
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు,సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతిఇంటా దీపావళి ఆనందాల కోటి కాంతులు నింపాలని వైఎస్ జగన్ అభిలాషించారు.
Comments
Please login to add a commentAdd a comment