చంఢీఘడ్: దీపావళి రోజున సిక్కు మతస్తులు బందీ ఛోడ్ దివస్‌ను జరుపుకుంటారు. వీరు ఈ ఉత్సవాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున సిక్కుల ఆరవ గురువు.. హరగోవింగ్ సాహెబ్‌ను మొఘల్ నవాబు జహంగీర్ గ్వాలియర్ జైలు నుంచి విముక్తి కల్పించాడు. ఈ రోజున వేలాదిగా సిక్కులు స్వర్ణదేవాలయం చేరుకుని.. దీపాలు వెలిగిస్తారు. మొఘల్ నవాబు జహంగీర్.. హరగోవింగ్ సాహెబ్‌ను గ్వాలియర్ జైలులో నెలల తరబడి.. బందీగా ఉంచుకున్నాడు. దీంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది.
ఈ క్రమంలో జహంగీర్ ఆస్థానంలోని మంత్రులు, ముస్లిం పెద్దలు జహంగీర్‌ను విడిచిపెట్టాలని రాజుకి సలహా ఇస్తారు. ఆ తర్వాత.. జహంగీర్ సిక్కుల గురువు హరగోవింద్ సాహెబ్‌ను దీపావళి రోజు విముక్తి కల్గిస్తాడు. హరగోవింద్ తనతోపాటు.. మరో 52 మంది హిందు రాజులను విముక్తిని కల్పించాలని జహంగీర్‌ను కోరారు. దీంతో 52 మంది రాజులు విముక్తి చేయబడ్డారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది దీపావళితోపాటు.. సిక్కులు బందీఛోడ్ ఉత్సవాన్ని జరుపుకుంటారు.
#WATCH On the occasion of Bandi Chhor Diwas and Diwali, devotees offer prayers at the Golden Temple in Amritsar pic.twitter.com/f8ldXJuJJy
— ANI (@ANI) November 4, 2021
Comments
Please login to add a commentAdd a comment