Gwalior Jail
-
దీపావళి రోజున జరుపుకునే బందీఛోడ్ ఉత్సవం.. మీకు తెలుసా...
చంఢీఘడ్: దీపావళి రోజున సిక్కు మతస్తులు బందీ ఛోడ్ దివస్‌ను జరుపుకుంటారు. వీరు ఈ ఉత్సవాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున సిక్కుల ఆరవ గురువు.. హరగోవింగ్ సాహెబ్‌ను మొఘల్ నవాబు జహంగీర్ గ్వాలియర్ జైలు నుంచి విముక్తి కల్పించాడు. ఈ రోజున వేలాదిగా సిక్కులు స్వర్ణదేవాలయం చేరుకుని.. దీపాలు వెలిగిస్తారు. మొఘల్ నవాబు జహంగీర్.. హరగోవింగ్ సాహెబ్‌ను గ్వాలియర్ జైలులో నెలల తరబడి.. బందీగా ఉంచుకున్నాడు. దీంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. ఈ క్రమంలో జహంగీర్ ఆస్థానంలోని మంత్రులు, ముస్లిం పెద్దలు జహంగీర్‌ను విడిచిపెట్టాలని రాజుకి సలహా ఇస్తారు. ఆ తర్వాత.. జహంగీర్ సిక్కుల గురువు హరగోవింద్ సాహెబ్‌ను దీపావళి రోజు విముక్తి కల్గిస్తాడు. హరగోవింద్ తనతోపాటు.. మరో 52 మంది హిందు రాజులను విముక్తిని కల్పించాలని జహంగీర్‌ను కోరారు. దీంతో 52 మంది రాజులు విముక్తి చేయబడ్డారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది దీపావళితోపాటు.. సిక్కులు బందీఛోడ్ ఉత్సవాన్ని జరుపుకుంటారు. #WATCH On the occasion of Bandi Chhor Diwas and Diwali, devotees offer prayers at the Golden Temple in Amritsar pic.twitter.com/f8ldXJuJJy — ANI (@ANI) November 4, 2021 చదవండి: టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి! -
కలలో దేవుడు: మర్మాంగాన్ని కోసుకున్న ఖైదీ
భోపాల్: జైలులో ఉన్న ఓ వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. తనకు దేవుడు చెప్పాడంటూ మర్మాంగాన్ని కోసుకున్న విచిత్ర ఘటన గ్వాలియర్ జైలులో చోటు చేసుకుంది. విష్ణు సింగ్ రాజ్వత్ అనే వ్యక్తి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్నాడు. మంగళవారం నాడు అతను తీవ్ర రక్తస్రావంతో కనిపించాడు. దీనిపై అతడు జైలు అధికారులతో మాట్లాడుతూ.. రాత్రి తనకు కలలో శివుడు ప్రత్యక్షమై, తన పురుషాంగాన్ని త్యాగం చేయాల్సిందిగా కోరాడని, అందుకే ఈ పని చేశానని తెలిపాడు. చెంచాను పదునుగా మార్చి దానితోనే మర్మాంగాన్ని కత్తిరించి శివలింగం వద్ద ఉంచినట్లు పేర్కొన్నాడు. (మహిళల గుండు గీయించి, అర్ధనగ్నంగా ఊరేగిస్తూ) దీనికి తాను ఏమాత్రం చింతించట్లేదన్నాడు. ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట్ మనోజ్ సాహు మాట్లాడుతూ.. "ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఖైదీ విష్ణు సింగ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాం. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాం. ప్రస్థుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది" అని తెలిపాడు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా అతను ఏడాదిన్నర క్రితం ఓ పోలీసును చంపిన కేసులో కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది. (పోలీసుల అదుపులో ‘బాయ్స్ లాకర్ రూం’ సభ్యుడు) -
బెయిల్ ఇప్పించండి.. లేదా చనిపోనివ్వండి!
ప్రణబ్‌కు వ్యాపమ్ నిందితుల లేఖ భోపాల్: వ్యాపమ్ స్కాంలో అరెస్టయి గ్వాలియర్ జైలులో ఉన్న నిందితుల్లో 70 మంది వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు.. తమను బెయిలుపై విడుదల చేయాలని.. లేదంటే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. అక్రమ పద్ధతుల్లో వ్యాపమ్ ప్రి-మెడికల్ పరీక్షను రాసి వైద్య సీట్లు పొందారన్న ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేశారు. ‘విచారణ ఖైదీలుగా సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్నాం. తీవ్ర మానసిక, సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. ఇది మాలో ఆత్మహత్య ఆలోచనలను ప్రేరేపిస్తోంది. మాతో పాటు ఇవే సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులు బెయిలు పొందితే.. జూనియర్ వైద్యులమంతా జైలులోనే మగ్గిపోతున్నాం’ అని ఆవేదన వ్యక్తంచేశారు. తమ వైద్య విద్యాభ్యాసానికి సుదీర్ఘంగా అవరోధం కలగకుండా ఉండేలా చూసేందుకు తమకు బెయిల్ ఇప్పించాలని కోరారు. -
ఆత్మహత్యలకోసం మరో 70 మంది లేఖలు
భోపాల్: వ్యాపం కుంభకోణం కేసులో నిందితులైన మరో 70మంది మెడికల్ విద్యార్థులు, జూనియర్ వైద్యులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖలు రాశారు. తమకు బెయిలయినా ఇప్పించాలని లేదంటే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని అందులో విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన మెడికల్ పరీక్షల్లో వీరంతా అవకతవకలకు పాల్పడ్డారని, వేరేవారితో పరీక్షలు రాయించడం, అధికారులకు డబ్బులిచ్చి మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంవంటి ఆరోపణలతో కేసులు పెట్టారు. ప్రస్తుతం గ్వాలియర్ జైల్లో ఉన్న వీరంతా తమను చాలా కాలం నుంచి విచారిస్తున్నారని, దీంతో తమ భవిష్యత్తు అంధకారంగా మారిందని, ఫలితంగా మానసికంగా సమాజ పరంగా తీవ్ర ఒత్తిడి నెలకొందని ఆవేదన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్లే తమకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి లేఖలు రాష్ట్రపతికి కొంతమంది విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే.