందుకు భారత్ హుటాహుటిన రంగంలోకి దిగడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పశ్చిమాసియాలోని ఈ ముస్లిం దేశాలతో మనకున్న బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలు. సౌదీ, కువైట్, ఖతర్, ఒమన్ తదితర దేశాల్లో భారతీయులు చాలా ఎక్కువగా ఉంటారు. యూఏఈ జనాభాలోనైతే 30 శాతం దాకా భారతీయులే. మొత్తమ్మీద ఈ ముస్లిం దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల సంఖ్య ఏకంగా 87 లక్షలని అంచనా. వీరిలో కార్మికులే అత్యధికంగా ఉంటారు. తాజా వివాదం నేపథ్యంలో వారి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే మొత్తాలు (రెమిటెన్సులు) దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయి. 2021లో భారత్‌కు 87 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు అందాయి. అంటే రూ.6.76 లక్షల కోట్ల పై చిలుకే! దేశ జీడీపీలో ఇది ఏకంగా 3.1 శాతం! ఇంతటి కీలకమైన ఈ రెమిటెన్సుల్లో అమెరికా తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఒమన్ దేశాల నుంచే అత్యధికంగా వస్తున్నాయి. దాంతో రెమిటెన్సుల్లో భారత్ ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉంది. కీలక గల్ఫ్ దేశాలతో కూడిన గల్ఫ్ కో ఆపరేటివ్ కౌన్సిల్(జీసీసీ)తో 2020–21లో భారత్ 87 మిలియన్ డాలర్ల మేరకు వాణిజ్యం జరిపింది. మన వర్తక భాగస్వాముల్లో యూఈఏ మూడో, సౌదీ నాలుగో స్థానంలో ఉన్నాయి. యూఏఈతో ఇటీవలే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమూ కుదిరింది. చదవండి: గూగుల్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా కోర్టు గల్ఫ్ దేశాలతో బంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దును స్వాగతించిన తొలి దేశాల్లో యూఏఈ ఉంది. ఇరాక్, సౌదీ, యూఏఈ తదితర గల్ఫ్ దేశాల నుంచి మనం భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నాం. యుద్ధం వల్ల రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతున్నందున గల్ఫ్ దేశాలపై ఆధారపడటం మరింతగా పెరిగేలా కన్పిస్తోంది. మనతో వర్తకం ద్వారా సమకూరే ఆదాయం గల్ఫ్ దేశాలకూ కీలకమే. పైగా వాటి కార్మిక శక్తిలో భారతీయులు కీలకంగా ఉన్నారు. వీటికి తోడు చాలా గల్ఫ్ దేశాల ఆహార అవసరాలను భారతే తీరుస్తోంది. ఈ జాబితాలో బియ్యం, మాంసం, సుగంధద్రవ్యాలు, పళ్లు, కూరగాయలు, చక్కెర వంటివెన్నో ఉన్నాయి. కువైట్ ఏకంగా 90 శాతం ఆహార పదార్థాలను భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది! -
జయప్రదపై ఆజం దిగజారుడు వ్యాఖ్య
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరో దిగజారుడు వ్యాఖ్య వినిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ఆజం ఖాన్, తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో పదేళ్లపాటు రాంపూర్‌కు జయప్రద ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించగా, ఇటీవలే ఆమె బీజేపీలో చేరి ప్రస్తుతం ఆమె అదే స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచారు. దీనిపై ఆజం ఖాన్ మాట్లాడుతూ ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అని ఖాన్ ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్‌తో జయ ప్రద సంబంధాలపై చర్చ లేవనెత్తేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ వ్యాఖ్యలు అపకీర్తికరమైనవనీ, ఆయనకు అతి త్వరలోనే నోటీసులు పంపనున్నామని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కూడా తాము కోరతామన్నారు. -
సాక్షిమాలిక్ పై వ్యాఖ్యలు చేసినందుకు..
మీరట్ః ఒలింపిక్స్ లో దేశానికి కాంస్య పతకం తెచ్చి పెట్టిన రెజ్లర్ సాక్షి మాలిక్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. నదీమ్ నంబార్డర్ అనే వ్యక్తి ఆమెకు, ఆమె మతానికి వ్యతిరేకంగా వ్యాఖలు చేసినందుకు గాను అతడిపై ఐటి చట్టంకింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక సోషల్ మీడియా గ్రూప్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి సైబర్ సెల్ దర్యాప్తు నిర్వహిస్తోంది. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడని అతడ్ని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. నంబార్డర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ ద్వారా అతడు.. సమాజ్ వాదీ కార్యకర్తగా తెలుస్తుండగా.. నిందితుడికి పార్టీకీ ఎలాంటి సంబంధాలు లేవని జిల్లా యూనిట్ ఛీఫ్ జైవీర్ సింగ్ తెలిపారు.