![Protest Against Babita For Making Offensive Remarks On Rajiv Gandhi - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/8/Babita-Phogat.jpg.webp?itok=Hn84C4YW)
షోలాపూర్ : మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌గాంధీపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందంటూ క్రీడాకారిణి బబితా పోగాట్‌కు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. షోలాపూర్‌లో జరిగిన ఈ ఆందోళనలో బబితా పోగాట్ దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు ఆమె పోస్టర్‌ను చెప్పులతో కొట్టి తమ నిరసనలు తెలిపారు. షోలాపూర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. దివంగత రాజీవ్‌గాంధీ క్రీడాకారుల కోసం, యువత కోసం చేసిన సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయ లబ్దికోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాజీవ్‌గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బబితా పొగాట్ వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. (పవార్, దేశ్‌ముఖ్‌లకు బెదిరింపు కాల్స్)
Comments
Please login to add a commentAdd a comment