భువనేశ్వర్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ సోమవారం జరగనున్నట్లు తెలుస్తోంది. స్వస్థలం హర్యానా పర్యటనలో ఉన్న గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ ఆదివారం భువనేశ్వర్‌కు తిరిగి రానున్నారు.
దీంతో 22న కొత్త మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో ఇటీవల ఝార్సుగుడ నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలుపొందిన దివంగత మంత్రి కుమార్తె దీపాలి దాస్‌కు మంత్రి బెర్తు లభించే అవకాశాలపై చర్చ జరుగుతోంది.
కొనసాగుతున్న మంత్రి మండలిలో ఇటీవల ఇద్దరు మంత్రులతో పాటు స్పీకర్ విక్రమ కేశరి అరూఖ్ రాజీనామా చేశారు. మిగిలిన ఇద్దరిలో మంత్రులు సమీర్ రంజన్ దాస్, శ్రీకాంత్ సాహు ఉన్నారు. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన విక్రమ్ కేశరి అరుఖ్‌కు కొత్త మంత్రి మండలిలో స్థానం లభిస్తుందని ఊహాగానాలు బలంగా వ్యాపించి ఉన్నాయి. మరో కొత్త ముఖం ఎవరనేది ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈ ఖాళీల భర్తీతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొంతమంది మంత్రుల శాఖలను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment