inappropriate remarks
-
శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేపై కేసు
ఇండోర్: ఆదిదేవుడు శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండెల్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బాబు జండెల్ శివుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ శుక్రవారం రాత్రి విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) లీగల్ సెల్ నేత, న్యాయవాది అనిల్ నాయుడు టుకోగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ హన్స్‌రాజ్ సింగ్ చెప్పారు. శివుడిపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే జండెల్పై ఇప్పటికే ఇండోర్‌లో కేసు నమోదైందన్నారు. అయితే, తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే జండెల్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియో మారి్ఫంగ్ చేసిందని చెబుతున్నారు. -
Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హైకోర్టు మాజీ జడ్జి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీచేసింది. ‘మమతా బెనర్జీ మీరు ఎంతకు అమ్ముడుపోయారు? మీ రేటు 10 లక్షలు, ఎందుకంటే మీరు కేయా సేథ్తో మేకప్ చేయించుకుంటున్నారు. మమత అసలు మహిళేనా? అని నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటా’ అని అభిజిత్ ఇటీవల ప్రచారసభలో వ్యాఖ్యానించారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రియాన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. న్యాయవ్యవస్థలో ఉన్నత పదవిని నిర్వహించిన వ్యక్తి మహిళల గౌరవానికి భంగం కలించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దీనిపై స్పందించిన ఈసీ ఈనెల 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు నోటీసులు జారీచేసింది. -
మోదీ ఎఫెక్ట్.. మాల్దీవులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!
#Maldives.. మాలె/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం కూడా వాటిపై తీవ్ర అభ్యంతరం వెలిబుచి్చంది. మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా వేలాది మంది భారత పర్యాటకులు మాల్దీవులకు ప్లాన్ చేసుకున్న హాలిడే ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. ఆ దేశ పర్యాటకానికి మన టూరిస్టులే ఆయువుపట్టు. పైగా భారత్‌తో వ్యూహత్మక బంధం మాల్దీవులకు అత్యంత కీలకం. దాంతో ఈ వివాదంపై ఆ దేశం హుటాహుటిన స్పందించింది. భారత ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసినట్లు ఆదివారం ప్రకటించింది. వారి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది. ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలే తప్ప, విద్వేషాన్ని, ప్రతికూల ప్రభావాన్ని కలిగించేలా ఉండొద్దు. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సంబంధాలను దెబ్బతీయొద్దు’’ అని పేర్కొంది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. సస్పెండైన మంత్రులు మరియం షియునా, అబ్దుల్లా మజూం మజీద్, మల్షా షరీఫ్ అని తెలుస్తోంది. అసలేమైంది...? ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలు»ొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. మంత్రుల వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ‘‘భారత్ మనకు కీలక మిత్రదేశం. మాల్దీవుల భద్రత, అభివృద్ధిలో చాలా కీలకం. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాష వాడటం తగదు’’ అన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు హితవు పలికారు. ఇంతగా నిరసనలు వ్యక్తమవుతున్నా మరియం మాత్రం ఆన్లైన్ వేదికలపై అక్కసు వెళ్లగక్కడం ఆపలేదు. దాతో పలువురు భారత నెటిజన్లు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ పిలుపునిస్తున్నారు! సెలబ్రిటీల ఖండన మాల్దీవుల మంత్రుల నోటి దురుసును క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. ‘‘మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపే భారత్‌పై అలా మాట్లాడటం దారుణం. పొరుగువారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం కానీ ఇలాంటి ద్వేషాన్ని మనమెందుకు సహించాలి? నేనెన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా. ప్రతిసారీ ఆ దేశాన్ని ప్రశంసించా. కానీ మన ఆత్మగౌరవమే ఫస్ట్. ఇకపై మన దీవుల్లో పర్యటిస్తూ మన పర్యాటకానికి దన్నుగా నిలుద్దాం’’ అని పిలుపునిచ్చారు. లక్షద్వీప్‌లో అందమైన, పరిశుభ్రమైన బీచుల్లో ప్రధాని మోదీని చూడటం ఎంతో బాగుంది. మన దేశంలోనే ఇంత అద్భుతమైన బీచ్లుండటం గర్వకారణం’’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ‘‘అతిథి దేవోభవ సందేశంతో భారత్ ఇచ్చే అద్భుతమైన ఆతిథ్యం, విస్తారమైన మన సముద్ర తీరాలను చూడాలే తప్ప వరి్ణంచలేం. ఇందుకోసం లక్షద్వీప్‌కు వెళ్లాల్సిందే’’ అంటూ జాన్ అబ్రహం బీచ్ ఫొటోలను షేర్ చేశారు. సుందరమైన లక్షద్వీప్ బీచ్‌ల అందాలను చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు నటి శ్రద్ధా కపూర్ తెలిపారు. సచిన్ కూడా ఇటీవలి లక్షద్వీప్ పర్యటన సందర్భంగా అక్కడ తాను క్రికెట్ ఆడిన వీడియో, బీచ్ ఫొటోలను షేర్ చేశారు. -
దేశాన్ని విడదీసే కుట్రలు సాగనివ్వం
న్యూఢిల్లీ: గోమూత్ర రాష్ట్రాలు అంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బుధవారం లోక్‌సభలో తీవ్ర అలజడి సృష్టించాయి. అధికార బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు సభకు పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సెంథిల్ కుమార్ అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు ఆమోదిస్తున్నారా? అని నిలదీశారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశంగా విడదీసే కుట్రలను సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. సెంథిల్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని మేఘ్వాల్ డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించారని, దేశం పట్ల వారి తీర్పును వెలువరించారని అన్నారు. టీఆర్ బాలు స్పందిస్తూ.. సెంథిల్ కుమార్ అలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. సెంథిల్‌ను తమ ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారని తెలిపారు. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు. సభలో సెంథిల్ కుమార్ క్షమాపణ తను వ్యాఖ్యల పట్ల డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బుధవారం లోక్‌సభలో క్షమాపణ కోరారు. ప్రజల మనోభావాలను గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అనుకోకుండానే ఈ మాట ఉపయోగించానని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని సెంథిల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆయన మంగళవారం క్షమాపణ కోరుతూ ‘ఎక్స్’లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతిని కించపర్చే కుట్ర ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ భారతీయ సంస్కృతిని, గుర్తింపునకు కించపర్చేందుకు కుట్ర పన్నిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేíÙంచకుండా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుయుక్తులు సాగిస్తోందని ధ్వజమెత్తారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాతే ఉత్తర–దక్షిణ భారతదేశం అనే విభజనను తెరపైకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. -
బబిత ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
షోలాపూర్ : మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌గాంధీపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందంటూ క్రీడాకారిణి బబితా పోగాట్‌కు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. షోలాపూర్‌లో జరిగిన ఈ ఆందోళనలో బబితా పోగాట్ దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు ఆమె పోస్టర్‌ను చెప్పులతో కొట్టి తమ నిరసనలు తెలిపారు. షోలాపూర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. దివంగత రాజీవ్‌గాంధీ క్రీడాకారుల కోసం, యువత కోసం చేసిన సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయ లబ్దికోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాజీవ్‌గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బబితా పొగాట్ వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. (పవార్, దేశ్‌ముఖ్‌లకు బెదిరింపు కాల్స్) -
బొక్కలిరిసి కుప్పపెడుత..!
మంత్రి ఈటల సమక్షంలో విపక్ష నేతలపై ఎమ్మెల్యే బొడిగె శోభ అనుచిత వ్యాఖ్యలు చొప్పదండి : ‘బెదిరిస్తే పోయెటోళ్లం కాదు.. ప్లకార్డులు పట్టుకొని వస్తే.. మేం గంత సోయి లేనోళ్లం కాదు.. మేమెంత వర్కు జేత్తున్నమో గీ ప్రజలకు తెలువదా? ఇం కొక్కసారి మేం జేసే కార్యక్రమానికి వస్తే మంచిగుండదు.. మా పోలీసోల్లైతే ఏం సేత్తలేరు.. ఎందుకంటె ఫ్రెండ్లీ గవర్నమెంటు అన్నం కాబట్టి మా సీఐగారు, మా డీఎస్పీగారు, మా ఎస్సైలు అంతా నిలబడి సూత్తాండ్రు. బొక్కలిరిసి కుప్ప పెడుత నేనే.. ఇగ ఊర్కునే సమస్యేలేదు.’ అంటూ కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ విపక్షాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం మిషన్ కాకతీయ రెండోదశ కింద చొప్పదండిలోని కుడిచెరువు పునురద్ధరణ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలోనే ఆమె ఇలా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కుడి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయూలంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులతోపాటు చొప్పదండి గ్రామస్తులు ప్లకార్డులతో సభావేదిక వద్దకు వచ్చారు. మంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రం అందించి కుడిచెరువు పరిస్థితి వివరించేందు కు యత్నించారు. ఇంతలోనే ఎమ్మెల్యే శోభ జోక్యం చేసుకొని పిటిషన్ మాత్రమే ఇవ్వాలని, ఏమీ మాట్లాడవద్దని, వెంటనే వేదిక దిగాలని గద్దించారు. అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు వారిపై దౌర్జన్యానికి దిగారు.