సాక్షిమాలిక్ పై వ్యాఖ్యలు చేసినందుకు.. | Man booked for making objectionable remarks against Sakshi Malik | Sakshi
Sakshi News home page

సాక్షిమాలిక్ పై వ్యాఖ్యలు చేసినందుకు..

Published Tue, Aug 23 2016 2:55 PM | Last Updated on Thu, Mar 28 2019 6:27 PM

సాక్షిమాలిక్ పై వ్యాఖ్యలు చేసినందుకు.. - Sakshi

సాక్షిమాలిక్ పై వ్యాఖ్యలు చేసినందుకు..

మీరట్ః ఒలింపిక్స్ లో దేశానికి కాంస్య పతకం తెచ్చి పెట్టిన రెజ్లర్ సాక్షి మాలిక్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. నదీమ్ నంబార్డర్ అనే వ్యక్తి ఆమెకు, ఆమె మతానికి వ్యతిరేకంగా వ్యాఖలు చేసినందుకు గాను అతడిపై ఐటి చట్టంకింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక సోషల్ మీడియా గ్రూప్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి సైబర్ సెల్ దర్యాప్తు నిర్వహిస్తోంది. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడని అతడ్ని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. నంబార్డర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ ద్వారా అతడు.. సమాజ్ వాదీ కార్యకర్తగా తెలుస్తుండగా.. నిందితుడికి పార్టీకీ ఎలాంటి సంబంధాలు లేవని జిల్లా యూనిట్ ఛీఫ్ జైవీర్ సింగ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement