
పుదుచ్చేరి: దీపావళి పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన పుదుచ్చేరి లోని విల్లుపురం జిల్లాలో జరిగింది. కూనిమెడు గ్రామానికి చెందిన కలైనేషన్, తన కొడుకు ప్రదీప్‌తో కలసి టపాకాయలు కొనుగోలు చేసి స్కూటర్‌పై.. తన స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో విల్లుపురం రహదారిపై ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ద్విచక్ర వాహనం పెద్ద ఎత్తున పేలిపోయి.. కలైనేషన్, ప్రదీప్‌లు అక్కడిక్కడే మృతి చెందారు.
ఈ ఘటనలో వీరితో పాటు మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి.. ఒక లారీతోపాటు, రెండు ద్విచక్రవాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒక గంటలో వస్తామని చెప్పిన భర్త.. కొడుకు చనిపోయారని తెలియడంతో.. వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, పేలుడుకి గల కారణాలు తెలియాల్సిఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment