Depawali
-
టపాకాయలు తీసుకుని గంటలో వస్తానన్నారు.. అంతలోనే..
పుదుచ్చేరి: దీపావళి పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన పుదుచ్చేరి లోని విల్లుపురం జిల్లాలో జరిగింది. కూనిమెడు గ్రామానికి చెందిన కలైనేషన్, తన కొడుకు ప్రదీప్‌తో కలసి టపాకాయలు కొనుగోలు చేసి స్కూటర్‌పై.. తన స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో విల్లుపురం రహదారిపై ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ద్విచక్ర వాహనం పెద్ద ఎత్తున పేలిపోయి.. కలైనేషన్, ప్రదీప్‌లు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో వీరితో పాటు మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి.. ఒక లారీతోపాటు, రెండు ద్విచక్రవాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒక గంటలో వస్తామని చెప్పిన భర్త.. కొడుకు చనిపోయారని తెలియడంతో.. వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, పేలుడుకి గల కారణాలు తెలియాల్సిఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యకు వీడియో కాల్ చేసి జైలు వార్డెన్ ఆత్మహత్య -
పండుగ పూట విషాదం: కల్తీ మద్యం తాగి 24 మంది మృతి
పట్నా: బిహార్‌లో దీపావళి పండుగ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ చంపారన్ ప్రాంతంలోని.. తెల్హువా గ్రామంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 24కి పెరిగింది. బాధితులంతా.. బుధవారం స్థానికంగా ఉన్న.. ఒక దుకాణంలో.. మద్యంసేవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో వీరిలో కొంత మంది ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇప్పటికే.. ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా, మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్సపోందుతూ మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలో మరికొందరిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై బిహార్ సీఎం నితిష్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానికి మంత్రులు, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో 20 మందిపై అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారులు పేర్కొన్నారు. -
Latth Maar Diwali: డప్పు చప్పుళ్లకు హుషారైన స్టెప్పులు.. కర్రలతో ‘ఫైటింగ్’
లక్నో: సాధారణంగా దీపావళి రోజు ఒక్కొ ప్రాంతంలో.. ఒక్కొ ఆచారం ఉంటుంది. దీపావళిని కొందరు బందీఛోడ్ దివస్‌గా నిర్వహించుకుంటే.. మరో చోట లాత్మార్ దీపావళిగా జరుపుకుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని జలౌన్ గ్రామస్తులు..ప్రతి ఏడాది లాత్మార్ దీపావళిని వేడుకగా జరుపుకుంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిలో వందల సంఖ్యలో గ్రామస్తులు ఒకచోట చేరారు. ఆ తర్వాత.. రెండు గ్రూపులుగా విడిపోయి పెద్ద ఎత్తున డప్పులకు తగ్గట్టుగా హుషారుగా స్టెప్పులేశారు. ఈ క్రమంలో.. కర్రలతో ఒకరిపై ,మరోకరు దాడి చేసుకుంటున్నారు. దీంట్లో పాల్గోన్న వారు.. 30 నుంచి 40 ఏళ్ల వయసు వారున్నారు. ఈ వేడుకలో కొందరు పాల్గొంటే.. మరి కొందరు పక్కన నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. అయితే , ఈ లాత్మార్ దీపావళి మేము అనాదిగా ఆచరిస్తున్నామని జలౌన్ గ్రామస్తులు తెలిపారు. ఇది.. బుందేల్ ఖండ్ నుంచి వచ్చిందని తెలిపారు. అయితే, ఈ వీడియోలో గ్రామస్తులు .. కొవిడ్ నిబంధనలు పాటించలేదు. #WATCH | People in Jalaun participate in Bundelkhand's traditional 'Latth Maar Diwali'. #Diwali pic.twitter.com/3F29F0Pgmx — ANI UP (@ANINewsUP) November 4, 2021 చదవండి: మరిది పెళ్లి... డ్యాన్స్‌తో రచ్చచేసిన వదిన.. వైరల్ వీడియో -
దీపావళి రోజున జరుపుకునే బందీఛోడ్ ఉత్సవం.. మీకు తెలుసా...
చంఢీఘడ్: దీపావళి రోజున సిక్కు మతస్తులు బందీ ఛోడ్ దివస్‌ను జరుపుకుంటారు. వీరు ఈ ఉత్సవాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున సిక్కుల ఆరవ గురువు.. హరగోవింగ్ సాహెబ్‌ను మొఘల్ నవాబు జహంగీర్ గ్వాలియర్ జైలు నుంచి విముక్తి కల్పించాడు. ఈ రోజున వేలాదిగా సిక్కులు స్వర్ణదేవాలయం చేరుకుని.. దీపాలు వెలిగిస్తారు. మొఘల్ నవాబు జహంగీర్.. హరగోవింగ్ సాహెబ్‌ను గ్వాలియర్ జైలులో నెలల తరబడి.. బందీగా ఉంచుకున్నాడు. దీంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. ఈ క్రమంలో జహంగీర్ ఆస్థానంలోని మంత్రులు, ముస్లిం పెద్దలు జహంగీర్‌ను విడిచిపెట్టాలని రాజుకి సలహా ఇస్తారు. ఆ తర్వాత.. జహంగీర్ సిక్కుల గురువు హరగోవింద్ సాహెబ్‌ను దీపావళి రోజు విముక్తి కల్గిస్తాడు. హరగోవింద్ తనతోపాటు.. మరో 52 మంది హిందు రాజులను విముక్తిని కల్పించాలని జహంగీర్‌ను కోరారు. దీంతో 52 మంది రాజులు విముక్తి చేయబడ్డారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది దీపావళితోపాటు.. సిక్కులు బందీఛోడ్ ఉత్సవాన్ని జరుపుకుంటారు. #WATCH On the occasion of Bandi Chhor Diwas and Diwali, devotees offer prayers at the Golden Temple in Amritsar pic.twitter.com/f8ldXJuJJy — ANI (@ANI) November 4, 2021 చదవండి: టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి! -
తిరుమలలో దీపావళి ఆస్థానం
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తయింది. అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో భారత సైనికుల ప్రాణాలు తీస్తున్న శత్రువులను, ప్రపంచాన్ని భాధిస్తున్న కరోనా వ్యాధిని సంహరించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశరక్షణకు సరిహద్దుల్లో మన సైనికులు చేస్తున్న వీరోచిత పోరాటం అభినందనీయమన్నారు. కరోనా నుంచి ప్రపంచాన్ని స్వామి వారు తప్పకుండా కాపాడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతియేటాలాగే ఈ సారి కూడా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్ర బద్దంగా నిర్వహించామని చెప్పారు. తెలుగు ప్రజలకు వైవి సుబ్బారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు శ్రీవారి ఆలయంలో నిర్వహించిన దీపావళి ఆస్థానంలో వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. -
జోరందుకున్న టపాసుల కొనుగోళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: దీపావళికి టపాసులు కాల్చాలా.. వద్దా..? అనే సందేహానికి తెరపడింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నగరవ్యాప్తంగా టపాసుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చుకునేందుకు అనుమతి లభించడంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నగరంలోని బేగంబజార్, మోండా మార్కెట్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లోని టపాసుల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. తక్కువ కాలుష్యం ఉండే టపాసుల కొనుగోలుకే నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. అధిక శబ్దం లేని ఎక్కువ వెలుగులు విరజిమ్మే వాటినే కొనుగోలుచేస్తున్నారు.రెండు గంటల నిబంధన ఎలా అమలవుతుందన్నఅంశం సస్పెన్స్‌గా మారింది. కాలుష్యం లేకుండాజాగ్రత్తలు తీసుకుంటామని గ్రేటర్ వాసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇళ్లను విద్యుత్ కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. కోవిడ్ సెకండ్‌వేవ్ ముప్పుతో ఈసారి సర్వత్రా పర్యావరణ స్పృహ, టపాసుల కాలుష్యంపై అవగాహన పెరిగిందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ఏ రంగు బాణసంచాలో.. ఏ కాలుష్యకారకాలంటే..? తెలుపు: అల్యూమినియం, మెగ్నీషియం, టైటానియం ఆరెంజ్: కార్బన్, ఐరన్ పసుపు: సోడియం కాంపౌండ్లు నీలం: కాపర్ కాంపౌండ్లు ఎరుపు: స్ట్రాన్షియం కార్బోనేట్ గ్రీన్: బేరియం మోనో క్లోరైడ్స్ సాల్ట్స్ కాల్చుకోవచ్చు.. సుప్రీం మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో గ్రేటర్ సిటిజన్లు ఇంటిల్లిపాదీ క్రాకర్స్ కాల్చుకునేందుకు 2 గంటల పాటు అనుమతి లభించింది. రాత్రి 8–10 గంటల మధ్య కాకుండా మిగతా సమయాల్లో.. సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున టపాసులు కాల్చే వారి విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై మరికొన్ని గంటల్లో స్పష్టతరానుంది. కాలుష్యంతో జాగ్రత్త.. టపాసుల కాలుష్యంతో పెద్ద ఎత్తున వెలువడే సూక్ష్మ, స్థూల ధూళికణాలు గాల్లో చేరి సిటిజన్ల ఊపిరితిత్తులకు చేటుచేస్తాయని పర్యావరణ వేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక నైట్రేట్లు, సల్ఫర్‌డయాక్సైడ్ తదితర విషవాయువులు కోవిడ్ రోగులు, ఇటీవలే కోలుకున్నవారు ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు, చిన్నారులు, వృద్ధులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అప్రమత్తతే రక్ష దీపావళి టపాసులు కాల్చే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు వారి దగ్గరే ఉంటూ జాగ్రత్తలు చెబుతుండాలి. ఇళ్లలో పెంపుడు జంతువులు, పక్షులు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి సంవత్సరం గ్రేటర్లో వందల సంఖ్యలో మూగజీవాలు గాయపడుతున్నాయి. అందరూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు, పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. కోవిడ్ బాధితులపై ప్రభావం బాణసంచా కాల్చడంతో హానికర రసాయనాలు వెలువడతాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్–19 బాధితులపై మరింత ప్రభావం చూపుతుంది. ఆస్తమా బాధితులు, చిన్నారులు, వృద్ధులు, ఇతర వ్యాధిగ్రస్తులు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. బర్నాల్, దూది, అయోడిన్, డెట్టాల్‌తో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. – ప్రశాంత్, పల్మొనాలజిస్ట్, రెనోవా ఆస్పత్రి కళ్లద్దాలు ధరించాలి వంటగదిలోని గ్యాస్ సిలిండర్, ఆయిల్ డబ్బాలకు దూరంగా టపాసులను ఉంచాలి. ఒకసారి ఒక్కరే టపాకాయలు కాల్చాలి. మిగిలిన వారు దూరంగా ఉండేలా చూడాలి. పక్కనే రెండు బకెట్లలో నీళ్లు ఉంచుకోవాలి. ప్రమాదవశాత్తు మిణుగురులు చర్మంపై పడితే కాలిన చోట నీళ్లు పోయాలి. బాణసంచా కాల్చే సమయంలో కళ్లద్దాలు ధరించాలి. కళ్లకు గాయాలైతే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. – డాక్టర్ మురళీధర్ రామప్ప, కంటివైద్య నిపుణుడు, ఎలీ్వప్రసాద్ ఆస్పత్రి విద్యుత్ లైన్ల కింద వద్దు బాణసంచా గోదాములు, దుకాణాలు, ఇళ్లు, జనం రద్దీంగా ఉంటే ప్రాంతాలు, పెట్రోల్ బంకులకు దూరంగా టపాసులు కాల్చాలి. కాలుతున్న కొవ్వొత్తులు, దీపాల పక్కన టపాసులు పెట్టవద్దు. సీసా, రేకు డబ్బా, బోర్లించిన కుండ వంటి పాత్రల్లో టపాసులు కాల్చడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తారా జువ్వలను విద్యుత్ లైన్ల కింద కాలిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. – నక్క యాదగిరి, సభ్యుడు, తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు -
అసలు ‘గ్రీన్ క్రాకర్స్’ అంటే ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు వ్యవసాయరంగంలో ‘గ్రీన్ రెవెల్యూషన్’ రాగా, ఇప్పుడు దీపావళి క్రాకర్స్ (బాణాసంచా) పరిశ్రమలో ‘గ్రీన్ రెవెల్యూషన్’ వస్తోంది. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడిని తీసుకరావడం కోసం తీసుకొచ్చిన గ్రీన్ రెవెల్యూషన్‌ను తెలుగులో హరిత విప్తవంగా పేర్కొన్నారు. బాణాసంచాను కాల్చడం వల్ల వాతావరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు క్రాకర్స్‌లో వస్తోన్న ఈ గ్రీన్ రెవెల్యూషన్‌ను తెలుగులో కాలుష్య నియంత్రణ విప్లవంగా పేర్కొనవచ్చు. పలు భాషలు మాట్లాడే ప్రజలందరికి సులభంగా అర్థమయ్యేలా ‘గ్రీన్ క్రాకర్స్’ అని వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో సాధారణ బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లను సుప్రీం కోర్టు 2018, అక్టోబర్ నెలలో నిషేధించింది. సాధారణ బాణాసంచాను ముందే కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నామని, ఇంత త్వరగా ‘గ్రీన్ క్రాకర్స్’ అందుబాటులోకి రావడం కష్టమంటూ నాడు దుకాణదారులు లబోదిబోమంటూ మొత్తుకోగా, సుప్రీం కోర్టు షరతులతో కూడిన మినహాయింపులు ఇచ్చింది. ఈ ఏడాది నుంచి మాత్రం సాధారణ బాణాసంచాను అమ్మరాదని, గ్రీన్ కాకర్స్‌ను మాత్రమే అమ్మాలని నిక్కచ్చిగా చెప్పింది. అలాగే గ్రీన్ క్రాకర్స్ ఫార్ములాను రూపొందించాల్సిందిగా ఢిల్లీలోని ‘నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్’ను సుప్రీం కోర్టు ఆదేశించింది. గ్రీన్ క్రాకర్స్‌లో ఉపయోగించే పదార్థాలు సాధారణ క్రాకర్స్ అన్నింటిలో ‘బేరియం నైట్రేట్’ను ఉపయోగిస్తారు. ఇది అత్యంత హానికరమైన పదార్థం. ప్రజల శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా వాతావరణంలోకి ధూళి, ద్రవ కణాలను వదలని లేదా అణచివేసే పదార్థాలతో గ్రీన్ క్రాకర్స్‌ను తయారు చేయాలని భావించి ఈ ఇంజనీరింగ్ సంస్థ ఓ ఫార్మూలాను రూపొందించింది. ఇందులో ఉపయోగించే పదార్థాల మిశ్రమాన్ని ‘జియోలైట్’ అంటారని సంస్థలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సాధన రాయులు తెలిపారు. ఎక్కువ ఆక్సిజన్ కలిగిన ఈ పదార్థంతో తయారు చేసే గ్రీన్ క్రాకర్స్‌ను కాల్చినప్పుడు అందులోని ఇంధనం వేడి లేదా వెలుతురు రూపంలో బయటకు వెలువడుతుందని ఆమె తెలిపారు. వీటి వల్ల ఎలాంటి విష వాయువులు వెలువడం కనుక సాధారణ క్రాకర్స్‌తో పోలిస్తే 70 శాతం తక్కువ హానికరం అని ఆమె చెప్పారు. ఇవెన్ని రకాలు ? కొత్తగా తయారు చేస్తోన్న గ్రీన్ క్రాకర్స్‌లో ‘సేఫ్ వాటర్ రిలీజర్, సేఫ్ మినిమల్ అల్యూమినియం క్రాకర్, సేఫ్ థర్మైట్ క్రాకర్’ రకాలు ఉన్నాయి. సేఫ్ వాటర్ రిలీజర్ క్రాకర్స్‌ను కాల్చినప్పుడు అందులో నుంచి నీరు విడుదలై గాలి, దూళి కణాలు వాతావరణంలో కలువకుండా అడ్డుకుంటుంది. సేఫ్ అల్యూమినియం క్రాకర్లో అల్యూమినియం అతి తక్కువగా ఉంటుంది. సేఫ్ థర్మైట్ క్రాకర్లో వేడిని ఉత్పత్తి చేసే ఐరన్ ఆక్సైడ్ లాంటి ఖనిజ లోహాలను, తక్కువ స్థాయిలో అల్యూమినియంను ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా సాధారణ క్రాకర్స్ కన్నా 70 శాతం తక్కువ, అంటే 30 శాతం కాలుష్యాన్ని మాత్రమే విడుదల చేస్తాయి. నూటికి నూరు శాతం కాలుష్యం ఉండొద్దనుకుంటే ఏ క్రాకర్స్‌ను కాల్చకపోవడమే ఉత్తమం. గ్రీన్ క్రాకర్స్‌కు లైసెన్స్‌లు ఎలా? వీటిని ఉత్పత్తి చేయాలనుకునే వారు ముందుగా ఢిల్లీలోని ‘నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్’ను సంప్రదించి ‘అవగాహన ఒప్పందం’ కుదుర్చుకోవాలి. ఫార్ములాను తీసుకోవాలి. ఆ తర్వాత ‘పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ ఆమోదంతో పరిశ్రమ లైసెన్స్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఇంజినీరింగ్ సంస్థతో ఉత్పత్తిదారులు 230 అవగాహన ఒప్పందాలు, 135 ‘నాన్ డిస్క్లోజివ్’ ఒప్పందాలు తీసుకోగా పెట్రోలియం అండ్ ఎక్స్పోజివ్స్ సంస్థ నుంచి కేవలం 28 మంది మాత్రమే ఆమోదం తీసుకున్నారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా పరిశ్రమలు స్థాపించి ‘గ్రీన్ కాకర్స్’ తయారు చేస్తున్నారు. రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఈ పరిశ్రమలు ప్రస్తుతం వెలిశాయి. ఢిల్లీలో పరిస్థితి ఏమిటీ ? ఢిల్లీలో బాణాసంచా లేదా టపాకాయల దుకాణదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది కస్టమర్స్ నిషేధించిన క్రాకర్స్ కావాలని కోరుతున్నారని, లేదంటే తిరిగి పోతున్నారని వాపోతున్నారు. వారు వెయ్యి రూపాయలు ఖర్చయినా ఫర్వాలేదనుకొని ఢిల్లీకి దూరంగా వెళ్లి క్రాకర్స్ కొనుగోలు చేస్తున్నారని, వారు వాటిని తెచ్చి ఢిల్లీ వీధుల్లో కాలిస్తే ఇక ఫలితమేమిటని ప్రశ్నిస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్‌కు డిమాండ్ బాగా పెరిగిందని, కంపెనీల నుంచి సకాలంలో సరఫరా అందక ఇబ్బంది పడుతున్నామని మరో ప్రాంతంలోని దుకాణదారులు వాపోతున్నారు. -
కాలుష్యం తగ్గిందా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా వాసికెక్కిన ఢిల్లీ నగరంలో దీపావళిని దృష్టిలో పెట్టుకొని కాలుష్యాన్ని నివారించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. నగర పరిధిలో బాణాసంచా అమ్మకాలను సుప్రీం కోర్టు నిషేధించింది. డీజిల్ వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే వాహనాల రాకపోకల సంఖ్యను నియంత్రించింది. బుధ, గురువారాల్లో నగరంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిలిపివేసింది. డీజిల్‌తో నడిచే జనరేటర్ల వాడకంపై నిషేధం విధించారు. వీటికి తోడు టపాసులను కాల్చవద్దంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేశాయి. ఈ చర్యల ఫలితం ఉందా? నగర కాలుష్యం ఏ మేరకు తగ్గిందా? ప్రభుత్వ చర్యలు పాక్షికంగానే ఫలితాలనిచ్చాయని చెప్పవచ్చు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నగరంలో కాలుష్యం సగానికి సగం తగ్గింది. గతేడాది వాతావరణంలో ‘పీఎం–2.5’ స్థాయి గతేడాది 778 పాయింట్లకు చేరుకోవడంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కాలుష్య నగరంగా ఢిల్లీని గుర్తించారు. ఈ పరిస్థితిపై పర్యావరణ పరిరక్షకవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం వాహనాల రాకపోకలను నియంత్రించడం, డీజిల్ వాహనాలను నిషేధించడం తదితర చర్యల వల్ల కొంతమేరకు కాలుష్యం తగ్గింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని భావించిన ప్రభుత్వం సకాలం తీసుకున్న చర్యల వల్ల వాతావరణంలో కాలుష్యం 200 పాయింట్ల స్థాయికి దిగివచ్చింది. అయినప్పటికీ ఇది క్షేమదాయకం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల ప్రకారం వాతావరణంలో కాలుష్యం స్థాయి 25 పాయింట్లకు మించకూడదు. 200 పాయింట్లకు చేరిందంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ఉన్నట్లే. భారత దేశంలో ఈ పాయింట్లు 300–500 పాయింట్ల మధ్యనుంచే అత్యంత ప్రమాదకర స్థాయిగా పేర్కొంటున్నారు. 500 పాయింట్లకు మించితే అది ఎంత ప్రమాదకరమో పేర్కొనే పద్ధతే లేదు. 500 పాయింట్లకు మించి పోదన్నతి గతంలో శాస్త్రవేత్తలు వేసిన అంచనా. ఇప్పుడు అనేక సార్లు ఢిల్లీ కాలుష్యం 500 పాయింట్లను దాటింది. ఈసారి బాణాసంచా కాల్పులను నగరంలో నియంత్రించినా పెద్దగా కాలుష్యం తగ్గలేదు. అందుకు కారణం నగరానికి సమీపంలోఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట దుబ్బలను విరివిగా కాల్చివేయడం. అధికారిక లెక్కల ప్రకారం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రతిఏటా 3.50 కోట్ల టన్నుల పంట దుబ్బలను తగులబెడతారు. ఇలా తగులబెట్టడంపై 2015 సంవత్సరం నుంచే దేశవ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ రెండు రాష్ట్రాల రైతులు వినిపించుకోవడం లేదు. ‘పంట దుబ్బలను మంటపెట్టకుండా వాటి రీసైక్లింగ్ కోసమో, మరో అవసరానికి ఉపయోగించేందుకు వాటిని మేము ఎక్కడికి తీసుకపోగలం? ఏం చేయగలం ? దుబ్బను తరలించేందుకు కూడా డబ్బులు ఖర్చుగావా?’ అని చివరి పేరును మాత్రమే చెప్పడానికి ఇష్టపడిని దేవి తెలిపారు. ఆమెది నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోనిపట్ గ్రామం. అంత దూరం నుంచే కాదు, ఉత్తరాది నుంచి వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా దుబ్బ తగులబెట్టిన కాలుష్యం నగరానకి వస్తోందని నాసా ఉపగ్రహం ఇటీవల తీసిన ఫొటోలు బయటపెట్టాయి. కాలుష్యం కారణంగా భారత్‌లో ఏటా పది లక్షల మంది మరణిస్తున్నారని అమెరికా గత ఫ్రిబవరిలో జరిపిన ఓ అధ్యయనం తెలిపింది. -
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు,సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతిఇంటా దీపావళి ఆనందాల కోటి కాంతులు నింపాలని వైఎస్ జగన్ అభిలాషించారు. -
ఆప్కో వస్త్రాలపై 50 శాతం తగ్గింపు
హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల సందర్భంగా అన్ని రకాల చేనేత వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు ఆప్కో చైర్మన్ గుజ్జ శ్రీను తెలిపారు. గురువారం తిలక్‌రోడ్‌లోని జీహెచ్ఎంసీ కాంప్లెక్స్‌లో ఆప్కో నూతన శాఖను ఆయన ప్రారంభించారు. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు ఉంటుందన్నారు. ఆప్కో వస్త్రాల కొనుగోలు ద్వారా చేనేతకు చేయూతనిచ్చినట్లుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఆఫీసర్ కె.జగదీశ్వర్‌రావు, డివిజన్ మార్కెటింగ్ ఆఫీసర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.