న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. రాహుల్‌పై పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్ గాం«దీని రాంచీలోని మెజిస్టీరియల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది.
దీంతో రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జార్ఖండ్ ప్రభుత్వానికి, బీజేపీ నేత నవీన్ ఝాకు నోటీసు జారీ చేసింది. రాహుల్ దాఖలు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కింది కోర్టులో రాహుల్‌పై విచారణ నిలిపివేయాలని తేల్చిచెప్పింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment